చెన్నై:తమిళనాడు,పుదుచ్చరిలకు భారత వాతవావరణశాఖ రెడ్‌అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ,గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు,పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
ప్రస్తుతం తుపాను తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment