సీనియర్ దర్శకుడు శశికుమార్ కన్నుమూత | Malayalam hit-maker Sasikumar passes away | Sakshi
Sakshi News home page

సీనియర్ దర్శకుడు శశికుమార్ కన్నుమూత

Published Thu, Jul 17 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

Malayalam hit-maker Sasikumar passes away

సీనియర్ దర్శకుడు, ఎవర్ గ్రీన్ హీరో ప్రేమ్ నజీర్కు పలు హిట్ చిత్రాలను అందించిన శశికుమార్ మరణించారు. 1960లు, 70లలో మళయాళంలో పలు హిట్ చిత్రాలను తీసిన ఆయన (86) వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా సాయంత్రం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మళయాళ సినీ చరిత్రలోనే ఎవరూ చేయనంతగా 141 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వాటిలోని 80 సినిమాల్లో ప్రేమ్ నజీరే హీరో. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే చాలు.. అది సూపర్ హిట్ అనేవారు. మొదట్లో అన్ని మళయాళ సినిమాల్లాగే వాస్తవిక చిత్రాలు తీసిన శశికుమార్, ఆ తర్వాత క్రమంగా ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ల వైపు మళ్లారు. అవన్నీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement