
అమీర్‌పేట(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన మహిళ భర్త గతంలో ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు.
అతడి స్నేహితుడైన పసుపులేటి వెంకట నరసింహారావు అలియాస్ పీవీ అనే వ్యక్తి అతడితో ఉద్యోగం మాన్పించి తన సొంత సంస్థ అయిన లోన్ వాలా డాట్ కామ్‌లో చేర్చుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాననే సాకుతో తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లే వాడు. స్నేహితుడి భార్యపై కన్నేసిన అతను తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు.
బాధితురాలు ఈ విషయం భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను పీవీ వద్ద పని మానేసి మరో సంస్థలో చేరాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పీవీ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గర్భవతినని చెప్పినా వినిపించుకోకుండా లైంగిక దాడికి యత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.