Panjagutta
-
బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్రరావుపై కేసు
-
ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్‌రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్‌గౌడ్ హరీశ్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్‌ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్‌రావుపై ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్‌షీట్: హరీశ్‌రావు -
HYD: పంజాగుట్టలో కారు బీభత్సం.. హోంగార్డును ఈడ్చుకెళ్లి..
సాక్షి,హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం(నవంబర్ 8) ఉదయం కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఆపకుండా దూసుకెళ్లాడు. కారు ఆపిన హోంగార్డును కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పంజాగుట్టలో కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్‌లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా నాగార్జున సర్కిల్ వద్ద హోంగార్డ్ రమేష్ ఓ కారును ఆపాడు. అయితే కారును ఆపకుండా హోం గార్డు రమేష్‌ని కారు డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడి ఆపకుండా ఈడ్చుకెళ్లాడు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో చోరీ.. పోలీస్‌స్టేషన్‌కు ప్రయాణికులు -
గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
-
పంజాగుట్ట డ్రగ్స్ కేసు: స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రముఖల పేర్లు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట డ్రగ్స్ కేసు నిందితుడు స్టాన్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్‌తో స్టాన్లీ పట్టుబడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పలువురు ఏజెంట్లను స్టాన్లీ రిక్రూట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్‌లో ప్రముఖల పేర్లు ఉండటం గమనార్హం. స్టాన్లీ డ్రగ్స్ లింక్స్.. పోలీసుల కస్టడీ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతునన్నాయని పోలీసులు పేర్కొన్నారు. అతనికి నైజీరియాలో డ్రగ్స్ తయారీదారులతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మందితో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ అప్డేట్
-
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం
-
దుబాయ్ పారిపోయిన సోహిల్..పంజాగుట్ట సీఐ సస్పెండ్
-
పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడింది. ప్రమాదం తర్వాత సోహైల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోహైల్‌ను అదుపులోకి తీసుకోవడంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పీఎస్‌కు వచ్చారు. షకీల్ కొడుకును విడిపించుకుపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోహైల్‌కు బదులు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంట్లో పనిమనిషి అబ్దుల్ అసిఫ్‌ను కేసులో పోలీసులు చేర్చారు. ప్రమాద సమయంలో కారు అబ్దుల్ నడిపినట్లు కేసు నమోదు చేశారు. దుబాయ్ నుంచి షకీల్ ఈ వ్యవహారం అంతా నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పంజాగుట్ట సీఐ దుర్గారావుకు అస్వస్థతకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో సీఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఐను బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్‌తో రాత్రి ఫోన్ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కాగా షకీల్ కొడుకు కారుతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను ఆయన ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. అయితే సోహైల్‌ను తప్పించి మరొకరు డ్రైవ్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ విచారణకు ఆదేశించారు.షకీల్ కొడుకు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. షకీల్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కొడుకు సోహైల్‌గా తేల్చారు. అయితే ఎఫ్ఐఆర్లో మరొకరి పేరు చేర్చారు. దీంతో నిందితుడు సోహైల్‌కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రమాద సమయంలో సోహైల్‌తోపాటు ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎందుకు చేయలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సోహైల్‌కు సహకరించి తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
పంజాగుట్టలో భారీ అగ్ని ప్రమాదం
-
పంజాగుట్టలోని శ్మశానవాటికలో జరగనున్న చంద్రమోహన్ అంత్యక్రియలు
-
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
టీబీజెడ్‌లో ‘మంగళ 2023 కలెక్షన్’
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ టీబీజెడ్ ‘మంగళ 2023 కలెక్షన్’ ఆవిష్కరించింది. పంజాగుట్ట షోరూంలో నిర్వహించిన వరలక్ష్మి వ్రతం వేడుకలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈ కొత్త కలెక్షన్ విడుదల చేసింది. ‘‘భారతదేశ సంస్కృతి స్ఫూర్తితో తీర్చిదిద్దిన ఈ బంగారు వజ్రాభరణాలు ఏ సందర్భంలో ధరించినా ప్రత్యేకత చాటుతాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అని రకుల్ తెలిపారు. పంజాగుట్ట స్టోర్ పునః ప్రారంభంతో భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని టీబీజెడ్ మార్కెటింగ్ ఆఫీసర్ అభిõÙక్ మాలూ ఆశించారు. -
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం.. 15 బృందాలతో దాడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా 2020 జనవరిలో మలినేని సాంబశివరావు కంపెనీపై సీబీఐ దాడులు జరిపింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ నుంచి ట్రాన్స్ ట్రాయ్ సింగపూర్ లిమిటెడ్‌కు నిధులు బదిలీ అయ్యాయన్న ఆరోపణలతో సోదాలు జరిపింది. దీంతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడి అభియోగం మోపింది. యూనియన్ బ్యాంక్ నుండి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రూ. 300 కోట్ల రూపాయల రుణాలు పొందగా.. తిరిగి ఆ రుణాలు చెల్లించకపోవడంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ. 260 కోట్ల రూపాయలను ఇతర కంపెనీకి మళ్ళీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. లోన్ కోసం తీసుకున్న డబ్బులను బంగారం, వెండి ఆభరణాలకు ఖర్చు చేశారంటూ ఆరోపించింది. 2013లో ట్రాన్స్ ట్రాయ్‌ను కెనరా బ్యాంక్ ఆడిట్ చేసింది. అప్పటినుంచి బ్యాంక్‌ల లిస్ట్‌లో నాన్ పర్ఫామింగ్ అసెట్‌గా మారింది ట్రాన్స్ ట్రాయ్. ఇక ఇదే కంపెనీకి మలినేని సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. చదవండి: సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి -
మెట్రో స్టేషన్ల కిందా తాగుడే!
హైదరాబాద్: బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లే కాకుండా ఇప్పుడు మెట్రోస్టేషన్ల కింద కూడా తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారని నగరానికి చెందిన టీఏవీ శ్రీనివాస్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. పంజగుట్ట మెట్రో స్టేషన్ కింద ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న దృశ్యాలను తన సెల్ఫోన్లో బంధించి తన ట్వీట్‌తో జతపరిచారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. This is the current situation near Punjagutta @HyderabadMetroR station. Request @KTRBRS to take action @TelanganaDGP @NVSReddyIRAS pic.twitter.com/mf4fPj7vuF — T A V Srinivas (@TAVSrinivas1) July 7, 2023 -
ఆర్థిక విద్యలో శిక్షణ అవసరం
పంజగుట్ట: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం బలంగా ఉన్నామంటే మన పూర్వీకులదగ్గర నుండి మనం నేర్చుకున్న, సంపాదించిన దాంట్లో కొంత దాచుకునే అలవాటు వల్లే అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. ఆదివారం రాజ్‌భవన్ సంస్కృతి హాల్లో హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ సిబ్బందికి ‘ఫైనాన్షియల్ లిట్రసీ ట్రైనింగ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. ఆర్థిక మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఆర్ధిక విద్యలో శిక్షణ ఎంతో అవసరమన్నారు. కరోనా సమయంలో రాజ్‌భవన్ మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇప్పించామని దీంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు నేను ఏదైనా సాధించవచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ తెలుగు రాష్ట్రాల రీజనల్ హెడ్ సిద్దార్ధ చటర్జీ, వైస్ ప్రసిడెంట్, సౌత్ జోనల్ హెడ్ జి.శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, ట్రైనర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ లో రెచ్చిపోయిన దుండగులు
-
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జీవో 317: ప్రగతి భవన్ వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం, కార్యాలయం అయిన ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు యత్నించారు. ఆదివారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో పంజాగుట్ట, సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. జీవో 317ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు ముట్టడికి యత్నించారు. ఫ్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ జీవో కారణంగా ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు వాపోయారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, జీవోకు సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆపై ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి ఉప్పల్ పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఇక ముట్టడి భగ్నం కాగా.. పంజాగుట్ట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317. అందుకు సంబంధించిన మార్గదర్శకాలే ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు సైతం జీవో రద్దు కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
వైఎస్సార్ సర్కిల్ వద్ద అభిమానులు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
-
Hyderabad National Book Fair: బుక్‌ఫెయిర్‌కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్‌ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
ఒక్క ప్రమాదం.. ఎన్నో పాఠాలు.. ఆ కాస్త దూరం వెళ్లలేక!
సాక్షి, హైదరాబాద్: పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం వాహనచోదకులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో స్పష్టం చేస్తోందని ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. ఆదివారం నాటికీ ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. అసలేం జరిగిందంటే... బల్కంపేటకు చెందిన విద్యార్థి యాదగిరి (22) తన ద్విచక్ర వాహనంపై, తన సమీప బంధువు అనిల్‌తో (20) కలిసి ఉప్పల్ నుంచి వస్తున్నాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన నాంపల్లి వాసి నవీన్ (31) తన బైక్పైప్రయాణిస్తూ రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నవీన్ వాహనాన్ని యాదగిరి వాహనం ఢీ కొట్టింది. ఈ ధాటికి రెండు వాహనాలూ దాదాపు వంద అడుగులు జారుకుంటూ వెళ్లాయి. దీంతో అనిల్, యాదగిరి తీవ్రంగా గాయపడగా... నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆ కాస్త దూరం వెళ్లలేక... తన వాహనంపై వస్తున్న నవీన్ ఘటనాస్థలి వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని మళ్లీ రాజ్‌భవన్ వైపు వెళ్లాల్సి ఉంది. వేగంగా వస్తున్న అతడు దాన్ని దాటి కాస్త ముందుకు వచ్చేశారు. ఇలా జరిగినప్పుడు కేవలం 500 మీటర్ల లోపు దూరంలో ఉన్న ఖైరతాబాద్ చౌరస్తా వరకు వచి్చ, అక్కడ యూ టర్న్ తీసుకుని రావాల్సి ఉంది. ఈ కాస్త దూరం ముందుకు వెళ్లడంపై నిర్లక్ష్యం వహించిన అతడు తాను ప్రయాణిస్తు మార్గంలోనే రాంగ్ రూట్లో వెనక్కు వచ్చి నర్సింగ్ కాలేజీ జంక్షన్ వద్ద నుంచి రాజ్‌భవన్ వైపు వెళ్లే రోడ్డులోకి రావాలని ప్రయత్నించారు. పరిమితికి మించిన వేగం... ఈ ప్రమాద దృశ్యాలను సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన పోలీసులు దాన్ని విశ్లేషించారు. ప్రమాదం జరిగిన సమయంలో యాదగిరి తన వాహనాన్ని అత్యంత వేగంగా నడిపినట్లు గుర్తించారు. సిటీ రోడ్లలో ఏ సమయంలోనైనా గరిష్టంగా గంటలకు 40 కిమీ వేగం మంచిది కాదు. అయితే ప్రమాద సమయంలో ఈ వాహనం గంటలకు దాదాపు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకర వేగమని చెప్తున్నారు. హఠాత్తుగా ఇటు రావడంతో... ఇంత స్పీడుగా వస్తున్న వీరి దృష్టి యూ టర్న్ వద్ద రాజ్‌భవన్ వైపు నుంచి వచ్చి యూటర్న్ తీసుకునే వాహనాలపై మాత్రమే ఉంటుంది. నిబంధనల ప్రకారం అలానే రావాలి. అయితే నవీన్ అదే రోడ్లో, రాంగ్ రూట్లో వ్యతిరేక దిశలో వచ్చి యూ టర్న్ వద్ద ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చి రాజ్‌భవన్ వైపు వెళ్లే మార్గంలో ప్రవేశించాడు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని యాదగిరి తన వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక నవీన్ వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ధాటికి ఆ వాహనం పెట్రోల్ ట్యాంక్ వద్ద వంగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. హెల్మెట్ వాడకపోవడంతోనే... ప్రమాదానికి కారణమైన, ప్రమాదానికి గురైన రెండు వాహనాలపై ఉన్న చోదకులూ హెల్మెట్లు ధరించలేదు. ఇదే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఈ రెండూ 220 సీసీ, 180 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలైనప్పటికీ చోదకులు హెల్మెట్లు ధరించలేదు. చిన్న పాటి నిర్లక్ష్యాలు, నిబంధనలు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది వాహనచోదకులకు గుణపాఠం కావాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. -
ఉద్రిక్తతల నడుమ ‘చలో రాజ్‌భవన్’
పంజగుట్ట: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వందలాదిగా సీపీఐ కార్యకర్తలు ఖైరతాబాద్ కూడలి వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ భారీ గా మోహరించిన పోలీసులు బ్యారికేడ్లు వేసి వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కార్యకర్తలు మక్తా రైల్వేగేటు మీదుగా రాజ్‌భవన్ ముట్టడికి యత్నించగా వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్ కూడలివద్ద ఆందోళనకారులు సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫెడరల్ సిస్టం, గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలి అని నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు అజీజ్ పాషా, చాడా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్‌తో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ...గవర్నర్ పదవిని అడ్డంపెట్టుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి వ్యతిరేక పార్టీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎన్‌టీఆర్‌లేని సమయంలో అప్పటి గవర్నర్ రాంలాల్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని గుర్తుచేశారు. ఇటీవల మహారాష్ట్రలో, గోవాలో అలానే జరిగిందన్నారు. ఈ నెల 29న అన్ని రాష్ట్రా ల్లో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కిలాడీ ఆటో డ్రైవర్.. పంజగుట్టకు చేరుకోగానే ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసి..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుడిని ఆటోలోంచి తోసేసిన ఓ ఆటో డ్రైవర్ సదరు వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి గూగుల్ పే ద్వారా రూ. 57 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్‌కు చెందిన పి.వీరప్రతాప్ సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23వ తేదీన ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చిన అతను అర్జెంట్‌గా మంచిర్యాల వెళ్లే క్రమంలో తెల్లవారు జామున 4:25కు ఈఎస్ఐ వద్ద సికింద్రాబాద్ వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. ఆటో పంజగుట్ట కూడలికి చేరుకోగానే ఆటోడ్రైవర్ వీరప్రతాప్‌ను ఆటోలోనుంచి బలవంతంగా బయటకు నెట్టివేసి ఆటో తీసుకుని బంజారాహిల్స్ వైపు వేగంగా వెళ్లిపోయాడు. వీరప్రతాప్ తేరుకుని కొద్దిసేపు తర్వాత చూసుకోగా అతని సెల్‌ఫోన్ కనిపించలేదు. అర్జెంట్‌గా ఊరు వెళ్లే క్రమంలో అతను మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఎటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసేందుకు చూడగా నో బ్యాలెన్స్ చూపించింది. దీంతో మంచిర్యాల యాక్సిస్ బ్యాంకులో సంప్రదించగా తన అకౌంట్ నుండి గూగుల్ పే ద్వారా 57362 రూపాయలు బదిలీ అయినట్లు నిర్ధారించారు. దీంతో తిరిగి నగరానికి వచ్చిన వీరప్రతాప్ శుక్రవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: శంషాబాద్‌లో కొత్త అంతర్జాతీయ టెర్మినల్.. 28 నుంచి కార్యకలాపాలు -
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్‌లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్‌లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్‌లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట)