Ameerpet
-
అమీర్‌పేట్‌లో పేలుడు.. పలువురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. అమీర్‌పేట్‌లోని రీసెంట్ కేఫ్ బేకర్స్‌లో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో సిలిండర్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కేఫ్‌లో పనిచేసే ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వినియోగదారులు ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
మద్యం కొనేందుకు వెళితే కారుతో పరారయ్యాడు
హైదరాబాద్: మద్యం కొనుగోలు చేసేందుకు షాపులోకి వెళ్తున్న క్రమంలోనే.. గుర్తు తెలియని వ్యక్తి ఖరీదైన కారును కొట్టేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌పేట లీలానగర్‌కు చెందిన తోట ప్రసాద్ వ్యాపారవేత్త. ఆదివారం సికింద్రాబాద్‌లో పనులు ముగించుకుని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బేగంపేట గ్రీన్‌పార్క్ హోటల్ ఎదురుగా ఉన్న రిలాక్స్ సంధ్య వైన్‌షాపులో మద్యం కొనేందుకు తన ఎంజీ హెక్టార్ కారులో వెళ్లారు. కారును ఆఫ్ చెయ్యకుండా అలానే ఉంచి మద్యం షాపులోకి పోతుండగానే తన కారు ముందుకు వెళ్లడం ఆయన గుర్తించారు. వెంటనే అడ్డుకునేందుకు ప్రయతించే లోపే.. ఆగంతకుడు అమీర్‌పేట వైపు వాహనాన్ని తీసుకుని అతివేగంతో వెళ్లిపోయాడు. ఆందోళనకు గురైన ప్రసాద్ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైన్ షాపు ముందున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాగా.. నిందితుడిని పట్టుకున్నట్లు కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితుడు గతంలో ఏదైనా దొంగతనాలు చేశాడా? పాత నేరస్తుడా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
'ఆ థియేటర్‌తో ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు'.. గుర్తు చేసుకున్న కల్కి డైరెక్టర్
కల్కి మూవీతో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కల్కి పార్ట్-2 పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫేమస్ థియేటర్‌ను గుర్తు చేసుకున్నారు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్లో నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. తెలుగు సినిమా చరిత్రలో సత్యం థియేటర్ ఒక భాగమన్నారు. ఆ థియేటర్లో గీతోపదేశంలోని కుడ్యచిత్రం అంతర్భాగమని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే మల్టీప్లెక్స్‌గా మార్చాక ఆ ఆ కుడ్యచిత్రాన్ని భద్రపరచలేదని ఆవేదన చెందాను.. కానీ మళ్లీ ఆ ఫోటోను చూడడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. ఆ చిత్రాలను అలాగే భద్రపరచిన నిర్మాత సునీల్ నారంగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సత్యం థియేటర్ మళ్లీ సత్యంగానే మారిందని ఇన్‌స్టాలో నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin) -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణలో కూడా నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరాతబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట సహా పాలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, తెలంగాలో కొద్ది రోజులుగా మేఘావృత వాతావరణం నెలకొన్ని విషయం తెలిసిందే. Hyderabad looks so beautiful with light rain and the glowing city skyline. A perfect peaceful Morning! 🌧️🌃 #HyderabadRains #CitySkyline #BeautifulHyderabad #RainyVibes@HyderabadMojo@HiHyderabad @hyderabadprop @ikaranreddy pic.twitter.com/fQaWuSDSHl— HyderabadInfra (@HyderabdInfra) December 8, 2024 -
అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ప్రయాణికుడి మృతి
హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి అమీర్‌పేట మెట్రోరైలు ఫ్లాట్ ఫాం నెంబర్ 1లో ఓ వ్యక్తి ఉన్న ఫలంగా కుప్పకూలడాన్ని గుర్తించిన సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో హార్ట్ స్ట్రోక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో అతను ఏపీలోని ఫిరంగిపురకు చెందిన బాలస్వామి సుదీర్ (39) గుర్తించారు. నగరంలోని కొత్తపేటలో ఉంటూ సింపోర్ సాఫ్ట్వేర్ కంపెనీలో అడ్మిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెట్టును ఢీ కొట్టిన కారుశామీర్పేట్: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన ఫర్హాన్ అహ్మద్ అన్సారి(23), షకీర్, రిజ్వాన్, అబ్దుల్లా స్నేహితులు. వీరు నలుగురు కలిసి కారు అద్దెకు తీసుకుని బుధవారం తెల్లవారుజామున కొండపోచమ్మ డ్యామ్‌కు బయలుదేరారు. అతివేగం కారణంగా మూడుచింతలపల్లి మండలం, కొల్తూర్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీటులో ఉన్న ఫర్హాన్ అహ్మద్ అన్సారీ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న షకీర్‌తో పాటు వెనక సీటులో కూర్చున్న రిజ్వాన్, అబ్దుల్లాకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Ameerpet: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
అమీర్‌పేట: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సంధ్య, నరేష్ దంపతులు ఎస్ఆర్నగర్లో ఓ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఆర్నగర్ పోలీసులతో కలిసి సీసీఎస్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు నరేష్ పరారు కాగా విటులు సంతోష్‌దాస్, రామరాజులతో పాటు మరో యువతిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీపులు తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌ఆర్‌నగర్‌కు బదిలీ చేశారు. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మళ్లీ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం జల్లులతో మొదలైన వర్షం.. కుండపోతగా మారింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఇక, నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, మాదాపూర్, ఖైరాతాబాద్, కొండాపూర్, పంజాగుట్టా, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్ నగర్, బోరబండా, మెహదీపట్నం,బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.Sunday Music Start #HyderabadRains pic.twitter.com/qP1uje5IX3— Johnnie Walker🚁 (@Johnnie5ir) September 8, 2024 Rainy day#rains #hyderabadrains #RainyDay pic.twitter.com/gSztUEI8cZ— Best Bike (@bestbike2023) September 8, 2024 Heavy rain in Begumpet Airport @balaji25_t 🌧️🌪️#Hyderabad #HyderabadRains#WeatherUpdate pic.twitter.com/FbtcUOHHbo— పంజా (@HarishNaidu01) September 8, 2024 Rains further Covers all parts in ✅Hyderabad by 3:15 PM ✅North Hyderabad to reduce rains after 3:20 PM#HyderabadRains https://t.co/WYklIZ5jPY— Hyderabad Rainfall Alert⛈️ (@Hyderabadstorm) September 8, 2024 -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోఠి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Very heavy smashing rain at Tellapur side. #Tellapur #HyderabadRains pic.twitter.com/dquYSIRmZx— Jagadish Reddy (@Jagadish_M) September 6, 2024 #06SEP 5:10PM⚠️Heavy Rain Spell ahead for West, Central, South &East #Hyderabad City.#Serilingampally, #Patancheru, #Kukatpally, #Begumpet, #Secunderabad,Abids,Khairatabad,Shaikpet, Charminar, Lb nagar Surroundings will see good Rains during the next 1hr⛈️⚠️#Hyderabadrains pic.twitter.com/vgpORYwzwg— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 Raining #Khajaguda 🌧️🌧️#Hyderabadrains pic.twitter.com/rnJ9GNbLBy— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం సమయంలో వర్షం కురుస్తుండటంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాగా, హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం కూకట్పల్లి, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, చందానగర్, మియాపూర్, జగద్గిరిగుట్ల సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Hyderabadrains!!Now iosalted thunder storm rains for west Hyderabad City places like Kukatpally serilingampally nizampet miyapur Quthbullapur places see good rains 🌧️🌧️⚠️ pic.twitter.com/aJlZvA4rSg— Telangana state Weatherman (@tharun25_t) August 14, 2024 -
అమీర్‌పేట కంపెనీపై సైబర్ అటాక్: రూ.10 కోట్లు..
టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే కాకుండా కొన్ని కంపెనీలను కూడా దోచేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ.. ఇటీవల హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన ఓ ఎక్స్పోర్ట్ కంపెనీ సైబర్ దాడికి గురైంది. నేరస్థులు ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేయడానికి కంపెనీ ఈమెయిల్ సిస్టమ్ హ్యాక్ చేశారు. దుబాయ్ కంపెనీ నుంచి అమీర్‌పేట కంపెనీకి రూ. 10 కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం సంస్థ దుబాయ్ కంపెనీకి మెయిల్ పంపింది.దుబాయ్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అందులో అమీర్‌పేట సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ కాకూండా.. సిడ్నీలో ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంకు అకౌంట్‌కు డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్లో ఉండటం గమనించి వెంటనే స్పందించారు.వెంటనే గమనించిన అప్రమత్తమవ్వడంతో లావాదేవీలు జరగకుండా ఆపగలిగారు. ఈ సంఘటన జరిగిన తరువాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి అమీర్‌పేట కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 318, 319 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా నుంచి వచ్చి.. యువతిని వేధించిన సీఈఓ
హైదరాబాద్: తన సంస్థలో విధులు నిర్వహిస్తున్న యువతి కోసం అమెరికా నుంచి వచ్చిన ఓ సీఈఓ..ఆమెను వేధించి కటకటాల పాలైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అమీర్‌పేటలో ఉన్న ఇన్ఫోగ్రావిటీ సంస్థ సీఈఓ టి.చంద్ర అమెరికాలో ఉంటాడు. ఇండియాలో తన కంపెనీ అభివృద్ధిలో భాగంగా నిరంతరం జూమ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగులకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో (అమీర్‌పేట సంస్థ)లో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్న యువతిని జూమ్ సమావేశంలో చూశాడు. అంతేగాకుండా ఆమెపై మనసు పారేసుకున్నాడు. తన కంపెనీ అభివృద్ధి కోసం అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వాలని సూచించడమే కాకుండా ఆమెను నిత్యం పొగిడేవాడు. అయితే అతను తన యజమాని కావడంతో యువతి ఏమీ అనలేక పోయింది. గతేడాది డిసెంబర్లో ఇండియాకు వచి్చన చంద్ర ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని ఒత్తిడి చేశాడు. దీంతో విసుగుచెంది అదే నెల 12న ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు రిలీవింగ్ లెటర్, జీతం, లీగల్ సరీ్వసెస్ డ్యూస్, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కావాలని కోరింది. అయితే తన కోర్కె తీరిస్తేనే వాటిని ఇస్తానని చంద్ర చెప్పడంతో ఆమె ఆగ్రహించి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై.. సాయంత్రం నుంచి పలుచోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, మీర్పేట్, చాదర్‌ఘాట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, పంజాగుట్ల, బంజారాహిల్స్, గోషామహల్, ఎస్ఆర్నగర్, కూకట్పల్లి, హబీబ్‌నగర్, రాయదుర్గం, అప్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. అకాల వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #HyderabadRains pic.twitter.com/IUaeFxv27c — pala hanmi reddy (@hanmireddy) November 23, 2023 @Hyderabadrains it's raining heavily at Raidurgham pic.twitter.com/druN8puIqC — Varun sam (@Varunsam007) November 23, 2023 Heavy rainfall in Hyderabad 🌧#HyderabadRains pic.twitter.com/o93Rq09eGp — Irfan Khan (@IrfanKhanhyd) November 23, 2023 -
అమీర్‌పేట్‌లో అవాన్య నెయిల్ అకాడమీ.. ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ సందడి (ఫోటోలు)
-
అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. అమీర్‌పేట్‌లో నిర్మించిన అత్యాధునిక మల్లీప్లెక్స్‌ను అల్లు అర్జున్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన మల్టీప్లెక్స్ చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) ఈనెల 16న రిలీజ్ కానున్న ప్రభాస్ ఆదిపురుష్ ఈ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టికెట్స్ భారీస్థాయిలో బుకింగ్ అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటికే టాలీవుడ్లో మహేష్ బాబు, ప్రభాస్, విజయ దేవర కొండ మల్టీప్లెక్స్ రంగంలో రాణిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మాణ సంస్థతో 'AMB' థియేటర్‌ను మహేష్ నిర్మించగా.. విజయ్ దేవర కొండ 'AVD' నిర్మించాడు. ప్రభాస్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఒక థియేటర్‌ను నిర్మించాడు. తాజాగా అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో బి డబ్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో ఒక రెస్టారెంట్, 800 జూబ్లీ అనే పబ్‌ను నడిపిస్తున్నాడు బన్నీ. Nizam king 👑 🔥 @alluarjun #Alluarjun #Pushpa2TheRule pic.twitter.com/NkM10Nzqn8 — AlluArjun Celebrations (@AA_CELEBRATIONS) June 15, 2023 ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్‌కు మరోసారి ప్రెగ్నెన్సీ.. నటి కీలక నిర్ణయం! ) the magnificent Grand Inauguration of #AAACinemas today graced by our beloved Icon Star, @alluarjun, and esteemed Minister @YadavTalasani Garu!@alluarjun Don't forget to use the hashtag #AAACinemasLaunch all day long to be a part of the excitement! 👍 pic.twitter.com/xKqnpNIi1C — AAA cinemas (@aaa_cinemas) June 15, 2023 -
AAA Cinemas Images: అల్లు అర్జున్ కొత్త థియేటర్ AAA సినిమాస్ ఎలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
AAA Cinemas Photos In HD: బన్నీ మల్టీప్లెక్స్‌లో అన్నీ ప్రత్యేకతలే.. చూస్తే వావ్ అనాల్సిందే (ఫోటోలు)
-
Hyderabad: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని
సాక్షి, హైదరాబాద్: మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి పేరుతో రూ.6 లక్షలు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.6 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌కు చెందిన యువతికి మ్యాట్రిమోనీ ద్వారా అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్ పరిచయం ఏర్పడింది. తనకు వివాహం అయ్యిందని.. భార్యతో విడాకులు తీసుకున్నట్లు చెప్పాడు. అతడి మాటలు నమ్మి సదరు యువతి అతడితో పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యాపార లావాదేవీల నిమిత్తం రూ.15 లక్షలు కావాలని చెప్పడంతో రూ.6 లక్షలు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్‌కు భార్యాపిల్లలు ఉన్నట్లు తెలియడంతో అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ఏమా జనం!.. కిక్కిరిసిన మెట్రో.. అడుగుపెట్టే జాగ లేదు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. రోడ్లపై ప్రయాణం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో నగరవాసులు సొంత వాహనాలను పక్కన పెట్టారు. ఆర్టీసీ బస్సుల్లోనూ పయనించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. గురువారం మాత్రం సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించినట్లు అంచనా. ఉదయం 8 గంటల నుంచే మెట్రో రైళ్లలో రద్దీ కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసి నడుస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు వేసవి కారణంగా సొంత వాహనాల కంటే మెట్రో రైళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. రద్దీ గంటలుగా భావించే ఉదయం 8 నుంచి 10 వరకు తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొద్ది రోజులుగా అన్ని వేళల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటుంది. రెండు కారిడార్లలోనే ఎక్కువ.. నాగోల్ నుంచి అమీర్‌పేట్ వరకు అక్కడి నుంచి రాయదుర్గం వరకు అన్ని ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అలాగే ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రం ప్రయాణికుల రాకపోకలు సాధారణంగానే ఉన్నాయి. మిగతా రెండు కారిడార్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటోంది. వివిధ స్టేషన్లలో కనీసం రెండు నుంచి మూడు మెట్రో రైళ్ల సామర్థ్యం మేరకు ప్రయాణికులు ఎదురు చూస్తుండగా ఒక్క రైలు మాత్రమే అందుబాటులోకి వస్తోంది. దీంతో మెట్రో ఆక్యుపెన్సీకి మించిన ప్రయాణికులతో రైళ్లు నడుస్తున్నాయి. నగరంలోని మూడు కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయినా.. ప్రయాణికులకు పడిగాపులు తప్పడంలేదు. ట్రిప్పులు పెరిగితేనే ఊరట... ప్రస్తుతం ప్రతి 3 నుంచి 5 నిమిషాలకో రైలు చొప్పున నడుస్తున్నాయి. కానీ.. రద్దీ ఎక్కువగా ఉండే నాగోల్ –రాయదుర్గం రూట్లో 5 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులు ఒక వెల్లువలా వచ్చేస్తున్నారు. ఎల్బీనగర్– మియాపూర్ రూట్లోనే అదే పరిస్థితి. రైళ్ల వేగాన్ని పెంచి ప్రతి 2 నిమిషాలకు ఒక మెట్రో అందుబాటులో ఉండేలా నడిపితేనే మరిన్ని ట్రిప్పులు పెరిగి ప్రయాణికులకు ఈ వేసవిలో ఊరట లభించే అవకాశం ఉంది. ఆ దిశగా హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాచరణ చేపడితే వేసవి తాపం నుంచి కొంత మేరకు ఉపశమనం లభించనుంది. Here a the answer. When you will increase the coaches? #hyderabadmetro @KTRBRS @TelanganaCMO @NVSReddyIRAS pic.twitter.com/4GkAYW4iE4 — Vishnu Vardhan (@vishnuremidi) April 20, 2023 -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్‌పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్‌హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్‌పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్‌నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
Hyderabad Metro: సాంకేతిక లోపంతో నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక సమస్యలు నగర మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తున్నాయి. మంగళవారం ఉదయం అమీర్‌పేట్– రాయదుర్గం రూట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓ రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో ఒకేవైపు మార్గంలోనే రైళ్ల రాకపోకలను కొనసాగించారు. రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. సమయానికి గమ్యం చేరుకోలేకపోయారు. మెట్రో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరగడంతో సుమారు రెండు గంటల పాటు గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. త్వరలోనే ప్రారంభం
సినిమాలతో పాటు బిజినెస్‌లపై కూడా దృష్టిపెట్టారు మన స్టార్ హీరోలు. ఎంతోమంది హీరోలు అటు సినిమాలు చేస్తూనే వ్యాపారరంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఏఎంబీ మాల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్సు రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ అల్లు అర్జున్ పేరిట హైదరాబాద్ అమీర్‌పేటలో భారీ మల్టీప్లెక్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీని నిర్మాణం కూడా పూర్తయ్యి, ఓపెనింగ్‌కి ముస్తాబవుతుంది. త్వరలోనే ఈ మల్టీప్లెక్సును ప్రారంభించనున్నారు బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిని తల్లిదండ్రులు మందలించి ఇంటికి తీసుకురాగా మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండలో జరిగిన సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన బి.లక్ష్మయ్య,నాగలక్ష్మిల కూతురు హేమలత (19) నల్గొండకు చెందిన వరుణ్‌కు ప్రేమించింది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 17న పెళ్లి చేసుకుంది.అదే రోజు అక్కడి పోలీసులు హేమలత తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు నల్గొండకు వెళ్లి పోలీసుల సమక్షంలో కూతురికి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం హేమలత నాయనమ్మ యాదమ్మ ఇంటి బయటకు కూర్చుని ఉండగా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన యాదమ్మ కేకలు వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా వచ్చి చూసేసరికి యువతి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై అంజనేయులు తెలిపారు. చదవండి: (భర్త కాదు.. మృగం.. భార్యను కత్తితో పొడిచి హత్య) -
HYD: కొంప ముంచిన వీడియో కాల్.. యువతి అందచందాలకు ఫిదా అయిపోయి..
సాక్షి, హైదరాబాద్: పరిచయం లేని అందమైన అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్‌కు బుట్టలో పడ్డాడు నగరానికి చెందిన పేరుమోసిన వ్యాపారవేత్త. ఇద్దరిమధ్యా చనువు పెరిగి ఒకరికొకరు వీడియో కాల్స్‌లో నగ్నంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ వీడియోను అడ్డం పెట్టుకుని సైబర్‌నేరగాళ్లు బెదిరింపులకు దిగడంతో లక్షలు ముట్టజెప్పి న్యాయం కోసం సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన మేరకు.. అమీర్‌పేటలో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారవేత్తకు అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయగా..ఇద్దరూ హాయ్ అంటూ మెసేంజర్‌లో పలకరించుకున్నారు. ఆతర్వాత వీరిద్దరూ వాట్సప్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. పరిచయమైన గంటలోనే యువతి వాట్సప్ నంబర్‌కు వీడియో కాల్ చేసి తన అందచందాలను చూపించింది. అమ్మాయి అందంగా ఉండటంతో వ్యాపారవేత్త రెండు అడుగులు ముందుకేశాడు. మరుసటి రోజు ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. సుమారు నిమిషన్నర్ర నిడివిగల న్యూడ్ వీడియోను అడ్డం పెట్టుకున్న యువతి వ్యాపారవేత్తపై బ్లాక్‌మెయిల్‌కు ఒడిగట్టింది. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యాపారవేత్త వీడియో బయటకు వస్తే పరువు పోతుందనే భయంతో..వారు అడిగిన విధంగా పలు దఫాలుగా రూ.9లక్షలు సమర్పించాడు. ఇంకా అడుగుతూ బెదిరింపులకు దిగడంతో చేసేదేమీ లేక న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ వ్యవహారం అంతా కూడా కేవలం రెండు రోజుల్లోనే జరగడం విశేషం. చదవండి: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి! -
మెట్రో స్టేషన్లో యువకుడి వికృత చేష్టలు.. లిఫ్ట్ ఎక్కి.. బట్టలు విప్పి
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్లే మహిళల ఎదుట వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళ మంగళవారం షాపింగ్ చేసేందుకు అమీర్‌పేటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న మెట్రో స్టేషన్ లిఫ్ట్ ఎక్కింది. వెనకాలే వచ్చిన ఓ యువకుడు లిఫ్ట్‌లోకి ఎక్కాడు. బట్టలు విప్పి వికృత చేష్టలు చేయడాన్ని గమనించిన ఆమె భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి మెట్రో సెక్యూరిటి సిబ్బందికి తెలిపింది. సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఒడిషాకు చెందిన రాజుగా గుర్తించారు. సోమవారం నగరానికి వచ్చిన అతను ఉదయం నుంచి లిఫ్ట్‌లో ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ప్రయాణికులకు ఊరట.. లష్కర్లో మినీ బస్సులు టికెట్ రూ.5 -
పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం అట్లూరి వారి గ్రామానికి చెందిన వర్ధమాన సినీనటి అనుశ్రీ జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఉంటోంది. ఫిట్నెస్ కోసం గతేడాది కల్యాణ్నగర్లోని ఏ–1 డాన్స్ అండ్ ఫిట్నెస్ సెంటర్లో చేరింది. నిర్వాహకుడు అన్వేష్ ప్రపోజ్ చేయడంతో అంగీకరించింది. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించిన అన్వేష్ వేరే యువతితో చనువుగా ఉండటాన్ని గమనించిన అనుశ్రీ అతడిని నిలదీయగా మరోసారి అలా చేయనని చెప్పడంతో ఊరుకుంది. ఈ క్రమంలో ఓ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నానని రూ.10 లక్షలు అవసరముందనడంతో అనుశ్రీ డబ్బులు ఇచ్చింది. ఓ రోజు వచ్చి పెళ్లి ప్రస్తావన తీయడంతో ఇప్పుడే చేసుకుందామని స్టూడియోలోనే దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా అన్వేష్ యువతులతో సంబంధాలు పెట్టుకున్నట్లు గుర్తించి మరోసారి గట్టిగా నిలదీయగా నువ్వు నా స్టూడియోకు రావొద్దని హెచ్చరించడంతో తనుశ్రీ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఓటీటీలో సర్కారు వారి పాట.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..) -
కరాటే కల్యాణితో ప్రాణభయం ఉంది.. మరో బాధితుడి ఫిర్యాదు
సాక్షి, అమీర్‌పేట: కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని ఓ మరో బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది. వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. నన్ను అడగడానికి నువ్వెవరంటూ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్ కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి) -
Hyderabad: అద్దె ఇల్లు చూసేందుకు వచ్చి... ఇంట్లోనే సన్నిహితంగా
సాక్షి, అమీర్‌పేట: అద్దె ఇల్లు కావాలంటూ వచ్చిన ఓ యువజంట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఎస్ఆర్నగర్లో సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఉదయం ఓ యువతి, యువకుడు ఇల్లు అద్దెకు కావాలని యజమాని వద్దకు వచ్చారు. లోపల ఇంటిని చూసేందుకు రెండో అంతస్తుకు వెళ్లారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో యజమాని పైకి వెళ్లాడు. ఇంట్లో ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారి పోయారు. ఇదంతా సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చదవండి: (భార్య రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త ఏం చేశాడంటే..?) -
ఓయోలో వ్యభిచారం.. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకొచ్చి..
సాక్షి, అమీర్‌పేట: ఓయో హోటల్ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బల్కంపేట ఎస్బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్‌లో ఉన్న ఓయో రూమ్‌లో వ్యభాచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు. రమేష్‌ను విచారించగా తాను జనార్దన్ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్‌లోని విద్యుత్ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. జనార్దన్ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్ మీరా, కో ఆర్టినేజర్ తిరుమల్‌రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇంతకుముందే పెళ్లి.. నాగరాజుతో సాన్నిహిత్యం.. కట్నం తేవాలంటూ.. -
తనను కాదని.. మనువాడిందని కత్తితో దాడి
అమీర్‌పేట: తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేశాడో వ్యక్తి. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి(35)కి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో 2007లో వివాహమైంది. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎర్రగడ్డ బి.శంకర్‌లాల్‌నగర్‌లో ఉండేవారు. తొలి కాన్పులో ఆమెకు కుమారుడు, రెండోసారి కూతురు జన్మించారు. కూతురు పుట్టిందనే నెపంతో 2009లో ఆమెను భర్త వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్యామల కొడుకు, కూతురితో కలిసి నగరంలోనే ఉంటోంది. 2016లో సుల్తాన్‌నగర్‌లో ఉండే సైకిల్ మెకానిక్ సయ్యద్ ఖలీల్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరు సహజీవనం చేశారు. ఈ నేపథ్యంలో 2017లో బి.శంకర్లాల్నగర్కు చెందిన చెఫ్ శ్రీశైల్ కోట్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ విషయం ఖలీల్‌కు తెలియడంతో ఆమెపై ఖలీల్ కక్ష పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఎర్రగడ్డ సంతలో మూడు కత్తులను కొనుగోలు చేసి గౌతంపురి కాలనీలో ఆమెపై కత్తితో దాడి చేశాడు. క్షతగాత్రురాలిని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
ఎమ్మెల్యేతో మహిళ ఫొటో.. మార్ఫింగ్ చేసి ఆడియోలో అసభ్యకరంగా..
సాక్షి, అమీర్‌పేట: శుభకార్యానికి వచ్చిన ఎమ్మెల్యేతో కలిసి ఓ మహిళ దిగిన ఫొటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అసభ్యకరంగా కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీసుల సమాచారం మేరకు.. వెంగళరావునగర్‌లో ఉండే ఓ గృహిణి భర్తతో కలిసి ఇటీవల జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైంది. అక్కడికి సమీప బంధువైన కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా రావడంతో పక్కపక్క కూర్చుని ఫొటోలు దిగారు. అయితే కొందరు వ్యక్తులు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆడియోలోఅసభ్యకరమైన కామెంట్లు పెట్టి ఫేస్బుక్, యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. దీంతో సదరు మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం కేసును ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు. చదవండి: Hyderabad: చిట్టీల పేరుతో అధిక వడ్డీ.. రెండు కోట్లతో ఉడాయించింది చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి.. -
అమీర్‌పేట: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన యువతి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్ పై నుంచి ఒక యువతి కిందకు దూకడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న మెట్రో అధికారులు యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగాను ఉంది. కాగా యువతి వయసు 18 సంవత్సరాలు అని తేలింది. అయితే ఆమె ప్రమాదవశాత్తూ జారిపడిందా లేక ఆత్యహత్యకు ప్రయత్నించిందా అన్నది తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని..
సాక్షి, మహేశ్వరం: నిశ్చితార్థం రద్దు కావడంతో ఓ యువతి ఉరివేసుకొని తనువు చాలించింది. రెండు కుటుంబాలు పట్టింపులకు వెళ్లడంతో మనస్తాపానికి గురైంది. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని పెండ్యాల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహేశ్వరం సీఐ మధుసూదన్, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చామలేటి చంద్రయ్య, లావణ్య దంపతుల కూతురు ప్రగతి(19) డిగ్రీ వరకు చదువుకుంది. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) మండల పరిధిలోని అమీర్‌పేట్ గ్రామానికి చెందిన కార్తీక్‌తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా ఇరు కుటుంబపెద్దలు పట్టింపులకు పోవడంతో ఆదివారం దానిని రద్దు చేసుకున్నారు. వివాహం చేసుకునేందుకు ప్రగతి, కార్తీక్‌కు ఇష్టం ఉన్నా నిశ్చితార్థం ఆగిపోవడంతో యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంట్లో చీరతో ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 6 గంటలకు ప్రగతిని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి ..వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్‌కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. ప్రగతి ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (చదవండి: హైదరాబాద్‌లో విషాదం: గాలిపటం ఎగురవేస్తూ..) -
అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత.. ప్రోటోకాల్ రగడ
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమీర్‌పేట ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ప్రోటోకాల్ విషయంలో బీజేపీ -టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్పొరేటర్- మాజీ కార్పొరేటర్ అనుచరులు బాహాబాహీకి దిగారు. పోలీసులు సర్దిచెప్పినా గొడవ సద్దుమణగలేదు. ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన శిలా ఫలకంమీద పోట్రోకాల్ ప్రకారం కిషన్‌రెడ్డి పేరు ముందు వరుసలో లేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్ఎస్,బీజేపీ కార్యకర్తల పరస్పర నినాదాలతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి -
ఇత్తడిని పుత్తడిగా మార్చి.. హాల్‌మార్క్ గుర్తుతో కోట్లు దండుకున్నాడు
సాక్షి, అమీర్‌పేట: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి బంగారు నగల దుకాణాల్లో తాకట్టుపెట్టి ఓ వ్యక్తి రూ.కోట్లు దండుకున్నాడు. అతడి చేతిలో మోసపోయిన నగల వ్యాపారులు తెలంగాణ, ఏపీ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రహమత్‌నగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇత్తడితో నగలు తయారు చేయించేవాడు. అనంతరం వాటికి బంగారు కోటింగ్ వేయించి, హాల్‌మార్క్ గుర్తుతో సహా నగర షాపులకు తీసుకువెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాడు. ఇదే తరహాలో బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లోని పలు షాపుల్లో నకిలీ నగలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా నగలను విడిపించుకోకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. శుక్రవారం నకిలీ నగలతో బోరబండలోని ఓ నగల షాపునకు వెళ్లిన వెంకట్‌రెడ్డి వ్యాపారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి చేతిలో మోసపోయిన 18 మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం -
అమీర్‌పేట్‌లో స్కూల్ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, అమీర్‌పేట: ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడ స్టేట్ హోంలోని బాలసదనంలోని ప్రియ అనే బాలిక వెంగళరావునగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రియ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేనందున పాఠశాల హెచ్ఎం ధనుంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
అమీర్‌పేట: ‘నిన్ను మనసారా ప్రేమించాను. నీవు నాకు దూరమవుతున్నావన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నీవు లేకుండా నేను బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది. ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నీరజ్‌కుమార్ కుటుంబం మధురానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరి కుమారుడు కె.విశాల్ (26)ఓ యువతిని ప్రేమిచాడు. చదవండి: సెంట్రల్ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక.. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోగా ఇటీవలే యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే తన గదిలో పడుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో తండ్రి నీరజ్ వెళ్లి విశాల్‌ను లేపేందుకు ప్రయతి్నంచాడు. ఎలాంటి చలనం లేకపోడంతో వెంటనే అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విశాల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. సెనైడ్ ఎలా వచ్చింది? సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. తాను అమితంగా ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని 40 నిమిషాల వీడియో తీసుకున్నాడు. గదిలోని ఓ సీసాలో సెనైడ్ ఉంది. దాన్ని ముట్టుకోవద్దని రాసిపెట్టి బెడ్ కింద ఉంచిన కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాల్ సెనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే విశాల్‌కు సెనైడ్ ఎలా వచ్చింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి -
అమీర్‌పేటలో ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నభానటేష్ సందడి
అమీర్‌పేట: విభిన్న ఆహార రుచులకు హైదరాబద్ కేరాఫ్‌గా నిలుస్తోందని సినీ నటి సభా నటేష్ అన్నారు. అమీర్‌పేటలో నూతనంగా ఏర్పాటైన జిస్మత్ మండి అరబిక్ జైల్ థీమ్ రెస్టారెంట్‌ను టాలివుడ్ నటి ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు జైల్ థీమ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరులో జిస్మత్ అరబిక్ మండీలు ఉన్నాయని, త్వరలో ఏఎస్‌రావునగర్, దిల్సుఖ్నగర్, ఏలూరుతో పాటు బెంగుళూరులో తమ శాఖలను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు యూట్యూబర్ గౌతమి, ధర్మా తెలిపారు. మండీలను జైలును తలపించే తరహాలో తీర్చిదిద్దామని, ఖైదీల వేషధారణలో కారాగారం డైనింగ్ సెటఫ్లో కూర్చునే ఆహార ప్రియులకు ఆహారం అందజేస్తారని చెప్పారు. కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ హిమజ, టీఆర్ఎస్ నాయకుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు. -
‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’
సాక్షి, అమీర్‌పేట: ‘నేను చనిపోతేనే నీకు ప్రేమ విలువ తెలుస్తుంది’అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం కేపీ పాలెం గ్రామానికి చెందిన గొర్రె సుధాకర్ (29) హైదరాబాద్‌కు వచ్చి ఎస్సై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బీకేగూడ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి రూమ్మేట్ భార్గవ్ గది తలుపులు తట్టగా, ఎంతసేపటికీ తలుపు తీయక పోవడంతో పై పోర్షన్లోకి వెళ్లి బాల్కనీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా సుధాకర్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సెల్ఫోన్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను గుర్తించారు. ప్రేమ విఫలం కావడంతోనే సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతుడి బాబాయ్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎల్లమ్మ తల్లీ.. నీవే మా కల్పవల్లి
అమీర్‌పేట: పండుటాకులు.. నిండు ముత్తైదువలు.. వేపకొమ్మలు చేబూని.. పసుపు కుంకుమలను ముఖాలకు పూసుకుని మురిసిపోయారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని తనివితీరా తలుచుకుని తన్మయత్వం పొందారు. అమ్మవారి పట్ల తమకున్న అవ్యాజమైన భక్తిని చాటుకున్నారు. పసుపు, కుంకుమలతో కలకాలం చల్లంగా ఉండాలని, నగర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మంగళవారం అమీర్‌పేటలోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో కనిపించిన ఈ దృశ్యం భక్తులను అమితంగా అబ్బురపరిచింది. ఉదయం 11.గంటల 11 నిమిషాలకు అమ్మవారి కల్యాణం జరిగింది. ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పులకించిన ‘బల్కంపేట’ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం మంగళవాద్యాలతో, వేద మంత్రోచ్చారణలతో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించి పులకించారు. వేడుకల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్‌కుమార్, దైవజ్ఞ శర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్య, కార్పొరేటర్లు సరళ, కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, ఆలయ ఈఓ ఎస్.అన్నపూర్ణ, చైర్మన్ సాయిబాబాగౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. -
జియోలో ఉద్యోగం.. రూ.7.48 లక్షలు మాయం
సాక్షి, హిమాయత్‌నగర్: సంపన్న వర్గానికి చెందిన ఓ యువతికి సైబర్ నేరగాడు భారీ టోకరా వేశాడు. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేటకు చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం నౌకరీ డాట్ కామ్‌లో రెజ్యూమ్ పెట్టింది. రెజ్యూమ్ చూసిన సైబర్ నేరగాడు జియో కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. మీ రెజ్యూమ్‌ను జియో హెచ్ఆర్కు ఫార్వర్డ్ చేశానని, మీ చదువుకు తగ్గ ఉద్యోగం రావాలంటే కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్నాడు. జియో సంస్థ కావడంతో అత్యాశకు పోయిన యువతి సైబర్ నేరగాడు అడిగిన విధంగా పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.7.48 లక్షలను పంపింది. రోజులు గడిచినా జియో సంస్థ నుంచి ఫోన్ రాకపోవడంతో పలుమార్లు ఆమెకు పరిచయమైన వ్యక్తికి ఫోన్ చేసి అడిగింది. వారం, పదిరోజులు అంటూ కాలయాపన చేస్తున్నాడు. దీంతో తాను వెసపోయినట్లు గ్రహించి బుధవారం సాయంత్రం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: అత్యాచార నిందితుడితో యువతి అరెస్ట్.. బాధతో గుండె పగిలి.. -
అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్‌కు పోటీగా!
సినిమాలతోపాటు ఇతర బిజినెస్‌లపై దృష్టిపెట్టారు మన టాలీవుడ్ హీరోలు.. కొత్త రంగాల్లో పెట్టిబడి పెడుతూ చేతికి అందినంత సంపాదించుకునేదుకు సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. స్టార్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ఇప్పుడు థియేటర్ల రంగంలోకి ఎంటర్ అయ్యాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఏఏ(AAA) సినిమాస్ మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ వ్యాపారంలో మహేశ్‌బాబు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ(AMB) సినిమాస్ పేరుతో మహేష్ బిజినెస్ చేస్తున్నాడు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఏవీడీ(AVD) సినిమాస్ పేరుతో తన సొంత పట్టణం మహబూబ్‌నగర్‌లో మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం బన్నీ కూడా థియేటర్ల బిజినెస్‌లోకి రావడంతో వీరిద్దరి మధ్య మంచి పోటీ నెలకొనబోతోందని టాక్ వినిపిస్తోంది. సినిమా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మల్టిప్లెక్స్ నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇక అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఏఏఏ సినిమాస్ నిర్మాణం జరుగుతోంది. అమీర్‌పేట్ పరిసరాల్లోనే అత్యంత విలాసవంతమైన భవంతిగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దీని కోసం భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాతి వరకు ఈ థియేటర్ రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ ఫోటోతో ఏఏఏ లోగో కూడా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ రేంజ్ మించిపోయేలా ఏఏఏ సినిమాస్ ఉంటుదా అనేది తెలియాలంటే నిర్మాణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. చదవండి: పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు -
కూకట్‌పల్లిలో ప్రభుత్వ స్థలం ఉందని చెప్పి...
అమీర్‌పేట: సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్కుడిని మోసం చేశాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూకట్‌పల్లిలో స్థలం ఇప్పిస్తానంటూ రూ.25 లక్షలు కాజేసిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవీ శైలేంద్రనాథ్ అనే వ్యక్తి ఎస్ఆర్నగర్లోని స్వస్థిక్ ప్లాజా హిమాలయా బుక్ స్టోర్ పైఅంతస్తులో నివాసముంటున్నాడు. ప్రసార మాధ్యమాల ద్వారా శైలేంద్రనాథ్ గురించి తెలుసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. తన పేరు సుధాకర్ అని తాను సీఎం కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పరిచయం చేసుకున్నాడు. పలుమార్లు జాతకం చూపించుకున్న సుధాకర్ వెంట ఇద్దరు గన్మెన్లు కూడా ఉండటంతో పాటు వారి వద్ద గన్స్ కూడా ఉండేవి. కూకట్‌పల్లిలో ఓ చోట ప్రభుత్వ స్థలం ఉందని, అది నీకు వచ్చేలా చూస్తానని, అందులో ఆధ్యాత్మిక కేంద్రం పెట్టుకోవచ్చని నమ్మించాడు. దీంతో శైలేంద్ర విడతలవారీగా 2019 నుంచి 2021 ఫిబ్రవరి వరకు రూ.25 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకుని సంవత్సరాలు గడస్తున్నా స్థలం ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చి తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శైలేంద్ర కోరారు. డబ్బులు అడిగితే గన్‌తో కాల్చి చంపేస్తానని బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. -
ఆగమాగమైన అమీర్‌పేట ఐటీ!
అమీర్‌పేట.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచానికి తెలిసిన పేరు.. కుప్పలుతెప్పలుగా ఉండే కోచింగ్ సెంటర్లలో గుంపులుగా యువత.. ఉదయం, సాయంత్రం ఆ ప్రాంతం కరపత్రాలతో నిండిపోతుంది. ఆకాశాన్ని మూసేలా పోటాపోటీ బ్యానర్లు.. ఎటు చూసినా ఆఫర్లమయం.. కాస్త ఆలోచించి శిక్షణ తీసుకొని కష్టపడితే చాలు ఫ్లైట్‌లో విదేశాలకు ఎగిరిపోవచ్చు.. పల్లెల్లో సైకిళ్లు ఎరుగని యువకులు సైతం పెద్ద కంపెనీల్లో కొలువులు చేస్తున్నారంటే అమీర్‌పేట పుణ్యమే.. ఎర్రబస్సు ఎరుగని పల్లె టు అమెరికా వయా అమీర్‌పేట అన్నా అతిశయోక్తి కాదేమో.. దిగ్గజ ఐటీ కంపెనీల్లో కొలువులకు బాటలు ఇక్కడి నుంచే మొదలయ్యేవి. ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను విద్యార్థులకు పండొలచినట్లు చెప్పి సవాళ్లను ఎదుర్కొనేలా తీర్చిదిద్దే సెంటర్లు కోకొల్లలు. ఏడాదికి ఐదు లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్‌కు పునాది అమీర్‌పేట. కరోనా కాటుకు ఇక్కడి ఐటీ శిక్షణ కేంద్రాలు ప్రస్తుతం మూతపడ్డాయి. -సనత్‌నగర్ ఆ తొమ్మిది నెలల్లో ఏం జరిగిందంటే.. ► కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ముందు ఐటీ విద్యార్థులతో అమీర్‌పేట అలరారింది. కరోనా మహమ్మారి కారణంగా ఇంకా కోచింగ్ సెంటర్లు తెరుచుకోలేదు. ► ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. అకాడమీ ఇయర్ పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు సాఫ్ట్వేర్ కొలువు కోసం ఇక్కడి శిక్షణ కేంద్రాల వైపే అడుగులు వేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దాదాపు 18 రాష్ట్రాల నుంచి ఇక్కడ శిక్షణ తీసుకునేందుకు వస్తారు. ► ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కావడంతో పాటు ఐటీ కోర్సుల ఫీజులు చాలా తక్కువ. ఆ ప్రకారంగా ఏడాదికి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు తమ కలల జాబ్‌ను సంపాదించేందుకు ఇక్కడి కేంద్రాల్లో వాలిపోతుంటారు. ► ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 9 నెలలుగా విద్యార్థులు లేక శిక్షణ కేంద్రాలు బోసిపోయాయి. అప్పట్లో ఒక్క విద్యార్థి అమీర్‌పేట గడప తొక్కాడంటే.. అతడిని ఏదో రకంగా తమ కేంద్రంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు. అలాంటిది తొమ్మిది నెలలు పాటు విద్యార్థులు దూరమైతే పరిస్థితి ఊహించుకోవచ్చు. ► అమీర్‌పేట కేంద్రంగా 400–450 వరకు శిక్షణ కేంద్రాలు ఉంటే కరోనా దెబ్బకు అందులో 80 శాతం మేర దివాళా తీసి పెట్టేబేడా సర్దుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చాక చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. మిగతా 20 శాతం సంస్థలు ‘ఆన్లైన్’ క్లాసులతో నెట్టుకొస్తున్నాయి. 50వేల మంది ఉపాధిపై వేటు.. ► అది మైత్రీవనం భవనంలో కొనసాగుతున్న ఐటీ శిక్షణ కేంద్రం. కరోనాకు ముందు 80 మంది పనిచేసేవారు. ఆన్లైన్ శిక్షణ కొనసాగిస్తుండటంతో ఇప్పుడు కేవలం నలుగురితో నడిపిస్తున్నారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాల్లో ఉద్యోగులను భారీగా కుదించుకోగా.. ఇక మూతపడ్డ శిక్షణ కేంద్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ► టిఫిన్ సెంటర్లు, చాట్ భండార్లు, టీ స్టాల్స్.. ఇలా పదుల సంఖ్యలో చిరువ్యాపారులు ఇక్కడ ఐటీ విద్యార్థులను నమ్ముకుని బతికేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలామంది ఊళ్లకు వెళ్లిపోయారు. అలాగే శిక్షణ కేంద్రాలకు ప్రచారం కల్పించేందుకు ఒక పెద్ద టీమ్ ఉంటుంది. ఇప్పుడు వారంతా అడ్రస్ లేకుండాపోయింది. ఇక హాస్టల్స్ పరిస్థితి అగమ్యగోచరం. టాలెంట్‌కే పెద్దపీట.. కరోనాకు ముందు ప్రతి 100 మందిలో 10 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ ఇప్పుడు 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా మోస్ట్ టాలెంటెడ్ వారికే అవకాశం కల్పిస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభ సమయంలో చాలా ఐటీ కంపెనీలు కరోనా సాకుతో చాలామందిని ఇంటికి సాగనంపినట్లు తెలిసింది. ఈ క్రమంలో టాలెంట్ కలిగిన ఫ్రెషర్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫ్రెషర్స్‌కు తక్కువ వేతనాలు ఇచ్చినా తమకు అనుకూలంగా ఉంటారన్న భావనతో ఉన్నట్లు సమాచారం. ‘ఆన్లైన్’.. ఒక సవాలే.. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్లో బోధించినట్లు ఇక్కడ కుదరదు. ఐటీ శిక్షణ అంటే విద్యార్థిని ఉద్యోగ జీవితంలోకి ఆహ్వానించే ఓ ఫ్లాట్‌ఫాం. అందుకు తగ్గట్టుగా విద్యార్థులకు ఐటీ విజ్ఞానాన్ని నూరిపోయాలి. ఫిజికల్ తరగతులతోనే ఇది సాధ్యమయ్యే ప్రక్రియ. అలాంటిది ఆన్లైన్లో ఆ తతంగాన్ని పూర్తి చేయాలంటే పెద్ద సవాలే.. అందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వర్స్, ఆన్లైన్ సిమిలేటర్స్ సమకూర్చుకోవాలి. ఐటీ శిక్షణ కేంద్రాలకు ఇది మరింత భారం. కీలక సమయం కోల్పోయాం.. ఐటీ శిక్షణ కేంద్రాలకు మే, జూన్, జూలై మాసాలు అత్యంత కీలకం. కరోనా కారణంగా ఆ సమయాన్ని కోల్పోయాం. ఆన్లైన్ తరగతులను సీరియస్‌గా ఫాలో అయితే జాబ్ కొట్టొచ్చు. కరోనాతో కొంతమేర ఐటీ కంపెనీలు డీలా పడిన మాట వాస్తవమే. ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులను పక్కకు తప్పించారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి. – నరేష్, ఎండీ, నరేష్ టెక్నాలజీ 400 మందికి ఉద్యోగాలు.. సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలపై కోవిడ్–19 కోలుకోని దెబ్బకొట్టింది. అమీర్‌పేట, కేపీహెచ్‌కాలనీ ప్రాంతాల్లో 80 శాతం వరకు శిక్షణ కేంద్రాలు మూతపడ్డాయి. విద్యార్థులకు స్కిల్స్ ఉంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా శిక్షణ పొందినా ఉద్యోగం గ్యారంటీ. తాము కోవిడ్‌లోనూ 400 మందికి ప్లేస్మెంట్ అందించాం. స్కిల్స్ ఉంటే ఇంటికే ల్యాప్‌టాప్ పంపించి పని చేయించుకుంటారు. – దండు విశ్వనాథరాజు, సీఈఓ, వెక్టార్ ఇండియా -
హైదరాబాద్: అమీర్‌పేట్‌లో రోడ్డు ప్రమాదం
-
అమీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం తెల్లవారుజామున అతి వేగంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడి తల మెట్రో స్టేషన్ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) -
అమీర్‌పేట్‌లో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ సరఫరా చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చేరవేస్తున్న బంటీ ముఠాను బుధవారం నగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎక్స్ స్టసి పిల్స్ 46 గ్రాములు, 2 గ్రాముల MDMA, 10 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. బంటీతో పాటు నగరానికి చెందిన రోహిత్, నవీన్‌రాజ్ డ్రగ్స్ కోసం గోవాకు వెళ్లినట్లు తెలుస్తోంది. గోవాకు చెందిన కునాల్, రఫీ పరార్ ఇద్దరు ముఠా సభ్యులు బంటీ గ్యాంగ్‌కు డ్రగ్స్ సరపర చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు వాడిన టూ వీలర్, కార్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. -
మాఫియా డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయ్యింది. ఆదివారం అమీర్‌పేట్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 105 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హషిష్ ఆయిల్, 4 బ్లాట్స్ ఎల్ఎస్డీ, 250 డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కార్లు, ఒక బైక్, 7 మొబైల్ ఫోన్ల స్వాధీనంతోపాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న మధురానగర్‌కు చెందిన భరత్ తుక్రాల్(48)తోపాటు బల్కంపేట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాణాప్రతాప్(29), షేక్ ఫిరోజ్ అహ్మద్(29)ను అరెస్టు చేశారు. డ్రగ్స్ రవాణాకు వినియోగించిన రెండు కార్లను, ఓ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్‌ను బెంగళూరుకు చెందిన జేమ్స్, ఢిల్లీకి చెందిన జెమీ, చెన్నైకు చెందిన అబ్దుల్ వద్ద కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. జేమ్స్, జెమీ, అబ్దుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నార న్నారు. కేసు తదుపరి విచారణ కోసం అమీర్ పేట్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజి రెడ్డి తెలిపారు. కాగా, నిందితులు నగరంలోని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలకు నిషే ధిత డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
అమీర్‌పేట: టైర్ల షాపులో పనిచేసే ఓ యువకుడు వేధిస్తున్నాడన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అమీర్‌పేట ఈస్ట్ శ్రీనివాస్‌నగర్ కాలనీలోని అనురాగ్ అపార్ట్మెంట్లో ఉండే ఆర్టీసీ కండక్టర్ ఎం. గోపాల్, లావణ్య దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కూతురు అశ్విని (22) రంగరాజు గోకరాజు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు చదువుకుంటానని అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత తండ్రికి ఫోన్‌చేసి అపార్ట్మెంట్ సమీపంలోని టైర్ల షాపులో పనిచేసే నవీన్ కొద్ది రోజులుగా తనను వేధిస్తున్నాడని, మనస్తాపంతో విషం సేవించి ఆత్మహత్య చేసుకుంటున్నా నని ఏడుస్తూ తెలిపింది. గోపాల్ వెంటనే పైకి వెళ్లి చూడగా నోట్లో నుండి నురగలు కక్కుతూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా యువతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
యువతులతో పట్టుబడ్డ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్ : గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నాగేందర్ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్ భవన్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అమీర్‌పేట్‌లో వ్యభిచారం దందా నడుస్తున్నట్లు ఎస్సార్‌నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి నిర్వహించిన పోలీసులకు నాగేందర్ ముగ్గురు యవతులతో అడ్డంగా దొరికిపోయాడు. నాగేందర్‌తో పాటు, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (లిఫ్ట్‌లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం) -
అనుమానాస్పదంగా సినీ ఆర్టిస్ట్ మృతి
సాక్షి, హైదరాబాద్(అమీర్‌పేట): సినీ ఆర్టిస్ట్, టీవీ యాంకర్‌గా పని చేస్తున్న పర్తి విశ్వశాంతి (33) మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని ఫ్రిబ్‌జీ రెసిడెన్సీ చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ ఫ్లాట్ నెంబర్.5లో అద్దె ఉంటున్న ఈమె గత మూడు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు. బెడ్రూంలో విగత జీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాళ్లు బెడ్‌పై, ముఖం నేలపై పడి ముఖం మీద గాయాలై రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. గదిలో ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయి. టీపాయ్ మీద స్నాక్స్ ఉండటంతో తీసుకోవడానికి వెళ్లి మద్యం మత్తులో అదుపుతప్ప కిందిపడి చనిపోయి ఉండవచ్చు లేదా ఎవరైనా చంపేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. మృతరాలి తల్లి ఇటీవలే సొంత ఊరికి వెళ్లిందని పోలీసులు తెలిపారు. -
దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నకొందరు ఆకతాయిల ఉదంతం మరువకముందే.. హైదరాబాద్‌లో మరో పిచ్చి ప్రచారం మొదలైంది. హిజ్రాలతో మాట్లాడినా.. సన్నిహితంగా ఉన్నా కరోనా వైరస్ సోకుందనే పోస్టర్లు కొన్ని చోట్ల వెలిశాయి. ‘కొజ్జాలు, హిజ్రాలను దుకాణాల వద్దకు రానివ్వకండి.. వారిని తరిమి కొట్టండి లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి’అని అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పోస్టర్లు బయటపడటంతో కలకలం రేగింది. ట్రాన్స్జెండర్లపై వివక్ష, ఫేక్ న్యూస్, హింసను ప్రేరేపిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని ట్రాన్స్జెండర్ల కార్యకర్త మీరా సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: కరోనా : ఈశాన్య విద్యార్థులపై జాతి వివక్ష) అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద వెలిసిన ఆయా పోస్టర్లను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఇప్పటికే సమాజానికి దూరంగా బతుకుతున్నామని, తామూ మనుషులమేనని గుర్తించాలని క్రుంగిపోతున్న హిజ్రాలకు ఇదో ఇబ్బందికర పరిస్థితి తెచ్చినట్టయింది. ఇదిలాఉండగా.. కర్ణాటకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు విద్యార్థులపై ప్రాంతీయ వివక్ష వెలుగుచూసింది. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులను సూపర్ మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దేశా రాజధాని ఢిల్లీలో సైతం.. మణిపురికి చెందిన ఓ అమ్మాయిని ఒకడు ‘కరోనా’అని పిలిచి అవమానించాడు. #Transphobic Posters at Ameerpet Metro Station reads: “Warning: Do not allow Kojja, Hijras near the shops. If you talk to them or have sex with them, you will be infected with #CoronaVirus. Beat & drive them away or call 100 immediately. Save people from Corona Virus Hijras". pic.twitter.com/21HP5YBDSp — Meera Sanghamitra (@meeracomposes) March 29, 2020 (చదవండి: పెళ్లి పేరుతో మోసం చేశాడు..) (చదవండి: లాక్‌డౌన్‌ను పొడిగించం: కేంద్రం) -
హైదరాబాద్‌లో హాస్టళ్లో ఉంటున్నవారికి ఊరట
సాక్షి, హైదరాబాద్ : దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టలర్లకు ఊరట లభించింది. అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్లను ఖాళీ చేయాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో యువతీ యువకులు బుధవారం ఆందోళనకు దిగారు. అమీర్‌పేట, పంజాగుట్టలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటికి వెళ్లిపోవడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఎస్ఆర్నగర్ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాల కోసం హాస్టల్ ఓనర్ నుంచి లెటర్ తీసుకురావాలని, వారిని తిరిగి హాస్టళ్లకు పంపించారు. -
అమీర్‌పేట నడిరోడ్డుపై దారుణ హత్య
అమీర్‌పేట: అమీర్‌పేట పరసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్నేహితుడే కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్కు హోటల్ ఎదుట ఫుట్‌పాత్‌పై గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన మేరకు.. కర్నాకట రాష్ట్రం గుల్బర్గాకు చెందిన షేక్ మోసిన్ (35) భార్య దివ్యతో కలిసి అమీర్‌పేట పరిసర ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లనే ఆవాసాలుగా చేసుకుని నివాసముంటున్నారు. చిత్తు కాగితాలు ఏరుకోవడంతో పాటు అడ్డా కూలిగా కూడా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరితో పాటు బోరబండకు చెందిన అబ్బు అలియాస్ గోర చిత్తు కాగితాలు ఏరుకునేవాడు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో గ్రీన్‌పార్కు హోటల్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై మోసిన్, అతని భార్య దివ్య, అబ్బు ముగ్గురు కలిసి మద్యం తాగారు. కాసేపటికి దివ్య పెరుగు తేచ్చేందుకు సమీపంలోని షాపునకు వెళ్లింది. ఆమె వచ్చేసరికి భర్త మోసిన్ రక్తపు మడుగులో పడికనిపించాడు. స్థానికుల సాయంతో దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 11 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. దివ్య షాపుకు వెళ్లిన సమయంలో ఇరువురి మద్య వాగ్వివాదం జరిగింది. అబ్బు ఆవేశంతో కత్తితో గొంతు భాగంలో కోసి హత్యచేసి పారిపోయాడు. గొంతులో కత్తి లోతుగా తెగడం, తీవ్ర రక్తస్రావం జరిగడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మోసిన్ కత్తిపోట్లకు గురై దాదాపు అరగంట వరకు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వీరి మధ్య గొడవకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మోసిన్ దివ్యను ప్రేమించి మూడు నెలల క్రితమే వివాహం చేసుకున్నాడు. గతంలో రాత్రి మద్యం సేవించి మోసిన్, దివ్య పడుకున్నాక అబ్బు దివ్య పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. గమనించిన మోసిన్ అబ్బును కాలుతో తన్నాడు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న అబ్బు కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
అమీర్‌పేటలో పిచ్చికుక్క స్వైరవిహారం..
అమీర్‌పేట: పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్లపై పరుగులు తీస్తూ భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు 50 మందిని కరిచింది. మంగళవారం జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాయంత్ర 3.30 గంటల సమయంలో మొదటగా సోమాజిగూడలో రోడ్డుపై వెళుతున్న ఆరుగురు యువకులను పిచ్చికుక్క కరిచింది. సీఎం క్యాంపు కార్యాలయం మీదుగా వచ్చి అమీర్‌పేట గ్రీన్‌ల్యాండ్ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన ముగ్గురిని వెంటపడి మరీ కరిచింది. అక్కడి నుంచి నేరుగా ఇండో యూఎస్ ఆస్పత్రి నిల్చున్న వ్యక్తిని తీవ్రంగా గాయపర్చింది. సిస్టర్ నివేదిత స్కూల్ సమీపంలో ఇద్దరు విద్యార్థులను కరిచింది. ఇంట్లో నుంచి ట్యూషన్‌కు వెళుతున్న చిన్నారుల వెంటపడి కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కొందరు యువకులు కుక్కను తరిమేందుకు ప్రయత్నించడంతో వారిపైకి దూకి మరీ కరిచింది. దీంతో వారు రాళ్లతో కొట్టి తరిమారు. అక్కడి నుంచి కన్యాగురుకుల్ పాఠశాల మీదుగా అమీర్‌పేట మున్సిపల్ గ్రౌండ్ చౌరస్తాకు వచ్చి ఇద్దరు విద్యార్థులను కరిచింది. చిరు వ్యాపారులు కర్రలతో కొట్టి తరిమివేశారు. చల్లా నర్సింగ్ హోం వద్ద ఓ వైద్యుడితో పాటు ఇద్దరు సేల్స్మెన్లను కరిచింది. అనంతరం అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద మరో ఇద్దరిని కరిచింది. ఆగ్రహంతో కొందరు యువకులు రాళ్లు, కర్రలు పట్టుకుని వెంటపడి కొట్టడంతో హెచ్డీఎఫ్సి బ్యాంకు సమీపంలో పడిపోయింది. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళ చెందారు. ఇటీవల కుక్కల సంఖ్య ఎక్కువైందని, వీటి భయంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన వ్యక్తచేశారు. 18 మందికి చికిత్సలు.. కుక్కకాటుకు గురైన అనేక మంది ఆస్పత్రుల బాట పట్టారు. అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని చల్లానర్సింగ్ హోంలో 18 మందికి చికిత్స అందించారు. వీరిలో నలుగురు విద్యార్థులతో పాటు ఓ వైద్యుడు ఉన్నారు. ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా లేకపోవడంతో చాలా మందిని ఇతర ఆస్పత్రులకు పంపించినట్లు వైద్యుడు విజేయ్కుమార్ తెలిపారు. యువకులతో మహిళ గొడవ.. రోడ్లపై కనిపించిన వారినందరినీ కరుస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు యువకులు కర్రలు, రాళ్లతో కొట్టి పిచ్చికుక్కను మట్టుపెట్టారు. ఈ సమయంలో అమీర్‌పేట సత్యంథియేటర్ వద్దకు వచ్చిన ఓ మహిళ కుక్కను కొట్టి చంపుతున్నారెందుకని ప్రశ్నించింది.అంతటితో ఆగకుండా కుక్కను కొట్టిన వారిని తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసింది. దీంతో సదరు యువకులు ఆమెతో గొడవకు దిగారు. పిచ్చికుక్క మనుషులను కరిచి గాయాలపాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సదరు మహిళ వినిపించుకోకుండా తాను కమిషనర్ కూతురునని, కుక్క మృతికి కారకులైన వారిపై కేసు పెడతానంటూ అక్కణ్నుంచి వెళ్లిపోయింది. -
పౌరసత్వ వివరాలు సేకరించేందుకేమోనని
అమీర్‌పేట: పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చారన్న అనుమానంతో వంట గ్యాస్ విచారణ కోసం వచ్చిన ఓ వ్యక్తిని కొందరు యువకులు చితక్కొట్టారు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డలోని ఆదిత్య (హెచ్‌పీ) గ్యాస్ ఏజెన్సీ ద్వారా గత కొన్ని రోజులుగా గ్యాస్ కనెక్షన్లపై విచారణ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఐదేళ్లు పూర్తయిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి కనెక్షన్‌కు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌కు చెందిన స్వామి అనే యువకుడు ఉదయం ఎర్రగడ్డ ఫాతిమానగర్‌కు వచ్చాడు. ఓ ఇంట్లోకి వెళ్లి గ్యాస్‌ను పరిశీలించాడు. ఆధార్‌కార్డు చూపించాలని అడగటంతో పౌరసత్వ సవరణ చట్టంపై వివరాలు సేకరించేందుకు వచ్చాడన్న అనుమానం వ్యక్తం చేస్తూ ఐడీ కార్డు చూపించాలని అడిగారు. స్వామి వద్ద ఉన్న కార్డును చూపించాడు. కార్డుపై ఫోటో అతికించి ఉన్నట్లు కనిపించడంతో మరింత అనుమానం వచ్చి సదరు యువకుడిని కొందరు వ్యక్తులు చితక బాదారు. వారే 100కు డయల్ చేసి అక్కడికి చేరుకున్న పోలీసులకు స్వామిని అప్పగించారు. ఈ సంఘటనకు గల కారణాలపై విచారణ జరిపిన పోలీసులు స్వామి అనే యువకుడు గ్యాస్ కనెక్షన్ల వివరాలు సేకరించేందుకే వచ్చినట్లు నిర్థారించారు. కాగా, గ్యాస్ కనెక్షన్ల విచారణ కోసం నియమించిన వ్యక్తులకు శాశ్వత గుర్తింపు కార్డులు లేని కారణంగా వేరే వ్యక్తుల పేర్లపై ఉన్న ఐడీ కార్డులపై స్వామి ఫొటోను అతికించినట్లు విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్పు, అబేద్ అనే యువకులపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ యువకులు పరారీలో ఉన్నారు. -
అమీర్‌పేట బిగ్‌బజార్ మాల్లో ప్రణీత సందడి
-
అకస్మాత్తుగా నిలిచిపోయిన మెట్రో రైల్
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట్‌లో మెట్రో రైల్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా నాగోల్ నుంచి హైటెక్ సీటీ వైపు వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. మెట్రో పిల్లర్ పైనుంచి ఓ ఇనుపరాడ్ కిందపడింది. రోడ్డుపై జనం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న మెట్రో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చెరుకొని మరమ్మతులు చేస్తున్నారు. రైలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులను కిందకు దించేశారు. మరమ్మతుల నిమిత్త అమీర్‌పేట్- నాగోల్ రూట్లో మెట్రో సర్వీసులు నిలిపివేశారు. -
శాస్త్రవేత్త హత్య కేసు: కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్ : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) అమీర్‌పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి.. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. (చదవండి : అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య) ఆ వ్యక్తితో సురేష్‌కు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ వల్ల హత్య జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సురేష్ కాల్‌డేటా, హత్యకు ముందు వాసవినగర్ కాలనీలో లభించిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. సురేష్ తలకు గాయమైనట్లు ప్రైమరీ మెడికల్ హెల్త్ రిపోర్ట్‌లో తేలిందన్నారు. పూర్తిస్థాయి రిపోర్ట్ వస్తే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులను కచ్చితంగా పట్టుకొని తీరుతామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. -
ఇస్రో శాస్త్రవేత్త హత్య కేసు : ఆ వ్యక్తి ఎవరు...?
సాక్షి, హైదరాబాద్ : ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్ సురేష్ (56) అమీర్‌పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. 48 గంటలు గడిచినా.. కేసుకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించలేకపోయారు. సురేష్ కాల్‌డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. సురేష్ వద్దకు తరచూ ఒక్క యువకుడు వచ్చేవాడని అపార్ట్మెంట్ వాచ్మెన్ తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. పోస్ట్‌మార్టం పూర్తి అయ్యాక సాయంత్రం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. భార్య, కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. (చదవండి : అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య) కేరళకు చెందిన శ్రీధరణ్ సురేష్ (56) అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఫ్లాట్ నం ఎస్–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో సురేష్ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్ ఒక్కడే నగరంలో ఉండేవాడు. -
మెట్రో స్టేషన్లలో మరమ్మతులు
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ దుర్ఘటన నేపథ్యంలో అన్ని స్టేషన్లలో మరమ్మతు పనులు ఊపందుకున్నాయి. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోరైలు, ఎల్‌అండ్‌టీలు అప్రమత్తమై ఆయా స్టేషన్లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పనులు చేపడుతున్నాయి. విడిభాగాలు, ప్లాస్టరింగ్ మెటీరియల్ ఊడి పడకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పనులను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానన్నారు. పనుల నాణ్యత, మన్నిక, లోపాలను గుర్తించేందుకు ఎల్అండ్టీ ఆరు ప్రత్యేక ఇంజినీరింగ్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. పనులు చేపట్టేందుకు అత్యంత ఎత్తునకు వెళ్లే బూమ్ లిఫ్టులు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశామన్నారు. నాగోల్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలోని అన్ని స్టేషన్ల విడిభాగాలు, ఇతర నిర్మాణాలను సూక్ష్మంగా పరిశీలిస్తున్నామన్నారు. సుదీర్ఘం అనుభవం కలిగిన ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణాల్లోని పగుళ్లు, ఉపరితల ప్లాస్టర్ మెటీరియల్, కాంక్రీట్ చిప్‌లు, విడిభాగాలు ఊడిపడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడే మరమ్మతులు.. ప్రధానంగా బాలానగర్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, హైటెక్‌సిటీ, గాంధీభవన్, ఎల్బీనగర్, న్యూమార్కెట్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ తదితర స్టేషన్లకున్న పగుళ్లను సరిదిద్దుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. -
అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య
అమీర్‌పేట: నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం ఇంటి బయట తాళం వేసి పరారయ్యారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అమీర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కేరళకు చెందిన శ్రీధరణ్ సురేష్ (56) అమీర్‌పేట్ ధరంకరం రోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ ఫ్లాట్ నం ఎస్–2లో నివాసం ఉంటున్నాడు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ పరిశోధన సంస్థలో సురేష్ శాస్త్రవేత్తగా పనిచేస్తుండగా.. భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. కుమార్తె రమ్యకు వివాహం జరిగింది. 2005లో భార్య బదిలీపై తమిళనాడుకు వెళ్లడంతో సురేష్ ఒక్కడే నగరంలో ఉంటున్నాడు. సోమవారం ఆఫీస్‌కు వెళ్లిన సురేష్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం పనిమనిషి లక్ష్మి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో వెళ్లిపోయింది. సురేష్ డ్యూటీకి రాకపోవడంతో తోటి ఉద్యోగులు అతడికి కాల్ చేశారు. ఎంతకూ స్పందించకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో అదే అపార్ట్మెంట్లో ఉంటున్న అతడి బంధువులకు సమాచారమిచ్చారు. వారు భార్య ఇందిరకు సమాచారం అందించారు. ఆమె కుమార్తెతో కలసి నగరానికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా సురేష్ విగతజీవిగా పడి కనిపించాడు. తల వెనుక, ముఖంపై లోతైన గాయాలు ఉండటాన్ని బట్టి హత్య చేసి.. అనంతరం బయటి నుంచి తాళం వేసి పారిపోయి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. పోలీసు జాగిలం అపార్ట్‌మెంట్‌పై వరకు వెళ్లి తిరిగి వచ్చింది. శ్రీనివాస్ ఎవరు..? సురేష్ హత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సురేష్ వద్దకు గత 2 నెలల నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కలసి మద్యం సేవిస్తున్నట్లు తెలిసింది. దీంతో శ్రీనివాస్ ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. -
అమీర్‌పేట్‌లో మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన బస్సు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి భయాందోళనలు రేకెత్తించింది. టైర్ పంచర్ కావడంతో బస్సు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టి... పక్కనే ఉన్న షాపు మీదకి దూసుకెళ్లింది. అయితే, ఉదయం సమయం కావడం.. రోడ్డు మీద పెద్దగా రద్దీ లేకపోవడం, దుకాణాలు మూసివేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి మియాపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 15మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అమీర్పేట్లోనే ఆదివారం మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడి మౌనిక అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా భయాందోళనలు రేపింది. చదవండి: మౌనిక మృతి: 20 లక్షల పరిహారం.. ఒకరికి ఉద్యోగం -
మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రాకతో ట్రాఫిక్ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు... ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే భయపడిపోతున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఆదివారం ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర పరిధిలో ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–హైటెక్‌సిటీ మార్గాల్లో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం విదితమే. ఈ రెండు రూట్లలో నిత్యం 3లక్షల మంది జర్నీ చేస్తుండగా... డిసెంబరులో ఎంజీబీఎస్–జేబీఎస్ రూట్లోనూ రాకపోకలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్ అయితే ఈ మార్గాల్లో స్టేషన్లలోని సీలింగ్, పిల్లర్లు పెచ్చులూడుతుండడంపై సిటీజనులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లు ప్రారంభమైన రెండేళ్లకే ఇలా పెచ్చులూడడం.. నిర్మాణ పనుల్లోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తోంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు, ప్రభుత్వ వర్గాలు ఒకవైపు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్రో పిల్లర్ల నిర్మాణాన్ని ఎక్కడికక్కడ చేపట్టినప్పటికీ, వాటిపై ఏర్పాటు చేసిన సెగ్మెంట్లు, స్టేషన్లకు ఇరువైపులా పక్షి రెక్కల ఆకృతిలో ఉన్న నిర్మాణాలను ఉప్పల్, మియాపూర్ మెట్రో కాస్టింగ్ యార్డుల్లో సిద్ధం చేసి తీసుకొచ్చి అమర్చారు. అంటే ప్రీకాస్ట్ విధానంలో సిద్ధం చేసిన విడిభాగాలతో మెట్రో స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి. ఇక మూడు అంతస్తులుగా పిలిచే ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ప్లాట్‌ఫామ్ లెవల్, మధ్యభాగం(కాన్కోర్స్), రహదారి మార్గంలో ఉండే మెట్రో మార్గానికి పైకప్పులను కాంక్రీటు మిశ్రమం, టైల్స్, ఫాల్‌సీలింగ్ ఇతర ఫినిషింగ్ మెటీరియల్‌తోతీర్చిదిద్దారు. మెట్రో పిల్లర్లు, పునాదులు, స్టేషన్ల కాంక్రీటు నిర్మాణాల నాణ్యతకు ఎలాంటి ఢోకా లేకపోయినా, పైకప్పులకు అతికించిన టైల్స్, పిల్లర్లు, సెగ్మెంట్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశాలను పూడ్చిన కాంక్రీటు మిశ్రమం రైళ్లు రాకపోకలు సాగించినపుడు, భారీ వర్షాలు కురిసినపుడు ఊడిపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో భారీ ఈదురు గాలులకు ఫాల్‌సీలింగ్ మెటీరియల్ ఎగిరిపడడం సంచలనం సృష్టించింది. కాగా ఆదివారం జరిగిన సంఘటన నేపథ్యంలోని నగరంలో మూడు మార్గాల్లో ఉన్న 64 స్టేషన్లలో ఇలాంటివి పునరావృతం కాకుండా నిపుణుల బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. -
మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రోస్టేషన్ ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఎస్.ఆర్.హోమ్స్‌లో నివసించే హరికాంత్ రెడ్డి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య మౌనిక కంతాల(24) గృహిణి. ఆమె తన సమీప బంధువు మున్నీకి అమీర్‌పేట్‌లో హాస్టల్ వసతి చూసేందుకు ఆదివారంమధ్యాహ్నం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్లో రైలు ఎక్కి అమీర్‌పేట్‌లో దిగారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మౌనికతోపాటు ఆమె బంధువు మున్నీ సారథి స్టూడియో వైపు మెట్రో స్టేషన్ మెట్లు దిగారు. వర్షం పడుతుండటంతో మెట్రోస్టేషన్ మెట్ల మార్గం పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఈ సమయంలో పిల్లర్‌పైన ఉన్న మెట్రో స్టేషన్ కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి ఆటోలో తరలించారు. అయితే మార్గమధ్యలోనే మౌనిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలిది కరీంనగర్ జిల్లా అని, నూతనంగా వివాహమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఎల్అండ్టీ మెట్రో అధికారులను ఆదేశించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. కాగా, ప్రమాద స్థలాన్ని నగర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు సందర్శించారు. నిర్మాణ లోపాలే ప్రమాదానికి కారణం... స్టేషన్లను సైతం ప్రీకాస్ట్ విధానంలో నిర్మించారు. అంటే ముందుగా స్టేషన్‌కు అవసరమైన సెగ్మెంట్ల తయారీని ఉప్పల్, మియాపూర్ కాస్టింగ్ యార్డులో సిద్ధం చేసి ఆ తర్వాత స్టేషన్లు నిర్మించిన చోట అమర్చారు. పిల్లర్లు, వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్ల మధ్య నున్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ మిశ్రమంతో మూసివేశారు. ఇక్కడే పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులను హడావుడిగా చేపట్టడంతో మెట్రో రైలు వెళ్లే సమయంలో ప్రకంపనలకు కాంక్రీట్ పెచ్చులూడి తరచూ కింద పడుతుందని తేల్చారు. ఇది మెట్రో ప్రయాణికులు, రహదారి మార్గంలో వెళ్లే వాహనదారుల పాలిట శాపంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఆదివారం జరిగిన ఘటనకు సైతం ఇదే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, గ్రేటర్ సిటీలో మెట్రో ప్రాజెక్టు 2017 నవంబర్‌లో ప్రారంభమైంది. రెండేళ్ల వ్యవధిలోనే ఇలాంటి ఘటన జరగడం మెట్రో ప్రాజెక్టులోని డొల్లతనాన్ని బయటపెడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘వ్యక్తిత్వంతో వైఎస్సార్ విశిష్టత చాటారు’
అమీర్‌పేట: సంస్కారవంతమైన వ్యక్తిత్వంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ విశిష్టతను చాటారనీ, మని షిలో నిజాయతీ ఉంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదని ఆయన భావించేవారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. అమీర్‌పేట ఆదిత్యపార్క్ హోటల్లో ఆదివారం జరిగిన ‘వైఎస్సార్ ఛాయలో జి.వల్లీశ్వర్’ పుస్తక ఆవిష్కరణ సభకు యార్లగడ్డ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కారవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. సమర్థవంతమైన నాయకుడు వైఎస్ఆర్ వద్ద పీఆర్ఓగా పనిచేసిన వల్లీశ్వర్.. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రత్యర్థులు ఏమి ఆలోచిస్తున్నారన్నది ముందుగానే పసిగట్టి వారి కంటే వేగంగా ప్రభుత్వం స్పందించేలా చూసేవారని తెలిపారు. -
కంప్యూటర్ గణేశుడు..
అమీర్‌పేట: వినాయక వేడుకల్లో భాగంగా అమీర్‌పేటలో కంప్యూటర్ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజశేఖర్ కంప్యూటర్ పరికరాలను ఉపయోగించి గణనాథుడిని తయారు చేశారు. పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో వెలసిన ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తిని చూపుతున్నారు. -
గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్‌పేట
గత పదేళ్లతో పోలిస్తే ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి బయటకు వస్తున్న వారి సంఖ్య 10 రెట్లు పెరిగింది. క్యాంపస్ స్థాయిలోనే ప్లేస్మెంట్ దక్కితే సరి.. లేదంటే అమీర్‌పేటను నమ్ముకోవాల్సిందే. ఇంజినీరింగ్ చదివి బయటకు వచ్చే ఏ ఫ్రెషర్ అయినా అమీర్‌పేటలో కాలుమోపిన తర్వాతే మరెక్కడికైనా వెళ్తారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడ శిక్షణ సంస్థలు అందించే కోర్సుల్లో కాసింత జ్ఞానం సంపాదించుకుంటే ఉద్యోగంలో రాణించవచ్చని, ఉపాధి పొందవచ్చనే భరోసాను కల్పించడమే కారణం. అందుకేనేమో అమీర్‌పేటకు గేట్ వే ఆఫ్ అమెరికా అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. దేశంలో ఎక్కడా దొరకని టెక్నాలజీ కోర్సులు ఇక్కడ లభించడం విశేషం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోర్సులైన జావా, ఫైతాన్, లిస్ప్, ప్రోలాగ్, సీ++ తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఒరాకిల్, డాట్నెట్, జావా వంటి పరిమిత బేసిక్ కోర్సులే ఒకప్పుడు ఎక్కువగా వినిపించేవి. ఆ తర్వాత ఆయా టెక్నాలజీలో వచ్చిన అధునాతన మార్పులను అందిపుచ్చుకుంటూనే ప్రస్తుతం రాజ్యమేలుతున్న క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ కోర్సుల వరకు ఎప్పటికప్పుడు శిక్షణ కేంద్రాలు పదునుపెట్టుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్లౌడ్ సర్వీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో అమీర్‌పేటలో ఆయా టెక్నాలజీ కోర్సులకు ఎక్కడా లేని ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి.. కోర్సుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని లక్షల ప్యాకేజీలకు ‘సాఫ్ట్’గా విద్యార్థులు ఎగిరిపోవడమే కాదు.. ఇక్కడ శిక్షణ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. శిక్షణ కేంద్రాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది మాట అలా ఉంచితే.. వీటిని నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్‌భండార్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హాస్టళ్లు, సాఫ్ట్వేర్ కోర్సుల మెటీరియల్ విక్రయ కేంద్రాలు, ట్రావెల్ ఏజెన్సీలు తదితర సంస్థల నిర్వాహకులు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. 500 పైచిలుకు శిక్షణ సంస్థలు.. రెండు దశాబ్దాల క్రితం వేళ్ల మీద లెక్కించేంత సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలకు మాత్రమే అమీర్‌పేట పరిమితంగా ఉండేది. మొదట అమీర్‌పేటలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కార్యాలయం ఉండేది. కాలక్రమంలో సాఫ్ట్వేర్ కంపెనీలు హైటెక్ సిటీకి వెళ్లిపోగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల హవా మొదలైంది. అమీర్‌పేట మైత్రీవనం, ఆదిత్య ట్రేడ్ సెంటర్, సత్యం టాకీస్ రోడ్డు, గురుద్వారా రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 500 వరకు శిక్షణ సంస్థలు ఆయా కోర్సుల్లో శిక్షణనిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్లైన్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. ఖర్చు తక్కువ.. బెంగళూరు, చెన్నైలతో పాటు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ‘సాఫ్ట్’ కోర్సుల్లో శిక్షణకయ్యే ఖర్చు ఇక్కడ చాలా తక్కువ. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు దక్షిణాఫ్రికా, దుబాయ్, అబుదాబి తదితర దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటుంటారు. గడిచిన రెండు దశాబ్దాల్లో అమీర్‌పేటలో కాలుపెట్టి అమెరికా వెళ్లినవారు అందుకే గేట్ వే ఆఫ్ అమెరికా.. అమీర్‌పేట అన్న పేరును సార్థకం చేసుకుంది. ఎప్పటికప్పుడు అప్డేట్.. మార్కెట్లోకి వచ్చే ఏ కొత్త టెక్నాలజీకి సంబంధించిన కోర్సయినా మొదట అమీర్‌పేట శిక్షణ కేంద్రాల్లో ఉండాల్సిందే. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనే ఆశలను నెరవేర్చేందుకు ఇక్కడ శిక్షణ సంస్థలు టెక్నాలజీ కోర్సులను అప్డేట్ చేసుకుంటూనే ఉంటాయి. – ఎన్.కోటి,ఆపరేషన్స్ హెడ్, పీర్స్ టెక్నాలజీస్ భవితకు భరోసా ప్రస్తుతం మార్కెట్లో ఏడబ్ల్యూఎస్‌కు మంచి డిమాండ్ ఉంది. నేను ఈ కోర్సులో శిక్షణ పొందాను. ఫీజు కూడా ఎంతో రీజనబుల్‌గా ఉన్నాయి. అనుకున్న సమయంలో కోర్సులు పూర్తి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత. – గోపీకృష్ణ, ఇంజినీరింగ్ విద్యార్ధి -
అమీర్‌పేటలో బాంబు కలకలం
అమీర్‌పేట: అమీర్‌పేటలో బాంబ్ కలకలం సృష్టించింది. మైత్రీవనం సమీపంలోని మెట్రో పిల్లర్ వద్ద ఓ డబ్బా అనుమానాస్పదంగా కనిపించడంతో అందులో బాంబు ఉండవచ్చునేనే భయంతో స్థానికులు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనికీలు నిర్వహించారు. డబ్బాలో పెయింట్ ఉన్నట్లు తేలండోత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
సీరియల్ నటి లలిత అదృశ్యం
హైదరాబాద్: తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే లలిత (25) అనే మహిళ కనిపించకుండా పోయింది. అమీర్‌పేట లోని ఓ హాస్టల్లో ఉంటున్న లలిత ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిం దని ఆమె తల్లి వెంకటలక్ష్మి బుధవారం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన లలిత (25)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఏడేళ్ల కుమార్తె ఉంది. లలిత ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోంది. కూతురుని తల్లిదం డ్రుల వద్ద ఉంచి అమీర్‌పేట రాజరాజేశ్వరీ ఉమెన్స్ హాస్టల్లో చేరి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. రోజూ రాత్రి ఫోన్ చేసి తల్లితో పాటు కుమార్తెతో మాట్లాడేది. ఈ నెల 17న ఫోన్ చేయకపోవడంతో తల్లి లలితకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఇలా వారం నుంచి లలిత ఫోన్ స్విచాఫ్ అని రావడంతో వెంకటలక్ష్మి మరో కుమార్తె రామాంజనమ్మతో కలిసి నగరానికి వచ్చి హాస్టల్లో ఆరా తీసింది. లలిత 2 నెలల క్రితమే హాస్టల్ నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాని అనే వ్యక్తి సీరియల్లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి నగరానికి తీసుకువచ్చాడని వెంకటలక్ష్మి పోలీసులకు తెలిపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీ తెలిపారు. -
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు
అమీర్‌పేట: ప్రముఖ హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఆర్నగర్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి నలుగురు విదేశీ యువతులతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న మంగళవారం వివరాలు వెళ్లడించారు. అమీర్‌పేట, ఆదిత్య పార్క్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, హోటల్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. పంజగుట్టలోని పోలో లాడ్జిపై దాడి చేసి ఉజకిస్తాన్కు చెందిన నలుగురు మహిళలతో పాటు బెంగాల్‌కు చెందిన యువతి, నలుగురు విటులను అరెస్టు చేశారు. పోలీసుల రాకపై సమాచారం అందడంతో నిర్వాహకులు పరారైనట్లు తెలిపారు. రాహుల్, సూర్య అనే వ్యక్తులు ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని ఏపీసీ తెలిపారు. దాడుల్లో ఎస్ఆర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెళ్లడిస్తున్న ఏసీపీ తిరుపతన్న -
నాగోల్–హైటెక్‌సిటీ: మెట్రోలో 55 నిమిషాలే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైలు ఈ నెల 20న (బుధవారం) హైటెక్ సిటీకి పరుగులు పెట్టనుంది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ఉదయం 9.30 గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి హైటెక్ సిటీకి మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొందరు ఉన్నతాధికారులు, ఎల్అండ్టీ, మెట్రో ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు రైలు అందుబాటులోకి రానుంది. 18 నిమిషాల్లో అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ చేరుకోవచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి సింగిల్‌ట్రాక్‌లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి రానుంది. దీంతో చెక్‌పోస్ట్ నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు వేగం కాస్త తగ్గే అవకాశం ఉంది. కాగా ఇక నాగోల్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రోలో 55 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. అదే బస్సు లేదా కారులో అయితే దాదాపు రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. 10కి.మీ 9 స్టేషన్లు.. అమీర్‌పేట్ నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కి.మీ. దూరంలో 9 స్టేషన్లున్నాయి. ప్రధానంగా అమీర్‌పేట్, తరుణి–మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నం.5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెర్వు, హైటెక్ సిటీ స్టేషన్లున్నాయి. తరుణి మధురానగర్ స్టేషన్లో మహిళలు, చిన్నారుల అవసరాల కోసం అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచారు. దీని కోసం ఈ స్టేషన్ ప్రాంగణంలో సుమారు 2 ఎకరాల సువిశాల స్థలాన్ని కేటాయించడం విశేషం. దేశంలో ఇలాంటి సౌకర్యాలున్న మెట్రోస్టేషన్ ఇదేనని అధికారులు తెలిపారు. మిగతా మెట్రో స్టేషన్లు రెండంతస్తుల్లో ఉండగా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్ మాత్రం ట్రాఫిక్ ఇబ్బందుల రీత్యా ఒకే అంతస్తులో నిర్మించారు. ఈ మార్గంలో రహదారులు పలు మలుపులు తిరిగి ఉండటంతో అనేక ఇంజనీరింగ్ సవాళ్లు, సాంకేతిక సమస్యలు, కోర్టు కేసుల చిక్కులను అధిగమించి మెట్రో మార్గాన్ని పూర్తిచేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రివర్సల్ సదుపాయం లేక రైళ్లు ఆలస్యం... జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి హైటెక్‌సిటీ వరకు (5 కి.మీ.) మార్గంలో మెట్రో మార్గం ఒకే వరుసలో (సింగిల్ ట్రాక్) ఉండటంతో మెట్రో రైళ్లు ట్విన్ సింగిల్ లైన్ మాన్యువల్ విధానంలో నడపనున్నట్లు ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. అంటే ఒక రైలు అమీర్‌పేట్ నుంచి బయలుదేరి హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి ఒకే ట్రాక్‌లో తిరిగి రావాల్సి ఉంటుంది. దీంతో ఈ రూట్లో ప్రతి 9 నుంచి 12 నిమిషాలకో రైలును మాత్రమే నడపనున్నామన్నారు. హైటెక్‌సిటీ స్టేషన్, ట్రైడెంట్ హోటల్ వద్ద రైలు రివర్సల్ సదుపాయం కోసం ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయన్నారు. కాగా ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్, నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో ప్రతి 6 నిమిషాలకో రైలు నడుపుతున్నామన్నారు. ఈ స్టేషన్లలో కొంతకాలం రైలు ఆగదు ఈ మార్గంలో ప్రస్తుతం ట్విన్ సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడపాల్సి రావడం, మెట్రో వేగంపై పరిమితులుండటం, మలుపులు అధికంగా ఉండటంతో కొన్ని వారాల పాటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ స్టేషన్లలో రైలు ఆపే అవకాశం ఉండదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇది తాత్కాలికమేనని త్వరలో ఈ స్టేషన్లలోనూ రైలు ఆగుతుందన్నారు. ఈ మార్గంలో నిత్యం లక్ష మంది వరకు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నాగోల్–అమీర్‌పేట్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో సుమారు 2 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్న విషయం విదితమే. మెట్రో అందుబాటులోకి వచ్చిన మార్గాలు.. ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.) నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ.) అందుబాటులోకి రావాల్సి మార్గాలివే... అమీర్‌పేట–హైటెక్‌సిటీ (10 కి.మీ. (బుధవారం నుంచి రాకపోకలు ప్రారంభం) జేబీఎస్–ఎంజీబీఎస్ (ఈ ఏడాది జూన్ లేదా డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం) ఎంజీబీఎస్–పాతనగరం (2019 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం) -
‘మానాన్న పోలీసు.. మానాన్న మాజీ ఎంపీ’ !
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో నడి రోడ్డుపై మద్యం మత్తులో పోలీసు అధికారి, మాజీ ఎంపీ తనయులమంటూ ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. దారిన పోయే వారిని అటకాయిస్తూ గొడవకు దిగారు. అమీర్‌పేట కీర్తి అపార్ట్మెంట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అశోక్ తాను పనిచేస్తున్న హైటెక్ సిటీ ప్రాంతం నుంచి శనివారం రాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా అడ్డుకొని అగ్గిపెట్టె కావాలని అడగగా... తన వద్ద లేదని చెప్పడంతో దాడి చేశారని తెలిపాడు. ఒకరు తాను ఏసీపీ కుమారుడినని, మరో యువకుడు తాను మాజీ ఎంపీ కొడుకునంటూ కొట్టారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్‌ను అటకాయించిన యువకులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడ కూడా హంగామా చేశారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి చర్యలు తీసుకోకపోగా ముందుగా వచ్చిన బాధితుడి సెల్ ఫోన్ తీసుకుని అతడిని స్టేషన్లోనే ఉంచారు. ఆ తరువాత వచ్చిన యువకులని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అశోక్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే రాత్రి జరిగిన సంఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉండటంతో వాటిని సేకరించిన బాధితుడి స్నేహితులు వాటిని ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రాత్రి రోడ్డుపై గొడవ పడిన వారిలో ఏపీసీ, మాజీ ఎంపీ కుమారులు ఎవరూ లేరని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అది చిన్నపాటి ఘర్షణ కావడంతో అశోక్, రాహుల్ అనే వ్యక్తిపై పెట్టి కేసు నమోదు చేశామన్నారు. -
పార్కింగ్ లేక పరేషాన్!
సోమాజిగూడ: నగరంలోని అమీర్‌పేట్ మార్కెట్ పేరు తెలియని వారుండరు. అంతటి ఖ్యాతి గాంచిన మార్కెట్‌కు పార్కింగ్ సమస్య తలెత్తింది. అందుకు కారణం మెట్రోరైల్ నిర్మాణ పనులు తోడయ్యాయని చెప్పవచ్చు. అమీర్‌పేట్ చౌరస్తానుంచి పంజగుట్ట వచ్చే మార్గంలో ఎడుమ వైపు వాణిజ్య సముదాయాలు ఎక్కువ. వాటిలో ముఖ్యంగా బట్టల దుకాణాలే అధికం. షాపుల ముంగిట ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు తమ వాహనాలను అక్కడున్న ఫుట్‌పాత్‌పై పార్కు చేసేవారు. అయితే ప్రస్తుతం ఆయా ఫుట్‌పాత్‌లకు ఎల్అండ్ టీ అధికారులు రెయిలింగ్ ఏర్పాటు చేశారు. దీంతో షాపింగ్‌కు వచ్చేవారికి వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియక సతమతం అవుతున్నారు. షాపులకు పార్కింగ్ సదుపాయం లేదు అమీర్‌పేటలోని వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో కార్లను కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి షాపింగ్‌కు రావలసి వస్తోంది. పార్కింగ్ లేమితో అమీర్‌పేట్‌లోని వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హాకర్స్‌తో తలనొప్పి కోట్లాది రూపాయల పెట్టుబడితో షాపులు నిర్వహిస్తున్న వారికి హాకర్స్‌తో మరో తలనొప్పి వస్తోంది. వస్త్రదుకాణాల ముంగిట హాకర్స్ బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారు విక్రయించే వన్నీ రెడీమేడ్ దుస్తులే. దుకాణాల ముంగిట ఉన్నది ఫుట్‌పాత్ మాత్రమే. దీన్ని ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. వేలాది రూపాయిలు అద్దెగా చెల్లిస్తూ వ్యాపారాలు సాగక నానా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్డుపైనే బస్సులు నిలిపివేత.. మెట్రోరైల్ నిర్మాణ పనుల కారణంగా ప్రధాన రహదారి కుంచించుకు పోయి ఇరుకుగా మారింది. అటుగా వెళ్లే బస్సులు ప్రధాన రహదారిపైనే నిలిపేస్తున్నారు. షాపింగ్‌కు వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్కుచేయడంతో తరచూ ట్రాఫిక్ సమస్యతో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. గంటల తరబడి వాహనాలు ఎటూ వెళ్లే మార్గంలేక నానా ఇబ్బందులు తప్పడంలేదు. -
ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు
అమీర్‌పేట: రెండు పెళ్లిలు చేసుకోవడమేగాక ముచ్చటగా మూడో పెళ్లికి సిద్దపడ్డాడో ప్రబుద్ధుడు అందుకు అంగీకరించాలని భార్యను బాలింత అని కూడా చూడకుండా బెల్టుతో చితకబాదిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోడబండ సైడ్ త్రీకి చెందిన మొహ్మద్‌ఖాన్ మొదట షమీనా బేగం, రెండో సారి రుక్సార్ బేగం అనే మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలకు ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. బ్యాగుల వ్యాపారం చేసే ఖాన్ ముడో పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డాడు. అందుకు అనుమతినివ్వాలని గత కొన్ని రోజులుగా రెండో భార్యను రుక్సార్ బేగంను వేధిస్తున్నాడు. ప్రసవమై 10 రోజుల క్రితమే ఇంటికి వచ్చిన ఆమెను హింసించసాగాడు. అంగీకారపత్రంపై సంతకం చేయాలని బాలింత అని చూడకుండా బెల్టుతో చితకబాదాడు. సంతకం పెట్టక పోతే బిల్డింగ్‌పై నుంచి తోసేసి చంపుతానని బెదిరించాడు. దీంతో తమకు న్యాయం చేయాలని ఇద్దరు భార్యలు షమీనా బేగం, రుక్సార్ బేగం ఎస్ఆర్నగర్ పోలీసులను ఆశ్రయించారు. మహిళా సంఘాల నాయకులు శ్రీలత,లత వారికి మద్దతు పలికారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. -
మెట్రో స్టేషన్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: రాజధానిలోని అమీర్‌పేట మెట్రోరైల్ స్టేషన్ మొదటి అంతస్తు పైనుంచి దూకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 7.40 గంటలకు ఓ గుర్తుతెలియని వ్యక్తి అమీర్‌పేట సారథి స్టూడియో వైపు నుంచి మెట్రో స్టేషన్ మెట్లపై నుంచి చేతులు ఊపుకుంటూ మొదటి అంతస్తుకు వెళ్లాడు. రేలింగ్ వద్ద కొద్దిసేపు నిలబడి అటూఇటూ చూస్తూ ఒక్కసారిగా దానిపైకి ఎక్కాడు. కొద్దిదూరంలో నిలబడి ఉన్న మరో వ్యక్తి గమనించి పడిపోతావు కిందకు దిగు అంటుండగానే దూకేశాడు. వ్యక్తి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు మెట్రో అధికారులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెళ్లి రాళ్లపై పడిన వ్యక్తిని చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. స్టేషన్ కంట్రోలర్ చక్రవర్తి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఒంటిపై చొక్కా మినహా ఎలాంటి దుస్తులు లేవు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు. -
డిసెంబర్‌కు డౌటే!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలు దరిదాపుల్లోనూ కనిపించడంలేదు. ఇటీవల ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్..డిసెంబర్ నాటికి హైటెక్ సిటీ కారిడార్‌ను పూర్తిచేసి మెట్రో రైళ్లనుసిటీజన్లకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ అధికారులకు సూచించారు. అయితే ఈ మార్గంలో మెట్రో పనుల పూ ర్తికి పలు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రివర్సల్ ట్రాక్ ఏర్పాటు పనులు ఆలస్యమౌతుండడమే దీనికి కారణమని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితితో ఈ రూట్లో మెట్రో రాకకోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల ఉద్యోగులకు మరో ఆరునెలలపాటు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. రివర్సల్‌ట్రాక్ పనులే కీలకం... నాగోల్–హైటెక్‌సిటీ(28 కి.మీ)మెట్రో మార్గాన్ని ప్రభుత్వం 1.5 కి.మీ మేర పెంచి రాయదుర్గం వరకు పొడిగించిన విషయం విదితమే. రాయదుర్గం ప్రాంతంలో 15 ఎకరాల సువిశాల స్థలంలో టెర్మినల్ స్టేషన్‌తోపాటు మెట్రోమాల్స్, ప్రజోపయోగ స్థలాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే మెట్రో మార్గాన్ని ఉన్నఫలంగా పొడిగించడం..హైటెక్‌సిటీ–రాయదుర్గం రూట్లో పనులు సకాలంలో మొదలుకాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు హైటెక్‌సిటీ నుంచి శిల్పారామం వరకు అరకిలోమీటరు మేర మెట్రో పిల్లర్లను పొడిగించి అక్కడివరకు మెట్రోట్రాక్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి రివర్సల్‌ట్రాక్(మెట్రో రైళ్లు మలుపుతిరిగే ట్రాక్)ఏర్పాటుచేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ మార్గంలో ఎస్ఆర్డీపీ పనుల కారణంగా మెట్రో పిల్లర్లు ఏర్పాటుచేయడం కష్టసాధ్యమని నిపుణులు స్పష్టంచేయడంతో రివర్సల్‌ట్రాక్ ఏ ర్పాటు పనులు మరింత ఆలస్యమయ్యాయి. దీం తో ఈ రూట్లో మెట్రో మరింత ఆలస్యమౌతోంది. రివర్సల్ ట్రాక్‌కు ప్రత్యామ్నాయమిదే.. హైటెక్‌సిటీకి సకాలంలో మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్ఎంఆర్,ఎల్అండ్టీ అధికారులు ఆగమేఘాల మీద పనులు ప్రారంభించారు. రివర్సల్ ట్రాక్ ఏర్పాటు చేస్తేనే అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(10 కి.మీ)మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకోరైలును నడిపే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా హైటెక్‌సిటీ నుంచి 500 మీటర్ల దూరంలోని లెమన్‌ట్రీ హోటల్ వరకు 7 మెట్రో పిల్లర్లను ఏర్పాటుచేసి మెట్రో ట్రాక్‌ను పొడిగించనున్నారు. అక్కడి నుంచి రివర్సల్ ట్రాక్‌ను ఏర్పాటుచేసి మెట్రో రాకపోకలకు మార్గం సుగమం చేయనున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైనప్పటికీ వీటిని పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది మార్చి వరకు సమయం పట్టనున్నట్లు స్పష్టంచేశారు. ఎల్బీనగర్–మియాపూర్ మెట్రో ఫుల్..జోష్ ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో మెట్రోలో రద్దీ క్రమంగా పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో రద్దీ 1.30 లక్షలు కాగా..సెలవురోజుల్లో రద్దీ 1.50 లక్షలనుంచి 1.60 లక్షలవరకు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇక నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో నిత్యం 50–60 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80–90 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో త్వరలో రద్దీ రెండు లక్షల మార్కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
వాస్తవ సంఘటనలతో...
‘మైత్రీవనం’ అంటే హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉండే ఓ ఏరియా అనుకునేరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందింది. లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుఖేశ్ ఈశ్వరగారి, జెట్టి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. రవిచరణ్ దర్శకుడు. విశ్వ, వెంకట్, వృషాలీ, హర్షదా పాటిల్, రాజ్ బాలా ప్రధాన పాత్రల్లో నటించారు. పీఆర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, కల్వకుంట్ల కన్నారావుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చిత్రదర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘యువతలో ఉన్న శక్తి అపారం. అది ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయగలదు. ఆ శక్తిని యువత గుర్తించేలా చేసే చిత్రమిది. కొన్ని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాను. పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తూనే సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ఆలోచనతో మొదలైన చిత్రమిది. దర్శకుడు రవిగారు సరదాగా చెప్పిన ఓ పాయింట్ నచ్చి కథని విస్తృతం చేసి, ఈ సినిమా తీశాం. ఇప్పుడున్న చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టించే చిత్రం అవుతుందని చెప్పగలను’’ అన్నారు సుఖేష్. -
సెప్టెంబర్ 1న ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో రన్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి మెట్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అన్ని పనులు, పరీక్షలు పూర్తయ్యాయని.. ట్రయల్ రన్ ముమ్మరంగా సాగుతుందని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) ధ్రువీకరణ పొందేందుకు జూలై 31న ఆ సంస్థకు దరఖాస్తు సమర్పించామన్నారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ (ఐఎస్ఏ), హాల్క్రో (యూకే) సంస్థలు సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతను పరీక్షిస్తున్నాయని చెప్పారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ సర్టిఫికెట్ అందిన తర్వాత సీఎంఆర్ఎస్ ప్రతినిధులు ఎల్బీనగర్–అమీర్‌పేట్ సెక్షన్‌ను పరిశీలించి భద్రతా ధ్రువీకరణ జారీ చేస్తారన్నారు. అన్ని స్టేషన్లకూ ఫీడర్ బస్సులు ఇప్పటివరకు 2.75 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులు గ్రేటర్ సిటిజన్లు కొనుగోలు చేసినట్లు ఎల్అండ్టీ ప్రతినిధులు తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలు, బస్తీలకు ఫీడర్ బస్సు సర్వీసులను ఆర్టీసీ సహకారంతో అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, అమీర్‌పేట్, బేగంపేట్, ప్రకాశ్‌నగర్, రసూల్‌పురా, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్, నాగోల్ తదితర 15 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాకారం చేసేందుకు అత్యాధునిక సైకిళ్లు, స్మార్ట్ బైకులు, పీఈడీఎల్, మెట్రో బైకులు, డ్రైవ్‌జీ వాహనాలు లభ్యమవుతున్నాయని చెప్పారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సొంతంగా నడుపుకుని వెళ్లేందుకు వీలుగా జూమ్‌కార్ విద్యుత్ వాహనాలు.. మియాపూర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల వద్ద జూమ్‌కార్ పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పలు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయమూ అందుబాటులో ఉందని చెప్పారు. ప్యారడైజ్ స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జీని ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్ సర్కిల్, పీజీ రోడ్, ఎంజీ రోడ్ తదితర ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతోందన్నారు. ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆర్మ్‌డీ ఎంట్రీ, ఎగ్జిట్ పూర్తికావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగాయని చెప్పారు. -
జూలై 26 లేదా 27న అమీర్‌పేట్ టు ఎల్బీనగర్
-
ఆగస్టులో అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మెట్రో
సాక్షి,సిటీబ్యూరో : అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్‌కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్‌లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్‌కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రక్రియ పూర్తికావడంతో ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు మార్గం సుగమమౌతోందని తెలిపారు. ఆగస్టులో ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్‌రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
ఆగస్టులో అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మెట్రో పరుగులు!
సాక్షి,సిటీబ్యూరో : అమీర్‌పేట్–ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల ట్రయల్‌రన్‌కు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో మెట్రో ట్రాక్ విద్యుదీకరణ ప్రక్రియ, సెక్షన్ ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టం(ఓఈటీఎస్)ను గురువారం కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ డీవీఎస్ రాజు తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ ట్రాక్షన్ సిస్టంకు అవసరమైన విద్యుత్ ఎంజీబీఎస్, మియాపూర్‌లలో నిర్మించిన 132 కెవి/25 కెవి రిసీవింగ్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్‌ను అందుకుంటుంది. ఈ ఆర్ఎస్ఎస్కు ఇన్కమింగ్ సరఫరా టీఎస్ ట్రాన్స్‌కోకు చెందిన 220 కెవి/132 కెవి మెయిన్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ఆగస్టులో పరుగులు.. ఈ ఏడాది ఆగస్టునెలలో ఎల్బీనగర్–అమీర్పేట్మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. జూలై నెలలో ఈ మార్గంలో ట్రయల్‌రన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రారంభతేదీని మాత్రం ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అమీర్‌పేట్–హైటెక్‌సిటీమార్గంలో అక్టోబరులో,ఎంజీబీఎస్–జేబీఎస్మార్గంలో ఈ ఏడాది డిసెంబరు నాటికి మెట్రో రైళ్లు గ్రేటర్ సిటీజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. -
నాప్టోల్ ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్ : వినియోగదారులకు వాస్తవిక అను భూతి కలిగించేలా రాష్ట్రంలో తొలిసారి ఆఫ్‌లైన్ స్టోర్‌ను అమీర్‌పేటలో ప్రారంభించినట్లు హోం షాపింగ్ సంస్థ నాప్టోల్ సీఎఫ్ఓ యూసుఫ్‌ఖాన్ తెలిపారు. ఆదివారం బేగంపేట పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ సెంట ర్లు ఏర్పాటు చేయడం, 26 వేలకు పైగా పిన్‌కోడ్ నె ంబర్లకు తమ నెట్వర్క్ విస్తరిస్తున్నామన్నారు. వ చ్చే ఏడాది లోగా దాదాపు కోటి మంది వినియోగ దారులను చేరే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ట్టు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ బిజినెస్ హెడ్ మనీష్చౌబే, బిజినెస్ పార్టనర్ అమర్జీత్సింగ్ పాల్గొన్నారు. -
అమీర్‌పేట వెళుతున్నారా.. ఇది గమనించండి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట ప్రధాన రహదారిలో ప్రారంభమైన ట్రాన్స్‌కో 132 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనుల కారణంగా అమీర్‌పేట నుంచి పంజగుట్ట నిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 24 నుంచి మే 31వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు. మళ్లింపు ఇలా... సంగారెడ్డి, జహిరాబాద్, పటాన్చెరువు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పంజగుట్ట నుంచి అనుమతించరు. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్బంద్జంక్షన్, బాలంరాయి జంక్షన్,ప్యారడైజ్ హోటల్ ఎంజీ రోడ్, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పఠాన్‌చెరువు, మియాపూర్, కూకట్పల్లి నుంచి వచ్చే ఆంధ్ర, రాయలసీమ ప్రైవేట్ బస్సులు అమీర్‌పేట, పంజగుట్ట వైపు అనుమతించరు. మైత్రివనం వద్దే మళ్లించి ఎస్ఆర్నగర్ గౌతండిగ్రీ కాలేజీ వద్ద యూ టర్న్ తీసుకొని అక్కడే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుంది. సిటీ బస్సులు, లారీలు, పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ట్యాంకులు, పటాన్ చెరువు, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ వెళ్లాలంటే ఎస్ఆర్నగర్ చౌరస్తాలో ఉమేష్ చంద్రా విగ్రహం వద్ద ఎడమ వైపు తీసుకొని కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్బి సిగ్నల్, సోనాబాయి టెంపుల్, అమీర్‌పేట్, బీకే రోడ్డు, కాకతీయ హోటల్, సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం చౌరస్తా వద్ద ఎడమ వైపు తీసుకొని రాజ్‌భవన్ రోడ్డులో ఖైరతాబాద్ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. -
చీరకట్టు బంగారంగానూ..
-
అమీర్‌పేట స్విమ్మింగ్‌పూల్ ప్రారంభం
హైదరాబాద్: క్రీడలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పాడిపరిశ్రమ, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని అమీర్‌పేట గురుగోవింద్ సింగ్ ఆడిటోరియంలోని స్విమింగ్‌పూల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్విమ్మింగ్‌పూల్‌లో నీరు లేక సకాలంలో ప్రారంభానికి నోచుకోలేదని తెలిపారు. ఈసారి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నిరంతరం నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ ద్వారా జలమండలికి 22 లక్షల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. నగరంలో ఎక్కడా లేని విధంగా అమీర్‌పేట స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్‌తో పాటు స్కేటింగ్, బ్యాడ్మింటన్, కరాటే, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, యోగా, జిమ్ సౌకర్యాలను కల్పించామని తెలిపారు. 50 మందికి ఒకేసారి స్విమ్మింగ్‌లో శిక్షణ ఇచ్చేలా సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమీర్‌పేట కార్పొరేటర్ నామన శేషు కుమారి, పలువురు జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
కోర్సుల కోట అమీర్‌పేట
-
మెట్రో స్టేషన్లో కీచక పర్వం
-
అదే మెట్రో.. అదే జోష్
సాక్షి, హైదరాబాద్: మియాపూర్.. అమీర్‌పేట్.. నాగోల్.. ఏ స్టేషన్ చూసినా ఇసుకేస్తే రాలనట్టుగా జనం.. ఇక మెట్రో రైళ్ల సంగతి సరే సరి.. రైలులోకి ఎక్కేందుకు.. దిగేందుకు కూడా ఖాళీ లేనంతగా కిక్కిరిసిన బోగీలు.. ఇదీ ఆదివారం నగరంలో మెట్రో జోష్. సెలవురోజు కావడంతో హైదరాబాదీలు సకుటుంబ సపరి వారసమేతంగా మెట్రోలో జాయ్ రైడ్ చేసి ఆనందించారు. దీంతో నాగోల్–అమీర్‌పేట్, మియాపూర్–అమీర్‌పేట్ మార్గంలోని 24 మెట్రో స్టేషన్లు.. ప్రతి 10–15 నిమిషాలకు ఒకటి చొప్పున పరుగులు తీసిన మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. మెట్రో ప్రారంభమైన తర్వాత ఇదే తొలి ఆదివారం కావడంతో చిన్నారులు తల్లిదండ్రులతో కలసి మెట్రో జర్నీ చేశారు. ఎలివేటెడ్ మార్గంలో ప్రయాణిస్తూ నగర అందాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇక ప్రయాణీకుల రద్దీ వల్ల మెట్రో స్టేషన్లలోని టికెట్ విక్రయ యంత్రాలు, కౌంటర్ల వద్ద జనం బారులుతీరారు. స్టేషన్లలో మంచినీటి వసతి లేకపోవడం, రద్దీకి అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ఇక కార్లు, ద్విచక్రవాహనాలపై మెట్రో స్టేషన్లకు వచ్చిన వారు పార్కింగ్ కోసం తిప్పలు పడ్డారు. మొత్తం 24 స్టేషన్లకుగానూ ఐదు చోట్లే పార్కింగ్ సదుపాయం ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో స్టేషన్ల నుంచి ఆర్టీసీ ఫీడర్ బస్సులు నడుపుతామని అధికారులు చెప్పినా ఇప్పటికీ వాటి జాడ లేదు. ఇక మియాపూర్ స్టేషన్ ఆవరణలో ఉన్న సైకిల్ స్టేషన్లో రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. సెల్ఫీస్పాట్.. మియాపూర్.. మియాపూర్ మెట్రో స్టేషన్ సెల్ఫీస్పాట్‌గా మారింది. స్టేషన్ పరిసరాల్లో ప్రధాని మోదీ ప్రారంభించిన పైలాన్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగడానికి యువత ఉత్సాహం చూపించింది. ప్రయాణికులు తమ వాహనాలను స్టేషన్ ఆవరణలోని ఫుట్‌పాత్‌పైనే వదిలివెళ్తున్నారు. ఆదివారం ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హెలిప్యాడ్ నిర్మించిన ప్రాంతంలో వాహనాలు నిలిపేందుకు వీలుకల్పించారు. అమీర్‌పేట్‌లో బాంబు కలకలం.. అమీర్‌పేట మెట్రో స్టేషన్లో బాంబు కలకలం రేగింది. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు స్టేషన్లో బాంబు పెట్టినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ సోదాలు నిర్వహించారు. స్టేషన్లో ఓ గుర్తు తెలియని బ్యాగ్‌ను గుర్తించారు. బ్యాగ్‌ను సోదా చేయగా అందులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ బ్యాగ్ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బందికి చెందినదిగా గుర్తించి వారికి అప్పగించారు. కాగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యేలా ప్రసారం చేసిన వార్తలను మెట్రో అధికారులు ఖండించారు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడం తగదని హితవుపలికారు. -
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు
-
అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఆదివారం ఉదయం కలకలం రేగింది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వార్తతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుర్తు తెలియని కాల్ ఆధారంగా అధికారులు అప్రమత్తం స్టేషనలో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఓ బ్యాగును, చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన బాంబ్ స్క్వాడ్ చివరకు బాంబు లేదని నిర్ధారించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
కోపంతో మెట్రోలోకి లిక్కర్ బాటిల్‌తో వచ్చాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో పరుగులు తీస్తున్న మెట్రో రైలుకు మంచి స్పందన లభిస్తోంది. రెండోరోజు గురువారం కూడా ప్రయాణికులు పెద్దసంఖ్యలో మెట్రోరైల్లో ఎక్కేందుకు ఉత్సాహం చూపారు. అయితే, అమీర్ పేట్ మెట్రో స్టేషన్లో లిక్కర్ బాటిల్ కలకలం రేపింది. లిక్కర్ బాటిల్‌తో వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, లిక్కర్ బాటిల్‌తో పోలీసులు దొరికిపోయిన సదరు వ్యక్తి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. మెట్రో స్టేషన్లో తాగునీరు అందుబాటులో లేదని, టికెట్ తీసుకున్నాక నీళ్లు అడిగితే.. బయటికి వెళ్ళి తెచ్చుకోమని మెట్రో సిబ్బంది చెప్పారని అతను తెలిపాడు. తీరా వాటర్ బాటిల్‌తో వస్తే పోలీసులు అనుమతిలేదంటూ.. లోపలికి రానివ్వలేదని, దీంతో కోపం వచ్చి లిక్కర్ బాటిల్‌ను మెట్రో స్టేషన్లోకి తీసుకొచ్చానని అతను తెలిపాడు. -
మెట్రో జర్నీ కోసం పోటెత్తిన జనం
-
అదరహో.. అమీర్‌పేట మెట్రో స్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రెండు మెట్రో కారిడార్లు కలిసే అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ మెట్రో స్టేషన్ దేశంలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటిగా ఖ్యాతి గడించిందని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సోమవారం ప్రకటించింది. నాగోల్–రాయదుర్గం, ఎల్బీ నగర్–మియాపూర్ కారిడార్లు కలిసేచోట ఈ స్టేషన్‌ను నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ స్టేషన్ నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 28న మెట్రో ముహూర్తం కుదిరిన నేపథ్యంలో స్టేషన్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇందులో ప్రతీది ఒక విశేషంగా భావిస్తున్నారు. ఒక కారిడార్ నుంచి మరో కారిడార్లోకి మారేందుకు ఈ స్టేషన్లో దిగిన ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులను ఇక్కడ కల్పించారు. ప్రత్యేకతలివే... ⇒ సూమారు 2 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో స్టేషన్ ఏర్పాటు. ⇒ ప్రతి రోజూ 40 వేలమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా. ⇒ 142 మీటర్ల పొడవు..40 మీటర్ల వెడల్పులో ఈ స్టేషన్ ఉంది. ఇందులో రిటెయిల్ దుకాణాలు, ప్రయాణికులకు వినోదం పంచే వసతులు, ఇతర స్టోర్లను ఏర్పాటు చేస్తారు. ⇒ ప్రయాణికులు ఒక మార్గం నుంచి మరొక మార్గానికి మారేందుకు ఎలాంటి సమస్యలు తలెత్తని రీతిలో స్టేషన్‌ను నిర్మించారు. ⇒ స్టేషన్ మధ్యభాగానికి(కాన్కోర్స్లెవల్కు) చేరుకోవడానికి ఎలాంటి టిక్కెట్ అవసరంలేదు. ఇక్కడ ఏటీఎం కేంద్రాలు కూడా ఉంటాయి. ⇒ ప్రధాన రహదారిపైన 30 మీటర్ల ఎత్తున..రూఫ్‌లెవల్ 36 మీటర్ల ఎత్తున ఏర్పాటుచేశారు. ⇒ ఈ స్టేషన్ పైకప్పును టెట్రాహైడ్రాన్ స్టీల్కాలమ్స్తో చూడముచ్చటగా నిర్మించారు. ⇒ స్టేషన్‌పైకి చేరుకునేందుకు ప్రధాన రహదారికి ఇరువైపులా మెట్లు, 16 ఎస్కలేటర్లు, 8 లిఫ్టులు ఏర్పాటుచేశారు. ⇒ స్టేషన్ మధ్యభాగంలో ఆటోమేటిక్ టిక్కెట్ జారీ యంత్రాలు, గేట్లు, టికెటింగ్ రూమ్‌లు ఉన్నాయి. ⇒ స్టేషన్లో బ్రౌన్గ్రానైట్ ఫ్లోరింగ్ చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. ⇒ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా లక్ష లీటర్ల నీటిని నిల్వచేసే భారీ సంపును నిర్మించారు. ⇒ స్టేషన్ పైకప్పుపై కురిసిన వర్షపునీటిని నేలగర్భంలోకి చేరవేసేందుకు భారీ ఇంకుడు గుంతలు తవ్వారు. ⇒ తక్కువ ఇంధన వినియోగంతో నడిచే ఎయిర్‌కండీషన్ వ్యవస్థ ఏర్పాటుచేశారు. ⇒ సింగిల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ స్టేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించే ఏర్పాట్లున్నాయి. ⇒ ఆటోమేటిక్ ఫైర్ ప్రొటెక్షన్ వ్యవస్థ, క్లీన్గ్యాస్ ఏర్పాట్లున్నాయి. ⇒ ఒకే దారి నుంచి ఆరువేల మంది చొప్పున లోనికి, బయటికి వెళ్లొచ్చు. ⇒ కారిడార్ మారే వారికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సమాచారం చేరవేసేందుకు అనౌన్స్మెంట్ సిస్టం ఉంది. ⇒ 33 కె.వి పవర్‌బ్యాకప్, 400 కిలోవాట్ల డీజిల్ జనరేటర్, యూపీఎస్ పవర్‌సప్లై వ్యవస్థలున్నాయి. ⇒ ఉప్పల్ మెట్రో డిపోలోని ఓసీసీ కేంద్రం నుంచి ఈ స్టేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ⇒ ఈ స్టేషన్లో రెండు నిమిషాల పాటు రైలును నిలపనున్నారు. మిగతా స్టేషన్లలో కేవలం 20 సెకన్లపాటు మాత్రమే నిలుపుతారు. -
సత్యం థియేటర్‌వైపు వెళ్లొద్దు..
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలోని సత్యం థియేటర్ మార్గంలో జీహెచ్ఎంసీ అధికారులు నాలా వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గురువారం నుంచి మూడు నెలల పాటు కనకదుర్గ దేవాలయం–సత్యం థియేటర్ మధ్య మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి. రవీందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి కేవలం ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. మైత్రీవనం నుంచి గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్ళే ఈ వాహనాలను ధరమ్‌కరమ్ రోడ్, జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్, సోనబాయ్ టెంపుల్, సత్యం థియేటర్ మీదుగా పంపించనున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను అనుమతిస్తామని చెప్పారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని కోరారు. మలక్‌పేటలోనూ.. మలక్‌పేట ఆర్వోబి వద్ద మెట్రో వయాడక్ట్‌ల(సెగ్మెంట్ల) అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. వయాడక్ట్‌ల అనుసంధానం కోసం నాలుగు నెలల క్రితం ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీక్రేన్ సహాయంతో ఎల్జి బ్రిడ్జి బ్లిల్డర్ను పిల్లర్లపైకి ఎక్కించారు. మూడు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి సెగ్మెంట్లను అనుసంధానం పూర్తిచేశారు. వయాడక్ట్‌ల అనుసంధానం పూర్తయి నెల రోజులు గడుస్తున్నా బ్రిడ్జి బిల్డర్‌ను కిందకి దింపలేకపోవటం, మరోవైపు మెట్రో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మలక్‌పేటలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని డాక్టర్ వి. రవీందర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం నుంచి నవంబర్ 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మా వాడిని వాడుకున్నావ్.. రూ. 3 లక్షలివ్వు
సహజీవనం చేసిన యువతితో యువకుడి మేనమామ అమీర్పేటః అనాథ యువతిని ప్రేమించి జీవితాంతం తోడుగా ఉంటానని నమ్మించి ఆశ్రయం కల్పించాడు. మూడు సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేసి వదిలేసి వెల్లాడు. తమ వాడిని మూడు సంవత్సరాలుగా వాడుకున్నందుకు మూడు లక్షల నష్ట పరిహరం చెల్లించాలని యువకుడి మేనమామ బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ బొధన్ మండలం సత్తనపల్లికి చెందిన అనాథ యువతి శ్రీనగర్ కాలనీలోని ఓ బట్టల షాపులో పనిచేస్తుంది. షాపుకు ఎదురుగా బేకరీషాపులో పనిచేసే రాజేష్ సదరు యువతి మద్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటానని మాయమాటలు చెప్పి సహజీవనం కొనసాగించాడు. ఇద్దరు కలిసి ఎస్ఆర్నగర్లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయం సమీపంలో ఓ ఇంట్లో ఉంటూ మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల రాజేష్‌లో మార్పు వచ్చి యువతి ఎవరితో మాట్లాడినా అనుమానంతో చేయి చేసుకుంటుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సర్ధిచెప్పగా పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. యువకుడి మేనమామ ఇంటికి వచ్చి ఇంట్లోని సామాగ్రిని అంతా తీసుకుని పోయాడు. దీనిపై యువతి అతడిని నిలదీయగా తమవాడిని వాడుకున్నందుకు మూడు లక్షల నష్ట పరిహరం చెల్లించాలని బెదిరించడంతో పోలీసుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.యువకుడి మేనమామ పోలీసుల విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది. -
అనుపమా.. శారీగమా..
అమీర్‌పేటలో శుక్రవారం వీఆర్కే సిల్క్స్ షోరూంను హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ప్రారంభించారు. కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన ఈ షోరూం ప్రారంభోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. కార్యక్రమంలో వీఆర్కే సిల్క్స్ ఎండీ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చిరునవ్వుల.. శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి ఆదివారం అమీర్‌పేట్‌లో సందడి చేసింది. ఇక్కడ నెలకొల్పిన ‘మాన్విస్ బ్యూటీ స్టూడియో అండ్ స్పా’ను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్వీరాన్ గ్రూప్ చైర్మన్ కేవీ సుబ్రమణ్యం, నిర్వాహకులు కనకదుర్గ, చంద్రకళ, సత్యప్రభావతి తదితరులు పాల్గొన్నారు. -
అమీర్‌పేట్‌లో మహేశ్...
జనవరి చివరి వారంలో అభిమానులకు ఓ బహుమతి ఇవ్వడానికి మహేశ్‌బాబు సిద్ధమవుతున్నారు. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తెలుగు, తమిళ సినిమా ఫస్ట్ లుక్‌ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా ప్రకటిస్తారని వినికిడి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో గల ఓ భవంతిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మహేశ్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ముంబై, పూణెలలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్తారట! ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సంభవామి’ టైటిల్ పరిశీలనలో ఉంది. దీంతో పాటు మరికొన్ని టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారు. చివరకి, ఏ టైటిల్ కన్ఫర్మ్ చేస్తారనేది నెలాఖరుకి తెలుస్తుంది. -
అమెరికాకు వయా ఇక్కడి నుంచే..!
అమెరికా వెళ్లాలన్నా.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజినీర్లు కావాలనుకున్నా.. ప్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా.. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలన్నా.. అందరికీ మొదట గుర్తుకువచ్చేది అమీర్‌పేటే. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కోచింగ్ కేంద్రాలకు కేరాప్ అడ్రస్‌గా విరాజిల్లుతోంది ఈ ప్రాంతం. ట్రెండ్‌కు అనుగుణంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తకొత్త కోర్సులు అందించే ఇక్కడ రద్దీకి కొదవలేదు. కోటి ఆశలతో నగరంలో అడుగుపెట్టే చాలామంది ఎప్పటికప్పుడు అమీర్‌పేట్‌లో తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకొని.. తమ కలలను సాకారం చేసుకునే దిశగా సాగుతున్నారు. రాష్ట్ర విభజన ప్రభావం అమీర్పేటపై కూడా ఉంటుందని అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడి కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పడిపోవచ్చునని, ఇవి మూతపడొచ్చునని, ఒకప్పుడు ఉన్నంత డిమాండ్ ఇకముందు ఉండదని రకరకాలుగా ఊహించారు. కానీ వాస్తవానికి చూసుకుంటే అమీర్‌పేట్ పరిస్థితి ఏమీ మారలేదు. అక్కడ రద్దీ మారలేదు. ఎన్నో ఆశలతో కోచింగ్ సెంటర్లలో చేరే ఆశావహుల సంఖ్య తగ్గలేదు. నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని కెరీర్లో దూసుకుపోవాలనుకునే వారికి ఇదొక కార్యక్షేత్రం. ట్రెయినింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్. బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ మొదలు.. సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, టెస్టింగ్ టూల్స్, నెట్వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్ ఇలా సకల టెక్నాలజీ కోర్సులకు ఇక్కడ కోచింగ్ లభిస్తోంది. అందుకే ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వచ్చేవారు తగ్గడం లేదు. ఇక్కడ వేలల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కనీసం వాటికి బోర్డు పెట్టుకోవడానికి కూడా తగినంత చోటు లేదంటే అతియోశక్తి కాదేమో. అలాంటి అమీర్‌పేట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా హల్చల్ చేస్తోంది. అమీర్‌పేట్‌లోని మైత్రీవనం కూడలిలోని భవనాలు కిక్కిరిపోయిన కోచింగ్ సెంటర్ల బోర్డులతో వీసమెత్తు స్థలం కూడా వదలకుండా.. అక్కడి పరిస్థితిని చాటుతున్నాయి. ఇక్కడి కోచింగ్ సెంటర్లకు కనీసం బోర్డు పెట్టుకునే స్థలం కూడా దొరకడం లేదంటే ఇక్కడి రద్దీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. -
అమీర్‌పేట కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు
⇒ ‘మెట్రో’ పనుల నేపథ్యంలో అమీర్‌పేట వద్ద ట్రాఫిక్ మళ్లింపులు ⇒ బుధవారం నుంచి వచ్చే మంగళవారం వరకు అమలు హైదరాబాద్: మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాల నేపథ్యంలో నగరంలోని అమీర్‌పేట బిగ్‌బజార్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి వారం రోజుల పాటు అమలులో ఉండే వీటిని దృష్టిలో పెట్టుకుని వాహనచోదకులు సహకరించాలని ఆయన కోరారు. ట్రాఫిక్ మళ్లింపు దారులు ఇవే.. ⇒ ఖైరతాబాద్, పంజగుట్ట వైపు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ ‘టి’ జంక్షన్ నుంచి ముందుకు వెళ్లడానికి అనుమతించరు. వీటిని బిగ్‌బజార్ వెనుక వైపు నుంచి పంపిస్తారు. ⇒ కృష్ణానగర్, ఇందిరానగర్, శ్రీనగర్‌కాలనీ వైపుల నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను (భారీ వాహనాల మినహా) జీహెచ్ఎంసీ పార్క్, శ్రీనగర్‌కాలనీ క్రాస్‌రోడ్, పార్క్ వ్యూ జీఎస్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్, గౌతమ్ చికెన్ సెంటర్, ఇమేజ్ హాస్పటల్ లైన్ మీదుగా పంపిస్తారు. ⇒ ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట వైపు నుంచి ఖైరతాబాద్, పంజగుట్ట వైపు వెళ్ళే వాహనాలను బిగ్‌బజార్ నుంచి షాలిమార్ ‘టి’ జంక్షన్ వరకు ఒకే మార్గంలో రెండు వైపులకూ వెళ్లే వాహనాలను అనుమతిస్తారు. ⇒ ఈ మళ్లింపుల ప్రభావం సిటీ బస్సు రూట్ నంబర్లు 218, 225, 9, 9 ఎం, 9 ఎక్స్, 9/ఎఫ్, 189 ఎం, 19/ఎఫ్, 158, 113, 19 జే, 19 ఎం, 185, 19 కె/జె రూట్ బస్సులపై ఉంటుందని ట్రాఫిక్ అదనపు సీపీ జితేందర్ తెలిపారు. -
హోటళ్లలో మొరాయించిన స్వైపింగ్ మిషన్లు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు పెద్ద నోట్ల మార్పిడి నగర వాసులను ముప్పు తిప్పలు పెడుతుండగా, మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లలో చెల్లింపులు చేసే సమయంలో స్వైప్ మిషన్లు సైతం పని చేయకపోవడంతో శనివారం వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన హోటళ్లలో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో నగరానికి వచ్చిన పర్యాటకులు, సందర్శకులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందని, వెంటనే పరిష్కరించి యథావిధిగా స్వైప్ మిషన్ల ద్వారా బిల్లులు స్వీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పలువురు హోటల్ యజమానులు చెప్పారు. నగరంలోని ఫంక్షన్ హాళ్లలోనూ పాత నోట్లను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలకు ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకోదలచిన నగరవాసులు తమ వద్ద అధిక మొత్తంలో కొత్త నోట్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. -
అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని దుస్తుల దుకాణంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కనకదుర్గ ఆలయ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగటంతో సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. -
రియల్ వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
-
రియల్ వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
హైదరాబాద్: నగరంలో మరోసారి తుపాకి కలకలం రేపింది. అమీర్‌పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ సమీపంలో కిశోర్‌కుమార్ అనే రియల్ వ్యాపారిని శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించారు. అకస్మాత్తుగా జరిగిన చర్యతో భయబ్రాంతులకు గురైన కిషోర్‌కుమార్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనపై బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమీర్ పేటలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డుపై గుంత @ అమీర్‌పేట్
హైదరాబాద్: విశ్వనగరిలో రోడ్డు ప్రయాణం రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. మొన్న ట్యాంక్ బండ్ పై ఏర్పడిన తరహాలోనే రద్దీ ప్రాంతమైన అమీర్ పేట్ (మైత్రివనం సమీపం) లోనూ రోడ్డుపై గుంత ఏర్పడింది. శనివారం సాయంత్రం ఆ ప్రాంతంలో వర్షం కురిసి వెలిసిన కొద్దిసేపటికే రోడ్డు కుంగిపోయి, గుంత ఏర్పడింది. దీనిని గుర్తించిన ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులకు చెప్పారు. దీంతో గుంత పడిన ప్రాంతం చుట్టూ ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. కాగా, పాత మురుగు నీటి పైప్ లైన్ పగిలిపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి గుంత పరిమాణం చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, రోడ్డును తొలిచివేస్తేగానీ అసలు విషయం బయటపడదు. కొద్ది రోజుల కిందట ట్యాంక్ బండ్ పై(ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా) రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. గుంత ఏర్పడిన ప్రాంతంలో రోడ్డును తొలిచివేసిన అనంతరం భారీ గుంత బయటపడిన విషయం తెలిసిందే. పాతకాలం నాటి మురుగునీటి పైప్ లైన్లు పగిలిపోవడం వల్లే ట్యాంక్ బండ్ పై భారీ గుంత ఏర్పడినట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. -
రోడ్డుపై గొయ్యి @ అమీర్‌పేట్
-
అందాల తళుకులు..
సనత్‌నగర్: అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్‌లోని హెచ్‌బీఎస్ డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి. బేగంపేట్ ఫ్యామిలీ వరల్డ్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఆడి పాడి అలరించారు. ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్, డ్యాన్స్, కామెడీ స్కిట్స్‌తో హుషారెత్తించారు. -
జెంటిల్మెన్ స్టైల్లో దొంగతనం
అమీర్‌పేట: సినీ ఫక్కీలో ఓ దొంగ కారు ఎత్తుకెళ్లాడు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగి శ్రీమన్నారాయణ బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి అమీర్‌పేట్ గ్రీన్‌పార్కు హోటల్‌కు వచ్చాడు. కారు దిగి హోటల్ డ్రైవర్‌కి తాళాలు ఇచ్చాడు. అదే సమయంలో రెప్పపాటులో మరో వ్యక్తి మరోవైపు డోర్లోంచి కారులో కూర్చున్నాడు. కారు తాళాలు ఇచ్చిన వారితో అతను కూడా వచ్చాడనుకున్న హోటల్ డ్రైవర్...‘సార్! లోపలికి వెళ్లండి’ అనగా... ‘నాకు అన్ ఈజీగా ఉంది, కారులోనే ఉంటా... ఏసీ ఆన్ లో ఉంచు’.. అని కారులో కూర్చున్న వ్యక్తి అన్నాడు. కారు పార్కింగ్ పాయింట్లో ఉంచిన హోటల్ డ్రైవర్ తాళాలను దొంగ చేతికి ఇచ్చి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత అందరి కళ్లుకప్పి దొంగ కారుతో ఊడాయించాడు. డిన్నర్ ముగించుకొని వచ్చిన శ్రీమన్నారాయణ తన కారు ఏదని ప్రశ్నించాడు. తర్వాత మోసం జరిగిందని తెలుసుకొని ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు దొంగ ఫోటొను విడుదల చేశారు. నిందితుడిని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మద్యం కోసం చెల్లిని చావబాదిన అన్నలు
అమీర్ పేట: చెల్లిని బడిలో చేర్చించి విద్య నేర్పించాల్సిన అన్నలు ఆమెను ఇళ్లల్లో పని మనిషిగా చేర్చారు... మద్యం కోసం డబ్బులు కావాలని వేధించి చావబాదారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నవీన్ కథనం ప్రకారం... బల్కంపేట బీకేగూడ మజీద్ బస్తీకి చెందిన యూసుఫ్‌మియా కురేషికి ఆరుగురు సంతానం. మటన్ కొట్టులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడో కూతురు సబా (15) ఉర్దూ మీడియంలో నాలుగో తరగతి చదువుతున్న సమయంలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బడి మాన్పించారు. తెలిసిన ఇళ్లలో పాచిపని చేస్తూ సబా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటోంది. అన్నలు ముగ్గురూ జులాయిగా తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డారు. మద్యం తాగి ఇంటికి వచ్చి తరుచూ తల్లిదండ్రులతో గొడవపడేవారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మద్యానికి డబ్బులు కావాలని కొడుకులు తండ్రితో గొడవకు దిగగా.. ఆయన తన వద్ద డబ్బులు లేవని చెప్పారు. ఎలాగైనా మాకు డబ్బు ఇవ్వాల్సిందేనని చెల్లి సబాను అన్నలు పట్టుబట్టారు. ఇచ్చేందుకు నిరాకరించిన చెల్లెలుపై చెయ్యి చేసుకున్నారు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన సబా గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి సాయంత్రం 6.30కి గదిలోకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందికి దించి ఉస్మానియాకు తరలించగా.. అప్పటికే సబా మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఆసుపత్రి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. సోదరుల వేధింపుల కారణంగానే సబా ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోదరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అక్రమ వ్యాపారానికి అడ్డగా ఉందని..
అమీర్‌పేట: అక్రమ వ్యాపారానికి కుక్క ఆటంకం కలిగిస్తుందని భావించిన కొందరు వ్యక్తులు కుక్కపై రాళ్లతో దాడి చేశారు. చికిత్స పొందుతూ శనివారం ఆ కుక్క మృతి చెందింది. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం...బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన దయానంద్‌కు కుక్కలంటే ప్రేమ. తన ఇంట్లో 7 సంవత్సరాల వయసుగల ల్యాబ్‌రా జాతికి చెందిన జిమ్మీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. ఇంటికి కాపలాగా కూడా ఉంటున్న జిమ్మీ రాత్రి వేళ ఎంతో అప్రమత్తంగా ఉండేది. కాగా స్థానికంగా కొందరు వ్యక్తులు అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలు (గాంజాయి) విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు అర్థరాత్రి సమయంలో పలువురు రాజ్‌నగర్‌కు వచ్చి తిష్టవేస్తుండగా...వారిని చూసి జిమ్మీ మొరిగేది. దీంతో తమ వ్యాపారానికి కుక్క ఆటంకం కలిగిస్తుంది భావించిన కొందరు వ్యక్తులు...యజమాని ఇంట్లో లేని సమయంలో దానిపై రాళ్లతో దాడిచేశారు. కళ్లు, తలపై తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. దీన్ని గమనించిన యజమాని దయానంద్ చికిత్స నిమిత్తం నారాయణగూడలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జిమ్మీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. యజమాని దయానంద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అక్కడి వైద్యులు జిమ్మీ అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
‘పసివాడికి చేయూత ’
అమీర్‌పేట: వింత వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన చిన్నారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చారు. వైద్యానికి డబ్బులు లేక బాధిత కుటుంబసభ్యులు పడుతున్న అవస్థలపై ‘సాక్షి’ దినపత్రికలో ‘పాపం పసివాడు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల యాజమాన్యం అతడికి ఆర్థిక సాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా తాళ్లగడ్డకు చెందిన షఫీ, మున్సీసాల దంపతుల జానీ(6) రక్త సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీనిపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన మాస్టర్‌మైండ్స్ విద్యాసంస్థల అధినేత మట్టుపల్లి మోహన్ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదుగా రూ.3.60లక్షల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ జోనల్ అడ్మిన్ ప్రిన్సిపాల్స్ ఎస్.ఎమ్.వలి,ఎస్.వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. బ్లడ్ ఇన్ఫెక్షన్ కారణంగా బాలుడి మొఖంపై పగుళ్లు, కురుపులు వచ్చి చీము, రక్తం కారుతుందన్నారు. వ్యాధి తలకు వ్యాపించడంతో కంటిచూపు మందగించి బాధితుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగులేక ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తేవడంతో అతడిని ఆదుకునేందుకు తమ వంతు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. -
బిర్యానీ ఫెస్టివల్..
అమీర్‌పేట: నోరూరించే వంటకాలు ‘పరాఠా, బిర్యానీ ఫుడ్ ఫెస్టివల్’లో భోజన ప్రియులను ఆహ్వానిస్తున్నాయి. అమీర్‌పేట ఆదిత్య పార్క్ హోటల్లో శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఫెస్టివల్ ఈనెల 21 వరకు కొనసాగుతుందని హోటల్ యాజమాన్యం గురువారం తెలిపింది. హోటల్ మాస్టర్ చెఫ్ ఎన్.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. శాఖాహారుల కోసం సబ్జి బిర్యానీ, మష్రూమ్, మక్కాయ్, కాబూలి, ఆవకాయ, పచ్చి మిరపకాయ బిర్యానీ, మాంసాహారులకు గోస్త్, ముర్గ్, నూర్ మహల్ ముర్గ్, అండా కగినా, ఆవాధి, మలాయ్ మహి, అంబర్ (మటన్) లేహా బిర్యానీతో బఫెట్‌ను అందుబాటులో ఉంచుతున్నావున్నారు. గులాబ్ ఫర్ని, గులాబ్ జామూన్, బేక్ట్ రసమలాయి, గాజర్ హల్వా, మిల్లి ఫుల్లి, డబుల్ కా మీఠా వంటి డెజర్ట్స్, బేక్ట్, పేస్ట్రీలు ప్రత్యేకమన్నారు. ప్రతి రోజు రాత్రి 7.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ వంటకాలను ఆస్వాదించవచ్చని హోటల్ మేనేజర్ డి.వసంత్‌కుమార్ తెలిపారు. -
అమీర్‌పేటలో...
శ్రీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘అమీర్‌పేటలో’. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై మహేశ్ నిర్మించిన ఈ చిత్రం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ -‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన నేను అమీర్‌పేటలోని పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్టోరీ రాసుకున్నా. దాన్నే తెరమీద ఆవిష్కరించాం. టైటిల్, పోస్టర్, టీజర్, పాటల విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఈ చిత్రం ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు. ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళుతున్నాం’’ అని చెప్పారు. ‘‘మురళి స్వరపరచిన పాటలు ఓ హైలైట్‌గా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిన చిత్రమిది. మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రం చిన్న చిత్రాల్లో ఓ టార్గెట్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత చెప్పారు. -
దొంగ అరెస్ట్: రూ.10 లక్షల సొత్తు స్వాధీనం
హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన అబ్బూరి సోమయ్య అనే వ్యక్తిని పంజగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమీర్‌పేటలో ఒక ఇంట్లో దొంగతనం చేస్తుండగా పట్టుకున్న పంజగుట్ట పోలీసులు విచారించగా ఇతనిపై 40 కేసులు ఉన్నట్లు తెలిసిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. సోమయ్య నుంచి రూ.10 లక్షల విలువైన 13 ల్యాప్‌టాప్‌లు, 14 సెల్ఫోన్లు, 5 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
విదేశీ కరెన్సీ స్వాధీనం..ఒకరి అరెస్ట్
హైదరాబాద్:చెలామణీలో లేని విదేశీ కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట్‌కు చెందిన వరప్రసాద్ అనే యువకుడు మైత్రీవనం సమీపంలో శనివారం మధ్యాహ్నం టర్కీ దేశ కరెన్సీ లిరాలను మార్పిడి చేసుకునేందుకు యత్నించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 89 లిరా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్ల విలువ రూ.100 కోట్లు ఉంటుందని, అయితే అవి ఇప్పుడు చెల్లుబాటు కావని చెబుతున్నారు. ఈ కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఐటీ కోర్సులకు కేరాఫ్ అమీర్‌పేట!!
ఇంజనీరింగ్ స్పెషల్ బీఎస్సీ, బీసీఏ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్హత ఏదైనా... సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్.. చేరాలనుకున్న కోర్సు ఏదైనా అన్నింటికి ముఖ్య కూడలి.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట. ఇది నేడు ఐటీ కోర్సుల శిక్షణా శిబిరంగా మారింది. నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో అమీర్‌పేటలోని ఐటీ శిక్షణ సంస్థలు.. కోర్సులు.. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లు కావాలని కలలు కనే వారికి పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్‌పేట. ఫ్రెషర్స్ ఉద్యోగాలు పొందాలన్నా, ఉద్యోగులు తమ స్కిల్‌ను డెవలప్ చేసుకోవాలన్నా అమీర్పేటని ఆశ్రయించవలసిందే. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. ట్రెండ్‌కు అనుగుణంగా..సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డిమాండ్‌కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఎవరెవరికి ఏ కోర్సులు బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. విద్యార్థులు.. సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, హడూప్, షేర్‌పాయింట్, లైనక్స్, టెస్టింగ్ టూల్స్, నెట్వర్కింగ్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు ట్యాలీ వంటి అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్ఎస్ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, హిమాయత్‌నగర్, కుకట్‌పల్లిలో కూడా మంచి ఇన్స్టిట్యూట్లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), (హైదరాబాద్) అమీర్‌పేటలోని మైత్రివనంలో ఉండేది. ఎస్టీపీఐ అనుమతి పొందిన సంస్థలు అక్కడే చుట్టుపక్కల ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించాయి. దాంతో విద్యార్థులు ఇక్కడకు వచ్చి వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందేవారు. అలా అమీర్‌పేట ఐటీ శిక్షణ సంస్థలకు కేంద్రంగా మారింది. అమీర్‌పేటలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న అన్ని రకాల టెక్నాలజీలకు కోచింగ్ లభిస్తుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ల మధ్య పోటీ ఉండటంతో తక్కువ ఫీజులకే కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఫీజులు ఒక్కో ఇన్స్టిట్యూట్ ఒక్కో కోర్సుకు ప్రసిద్ధి. ఫీజులు కూడా ఇన్స్టిట్యూట్లను, కోర్సులను బట్టి మారుతుంటాయి. రూ.500 నుంచి రూ.50000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇతర విద్యార్థులే ఎక్కువ ప్రస్తుతం ఇన్స్టిట్యూట్లల్లో ఇతర రాష్ట్రాల వారు, విదేశీయులు ఎక్కువగా ఉంటున్నారు. జావా నేర్చుకునే వారిలో 40 శాతం మంది తెలుగు విద్యార్థులు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 50 శాతం మంది, విదేశీయులు 10 శాతం వరకు ఉన్నారు. ఇన్స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు * మార్కెట్ ట్రెండ్‌కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి. అయితే అన్ని టెక్నాలజీలు, టూల్స్ కానీ మార్కెట్లో ఎక్కువ కాలం ఉన్న దాఖలాలు లేవు. కొన్ని టెక్నాలజీలు మాత్రమే నిలకడగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. అభ్యర్థులు వాటివైపు మొగ్గు చూపాలి. * కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కంపెనీలు నిపుణులను నియమించుకుంటున్నాయో తెలుసుకోవాలి. * కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో విశ్లేషించుకోవాలి. * ఇన్స్టిట్యూట్లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. * అన్నింటి కంటే ముఖ్యంగా చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం, వారు ఎప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నారు తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్లు అనుభవం లేని, ల్యాబ్ కోఆర్డినేటర్లతో కూడా క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. * కొన్ని ఇన్స్టిట్యూట్లు తమ ప్రకటనలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటాయి. ఇంకా ఆకర్షణీయంగా డెమో క్లాసులు నిర్వహించి అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అమీర్‌పేటలో కోర్సుల ఫీజులు చాలా తక్కువ. పుణే, బెంగళూర్ లాంటి నగరాల్లో జావా నేర్చుకోవాలంటే దాదాపు రూ. 25 వేల వరకు ఖర్చు చేయాల్సిందే. కానీ ఇక్కడ రూ. 3 వేల నుంచి రూ.5 వేల లోపే పూర్తవుతుంది. - ఎన్.దుర్గా ప్రసాద్, డెరైక్టర్, దుర్గాసాఫ్ట్ -
అమీర్‌పేటలో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్: అమీర్‌పేటలోని సారథి స్టూడియో, యూసుఫ్‌గూడ మధ్య జరుగుతున్న మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ (ట్రాఫిక్) జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు భారీ వాహనాలకు నిబంధనలు వర్తిస్తాయి. మిగిలిన వాహనాలన్నీ యథావిధిగా యూసుఫ్‌గూడ వైపు వెళ్ళోచ్చు. * అమీర్‌పేట, పంజగుట్ట, సత్యం థియేటర్ వైపు నుంచి యూసుఫ్‌గూడ వెళ్లే వాహనాలు ఎస్సార్‌నగర్ జంక్షన్, వెంగళ్రావు నగర్, కళ్యాణ్‌నగర్, సాయిబాబా దేవాలయం, కృష్ణకాంత్ పార్క్, జీహెచ్ఎంసీ కార్యాలయం, యూసుఫ్‌గూడ బస్తీ చౌరస్తా మీదుగా వెళ్లాలి. * మళ్లింపులు వర్తించే బస్సుల రూట్ నెంబర్లు: 19 వై/ఎఫ్, 10 హెచ్, 10 వై/ఎఫ్, 19 ఎస్/ఎఫ్, 113 వై/ఎఫ్, 45ఏ, 47 ఎఫ్, 47 కే -
అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : అమీర్‌పేటలోని నైస్ బెడ్ వర్క్స్ షాపులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాపులో ఉన్న సామాగ్రితో సహా పరుపులు, దుప్పట్లు పూర్తిగా కాలిపోయాయి. మొత్తం మూడు ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకోవడంతో చుట్టుపక్కల ఉన్న విద్యాసంస్థలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. -
అమీర్‌పేట కార్పొరేటర్ ఇంట్లో చోరీ
అమీర్‌పేట (హైదరాబాద్) : అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి ఇంట్లో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. దొంగలు పడి 4 తులాల బంగారు గొలుసు, 22 వేల రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లు దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయం ఆదివారం ఉదయం గమనించిన శేషుకుమారి సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహేశ్వరం.. మహర్దశ!
మూడేళ్ల క్రితం ఎకరం ధర రూ.25 లక్షలు.. మరి నేడో అర కోటికి పైమాటే ♦ అమీర్‌పేట్, రావిర్యాల, తుక్కుగూడలో రియల్ బూమ్ ♦ ఐటీఐఆర్, టీ-పాస్‌తో పరిశ్రమల పరుగులు ♦ స్థిరాస్తి రంగానికి పెరిగిన గిరాకీ; ప్రాజెక్ట్‌లతో నిర్మాణ సంస్థల క్యూ ♦ గతంలో షేరింగ్ ఆటోలు కూడా తిరగని ప్రాంతం! ♦ మరి నేడో.. లగ్జరీ కార్లు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయ్!! ♦ గతంలో గ్రామాధికారులు కూడా సరిగా పట్టించుకోని ప్రాంతం! మరి నేడో.. ఐటీఐఆర్‌తో కేంద్రం, టీ-పాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన హైటెక్ గ్రామం!! ... ఇదంతా మహేశ్వరం మండలం గురించి. ఈ ప్రాంతాన్ని మూడు ముక్కల్లో వివరించాలంటే.. ఎత్తై కార్యాలయ భవనాలు.. విశాలమైన రోడ్లు.. లక్షల సంఖ్యలో ఉద్యోగులు! ఇలా పూర్తి స్థాయి హైటెక్ గ్రామంగా రూపుదిద్దుకుంటున్న మహేశ్వరం మండలంపై ఈ వారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది. సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో మహేశ్వరం, కందుకూరు మండలాలొస్తాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమీర్‌పేట్, ర్యావిర్యాల, తుక్కుగూడ, మంఖాల్, శ్రీనగర్ ప్రాంతాల గురించే. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లే కారణం. గతంలో కేంద్రం ప్రకటించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్) మూడు క్లస్టర్లలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఉంది. ♦ ఈ క్లస్టర్ కిందికి మామిడిపల్లి, రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాలొస్తాయి. మొత్తం 79.2 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న క్లస్టర్లో ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇక రాష్ర్ట ప్రభుత్వం విషయానికొస్తే.. 313 ఎకరాల్లో మహేశ్వరంలో, 600 ఎకరాల్లో రావిర్యాలలో ఎలక్ట్రానిక్ సిటీ (ఈ-సిటీ)లను ఏర్పాటు చేశాయి. నూతన పారిశ్రామిక విధానం (టీ-పాస్)లో పరిశ్రమల స్థాపన కోసం 60కి పైగా కంపెనీలు స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాయి కూడా. ♦ భాగ్యనగర అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం చుట్టూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నగరం చుట్టూ 13 రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాంతాలను నగరంతో అనుసంధానించనున్నారు. వీటిలో తుక్కుగూడ ప్రాంతానికి చోటు దక్కింది. ఆయా ప్రాంతాల్లో 2041 నాటికి నగరం ఎలా విస్తరిస్తుంది? అప్పటి మౌలిక, వాణిజ్య అవసరాలకు తగ్గట్లు ప్రజా రవాణా, మౌలిక వసతుల ఏర్పాట్లు చేస్తారు. అలాగే సైన్స్‌పార్క్‌ను మహేశ్వరంలో ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఆయా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటుగా ఈ ప్రాంతంలో స్థిరాస్తి, అద్దెల ధరలు పెరుగుతాయి. గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులూ మెరుగవుతాయి. ఐటీఐఆర్ జోన్ కారణంగా కేవలం ఐటీ రంగమే కాదు.. రవాణా, పర్యాటక, ఆతిథ్య రంగాలకూ గిరాకీ పెరుగుతుంది. వైద్య, విద్యా రంగాలకు రానున్న రోజుల్లో ఆదరణ లభిస్తుంది. ఎకరం రూ.50 లక్షల పైమాటే.. మూడేళ్ల క్రితం వరకూ మహేశ్వరం మండలంలో ఎకరం ధర పాతిక లక్షలుండేది. కానీ, నేడు రూ.50 లక్షలకు పైగానే ఉందని శతాబ్ది టౌన్షిప్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి వైద్య కళాశాలతో పాటూ 70 ఎకరాల్లో చిన జీయర్ స్వామి ఆశ్రమం, నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కార్వి, సెంట్రల్ ఎక్సైజ్, బ్యాంక్ కాలనీ నివాస సముదాయాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాంతం హైలెట్స్.. మహేశ్వరం మండలం మెహదీపట్నం నుంచి 32 కి.మీ., శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్‌కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. కొంగర, రావిర్యాల, శ్రీనగర్ గ్రామాల్లో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్‌లు, మండల కేంద్రంలో ఐటీ ఎలక్ట్రానిక్ పార్క్, మంఖాల్‌లో పారిశ్రామికవాడలో పలు కంపెనీలు రానున్నాయి. రావిర్యాలలో రూ.200 కోట్లతో ఏర్పాటైన మైక్రోమ్యాక్స్ ప్లాంట్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఇదే ప్రాంతంలో బెంగళూరుకు చెందిన వండర్ లా సంస్థ అమ్యూజ్మెంట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తోంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా. -
ఫ్యాన్సీ సెల్ నంబర్ల పేరుతో మోసం
అమీర్‌పేట (హైదరాబాద్) : ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డ యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన ఎం.కిరణ్‌కుమార్,లైఫ్‌లైన్ ఫార్మాలో పనిచేసే శేఖర్‌రెడ్డిలు వొడాఫోన్ సంస్థలో పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే సెల్‌ఫోన్ ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని చెప్పడంతో ఎల్లారెడ్డిగూడకు చెందిన పి.వి.రామకృష్ణ వారి వలకు చిక్కాడు. అతడి నుంచి వారు రూ.3,500 వసూలు చేశారు. అయితే రామకృష్ణకు నిందితుల తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మేరకు నిందితుడు కిరణ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం ఒక సిమ్ తీసుకుని అమీర్‌పేటకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నగదుతోపాటు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని వేరే సిమ్ కార్డులు అంటగడుతున్నారని ఏసీపీ తెలిపారు. కాగా ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరారీలో ఉన్న శేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
తలసాని ఫ్లెక్సీల దహనానికి కూలీల యత్నం
అమీర్‌పేట (హైదరాబాద్): తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహించిన కూలీలు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఫ్లెక్సీలను దహనం చేసేందుకు యత్నించారు. దీన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బల్కంపేట డివిజన్లోని స్వామి థియేటర్ వద్ద ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని పేర్కొంటూ ఉదయం అడ్డా కూలీలు తలసాని ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేత గోదాస్ కిరణ్‌తోపాటు కొందరు అక్కడకు చేరుకుని కూలీల చేతిలో ఉన్న ఫ్లెక్సీని లాగేసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటుతోపాటు గృహ నిర్మాణ పథకం వర్తింపచేస్తామని మంత్రి హమీ ఇచ్చి పట్టించుకోవడం లేదని కూలీల అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికి నిరసనగా చేపట్టిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
అమెరికా వయా అమీర్‌పేట....
► సాఫ్ట్వేర్ కోర్సులకు చిరునామా ► వందలాది శిక్షణ సంస్థలు ► స్వల్ప ఫీజులతోనే మంచి కోర్సులు ► యువతరం చూపు...ఇటు వైపు అమెరికా... సాఫ్ట్వేర్ ఉద్యోగుల కలల ప్రపంచం. అందమైన భవిష్యత్తును అందించే అద్భుత లోకం. ఆ కలలను సాకారం చేసుకోవాలనుకున్న వారు ముందుగా అమీర్‌పేటలో అడుగు పెట్టాల్సిందే. అవును... అమెరికాకు దగ్గర దారి అమీర్‌పేట అంటే అతిశయోక్తి కాదు. అప్పుడే కళాశాల నుంచి బయటకు వచ్చిన వారితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు సైతం ఇక్కడ తమ సాంకేతిక ప్రతిభకు మెరుగులు దిద్దుకొని... విమానం ఎక్కుతున్నారు. సాఫ్ట్వేర్ కోర్సులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ ప్రాంతం... అభ్యర్థులకు శిక్షణ అందించడమే కాదు... పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సనత్ నగర్: అమీర్‌పేట... గేట్ వే ఆఫ్ అమెరికా. అవును... ఏ మారుమూల గ్రామం నుంచైనా... ఎవరైనా ‘సాఫ్ట్’గా అమెరికా వెళ్లారంటే వయా అమీర్‌పేటే. ఇక్కడ ‘శిక్షణ’కు పునాది వేసుకుంటేనే అమెరికా ప్రయాణం ఖాయమైనట్టు. సాంకేతికత కొత్త అడుగులు వేస్తే... సంబంధిత కోర్సులు మొదటిగా అమీర్‌పేటలోనే ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ లభించే కోర్సులు సెంచరీ దాటేశాయి. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సును అందిపుచ్చుకునే లోపే... మరో కోర్సు సాఫ్ట్వేర్ యువతకు పరిచయం అవుతోంది. జావా, సీ ప్లస్, సీ ప్లస్ ప్లస్, క్లౌడ్ ఫర్ కస్టమర్, హనా డెవలప్మెంట్, యూఐ5-ఫ్లోరి, వెబ్ ప్రో అబాప్, సీఆర్ఎం టెక్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, మొబిలిటీ (ఆప్స్ డెవలప్మెంట్), షేర్ పాయింట్ టెక్నాలజీ, ఫోన్ గ్యాప్ శాప్ (సింపుల్ ఫైనాన్స్) ... ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త సాఫ్ట్వేర్ కోర్సులతో పాటు హార్డ్‌వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్సుల శిక్షణకు అమీర్‌పేట్ పెట్టింది పేరు. ఈ కోర్సులు ఇన్ఫ్రా, మొబైల్, సైబర్ సెక్యూరిటీ, మొబైల్ ట్రాకింగ్, జీఐఎస్ వంటి విభిన్న రంగాల వైపు యువతను అడుగులు వేయిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యువతను సానబెడుతూ సాఫ్ట్వేర్ దిగ్గజాలను తయారు చేసే కేంద్రంగా అమీర్‌పేట్ భాసిల్లుతోంది. రెండున్నర దశాబ్దాల క్రితమే ‘సాఫ్ట్’కు దారులు... అమీర్‌పేట్ కేంద్రంగా రెండున్నర దశాబ్దాల క్రితమే సాఫ్ట్‌వేర్‌కు దారులు తెరుచుకున్నాయి. ఆ సమయంలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని వచ్చే విద్యార్థుల పరిజ్ఞానం సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏమాత్రం సరిపోయేది కాదు. ఇలాంటి వారికి శిక్షణ కేంద్రాలు బాసటగా నిలిచాయి. 1999-2000 మధ్య ఇక్కడ కేవలం నాలుగైదు శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఆ సమయంలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) మైత్రీవనంలోకివచ్చింది. ఎస్టీపీఐ చెంతనే ఉండడంతో అనుమతులు... ఇతర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందన్న భావనతో ఈ ప్రాంతం సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థలకు నెలవైంది. ప్రస్తుతం ఇక్కడ 400కు పైగా సంస్థలు సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నాయి. అందరి చూపు అమీర్‌పేట వైపే... తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 700 ఇంజినీరింగ్కళాశాలల విద్యార్థులతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, ముంబయి నగరాల నుంచి సైతం సాఫ్ట్వేర్ శిక్షణకు అమీర్‌పేట వస్తుంటారు. వీటితో పాటు ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్లో ప్రాజెక్టు శిక్షణకూ విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. దాదాపు లక్షకు పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో వివిధ కోర్సులు, ప్రాజెక్టులకు సంబంధించి శిక్షణ పొందుతున్నారు. మిగతా నగరాల్లో ఎన్నో శిక్షణ సంస్థలు ఉన్నప్పటికీ... అక్కడి ఫీజులో 10 శాతం మాత్రమే ఇక్కడ ఉండడంతో విద్యార్థులు ఇటువైపుక్యూ కడుతున్నారు. ఉదాహరణకు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్సుకు బెంగళూరులో రూ.40వేలు ఫీజు ఉంటే అమీర్‌పేట్‌లో రూ.నాలుగు వేలకే లభిస్తోంది. తక్కువ ఫీజు ఉంది కదా... క్వాలిటీ ఎలా ఉంటుందోనని భయపడనక్కర్లేదు. నాణ్యతా ప్రమాణాలలోనూ ఇక్కడి సంస్థలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలోనే శిక్షణతో పాటు ప్లేస్మెంట్స్కూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో పాటు హాస్టళ్లు, భోజన వసతికి కొదువ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వారు సైతం సాఫ్ట్వేర్ కోర్సులు అనగానే అమీర్పేటకే మొగ్గు చూపుతారు. విడిభాగాలకు కేరాఫ్... ఆదిత్య ట్రేడ్ సెంటర్ మదర్ బోర్డు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ (ర్యామ్), ఎస్‌ఎంపీఎస్, హార్డ్‌డిస్క్... ఇలా కంప్యూటర్‌కు సంబంధించిన సకల విడి పరికరాలకు ఆదిత్య ట్రేడ్ సెంటర్ కేంద్ర బిందువైంది. చిన్న చిన్న చిప్‌ల నుంచి సీపీయూ, మానిటర్, యూపీఎస్, ప్రింటర్, స్కానర్, డీటీఎస్ స్పీకర్స్ వరకు... ఏది కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే. కొత్త వాటిని ఇంటికి ఆహ్వానించాలన్నా... పాత వాటిని వదిలించుకోవాలన్నా (అమ్మాలన్నా) ఇదే అడ్డా. ఇక ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ మొరాయించినా ఆదిత్య ట్రేడ్ సెంటర్ బాట పట్టాల్సిందే. నాణ్యమైన సేవలు యువతను ఇటువైపు నడిపిస్తుంటాయి. ఎందరికో ఉపాధి ఒక్కసారి అమీర్‌పేట మైత్రీవనం-సత్యం టాకీస్ మార్గాన్ని పరిశీలిస్తే ఆ రహదారితో పాటు అక్కడి భవనాలు దాదాపుగా హోర్డింగ్‌లు, బ్యానర్లతో నిండి ఉంటాయి. శిక్షణ సంస్థలు ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడంతో ఎందరో ఉపాధి పొందుతున్నారు. వెయ్యి కరపత్రాలు పంచితే... రూ.100 వస్తాయి. ఒక్కొక్కరు రోజుకు 5 నుంచి 10 వేల వరకు కరపత్రాలు పంపిణీ చేస్తూ రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదించుకుంటున్నారు. దాదాపు 500 మందికి కరపత్రాలే ఉపాధినిస్తున్నాయి. ఒక్కో బ్యానర్ కడితే రూ.10 నుంచి రూ.20 చెల్లిస్తారు. దీంతో బ్యానర్ల ద్వారా కూడా చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఇక్కడికి వచ్చే యువతను నమ్ముకుని టీ స్టాళ్లు, చాట్‌బండార్, టిఫిన్ సెంటర్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారులు సునాయాసంగా బతుకు బండిని నడిపించేస్తున్నారు. ఇక వీరిని నమ్ముకున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల వ్యాపారమైతే మూడు పువ్వులు... ఆరు కాయలే. చెంతనే పాస్‌పోర్టు సేవా కేంద్రం... ట్రావెల్ ఏజెన్సీలు అమెరికా కలలలో బతికే సాఫ్ట్వేర్ యువత కోసమే అన్నట్లుగా పాస్‌పోర్టు సేవా కేంద్రంతో పాటు ఎయిర్ టికెట్ల కోసం ట్రావెల్ ఏజెన్సీలు అమీర్‌పేటలో వెలిశాయి. ఊరు నుంచి అమీర్‌పేట్.... ఇక్కడి నుంచి ఎంచక్కా విదేశాలకు చేరవేసేందుకు వివిధ సంస్థలు యువత కోసం తరచూ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంటాయి. అందుబాటులో కొత్త కోర్సులు నేను 2000వ సంవత్సరంలో నగరానికి వచ్చాను. అప్పుడు కేవలం నాలుగు సాఫ్ట్వేర్ శిక్షణ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 400 దాటిపోయాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్న కొద్దీ కొత్త కోర్సులు పుట్టుకురావడం సహజమే. మా సంస్థలోనే దాదాపు వందకు పైగా కోర్సులు సాఫ్ట్వేర్ యువతకు అందిస్తున్నాం. థియరీతో పాటు వారి కోసం ప్రాక్టికల్ చేయించేందుకు ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖర్చుతోనే డిమాండ్ ఉన్న కోర్సులు లభిస్తాయి. -కోటి, పీర్స్ టెక్నాలజీ ఆపరేషన్ హెడ్, మైత్రీవనం జాబ్ గ్యారెంటీ ఇక్కడ శిక్షణ పొందితే జాబ్ గ్యారెంటీ అన్న నమ్మకం ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి వెబ్ డిజైనింగ్‌లో శిక్షణకు వచ్చాను. తక్కువ ఫీజుతోనే శిక్షణ ఇచ్చే సంస్థలు ఇక్కడ ఉండడంతో పేద కుటుంబీకులు సైతం ఉన్నత కోర్సులను ఇక్కడ చేయగలుగుతున్నారు. నాలాంటి వారికి అమీర్‌పేట్ ప్రాంతం ఒక వరం లాంటిదే. - శిరీష, వెబ్ డిజైనింగ్ విద్యార్థిని ఇక్కడ ఫీజులు తక్కువ జేఎన్టీయూలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోర్సులో చేరేందుకు ఇక్కడికి వచ్చాను. డిమాండ్ ఉన్న సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారని తెలిసి అమీర్‌పేట్ వచ్చాను. నెట్లో అన్వేషిస్తే... బెంగళూరు, ముంబయిలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఫీజు, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా అనిపించింది. అందుకే ఇక్కడ శిక్షణకు ఆసక్తి కనబరిచాను. -హసన్ డెరినోజ్, టర్కీ దేశస్తుడు -
హైదరాబాద్ మైత్రివనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట సమీపంలోని మైత్రీ వనం పోస్టాఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. పోస్టాఫీస్‌లో ఉన్న ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. -
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమీర్‌పేట వద్దగల ఓ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత రద్దీ గల మైత్రీవనం ప్రాంతంలోని షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో షాపింగ్ మాల్ సిబ్బంది, సమీపంలోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో టోకరా
రాంగోపాల్‌పేట్: సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నిరుద్యోగి నుంచి రూ.2లక్షలు కాజేశాడు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే రేపుమాపు అంటు తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితుడి తండ్రి మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మెదక్ జిల్లా గజ్వేల్‌కు చెందిన కుమారస్వామి ప్రభుత్వ ఉద్యోగి. ఇతని కుమారుడు రాకేష్ బీటెక్ పూర్తి చేసి అమీర్‌పేట్‌లో హాస్టల్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గత కొద్ది నెలల క్రితం అమీర్‌పేట్‌కు చెందిన చక్రధర్ అనే వ్యక్తి రాకేష్‌కు పరిచయం అయ్యాడు. తాను ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని లక్ష రూపాయలు ఇవ్వాలని రాకేష్‌ను నమ్మించాడు. దీంతో రాకేష్ జూలై 15వ తేదీన చక్రధర్‌కు లక్ష రూపాయలు ఇచ్చాడు. కానీ, ఉద్యోగం మాత్రం రాలేదు. దీంతో రాకేష్ ఒత్తిడి చేయడంతో ఓ ఎంఎన్సీ కంపెనీకి చెందిన అపాయింట్మెంట్ లెటర్‌ను తెచ్చి ఇచ్చాడు. అటు తర్వాత రెండు రోజులకే ఆ కంపెనీ దివాళా తీసిందని మరో లక్ష రూపాయలు ఇస్తే ఇంకా మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. తన స్నేహితుడు ప్రదీప్ అకౌంట్‌కు ఆ డబ్బును బదిలీ చేయాలని చక్రధర్ కోరడంతో రాకేష్ అలాగే చేశాడు. కానీ, మళ్లీ ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. గత నెల 10వ తేదీన రాకేష్ ఆయన తండ్రి కుమారస్వామిలు చక్రధర్‌ను గట్టిగా నిలదీయడంతో చెక్కును అందించాడు. కానీ, అందులో డబ్బు లేవు. అప్పటి నుంచి చక్రధర్ తప్పించుకుని తిరుగుతూ డబ్బు ఇవ్వకుండా ఉద్యోగం చూపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన కుమార స్వామి శనివారం మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బు లావాదేవీలు అన్నీ సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద జరగడంతో మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
అమీర్‌పేట(హైదరాబాద్): అమీర్‌పేటలోగల గాంధీ నేచురోపతి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరస్పరం దాడులకు పాల్పడ్డట్టు సమాచారం. ఈ సంఘటన గతనెల 29న జరుగగా మంగళవారం రాత్రి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని దీనిపై విచారణ చేస్తున్నామని ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న రాజు, సనీత్కుమార్, భానుతేజ, చందు అనే విద్యార్థులు హాస్టల్లో ఒకే రూంలో నివాసం ఉంటున్నారు. 29న రాత్రి వంట చేస్తున్న సమయంలో రాజు, సనీత్కుమార్ల మద్య గొడవ జరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గొడవ జరిగిన సమయంలో ఓ వర్గానికి చెందిన విద్యార్థులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. కాగా, సనీత్కుమార్, భానుతేజ, చందులు తమపై దాడికి పాల్పడ్డారని రాజు తన అనుచరవర్గంతో కలిసి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు.అయితే అధికారులు వారి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. హాస్టల్లో ర్యాగింగ్ జరిగిందన్న విషయం విద్యార్థుల తల్లిదండ్రుల వరకు వెళ్లడంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులను పిలిపించగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, కళాశాలలో ర్యాగింగ్ జరుగలేదని, హాస్టల్ రూంమేట్స్ మధ్య చిన్నపాటి గొడవ మాత్రమే జరిగిందని నేచురోపతి కళాశాల ప్రిన్సిపాల్ నీరజారెడ్డి తెలిపారు. -
చైన్ స్నాచర్ అనుకుని దేహశుద్ధి..
పంజగుట్ట: మద్యం మత్తులో ఓ యువకుడు మహిళపై చెయ్యి వేయడంతో అక్కడి స్థానికులు చైన్‌స్నాచర్ అని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లా జనగామకు చెందిన వినోద్ అనే యువకుడు అతిగా మద్యం సేవించి శనివారం రాత్రి సుమారు 8:15 ప్రాంతంలో అమీర్‌పేట బిగ్ సీ వద్ద వాహనం ఆపుకుని నిలబడ్డాడు. రోడ్డుపై అటుగా వెళుతున్న ఓ యువతిని చేయిపట్టుకునేందుకు యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు చైన్‌స్నాచింగ్ చేసేందుకు యత్నించాడనుకుని, అతడిని చితకబాదారు. అనంతరం పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని మద్యం లెవల్ తెలుసుకునేందుకు ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉండగా, వినోద్‌పై బాధిత యువతి ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయింది. -
అమీర్‌పేట బస్తీలను దత్తత తీసుకుంటారా..?
సినిమాలతోనే కాదు తన ట్విట్టర్ కామెంట్లతో కూడా సంచలనాలు సృష్టించే రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెరతీశాడు. శ్రీమంతుడు సినిమా ప్రేరణతో గ్రామాలను దత్తత తీసుకుంటున్న సినీతారలను టార్గెట్ చేస్తూ తన మార్క్ కామెంట్స్ చేశాడు. గ్రామాలను దత్తత తీసుకోవటం అంటే వారిని అవమానించటమే అంటూ కొత్త లాజిక్‌ను తెర మీదకు తీసుకొచ్చాడు. వర్మ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి... 'సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవటం అంటే వారిని అవమానించటమే, ఆత్మగౌరవం ఉన్న ఏ గ్రామస్థులూ ఈ దత్తతను అంగీకరించరు. ఏ హాలీవుడ్ నటుడైనా భారత్‌ను వెనుకబడిన దేశం అంటూ దత్తత తీసుకోవడానికి ముందుకొస్తే అది ఎంత అవమానకరంగా ఉంటుంది. దత్తత తీసుకోవడానికి గ్రామాలేమైనా వికలాంగులా, అనాథలా.? ఆత్మాభిమానం ఉన్న గ్రామస్థులు ఈ చర్యలను వ్యతిరేకించాలి. గ్రామాలే దేశానికి బలం అని చెప్పేవారు. అలాంటి గ్రామాలు ఒకరి దయ, జాలితో బతుకుతున్నాయని అవమానించటం ఏంటి..? మామూలు తారలే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటుంటే, పెద్ద హీరోలు ఎన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలి..? గ్రామాలు గౌరవప్రదంగా ఎదిగి నగరాలుగా మారాలి. దత్తత తీసుకోవటం అనే సాంప్రదాయం వల్ల మరోసారి రాజరిక వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దత్తత తీసుకున్న గ్రామాలకు తమను తాము వాళ్లు మహారాజులుగా భావిస్తారు. ఏ సెలబ్రిటీ అయినా హైదరాబాద్‌లో అమీర్‌పేట వెనుక ఉన్న బస్తీలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తారా..? ఇక్కడ గ్రామాల్లో ఉన్నవారి కంటే నిరుపేదలు ఉన్నారు. గ్రామాల్లో కనీసం పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి ఉన్నాయి. ఇక్కడి ప్రజలకు అవి కూడా లేవు. ఈ బస్తీలను ఎవరు దత్తత తీసుకుంటారు. గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పుకోవటం అందంగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంతేకానీ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేంత మంచి హృదయం మన తారలకు ఉందని నేను అనుకోవటం లేదు' అంటూ ఘూటుగా విమర్శించాడు వర్మ. వర్మ చేస్తూ ఈ కామెంట్స్‌ను ఫిలిం సెలబ్రిటీస్ పెద్దగా పట్టించుకోకపోయినా అభిమానులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. I find this whole thing of celebs adopting villages very insulting to villages..No self respecting village will allow itself to be adopted — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Imagine how insulting we will feel if a Hollywood star would want to adopt india reminding us that we are an under developed country — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Do People who adopt think villages are orphans or beggars or handicapped or what? If villages have any self respect they should protest — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Any village who is willing to be adopted is actually admitting that its depending on left over morsels thrown at it by the rich and famous — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 They say villages are the strength of the country and then they insult them by telling the whole world the villages live on their mercy — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 If Normal stars also are adopting a village should very powerful stars adopt many many many villages ? — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 I think it's a conspiracy of government to incite the rich and the famous to adopt villages so that it itself doesn't need to do anything — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Villages should try to become cities and not depend on charity of people who adopt them ..Then only they will respectfully develop — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Adoptation will lead to kingdom culture as celeb who adopted village wil think himself as king of village bcos village depended on his mercy — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Celebrities adopting villages is primarily about satisfying their alter ego in bragging to others that the village depends on their mercy — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 I wonder if any celebrity will adopt the back lanes of Ameerpet in Hyderabad.I think there are more poor people there than in many villages — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Villages atleast have so called green fields and supposedly pure air ..Dirty back lanes in cities don't have that too ..who will adopt them? — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Celebs will prefer villages to adopt because villages sound nicely exotic and poetic and Dhoolpet sounds dirty — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 I don't think any celeb will have a heart enough to adopt the people living along side the dirtiest place on the planet ..The Musi River — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Rich people are individuals and poor people are only a number and rich people adopt poor people to see that they forever remain a number — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 Poor villagers if they have self respect should rebel against the charity giving rich people and work hard to become rich people themselves — Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2015 -
హైదరాబాద్‌లో భారీ వర్షం
-
కరెంట్ షాక్ చనిపోయిన ఉద్యోగి
-
మెట్రో పనుల్లో అపశృతి
అమీర్‌పేట (హైదరాబాద్) : నగరంలో జరుగుతున్న మెట్రో పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. గురువారం మెట్రో నిర్మాణ పనుల్లో పని చేస్తున్న ఒక కూలీ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నగరంలోని అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్ సమీపంలో జరిగింది. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన చెన్నమనాయుడి(38)గా పోలీసులు గుర్తించారు. చెన్నమ నాయుడు మెట్రో రైలు పనుల్లో రోజు వారి కూలీగా పని చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కార్మికుడి మృతి విషయాన్ని పోలీసులు మెట్రో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం
హైదరాబాద్ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారంరాత్రి 8 గంటల సమయంలో ఓ మోస్తరు నుంచి తేలిక వర్షం కురిసింది. వ నస్థలిపురం, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. -
అమీర్‌పేటలో సాఫ్ట్వేర్ సంస్థ మోసం
హైదరాబాద్: హైదరాబాద్ అమీర్‌పేటలో ఎంఎన్ఎస్ అనే ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.40 వేలు వసూలు చేసిన సంస్థ ఎనిమిది నెలలైనా ఉద్యోగాలు చూపించకపోవడంతో బాధితులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల నుంచి మొత్తం రూ. 80 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మే 9 న అమీర్‌పేటలో జాబ్ మేళా
హైదరాబాద్ (వెంగళరావునగర్) : లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన హైదరాబాద్ అమీర్‌పేటలోని పావని ఫంక్షన్హాల్లో నిరుద్యోగులకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బి.సాంబిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్జీఎస్, ధర్మల్ సిర్టమ్స్, పాన్ బిజినెస్, సిజే కమ్యూనికేషన్స్, బలరామ్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటున్నాయన్నారు. ఆయా కంపెనీల్లో దాదాపు 300 పోస్టులకు ఇంటర్యూలు జరుగుతాయని తెలియజేశారు. నిముషానికి 20 పదాలు ఇంగ్లీష్ టైప్ చేయగలవారు, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బి.ఫార్మశీ, బీఈ, ఎంసీఏ, ఎంబీఏ, బీ.టెక్ చదివినవారు అర్హులన్నారు. జీతం నెలకు రూ.6,500 నుంచి రూ.25 వేలు వరకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 89770 31068, 88850 03334 నంబర్లలో సంప్రదించవచ్చని తెలియజేశారు. -
ఎమ్మార్వోపై దాడి కేసులో ఒకరు అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ అమీర్‌పేట ఎమ్మార్వో వెంకటేశ్వర్లుపై దాడి చేసిన కేసులో ఒకరిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలంలో 'ఫ్లాట్ ఫర్ సేల్' అని బోర్డు పెట్టి అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన ఎమ్మార్వో ఆ బోర్డును తీసేయించారు. దాంతో ఆ వ్యక్తి ఆ స్థలం తనదేనని ఎమ్మార్వోతో గొడవపడి దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు పోలీసులు హుస్సేన్ని శనివారం అరెస్ట్ చేశారు. -
అమీర్‌పేట్ లో అగ్నిప్రమాదం
అమీర్‌పేట్ : షార్ట్ సర్క్యూట్ కారణంగా అమీర్‌పేట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాలు.. హైదరాబాద్ అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ సెల్లార్లో ఉన్న బ్యాటరీల్లో షార్ట్ సర్య్కూట్ కావడంతో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే గమనించిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. కాగా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షాపింగ్ మాల్ ప్రారంభించిన సమంత
-
సమంత శారీగమ
వన్నెచిన్నెలున్న అందం చీరక ట్టులో తళుక్కుమంది. శుభమంటూ అడుగిడిన ఆ కుందనపు బొమ్మ.. పట్టుచీర మెరుపులో సౌందర్యానికి కేరాఫ్‌గా నిలిచింది. అమీర్‌పేట్‌లో సరికొత్త వస్త్రశ్రేణితో కొలువుదీరిన సౌతిండియా షాపింగ్ మాల్‌ను సినీనటి సమంత శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా సమంతను చూడటానికి అభిమానులు షాపింగ్ మాల్ ముందు బారులుతీరారు. -
యే భాయ్!.. జర దేఖ్కే సెలో!
తోటి మనిషి కంటే చేతిలో ఫోన్ మంచి కంపెనీ అనుకునే జనాభాకేం తక్కువ లేదు. దాదాపు ఓ ఏడాది కిందట అమీర్‌పేట్ మెయిన్‌రోడ్‌పై డ్రైవ్ చేస్తుంటే ఉన్నట్టుండి ఓ మనిషి ప్రపంచంతో సంబంధం లేకుండా రోడ్డు దాటుతున్నాడు. ముందు వెనుక వాహనాలున్నాయన్న స్పృహ ఏ మాత్రం లేదు. పళ్లు బిగబట్టి బ్రేకు తొక్కిపట్టి చూద్దును కదా..! కళ్లకు నిజం కనబడింది. సారు ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ తాపీగా రోడ్డు దాటుతున్నాడు. మన మహానగరంలో మామూలు రోడ్డు దాటడమే కష్టమనుకుంటే.. ఇక ప్రధాన రహదారులు దాటడం అంటే గమనంలో కదనం కంపల్సరీ. ఒకదాని వెనుక ఒకటి బారులు తీరిన వాహనాల మధ్య సందు వెతక్కోవడం ఒక కష్టం. చిన్న ఖాళీ దొరికిందని అడుగు ముందుకేస్తే, ఆ సందులోకి దూసుకుచ్చే వాహనాలు మనకు స్పీడ్ బ్రేకులు వేస్తాయి. వాహనదారులను నొప్పింపక.. మనం నొవ్వక నడవడం అనేది ఓ కళ. రోడ్డు దాటడం అనే ఈ 65వ కళలో ప్రవేశం లేని వ్యక్తి సిటీ రోడ్డులో బిక్కచచ్చి ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అంతటి బ్రహ ్మవిద్యలాంటి ట్రాఫిక్ ఛేదనను ఇంత తేలిగ్గా తీసుకున్న ఈ మహానుభావుణ్ని చూసి జాలి, కోపం అన్నీ కలిగాయి. తమ ప్రాణాలకంటే ఫోన్‌కాల్‌కు అంత విలువిస్తున్నారని ఆశ్చర్యపోయాను. రాస్తా పే హల్‌సెల్.. ఆ రోజు నుంచి గమనించడం మొదలుపెట్టాను. రోడ్డు దాటుతున్న పది మందిలో కనీసం ఆరుగురు ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. ఈ సారి మీరూ చూడండి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మధ్యలో ఎంత మంది కనిపిస్తారో ! ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలరు. అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఓ నిమిషం ఆగలేరా..? వాహన చోదకులకు మనం ఇబ్బంది కలిగిస్తున్నామన్న విషయం పక్కన పెడితే మన ప్రాణానికే ముప్పు ఉందని అర్థం కావడం లేదా..? ఒక్కోసారి అలాంటి వారిని ఆపి మరీ చెప్పాలనిపిస్తుంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఎలా వాడొద్దని హెచ్చరిస్తున్నామో..! అలా రోడ్డు దాటే టప్పుడు పాదచారులు కూడా ఫోన్ వాడొద్దని ప్రచారం మొదలుపెట్టాలి. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ గురించిన ప్రచారం చేసే సమయం వచ్చేసింది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, బస్‌స్టాప్‌లో, బస్సులో, షాప్‌లో.. ఎక్కడపడితే అక్కడ చెవిలో ఇయర్ ఫోన్స్‌తో యువత దర్శనమిస్తోంది. పాటలు వింటూనో, రేడియో వింటూనో చుట్టూ ఏం జరుగుతుందో అన్న స్పృహ లేకుండా ఉంటున్నారు. హియర్.. హియర్.. మన పరిసరాలకు తగ్గట్టుగా అలెర్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ప్రధానంగా అమ్మాయిలకు తమ చుట్టూ ఏం జరుగుతుందో అన్న అవగాహన ఉండాలి. వేధింపులకు గురయ్యే అవకాశాన్ని అన్యమనస్కంగా ఉంటే గుర్తించడం కష్టం. ఫోన్‌ను కేవలం వినోద సాధనంగా మార్చకుండా మన రక్షణకు ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. ఇబ్బందికర సన్నివేశాల్లో ఫోన్లోని కెమెరా మనకు కొండంత అండగా నిలుస్తుంది. కొత్త కొత్త యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ఈ తరంలో ఎంత మంది దగ్గర సిటీ పోలీస్ యాప్, హ్యాక్ ఐ ఉంది. ఫోన్లో ఉండే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే ఈ తరంలో మనవంతు బాధ్యతను కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్ దాటుతున్నప్పుడే కాదు బిల్ పే చేస్తున్నప్పుడు, వస్తువులు కొనేటప్పుడు.. చివరకు మనని ఎదుటి వ్యక్తి పలకరిస్తున్నప్పుడు కూడా చెవిలో జోరీగ మోగుతుండటం ఏం సంప్రదాయం. మన ఫోన్ వల్ల మనకే కాదు పక్కవాడికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. సెల్ హెల్ ఇటీవల ముంబైలో, ఇయర్ ఫోన్స్ మ్యూజిక్ హోరులో రోడ్డు దాటుతున్న యువతికి మృత్యు శక టం ఘంటికలు వినిపించక.. తన ప్రాణాలను ఆ వాహనానికి బలివ్వాల్సి వచ్చింది. అదేవిధంగా వస్తున్న రైలు కూత వినబడక చెవిలో ఇయర్ ఫోన్స్‌తో పాటే పరలోకానికి చేరుకున్న సంఘటనలు ఉత్తరభారతంలో చాలా జరిగాయి. పాటలైనా, మాటలైనా వినోదం వినోదమే. ప్రయాణం ప్రయాణమే, ప్రాణం ప్రాణమే. మన ఫోన్ మన చేతిలో ఉన్నట్టు మన భద్రత కూడా మన చేతిలోనే ఉంది. ‘హలో రోడ్ దాటుతున్నా మళ్లీ చేస్తా’ అనడం చాలా తేలిక. ట్రై చేయండి. -
20, 22 తేదీల్లో జాబ్‌మేళా
హైదరాబాద్: లోక్‌సత్తా, ఇంజినీర్స్ కాడ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20, 22 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు లోక్‌సత్తా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధ్యక్షులు బి.సాంబిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10 నుంచి మ.2 గంటల వరకు ఈ జాబ్‌మేళా ఉంటుందని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని యూరేకాకోర్ట్ 2వ అంతస్తులో ఉన్న సీసీఈ సంస్థలో ఈ మేళా ఉంటుందని తెలిపారు. డిగ్రీ, డిప్లొమా, మెకానికల్, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నెలకు జీతం రూ.7 వేలు ఆపై ఉంటుందని, పూర్తి వివరాలకు 89770 31068 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
ఉపాధి @ అమీర్‌పేట్
అమీర్‌పేట్...కేరాఫ్ అమెరికా! ఔను...ఏ మారుమూల గ్రామం నుంచి ఎవరైనా ‘సాఫ్ట్’గా అమెరికా వెళ్లారంటే వయా అమీర్‌పేటే. ఇక్కడ ‘శిక్షణ’ పునాది వేసుకుంటే అమెరికా ప్రయాణం ఖాయమైనట్టు. యువతను సానబెడుతూ సాఫ్ట్వేర్ దిగ్గజాలను తయారుచేసే కేంద్రం అమీర్‌పేట్ అంటే అతిశయోక్తి కాదు. వాణిజ్య, వ్యాపార, విద్యా, రెసిడెంట్స్.. ఇలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో విరాజిల్లుతోంది. ఒక నగరం.. ఒక రాష్ర్టం.. ఒక ప్రాంతంతో నిమిత్తం లేకుండా అంతర్జాతీయంగా ఇక్కడి నుంచి లావాదేవీలు జరుగుతుంటాయి. ‘అమీర్’పేటను నమ్ముకుంటే అమీరులవుతారని అంటుంటారు కొందరు. అందుకేనేమో అందరి చూపు ఇటు వైపే. చిరువ్యాపారి నుంచి కోట్లలో వ్యాపారాలు చేసే వారికి ఈ ప్రాంతం ఓ వేదిక. నిరుపేద నుంచి సంపన్నవర్గాల వరకు అవసరమైన ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది. - సనత్‌నగర్ నల్లభై ఏళ్ళ క్రితం అమీర్‌పేట ఒక మామూలు ప్రాంతం. పల్లెటూరు వాతావరణం దాని సొంతం. అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉండే పెంకుటిల్లు. హోయ్...హోయ్...అంటూ గేదెల చావిళ్ల వద్ద సవ్వడి...అక్కడక్కడ చిన్న చిన్న దాబాలు...రారమ్మని ఆహ్వానించే ఢిల్లీ మిఠాయి దుకాణం...ప్రధాన రోడ్డు పక్కనే ఉడిపి హోటల్..సమీపంలో కూడా కంటికి కనిపించని ఎర్రబస్సులు...బస్సు కూడా దూరని దారులు...విజయలక్ష్మి గుడి.. శీష్ మహల్ థియేటర్...ఇవీ 40 ఏళ్ల క్రితం అమీర్‌పేట్‌లోని దృశ్యాలు. అంతకమునుపే అమీర్‌పేట్ కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. క్రమేపీ రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది. భాగ్యనగరానికి సెంటర్ పాయింట్ అయ్యింది. నగరం నడిబొడ్డున ఉండడం చేత అమీర్‌పేట దశ మారింది. అలనాడు పచ్చదనంతో నిండిన అమీర్‌పేట్ ఇప్పుడు జనాల సందడితో బిజీగా మారిపోయింది. అన్ని రంగాలకు కేంద్ర బిందువుగా.. నెమ్మది నెమ్మదిగా పెంకుటిళ్లు మాయమయ్యాయి. ఆకాశహారా్మ్యాలను తలపించే భవన సముదాయాలు వెలిశాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు అనువైన ప్రాంతంగా మారింది. ఒక్కొక్కటిగా కార్పొరేట్ సంస్థలు పాగా వేశాయి. పేరెన్నికగన్న వస్త్ర దుకాణాలు, ఆటోమొబైల్స్, హోటల్స్, విద్యా సంస్థలు, పారిశ్రామికం, సాఫ్ట్వేర్, సూపర్ మార్కెట్లు, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని రంగాల వ్యాపారులు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ వచ్చారు. ఆయా రంగాల్లో శిక్షణ, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చే వారికి సందడిగా ఉంటుంది. చిరువ్యాపారాలకు కేరాఫ్‌గా... ఒకవైపు బడా వ్యాపారుల కల్చర్...మరోవైపు చిరువ్యాపారుల బతుకుబండిని అమీర్‌పేట్ నడిపిస్తోంది. చాయ్...చాట్...చైనీస్ ఫుడ్....టిఫిన్ బండ్లు...ఇలా ఎన్నో రకాల చిరు వ్యాపారాలకు అమీర్‌పేట్ సెంటర్ అయ్యింది. ఇక్కడకు సామాన్యుడి నుంచి కుబేరుల వరకు వచ్చి రుచులను ఆస్వాదిస్తూనే ఉంటారు. సాయంత్రమైందంటే ఆయా సెంటర్ల వద్ద సందడి అంతా ఇంతా కాదు. ఈ చిరువ్యాపారాలు కోట్లలో ఉంటాయన్నది సుస్పష్టం. -
నావన్నీ కోతి పనులే..
