Traffic system
-
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్‌లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్‌లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్‌లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట) -
సీసీ'ఠీవి'గా ట్రాఫిక్..
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం.. స్వైర ‘విహారం’చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడం.. వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం.. ట్రాఫిక్ జామ్స్‌ను దాదాపు కనుమరుగు చేయడం వంటి లక్ష్యాలతో ఏర్పాటవుతున్న అత్యాధునిక వ్యవస్థ ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ట్రయల్ రన్ ప్రారంభమైంది. జూన్ వరకు ఈ వ్యవస్థ నిర్వహణలో ఉన్న ఇబ్బందులు, తలెత్తే సాంకేతిక సమస్యల్ని అధ్యయనం చేయాలని ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. వాటన్నింటినీ సరిచేయడంతో పాటు సమర్థవంతంగా అభివృద్ధి చేసి రాష్ట్రావతరణ రోజైన జూన్ 2 నుంచి పూర్తిస్థాయిలో అధికారికంగా అమల్లోకి తీసుకురావడానికి నగర ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నగరంలోని 3 పోలీసు కమిషనరేట్లలో ఉన్న 250 జంక్షన్లలో తొలి దశలో ఈ వ్యవస్థ అమలుకానుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పనిచేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) నుంచే జరగనుంది. రాత్రి వేళల్లోనూ పనిచేసే 16 మెగాపిక్సల్ కెమెరాలతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తున్న ఐటీఎంఎస్‌లో ఉండే కీలకాంశాలివి.. వాహన మార్గంపై నిఘా.. నగరవ్యాప్తంగా సంచరించే వాహనాల ట్రాకింగ్ విధానం ఐటీఎంఎస్ ద్వారా అందుబాటులోకి రానుంది. సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో తిరిగే ప్రతి వాహనాన్నీ నంబర్‌తో సహా చిత్రీకరించి సర్వర్‌లో నిక్షిప్తం చేస్తాయి. దీంతో ఓ వాహనం నగర పరిధిలో ఎక్కడెక్కడ తిరిగిందన్న వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఇక నేరానికి పాల్పడిన వాహనమో, అనుమానిత వాహనాన్ని గుర్తించి.. సత్వర చర్యలకు ఇది దోహదం చేస్తుంది. బస్సుల వివరాలూ.. సిటీలో సంచరిస్తున్న ఆర్టీసీ బస్సులు ఓ క్రమపద్ధతిలో సాగవు. ఒకే మార్గంలో వెళ్లే అనేక బస్సులు ఏకకాలంలో బస్టాప్స్ వద్దకు చేరుకుంటుంటాయి. దీనివల్ల ఆయా బస్టాప్లతోపాటు అవి వెళ్లే మార్గాల్లోనూ ట్రాఫిక్ జామ్స్ తప్పవు. దీనికి విరుగుడుగా అమల్లోకి రానున్నదే డైనమిక్ బస్ ప్లాట్‌ఫాం అసైన్మెంట్ (డీబీపీఏ) వ్యవస్థ. ఒకే మార్గంలో వెళ్లే అనేక బస్సులు ఒకే స్టాప్ దగ్గరకు వస్తుంటే.. జంక్షన్లు, బస్‌బేల్లో ఉన్న సీసీ కెమెరాలు అప్రమత్తమవుతాయి. రెండు కూడళ్ల మధ్యలోనే వాటి వేగం తగ్గించాల్సిందిగా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు సూచనలు చేస్తాయి. ఇక ప్లేటు మార్చలేరు నేరగాళ్లు, ఉల్లంఘనులు పోలీసుల్ని తప్పించుకోవడానికి అనేక ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఇతర వాహనాల నంబర్లను తమ వాహనాల నంబర్ ప్లేట్లపై వేసుకుని సంచరిస్తుంటారు. ఇలాంటి వాళ్ల ఆట కట్టించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టమ్ (ఏఎన్పీఆర్) సాఫ్ట్వేర్ ఉపయోగపడనుంది. నగర వ్యాప్తంగా ఉండే కెమెరాల ద్వారా ఒకే నంబర్‌తో రెండు వాహనాలు, కార్ల నంబర్లతో ద్విచక్ర వాహనాలు, వేరే నంబర్లతో తిరిగే ఆటోలను తక్షణం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని ఆ వాహనం