చెన్నై : ఎడతెగని వర్షాలు, వరదలతో చెన్నై వాసులు నరకాన్ని చవిచూస్తున్నారు. తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కనీవిని ఎరుగని విపత్తు చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నది. భారీ వర్షాలతో చెన్నై జలరాకాసి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.
చెన్నై మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అనేకమంది కోయంబేడు బస్టాండ్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో వారు బస్టాండ్లోనే తల దాచుకుంటున్నారు. దొరికిన కాస్త జాగాలోనే సర్దుకుంటున్నారు. సెల్ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ప్రయాణికులు పోటీ పడుతున్నారు. మరోవైపు తమ క్షేమ సమాచారాలు తెలిపేందుకు కాయిన్ బాక్స్ ల దగ్గర బారులు తీరారు.
బస్టాండులో తలదాచుకుంటున్నారు..
Published Thu, Dec 3 2015 4:26 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM
Advertisement