రద్దీగా ఉన్న అమీర్‌పేట్–పంజగుట్ట ప్రధాన రహదారి
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట ప్రధాన రహదారిలో ప్రారంభమైన ట్రాన్స్‌కో 132 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ నిర్మాణ పనుల కారణంగా అమీర్‌పేట నుంచి పంజగుట్ట నిమ్స్ వరకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 24 నుంచి మే 31వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు.
మళ్లింపు ఇలా...
సంగారెడ్డి, జహిరాబాద్, పటాన్‌చెరువు వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పంజగుట్ట నుంచి అనుమతించరు. కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ క్రాస్ రోడ్, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బంద్‌జంక్షన్, బాలంరాయి జంక్షన్,ప్యారడైజ్ హోటల్ ఎంజీ రోడ్, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
పఠాన్‌చెరువు, మియాపూర్, కూకట్‌పల్లి నుంచి వచ్చే ఆంధ్ర, రాయలసీమ ప్రైవేట్ బస్సులు అమీర్‌పేట, పంజగుట్ట వైపు అనుమతించరు. మైత్రివనం వద్దే మళ్లించి ఎస్‌ఆర్‌నగర్ గౌతండిగ్రీ కాలేజీ వద్ద యూ టర్న్ తీసుకొని అక్కడే ప్రయాణికులను ఎక్కించుకోవాల్సి ఉంటుంది.
సిటీ బస్సులు, లారీలు, పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ట్యాంకులు, పటాన్ చెరువు, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి నుంచి ఖైరతాబాద్ వెళ్లాలంటే ఎస్‌ఆర్‌నగర్ చౌరస్తాలో ఉమేష్ చంద్రా విగ్రహం వద్ద ఎడమ వైపు తీసుకొని కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్‌బి సిగ్నల్, సోనాబాయి టెంపుల్, అమీర్‌పేట్, బీకే రోడ్డు, కాకతీయ హోటల్, సోమాజిగూడ రాజీవ్‌గాంధీ విగ్రహం చౌరస్తా వద్ద ఎడమ వైపు తీసుకొని రాజ్‌భవన్ రోడ్డులో ఖైరతాబాద్ జంక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment