పాడేరు ఏఎస్పీ అనుమానాస్పద మృతి | paderu asp sasikumar died | Sakshi
Sakshi News home page

పాడేరు ఏఎస్పీ అనుమానాస్పద మృతి

Published Thu, Jun 16 2016 7:56 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

పాడేరు ఏఎస్పీ అనుమానాస్పద మృతి - Sakshi

పాడేరు ఏఎస్పీ అనుమానాస్పద మృతి

విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పాడేరు అడిషనల్ ఎస్పీ శశికుమార్ గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించారు.  ప్రమాదవశాత్తూ గన్ పేలిందా లేక కావాలనే ఆయన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున ఏఎస్పీ బంగ్లాలో కాల్పులు వినిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

శశికుమార్ తలకు తీవ్ర గాయం కావటంతో ఆయన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఏఎస్పీ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అవివాహితుడు అయిన శశికుమార్ ఆరు నెలల క్రితమే పాడేరు ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వస్థలం తమిళనాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement