Sasikumar
-
బాలికల హాస్టల్లో కీచకపర్వం
ఏలూరు టౌన్: పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు కొంతకాలంగా చెలరేగిపోతున్నాడు. వార్డెన్ భర్తగా ఎంటరైన సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ కీచకుడు బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన కోరికను కాదంటే బాలికలను దారుణంగా కొడతాడు. చాలా కాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించింది. సేవాశ్రమంలోని వారంతా మంగళవారం సాయంత్రం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు. ఆ కామాంధుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఘోరకలికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌ను నిర్వహకులు సేవాభావంతో ఏర్పాటు చేయగా.. గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా వేధిస్తున్నాడు. శశికుమార్ ఏలూరు ఎన్ఆర్పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతూ, మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న తన పలుకుబడితో కొంతకాలం క్రితం తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చాడని సమాచారం. బాలికలపై లైంగిక దాడులుఆ బాలికల సేవాశ్రమంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు వసతి సదుపాయం పొందుతున్నారు. వీరు స్థానికంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటరయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్టు బాధిత బాలికలు చెబుతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్.. సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు. రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ప్రశ్నించారు. జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. రాత్రి బాలికల ఏడుపులు వినిపించాయని స్థానికులు కూడా చెప్పారు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు మంగళవారం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికలను భయపెట్టి నీరుగార్చే ప్రయత్నంసేవాశ్రమంలో జరిగిన దారుణాలపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తారా... అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాలికలు మీడియాకు జరిగినదంతా వివరించారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేసు్తన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వార్డెన్ మణిశ్రీకి ఏలూరులోని ఓ ప్రజాప్రతినిధి వత్తాçÜు పలికినట్లు, అలాగే స్థానిక ఎంపీ కార్యాలయానికి చెందిన వ్యక్తులు సైతం రంగంలోకి దిగి పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదులో కేవలం వేధింపులకు గురిచేసినట్టుగానే బాలికలతో పోలీసులు రాయించినట్లు తెలుస్తోంది. ఏలూరు డీఎస్పీ దర్యాప్తుఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వెంటనే స్పందించారు. సేవాశ్రమం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఫొటో షూట్లంటూ.. ఫొటో షూట్ల కోసమని శశికుమార్ ఒక్కొక్క బాలికను దూరప్రాంతాలకు తీసుకువెళతాడనీ, అక్కడ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని, కాదంటే ఇష్టారాజ్యంగా కొడతాడని బాధిత బాలికలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు మిమ్మల్ని పంపుతాను, రూమ్‌లు ఏర్పాటు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చారు. బయటకు తీసుకెళ్లి టీ, కాఫీ ఇప్పించి సగం తాగిన అనంతరం కప్పు తీసుకుని తాగుతూ వక్రంగా మాట్లాడుతూ పైశాచికత్వాన్ని చూపిస్తాడని వివరించారు. ఇక స్థానికంగా ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టళ్ల వార్డెన్లను కోరతాడని, అతని కోరిక మేరకు ఆ హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిసింది. -
ప్రియుడి మోజులో.. భర్తనే కడతేర్చింది..
ఒంగోలు టౌన్: ప్రియుడి మోజులో పడి ఆమె ఏకంగా భర్తనే హతమార్చింది. తన వ్యవహారం బయట పడేసరికి భర్త మందలించడం.. భర్త బతికుంటే తమ ‘బంధం’ కష్ట మని భావించిన ఆ మహిళ.. కిరాయి ముఠా, ప్రియుడి సాయంతో కట్టుకున్న భర్తనే దారుణంగా కడతేర్చింది.. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన పీఎఫ్ ఇన్స్పెక్టర్ చల్లా వెంకటనరేంద్రబాబు హత్య కేసులో మృతుడి భార్యతో సహా మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఆ యువకుడికి అలా దగ్గరైంది.. ఒంగోలులోని పీఎఫ్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేసే చల్లా వెంకటనరేంద్రబాబు పొదిలిలోని పీఎన్ఆర్ కాలనీ మూడో లైనులో నివాసముంటున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లలు. వారి ఇంటి ఎదురుగా అద్దె ఇంట్లో ఉంటున్న కొండ శశికుమార్ అనే యువకుడికి లక్ష్మీప్రియ దగ్గరైంది. వారి వ్యవహారం తెలిసిన నరేంద్ర.. ఇద్దరినీ తీవ్రంగా మందలిస్తూ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శశితో కలిసి పథకం రచించింది. ఆమె ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులతో రూ.2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున నరేంద్ర గాఢ నిద్రలో ఉన్న సమయంలో శశితో పాటు.. నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన నలుగురు యువకులు కలిసి నరేంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. మృతదేహాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి తాడుతో వేలాడ దీశారు. భార్యభర్తల గొడవలతో విసిగివేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు యత్నించారు. ఇదిలా ఉండగా, కిరాయి ముఠా తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.50 వేలు మాత్రమే అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన డబ్బు కోసం వారు ఫోన్లు చేస్తుండటంతో భయపడిపోయిన శశిపోలీసులకు లొంగిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితులు.. లక్ష్మీప్రియతో పాటుగా ఆమె ప్రియుడు కొండ శశికుమార్, నెల్లూరు కిరాయి ముఠాకు చెందిన షేక్ నహీద్, షేక్ ఫజ్లూ, సయ్యద్ సిద్దిక్, షేక్ ముబారక్‌లను అరెస్టు చేసినట్టు ఎస్పీ దామోదర్ వివరించారు. -
శశికుమార్‌కు జంటగా సిమ్రాన్
నటుడు శశికుమార్కిప్పుడు మంచి టైమ్ నడుస్తోందనే చెప్పాలి. ఆ మధ్య వరుస ప్లాప్‌లతో సతమతం అయిన ఈయన్ని విజయాల బాట పట్టించిన చిత్రం అయోధి. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకోవడంతో పాటు, కమర్షియల్గానూ మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇటీవల గరుడన్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషించిన శశికుమార్‌కు ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా మిలియన్ డాలర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రంలో శశికుమార్ హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఇంతకు ముందు గుడ్‌నైట్ అనే విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయం కానున్నారని తెలిసింది. అలాగే ఇందులో శశికుమార్‌కు జంటగా నటి సిమ్రాన్ నటించనున్నారని సమాచారం. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే దీనితోపాటు శశికుమార్ మరో చిత్రంలోనూ నటించనున్నారని సమాచారం. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. కూక్కూ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అని రాజు మురుగన్ తొలి చిత్రంతోనే ప్రాంతీయ చిత్ర కేటగిరీలో జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత జోకర్, జిప్సీ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇటీవల నటుడు కార్తి హీరోగా జపాన్ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం పూర్తిగా నిరాశపరచింది. దీంతో తాజాగా శశికుమార్‌తో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
హీరో డైరెక్షన్లో నటించనున్న స్టార్ హీరోయిన్..!
కోలీవుడ్ నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార పచ్చజెండా ఊపారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుబ్రమణ్యపురం చిత్రం ద్వారా కథానాయకుడు, దర్శకుడిగా పరిచయమైన శశికుమార్ ఆ తరువాత నాడోడిగళ్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో శశికుమార్ హీరోగా స్థిరపడిపోయారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈయన ఈ మధ్య కథానాయకుడిగా నటించిన అయోథి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక నటి నయనతార విషయానికి వస్తే లేడీ సూపర్‌స్టార్‌గా ఆమె రాణిస్తున్నారు. ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయాన్ని అందుకున్నారు. గతేడాది ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన 75వ చిత్రం అన్నపూరణి తీవ్ర నిరాశ పరిచింది. అంతే కాకుండా వివాదాల్లో చిక్కుకుని కేసుల వరకూ వెళ్లి ఓటీటీలో నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా.. నయన్‌కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే విజయాలే ముఖం చాటేస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్ అనే క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంతో పాటు మన్నాంగట్టి అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా తాజాగా నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరలవుతోంది. ఇదీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నయనతార పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి శశికుమార్ దర్శకత్వం మాత్రమే చేయనున్నట్లు.. నటన జోలికి వెళ్లడం లేదని సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. -
జై భీమ్ నటి హీరోయిన్గా కొత్త సినిమా.. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో..
విభిన్న కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నటుడు శశికుమార్. ఈయన ఇటీవల కథానాయకుడిగా నటించిన అయోత్తి చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన కళుగు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సత్య దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా జైభీమ్ చిత్రం నటి లిజోమోల్ జోస్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సుదేవ్నాయర్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా శరవణన్, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ మాళవిక, బోస్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయగణపతి పిక్చర్స్ పతాకంపై పాండియన్ పరశురాం నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 1990 ప్రాంతంలో జరిగే కథాచిత్రంగా ఉంటుందన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్లర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం చైన్నె పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. నటుడు శశికుమార్ పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, కథ, కథనం, నేపథ్యం కొత్తగా ఉంటుందని, త్వరలోనే టైటిల్ ప్రకటించి చిత్ర టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: ‘భగవంత్ కేసరి’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.. కాజల్ కంటే ఎక్కువే! -
లండన్‌లో కత్తిపోట్లతో భారతీయుడు దుర్మరణం
లండన్: దక్షిణ లండన్‌లో భారతీయుడు ఒకరు వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. కేరళకు చెందిన అరవింద్ శశికుమార్ (38)ను సౌత్‌వార్క్‌లో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లో కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న శశికుమార్ ఆస్పత్రికి తరలించే లోపు మరణించినట్టు పోలీసులు తెలిపారు. సల్మాన్ సలీమ్ (25) అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన తేజస్విని రెడ్డిని కత్తితో పొడిచి చంపిన మూడు రోజుల్లోనే మరొక భారతీయుడు అదే విధంగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. -
తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కన్న తల్లినే కూతురు చంపిన కేసులో మరో ట్విస్టు. సొంత కూతురే తల్లిని చంపేలా ఆమె ప్రియుడే చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కీర్తి, శశికుమార్‌ను విచారిస్తుండగా నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ కేసు ఛేదనలో సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియోలు, వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా కీలకంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు... కీర్తి నాన్న శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్ కావడంతో ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఒకవేళ ఇంటికొచ్చినా తరచూ మద్యం తాగి భార్య రజితతో గొడవపడేవాడు. ఈ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె కీర్తి అందంగా ఉండడం, ఆమెను ప్రేమలోకి దింపాలని బీటెక్ చదివి జులాయిగా తిరుగుతున్న పొరుగింటి వ్యక్తి శశికుమార్ పథకం పన్నాడు. ఇదే సమయంలో తల్లిదండ్రుల నిరాదరణకు గురైన కీర్తి శశికుమార్‌ను నమ్మింది. ‘మా నాన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ ఏఈ పర్వతాలు. ఆస్తి బాగానే ఉంది’ అని కీర్తి ముందు శశి బిల్డప్ ఇవ్వడంతో మరింతగా నమ్మేసింది. చివరకు ఆమెను ముగ్గులోకి దించి సన్నిహితంగా ఉన్న సమయంలో కీర్తికి తెలియకుండా వీడియోలు తీశాడు. గర్భం దాల్చిన కీర్తిని మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి శశికుమార్‌నే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని శశికుమార్ ఇంట్లో చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో వాళ్లు ‘నీ ఇష్టమున్నట్టు చేస్కో’ అని వదిలేశారు. ఇక కీర్తిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లి రజితకు చెప్పాడు శశికుమార్. అందుకు రజిత నిరాకరించింది. అమ్మాయి చదువుకునేది చాలా ఉందని చెప్పింది. ఇది మనసులో పెట్టుకున్న శశికుమార్ కొన్నాళ్లు మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో కీర్తికి గతంలో తాము అద్దెకు ఉన్న పక్క కాలనీలో ఉండే బాల్‌రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. బాల్‌రెడ్డి గురించి తెలిసిన కీర్తి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నా రు. ఈ విషయం తెలిసి శశికుమార్.. కీర్తి వెంటపడ్డాడు. ‘నువ్వు నాతో సాన్నిహిత్యంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. అందరికీ చూపిస్తాన’ని బెదిరించాడు. చదవండి: కీర్తి ఇలా దొరికిపోయింది.. తనతోనే ఉండాలని వెంటపడినా మొదట్లో నిరాకరించింది. ఆ తర్వాత శశికుమార్ వేధింపులు తారస్థాయికి చేరాయి. కీర్తి పెళ్లి చేసుకునే బాల్రెడ్డికి కూడా చూపిస్తానంటూ బెదిరించాడు. ఓవైపు అమ్మతో చెబుదామంటే భయం, మరోవైపు తండ్రి పట్టించు కోకపోవడంతో శశికుమార్ ఎలా చెబితే అలా చేయడం మొదలెట్టింది కీర్తి. ఇందులో భాగంగానే శశికుమార్ మొదట వీరి ప్రేమకు అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను అంతమొందించాలని నిర్ణయించాడు. కీర్తి సమక్షంలోనే ఆమె చేతుల మీదుగానే రజితను ఈ నెల 19న చున్నీతో ఉరివేసి హత్య చేయించాడు. ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లోనే శవాన్ని ఉంచి కీర్తితో గడిపాడు. దుర్వాసన రావడంతో శవాన్ని కారులో తీసుకెళ్లి రైల్వే పట్టాలపై పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శశికుమార్ చెప్పినట్టుగా నటించిన కీర్తి చివరకు తండ్రితోనే అబద్ధం చెప్పి పోలీసులకు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు ఇచ్చింది. అయితే కూతురు ప్రవర్తన అనుమానంగా ఉందని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. కీర్తి ధైర్యం చేసి అమ్మ రజితకు చెప్పినా, నాన్న శ్రీనివాస్‌రెడ్డికి చెప్పినా, చివరకు షీటీమ్స్‌ను ఆశ్రయించినా పరిస్థితి హత్య వరకు వచ్చేది కాదని స్థానికులు అంటున్నారు. ఇటీవల రెండు నెలల క్రితం ఏసీబీ చేతికి చిక్కిన మహబూబ్‌నగర్ ఎలక్ట్రికల్ ఏఈ పర్వతం మూడో భార్య మూడో కుమారుడు శశికుమార్ అని తెలిసింది. కీర్తికి అబార్షన్ చేయించేందుకు మహబూబ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అతడి తండ్రి ఏమైనా సహకరించాడా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించని పోలీసులు బుధవారం నిందితుల అరెస్టు చూపే అవకాశం ఉంది. చదవండి: తల్లిని చంపి.. ప్రియుడితో కలిసి అక్కడే.. -
ముంబైలో శశికుమార్
నటుడు శశికుమార్ ముంబైలో మకాం పెట్టారు. అంతే కాదు అక్కడి తమిళులు తనపై చూపిన అభిమానానికి తబ్బిబ్బైపోతున్నారు కూడా. గ్రామీణ చిత్రాలకు పేటెంట్ హీరోగా మారిన ఈయన ఇప్పుడు సిటీస్‌లోనూ అలరించడానికి సిద్ధమైపోయారు. అలా శశికుమార్ తాజాగా నటిస్తున్న చిత్రాన్ని కల్పతరు పిక్చర్స్ పతాకంపై పీకే.మోహన్ నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్‌తో పాటు వినోదభరిత సన్నివేశాలతో కూడిన కమర్శియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రను నటుడు శరత్‌కుమార్ పోషించడం విశేషం. ఎన్వీ.నిర్మల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను ముంబైలో బాగా జన సంచారం ఉన్న రోడ్లపై చిత్రీకరించామని తెలిపారు. షూటింగ్ అని తెలియకుండా కెమెరాలను చాటుగా ఉంచి ఈ సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. దీంతో అక్కడేదో గొడవ జరుగుతుందని భావించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారన్నారు. దీంతో అక్కడకు పోలీసులు రావడంతో తాము పరిస్థితిని వారికి వివరించినట్లు చెప్పారు. ముంబైలో శశికుమార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కొంత మంది తమిళులు శశికుమార్ ను చూసేందుకు షూటింగ్ లోకేషన్‌కు చేరుకున్నారు. ముంబైలో ఉన్న తమిళులు కూడా తన పట్ల చూపిస్తున్న అభిమానానికి ముగ్ధుడైన శశికుమార్ అందరితో ఫోటోలు దిగి వారిని సంతృప్తి పరిచారు. తమ పొరుగు రాష్ట్రాల్లోనూ ఇంతటి అభిమానులను సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారి రుణం తీర్చుకోవడానికి మంచి మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించాలని కోరుకుంటున్నానని శశికుమార్ తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. అదేవిధంగా ఒక ప్రముఖ సంగీత దర్శకుడు దీనికి సంగీతాన్ని అందించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఇకపోతే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెన్నైలో పూర్తి చేసినట్లు, ప్రస్తుతం ముంబైలో 15 రోజుల పాటు రెండవ షెడ్యూల్‌ను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
కీర్తి ఖాతాలో మరో క్రేజీ మూవీ
నటుడు శశికుమార్‌తో లక్కీ కథానాయకి కీర్తీసురేశ్ జత కట్టనుందన్నది తాజా సమాచారం. కీర్తీసురేశ్ కోలీవుడ్‌కు పరిచయమైన చిత్రం ఇది ఎన్న మాయం చిత్రం పర్వాలేదనిపించుకున్నా, మలి చిత్రం నుంచే ఈ బ్యూటీ విజయ పరంపర ప్రారంభమైంది. అది ఇటీవల నటించిన మహానటి వరకూ కొనసాగింది. అంతే కాదు మహానటి చిత్రానికి ముందు ఆ తరువాత అన్నంతగా కీర్తీసురేశ్ క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో రెండు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో విక్రమ్‌కు జంటగా నటించిన సామి స్క్వేర్ చిత్రం ఈ వారమే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇక విశాల్‌తో రొమాన్స్ చేసిన సండైకోళి–2 వచ్చే నెల విడుదల కానుంది. ఆ తరువాత విజయ్ సరసన నటించిన సర్కార్ దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ మూడు చిత్రాలపైనా భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా కీర్తీసురేశ్ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆమె నటుడు శశికుమార్‌తో జతకట్టడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇంతకు ముందు శశికుమార్ కథానాయకుడిగా సుందరపాండియన్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎస్ఆర్.ప్రభాకరన్ తాజాగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో ఉదయనిధిస్టాలిన్ హీరోగా ఇదు కధిరవేలన్ కాదల్, విక్రమ్‌ప్రభు హీరోగా క్షత్రియన్ చిత్రాలను చేశారు. అవిఆశించిన విజయాలను అందించకపోవడంతో ఈ దర్శకుడు మళ్లీ తన తొలి చిత్ర హీరో వద్దకే వచ్చారు. ఈ చిత్రానికి కొంబు వచ్చ సింగం అనే టైటిల్‌ను నిర్ణయించారు. బిగ్‌బాస్ ఆరవ్, సూరి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించనున్న ఇందులో కథానాయకి పాత్రకు నటి కీర్తీసురేశ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. నటుడు శశికుమార్‌కు ఇటీవల సరైన హిట్ పడలేదు. కీర్తీసురేశ్ లక్కుతోనైనా ఈ చిత్రం సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న కొంబు వచ్చ సింగం చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, పొల్లాచ్చి ప్రాంతాల్లో చిత్రీకరించుకోనుందట. -
భాగ్యరాజ్ పాత్రలో శశికుమార్
తమిళ సినిమా : సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ పాత్రలో నటుడు శశికుమార్ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా వార్త. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలను పునర్నిర్మించడం చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే ఇటీవల సీక్వెల్స్ నిర్మాణం అధికం కావడంతో పాత చిత్రాల రీమేక్ తగ్గింది. తాజాగా నటుడు శశికుమార్ ఆ ట్రెండ్‌కు తెరలేపనున్నారు. 1982లో నటుడు కే.భాగ్యరాజ్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం తూరల్ నిండ్రు పోచ్చు. ఇందులో నటి సులోచన కథానాయకిగా నటించారు. ముఖ్య పాత్రలో నంబియాన్ నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం ఇప్పుడు నటుడు శశికుమార్ కథానాయకుడిగా రీమేక్ కానుంది. ఈ విషయాన్ని నట దర్శకుడు కే.భాగ్యరాజ్ ధ్రువీకరించారు. నటుడు శశికుమార్ కూడా ఈ ప్రచారాన్ని ధ్రువపరిచారు. దీని గురించి ఆయన తెలుపుతూ కే.భాగ్యరాజ్ నటించిన తూరల్ నిండ్రు పోచ్చు చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. ఆ చిత్ర కథను నేటి తరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పునర్నిర్మాణం జరపనున్నట్లు చెప్పారు.ఇందులో కే.భాగ్యరాజ్ పాత్రను తాను, నంబీయార్ పాత్రలో రాజ్‌కిరణ్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శశికుమార్ సముద్రఖని దర్శకత్వంలో నాడోడిగళ్ 2లో నటిస్తున్నారు. మరో చిత్రం అసురవధం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. -
శశికుమార్ మొరటోడనుకున్నా!
తమిళనాడు ఇప్పుడు చాలా టెన్షన్ గా ఉందని ప్రముఖ హాస్యనటి కోవైసరళ పేర్కొన్నారు. కథానాయకుడు, నిర్మాత శశికుమార్ తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించి నటించిన తాజా చిత్రం భలే వెళ్‌లైయదేవా. నటి తాన్యా కథానాయకిగా నటించిన ఇందులో కోవైసరళ, రోహిణి, సంగిలి మురుగన్ ముఖ్య పాత్రలు పోషించారు. సోలై ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శశికుమార్ మాట్లాడుతూ దర్శకుడు సోలైప్రకాశ్ చెప్పిన కథ చాలా నచ్చిందన్నారు. అయితే అందులో తనకు ముందుగా కళ్ల ముందు మెదిలింది బామ్మ పాత్ర అని చెప్పారు.ఈ పాత్ర పోషించే సత్తా ఇద్దరు నటీమణులకే ఉందనపించిందన్నారు.అందులో ఒకరు నటి మనోరమ, రెండోవారు కోవైసరళ అని పేర్కొన్నారు. మనోరమ ఇప్పుడు లేకపోవడంతో తమ చిత్రంలో బామ్మ పాత్రను కోవైసరళనే పోషించాలని భావించామన్నారు. ఆమె నటించడానికి అంగీకరించకుంటే ఈ భలే వెళ్‌లైయదేవా చిత్రం ఉండేది కాదన్నారు. ఇందులో హీరోను తాను కాదు కోవైసరళనే అని శశికుమార్ పేర్కొన్నారు. కానీ చాలా సాఫ్ట్.. నటి కోవైసరళ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు శశికుమార్ చాలా మొరటోడు, తానేమో కామెడీ పీస్‌ను కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని కాస్త భయపడినట్లు పేర్కొన్నారు. అయితే చిత్రంలో నటిస్తున్నప్పుడు శశికుమార్ సినిమాల్లో చూడడానికే మొరటోడులా కనిపిస్తారని, నిజానికి చాలా సాఫ్ట్ అని తెలిసిందన్నారు. ఆయన ఎక్కువగా మాట్లాడరు కూడా అని అన్నారు. ఇక పేమెంట్ విషయంలో చెప్పనే అక్కర్లేదన్నారు. ఇంటికి వచ్చి మరీ ఇచ్చే వారని చెప్పారు. ఇప్పుడు తమిళనాడు చాలా టెన్షన్ లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భలే వెళ్‌లైయదేవా చిత్రం చూస్తే కాస్త ఓదార్పు కలుగుతుందని కోవైసరళ తెలిపారు. సమావేశంలో నటి తాన్యా, సంగిలిమురుగన్, దర్శకుడు సోలై ప్రకాశ్ పాల్గొన్నారు. -
శశికుమార్‌కు జంటగా తాన్యా
నటుడు శశికుమార్‌కు జంటగా నాటి సూపర్‌స్టార్ రవిచంద్రన్ మనవరాలు తాన్యా నటించనున్నారని తాజా సమాచారం. 1960-70 దశకంలో తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన నటుడు రవిచంద్రన్. ఈయన వారసుడు హంసవర్దన్ హీరోగా తెరంగేట్రం చేసినా నిలదొక్కుకోలేకపోయారు. కాగా తాజాగా రవిచంద్రన్ మనవరాలు తాన్యా నాయకిగా రంగప్రవేశం చేశారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో నాయకిగా నటిస్తున్నారు. రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బృందావనం చిత్రంలో అరుళ్‌నిధికి జంటగా తాన్యా నటిస్తున్నారు. అదే విధంగా మిష్కిన్ దర్శకత్వంలో విశాల్ సరసన నాయకిగా నటిస్తున్నారు. తాజాగా శశికుమార్‌తో జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. కిడారి వంటి విజయవంతమైన చిత్రం తరువాత శశికుమార్ తదుపరి చిత్రానికి రెడీ అయ్యారు. తన సొంత సంస్థ కంపెనీ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు ప్రకాశ్ పరిచయం కానున్నారు. ఇందులో శశికుమార్‌కు జంటగా తాన్యాను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నటి కోవైసరళ, సంగిలి మురుగన్ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. దీనికి అలప్పారై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. -
దాడులతో కలవరం
సాక్షి, చెన్నై : హిందూ సంఘాల నేతలపై సాగుతున్న దాడుల కలవరం రేపుతున్నాయి. కోయంబత్తూరులో శశికుమార్ హత్యకు గురి కావడం, మరి కొందరు నాయకుల్ని టార్గెట్ చేసి బెదిరింపులు రావడం ఆందోళన కల్గిస్తున్నాయి. నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈనెల 28న ఆందోళనకు బీజేపీ పిలుపు నిచ్చింది. హిందూ సంఘాల నేతల్ని టార్గెట్ చేసి గతంలో సాగిన దాడుల గురించి తెలిసిందే. అజ్ఞాతంలో ఉన్న తీవ్ర వాదుల అరెస్టుతో ఈ దాడులు సద్దుమణిగాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ హిందూ సంఘాల నాయకుల్ని గురి పెట్టి దాడులు, హత్యలు చోటుచేసుకుంటుండడం కలవరం రేపుతున్నది. కోయంబత్తూరులో హిందూ మున్నని నేత శశికుమార్ హత్య అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. నిఘా వర్గాల మోహరింపుతో పరిస్థితి సద్దుమణిగి ఉన్నది. ఈ హత్య కేసును ఛేదించేందుకు పోలీసు బృందాలు తీవ్రంగా ఉరకలు తీస్తున్నాయి. అల్లర్లకు సంబంధించి వందలాది మందిని అరెస్టు చేసి ఉన్నారు. హత్య కేసుకు సంబంధించిన ఒకర్ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నార ు. ఈ పరిస్థితుల్లో శనివారం అర్థరాత్రి కోయంబత్తూరులో సుందరాపురంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు నడుపుతున్న మోటార్ సైకిళ్ల విక్రయ దుకాణం మీద గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌బాంబ్‌తో దాడి చేశారు. అయితే, అదృష్టవశాత్తు అది పేల లేదు. పేలి ఉంటే, ఆ దుకాణంలో ఉన్న మోటారు సైకిళ్లు దగ్ధం అయ్యేవి. అలాగే, దిండుగల్‌లో ఉన్న బీజేపీ కార్యాలయంపై కూడా పెట్రోల్ బాంబు దాడి జరగడం ఆందోళననురెట్టింపు చేస్తున్నది. ఈ దాడిలో ఆ కార్యాలయం షట్టర్‌తోపాటుగా అక్కడ ఆగిఉన్న కారు పాక్షికంగా దెబ్బ తింది. ఈ ఘటనలో రాష్ట్రంలో శాంతిని విచ్ఛిన్నం చేయడానికి అ సాంఘీక శక్తులు చాప కింద నీరులా తమ పనితాన్ని ప్రదర్శిస్తున్నారా..? అన్న ఆందోళన బయలు దేరి ఉన్నది. ఈ దాడుల్ని అడ్డుకునేందుకు తగ్గట్టు పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. రాత్రుల్లో నిఘా కట్టుదిట్టం, తనిఖీల ముమ్మరానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ దాడుల్ని, హత్యల్ని డీఎంకే దళపతి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, బిజేపి తమిళనాడు అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్ని ఖండిస్తూ 28వ తేదీన ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. -
నరికిన తలతో పోలీస్ స్టేషన్‌కు..!
హడలిపోయిన పోలీసులు అప్పు తీర్చలేదని ఘోరం సొమ్మసిల్లిపడిపోయిన హతుడి తల్లి దొడ్డబళ్లాపురం : ఒక వ్యక్తి తల నరికి అదే తల పట్టుకుని నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగి పోయిన సంఘటన దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కెంపతిమ్మనహళ్లి నివాసి మంజునాథ్ (26) హత్యకు గురైన వ్యక్తి. ఉగనవాడి గ్రామానికి చెందిన శశికుమార్ హత్యచేసిన నిందితుడు. నిందితుడు శశికుమార్ హతుడు మంజునాథ్‌కు రూ.27వేలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగివ్వడంలో ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మాట్లాడాలని చెప్పి మంజునాథ్‌ను ఉగనవాడి గ్రామం శివారు లోని నిర్జనప్రదేశానికి పిలిచాడు శశికుమార్. అప్పటికే కొడవలితో సిద్ధంగా ఉన్న శశశికుమార్ మంజునాథ్ తల నరికివేసాడు. ఆదివారం రాత్రే నిందితుడు నరికిన తలతో పాటు విశ్వనాథపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోయాడు. మొండెం లేని తలను చూసిన పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. తక్షణం పోలీసులు ఘటన జరిగిన స్థలాన్ని చేరుకుని తలలేని మంజునాథ్ మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అమిత్‌సింగ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘనపై వివరాలు తెలుసుకున్నారు. విశ్వనాథపుర పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రాత ఆయనదేనా..!
పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఎదుర్కొన్న ఒత్తిళ్లు ఏమై ఉంటాయి? ఐపీఎస్ మరణంపై లోతుగా అధ్యయనం చేస్తున్న సీఐడీ విశాఖపట్నం : పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ మృతి కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ ఆయన స్వదస్తూరితో రాశారా? లేదా? అనే కోణంలో హ్యాండ్ రైటింగ్ నిపుణుడితో పరిశీలన జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాల ప్రకారం నివేదిక ఇప్పటికే హైదరాబాద్‌లో సిద్ధమైనట్లు సమాచారం. నేడో రేపో దర్యాప్తు అధికారులకు ఆ నివేదిక చేరనుంది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతనిని రాజకీయ, అధికార వర్గాలు హత్య చేశాయని శశికుమార్ తల్లిదండ్రులు ఆరోపించడంతో తమిళనాడు పోలీసులు జిల్లాకు వచ్చి దర్యాప్తు చేస్తారని భావించినప్పటికీ ఇంతవరకూ అలాంటి సమాచారం తమకేమీ రాలేదని సీఐడీ అధికారులు అంటున్నారు. అయితే సీఐడీ డీఎస్పీ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రధానంగా సీఐడీ దృష్టి సారించింది. రెండు సార్లు విచారణకు వెళ్లిన సీఐడీ అధికారులు అనేక మందిని విచారించి అనేక విషయాలను తెలుసుకున్నారు. శశికుమార్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మావోయిస్టు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల అరెస్టులు గానీ, లొంగుబాట్లు గానీ జరగలేదు. దీనిపై కూడా ఉన్నతాధికారుల నుంచి ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొని ఉండవచ్చని తెలుస్తోంది. మావోయిస్టు సానుభూతిపరులనే నెపంతో గిరిజనులపై నమోదు చేసిన కేసులను శశికుమార్ మాఫీ చేశారని, ఆ విషయంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారని సమాచారం. ఆ కారణంగానే ఇటీవల మన్యంలో మావోయిస్టులు లొంగిపోయినప్పుడు ఏఎస్పీ కేడర్‌లో ఉన్న శశికుమార్‌కు బదులు ఓఎస్డీ అట్టాడ బాబూజీ విశాఖ ఎస్పీతో పాటు విలేకరుల ముందుకు వచ్చారు. మావోయిస్టుల లొంగుబాట్లలో ఏఎస్పీ ప్రమేయం ఉండటం లేదని ఉన్నతాధికారులు పదే పదే అంటుండటంతో శశికుమార్ మానసికంగా కుంగిపోయి ఉంటారని తెలుస్తోంది. -
అంత కష్టం ఏమొచ్చింది !
యువ ఐపీఎస్ది ఆత్మహత్యా? హత్యా? మిస్‌ఫైర్ అని అధికారులు తప్పించుకుంటున్నారా ? దూకుడే కొంపముంచిందా? మాఫియా బెదిరింపులున్నాయా మిస్టరీగా మారిన శశికుమార్ మరణం విశాఖపట్నం: చిన్న వయసులోనే ఐపీఎస్ అధికారి అయ్యాడు..ఉన్నత హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు.. కొద్ది కాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.. త్వరలోనే వివాహం చేసుకుని జీవితంలోనూ స్థిరపడాలనుకున్నారు. కానీ ఇంతలోనే తనువు చాలించారు. పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ గురువారం బుల్లెట్ తలకు తగలడంతో మృతి చెందారు. ఆయన మరణంపై విచారణకు సీఐడీ రంగంలోకి దిగుతోంది. విచారణలో నిజాలు బయటకొస్తే తప్ప శశికుమార్ మృతికి కారణాలు వెల్లడికావు. అయితే ఈ సంఘటనపై అనేక అనుమానాలు, వాదనలు బయటకు వస్తున్నాయి.అధికారులు చెబుతున్నట్లు తుపాకీ మిస్‌ఫైర్ అయిందా, లేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారా అనేది మిస్టరీగా మిగిలింది. ఆయనను హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శశికుమార్ తన తోటి వారితో శాంతంగా ఉంటారు. కానీ నేరస్థులకు మాత్రం నిద్ర లేకుండా చేస్తారు. గ్రేహౌండ్స్ నుంచి ఆళ్లగడ్డ ఏఎస్పీగా వస్తూనే ఎర్రచందనం స్మగ్లర్ల పనిపట్టారు. విశాఖ ఏజెన్సీలో అడుగుపెట్టి గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. జి.మాడుగుల, పాడేరు, అనంతగిరిలో గంజాయి రవాణా, స్టోరేజీ కేంద్రాలపై దాడులు చేసి వేలాది కేజీల గంజాయిని పట్టుకున్నారు. మావోయిస్టుల కదలికలపైనా దృష్టి సారించారు. ఈ దూకుడే ఆయనను ఉన్నతాధికారులకు దూరం చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి శశికుమార్ వేధింపులు ఎదుర్కొని ఉండవచ్చని భావిస్తున్నారు. ఏజెన్సీలో మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణంతో గిరిజనులపై కేసలు పెడుతుంటారు. అమాయకులపై కేసులేంటని శశికుమార్ ఇటీవల కొందరు గిరిజనులకు క్లీన్చిట్ ఇచ్చారని, ఈ విషయంపై రెండు రోజుల క్రితం గంజాయి సాగు నివారణపై ఐటీడీఏలో ఉన్నతస్థాయి సమావేశానికి వెళ్లిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని, దాంతో మనస్థాపానికి గురై ఉండవచ్చని అంటున్నారు. మరోవైపు గంజాయి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. మావోయిస్టులు చంపేశారా? శశికుమార్ మరణం వెనుక మరో వాదన బలంగా వినిపిస్తోంది. పాడేరు ప్రాంతంలోని దాదాపు 70 మంది మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. వారి అరెస్టును నేడో రేపో ధృవీకరించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మావోయిస్టులు పథకం ప్రకారం ఏఎస్పీని మట్టుబెట్టి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన నివాసంలో ఉదయం వేళ భద్రత పెద్దగా ఉండదు. పై అంతస్థులో జీఆర్పీఎఫ్ జవాన్లు ఉంటున్నారు. ఏఎస్పీ ఉంటున్న అంతస్థులోనే వెనుక వైపు ఆయన సీసీ, బయట గదిలో హోం గార్డు నిద్రిస్తుంటారు. ఉదయం శశికుమార్ నిద్ర లేచి బెల్ కొట్టినపుడు ఆయన చాంబర్లోకి ఫైళ్లు తీసుకుని వెళతారు. అంతవరకు ఆయన వద్దకు ఎవరూ వెళ్లరు. ఆమన ఎవరినైనా కలవాలనుకుంటే అదే సమయంలో కలుస్తుంటారు. భద్రతా సిబ్బంది కాలకృత్యాలు తీర్చుకునే పనిలో ఉంటారు. ఈ క్రమంలో మావోయిస్టులెవరైనా సందర్శకుల మాదిరిగా వచ్చి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సెలవు ఎందుకు పెట్టారు రేపటి నుంచి మూడు రోజుల పాటు తనకు సెలవు కావాలని శశికుమార్ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశారని నర్సీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ ‘సాక్షి’కి వెల్లడించారు. సంఘటన జరిగిన పాడేరు ఏఎస్పీ చాంబర్‌ను మధ్యాహ్నం పరిశీలించిన ఆయన రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. శశికుమార్ తలలోకి దూసుకువెళ్లిన బుల్లెట్ ఆయన తుపాకీలో నుంచి వచ్చినదేనని బాబూజీ స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాటుపై స్పందిస్తూ ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదన్నారు. అయితే సెలవు ఎందుకనేది చెప్పలేదు. -
శశికుమార్ మృతిపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
పాడేరు ఏఎస్పీ శశికుమార్ ఆకస్మిక మృతికి ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాడేరులో గురువారం ఉదయం ఏఎస్పీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఏఎస్పీ మరణ వార్త విన్న వెంటనే ఉపముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని విశాఖ బయలుదేరారు. కేజీహెచ్‌లో ఉంచిన శశికుమార్మృతదేహాన్ని సందర్శించనున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
పాడేరు ఏఎస్పీ అనుమానాస్పద మృతి
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రమాదవశాత్తూ గన్ పేలిందా లేక కావాలనే ఆయన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున ఏఎస్పీ బంగ్లాలో కాల్పులు వినిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. శశికుమార్ తలకు తీవ్ర గాయం కావటంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఏఎస్పీ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అవివాహితుడు అయిన శశికుమార్ ఆరు నెలల క్రితమే పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వస్థలం తమిళనాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కిడారి అంటున్న శశికుమార్
సొంతంగా నిర్మించి నటించిన తారైతప్పట్టై చిత్రం వసూళ్ల పరంగా నిరాశపరచినా ఆ వెంటనే శరవేగంగా కథానాయకుడిగా నటించిన వెట్రివేల్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నటుడు, నిర్మాత, దర్శకుడు శశికుమార్. ఇదే ఏడాది మరో చిత్రంతో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. తాజా చిత్రం ఒక షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కిడారి అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీని గురించి శశికుమార్ తన ట్విట్టర్లో పేర్కొంటూ తన తాజా చిత్రానికి ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. త న సొంత బ్యానర్ కంపెనీ ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ఈ ఏడాదిలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటి సుభ వరూనీ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాజమందిరం చిత్రం ఫేమ్ దర్భుక శివ సంగీతాన్ని అందిస్తున్నారు. విషయం ఏమిటంటే కిడారి అనే టైటిల్‌తో ఒక చరిత్ర కథను తెరకెక్కించనున్నట్లు శశికుమార్ స్నేహితుడు, దర్శక-నటుడు సమద్రకణి ఇంతకు ముందు ప్రకటించారు. ఇప్పుడా టైటిల్‌ను శశికుమార్‌కి ఇచ్చినట్లు తెలుస్తోంది. సముద్రకణి కిడారి చిత్ర నిర్మాణానికి తెరపడినట్లేనా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ తెరలేపుతోంది. -
పాంచ్ పటాస్
చెన్నై : కోలీవుడ్ జాతీయ స్థాయిలో పాంచ్ పటాస్ అంటూ మరోసారి తన సత్తా చాటుకుంది.ఉత్తమ చిత్రాలకు, కళాకారులకు పేరెన్నికలో మేమెప్పుడూ ఉంటామని తాజా జాతీయ అవార్డులతో మరోసారి రుజువు చేసుకుంది. ఈసారీ ఐదు జాతీయ అవార్డులు కోలీవుడ్‌ను పులకరింపజేశాయి.2015 ఏడాదికి గానూ కేంద్రప్రభుత్వం 63వ జాతీయ సినీ అవార్డులను గెలుచుకున్న చిత్రాలను, కళాకారులు, సాంకేతిక నిపుణుల పట్టికను సోమవారం ఉదయం ఢిల్లీలో వెల్లడించారు.అందులో తమిళ చిత్ర పరిశ్రమ ప్రధాన కేటగిరీల్లో ఐదు అవార్డులను గెలుచుకుని తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. విచారణైకి ముచ్చటగా మూడు ఇక ఉత్తమ విలువలతో ఆలోచింపజేసే కథలతో చిత్రాలు రూపొందించడంలో తమిళ కళాకారులు దిట్ట అని ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి నిరూపణ అయ్యింది. వెట్రిమారన్ ఈయన తమిళసినిమా నమ్ముకున్న దర్శకులలో ఒకరు. ఇంతకు ముందు ఆడుగళం చిత్రంతో జాతీయ అవార్డును తమిళ సినిమాకు గెలిచిపెట్టిన వెట్రిమారన్ ఈ సారి విచారణై చిత్రంతో ఏకంగా మూడు జాతీయాలను అందించారు.జైలులో ఖైదీ జీవన విధానాన్ని అత్యంత సహజత్వంతో కళ్లకు కట్టినట్లు ఈయన తెరపై ఆవిష్కరించిన చిత్రం విచారణై.ఇటీవలే విడుదలై సగటు ప్రేక్షకుడితో పాటు విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం విచారణై. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు,రివార్డులు అందుకున్న ఈ చిత్రం తాజాగా ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.ఇక ఇందులో నటించిన దర్శకుడు సముద్రకనిని ఉత్తమ సహాయనటుడు అవార్డు వరించింది.ఇక ఇదే చిత్రానికి గాను ఆ మధ్య కన్ను మూసిన ఎడిటర్ కిశోర్‌ను జాతీయ అవార్డు వరించడం విశేషం.ఆయన ఇంతకు ముందు ఆడుగళం చిత్రానికి గాను ఉత్తమ జాతీయ అవార్డును అందుకున్నారన్నది గమనార్హం.అదే విధంగా తొలి చిత్రంతోనే సినీ పండితుల ప్రశంసలను అందుకున్న నటి రితిక ఇరుదుచుట్రు చిత్రానికి గాను ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డుకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం.నిజ జీవితంలో బాక్సర్ అయిన రితిక చిత్రంలోనూ అదే పాత్రలో జీవించారు. ఈమెకిదే తొలి చిత్రం కావడం విశేషం.కాగా జాతీయ అవార్డులను గెలుచుకున్న కళాకారుల అభిప్రాయాలను చూద్దాం. ఆదరణకు ధన్యవాదాలు జాతీయ ఉత్తమ సహాయ నటుడు అవార్డుకు ఎంపికైన దర్శకుడు సముద్రకని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నటుడిగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.విచారణై చిత్రానికి ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు,ఎడిటర్ కిశోర్‌ను అవార్డు వరించడం సంతోషంగా ఉంది. ఆస్కార్ అవార్డుగా ఇక తొలి చిత్రంతోనే జాతీయ అవార్డుకు అర్హురాలైన నటి రితిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవార్డును ఊహించలేదు. దీన్ని ఆస్కార్ అవార్డుగా భావిస్తున్నాను.దీనికి కారణం అయిన దర్శకురాలు సుధ,రాజ్‌కుమార్ హిరాణి లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నారు.దర్శకుడు వెట్రిమారన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయ అవార్డులను గెలుచుకున్న వారందరికీ సూపర్‌స్టార్ అభినందనలు తెలిపారు. సంగీతరాజాకు మరోసారి భారతీయ చిత్ర పరిశ్రమలోనే సహస్ర చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఏకైక సంగీత దర్శకుడు ఇళయరాజా.సంగీత ప్రపంచంలో అనితరసాధ్యం కాని ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఈ సంగీత జ్ఞానికి తాజాగా మరో జాతీయ అవార్డుకు అలంకారం కానున్నారు.ఎస్.ఆయన సంగీతం అందించిన 1000వ చిత్రం తారై తప్పట్టై చిత్రంతోనే ఆయన ఉత్తమ సంగీత దర్శకుడుగా మరోసారి జాతీయ అవార్డును అందుకోనున్నారు. బాలా వల్లే సాధ్యం అయ్యింది తారై తప్పట్టై చిత్రానికి గానూ ఇళయరాజా ఉత్తమ సంగీతదర్శకుడు అవార్డును గెలుచుకున్న సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, కథానాయకడు శశికుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇళయరాజా 1000వ చిత్రాన్ని నేను నిర్మించడం భాగ్యంగా భావిస్తున్నాను.నా కంపెనీ ప్రొడక్షన్లో నిర్మించిన పసంగ,తలైమురైగళ్ చిత్రాల వరుసలో జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రంగా తారైతప్పట్టై చేరడం ఆనందంగా ఉంది.ఇది దర్శకుడు బాలా వల్లే సాధ్యం అయ్యింది. కొన్ని చిత్రాల గురించి ముందుగానే.. మూడు జాతీయ అవార్డులను కైవశం చేసుకున్న విచారణై చిత్ర నిర్మాత నటుడు ధనుష్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.కొన్ని చిత్రాలు ప్రారంభించినప్పుడే తెలిసి పోతుంది.అవి ముఖ్యమైన స్థానంలో నిలుస్తాయని.వెట్ట్రిమారన్ దర్శత్వంలో నేను నిర్మించిన ఈ విచారణై చిత్రం అలాంటి అంచనాలనే ఏర్పరచింది.ఈ చిత్రంలో నటించిన సముద్రకని ఉత్తమ సహాయ నటుడు అవార్డును,ఎడిటర్ కిశోర్‌కు అవార్డు వరించడం సంతోషంగా ఉంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని ధనుష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
టేకులపల్లి మండలం బొమ్మన పల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు లారీని ఓవర్టేక్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో శశికుమార్(25), నరేష్(25)లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 లో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ యువకులు బూర్గంపాడు నియోజకవర్గ పరిధిలోని సారపాకకి చెందినవారిగా తెలుస్తోంది. -
సినిమా విడుదల కాలేదని నిర్మాత ...
బెంగళూరు : దర్శకత్వం వహించి సొంతంగా నిర్మించిన సినిమా విడుదలకు నోచుకోకపోవవంతో మనోవేదనకు గురైన సినీ నిర్మాత, దర్శకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... నందినీ లేఔట్‌కు చెందిన శశికుమార్ రెండు సంవత్సరాల క్రితం నూతన కథానాయకుడు సందీప్‌తో ఆఫ్ మెంటల్ సినిమా నిర్మాణాన్ని ప్రారంభించాడు. చిత్రీకరణ, ఇతర వ్యవహారాలు పూర్తయి యేడాది గడిచినా ఇప్పటి వరకు ఆ సినిమా మాత్రం విడుదల కాలేదు. దీంతో మనోవేదనకు గురైన ఆయన గురువారం కారులో బయటకు వచ్చి కామాక్షిపాళ్య బస్టాండు సమీంపలో నీరు బాటిల్లో పురుగుల మందు కలుపుకొని తాగాడు. కొద్దిసేపటికి భార్య ఫోన్ చేయగా అతని మాటలు అస్పష్టంగా వినిపించాయి. దీంతో ఆమె అతని స్నేహితులకు సమాచారం ఇచ్చింది. వారు ఘటనా స్థలానికి చేరుకొని అస్వస్థతకు గురైన శశికుమార్‌ను అక్కడి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి అతన్ని ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. సినిమా విడుదలకు మరింత డబ్బు అవసరమవుతుందని, అంత మొత్తంలో డబ్బు లేక ఆత్మహత్యకు యత్నించినట్లు శశికుమార్ తెలిపారు. -
క్షణక్షణం
హిమాయత్‌నగర్ టు మొయినాబాద్ డాక్టర్ల ఘటన పూర్వాపరాలు ఇవీ.. సిటీబ్యూరో: డాక్టర్ల త్రయం ఉదయ్ కుమార్, శశికుమార్, సాయికుమార్‌ల వ్యవహారం సోమవారం సాయంత్రం హిమాయత్ నగర్లో ఉదయ్ కుమార్‌పై హత్యా యత్నంతో ప్రారంభమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మొయినాబాద్‌లోని నిష్ ఫామ్‌హౌస్‌లో శశికుమార్ ఆత్మహత్యతో ఆగింది. ఈ మధ్య కాలంలో ఏ క్షణం ఏం జరిగిందనేది పోలీసుల కథనం ప్రకారం... సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలు మినర్వా కాఫీ షాప్ దగ్గర ఉదయ్, శశి, సాయి కలుసుకున్నారు. అక్కడ శశి దోశ తినగా... మిగిలిన ఇద్దరూ కాఫీ తాగారు. ► 4.30: ఈ ముగ్గురి మధ్యా వాగ్వాదం చోటు చేసుకోవడంతో కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చి కారులో స్ట్రీట్ నెం.6లోకి వెళ్లారు. ►4.40: ఆవేశానికి లోనైన శశికుమార్ తన .32 లెసైన్స్డ్ రివాల్వర్‌తో ఉదయ్‌పై కాల్పులు జరిపాడు. ►5.15: చికిత్స కోసం ఉదయ్ కుమార్ తనంతట తానుగా హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందింది. ►6.15: శశికుమార్ సోమాజిగూడలోని స్నేహితురాలు చంద్రకళ ఇంటికి వెళ్లారు. ►6.30: సోమాజిగూడ నుంచి చంద్రకళ, శశికుమార్‌లు మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ► రాత్రి 7.45: దారిలో షాపింగ్ చేసుకుంటూ వీరిద్దరూ నక్కలపల్లిలో ఉన్న నిష్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. ►8.00: శశికుమార్‌ను అక్కడే వదిలిన చంద్రకళ తన కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ► 9.30: ఇంటికి చేరుకున్న చంద్రకళ రెండుసార్లు వాచ్మెన్ నెంబర్‌కు ఫోన్ చేసి శశికుమార్‌తో మాట్లాడారు. ►9.45: ఉదయ్ కుమార్‌పై కాల్పులు, శశికుమార్ వాంటెడ్ వివరాలను టీవీల్లో చూసిన చంద్రకళ షాక్‌కు గురయ్యారు. ►10.15: తనకు పరిచయస్తుడైన ఓ ఆర్మీ అధికారి సాయంతో పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పారు. ►11.10: పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చిన నారాయణగూడ పోలీసులు చంద్రకళతో కలిసి ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ►12.50: నిష్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్న పోలీసు బృందం శశికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించింది. ►మంగళవారం ఉదయం 10.30శశికుమార్ మృతదేహాన్ని మొయినాబాద్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ►మధ్యాహ్నం 1.30: పోస్టుమార్టం పరీక్షలు పూర్తి చేసిన ఫోరెన్సిక్ వైద్యులు శశికుమార్ మృతదేహాన్ని ఆయన సోదరుడికి అప్పగించారు. -
శశికుమార్ మియాజార్జ్ జంటగా వెట్రివేల్
నటుడు శశికుమార్‌తో నటి మియాజార్జ్ జత కడుతున్న వెట్రివేల్ చిత్ర షూటింగ్ మొదలైంది. దర్శకుడు, నిర్మాత, నటుడు శశికుమార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు రెండేళ్లు అయింది. ఆయన కథానాయకుడిగా నటించిన బ్రహ్మన్ చిత్రం తరువాత మరో చిత్రం విడుదల కాలేదు. ప్రస్తు తం జాతీయ ఉత్తమ దర్శకుడు బాలా దర్శకత్వంలో తారాతప్పట్టై చిత్రాన్ని నిర్మిస్తూ క థా నాయకుడిగా నటిస్తున్నారు. గరగాట కళకు కమర్షియల్ టచ్ ఇచ్చి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శశికుమార్ నాద స్వరం కళాకారుడిగా నటించడం విశేషం. నటి వరలక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాం తర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంగీత జ్ఞాని ఇళయరాజా బాణీ లు అందిస్తున్నారు. ఇది ఆయన సహస్ర చిత్రం కావడం విశేషం. త్వరలో ఆడియోను, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి శశికుమార్ సన్నాహాలు చేస్తున్నారు. మరో పక్క నూతన చిత్రంలో నటిస్తున్నారు. దీనికి వెట్రివేల్ అనే టైటిల్ నిర్ణయించారు. అమరకావ్యం చిత్రం ఫేమ్ మియాజార్జ్ నాయకిగా నటిస్తోంది. సీనియర్ నటుడు ప్రభు, తంబిరామయ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వసంతమణి పరిచయం అవుతున్నాడు. -
సంస్కృతిని ఆవిష్కరించేలా కుట్రపరంపరై
దర్శకుడు బాలా తన చిత్రాలకు తీసుకునే ఇతి వృత్తమే ఇతర చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సేతు, పితామగన్, నందా, నాన్‌కడవుల్, పరదేశి లాంటి చిత్రాలే ఇందుకు సాక్ష్యం. కథలో బలమైన పాయింట్ లేనిదే ఆయన టచ్ చేయరు. ప్రస్తుతం తమిళుల సంస్కృతిలో ఒక భాగం అయిన గరగాటక్కారన్ కళ ఇతి వృత్తాన్ని తీసుకుని తారైతప్పట్టై చిత్రాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. శశికుమార్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న ఆ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నాయకిగా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన 1000వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా తెరపైకి రానుంది. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత బాలా తదుపరి మరో సంచలన కథను చిత్రంగా మలచడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో విశాల్, అరవింద్‌సామి, ఆర్య, అధర్వ, రానా మొదలగు ఐదుగురు కథానాయకులు నటించనున్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. నాయకిగా అందాల తార అనుష్క నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా హిందీ నటుడు ఇబ్రాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రను పోషించనుండడం విశేషం. అయితే ఈ చిత్రానికి కథ ఏమిటన్న తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ర చయిత, నటుడు వేల్ రామమూర్తి రాసిన కుట్రపరంపరై అనే నవలను వెండితెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇది బ్రిటీష్ ఇండియాలో తీసుకొచ్చిన ఒక చట్టం.ఆ కుట్రపరంపరై చట్టం వల్ల ఒక సంఘం ఎలాంటి బాధల్ని ఎదుర్కొంది అన్నదే కథ. అప్పటి సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరించే చి త్రంగా కుట్రపరంపరై ఉంటుందని తెలి సింది. సంక్రాంతి పండగ తరువాత ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వె ల్లడించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ సమాచారం.