హిమజ, యాంకర్, నటి విజయవాడలో అమ్మమ్మ వాళ్లింట్లో పుట్టాను. చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే పెరిగాను. అన్నయ్య మాత్రం అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగాడు. నాన్న ఆర్టీసీలో మేనేజర్. అమ్మ హౌస్‌వైఫ్. నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరి. హాలీడేస్‌లో అన్నయ్య హైదరాబాద్ రాగానే ఎంతో ఎగ్జైట్ అయ్యేదాన్ని. ఒకసారి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు సడన్‌గా కనిపించకుండా పోయాను. అప్పుడంతా నా కోసం ఊరంతా వెతికారు. ఒకచోట టెంట్ వేసి ఫంక్షన్ చేస్తున్నారు. అక్కడి వరకు వెతుక్కుంటూ వస్తే, అక్కడ దొరికాను. విషయమేమిటంటే, నేను పెద్ద ఫుడీని. ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ వాలిపోయేదాన్ని. చదువు విషయానికొస్తే, లాస్ట్ బెంచర్స్ వరస్ట్ బ్యాచ్‌కి లీడర్ని. క్లాస్రూమ్ లో అందరి బాక్సుల్లోని లంచ్ కొంచెం కొంచెం తినేసేదాన్ని. స్పోర్ట్స్‌లో కబడ్డీ, టెన్నికాయ్ చాలా ఇంటరెస్ట్. చిన్నప్పుడు.. ఆదిత్య 369లో లాగా ఒక టైమ్ మెషిన్ తయారు చేసేయాలని అనుకునేదాన్ని. అయితే, నావన్నీ కోతి పనులే కదా! మా ఇంటి చుట్టుపక్కల ఎవరి పెళ్లి బారాత్ జరిగినా, తీన్మార్ బ్యాండు వినిపిస్తే చాలు, వెంటనే డ్యాన్స్ చేయడానికి వెళ్లిపోయేదాన్ని. ఇంట్లో చెప్పకుండా ఆడిషన్‌కి వెళ్లా.. ఎంబీఏ వరకు చదివి అమీర్‌పేటలోని మైత్రీవనంలో జావా, ఒరాకిల్ వంటి కోర్సులన్నీ చేశా. నాకు నటనంటేనే ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా..ఓసారి మయూరి ఆఫీసుకి వెళ్లి ఆడిషన్ ఇచ్చి వచ్చాను. రెండు రోజుల్లోనే ఫోన్ కాల్.. ‘భార్యామణి’ సీరియల్లో హీరోయిన్గా సెలక్ట్ అయ్యానని.. అలా స్వయంవరం సీరియల్లో, టీవీ షోస్‌లో అవకాశాలు వచ్చాయి. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్లో లీడ్ రోల్ చేస్తూ, ‘ద బెస్ట్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ది ఇయుర్-2014’గా ఎంపికయ్యాను. తాటాకు టపాకాయలు కాల్చేదాన్ని.. మేం హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎల్బీ నగర్లో ఉండేవాళ్లం. దీపావళికి తాటాకు టపాకాయలు బాగా కాల్చేదాన్ని. ఇప్పుడు నన్ను చూసుకుని మా పేరెంట్స్ ఎంతో గర్వపడుతున్నారు. సంప్రదాయంగా ఉండటానికే ఇష్టపడతాను. సాయిబాబాను అనుక్షణం నమ్ముతాను. నా డ్రెసెస్ నేనే డిజైన్ చేసుకుంటాను. ఇక హైదరాబాద్ సిటీ అంటే, నాకు నా తండ్రి అంత భరోసా. యాక్టింగ్‌కి, కెరీర్‌కి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ అని భావిస్తాను. - చల్లపల్లి శిరీష -
మిస్డ్‌కాల్ పరిచయం.. ఆపై మోసం
హైదరాబాద్: మహిళకు మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఉమ(28) వనస్థలిపురంలో ఉంటోంది. పంజగుట్టలో కంప్యూటర్ కోర్సు చేస్తున్న ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన యశ్వంత్ చౌదరి (25)తో ఈమెకు మిస్డ్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఉమకు గతంలోనే వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. కాగా, ఇద్దరూ తరుచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇదిలా ఉండగా, పది రోజుల క్రితం ఆమె తన పిల్లల్ని పుట్టింట్లో వదిలి యశ్వంత్ వద్దకు వచ్చేసింది. వారం పాటు గడిపిన యశ్వంత్ మూడు రోజుల క్రితం ఆమెను అమీర్‌పేటలోని ఓ హాస్టల్లో వదలి వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన ఉమ సోమవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. పది రోజులుగా తన కొడుకు ఆ చూకీ లభించలేదని యశ్వంత్ తండ్రి పాపారావు మూడు రోజుల క్రితం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
గ్రేట్ వే టూ అమెరికా.. ఐటీకి ‘మైత్రీ’వనమ్
ఓ ఐటీ ఉద్యోగి గర్వంగా ఫీలవుతాడు తాను మైత్రీవనం బ్రీడ్నని. ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి నమ్మకం.. మైత్రీవనం వెళ్తే యూఎస్ స్టాంపింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకోవచ్చని. సిటీకి సంబంధించినంత వరకూ యునెటైడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట్ యూఎస్ఏ అయితే.. అందులో ఓ ఆరంతస్తుల బిల్డింగ్.. గేట్ వే ఆఫ్ అమెరికాగా నిలిచింది. పాతికేళ్ల కిందట నగరానికి సైబర్ కనెక్టివిటీ అంటే ఏంటో తెలియని రోజుల్లో అది పురుడు పోసుకుంది. అదే.. మైత్రీవనం! లక్షలాది మంది కలలను నిజం చేస్తున్న భవనం!! పాతికేళ్ల కిందట చుట్టూ పచ్చదనం పరుచుకుని.. ఓ చెరువు నిండుగా కళకళలాడుతుండేది. ఆ పచ్చని పరిసరాల్లో వెలసిన ఓ భవంతికి అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ‘మైత్రీవనం’గా నామకరణం చేశారు. కొత్త భవిష్యత్తుకు నేనున్నానని ఊతమిచ్చే ఆ భవంతి చుట్టూ కాంక్రీట్ మేటలు పరుచుకున్నా.. ఆ మైత్రి మాత్రం చెక్కుచెదరలేదు. అమీర్‌పేటలోనే కాదు.. అమెరికాలోనూ తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ఐటీ హబ్‌గా విరాజిల్లుతోంది. ఫస్ట్ టర్న్ ఆన్ ఇక్కడే హైదరాబాద్‌లో మొదట కంప్యూటర్ ఆపరేట్ అయ్యింది ‘మైత్రీవనం’లోనే. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్టీపీ) పుట్టింది ఇక్కడే. ఇప్పటి వరకు ఈ వనం నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య పది లక్షలకు పైమాటే. ఈ బిల్డింగ్‌లో దాదాపు యాభై ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకున్న ప్రతిఒక్కరూ ఇక్కడ అక్షరాభ్యాసం చేయాల్సిందే. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులకు మైత్రీవనం భరోసా ఇస్తుంది. కొత్త మిత్రులను పరిచయం చేస్తుంది. ఉదయం పదిన్నర సమయంలో ఈ బిల్డింగ్ లోనికి వెళ్లాలంటే ఓ పావుగంట వెయిట్ చేయాల్సిందే. క్లాసులు ముగించుకొని బయటకు వచ్చే విద్యార్థులతో బిల్డింగ్ పరిసరాలు తిరునాళ్లను తలపిస్తాయి. ఇక్కడ శిక్షణతో ఐటీ హబ్‌లో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అమీర్‌పేట్ టు అమెరికా ‘అమీర్‌పేట్ టు అమెరికా’ అనే మాట మైత్రీవనం వల్లే అంటారు ఇక్కడి వారు. ‘ ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు బిల్డింగ్ మొత్తం విద్యార్థులతో కిటకిటలాడుతుంటుంది. ఇక్కడే మూడు క్యాంటీన్లు, చిన్న సైజు షాపింగ్ మాల్స్, రైల్వే, ఎల్ఐసీ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ భవనంలో స్థలం లేక చుట్టుపక్కల సందుల్లో కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వందలాదిగా వచ్చేశాయి’ అని చెప్పారు ‘మైత్రీవనం’ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇంజనీర్ సరోజ. విదేశీ విద్యార్థులతో మైత్రి మైత్రీవనం హైదరాబాదీలకో, ఇతర రాష్ట్రాల విద్యార్థులకో మాత్రమే నేస్తం కాదు.. ఇక్కడ ట్రైనింగ్ కోసం విదేశీ విద్యార్థులూ ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు తొంభై దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. కోర్సుల ఫీజులు తక్కువగా ఉండటం, సౌకర్యవంతంగా ఉండటంతో ఇంజనీరింగ్ విద్యార్థులు మైత్రీవనానికి క్యూ కడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడంలో మైత్రీవనం ఇన్స్టిట్యూట్లు నంబర్ వన్. అమెరికాలో ఏ కొత్త సాఫ్ట్వేర్ రిలీజ్ అయినా.. రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చేస్తుంది. ‘ మార్కెట్ డిమాండ్‌ను బట్టి దూసుకెళ్లే ఇన్స్టిట్యూట్లకు మైత్రీవనం కేరాఫ్ అడ్రస్’ అని జూమ్ టెక్నాలజీకి చెందిన శివ చెప్పారు. ఇక కొండపల్లి శేషగిరిరావు వేసిన కళాఖండాలు ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చెట్లూ కొట్టేస్తారట మైత్రీవనం భవనం నిర్మించిన తొలినాళ్లలో ఇక్కడ ఇన్ని భవనాలు, ట్రాఫిక్ ఉండేది కాదు. దీని వెనుక ఒక చెరువు ఉండేది. బోలెడన్ని చెట్లుండేవి. ఇప్పుడు చెట్ల మాట దేవుడెరుగు.. అడుగు పెడదామంటే జానెడు భూమి కూడా లేదు. మెట్రో రైలు మార్గం పనులతో ఇప్పుడున్న నాలుగు చెట్లకూ కాలం చెల్లే పరిస్థితి ఏర్పడింది. మెట్రో గుర్తులు చూస్తున్నారుగా.. అదిగో ఆ తాటిచెట్టును కూడా కొట్టేస్తారట. దాని చుట్టూ అందంగా లాన్‌లా అలంకరించుకున్నాం. రేపో మాపో కూలిపోతుందంటే బాధగా ఉంది.‘మైత్రీ’ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు కొందరు ఆ భవనం పరిధిలోని తాటిచెట్టు వద్దకొచ్చి ఫొటోలు తీయించుకుంటున్నారు. - ఎన్.రామకోటేశ్వరరావు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు వానొచ్చెనంటే వరదే ఇన్ని ప్రత్యేకతలున్న మైత్రివనానికి ఓ మచ్చ. భవనం చుట్టూ కాంక్రిట్ జంగిల్ పెరిగిపోవడంతో నీటి బొట్టు ఇంకే దారిలేదు. వర్షాకాలంలో వరద నీరు చేరి సెల్లార్‌లోని వాహనాలు పడవల్లా మారిపోతుంటాయి. బిల్డింగ్ బయట రోడ్లు నాలాలను తలపిస్తాయి. ఈ ఇబ్బందులు పక్కన పెడితే మైత్రీవనం విద్యార్థుల కలలు తీర్చే చక్కటి వేదిక. - భువనేశ్వరి ఫొటోలు: సృజన్ పున్నా -
ఐటీ కోర్సులు: అమీర్‌పేట్!
టాప్ స్టోరీ: పదోతరగతి విద్యార్థి నుంచి పట్టభద్రుల వరకు... బేసిక్ కోర్సుల నుంచి సర్టిఫికేషన్ల వరకు... ఎనీ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ కోర్సుల కూడలి... అమీర్‌పేట్!! హైటెక్ సిటీ నిర్మాణానికి ముందు ఐటీ హబ్‌గా వెలుగులీనిన ఈ ప్రాంతం తర్వాత ఐటీ కోర్సుల శిక్షణ శిబిరంగా మారింది. ఆధునిక ప్రపంచానికి అవసరమైన సాంకేతిక సైనికులను తీర్చిదిద్దుతోంది!! సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌తోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు కనే ప్రతి ఒక్కరికీ పరిచయం అక్కర్లేని ప్రాంతం అమీర్‌పేట. వందల సంఖ్యలో ఇన్స్టిట్యూట్లతో, వేల మంది విద్యార్థులతో వీధులన్నీ నిత్యం కోలాహలంగా ఉంటాయి. అంగుళం ఖాళీ లేకుండా భవనాల గోడల నిండా భారీ హోర్డింగులు, బ్యానర్లు దర్శనమిస్తాయి. రోడ్లన్నీ సాయంత్రం సమయానికి కరపత్రాలతో తివాచీ పరచినట్లు కనిపిస్తాయి. అర్హతలేవైనా... వయసెంతైనా... ఇక్కడ అందుబాటులో ఉండే ఐటీ కోర్సులు అనేకం. ఇక్కడి కోచింగ్ సంస్థలు.. సాఫ్ట్వేర్ పరిశ్రమ డిమాండ్‌కు తగిన కోర్సుల్లో శిక్షణ ఇస్తూ సగటు విద్యార్థుల సమున్నత కెరీర్ అవకాశాలకు అండగా నిలుస్తున్నాయి. ‘హైదరాబాద్ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాను. కోర్సు పూర్తై కొలువు దక్కలేదు. స్నేహితులు, సీనియర్ల సలహా మేరకు అమీర్‌పేటలో టెస్టింగ్ టూల్స్ కోర్సులో చేరాను. ఎలాగైనా ఆర్నెల్లలో ఉద్యోగం సంపాదిస్తాననే నమ్మకం ఏర్పడింది’ అంటున్నాడు ఏడాది క్రితం బీటెక్ పూర్తిచేసిన మహేందర్. అమీర్‌పేట పరిసరాల్లోకి అడుగుపెట్టిన విద్యార్థిలో మానసిక స్థైర్యంతోపాటు భవిష్యత్తుపై ధీమా కూడా ఏర్పడుతుందనేందుకు ఇలాంటి ఉదాహరణలెన్నో. ఎవరెవరికి ఏ కోర్సులు: అకడమిక్ బ్యాగ్రౌండ్ ఏదైనా విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ కోర్సుల్లో చేరుతున్నారు. కంపెనీలు కూడా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫాంలో నైపుణ్యాలను పరీక్షిస్తూ, అకడమిక్ ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఉదాహరణకు బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, బీఎస్సీ.. వీటిలో ఏ కోర్సునభ్యసించినవారైనా సీ, సీ++, జావా, డాట్నెట్, ఒరాకిల్, ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్ పీహెచ్, హడూప్, షేర్‌పాయింట్, జెక్వెరీ, హెచ్‌టీఎంఎల్5 సీఎస్ఎస్3, ఎంవీసీ, డబ్ల్యూఎఫ్, లినక్స్, మైక్రోసాఫ్ట్ సర్వర్స్, సిస్కో రూటర్స్, వీఎంవేర్ మొదలైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కోర్సులతోపాటు ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ అప్లికేషన్లనూ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. బీకామ్ విద్యార్థులు టాలీ తదితర అకౌంటింగ్ కోర్సుల్లోనూ చేరుతున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విద్యార్థుల కోసం వీఎల్ఎస్ఐ డిజైన్, క్యాడ్/క్యామ్ తదితర కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ‘అమీర్‌పేటలో కోర్సులు నేర్చుకున్న వారు ప్రపంచంలో ఎక్కడైనా తమ సత్తా నిరూపించుకోగలరు. అమెరికా తదితర దేశాలకు వెళ్లాలనుకునే వారు ఇక్కడికే వచ్చి అవసరమైన కోర్సుల్లో శిక్షణ పొందుతారు. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకుంటే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం షేర్‌పాయింట్ - 2013 కోర్సుకు డిమాండ్ ఉంది’ అని పీర్స్ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్ ఆపరేషన్స్ హెడ్ ఎన్.రామకోటేశ్వరరావు తెలిపారు. అమీర్‌పేటే ఎందుకు? హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లిలో కూడా మంచి ఇన్స్టిట్యూట్లు, కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థులు అమీర్పేటకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దేశంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి మొదలైన తొలినాళ్లలో సాఫ్ట్వేర్ నిపుణులకు, కోర్సులకు విస్తృత డిమాండ్ ఉండేది. ఆ సమయంలోనే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ), హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనం భవనంలో ఏర్పాటు చేశారు. ఎస్టీపీఐ అనుమతులు పొందినవారు చుట్టు పక్కల ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్స్లోని అన్నపూర్ణ, నీలగిరి బ్లాకుల్లో చిన్న ఇన్స్టిట్యూట్లను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి వివిధ ఐటీ కోర్సులను అభ్యసించేవారు. దాంతో అమీర్‌పేట ఐటీ శిక్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. తర్వాత కాలంలో ఎస్టీపీఐ మాదాపూర్‌లోని సైబర్ టవర్స్‌లోకి మారినప్పటికీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఇక్కడే కొనసాగాయి. ప్రస్తుతం అమీర్‌పేటలో ఇన్స్టిట్యూట్ల సంఖ్య 600లకు పైనే ఉంటుంది. పోటీ వాతావరణం నెలకొనడంతో ఇన్స్టిట్యూట్లు వీలైనంత తక్కువ ఫీజులకే కోర్సులను ఆఫర్ చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఫీజులు: ఒక్కో ఇన్స్టిట్యూట్లో ఒక్కో కోర్సుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫీజులు కూడా ఇన్స్టిట్యూట్లను బట్టి మారుతుంటాయి. రూ.300 నుంచి రూ.15000 వరకు అమీర్‌పేటలో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ అర్హతలు, అభిరుచులకు తగిన కోర్సులను ఎంపిక చేసుకోవాలి. విదేశీ విద్యార్థులు- మెచ్చిన కోర్సులు అమీర్‌పేట్‌లో అందుబాటులో ఉండే కొన్ని ప్రత్యేక కోర్సులు నేర్చుకోవడానికి విదేశీ విద్యార్థులు కూడా క్యూ కడుతుంటారు. కెన్యా, లైబీరియా, మాల్దీవులు, మెక్సికో, నేపాల్, నైజీరియా, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా, దక్షిణ సుడాన్, థాయిలాండ్, ఉగాండా, జాంబియా తదితర దేశాల నుంచి ఇక్కడికి కోర్సులనభ్యసించడానికి వస్తుంటారు. ఇన్స్టిట్యూట్, కోర్సు ఎంపికలో జాగ్రత్తలు: - మార్కెట్ ట్రెండ్‌కనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సును ఎంచుకోవాలి. - కోర్సు పూర్తయ్యాక ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలుసుకోవాలి. ఆయా సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తి ఉంటేనే కోర్సుల్లో చేరాలి. - కోర్సు కాలపరిమితిని దృష్టిలో ఉంచుకోవాలి. సదరు కోర్సును తక్కువ కాలవ్యవధుల్లో ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లో చేరేముందు, ఆ పరిమిత కాలంలో పూర్తి నైపుణ్యాలు సాధించగలరో లేదో విశ్లేషించుకోవాలి. - ఇన్స్టిట్యూట్లో ల్యాబ్స్, ఇతర సౌకర్యాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. - చేరాలనుకుంటున్న ఇన్స్టిట్యూట్ పాటించే ప్రమాణాలు, ఫ్యాకల్టీ అనుభవం తదితర అంశాలను స్నేహితులు, సీనియర్ల ద్వారా తెలుసుకోవాలి. క్వాలిటీ కోచింగ్ గత మూడేళ్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం స్తబ్దుగా ఉండడంతో కొన్ని కోర్సులకు ఆదరణ తగ్గింది. అయితే ఐటీ రంగం మళ్లీ ఊపందుకోనున్న నేపథ్యంలో ఐటీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. తక్కువ కాస్ట్‌తో క్వాలిటీ కోచింగ్ అందించడం అమీర్‌పేట ప్రత్యేకత. - కె. శివ కుమార్, జీఎం, ఎడ్యుకేషన్ అకాడెమీ, జూమ్ టెక్నాలజీస్ మెయిన్ ఫ్రేమ్స్‌తో లైఫ్ టర్నయింది నేను 2009లో ఎంసీఏ పూర్తి చేశాను. రెసిషన్ సమయం. కొలువు సాధించలేనేమోనని ఆందోళన చెందేవాడిని. అమీర్‌పేటలోని ఓ ఇన్స్టిట్యూట్లో ఐబీఎం మెయిన్‌ఫ్రేమ్స్ కోర్సులో చేరా. నెల తిరగకముందే హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించా. వృత్తిలో భాగంలో ఆన్సైట్ ద్వారా యూకేలో ఏడాదిపాటు పనిచేశా. ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను. అమీర్‌పేటలో లభించే డిమాండ్ ఉన్న కోర్సుల్లో చేరితే సులువుగా ఉద్యోగం పొందొచ్చు. - వి. సురేశ్ రెడ్డి. కుంట్లగూడెం, నల్గొండ -
అమీర్ పేట్ లో అంజలి సందడి
-
పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం
అభిమాన నటుడు సమయానికి రాలేదని కన్నెర్ర కుర్చీలు ధ్వంసం.. స్టేజి పైకి రాళ్లు పోలీసుల లాఠీచార్జి.. తొక్కిసలాట సనత్‌నగర్, న్యూస్‌లైన్: జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులు చుక్కలు చూశారు. పవన్ నిర్ణీత సమయానికి అమీర్‌పేట సత్యం థియేటర్ వద్ద జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఓపిక నశించిన అభిమానులు చేతికందిన వస్తువులను నేలకేసి కొట్టి హంగామా సృష్టించారు. పవన్‌కళ్యాణ్ సత్యం థియేటర్ వద్దకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు వస్తారని స్థానిక నేతలు ప్రచారం చేశారు. దీంతో అమీర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటూ హాస్టల్లో ఉండే యువకులు పెద్దసంఖ్యలో మూడు గంటలకే వేదిక వద్దకు చేరుకున్నారు. రాత్రి 9 అయినా పవన్ రాలేదు. ఇదిగో ఇప్పుడే వస్తున్నారంటూ నిర్వాహకులు ఎప్పటికప్పుడు చెబుతూ అక్కడికి హాజరైన వారికి సర్దిచెబుతూ వచ్చారు. ఎంతకీ రాకపోయేసరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కుర్చీలను నేలకేసి కొట్టారు. ఇంకొందరు వాటర్ ప్యాకెట్లను, కట్టెలను, రాళ్లను అందుకుని స్టేజీ మీదకు విసిరారు. పోలీసులు వారిపై లాఠీచార్జీకి దిగారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు కిందపడిపోయారు. యువతులు, అభిమానులు బతుకుజీవుడా అంటూ తలోదిక్కుకు పరుగులు తీశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు 9.10 నిమిషాలకు పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యారు. తెగిన కరెంటు వైర్... త్రుటిలో తప్పిన ప్రమాదం తొక్కిసలాటలో విద్యుత్ తీగలు తెగిపోయాయి. స్టేజీకి ఏర్పాటుచేసిన లైట్లు ఆరిపోవడంతో విషయాన్ని తెలుసుకుని వెంటనే అక్కడే ఉన్న ఎలక్ట్రీషియన్ అప్రమత్తమై సరఫరా నిలిపివేశారు. దీంతో ముప్పు తప్పింది. అయితే, రాత్రి 9.10 గంటలకు వచ్చిన పవన్‌కళ్యాణ్ ఐదంటే ఐదే నిమిషాల పాటు మాట్లాడి వెళ్లిపోవడం స్థానికులను నిరుత్సాహానికి గురిచేసింది. -
చేతివాటం చూపిన కిలేడీలు
-
పేద క్రీడాకారుల కోసం...
నేడు టి10 క్రికెట్ మ్యాచ్ అమీర్‌పేట్, న్యూస్‌లైన్: ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు ఏఐసీపీ సంస్థ ముందుకొచ్చింది. ఏఐసీపీ అంటే ఎనీ ఇండియన్ కెన్ ప్లే (భారతీయులెవరైనా ఆడగలరు). ఇందులో భాగంగా టి10 క్రికెట్ మ్యాచ్ నిర్వహించి నిధులు సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏఐసీపీ అధ్యక్షుడు కైలాశ్ విజయ్‌వర్గీ వెల్లడించారు. బుధవారం కులీకుతుబ్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమం మంగళవారం స్థానిక హోటల్లో జరిగింది. ఇందులో సినీతారలు తనూష, మధులగ్నదాస్లతో పాటు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ మ్యాచ్ ద్వారా సమకూరిన నిధుల్ని పేద క్రీడాకారులకు అందజేస్తామని కైలాశ్ తెలిపారు. ఆటగాళ్లు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఏఐసీపీ తోడ్పాటునందిస్తుందన్నారు. మ్యాచ్ వివరాలను ఆయన వెల్లడిస్తూ... సాధారణ క్రికెట్ మ్యాచ్‌లకు భిన్నంగా ఈ మ్యాచ్ ఉంటుందన్నారు. ఓవర్‌కు ఎనిమిది బంతులు, తుది జట్టుకు పది మంది ఆటగాళ్లు ఆడతారని చెప్పారు. పదేసి ఓవర్ల చొప్పున మ్యాచ్ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సినీ తారలు తనూష, మధులగ్నదాస్లు తమ చిన్ననాటి క్రీడల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విశాల్ అగర్వాల్, దీపక్ అశ్వ, సంకేత్ షా, హిరేన్ గజ్జార్ తదితరులు పాల్గొన్నారు.