సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్‌లు చేపట్టగా ఎస్‌ఆర్‌డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్‌లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్‌లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట)
Comments
Please login to add a commentAdd a comment