ప్రయాణించే ముందు జంక్షన్లలో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తుంది. అత్యవసర వాహనాలకు గ్రీన్ చానల్ సిటీలోని అనేక రోడ్లలో ట్రాఫిక్ మధ్య అంబులెన్స్‌లు ఇరుక్కుపోతున్నాయి. అత్యంత ప్రముఖుల వాహనాలు రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు వీటికి ట్రాఫిక్ జామ్స్ ఎఫెక్ట్ లేకుండా గ్రీన్ చానల్ కల్పించడానికి ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారంగా ‘డివైజ్’ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎంపిక చేసిన అంబులెన్స్‌ను, అర్హులైన ప్రముఖుల వాహనాలకు ఈ డివైజ్‌లను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా జంక్షన్‌కు 200 మీటర్ల దూరానికి ఆ వాహనాలు వచ్చిన వెంటనే.. అవి వస్తున్న వైపు సిగ్నల్ లైట్ గ్రీన్‌గా మారిపోతుంది. మిగిలిన మార్గాల్లో వాహనాలు ఆపడానికి రెడ్ లైట్ పడుతుంది. ట్రాఫిక్ స్థితిగతులు.. నగరంలోని కొన్ని జంక్షన్లలో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులద్వారా వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలూ ప్రదర్శిస్తారు. సాంకేతిక లోపాలతో ఆగిపోయే వాహనాల గుర్తింపునకు ఐటీఎంఎస్‌లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎంఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇది బ్రేక్‌డౌన్ వాహనాలను గుర్తించడంతోపాటు ఏ మార్గాల్లో ట్రాఫిక్ని నియంత్రించాలి, ఎక్కడ ఆపేయాలి అనే అంశాలను విశ్లేషిస్తుంది. ఆగకుండా ముందుకు సాగేలా రద్దీ వేళల్లో వాహనచోదకుల్ని ట్రాఫిక్ జామ్స్ కంటే ఎక్కువగా రెడ్ సిగ్నల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. గమ్య స్థానాల వైపు ప్రయాణించే వాహనాలను దాదాపు ప్రతి చౌరస్తాలోనూ రెడ్ సిగ్నల్ నేపథ్యంలో ఆగుతూ వెళ్లాల్సిన పరిస్థితులు సర్వసాధారణం. ఇలా కాకుండా ఉండేందుకు అన్ని జంక్షన్ల ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అనుసంధానం చేయనున్నారు. ఇలా చేయడంతో ఓ జంక్షన్లో ఆగిన వాహనం గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ముందుకు కదిలితే.. సమీపంలో ఉన్న మిగిలిన జంక్షన్లలో ఆగాల్సిన పని ఉండదు. ఈవెంట్ ఉంటే ‘నో గ్రీన్’ ఓ చౌరస్తాకు అవతలి వైపు ఏమైనా ధర్నాలు, నిరసనలు, సభలు, సమావేశాలతోపాటు అనుకోకుండా ఏర్పడే అవాంతరాలు వంటి ‘ఈవెంట్’ఉన్నా.. ఈ విషయాన్ని ముందే సర్వర్‌లో ఫీడ్ చేస్తారు. ఫలితంగా ఆ రూట్లోకి వెళ్లాలని ప్రయత్నించే వాహనాలకు నిత్యం రెడ్ లైటే కనిపిస్తుంది. అక్కడుండే వీఎంఎస్ బోర్డుల ద్వారా వాహనచోదకుడికి విషయాన్ని వివరిస్తూ ప్రత్యామ్నాయ మార్గంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ఉల్లంఘనులకు ఈ–చెక్ వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతోపాటు ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి ఐటీఎంఎస్‌లో పెద్దపీట వేస్తున్నారు. అన్ని రకాలైన ఉల్లంఘనలపై కెమెరాలు వాటంతట అవే ఆయా ఉల్లంఘనుల వాహనాలను ఫొటో తీస్తాయి. సర్వర్ ఆధారంగా ఈ–చలాన్ సైతం ఆటోమేటిక్‌గా సంబంధిత వాహనచోదకుడి చిరునామాకు చేరిపోతుంది. చౌరస్తాల్లో కాల్ బ్యాక్స్ ఐటీఎంఎస్‌లో భాగంగా చౌరస్తాలు, కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ బాక్సులోని బటన్ నొక్కిన వెంటనే.. అక్కడ ఉండే కెమెరా సైతం యాక్టివేట్ అవుతుంది. దీంతో టీసీసీసీలో ఉండే సిబ్బంది ఫిర్యాదు చేస్తున్న వ్యక్తిని చూడటంతోపాటు అతడు చెప్పేది విని స్పందిస్తారు. -
ఏం చెప్పారు.. సీపీగారూ...
►ట్రాఫిక్ వ్యవస్థ పనిచేయకపోవడం కుట్ర పూరితమా..? ►మరి మూడు రోజులు మీరంతా ఏం చేస్తున్నట్టు ►సిగ్నల్స్ పనిచేయకపోతే.. పోలీసులైనా ఉండాలి కదా ►మరి వారంతా కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్లినట్టు ►ఇలాగైతే మహానాడు భద్రత ఎలా? ►సీపీ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు నగరంలో మూడు రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం కుట్ర పూరితమట!.. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టు సంస్థ స్టాన్ పవర్ అలక్ష్యం వల్లే మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలిందట!! వెంటనే సదరు సంస్థపై కేసు కూడా పెట్టేశారట!!! మూడు రోజులుగా నగర ప్రజలకు నరకం చూపిస్తున్న ట్రాఫిక్ వ్యవస్థ వైఫల్యంపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ చెప్పుకొచ్చిన సంజాయిషీ ఇది. ఈ వివరణలు సంతృప్తిçకరంగాలేకపోగా.. కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.. మరిన్ని విమర్శలకు తావిస్తున్నాయి. యోగానంద్ మీడియా ముందుకొచ్చి ఇదంతా కుట్రపూరితమని చెప్పుకొచ్చారు. సీపీ చెప్పినట్టుగానే జీవీఎంసీ, సిగ్నల్ కాంట్రాక్టు సంస్థ వైఫల్యమే అనుకుందాం.. మరి మూడురోజుల పాటు పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదు?.. సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖ మహానగరంలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా పనిచేయలేదంటే పోలీసు వ్యవస్థ ఏమేరకు పని చేస్తున్నట్టు??.. ఒకవేళ నిజంగానే సదరు సంస్థల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే సిగ్నల్స్ పనిచేయలేదనే అనుకుందాం.. మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్టు.. వెంటనే పసిగట్టి సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేయాలి కదా.. ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడ? రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయని పరిస్థితిలో కనీసం పోలీసులు అక్కడే విధులు నిర్వర్తించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలి కదా.. కానీ ఈ మూడురోజుల్లో నగరంలోని సిగ్నల్స్ వద్ద ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వందల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉన్నట్టుండి ఏమైపోయారు.. ఖాకీలంతా కట్టకట్టుకుని ఒక్కసారిగా ఎక్కడికి వెళ్లినట్టు... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నగర ప్రజలందరికీ తెలుసు. మహానాడు పనుల్లో ఖాకీలు మునిగితేలడం వల్లే ఈ ట్రాఫిక్ వైఫల్యం అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఏమో సీపీ చెప్పినట్టు జీవీఎంసీ, స్టాన్పవర్ల నిర్లక్ష్యం వల్ల సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తి ఉండవచ్చు.. కానీ ట్రాఫిక్ జంక్షన్లలో ఒక్క పోలీసు కూడా విధులు నిర్వర్తించని తప్పిదానికి ఎవరిని బాధ్యులను చేయాలన్నది పోలీసు అధికారులకే వదిలేయాలి. ఇలాగైతే మహానాడు భద్రత ఏమేరకు మూడురోజుల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడానికి కారణం కనుక్కునేందుకు విశాఖ పోలీసులకు మూడురోజుల సమయం పట్టింది. ఇంతటి ఘనత వహించిన పోలీసులు మహానాడుకు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తున్న మహానాడుకు సీఎంతో సహా మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో పాటు పాతిక వేలమందికి పైగా టీడీపీ కార్యకర్తలు తరలిరానున్నారు. వీరి భద్రతా సిబ్బందితో పాటు మందీమార్బలమంతా మూడు, నాలుగురోజులు ఇక్కడే మకాం వేయనున్నారు. ఇక అధికార యంత్రాంగం తరలిరానుంది. ఓ విధంగా రాష్ట్రంలో పాలన మూడురోజుల పాటు ఇక్కడి నుంచే కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మహానాడు నేపథ్యంలో ఎటూ నగర పౌరుల భద్రతను గాలికొదిలేసిన ఖాకీలు కనీసం మహానాడుకైనా సరైన భద్రత కల్పిస్తే అదే మహా యోగం.. అనే పరిస్థితి ఇక్కడ నెలకొంది. -
డేంజర్... యమ డేంజర్..!
⇒ రోడ్డు ఎక్కాలంటేనే హడల్ ⇒ అస్తవ్యస్తంగా ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ ⇒ సిబ్బంది కొరత... మౌలిక వసతుల లేమి ⇒ రహదారి భద్రతను పట్టించుకోని ప్రభుత్వం సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ... వాహనాల సంఖ్యలోనే కాదు రోడ్డు ప్రమాదాల్లోనూ రాష్ట్రంలోనే అగ్రస్థానం. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 6 లక్షలకుపైగా రవాణా వాహనాలు ఉన్నాయి. లక్షకుపైగా ఉన్న రవాణేతర వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతునే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 50 వేల వాహనాలు నగరం గుండా వెళ్తున్నాయి. ఇలా నిత్యం పరుగులు పెడుతున్న వాహనాలను నియంత్రించే స్థాయిలో నగర ట్రాఫిక్ వ్యవస్థ లేకుండాపోయింది. దాంతో నగర రోడ్లపై ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. గత రెండేళ్లలో అమరావతి పరిధిలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికి నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 60 మంది వరకు దుర్మరణం చెందారు. వారిలో 40 మంది నగర పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లోనే మృత్యువాతపడ్డారు. నగర రహదారులపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటంగా మారుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ట్రాఫిక్ పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచేందుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. మౌలిక వసతుల లేమి... విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రహదారి భద్రతను గాలికి వదిలేసింది. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేసేందుకు వాహనాలు కూడా లేకపోవడం ట్రాఫిక్ విభాగం దైన్యస్థితికి నిదర్శనం. కనీసం 4 పెట్రోలింగ్ వాహనాలు కావాలని రెండేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. జాతీయ రహదారుల ఆథారిటీ అయితే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కీలకమైన ఇంటర్‌సెప్టర్ వాహనాలూ లేనేలేవు. అతివేగంతోనూ, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని కట్టడి చేయలేకపోతున్నారు. కనీసం 6 ఇంటర్‌సెప్టర్ వాహనాల కోసం ట్రాఫిక్ పోలీసులు పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలే అయ్యాయి. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించేందుకు టోయింగ్ వాహనాలు కూడా కేటాయించలేదు. ఇక నగరంలోని కీలక కూడళ్లలో కూడా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయడం లేదు. మహానాడు కూడలితోపాటు పలుచోట్ల ట్రాఫిక్ పోలీసులే స్వయంగా వాహనాలను నియంత్రించాల్సి వస్తోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత ... అధికారిక లెక్కల ప్రకారం విజయవాడకు అవసరమైన కానిస్టేబుళ్లు 396 మంది... కానీ ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో ఉన్న కానిస్టేబుళ్లు కేవలం 163 మంది... విజయవాడ ట్రాఫిక్ పోలీసు విభాగంలో సిబ్బంది కొరతకు ఈ ఒక్క తార్కాణం చాలు... రాజధానిగా రూపాంతరం చెందిన తరువాత కూడా నగర ట్రాఫిక్ వ్యవస్థ మీద ప్రభుత్వం దృషి ్టసారించలేదు. క్షేత్రస్థాయిలో కీలకమైన కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టసాధ్యంగా మారింది. కానిస్టేబుళ్లే కాదు ఇతర పోస్టుల పరిస్థితీ అలాగే ఉంది. 72 మంది హెడ్‌కానిస్టేబుళ్లు ఉండాలి. కానీ కేవలం 42 మందే ఉన్నారు. ఏఎస్సైలు 36మందికి 21మందినే నియమించారు. 24 ఎస్సై పోస్టులకు 21 పోస్టులే భర్తీ చేశారు. దాంతో నగరంలోని ప్రధాన కూడళ్లతోపాటు జాతీయరహదారిపై తగినంత మంది సిబ్బందిని వినియోగించలేకపోతున్నారు. డైవర్షన్లు అమలైతే పరిస్థితి మరింత దయనీయం నగరంలోని రామవరప్పాడు – బెంజి సర్కిల్ మార్గంలో ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం జాతీయ రహదారి మీద నుంచి వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు, మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌వైపు మళ్లిస్తారు. చెన్నై వైపు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ మీదుగా మోపిదేవి వైపు మళ్లించి జాతీయరహదారి 216వైపు తీసుకుపోతారు. ఇక చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను గుంటూరు, తెనాలి, భట్టిప్రోలు మీదుగా మోపిదేవి, గుడివాడ మీదుగా మళ్లిస్తారు. అందుకోసం కనీసం 30 శాతం అదనపు సిబ్బంది అవసరమని భావిస్తున్నారు. మంజూరైన సిబ్బందినే కేటాయించని ప్రభుత్వం అదనపు సిబ్బంది గురించి ఆలోచిస్తుందా...! -
బస్టాండులో తలదాచుకుంటున్నారు..
చెన్నై : ఎడతెగని వర్షాలు, వరదలతో చెన్నై వాసులు నరకాన్ని చవిచూస్తున్నారు. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీవిని ఎరుగని విపత్తు చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నది. భారీ వర్షాలతో చెన్నై జలరాకాసి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. చెన్నై మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అనేకమంది కోయంబేడు బస్టాండ్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో వారు బస్టాండ్‌లోనే తల దాచుకుంటున్నారు. దొరికిన కాస్త జాగాలోనే సర్దుకుంటున్నారు. సెల్ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రయాణికులు పోటీ పడుతున్నారు. మరోవైపు తమ క్షేమ సమాచారాలు తెలిపేందుకు కాయిన్ బాక్స్ ల దగ్గర బారులు తీరారు. -
ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టతకు చర్యలు
భాగ్యనగర్‌కాలనీ: ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజా రవాణా వ్యవస్థ సాఫీగా సాగుతుందని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కూకట్‌పల్లిలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు ఉప కమిషనర్, ట్రాఫిక్ కూకట్పల్లి డివిజన్ సహాయ పోలీస్ కమిషనర్ భవనాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి ట్రాఫిక్‌పై అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో రెండు జోన్లుగా విభజించినట్టు చెప్పారు. ఈ భవన నిర్మాణానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రూ.6 లక్షలు విరాళం ఇవ్వగా మిగతా డబ్బును పోలీస్ వ్యవస్థ వెచ్చించిందన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిచవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ వై.గంగాధర్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సైబరాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎం.రామ్మోహన్రావు, కూకట్పల్లి ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పి.సంతోష్‌కుమార్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డి, కూకట్పల్లి, బాలానగర్ ఏసీపీలు సాయిమనోహర్, నంద్యాల నర్సింహరెడ్డి పాల్గొన్నారు. -
జూలై2న ముంబైకి రవాణాశాఖ బృందం
ట్రాఫిక్ వ్యవస్థ అధ్యయనం మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలన అక్కడి మెరుగైన విధానాలు గుర్తించి హైదరాబాద్‌లో అమలు సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా మారిన హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటంతో ఓ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ముంబైలో పరిస్థితుల అధ్యయనానికి వెళ్తోంది. జూలై 2న రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నేతృత్వంలో బృందం అక్కడికి వెళ్తోంది. ఇందులో సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగం, ఆర్టీసీ, జీహెచ్ఎంసీల నుంచి ఉన్నతాధికారులు ఉంటారు. ఈమేరకు బధవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, రవాణాశాక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రాలతో భేటీ అయ్యారు. ఆయా విభాగాల నుంచి ఎవరెవరు వస్తారో ఎంపిక చేసి తనకు తెలపాలని ఆదేశించారు. ‘నగరంలో ట్రాఫిక్ గందరగోళంగా మారింది. ఇక్కడి కంటే వాహనాలు, జనాభా అధికంగా ఉన్న ముంబైలో ప రిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అక్కడి యంత్రాంగం అం దుకు తీసుకుంటున్న చర్యలేంటో పరిశీలిస్తాం. సిటీ బస్సు ల నిర్వహణ, అవి బస్టాప్‌లలో నిలిచేతీరు, ప్రయానికులు క్యూ పద్ధతిని అనుసరించటం, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, జీబ్రా క్రాసింగ్స్, ప్రజలు నిబంధనలు పాటించటంలో అ ధికారులు చేస్తున్న కృషి... తదితర అంశాలను పరిశీలి స్తాం. వాటిని హైదరాబాద్‌లో ఎంతవరకు అమలు చేయ చ్చో గుర్తించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తాం’ అని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ‘నెంబర్ ప్లేట్ల’పై త్వరలో ఉత్తర్వులు... తెలంగాణకు టీఎస్ రిజిస్ట్రేషన్ సీరీస్ కేటాయించిన నేపథ్యంలో ఏపీ సీరీస్‌తో ఉన్న పాత వాహనాల నెంబర్ ప్లేట్లను కూడా కొత్త సీరీస్‌లోకి మార్చాల్సిందేనని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నామని, అవి పూర్తి కాగానే ముఖ్యమంత్రితో చర్చించి ఆమోదం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. -
ట్రాఫిక్ నియంత్రణకు కొత్త సిస్టం