Puducherry
-
పుదుచ్చేరిలో తీవ్ర ఉద్రిక్తత.. స్కూల్ సీల్ చేసిన కలెక్టర్
కడలూరు: పుదుచ్చేరిలో ఉద్రికత్త చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిరసనలకు దిగారు. పుదుచ్చేరి-కడలూరు రోడ్డుపైకి నిరసనకారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.వివరాల ప్రకారం.. తలవకుప్పంలో ఓ బాలికను ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో బాధితురాలు స్కూల్‌కు వెళ్లేందుకు భయంతో వణికిపోయింది. దీంతో, కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం సాయంత్రం భారీ సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకున్నారు. టీచర్‌ను చితకబాదారు. పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.#JUSTIN ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் பொதுமக்கள் தர்ம அடி கொடுத்து போலீசில் ஒப்படைத்தனர்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/3viBaLMA2j— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025అంతటితో ఆగకుండా.. పుదుచ్చేరి-కడలూరు రోడ్డును నిరసనకారులు బ్లాక్ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో, పోలీసుల తీరుపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు నిరసనలను మరింత ఉధృతం చేశారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల ట్రాఫిక్ స్థంభించిపోయింది. అర్ధరాత్రి వరకు రోడ్లపైనే నిరసనలు తెలిపారు. #JUSTIN புதுச்சேரியில் ஒன்றாம் வகுப்பு மாணவிக்கு பாலியல் தொல்லை பள்ளியை அடித்து நொறுக்கிய போராட்டக்காரர்கள்#Puducherry #Sexualharassmen #protest #News18Tamilnadu | https://t.co/3v5L32pe7b pic.twitter.com/yMVcvBXOKP— News18 Tamil Nadu (@News18TamilNadu) February 14, 2025ఈ నేపథ్యంలో పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం, కలెక్టర్ కులోత్తుంగన్, సీనియర్ పోలీసు అధికారులు నిరసనకారులతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా పాఠశాలను సీల్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం, రాత్రి జారీ చేసిన ఉత్తర్వులో పాఠశాలలో శనివారం జరగాల్సిన పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.புதுச்சேரியில் தவளக்குப்பம் அருகே, தனியார் பள்ளியில் மாணவிக்கு பாலியல் தொல்லை.மாணவிக்கு பாலியல் தொல்லை கொடுத்த ஆசிரியர் மீது வழக்கு பதியவில்லை என பெற்றோர் குற்றச்சாட்டு. @LGov_Puducherry pic.twitter.com/Zx9FHqQVqJ— Dhivya Marunthiah (@DhivCM) February 14, 2025 -
శతక్కొట్టిన కరణ్ షిండే.. తేలని ఫలితం
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసింది. పుదుచ్చేరి జట్టుతో ఆదివారం ముగిసిన ఎలైట్ గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినందుకు ఆంధ్ర జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 82.4 ఓవర్లలో 6 వికెట్లకు 319 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.ఓవర్‌నైట్ స్కోరు 86 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన కరణ్ షిండే (171 బంతుల్లో 119 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శశికాంత్ (39; 4 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరు వద్దే అవుటయ్యాడు. ఆ తర్వాత త్రిపురాణ విజయ్ (15; 2 ఫోర్లు), పృథ్వీరాజ్ (14 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సహకారంతో కరణ్ శతకం సాధించాడు. ఆంధ్ర నిర్దేశించిన 363 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి 46 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్లు ఆటను ముగించాయి. ఇక పుదుచ్చేరి ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు (148 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు), జై పాండే (131 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలు చేశారు. ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర జట్టు 6 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 7 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 30 నుంచి విజయనగరంలో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్‌తో ఆంధ్ర తలపడుతుంది. -
మెరిసిన పృథ్వీరాజ్
పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా పుదుచ్చేరితో జరుగుతున్న పోరులో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 209/5తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పుదుచ్చేరి జట్టు 79 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆంధ్ర జట్టుకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పుదుచ్చేరి బ్యాటర్ అమాన్ ఖాన్ (50) అర్ధశతకం సాధించాడు. ఆంధ్ర బౌలర్లలో పృథ్వీరాజ్ 5 వికెట్లు పడగొట్టగా... విజయ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొహమ్మద్ రఫీ, శశికాంత్, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. కరణ్ షిండే (136 బంతుల్లో 86 బ్యాటింగ్; 9 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో సత్తా చాటగా... శ్రీకర్ భరత్ (41; 7 ఫోర్లు), షేక్ రషీద్ (26; 3 ఫోర్లు), రికీ భుయ్ (32; 5 ఫోర్లు, 1 సిక్స్), శశికాంత్ (39 బ్యాటింగ్; 4 ఫోర్లు) రాణించారు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 5 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు ఓవరాల్‌గా 291 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 303; పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్: శ్రీధర్ రాజు (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 0; జయ్ పాండే (బి) పృథ్వీరాజ్ 3; పారస్ (సి) శ్రీకర్ భరత్ (బి) పృథ్వీరాజ్ 39; ఆకాశ్ (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 7; మోహిత్ కాలె (సి) రషీద్ (బి) పృథ్వీరాజ్ 60; అరుణ్ కార్తీక్ (సి) రికీ భుయ్ (బి) పృథ్వీరాజ్ 59; అమాన్ ఖాన్ (సి) రికీ భుయ్ (బి) లలిత్ మోహన్ 50; అంకిత్ శర్మ (సి) శ్రీకర్ భరత్ (బి) విజయ్ 13; సాగర్ (సి) రషీద్ (బి) విజయ్ 0; అబిన్ మాథ్యూ (నాటౌట్) 4; గౌరవ్ యాదవ్ (సి) అభిషేక్ రెడ్డి (బి) రఫీ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (79 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–20, 4–84, 5–148, 6–225, 7–237, 8–238, 9–241, 10–260, బౌలింగ్: పృథ్వీరాజ్ 23–5–64–5; మొహమ్మద్ రఫీ17–1–53–1; శశికాంత్ 15–0–57–1; లలిత్ మోహన్ 16–2–42–1; విజయ్ 8–0–36–2. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) గౌరవ్ యాదవ్ 15; శ్రీకర్ భరత్ (ఎల్బీ) (బి) అంకిత్ శర్మ 41; షేక్ రషీద్ (రనౌట్) 26; కరణ్ షిండే (బ్యాటింగ్) 86; రికీ భుయ్ (సి) (సబ్) సీజీడీ శాస్త్రి (బి) అమన్ ఖాన్ 32; హనుమ విహారి (సి) శ్రీధర్ రాజు (బి) అంకిత్ శర్మ 0; శశికాంత్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (69 ఓవర్లలో 5 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–24, 2–81, 3–82, 4–141, 5–142, బౌలింగ్: గౌరవ్ యాదవ్ 10–1–49–1; అబిన్ మాథ్యూ 11–3–34–0; సాగర్ 21–3–72–0; అంకిత్ శర్మ 22–3–56–2; అమాన్ ఖాన్ 3–0–25–1; ఆకాశ్ 2–1–11–0. -
మరో నాలుగు హెచ్ఎంపీవీ కేసులు
అహ్మదాబాద్/డిబ్రూగఢ్/పుదుచ్చేరి: దేశంలో మరో నాలుగు హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్ఎంపీవీ) కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారౖణెన కేసులతో కలిపితే గుజరాత్లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లయింది. అహ్మదాబాద్‌కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణైందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడికి కూడా ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని చెప్పారు. గుజరాత్లో ఈ నెల 6న మొదటి హెచ్ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, అస్సాంలోని డిబ్రూగఢ్‌కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది. జలుబు సంబంధిత లక్షణాలతో నాలుగు రోజులుగా డిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు వెల్లడైంది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. హెచ్ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గొరిమేడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
మిలింద్ మ్యాజిక్
అహ్మదాబాద్: లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ (5/13) నిప్పులు చెరగడంతో... విజయ్ హజారే టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు రెండో విజయం ఖాతాలో వేసుకుంది. గ్రూప్ ‘సి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో పుదుచ్చేరిని మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటైంది. పారస్ (57 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్ స్కోరర్... కాగా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. హైదరాబాద్ బౌలర్లలో మిలింద్ 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు తీయగా... మొహమ్మద్ ముదస్సిర్, నిశాంత్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యం చిన్నదే అయినా హైదరాబాద్ జట్టు తడబడింది. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. హిమతేజ (61 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మిలింద్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం కర్ణాటకతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. భరత్, హెబర్ మెరుపులుబౌలర్ల క్రమశిక్షణకు ఓపెనర్ల దూకుడు తోడవడంతో దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 10 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ 36.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ శర్మ (39; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అన్షుల్ గుప్తా (23), వినీత్ (23), అరుణ్ (22) తలా కొన్ని పరుగులు చేశారు. ఆంధ్ర బౌలర్లలో పిన్నింటి తపస్వి 4 వికెట్లు పడగొట్టగా... పృథ్వి రాజ్, శశికాంత్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు 28.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 163 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రీకర్ భరత్ (90 బంతుల్లో 86 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబర్ (66 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, ఒక ‘డ్రా’తో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. తపస్వికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం మేఘాలయతో ఆంధ్ర జట్టు తలపడనుంది. -
బీఎస్ఎన్ఎల్ ఉచిత సర్వీసులు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పుదుచ్చేరిలోని తన వినియోగదారులకు ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తన యూజర్లకు డిజిటల్, వినోద సేవలను మరింత చేరువ చేసేందుకు మూడు కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది.మొబైల్ కోసం ఇంట్రానెట్ టీవీ (బీఐ టీవీ)ఓటీటీప్లే సహకారంతో బీఎస్ఎన్ఎల్ ప్రీమియం కంటెంట్‌తో సహా 300 లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది. ఈ సర్వీసు స్థిరంగా స్ట్రీమింగ్ అయ్యేందుకు, ఎలాంటి అవాంతరాలు కలుగకుండా ఉండేందుకు బీఎస్ఎన్ఎల్ మొబైల్ ఇంట్రానెట్‌ను ఉపయోగిస్తుంది.నేషనల్ వై-ఫై రోమింగ్బీఎస్ఎన్ఎల్ మనడిపట్టు గ్రామంలో వై-ఫై రోమింగ్‌ను ప్రారంభించింది. ఈ గ్రామం భారతదేశంలో రెండో పూర్తి వై-ఫై వినియోగిస్తున్న గ్రామంగా ప్రసిద్ధి. బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ చందాదారులు దేశవ్యాప్తంగా ఏదైనా బీఎస్ఎన్ఎల్ వై-ఫై హాట్‌స్పాట్ లేదా ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ నుంచి ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ (ఐఎఫ్ టీవీ)బీఎస్ఎన్ఎల్ కొత్త ఐఎఫ్ టీవీ సర్వీస్‌ను పుదుచ్చేరిలో అందిస్తుంది. ఎఫ్టీటీహెచ్ చందాదారులకు 500కి పైగా లైవ్ టెలివిజన్ ఛానళ్లను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. ఈ ఛానళ్లు నిరంతరంగా, హై క్వాలిటీలో స్ట్రీమింగ్ అయ్యేలా సంస్థ చర్యలు తీసుకుంటుంది. -
తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ 26 పుదుచ్చేరి 1
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థి జట్టుపై గోల్స్ వర్షం కురిపించినా... జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు నాకౌట్ దశకు చేరుకోలేకపోయింది. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది. సోమవారం జరిగిన చివరిదైన గ్రూప్ ‘హెచ్’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు 26–1 గోల్స్ తేడాతో పుదుచ్చేరి జట్టుపై భారీ విజయం నమోదు చేసుకుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘హెచ్’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన మధ్యప్రదేశ్ జట్టు అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది.లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఎనిమిది గ్రూపుల్లో టాప్ స్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు (హరియాణా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మిజోరం, ఢిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్) క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌తో మిజోరం; మహారాష్ట్రతో జార్ఖండ్; మధ్యప్రదేశ్‌తో హరియాణా; ఒడిశాతో ఢిల్లీ తలపడతాయి. తులసీ 9 గోల్స్... పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు ఆరంభం నుంచే అదరగొట్టారు. 6వ నిమిషంలో మొదలైన గోల్స్ వేట 56వ నిమిషం వరకు కొనసాగింది. ఏపీ అమ్మాయిలు అవకాశం దొరికినపుడల్లా పుదుచ్చేరి గోల్ పోస్ట్‌పై దాడులు చేసి అనుకున్న ఫలితం సాధించారు. ముఖ్యంగా కెపె్టన్ కుప్పా తులసీ చెలరేగిపోయింది. ఆమె ఏకంగా 9 గోల్స్ సాధించి అబ్బురపరిచింది. తులసీ 6వ, 12వ, 21వ, 23వ, 32వ, 33వ, 34వ, 43వ, 56వ నిమిషాల్లో గోల్స్ కొట్టింది. పూజారి మధురిమ బాయి నాలుగు గోల్స్ (26వ, 39వ, 42వ, 47వ నిమిషాల్లో), మునిపల్లి నాగనందిని నాలుగు గోల్స్ (16వ, 28వ, 29వ, 54వ నిమిషాల్లో), పరికి లక్ష్మి మూడు గోల్స్ (8వ, 32వ, 37వ నిమిషాల్లో), చిల్లూరు నాగతేజ రెండు గోల్స్ (14వ, 24వ నిమిషాల్లో), మండల వైష్ణవి (19వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్, ముజియా బేగం పఠాన్ (11వ నిమిషంలో), తిరుమలశెట్టి జోష్నా (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పుదుచ్చేరి జట్టుకు నిలోవియా (28వ నిమిషంలో) ఏకైక గోల్ అందించింది. సోమవారం జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో మణిపూర్ 5–1తో దాద్రా అండ్ నాగర్ హవేలి అండ్ డమన్ అండ్ డియు జట్టుపై, చండీగఢ్ 3–0తో కేరళపై, పంజాబ్ 9–0తో అస్సాంపై గెలుపొందగా... బిహార్, కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. -
‘ఫెంగల్’ తడాఖా.. వరదల్లో కొట్టుకుపోతున్న బస్సులు, కార్లు..
చెన్నై: ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరుకుంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, కృష్ణగిరి జిల్లాలో వరద ధాటికి బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో ఇళ్లు సైతం నీటి మునిగాయి. వరద నీటిలో పాములు కనిపించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. Scary visuals coming from Uthangarai, Krishnagiri district. Once in a lifetime historic rains of 500mm recorded. Super rare to see such numbers in interiors. Why slow moving cyclones are always dangerous. #CycloneFengal #Tamilnadu #Floods #Krishnagiri pic.twitter.com/K8Jla22VUc— Chennai Weatherman (@chennaisweather) December 2, 2024ఇదిలా ఉండగా.. తుపాన్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.Cyclone Fengal Wreaks Havoc Along India’s Coast, Three DeadThe storm made landfall near Puducherry & unleashed torrential rains and winds, sparking severe flooding across Tamil Nadu, & submerging streets, homes, and businesses as well as leaving thousands displaced. pic.twitter.com/dyAOtrQQd4— COMMUNITY EARTH RADIO🌎 (@COMM_EARTH) December 2, 2024మరోవైపు.. తుపాన్ ప్రభావం తాజాగా కర్ణాటక మీద కూడా చూపిస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు, హసన్, మాండ్యా, రామనగర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ విధించింది. అలాగే, ఉడిపి, చిక్మంగ్లూర్, చిక్బల్లాపూర్ జిల్లాలకు ఆరెంట్ అలర్ట్ విధించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Remnant of Cyclone Fengal - WML has moved on from Bengaluru to further West #BengaluruRains #KarnatakaRainsParts of South Interior Karnataka districts of Tumakuru, Ramanagara & Mandya have got heavy rains from this & the action will now shift to Malenadu & Coastal Karnataka… https://t.co/oKb0uzIyqW pic.twitter.com/bdCYdYA8dC— Karnataka Weather (@Bnglrweatherman) December 2, 2024 -
ఫెంగల్ టెన్షన్.. చెన్నై ఎయిర్‌పోర్టులోకి వరద నీరు
Cyclone Fengal Updates..👉 తీరం దాటుతున్న ‘ఫెంగల్’ తుపానుపుదుచ్చేరి సమీపంలో ‘ఫెంగల్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపిన ఐఎండీఈ ప్రక్రియకు దాదాపు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలుదక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం👉మహాబలిపురం వద్ద ఫెంగల్ తుపాన్ తీరాన్ని తాకింది. 👉తుపాను ఎఫెక్ట్.. విమానాలు రద్దు..వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు విమానాలు రద్దు చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దువిమానాల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత. 👉ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి, ఏపీపై చూపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. #ChennaiAirport During #FengalCyclone#CycloneAlert#Chennaipic.twitter.com/EPLZlM5CYt— Musharraf Mughal. (@marcanthony99) November 30, 2024 👉మరోవైపు.. లోతట్టు పప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. 📍 சென்ட்ரல் ரயில் நிலையம் எதிரில். ✍️ ஆபத்தான முறையில் கீழே விழ இருந்த அறிவிப்புப் பலகை உடனடியாக அகற்றப்பட்டது. #ChennaiRains #chennaipolice #cyclone #Fengal pic.twitter.com/b3et05ClSi— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) November 30, 2024 👉రన్‌వే పైకి వరద నీరు చేరుకోవడంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే, కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 👉నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుపాను భయపెడుతోంది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.👉తుపాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 70-80 కి.మీ వేగంలో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైలు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. Cyclone Fengal 🌀 effect on CHENNAI cityParts of the city have reported inundations due to spells of intense rainfall activityStay safe & indoors for the next crucial 36 hours#ChennaiRains #ChennaiRains2024 #ChennaiRain https://t.co/voiAq7RIiP pic.twitter.com/2GX6SbHD4K— Karnataka Weather (@Bnglrweatherman) November 30, 2024👉తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కల్లకురుచ్చి, కుద్దలూరు, పుద్చుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అల్టర్ విధించింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.சிக்கி தவிக்கும் தலைநகரம். #Fengal #FengalCyclone #Chennai #ChennaRains #DMKFails pic.twitter.com/OHBlmMmy8D— D.Jackson Jayaraj (@VirugaiJackson) November 30, 2024👉ఫెంగల్ ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది. పెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ஆட்டோ உள்ளே தண்ணீர்போகும் அளவுக்கு சூளைமேடு பகுதி #ChennaiRains @thatsTamil #Chennaiflood pic.twitter.com/6AohpLlbhb— Veerakumar (@Veeru_Journo) November 30, 2024 -
Cyclone Fengal: చెన్నై ఎయిర్‌పోర్టు బంద్.. రెడ్ అలెర్ట్ జారీ
ఫెంగల్ తుఫాను తమిళనాడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారిన ఫెంగల్.. శనివారం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే అవకాశం ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని రాత్రి ఏడు గంటల వరకు అధికారులు మూసివేశారు. ఈ సమయంలో సబర్బన్ రైళ్లు కూడా తక్కువగా నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.భారీ వర్షాలు..పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు, అధిక ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. తీరాన్ని ఫెంగల్ సమీపించే కొద్దీ గాలిప్రభావం 90 కి.మీ వేగంతో ఉండేందుకు అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తలు విస్తృతమయ్యాయి.Beautiful low cyclonic clouds... #ChennaiRains #Cyclone #Fengal pic.twitter.com/VTGxLYNty4— Sreeram (@sreeram) November 30, 2024 వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, పెరంబలూరు, అరియలూర్, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, కారైకల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణం బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతుండడంతో పాటు కారైక్కాల్–తమి నాడులోని చైన్నె శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరాన్ని ఫెంగల్ తుపాను తాకనుండడంతో ఇక్కడి గ్రామీణ, తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.Velachery, Vijayanagar 2nd main road #Fengal #ChennaiRains #velachery pic.twitter.com/nR7Ygwywcm— Swetha Chandran (@SwethaC3110) November 30, 2024మత్స్యకారులకు ఆదేశం..ఈ జిల్లాల్లో పడవలు, జనరేటర్లు, మోటారు పంపులు, ట్రీ కటర్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచారు. ఈ జిల్లాల్లో ఎన్డిఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు. తమ పడవలు, ఇతర పరికరాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించి నష్టం జరగకుండా చూడాలని అధికారులు సూచించారు.విద్యాసంస్థలు బంద్తుఫాను కారణంగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, మైలాడుతురై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కంపెనీలను కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. -
ఫెంగల్ తుపాన్ ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
సాక్షి, విశాఖపట్నం: ఫెంగల్ తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ., చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఫెంగల్ తుపాన్ నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ విధించారు. మరోవైపు.. పుదుచ్చేరిలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక, వాయుగుండం కారణంగా ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఈ నెల 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. దీని ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనూ, రాయలసీమలోని తిరుపతి జిల్లాలోనూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.ఇక తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు. -
‘ఫెంగల్’ తుఫాన్.. తమిళనాడు,పుదుచ్చేరిలకు రెడ్ అలర్ట్
చెన్నై:తమిళనాడు,పుదుచ్చరిలకు భారత వాతవావరణశాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం తుఫానుగా మారనుందని వెల్లడించింది.ఫెంగల్ తుఫాను ప్రభావంతో బుధ,గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు,పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.ప్రస్తుతం తుపాను తమిళనాడులోని నాగపట్నం నుంచి 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి తుపాను దగ్గరగా రానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
హైదరాబాద్ 536/8 డిక్లేర్డ్
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పుదుచ్చేరితో పోరులో బ్యాటర్లంతా కలిసి కట్టుగా కదం తొక్కడంతో హైదరాబాద్ జట్టు 163 ఓవర్లలో 536/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (328 బంతుల్లో 173; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... రోహిత్ రాయుడు (84; 7 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ (60; 7 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 290/1తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు తన్మయ్, రోహిత్ 220 పరుగులు జోడించడంతో గట్టి పునాది పడింది. కెపె్టన్ రాహుల్ సింగ్ (27), వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (24) ఎక్కువ సేపు నిలవలేకపోగా... చామా మిలింద్ (7) ఆకట్టుకోలేకపోయాడు. మిడిలార్డర్ విఫలమైనా... ఆఖర్లో తనయ్ త్యాగరాజన్ మెరుపులు మెరిపించాడు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 3, సతీశ్ రెండు వికెట్లు పడగొట్టారు. కొండంత స్కోరు చేసిన అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... చివరి గంటలో బ్యాటింగ్‌కు వచ్చిన పుదుచ్చేరి బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పుదుచ్చేరి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. శ్రీధర్ రాజు (19), సాగర్ (0) అవుట్ కాగా... వికెట్ కీపర్ అజయ్ రొహెరా (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పుదుచ్చేరి జట్టు... హైదరాబాద్ స్కోరుకు ఇంకా 512 పరుగులు వెనుకబడి ఉంది. గౌరవ్ యాదవ్ (0 బ్యాటింగ్), ఆకాశ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) (సబ్) విఘ్నేశ్వరన్ (బి) అంకిత్ శర్మ 173; అభిరత్ రెడ్డి (సి) అరుణ్ కార్తీక్ (బి) సాగర్ 68; రోహిత్ రాయుడు (బి) ఫాబిద్ అహ్మద్ 84; హిమతేజ (సి) అమన్ (బి) సతీశ్ 60; రాహుల్ సింగ్ (సి) గంగ శ్రీధర్ రాజు (బి)గౌరవ్ యాదవ్ 27; రాహుల్ రాధేశ్ (సి అండ్ బి) అంకిత్ శర్మ 24; చామా మిలింద్ (బి) సతీశ్ 7; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 53; అనికేత్ రెడ్డి (బి) అంకిత్ శర్మ 12; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (163 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్) 536. వికెట్ల పతనం: 1–111, 2–231, 3–345, 4–397, 5–440, 6–458, 7–460, 8–486. బౌలింగ్: గౌరవ్ యాదవ్ 35–9–102–1; సాగర్ 31–5–98–1; ఫాబిద్ అహ్మద్ 30–6–78–1; అమన్ ఖాన్ 11–1–55–0; అంకిత్ శర్మ 35–1–117–3, సతీశ్ 20–2–72–2. -
తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు
చెన్నై:తమిళనాడు,పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు డెల్టాప్రాంతంలో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై,పుదుచ్చేరి సహా ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.పుదుచ్చేరిలో ప్రభుత్వాస్పత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పేషెంట్లను మరో ఆస్పత్రికి అధికారులు తరలించారు. వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి చెన్నై,పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమిళనాడు సేలం జిల్లాలో సబ్వేలో వరద నీరు నిలిచింది.ఇదీ చదవండి: మురసోలి సెల్వమ్ కన్నుమూత -
తెలంగాణ గవర్నర్‌గా రేపు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్.. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ విడుదల చేసింది. -
ఇంకెన్నాళ్లు ఈ దారుణాలు.. ఇంకెంతకాలం భరించాలి: నటి ఆవేదన
నటి సోనా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈమె బహు భాషా నటి. అంతకు మించి ఏదో ఒక ఘటనతో వార్తలో తరచుగా కనిపించే నటి. శృంగార తారగానూ ముద్ర వేసుకున్న సోనాలో నిర్మాత, దర్శకురాలు కూడా ఉన్నారు. తాజాగా తన బయోపిక్‌ను స్మోక్ అనే పేరుతో స్వీయ దర్శకత్వంలో వెబ్ సిరీస్‌గా రూపొందిస్తున్నారు. కాగా ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన బాలిక అత్యాచారం, హత్యా ఘటనపై స్పందించింది. ఈ రోజు మనం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని.. కానీ ఇటీవల పాండిచ్చేరిలో చిన్నారికి జరిగిన దారుణ ఘటన తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక అమ్మాయిగా ఎలా ఉండాలో అనేది కూడా తెలియని ఆ బాలికను చిత్ర వధ చేసి ప్రాణాలు తీయడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇలాంచి క్రూరమైన ఘటనతో మనం మానవ సమాజంలోనే బతుకుతున్నామా? లేక మృగాల మధ్య జీవిస్తున్నామా? అని తెలియడం లేదన్నారు. ఒక నటిగా తానూ ఇలాంటి సంఘటనలను ఎదుర్కొని బయట పడ్డానని చెప్పారు. మృగాల్లాంటి మగాళ్ల మధ్య జీవించడానికి.. రక్షించుకోవడానికి అనునిత్యం పరుగులు తీస్తూనే ఉన్నామన్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందుతున్న ఈ నాగరిక ప్రపంచంలో మహిళలను అణచివేయడం.. కించపరచడం, తప్పుగా చిత్రీకరించడడం కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిని ఇంకా ఎంతకాలం మౌనంగా భరించాలి.. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నటి సోనా పేర్కొన్నారు. -
ప్రజాప్రతినిధిగా ఉండాలనుకుంటున్నా
పుదుచ్చెరి: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉందని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరోక్షంగా చెప్పారు. పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం పుదుచ్చేరిలో తన అధికారిక నివాసం(రాజ్ నివాస్)లో మీడియాతో ఆమె మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పుదుచ్చేరి నుంచి ఎంపీగా బరిలో దిగుతారనే ఊహాగానాల నడుమ అదే అంశాన్ని ఆమె ప్రస్తావించడం గమనార్హం. ‘‘నేనొక సాధారణ వ్యక్తిని. ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి ఏం ఆదేశిస్తారో అది మాత్రమే నేను ఒక సాధారణ కార్యకర్తలా చేస్తా. లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చెరి నుంచి పోటీచేయబోతున్నానని నేను ఎక్కడా అనలేదు. నా జీవితంలో ఇది కావాలని ఏనాడూ అడగలేదు. అగ్రనాయకత్వం నుంచి వచ్చే ఆదేశాలను శిరసావహిస్తా. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. అయితే అది నెరవేరుతుందా లేదా అనేది ప్రధాని మోదీ తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’’అని ఆమె అన్నారు. ‘‘కోవిడ్ విపత్తుకాలంలో పుదుచ్చెరిలో కరోనా వ్యాక్సిన్లు సకాలంలో అందించడంలో సఫలమయ్యా. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడితో పుదుచ్చేరిని అందరికీ ఆదర్శంగా నిలిపా. అరబిందో, సుబ్రమణ్యభారతి వంటి వారికి పుదుచ్చేరితో ఎంతో అనుబంధం ఉంది. నాకూ అలాంటి అనుబంధమే ఉంది. కానీ ఇన్నేళ్లు ఇక్కడ ఉన్నా కొందరు ఇంకా నన్ను ‘బయటివ్యక్తి’అనడం నాకెంతో బాధగా ఉంటుంది’’అని అన్నారు. ‘‘మూడేళ్లకాలంలో పుదుచ్చేరిలో వేర్వేరు రంగాల్లో, ముఖ్యంగా వైద్యరంగంలో ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేశా. ఇక్కడి ఎన్నుకున్న ప్రభుత్వ సహాయసహకారాలతో ఉత్తమంగా పాలించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’అని ఆమె అన్నారు. -
ఓపెనర్‌గా ఉమ్రాన్ మాలిక్.. డకౌట్! ఎందుకీ దుస్థితి?
Ranji Trophy 2023-24- Puducherry vs Jammu and Kashmir: టీమిండియాలో స్థానం కోల్పోయిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. రంజీ ట్రోఫీ-2024 బరిలో దిగాడు ఈ 24 ఏళ్ల పేసర్. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ అతడి వైఫల్యం కొనసాగుతోంది. కాగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా చేరి.. జట్టులో కీలక సభ్యుడి స్థాయికి ఎదిగాడు. టీమిండియాలో చోటు కరువు అయితే, గత రెండు సీజన్లుగా ఉమ్రాన్ మాలిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో తుదిజట్టులోనూ పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు. లీగ్ క్రికెట్ పరిస్థితి ఇలా ఉంటే.. టీమిండియాలోనూ అతడికి చోటు కరువైంది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్ మాలిక్.. ఇప్పటి వరకు 8 టీ20లు, 10 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ ఫాస్ట్ బౌలర్ వరుసగా 11, 13 వికెట్లు తీశాడు. అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు ఉమ్రాన్‌ను పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో గతేడాది జూలైలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఈ కశ్మీరీ బౌలర్ టీమిండియా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో పరిమిత ఓవర్లలో సత్తా చాటలేకపోయిన ఉమ్రాన్.. రంజీ బరిలో దిగి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రంజీల్లోనూ వరుస వైఫల్యాలు తాజా రంజీ సీజన్లో ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన ఉమ్రాన్ మాలిక్.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వర్షం కారణంగా ఆయా మ్యాచ్‌లకు ఆటంకం కలిగినప్పటికీ తనకు బౌలింగ్ చేసే అవకాశం వచ్చినపుడు కూడా ఉమ్రాన్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తాజాగా పుదుచ్చేరితో మ్యాచ్‌లోనూ తన వైఫల్యం కొనసాగించాడు. పుదుచ్చేరి వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బ్యాటింగ్ చేసి.. 106 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 172 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించి 66 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కాగా పుదుచ్చేరి మొదటి ఇన్నింగ్స్‌లో కశ్మీర్ బౌలర్లు అబిద్ ముస్తాక్, వన్షజ్ శర్మ ఐదేసి వికెట్లు పడగొట్టగా ఉమ్రాన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా.. డకౌట్ ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఉమ్రాన్ డకౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ ఫాజిల్ రషీద్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కశ్మీర్ 152 పరుగులకే చాపచుట్టేసింది. ఈ క్రమంలో 86 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పుదుచ్చేరి శనివారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 35 రన్స్ చేసింది. విజయానికి పుదుచ్చేరి 52 పరుగుల దూరంలో నిలవగా.. జమ్మూ కశ్మీర్ ఇంకో మూడు వికెట్లు పడగొడితే గెలుపొందుతుంది. అయితే, పుదుచ్చేరి రెండో ఇన్నింగ్స్‌లో ఉమ్రాన్‌కు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. అబిద్ ముస్తాక్ మరోసారి 5 వికెట్లు తీయగా.. వన్షజ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి రంజీల్లోనైనా ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. టీమిండియా భవిష్యత్ స్పీడ్గన్గా నీరాజనాలు అందుకున్న ఉమ్రాన్ మాలిక్ ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం ఉండకపోవచ్చని ఫ్యాన్స్ వాపోతున్నారు. -
ఇంకెప్పటికి మారతాం?!
ఆ కేంద్రపాలిత ప్రాంతం మొత్తంలో ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి కూడా ఆమే! తీరా, అలాంటి వ్యక్తి కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏమనాలి? మామూలు పరిస్థితుల్లో రాజీనామా చేయడం కాదు... లింగ, కుల దుర్విచక్షణల్ని తట్టుకోలేక రాజీనామా చేశానంటున్నారు. ఆ ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఏకైక దళిత, మహిళా ఎమ్మెల్యే సి. చంద్ర ప్రియాంక ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే, ఆమె అసమర్థత రీత్యానే పదవి నుంచి తప్పించామని అధికార కూటమి అంటోంది. ఏమైనా, ఈ మహిళా మంత్రి రాజీనామా ఉదంతం స్త్రీలు, వెనుకబడిన కులాల పట్ల మన వ్యవస్థలోని చిన్నచూపును మరోసారి చర్చకు పెడుతోంది. దాదాపు 40 ఏళ్ళ విరామం తర్వాత పుదుచ్చేరిలో మంత్రి పదవి దక్కిన మహిళ చంద్రిక అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముప్ఫై మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో కారైక్కాల్ ప్రాంతంలో రిజర్వుడు స్థానమైన నెడుంగాడు నుంచి ఎన్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో 2021లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ‘మంచి ఆలోచనలతో, కష్టపడి పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చాన’న్న చంద్రిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో వివక్షకు గురయ్యానని ఆరోపించారు. ప్రజాదరణ ఉన్నా కుట్రల్ని తట్టుకొని, ధనశక్తి అనే భూతంపై పోరాడడం తేలిక కాదని గ్రహించినట్టు ఆమె తన రాజీనామా లేఖలో ఆవేదన చెందారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకె, వామపక్షాలు ప్రభుత్వాన్నీ, సీఎం ‘దళిత వ్యతిరేక వైఖరి’నీ తప్పు బట్టాయి. అయితే, కీలకమైన మంత్రి పదవిని చంద్రిక సమర్థంగా నిర్వహించట్లేదనీ, ఆరునెలలుగా చెబుతున్నా పట్టించుకోవట్లేదనీ, అందుకే ఆమెను పదవి నుంచి తప్పించామనీ, కేంద్రానికి లేఖ పంపగానే అది తెలిసి ఆమె ముందే రాజీనామా చేశారనీ అధికార పక్షం చెబుతోంది. చిత్రమేమిటంటే, అధికారపక్షం చెబుతున్న ఈ కథనాన్నే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరైన మరో మహిళ తమిళిసై సౌందరరాజన్ పేర్కొనడం! దుర్విచక్షణ ఉన్నట్టు తెలీదనీ, తనకు చెబితే పరిస్థితిని చక్కదిద్దేదాన్ననీ గవర్నర్ అన్నట్టు తమిళ పత్రికల కథనం. అయితే, మన దేశంలో అలాంటివి లేవనుకోవడం వట్టి భ్రమ. ఆ మాటకొస్తే, ఎవరూ బయటపడకపోయినా చంద్రిక కథ లాంటిదే... ఈ దేశంలోని పలు వురు మహిళా నేతల వ్యధ! పురుషాధిక్య ప్రపంచంలో, అందులోనూ రాజకీయాల్లో ఎన్నో సహించి, భరిస్తే కానీ స్త్రీలు తమకంటూ చిన్నచోటు దక్కించుకొని, గొంతు విప్పలేరన్నది నిష్ఠురసత్యం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, చట్టం చేయడానికి సైతం దశాబ్దాలు పట్టిన రాజకీయ వ్యవస్థ మనది. అది అమలయ్యేదెన్నడో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరి స్థితుల్లో చంద్రిక లాంటి వారి ఉదంతాలు ఒక మేలుకొలుపు. ఆమె ఆరోపణలు సంపూర్ణ అసత్యాలని కొట్టిపారేయలేం. స్వతంత్ర భారత శతవసంతాల నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది పాలకులు ప్రవచిస్తున్న లక్ష్యం. 2047 కల్లా అది సాధ్యం కావాలంటే, జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళల పాత్ర, వారి ప్రాతినిధ్యం కీలకం. కానీ, అధిక శాతం పార్టీలు, ప్రభుత్వాల చేతలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గమనిస్తే, 1970ల వరకు లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం వద్దే తచ్చాడుతూ వచ్చింది. 2009లో గానీ అది రెండంకెలకు చేరు కోలేదు. రాజ్యసభలో అయితే 1951 నుంచి ఇప్పటి దాకా ఏనాడూ మహిళల సంఖ్య 13 శాతమైనా దాటలేదు. రాష్ట్ర శాసనసభల్లోనైతే సగటు మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువే. మహిళా మంత్రుల సంఖ్యలోనూ మన దేశంలో ఇదే పరిస్థితి. గత మూడు దశాబ్దాల పైచిలుకులో కేంద్రంలో మంత్రిపదవులను చేపట్టిన స్త్రీలు నాటి మహిళా ప్రాతినిధ్యంతో పోలిస్తే 11 శాతమే. క్యాబినెట్ హోదా దక్కినవారైతే 7 శాతమే. రాజకీయ పాలనలో కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలోనూ ఆడవారి వాటా మరీ తీసికట్టు. మొత్తం 30 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 11 శాతమే స్త్రీలు. కార్యనిర్వాహక, శాసన నిర్మాణ వ్యవస్థలతో పోలిస్తే, భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత మరీ కనాకష్టం. 1950 నుంచి చూస్తే, సుప్రీమ్ కోర్ట్ జడ్జీల్లో కూడా ఆడ వాళ్ళు 3 శాతమే. ప్రతిచోటా ఉన్నత స్థాయికి చేరడానికి అతివలకు అనేక అవరోధాలు. ఈ గణాంకాలన్నీ ఇప్పటికీ మహిళల పట్ల మనకున్న దుర్విచక్షణకూ, మారని మన పితృస్వామ్య భావజాలా నికీ నిలువుటద్దాలు. దానికి తోడు దళితులు, వెనుకబడిన వర్గాల స్త్రీల పరిస్థితి మరీ కష్టం. ఈ నేపథ్యం నుంచి పుదుచ్చేరి ఉదంతాన్ని చూసినప్పుడే సమస్య లోతులు స్పష్టమవుతాయి. దాదాపు 156 దేశాల్లో సగటున 23 శాతం మహిళా మంత్రులుంటే, భారత్ తద్భిన్నం. కేంద్రంలో పేరుకు మహిళా మంత్రుల సంఖ్య పెంచినా, వారికి రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, రవాణా, వ్యవసాయం లాంటి కీలక శాఖలు అప్పగించడం అరుదు. ఈ పరిస్థితిని మార్చాలంటే, మహిళా రిజర్వేషన్ చట్టాలు తెస్తే సరిపోదు. కులం, మతం, ప్రాంతం, జెండర్ అంశాల్లో పార్టీల, ప్రజల ఆలోచన మారాలి. వెనుకబడిన వర్గాల, స్త్రీల సమర్థతను శంకించడం క్షమార్హం కాదు. అవకాశమిచ్చి, ప్రోత్సహిస్తే, పలువురు నేతల కన్నా వారే సమర్థులు. పాలిచ్చి పెంచిన అమ్మలు మనల్ని పాలించ లేరా? కుటుంబానికి ఇరుసుగా మారి, మొత్తం సమాజాన్ని నిలబెడుతున్న స్త్రీలు సమర్థులు కారా? వారికా సమర్థత లేదనుకోవడం మూర్ఖత్వం. మకిలిపట్టిన మనసుల్లోని మనుస్మృతి భావజాలం! -
నేనైతే సంతకం పెట్టాను.. కానీ అంతా వాళ్ల చేతిలోనే ఉంది
సాక్షి, చైన్నె : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కేంద్రం చేతిలో ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తన వద్దకు నివేదిక రాగానే, పరిశీలించిన సంతకం పెట్టినట్టు వివరించారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్ మార్మోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ మిత్రపక్షం ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర హోదాకోసం తీర్మానం చేసింది. దీనిని రాజ్‌నివాస్‌కు పంపించారు. అయితే, దీనిని ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తుంగలో తొక్కేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సమాధానం ఇస్తూ ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తీర్మాన నివేదిక తనకు జూలై 22న అందినట్టు పేర్కొన్నారు. మరుసటిరోజే తాను పరిశీలించి సంతకం కూడా చేశానని, అదే రోజున కేంద్రం అనుమతి కోరుతూ ఢిల్లీకి పంపించినట్టు వివరించారు. నిబంధనల పరంగా ఇందులోని అంశాలను కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తన వరకు రాష్ట్ర హోదా ఫైల్లో సంతకం పెట్టానని, అమల్లోకి రావాలంటే కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడాల్సి ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. -
ఏమీ చేయలేక సీఎం కుర్చీలో ఉన్నా!
సాక్షి, చెన్నై : తాను ఏమీ చేయలేని పరిస్థితులలో ఈ కుర్చీలో ఉన్నానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో నియమితులైన నర్సులు తమ ఉద్యోగాలను పరి్మనెంట్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంగళవారం సీఎం రంగస్వామిని కలిసేందుకు వచ్చిన నర్సులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద వీరు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు వారికి మద్దతు ఇచ్చారు. సీఎం రంగస్వామిని కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా నర్సులతో రంగస్వామి మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లగక్కడం గమనార్హం. గతంలో ఉన్న పాలన వేరు, ప్రస్తుతం ఉన్న పాలన వేరని వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో నియమించిన నర్సులను తొలగించాలని అధికారులు తనకు సూచించారని గుర్తుచేశారు. అయితే, తానే మూడు నెలలకు ఒక పర్యాయం కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తూ వచ్చానని వివరించారు. ఇక్కడున్న వారి ముందు చెప్పడంలో సంకటంగా ఉందంటూ, సీఎం కురీ్చలో ఎందుకు ఉన్నానో అని అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెబితే గతంలో అధికారులు చేసే వారని, ఇప్పుడు అలా చేయడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాక్రమాలకు వెళ్లినా, శిలాఫలకంలో తన పేరు ఉందా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు అయితే, వీఆర్ఎస్ ఇవ్వాలని కోరుతున్నారని వివరించారు. విద్యుత్ శాఖలో సెలవులపై అనేక మంది అధికారులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. తన చేతిలో అధికారం ఉంటే, కరోనా కాలంలో సేవలు అందించిన నర్సుల కాంట్రాక్టు ఐదేళ్లకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నానని, తన చేతిలో ఏమీ లేదని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: పుదుచ్చేరి సీఎం
సాక్షి, చైన్నె: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, తాను సైతం ప్రజలతో కలిసే వెళ్తానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి పోలీసులను సోమవారం ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రజలతో మమేకమైతిరిగే నాయకుడు. ఆయన తరచూ మోటారు సైకిల్‌పై సైతం చక్కర్లు కొడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను ఆపేస్తున్నారు. రోజూ గోరిమేడులోని ఇంటి నుంచి సచివాలయం వెళ్లే సమయంలో అనేక ప్రాంతాల కూడలిలో వాహనాలు నిలుపుదల చేస్తూ వస్తున్నారు. తన కారణంగా స్థానికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురు అవుతుండడాన్ని సీఎం పరిగణించారు. దీంతో తన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఇకపై ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించారు. ప్రజల వాహనాలతో పాటే తన వాహనం కూడా ముందుకెళ్తుందని, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజల వాహనాలను కూడా ఆపొద్దని పోలీసులకు ఆయన సూచించడం విశేషం. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 రోజులు స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే!
భారత్‌లో మెల్లమెల్లగా హెచ్3ఎన్2 వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్ ఎఫెక్ట్ తాజాగా పుదుచ్చేరికి తాకింది. ఈ నేపథ్యంలో పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు. సీజనల్ ఇన్ఫ్లుఎంజా H3N2 వైరస్ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారనే నివేదికల నేపథ్యంలో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని పుదేచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా కేసులు అకస్మాత్తుగా పెరగుతూ ఆందోళన కలిగిస్తోంది. గత వారం ప్రారంభంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2 మార్చి 5 మధ్య భారత్‌లో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 23 ఏళ్ల వైద్య విద్యార్థి H3N2 వైరస్‌తో మరణించగా.. గుజరాత్‌లోని వడోదరలో ఈ వైరస్ కారణంగా మొదటి మరణం నమోదైంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. హెచ్3ఎన్2 వైరస్ పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తోంది కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్‌లను మళ్లీ అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంట పాటించడంతో పాటు మహమ్మారి సమయంలో అనుసరించిన నియమాలను మళ్లీ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. చదవండి: ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా.. -
Puducherry: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్ సిలింబర్ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే. -
కేసీఆర్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసైసౌందరరాజన్, ప్రభుత్వం మధ్య విమర్శలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాటల దాడి మరింతగా పెరిగింది. గవర్నర్ తమిళిసై అటు పుదుచ్చేరిలో కూడా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పుదుచ్చేరిలో కూడా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. 5 లక్షల మందితో సీఎం కేసీఆర్ బహిరంగ సభ పెట్టారు. కానీ, రిపబ్లిక్ డే వేడుకలకు మాత్రం కరోనాను సాకుగా చూపించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. కేంద్రానికి నేను ఇవ్వాల్సిన రిపోర్టు పంపించాను. తెలంగాణలో అన్నీ అతిక్రమణలే. రాజ్యాంగ, రాజకీయ, చట్టపరమైన అతిక్రమణలు ఉన్నాయి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు తెలంగాణలో రాజ్‌భవన్ వేడుకల్లో పాల్గొన్న తమిళిసై కేసీఆర్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే ఇష్టం. ఎంతకష్టమైనా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం. కొందరికి ఫార్మ్‌హౌస్‌లు కాదు.. అందరికీ ఫార్మ్‌లు కావాలి. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి’ అంటూ ఆమె కామెంట్స్ చేశారు. -
త్వరలో గృహిణులకు నెలనెలా రూ. 1000
సాక్షి, చెన్నై: ఇంటి యజమానులుగా ఉన్న గృహిణులకు నెలనెలా రూ. 1000 నగదు పంపిణీ చేసే పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని పుదుచ్చేరి సీఎం ఎన్‌రంగస్వామి తెలిపారు. అలాగే అదనంగా 16 వేల మంది వృద్ధులకు పింఛన్లు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అభివృద్ధికి రూ. 2000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని రూ. 1,400 కోట్లను కేటాయించేందుకు ఆమోదించినట్లు చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం విస్తరణ పనులపై దృష్టి పెట్టామని, అయితే తమిళనాడు ప్రభుత్వం స్థలం ఇంతవరకు కేటాయించ లేదని తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్త.. ఆర్థికంగా, పారిశ్రామికంగా తమ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. హెల్త్ పార్క్.. సేదార పట్టిలో పారిశ్రామిక వాడ కోసం 800 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పగించామని, అయితే ప్రస్తుతం ఆ స్థలం మళ్లీ రాష్ట్రం గుప్పెట్లోకి చేరిందన్నారు. ఈ స్థలానికి మరో 200 ఎకరాలను కలిపి 1000 ఎకరాల్లో హెల్త్‌పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో కుటుంబ యజమానులుగా ఉన్న గృహిణిలకు రూ. 1000 పథకం గురించి బడ్జెట్లో ప్రకటన చేశామని తెలిపారు. దీనిని త్వరలో ఆచరణలో పెట్టనున్నామని వెల్లడించారు. అదనంగా 16 వేల మందికి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే 2 వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని ప్రకటించారు. -
ఐదేసిన సిద్ధార్థ్ కౌల్.. పంజాబ్ ఘన విజయం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022 ఎలైట్ గ్రూప్-బిలో పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. జైపూర్ వేదికగా పుదుచ్చేరితో ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన పంజాబ్.. 20 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్.. ప్రత్యర్ధిని కేవలం 86 పరుగులకే కట్టడి చేసింది. వెటరన్ పేసర్ సిద్ధార్థ్ కౌల్ (5/12) ఐదు వికెట్లతో చెలరేగడంతో పుదుచ్చేరి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. సిద్దార్థ్‌కు జతగా బల్తేజ్ సింగ్ (1/17), హర్‌ప్రీత్ బ్రార్ (1/16), మార్కండే (2/17) రాణించారు. పుదుచ్చేరి ఇన్నింగ్స్‌లో పరమేశ్వరన్ శివరామన్ (25), అంకిత్ శర్మ (23), అరుణ్ కార్తీక్ (15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ శర్మ (29), శుభ్‌మన్ గిల్ (21), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23 నాటౌట్), హర్‌ప్రీత్ బ్రార్ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ ఉదేషికి ఓ వికెట్ దక్కింది. -
విష ప్రయోగానికి గురైన బాలుడి మృతి
సాక్షి, చెన్నై: ఓ కిరాతక తల్లి చేసిన విష ప్రయోగంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం రాత్రి మృతి చెందాడు. సరైన వైద్యం అందక పోవడంతోనే ఆ బాలుడు మరణించాడని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడనే అసూయతో 8వ తరగతి విద్యార్థి బాల మణిగండన్‌పై ఓ విద్యార్థిని తల్లి శీతల పానీయంతో శుక్రవారం విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఆ బాలుడికి పుదుచ్చేరిలో అత్యవసర చికిత్స అందించారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులు రాజేంద్రన్, మాలతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పాఠశాల సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లి సహాయ రాణి విక్టోరియా చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. సరైన చికిత్స అందలేదా..? పోలీసులు కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించినా, వైద్యులు మాత్రం ఆ బాలుడికి సరైన చికిత్స అందించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత కోలుకున్నాడని భావించిన బాల మణిగండన్ ఆరోగ్యం శనివారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. విషం శరీరంలోకి కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ బాలుడు మరణించాడు. దీంతో అతడి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. అదే సమయంలో ఆస్పత్రిలో సరైన వైద్యం అందించ లేదని, నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించారని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ విద్యార్థిపై విష ప్రయోగం చేసి హతమార్చిన సహాయ రాణి విక్టోరియాపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని..
సాక్షి, చెన్నై: తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడని ఓ విద్యార్థిపై ఆ తల్లి అసూయ పెంచుకుంది. చివరికి ఆ విద్యార్థిని మట్టు మెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. ఇందులో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఈ విద్యార్థి హఠాత్తుగా స్పహ తప్పి పడిపోయాడు. చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడి సిబ్బంది ఆస్పత్రికి సకాలంలో తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఆ బాలుడు విషం తాగినట్లు వైద్యుల పరిశీలన తేలింది. సెక్యూరిటీ ఇచ్చిన శీతలపానీయంతో.. ఆ పాఠశాల సెక్యూరిటీ ఇచ్చిన శీతల పానీయం తాగడంతోనే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు కోలుకున్న తరువాత తల్లిదండ్రుల దృష్టికి ఆ విద్యార్థి తీసుకెళ్లాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా, ఓ మహిళ తనకు కూల్‌డ్రింక్ ఇచ్చి ఆ విద్యార్థికి ఇవ్వాలని సూచించినట్లు వాంగ్ములం ఇచ్చాడు. డబ్బులకు కక్కుర్తిపడి తాను ఆమె చెప్పినట్లు చేశానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఓ మహిళ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వడాన్ని గుర్తించారు. ఆ దృశ్యాల ఆధారంగా సహాయరాణి విక్టోరియా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్ వచ్చే తన కుమారుడిని అధిగమించి రాజేంద్రన్, మాలతి కుమారుడు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడని పోలీసులకు ఆమె వివరించింది. తన కుమారుడి కంటే అధికంగా మార్కులు సాధిస్తున్న ఈ విద్యార్థిపై తనకు ఈర్ష్య, కోపం పెరిగిందని, అందుకే విషం ఇచ్చి మట్టుబెట్టే ప్రయత్నం చేశానని అంగీకరించింది. ఇది విని పోలీసులు కూడా నివ్వెరపోయారు. చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్‌డిస్క్‌లు -
కాంగ్రెస్‌లో కుమ్ములాట.. పీసీసీని మార్చాలంటూ నేతల ఫైటింగ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి కాంగ్రెస్‌లో అసమ్మతి భగ్గుమంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలంటూ శ్రేణులు రోడ్డెక్కి నిరసనకు దిగాయి. వివరాలు.. పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ సీఎం నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అధికారం చేజారిపోయింది. అప్పటి నుంచి ఎలాగోలా పార్టీని నెట్టుకొస్తున్న నారాయణస్వామిపై నిరసన మేఘాలు కమ్ముకున్నాయి. పార్టీని బలోపేతం చేస్తూ, నిరసన నిప్పును ఆర్పివేసేలా పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలతో సమావేశం కావాలని రాష్ట్ర ఇన్చార్జ్ దినేష్ గుండూరావు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఆయన పుదుచ్చేరికి చేరుకున్నారు. అప్పటికే సమావేశం కోసం గుమికూడిన ఇరువర్గాలు బాహాబాహాకి దిగాయి. ఈ సమయంలో దినేష్ గుండూరావు సమావేశం ప్రాంగణానికి చేరుకోగా ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. గుండూరావు కారును అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. సమావేశం హాలులోకి వెళ్లకుండా గుండూరావుకు పార్టీ శ్రేణులు చుక్కలు చూపించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లురువ్వారు. పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణస్వామిని బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇక కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి భౌతిక దాడులకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీ సీఎం నారాయణ స్వామి సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. -
డెంగీ, చికున్‌గున్యా వ్యాధులకు చెక్.. ఐసీఎంఆర్ శుభవార్త
పుదుచ్చేరి: డెంగీ, చికున్‌గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్లు ఉన్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్‌రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో వైరస్లు ఉండవుకనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్‌గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలో మునిగిపోయారు. అయితే, ఈ ప్రయోగానికి జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్‌గున్యా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి) డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ చెప్పారు. చదవండి: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో.. -
‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన నేత ద్రౌపది ముర్ము(64) పేరును భారతీయ జనతా పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ద్రౌపది ముర్ముపై పుదుచ్చేరి కాంగ్రెస్ ట్విటర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘బీజేపీకి అధ్యక్షుడిగా డమ్మీ వ్యక్తి కావాలి. డమ్మీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ కోరుకుంటోంది. కేంద్రం ఎస్సీ, ఎస్టీ వర్గానికి ద్రోహం చేయాలని చూస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది’ అని పుదుచ్చేరి కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అనంతరం కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది. అయితే డిలీట్ చేసినప్పటికీ ఆలోపే సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో విమర్శలకు దారితీసింది. Congress has started insulting Tribal community & Women Official handle of Congress labels Draupadi Murmu ji as “dummy” Link https://t.co/MUg7STl5GP 1st woman tribal leader from Odisha to serve as Jharkhand Gov,2 time MLA, someone who worked her way up being insulted!! pic.twitter.com/wMbDSrJe8f — Shehzad Jai Hind (@Shehzad_Ind) June 22, 2022 కాంగ్రెస్ ట్వీట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రతిపక్ష కాంగ్రెస్ గిరిజన సమాజాన్ని, మహిళలను అవమానపరిచిందని విమర్శించింది. కాంగ్రెస్ ద్రౌపది ముర్మును డమ్మీగా పేర్కొందని ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన తొలి మహిళా గిరిజన నాయకురాలని పేర్కొంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని కాంగ్రెస్ అవమానించిందంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా ట్విట్టర్లో ధ్వజమెత్తారు. సంబంధిత వార్త: ద్రౌపది ముర్ముకు జెడ్ ప్లస్ భద్రత.. 24న నామినేషన్ -
జిప్మర్లో హిందీ రగడ
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చి)లో పాలనా వ్యవహారాలన్నీ హిందీలోనే జరగాలన్న ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ హిందీ, సంస్కృత భాషలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిప్మర్ ఇచ్చిన హిందీ ఉత్తర్వులపై తమిళాభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని డీఎంకే ఎంపీ కనిమొళి హెచ్చరించారు. పుదుచ్చేరిలో బీజేపీ– ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. -
క్రికెట్ బెట్టింగ్...ఏడుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలోని యానాం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రధాన బుకీ సీహెచ్ సాయిరామ్ వర్మ పరారీలో ఉండగా.. ఏడుగురు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాచకొండ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్, ఇన్స్పెక్టర్ బీ అంజిరెడ్డిలతో కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన తన్నీరు నాగరాజు 2016లో క్రికెట్ బెట్టింగ్ కేసులో వనస్థలిపురం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా తన వైఖరి మార్చుకోలేదు. తాజాగా ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో.. మెయిన్ బుకీ సాయిరామ్ వర్మతో చేతులు కలిపి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగ్స్ మొదలుపెట్టాడు. తన స్నేహితుడైన కృష్ణా జిల్లా, చింతకుంటపాలెం గ్రామానికి చెందిన గుండు కిశోర్‌ను రెండు నెలల పాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయాలని ఇందుకు నెలకు రూ.50వేల కమీషన్ ఇస్తానని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. తన బంధువులైన ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన తన్నీరు అశోక్, చెమ్మేటి వినోద్‌లను సబ్ బుకీలుగా ఏర్పాటు చేసుకొని వనస్థలిపురంలో వినోద్ ఇంట్లో బెట్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మ్యాచ్ మొదలు మూడు లైన్ల ద్వారా సబ్ బుకీలు పందేలు కాసే పంటర్లకు ఆన్లైన్లో లింక్‌లు పంపేవారు. మ్యాచ్ పరిస్థితిని బట్టి పంటర్లు రూ.10–50 వేల మధ్య పందేలు కాస్తుంటారు. ప్రతి బెట్టింగ్‌కు సబ్ బుకీలు రేటింగ్స్ ఇస్తుంటారు. మ్యాచ్ పూర్తయ్యాక.. ఏ పంటర్ల నుంచి ఎంత సొమ్ము వసూలు చేయాలి, ఎంత చెల్లించాలో బుకీలు ఏజెంట్లకు సూచిస్తారు. మొత్తం లాభంలో సబ్ బుకీలకు 3 శాతం కమీషన్‌గా ఇచ్చేవారు. ఆన్లైన్లో పందేలు కాసేవారి కోసం సాయిరామ్ వర్మ ‘రోమన్ క్యాథలిస్ట్ కులమదై స్వామి’ అనే పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్‌లో నకిలీ ఖాతాను తెరిచాడు. గురువారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. సత్యానగర్ కాలనీలోని స్థావరంపై దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సబ్ బుకీలు నాగరాజు, కిశోర్, అశోక్, వినోద్‌లతో పాటు పంటర్లు చైతన్యపురీకి చెందిన కోట్ల దినేష్ భార్గవ్, కొత్తపేటకు చెందిన మేడిశెట్టి కిశోర్, శంకర్‌పల్లికి చెందిన బోజన రాజులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.11.80 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.31,17,576 సొమ్ముతో పాటు 9 ఫోన్లు, కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు) -
కర్ణాటక హిజాబ్ వ్యవహారంపై స్పందించిన మలాలా
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం.. మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలనైన మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలోనూ ‘హిజాబ్’పైనా చర్చ మొదలైంది. మతసామరస్యం పాటించాలని చెబుతూనే శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని, ఒకే తరహా యూనిఫామ్‌లకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని ఓవైపు కర్ణాటక హైకోర్టు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వ్యవహారం మరింత ముదురుతుందే తప్పా.. చల్లారడం లేదు. ఈ క్రమంలో హిజాబ్ వివాదం ఇప్పుడు గ్లోబల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో ఉద్యమకారిణి, నోబెల్ గ్రహీత మలాలా స్పందించారు. బాలికలను హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లనివ్వాలని మలాలా భారతీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తోంది. యూసఫ్‌జాయ్ ట్వీట్లో.. ‘చదువు, హిజాబ్‌లో ఏది ఎంచుకోవాలో కళాశాల మమ్మల్ని బలవంతం చేస్తోంది’ అంటూ విద్యార్థిణిలు ఆవేదనను ట్వీట్ చేసిన ఆమె.. ఆపై భారతీయ నేతలకు విజ్ఞప్తి చేశారు. ‘బాలికలు తమ హిజాబ్‌లో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకంగా ఉందని వ్యాఖ్యానించారామె. ఆడపిల్లలను హిజాబ్‌లు ధరించి పాఠశాలకు వెళ్లనివ్వకపోవడం దారుణం. భారత నాయకులు ముస్లిం మహిళలను చిన్నచూపు చూడటం ఆపాలి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. “College is forcing us to choose between studies and the hijab”. Refusing to let girls go to school in their hijabs is horrifying. Objectification of women persists — for wearing less or more. Indian leaders must stop the marginalisation of Muslim women. https://t.co/UGfuLWAR8I — Malala (@Malala) February 8, 2022 ఇదిలా ఉంటే హిజాబ్ ధరించిన ఆడపిల్లలను క్లాస్ రూంల్లోకి రైట్ వింగ్ గ్రూపులు అనుమతించకపోవడంతో మొదలైన వివాదం.. పోటాపోటీగా కాషాయపు కండువాలతో ర్యాలీలు చేపట్టడంతో మరింత ముదిరింది. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం సామరస్యం పాటిస్తూ.. శాంతి భద్రతలు పాటించాలని పిలుపు ఇస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ హిజాబ్ అభ్యంతరం గళం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్.. హిజాబ్ యూనిఫామ్‌లో భాగం కాదని, క్రమశిక్షణ ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వార్త: హిజాబ్ వ్యవహారం.. మూడు రోజులు అక్కడ విద్యాసంస్థలు బంద్ -
విజయ్‌తో పుదుచ్చేరి సీఎం భేటీ
సాక్షి, చెన్నై: సినీ నటుడు విజయ్‌తో పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి భేటీ అయ్యారు. చెన్నై పయనూర్‌లోని విజయ్ ఇంట్లో శుక్రవారం సాయంత్రం గంటపాటు ఇద్దరూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నగర పాలక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ను కలవడం చర్చకు దారితీసింది. భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన రంగ స్వామిని మీడియా ప్రశ్నించగా, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు వ్యాఖ్యానించారు. విజయ్ తనకు మంచి మిత్రుడని, ఆయనపై అభిమానంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా చర్చనీయాంశం ఈ భేటీ ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్– బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం పగ్గాలు చేపట్టినానంతరం ప్రధాని మోదీని రంగన్న ఇంత వరకు కలవలేదు. అయితే విజయ్ను కలిసేందుకు పుదుచ్చేరి నుంచి రావడం, తనకు మంచి మిత్రుడు అని వ్యాఖ్యానించడాన్ని రాజకీయ వర్గాలు నిశితంగానే పరిశీలిస్తున్నాయి. విజయ్ మక్కల్ ఇయక్కంను పర్యవేక్షిస్తున్న పుదుచ్చేరికి చెందిన పి. ఆనంద్ ఈ భేటీకి ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
3,000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో దగ్గరికి వచ్చిన కస్టమరుకు సీఈఓ క్షమాపణలు
ఇటీవల పుదుచ్చేరికి 3000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఓయో లాడ్జ్ కి వచ్చిన ఒక బృందానికి ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. పుదుచ్చేరిలో ఓయోలో రూమ్ బుక్ చేసిన ఈ బృందానికి తీర ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడ ఆ ఓయో లాడ్జ్ లేదు. దీంతో వారందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. ఈ బృందంలోని సభ్యుల్లో ఒకరైన అభినందన్ పంత్ ఈ అనుభవం గురించి లింక్డ్ ఇన్‌లో పోస్ట్ రాశారు. ఈ ఆసక్తికర పరిణామం గురించి వీడియో కూడా చిత్రీకరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ తొమ్మిది మంది గల బృందం ఓయో 74612 రాయల్ ప్లాజా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లో గదులను బుక్ చేసుకున్నారు. కానీ, వారు 3000 కిలోమీటర్లు ప్రయాణించి ఓయో లాడ్జ్ ఉన్న ప్రదేశానికి డిసెంబర్ 24 రాత్రి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న అడవి మొక్కల ప్రదేశం చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. తాను, తన తోటి ప్రయాణికులు రాత్రి పూట నిర్మానుష్యమైన రహదారిపై చిక్కుకుపోయినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ఓయో కస్టమర్ సర్వీస్ కు కాల్ చేసినప్పుడు, తాము ఇతర లాడ్జింగ్ ఏర్పాటు చేయలేమని తనకు చెప్పినట్లు పంత్ పేర్కొన్నాడు. కానీ అతను ఆ నగరంలో తనిఖీ చేసినప్పుడు 50కి పైగా ఆస్తులు గల ఓయో లాడ్జ్ అందుబాటులో ఉన్నట్లు అతను అన్నాడు. చివరకు అక్కడ ఉండటానికి ఇతర హోటళ్లకు అనేకసార్లు కాల్స్ చేసినట్లు పంత్ చెప్పారు. అక్కడ ఉన్న ఒక హోటల్ లో బస చేశామని, క్రిస్మస్ వారాంతం కావడం వల్ల చివరి నిమిషంలో హోటల్ బుకింగ్ ఖర్చును రెట్టింపు చేసినట్లు తెలిపాడు. గత ఏడాదిగా ఉనికిలో లేని ఈ హోటల్ గురించి చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారని తను అన్నాడు. తనకు అసౌకర్యానికి చింతిస్తూ ఓయోపై కేసు వేస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. భారతదేశం & ఆగ్నేయ ఆసియా ఓయో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ అభినందన్ పంత్ లింక్డ్ ఇన్ పోస్టుకు స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. "అలాగే, ఆ లాడ్జ్ మా ప్రమాణాలను ఏమాత్రం చేరుకోలేదు. మీ అనుభవంతో మరిన్ని మార్పులు చేయడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి మేము సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాము" అని కపూర్ పంత్ పోస్ట్ పై ఒక వ్యాఖ్యలో తెలిపారు. ఓయో సీఈఓ తను అసౌకర్యానికి గురైన ప్రాంతానికి సంబంధించిన లొకేషన్ పంపమని అభినందన్ ను కోరాడు. "అలాగే మీ అనుభవం నుంచి మరింత నేర్చుకుంటాను" అని ఆయన అన్నారు. (చదవండి: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌పై ఎయిర్టెల్ కీలక నిర్ణయం..!) -
వామ్మో.. చుక్క పడకపోతే ఎలా... కరోనా టీకా వద్దంటే వద్దు..
ఈ ఫోటోలో చెట్టెక్కి కూచున్న వ్యక్తి పేరు ముత్తువేల్. పుదుచ్చేరి వాసి. కరోనా టీకా తీసుకోవడానికి నిరాకరిస్తూ ఇలా చెట్టెక్కి కూర్చున్నాడు. పుదుచ్చేరిలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అందరికీ టీకాలు వేస్తున్నారు. వారిని చూడగానే ముత్తువేల్ ఇదిగో ఇలా చెట్టేక్కాశాడు. ఇదివరకు కూడా అతనిలాగే టీకా తీసుకోకుండా తప్పించుకున్నాడని అధికారులు తర్వాత గుర్తించారు. చదవండి: రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్‌కి అధికం సూది మందు అంటే భయం కాబట్టి ఇలా చేశాడనుకుంటున్నారేమో! అసలు విషయం అది కాదు... కరోనా టీకా తీసుకుంటే కొద్దిరోజులు మద్యం జోలికి వెళ్లొద్దని ముత్తువేల్‌కు చెప్పారు. వామ్మో... చుక్క పడకపోతే ఎలా... అని టీకా వద్దంటే వద్దంటున్నాడు. అరోగ్య కార్యకర్తలు ఎంత బతిమిలాడినా కిందకు దిగలేదు. వారు వెళ్లిపోయిన తర్వాతే దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆ మూడు గంటలు లిక్కర్ సేల్స్‌పై బ్యాన్
సాక్షి, చెన్నై(తమిళనాడు): దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్‌పై రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించడంతోపాటు కోవిడ్ ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా, మద్రాసు హైకోర్టు ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలను విధించాలంటూ సూచించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబరు 31 రాత్రి 10 గంటల.. అర్ధరాత్రి 1 గంట దాకా.. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించింది. ఆ మూడు గంటల పాటు బార్లు, హోటళ్లు ఎక్కడా కూడా మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాలని బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రెండు డోసుల టీకా ధృవీకరణ పత్రం లేకుండా డిసెంబరు 31 న రాత్రి 7గం. తర్వాత బహిరంగ ప్రదేశాలలో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. వేడుకల సమయంలో ప్రజలు ఆంక్షలను కఠినంగా పాటించాలని కోరారు.ప్రజలంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని ఆమె కోరారు. పర్యాటకులు, రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరి పాటించాలని సూచించారు. వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను కూడా పరిమితంగా ఉండేలా చూడాలన్న ఆదేశాలు ఇదివరకే జారీ అయ్యాయి. -
Mitra Satheesh: నీలగిరి ‘తోడాలు’.. పాండిచ్చేరి చాపనేత.. ఎన్నెన్నో విశేషాలు!
Kerala Mithra Satheesh And Son On Epic Road Trip To Kashmir Interesting Facts: తెలుగువాళ్ల పూతరేకులు నచ్చాయి... జమ్ము – సోనామార్గ్లు కనువిందు చేశాయి. అస్సాం ఆదివాసీలు మనసు దోచుకున్నారు. నాగాలాండ్ గ్రీన్ విలేజ్ స్వాగతం పలికింది. ఇదీ... ఈ తల్లీకొడుకుల పర్యటన స్వరూపం. డాక్టర్ మిత్రా సతీశ్ వయసు నలభై. ఆమె కేరళ రాష్ట్రం, కొచ్చిలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్. ఆమె కొడుకు నారాయణ్‌కి పదేళ్లు. ఇద్దరూ కారు ట్యాంకు నింపుకుని కొచ్చిలో బయలుదేరారు. ఏకంగా 17 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. తమ భారతదేశ పర్యటనలో 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేశారు. ఇంతకీ ఈ సుదీర్ఘ ప్రయాణం ఎందుకు? ఈ ప్రయాణంలో వాళ్లు తెలుసుకున్న కొత్త సంగతులేంటి? తెలుసుకుందాం. నీలగిరి ‘తోడా’లు డాక్టర్ మిత్ర గ్రామీణ భారతాన్ని స్వయంగా చూడడానికి, అర్థం చేసుకోవడానికి వెళ్లారు. తోడా గిరిజనులను దగ్గరగా చూడడానికి, వారి జీవనశైలిని అధ్యయనం చేయడానికి కొచ్చి నుంచి నేరుగా నీలగిరికి ప్రయాణమయ్యారామె. అలా అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించాలనుకున్నారు. అందుకే రాష్ట్రంలో కనీసం ఒక్క గ్రామాన్నయినా చూసేటట్లు టూర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఆ ఒక్క గ్రామం కూడా ఆ ప్రదేశానికి చెందిన లలిత కళలు, హస్తకళల ప్రాముఖ్యత ఉన్న గ్రామాలనే ఎంపిక చేసుకున్నారు డాక్టర్ మిత్ర. ఆ జాబితాలో ఇప్పటికే బయటి ప్రపంచానికి తెలిసినవి కొన్ని, తెలియనివి ఎక్కువగా ఉన్నాయి. పాండిచ్చేరి చాపనేత ఈ తల్లీకొడుకులు తమ పర్యటనలో పాండిచ్చేరిలోని ఒక ముస్లిమ్ కుటుంబం నుంచి చాపనేత కళ నేర్చుకున్నారు. నాలుగు వందల ఏళ్ల నుంచి వారసత్వంగా వస్తున్న కళ ఈ చాపనేత. స్థానికంగా దొరికే గడ్డిని మగ్గం మీద చాపలాగ నేస్తారన్నమాట. అలాగే వెళ్లిన ప్రతిచోటా స్థానిక రుచులను ఆస్వాదించారు. భౌగోళిక, చారిత్రక నేపథ్యాల్లో రూపుదిద్దుకున్న ప్రత్యేకమైన జీవనశైలిని చూసి ఆనందించారు. అలా జమ్ము, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, జైపూర్, ఉజ్జయిన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా మీదుగా కేరళ చేరుకున్నారు. ఈ టూర్ లో మిస్ అయిన కర్నాటక కోసం దీనికి అనుబంధంగా ఓ చిన్న టూర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారామె. అందులో కూర్గ్, బేలూర్, బేలావాడి, మెల్కొటేలుంటాయన్నారు. అచ్చమైన మనిషి సోనామార్గ్, అస్సాం, చత్తీస్‌గఢ్ వాళ్లు ఆత్మీయతంగా, స్వార్థరహితంగా కనిపించారు. వాళ్లను చూసినప్పుడు అచ్చంగా మనిషిని చూసిన సంతోషం కలిగిందన్నారామె. ‘‘జంతువులను వేటాడమే వృత్తిగా కలిగిన బోడో గిరిజనులు ఇప్పుడు మానాస్ నేషనల్ పార్క్‌లో జంతువులను సంరక్షిస్తున్నారు. ఇండియాలో తొలి గ్రీన్ విలేజ్ ఖోనామాను నాగాలాండ్‌లో చూశాను. ఆదివాసీలందరూ పర్యావరణహితమైన వ్యవసాయ విధానాలను పాటిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోవడం నా వంతయింది. వాళ్లు వేటను పూర్తిగా త్యజించారు. ఒక మహిళ ఇలా దేశ పర్యటనకు వచ్చిందని తెలిసి అబ్బురపడుతూ నాకు జాగ్రత్తలు చెప్పారు. ఈ టూర్లో మేము చూసిన ఎత్తైన ప్రదేశం లధాక్‌లోని జోజి లా. మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ప్రదేశం జమ్ము, కశ్మీర్‌లోని సోనామార్గ్ హిల్‌స్టేషన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ల పూతరేకుల రుచిని మర్చిపోలేం. హోమ్లీ స్టే ఇక ఈ టూర్ కోసం నేను పాటించిన జాగ్రత్తలేమిటంటే... సూర్యోదయం స్టీరింగ్ పట్టుకుంటే సూర్యాస్తమయం సమయానికి ఆ రోజు ప్రయాణాన్ని ఆపేసేదాన్ని. బస కోసం హోమ్స్టేలకే ప్రాధాన్యం ఇచ్చాను. హోటళ్లతో పోలిస్తే ఖర్చు తగ్గడం మాత్రమే కాదు, స్థానికుల ఆత్మీయతను ఆస్వాదించవచ్చు. సొంతవాళ్లతో ఉన్నట్లే అనిపిస్తుంది. వారి సంప్రదాయాలను, జీవనశైలిని కూడా తెలుసుకోవచ్చు. నమ్ముతారో లేదో కానీ ఈ టూర్‌కి అయిన ఖర్చు ఒకటిన్నర లక్ష మాత్రమే. నాకు ఈ టూర్‌కి వెళ్లకముందు కారు నడపడం మాత్రమే తెలుసు. టూర్ కోసం కారుకి వచ్చే చిన్న చిన్న రిపేర్లు, టైరులో గాలి చెక్ చేసుకోవడం, టైరు మార్చడం వంటివి కూడా నేర్చుకున్నాను. మగవాళ్లు లేకుండా ఆడవాళ్లు మాత్రమే సోలో టూర్ చేసేటప్పుడు పిల్లలను తీసుకువెళ్లడానికి భయపడతారు. కానీ పదేళ్లు నిండిన పిల్లలైతే ఏమీ భయపడాల్సిన పని లేదు. కొత్త ప్రదేశాల నుంచి పెద్దవాళ్ల కంటే పిల్లలే ఎక్కువ తెలుసుకుంటారు. అలాగే ప్రదేశాలకు తగినట్లు, పరిస్థితులకు అనుగుణంగా మెలగడం కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలను తీసుకుని వెళ్లడమే సరైన నిర్ణయం’’ అంటారు డాక్టర్ మిత్ర. చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు... RJ Malishka: ముంబై కీ రాణీ.. ఈ స్వరం... మైమరపిస్తుంది.. పనిచేయిస్తుంది! -
పుదుచ్చేరి: బైకులో తీసుకేళుతుండగా పేలిన నాటుబాంబులు
-
టపాకాయలు తీసుకుని గంటలో వస్తానన్నారు.. అంతలోనే..
పుదుచ్చేరి: దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పుదుచ్చేరి లోని విల్లుపురం జిల్లాలో జరిగింది. కూనిమెడు గ్రామానికి చెందిన కలైనేషన్, తన కొడుకు ప్రదీప్‌తో కలసి టపాకాయలు కొనుగోలు చేసి స్కూటర్‌పై.. తన స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో విల్లుపురం రహదారిపై ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ద్విచక్ర వాహనం పెద్ద ఎత్తున పేలిపోయి.. కలైనేషన్, ప్రదీప్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో వీరితో పాటు మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి.. ఒక లారీతోపాటు, రెండు ద్విచక్రవాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒక గంటలో వస్తామని చెప్పిన భర్త.. కొడుకు చనిపోయారని తెలియడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, పేలుడుకి గల కారణాలు తెలియాల్సిఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: భార్యకు వీడియో కాల్ చేసి జైలు వార్డెన్ ఆత్మహత్య -
బాలికతో క్రికెట్ కోచ్ అసభ్యకర ప్రవర్తన..భుజాలు, ఇతర భాగాలను తాకుతూ..
పుదుచ్చెరి: శిక్షణ కోసం వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై క్రికెట్ కోచ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. సీనియర్ క్రికెటర్, కోచ్ అయిన నిందితుడు తన వద్ద శిక్షణ తీసుకుంటున్న టీనేజర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్ అసోయేషన్ ఆఫ్ పాండిచ్చేరి (సీఏపీ)కి చెందిన ఐదుగురు ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సీనియర్ ప్లేయర్, కోచ్ అయిన తమరైకన్నన్ వద్ద శిక్షణ తీసుకుంటున్న తనని అసభ్యంగా తాకి వేధించినట్టు మెట్టుపాళయంలోని పోలీసులకు చైల్డ్ లైన్ ద్వారా ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. కోచ్ తమరైకన్నన్ ప్రేమిస్తున్నట్టు మెసేజ్ చేశాడని, అంగీకరించకపోతే కోచింగ్ ఇవ్వనని బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. చివరకు కోచ్ ఆగడాలను భరించలేని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. అయితే బాలిక తన మీద ఫిర్యాదు ఇవ్వబోతోందన్న విషయాన్ని తెలుసుకున్న కోచ్ తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆమెను బతిమలాడినట్లు తెలిపింది. అయినప్పటికీ అతనికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో చైల్డ్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించింది. దీంతో తమరైకన్నన్ సహా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డులోని ఐదుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. చదవండి: స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత -
నడి సముద్రంలో క్రికెట్..!
సాక్షి, చెన్నై(తమిళనాడు): ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్ గెలుపును కాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ నడి∙సముద్రంలో స్కూబా డైవింగ్ ట్రైనర్లు ప్రదర్శించిన సాహసం శనివారం వెలుగులోకి వచ్చింది. నడి సముద్రంలో బ్యాట్ బాల్ పట్టి క్రికెట్ ఆడుతూ వీరు చేసిన వీడియో వైరల్‌గామారింది. ఇటీవల పుదుచ్చేరిలో స్కూబా డైవింగ్ శిక్షణ పొందుతున్న వారు నడి సముద్రంలో ఓ జంటకు వివాహం చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సంచలనానికి దారి తీసింది. ఈ సాహసాన్ని మరోమారు తలపించే విధంగా డైవింగ్ శిక్షణ పొందిన స్విమ్మర్లు వినాయక చవితిపర్వదినం వేళ గణపయ్య ›ప్రతిమను నడి సముద్రంలో నిమజ్జనం చేసి వార్తల్లోకి ఎక్కా రు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం దుబాయ్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో చెన్నై సూపర్ సింగ్స్ విజయాన్ని కాంక్షిస్తూ, «ధోని సేనకు శుభాకాంక్షలు తెలిపే విధంగా స్విమ్మర్లు నడి సముద్రంలో క్రికెట్‌తో అలరించారు. పుదుచ్చేరి – తమిళనాడుకు చెందిన టెంపుల్ అట్ వెంచర్స్ పేరిట స్కూబా డైవింగ్ శిక్షణలో ఉన్న అరవింద్ నేతృత్వంలోని బృందం ఈ సాహసం చేసింది. చెన్నై శివారులోని నీలంకరై నుంచి పుదుచ్చేరి మధ్యలో 12 నాటికన్ మైళ్ల దూరంలో నడి సముద్రంలో క్రికెట్ ఆడారు. స్టంపులు, బ్యాట్, బాల్ అంటూ అన్ని రకాల సామగ్రితో భద్రతా పరమైన ఏర్పా ట్లతో ఈ బృందం చెన్నై కింగ్స్ ఆటగాళ్లను తలపించే విధంగా జెర్సీ ధరించి సముద్రంలో క్రికెట్ ఆడారు. ఈ వీడియో శనివారం వైరల్‌గా మారింది. ఫైనల్స్ లో చెన్నైకింగ్స్ విజయ కేతనంతో ఈ స్కూబా డైవింగ్ ట్రైనర్లే కాదు, తమిళ క్రీడాభిమానులూ ఆనంద సాగరంలో మునిగిపోయారు. -
Puducherry: వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం.. తమిళి సై టీకా మెలిక
సాక్షి, చెన్నై(తమిళనాడు): కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉద్యోగుల జీతాలకు.. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ టీకా మెలిక పెట్టారు. కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం, దీపావళి రాయితీలు అని గురువారం ప్రకటించారు. వ్యాక్సిన్ ఆవశ్యకతను వివరిస్తూ, అందరూ టీకా వేసుకోవాలన్న నినాదంతో పుదుచ్చేరిలో వైమానిక దళానికి చెందిన సైనికులు గురువారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. రాజ్ నివాస్ ఆవరణలో ఈ ర్యాలీని తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలో మాస్క్ వేటకు 200 బృందాలు చెన్నైలో మళ్లీ మాస్క్‌లు ధరించే వారు, భౌతిక దూరం పాటించే వారి సంఖ్య తగ్గింది. దీంతో ప్రత్యేక బృందాల్ని చెన్నై కార్పొరేషన్ గురువారం రంగంలోకి దింది. రెండు వందల ప్రత్యేక బృందాలు జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద నిఘా వేయనున్నాయి. మాస్క్‌లు ధరించని వారి వద్ద నుంచి స్పాట్ ఫైన్ వసూలు చేయడమే కాకుండా, హెచ్చరించి మరీ మాస్క్‌లు ఇచ్చే పనిలో పడ్డారు. ఇక, చెన్నై వేప్పేరిలోని వ్యవసాయ కళాశాలలో 13 మంది, కోయంబత్తూరులోని నర్సింగ్ కళాశాలలో 46 మంది విద్యార్థులు కరోనా బారిన పడడం గమనార్హం. చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు -
పుదుచ్చేరి స్పీకర్‌కు గుండెపోటు, ఆస్పత్రిలో చేరిక
సాక్షి, చెన్నై: గెండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ ఆర్ సెల్వం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అత్యవసర చికిత్స అందిస్తున్నామని, ఆయన్ని చెన్నైకు తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా పుదుచ్చేరి స్పీకర్, బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం ఆర్ సెల్వం మంగళవారం గుండెపోటుకు గురవ్వగా ఆయను ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సీఎం రంగస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన ఈనంతరం గత నెల 26(ఆగస్టు) అసెంబ్లీలో బడ్జెట్ దాఖలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్పీకర్ ఎన్బలం సెల్వం నేతృత్వంలో సభా వ్యవహరాలు సాగుతూ వస్తున్నాయి. మంగళవారం ఇంటి నుంచి కారులో అసెంబ్లీకి స్పీకర్ సెల్వం బయలుదేరారు. కారు అసెంబ్లీ ఆవరణలోకి రాగానే సెల్వంకు శ్వాస సమస్య తలెత్తింది. డ్రైవర్, భద్రతా సిబ్బంది ఆయన్ని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఈమేరకు వైద్యం చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. సమావేశాలకు ఆటంకం కల్గకుండా డిప్యూటీ స్పీకర్ రాజ వేలు సభను నడిపించారు. సీఎం రంగస్వామి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకుని స్పీకర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. చదవండి: అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లొస్తాయ్! అప్పడాలపై జీఎస్టీ ! ట్విట్టర్లో రచ్చ రచ్చ -
జాలర్ల ఫైట్.. గాల్లో కాల్పులు
-
జాలర్ల ఫైట్.. గాల్లో కాల్పులు
సాక్షి, చెన్నై: నిషేధిత వలల విషయంపై రెండు గ్రామాల జాలర్ల మధ్య శనివారం పుదుచ్చేరిలో వివాదం భగ్గుమంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు రౌండ్లు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. రాష్ట్రంతోపాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జాలర్లు వినియోగించే కొన్ని రకాల వలలపై ప్రభుత్వం నిషేధించింది. అలాగే పడవల కు కొన్ని రకాల ఇంజిన్లు వాడకానికి కూడా అనుమతులు రద్దు చేసి ఉంది. అయితే, ఓ వర్గం ఈ నిషేధానికి అనుకూలంగా, మరో వర్గం వ్యతిరేకం అన్నట్టుగా జాలర్లు విడిపోయారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య నిరసనలు, వివాదాలు తరచూ చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పుదచ్చేరిలో శనివారం రెండు గ్రామాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చదవండి: ఆ తల్లి నిర్దోషి, ఇవన్ని ఆకాశరామన్న ఉత్తరాలే?! గాల్లోకి కాల్పులు.. వీరాపట్నం, నల్లవాడు గ్రామానికి చెందిన జాలర్ల మధ్య ఈ వలల విషయంలో వివాదం రగులుతూ వస్తోంది. శనివారం వీరాపట్నం జాలర్లు నల్లవాడు సరిహద్దుల్లో 30కి పైగా పడవల్లో నిషేధిత వలల్ని ఉపయోగించి చేపల వేటలో నిమగ్నం అయ్యారు. వీరిని అడ్డుకునేందుకు వీరాపట్నం గ్రామ జాలర్లు ఏకం కావడం, ఈటెలు, కర్రల సాయంతో సముద్రంలోకి వెళ్లారు. ఈ సమాచారంతో నల్లవాడు గ్రామం నుంచి పెద్దఎత్తున జాలర్లు తరలిరావడంతో పరస్పరం దాడులకు సిద్ధం అయ్యారు. రెండు గ్రామాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలు మార్లు గాల్లో కాల్పులు జరిపి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సముద్రంలో చేపల వేటలో ఉన్న జాలర్ల మీద సైతం డమ్మి బుల్లెట్లను ఉపయోగించి తరిమి కొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈనేపథ్యంలో రెండు గ్రామాల మధ్య మళ్లీ ఉద్రిక్తత నెలకొనకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అరియాకుప్పం ఎమ్మెల్యే భాస్కరన్ నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగి,రెండు గ్రామాల జాలర్లతో చర్చిస్తున్నారు. -
ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ గురువారం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణ, పాండిచ్చేరి లోని తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ప్రధానికి పీఎం అండ్ పీఎం, మరో పుస్తకాన్ని గవర్నర్ తమిళ సై అందించారు. -
షూటింగ్లో పొల్గొన్న ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్
చెన్నై: నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పుదుచ్చేరిలో జరుగుతున్న తన రాజా చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ శుక్రవారం పుదుచ్చేరిలో మొదలైంది. ఉదయనిధికి జంటగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. కలైయరసన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రేమ్ ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. దీనికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. -
ఆ డ్యామ్‌కు మేమూ వ్యతిరేకం: పుదుచ్చేరి బీజేపీ
సాక్షి, చెన్నై: మేఘదాతులో డ్యాం నిర్మాణానికి తాము వ్యతిరేకమని పుదుచ్చేరి బీజేపీ ప్రకటించింది. నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రధానిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ పుదుచ్చేరి అధ్యక్షుడు స్వామినాథన్ ఆదివారం ప్రకటించారు. కావేరి తీరంలోని మేఘదాతు వద్ద డ్యాం నిర్మాణం కోసం కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, బీజేపీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే... పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ సైతం డ్యాంకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తోంది. ఈ క్రమంలో తామూ వ్యతిరేకమని పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడు స్వామినాథన్ ప్రకటించడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. కావేరి జలాలపై పుదుచ్చేరికి సైతం హక్కులు ఉన్నాయని, ఇక్కడి రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేఘదాతులో డ్యాంను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. -
కొలువుదీరిన మంత్రివర్గం: సీఎం చేతిలో 13 శాఖలు
సాక్షి, చెన్నై: రెండు నెలల అనంతరం పుదుచ్చేరి మంత్రి వర్గం శాఖల కేటాయింపుతో పూర్తి స్థాయిలో కొలువుదీరింది. ఐదుగురు మంత్రులకు సీఎం రంగస్వామి ఆదివారం శాఖల్ని కేటాయించారు. గత నెల 27న బీజేపీకి చెందిన ఇద్దరు, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరికి శాఖల కేటాయింపుల్లో జాప్యం తప్పలేదు. ముఖ్యశాఖలపై బీజేపీ కన్నేయడంతోనే ఈ జాప్యం నెలకొంది. ఎట్టకేలకు శాఖల కేటాయింపు ప్రక్రియను సీఎం రంగస్వామి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో ముగించారు. సీఎం రంగస్వామి చేతిలో సాధారణ, స్థానిక పాలన, ఆరోగ్యం, దేవదాయ, హార్బర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా 13 శాఖలు ఉన్నాయి. బీజేపీ మంత్రి నమశ్శివాయంకు హోం, విద్యుత్, పరిశ్రమలు, విద్య, క్రీడలు సహా ఆరు శాఖలు కేటాయించారు. మరో బీజేపీ మంత్రి సాయి జె శరవణకుమార్‌కు పౌరసరఫరాలు, డీఆర్డీఏ, అగ్ని మాపక, మైనారిటీ వ్యవహారాలు సహా ఆరు శాఖలు అప్పగించారు. ఇక, ఎన్ఆర్ కాంగ్రెస్ మంత్రులు లక్ష్మీనారాయణన్‌కు ప్రజాపనులు, పర్యాటకం, మత్స్య, న్యాయ, సమాచార శాఖలు, తేని జయకుమార్‌కు వ్యవసాయం, అటవీ, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన సామాజిక వర్గం, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, చంద్ర ప్రియాంకాకు రవాణా, ఆది ద్రావిడ, గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖ లను కేటాయించారు. -
జూలై 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం
రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు మరింత విస్తృతం చేద్దామని అధికారులకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పూర్ణలింగం నేతృత్వంలోని కమిటీ పిలుపునిచ్చింది. ఇక పుదుచ్చేరిలో ఈనెల 16 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పాలకులు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలతో కరోనా కట్టడిలోకి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోమవారం నుంచి మరిన్ని ఆంక్షలు సడలించారు. తమిళనాడు నుంచి పుదుచ్చేరికి బస్సుల సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక వ్యాక్సిన్ డ్రైవ్ ఆదివారం నుంచి మళ్లీ పుంజుకుంది. వ్యాక్సిన్ కొరతతో రెండు రోజులుగా డ్రైవ్ ఆగింది. తాజాగా టీకాల రాకతో ఆదివారం ఉదయం నుంచి ఆయా నగరాల్లోని కేంద్రాల్లో టీకాలు వేసే పనిలో ఆరోగ్యశాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఆదివారం నిబంధనల్ని ఉల్లంఘించి జనం బీచ్‌ల వైపు తరలిరావడంతో కట్టడికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా కట్టడిపై మరింతగా చేపట్టాల్సిన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సచి వాలయంలో సమావేశమైంది. పూర్ణలింగం నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన కమిటీ నామక్కల్ కవింజర్ మాలిగైలో భేటీ అయింది. ఈ భేటీకి సీఎస్ ఇరైఅన్భు, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ హాజరయ్యారు. పూర్తి స్థాయిలో కరోనా కట్టడికి మరింత విస్తృతంగా చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా చర్యలకు సిద్ధమయ్యారు. పుదుచ్చేరిలో బడులు.. పుదుచ్చేరిలో కరోనా కట్టడిలోకి వచ్చింది. దీంతో పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు తగ్గట్టుగా అభిప్రాయ సేకరణకు సీఎం రంగస్వామి నిర్ణయించారు. ఆదివారం జరిగిన ఈ అభిప్రాయ సేకరణ అనంతరం రంగస్వామి రాజ్‌నివాస్‌కు వెళ్లారు. ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో రంగస్వామి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలలు, కళాశాలలు తెరవనున్నట్టు ప్రకటించారు. 9, 10,11,12 తరగతుల విద్యార్థులకు, కళాశాల స్థాయి విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతాయని వివరించారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం పూర్తి స్థాయిలో ఫిట్ ఇండియా మూమెంట్ సర్టిఫికెట్‌ను పొందాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల ప్రారంభానికి ముందే ఆయా విద్యా సంస్థలు ఫిట్ ఇండియా.జీఓవి.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఏడాదిన్నర కాలంగా కరోనా ఆర్థికంగా దెబ్బతీయడంతో అనేక కుటుంబాలు తమ పిల్లల చదువులకు స్వస్తిపలికినట్టు సర్వేలో తేలింది. తొమ్మిదో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు 27 శాతం మేరకు విద్యార్థులు బడులు మానేసి ఉండడం గమనార్హం. -
Puducherry: కొలువుదీరిన రంగన్న కేబినెట్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో 55 రోజుల అనంతరం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని మంత్రి వర్గం కొలువుదీరింది. ఐదుగురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయన కరోనా బారిన పడడం, ఆ తదుపరి పరిణామాలతో కొత్త కేబినెట్ కొలువులో జాప్యం నెలకొంది. బీజేపీతో చర్చలు ఫలించడంతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నమశ్శివాయంతో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణన్, బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణన్ కుమార్‌కు, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన తేని జయకుమార్, చంద్ర ప్రియాంక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం అరగంటలో ముగించారు. దీన్ని డీఎంకే బహిష్కరించింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన బీజేపీ ఎమ్మెల్యే జాన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. 1980–1983లో కాంగ్రెస్ డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకా అప్పాదురై మంత్రిగా పనిచేశారు. తర్వాత 40 ఏళ్లకు మహిళా మంత్రిగా చంద్ర ప్రియాంక పగ్గాలు చేపట్టారు. ఆమె కారైక్కాల్ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. విద్యావంతురాలైన చంద్రప్రియాంక మాజీ మంత్రి చంద్రకాశి కుమార్తె కావడం గమనార్హం. కాగా కేంద్రాన్ని డీఎంకే సర్కారు యూనియన్ ప్రభుత్వం (ఒండ్రియ అరసు) అని పిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పుదుచ్చేరిలో ప్రమాణ స్వీకార సమయంలో ఎల్జీ అదే పదాన్ని ఉపయోగించే రీతిలో ఇండియా ఒండ్రియం (భారత యూనియన్) పరిధిలోని పుదుచ్చేరి అని మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం గమనించదగ్గ విషయం. చదవండి: బంగారు పతకం గెలిస్తే రూ.3 కోట్లు -
పుదుచ్చేరి స్పీకర్‌గా సెల్వం
సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బిజేపి బలం పెరిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరపున ఆరు మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచారు. ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి 16 సీట్లలో గెలిచి పుదుచ్చేరి అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. సీఎంగా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగ స్వామి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి రెండు మంత్రి పదవులతో పాటుగా స్పీకర్ పదవిని ఎన్ఆర్ కాంగ్రెస్ కేటాయించింది. ఇదిలా ఉండగా, స్పీకర్ ఏకగ్రీవ ఎంపికతో ఇక మంత్రివర్గం విస్తరణకు రంగ స్వామి చర్యలు తీసుకున్నారు. మంత్రులు ఎంపిక చేసిన వారి జాబితాను గురు లేదా శుక్రవారం ఎల్జీ తమిళి సై సౌందరరాజన్‌ను కలిసి సమర్పించనున్నారు. ఈనెల 21న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. చదవండి: ఆ.. ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత -
కరైకల్ పోర్టుపై అదానీ కన్ను..!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తాజాగా పుదుచ్చేరిలోని కరైకల్ పోర్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరైకల్ పోర్టు విలువను రూ. 1,500–2,000 కోట్లుగా పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే డీల్ కుదుర్చుకోవడం అంత సులభమేమీకాదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు యాజమాన్య వాటాలు, రుణాలు అడ్డంకికావచ్చని తెలియజేశాయి. కరైకల్ పోర్టు ప్రయివేట్(కేపీపీఎల్)కు మార్గ్ లిమిటెడ్ ప్రమోటర్కాగా.. 45 శాతం వాటాను కలిగి ఉంది. నాలుగు పీఈ సంస్థలు అసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్, జాకబ్ బాల్స్ క్యాపిటల్, అఫిర్మా క్యాపిటల్, జీఐపీ ఇండియా సంయుక్తంగా పీపీఎల్లో 44 శాతం వాటాను పొందాయి. మిగిలిన 11 శాతం వాటా ఎడిల్వీజ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ చేతిలో ఉంది. రుణాల్లో 97 శాతం కేపీపీఎల్ రుణ భారం రూ. 2,000 కోట్లు కాగా.. దీనిలో 97 శాతం ఎడిల్వీజ్ ఏఆర్సీ పీఎస్‌యూ బ్యాంకుల కన్సార్షియం నుంచి బదిలీ చేసుకుంది. దీంతో కేపీపీఎల్‌ను కొనుగోలు చేయాలంటే కంపెనీ విలువకు సంబంధించి ప్రమోటర్లు, పెట్టుబడిదారులు, రుణదాతల మధ్య అవగాహన కుదరవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కేపీపీఎల్‌ను సొంతం చేసుకునే అంశం సంక్లిష్టమైనదిగా వ్యాఖ్యానించాయి. అవకాశాలిలా.. కేపీపీఎల్‌ను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసేందుకు రెండు అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటిలో తొలుత కంపెనీకున్న రుణ భార చెల్లింపునకు ఎడిల్‌వీజ్‌తో చర్చలు జరపడంతోపాటు.. వాటాదారులకు నగదు చెల్లింపు ద్వారా వాటాలను సొంతం చేసుకోవడం. అయితే ఇది వ్యయభరితమని తెలియజేశాయి. బలహీన ఆర్థికాంశాల రీత్యా కంపెనీ విలువ రూ. 1,500 కోట్లుగా అంచనా. రుణ భారం రూ. 2,000 కోట్లవరకూ ఉంది. ఈ డీల్ ప్రకారం చూస్తే అదానీ పోర్ట్స్ ఇటీవల కొనుగోలు చేసిన కృష్ణపట్నం, గంగవరం పోర్టులకంటే ఖరీదైన వ్యవహారంగా మిగలనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా పాజిటివ్
పుదుచ్చేరి:పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కరోనా బారినపడ్డారు. ఈనెల 7వ తేదీ సాయంత్రం పదవీ ప్రమాణం చేసిన వెంటనే ఆయన విధుల్లో చేరారు. తాజాగా జ్వరం రావడంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకుని.. పాజిటివ్‌గా తేలడంతో సోమవారం చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనతో సఖ్యతగా మెలిగిన ఎమ్మెల్యేలకు కూడా సోమవారం కరోనా పరీక్షలు చేశారు. ఈ కారణంగా ఈనెల 14వ తేదీన జరగాల్సిన మంత్రుల పదవీ ప్రమాణం కార్యక్రమం వాయిదాపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే కరోనా కష్టకాలంలో పనిచేయాల్సి ఉన్నందున సీఎం ఆశీస్సులతో ఆదేరోజున ఉప ముఖ్యమంత్రి సహా నలుగురు మంత్రులు పదవీ ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అలాగే, అరియలూరు జిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి శివశంకర్‌కు కరోనా సోకడంతో హోం క్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. చదవండి: రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి కేంద్రం చేసింది క్రూరమైన నేరం: సిసోడియా -
రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి
సాక్షి, పుదుచ్చేరి : పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్. రంగస్వామి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి తమిళ భాషలో దేవుడ్ని స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారా పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6 సీట్లను గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించిన సంగతి తెలిసిందే. -
ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు
-
బీజేపీ కూటమి గెలుపు: రంగన్నకే పుదుచ్చేరి
పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. ఈ కూటమి అధిక స్థానాల్లో విజయ కేతనం ఎగుర వేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుదుచ్చేరిలో పాగా వేయడం లక్ష్యంగా బీజేపీ ఆది నుంచి వ్యూహాల్ని పదును పెడుతూనే వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేసి బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్‌ల వైపుగా వెళ్లడంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయం రసవత్తరంగా మారింది. తేలని నేతృత్వం.. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా ప్రకటించుకున్నా, నేతృత్వంపై మాత్రం సందిగ్ధం నెలకొంది. అయితే, రంగస్వామి నేతృత్వంలోనే కూటమి అని, ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రకటించుకుంది. అయితే, బీజేపీ వర్గాలు ఈ విషయంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల అనంతరం నేతృత్వం గురించి చర్చించుకుందామని, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకుందామని బీజేపీ నేతలు పేర్కొంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి రంగన్నకు చిక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌కాంగ్రెస్ తొమ్మిది చోట్ల విజయ ఢంకా మోగించింది. ఓ చోట ఫలితం తేలాల్సి ఉంది. ఇక, బీజేపీ మూడు చోట్ల గెలవగా, రెండు చోట్ల ఫలితం తేలాల్సి ఉంది. ఈ సారి ఇక్కడ అన్నాడీఎంకే ఖాతా తెరవలేదు. ఆపార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం ఇదే ప్రపథమం కావడం గమనార్హం. ఇక, ఇతరులు ఆరుగురు విజయకేతనం ఎగుర వేసి ఉండడం రంగస్వామికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, డీఎంకే – కాంగ్రెస్ కూటమికి ఆశించిన గెలుపు దక్కలేదు. అయితే, డీఎంకే మూడు చోట్ల గెలవగా, రెండు చోట్ల ఫలితం తేలాల్సి ఉంది. కాంగ్రెస్ రెండు చోట్ల గెలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా ఎమ్మెల్యేల్ని రంగస్వామి దక్కించుకున్న దృష్ట్యా, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా..? లేదా కేంద్ర పెద్దలు ఏదేని మెలిక పెట్టేనా..? అన్నది వేచి చూడాల్సిందే. చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు -
బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా..
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో పోలింగ్ నమోదవగా, అత్యల్పంగా తమిళనాడులో పోలింగ్ జరిగింది. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ ముగిసింది. అసోంలో 40 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగ్గా మంగళవారంతో పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్లో మూడో దశ పోలింగ్ జరిగింది. అసోంలో చివరి దశ పోలింగ్‌లో భారీగా ఓటింగ్ నమోదైంది. నేటితో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ఒక్క పశ్చిమబెంగాల్లో మాత్రం ఎన్నికలు కొనసాగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 8 దశల్లో పోలింగ్ జరుగుతుండగా మంగళవారంతో మూడు దశలు పూర్తయ్యింది. ఇక ఏప్రిల్ 10, 17, 22, 26, 29 తేదీల్లో మలి విడతల్లో పోలింగ్ జరగనుంది. చివరి సమాచారం అందే వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 77.68 తమిళనాడు : 65.15 కేరళ : 70.16 అసోం : 82.28 పుదుచ్చేరి : 78.24 5 గంటల వరకు నమోదైన పోలింగ్ పశ్చిమ బెంగాల్: 76.84 శాతం తమిళనాడు : 61.34 శాతం కేరళ : 69.24 శాతం అసోం : 78.32 శాతం పుదుచ్చేరి : 76.46 శాతం 4 గంటల వరకు పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 67.27 తమిళనాడు : 53.35 కేరళ : 59.91 అసోం : 68.31 పుదుచ్చేరి : 66.36 3 గంటల వరకు పోలింగ్ పశ్చిమ బెంగాల్: 54.43శాతం తమిళనాడు : 43.40శాతం కేరళ : 51.4శాతం అసోం : 54.73 పుదుచ్చేరి : 54.27శాతం రెండు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 54.43 తమిళనాడు : 40.94 కేరళ : 51.4 అసోం : 53.23 పుదుచ్చేరి : 54.21 ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతం పశ్చిమ బెంగాల్: 53.89 తమిళనాడు : 39.61 కేరళ : 43.3 అసోం : 53.23 పుదుచ్చేరి : 53.35 -
తాజా మాజీ ముఖ్యమంత్రికి అధిష్టానం షాక్
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రెండు నెలలుగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. 30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ స్వామికి షాకిచ్చింది. ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ విషయాన్ని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా 14 అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆ జాబితాలో నారాయణస్వామి పేరు లేదు. రెండో జాబితాలోనూ ఆయనకు అవకాశం ఉండదని తెలుస్తోంది. నారాయణస్వామి నియోజకవర్గం నెల్లిథోప్ స్థానాన్ని డీఎంకేకు కేటాయించారు. షా జహన్ కామ్రాజ్ నగర్, వి.సుబ్రమణ్యన్ కరైకల్ (నార్త్), కందసామి ఎంబలమ్, కమలకణ్నన్ థిరునల్లర్ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారం బాధ్యతలను నారాయణస్వామి చూసుకుంటారని.. అందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ పుదుచ్చేరి వ్యవహారాల ఇన్చార్జి గుండురావు తెలిపారు. అయితే నారాయణస్వామి పేరు ప్రకటించకపోవడం కొంత పార్టీలో విబేధాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఆది నుంచి వివాదాలు, ట్విస్టులే..
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం విచిత్ర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందే, ఆయా నేతలు తమకు పట్టున్న స్థానాలపై గురి పెట్టి నామినేషన్లు వేయడం చర్చకు దారి తీసింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్–బీజేపీ–అన్నాడీఎంకే కూటమి వ్యవహారం మొదటి నుంచి వివాదాలు, ట్విస్టుల నడుమ సాగిన విషయం తెలిసిందే. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 చోట్ల, బీజేపీ, అన్నాడీఎంకేలు 14 చోట్ల పోటీకి నిర్ణయించాయి. అన్నాడీఎంకే –బీజేపీల మధ్య సీట్ల పంపకాలు సాగలేదు. ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో కూటమిలో ఇంత వరకు తేలలేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ కూటమికి తానే సీఎం అభ్యర్థి అని ప్రకటించుకున్న ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి తట్టాన్ చావడి నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీకి చెందిన మరో నలుగురు తమకు పట్టున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు. ఇదే అదనుగా బీజేపీకి చెందిన ముగ్గురు, అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు నేతలు తమకు పట్టున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయడంతో కూటమి వ్యవహారం విచిత్ర పరిస్థితుల్లోకి నెట్టినట్టు అయింది. తమకు పట్టున్న స్థానాల్లో ముందుగానే నామినేషన్లు వేసి రిజర్వు చేసుకునే పనిలో నేతలు ఉండడం గమనార్హం. కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి.. కాంగ్రెస్–డీఎంకే కూటమిలోనూ అదే పరిస్థితి. డీఎంకే అయితే, అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక కుస్తీలు సాగుతున్నాయి. మరో రెండు రోజులే నామినేషన్లకు గడువు ఉన్న నేపథ్యంలో తమకు పట్టున్న స్థానాలపై గురి పెట్టిన పలువురు కాంగ్రెస్ నేతలు ముందుగానే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో మాజీ సీఎం నారాయణ స్వామి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. -
బస్సులో గవర్నర్ తమిళిసై ప్రయాణం
-
బస్సులో ప్రయాణించిన గవర్నర్ తమిళిసై!
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఇన్చార్జ్) తమిళిసై సౌందరరాజన్ ప్రజలతో మమేకం అయ్యేరీతిలో, వారి సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం బస్సులో ప్రయాణం చేశారు. ప్రజల విజ్ఞప్తుల్ని విన్న ఆమె అవసరం అయితే, రాజ్‌నివాస్‌కు వచ్చి తనను కలవాలని సూచించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారిక వ్యవహారాలే కాదు, ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. తనకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మంగళవారం బస్సులో పయనించారు. పుదుచ్చేరిలోని కడలూరు బస్టాండ్‌కు ఉదయం పది గంటలకు రాజ్‌నివాస్ నుంచి కారులో సహాయకుడు చంద్రమౌళితో కలిసి బయలుదేరారు. అంతోనియార్ బస్టాండ్ వద్ద కారు నుంచి దిగేసి బర్గూర్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఎక్కారు. ముందు సీటులో కూర్చున్న ఆమె ప్రయాణికులతో మాటలు కలిపారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది తమ వ్యక్తిగత సమస్యలు చెప్పుకోగా, మరి కొందరు పింఛన్ రాలేదంటూ, ఇంకొందరు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేవంటూ ఇలా అనేక సమస్యల్ని ఆమె దృష్టికి తెచ్చారు. తవలకుప్పం వరకు ఆమె బస్సులో ప్రయాణించారు. ఆ తర్వాత కారులో అక్కడి డంపింగ్ యార్డ్‌కు వెళ్లారు. ఆ పరిసర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిశీలించారు. మళ్లీ తవలకుప్పం చేరుకుని మరలా మరో బస్సులో ప్రయాణించారు. అప్పటికే ఆ బస్సులో సీట్లు పూర్తిగా నిండి ఉన్నాయి. దీంతో ఆమె నిలబడే పయనం చేశారు. మాస్క్‌ను ఆమె ధరించి ఉండడంతో తొలుత ఎవరూ గుర్తు పట్టలేదు. చివరకు తమతో లెఫ్టినెంట్ గవర్నర్ పయనిస్తున్నట్టు గుర్తించిన అనేక మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే పనిలో పడ్డారు. కొందరు తన దృష్టికి పలుసమస్యలు తీసుకు రాగా, వారిని నేరుగా రాజ్‌నివాస్‌కు వచ్చి కలవాలని, తనను కలిసేందుకు ఎవరైనా రావచ్చు అని ప్రజలకు సూచించారు. కొన్ని గంటల పాటు బస్సులో పయనించి, ప్రజా సమస్యలు తెలుసుకున్న తమిళిసై మీడియాతో మాట్లా డారు. ప్రజా సమస్యల్ని తెలుసుకునే పరిష్కరించేందుకే ఈ పయనం అని ఆమె పేర్కొన్నారు. -
గాంధీ కుటుంబానికి ‘కట్ మనీ’
కారైక్కల్/సాక్షి, చెన్నై: పుదుచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.15,000 కోట్ల నిధుల నుంచి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి కట్ మనీ పంపించారని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆరోపించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్లే పుదుచ్చేరితోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనమయ్యిందని తేల్చిచెప్పారు ఆదివారం పుదుచ్చేరిలోని కారైక్కల్‌లో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ప్రతిభావంతులకు చోటు లేదని విమర్శించారు. 2016లో పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ను గెలిపించిన నమశ్శివాయంను కాదని, నారాయణస్వామిని ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలకు నారాయణస్వామి కట్టుబానిస అని ఆక్షేపించారు. కమల వికాసాన్ని అడ్డుకోలేరు పుదుచ్చేరిలో ఈసారి బీజేపీని గెలిపించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిలో భారతదేశ ఆభరణంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నారాయణస్వామి గాంధీ కుటుంబ సేవలో తరించడం తప్ప ప్రజలకు చేసేందేమీ లేదని తప్పుపట్టారు. పుదుచ్చేరి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గాంధీ కుటుంబానికి చేరవేశారని, ఆఖరికి ఎస్టీ, ఎస్టీల నిధులను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. గొప్ప భాష అయిన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. స్పీకర్ శివకొళుందు రాజీనామా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ శివకొళుందు ఆదివారం పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖను అందజేశారు. -
ఒపినీయన్ పోల్: వచ్చే ఎన్నికల్లో వారిదే గెలుపు
న్యూఢిల్లీ: పంచతంత్రంగా పేర్కొన్నే ఐదు అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఓ సర్వే చెబుతున్న ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. మళ్లీ పశ్చిమబెంగాల్లో మమత, కేరళలో వామపక్షాలే, అస్సోలో బీజేపీ ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయని.. ఇక తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే కూటమి, ఇక పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపేవి కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏబీపీ-సీ ఓటర్ సంస్థ సర్వే చేసింది. అంటే ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో చేసిన సర్వే ప్రకారం పై ఫలితాలు వెల్లడయ్యాయి. ఏ పార్టీ గెలుస్తుందనే దానితో పాటు ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు.. ఎన్నేసి సీట్లు వస్తాయో ఓ అంచనా రూపొందించింది. ఆ ఒపినీయన్ పోల్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సర్వే ఒక అంచనా మాత్రమే. ఏది ఏమున్నా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఏప్రిల్ 2వ తేదీన తెలియనుంది. పశ్చిమ బెంగాల్ పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే మళ్లీ పట్టం కట్టే అవకాశం ఉంది. మళ్లీ మమత బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని అభిప్రాయాలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్: 148-164 సీట్లు (43 శాతం ఓట్లు) బీజేపీ: 92-108 సీట్లు (38 శాతం ఓట్లు) కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 31-39 సీట్లు (13 శాతం ఓట్లు) కేరళ దేవభూమిగా ఉన్న కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్: 83-91 సీట్లు యూడీఎఫ్: 47-55 సీట్లు బీజేపీ: 0-2 సీట్లు, ఇతరులు 0-2 సీట్లు తమిళనాడు ఈసారి తమిళనాడులో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకేకు పరాభవం తప్పేటట్టు లేదు. మిత్రపక్షాలతో కలిసి డీఎంకే అధికారం చేపట్టేలా పరిస్థితులు ఉన్నాయి. డీఎంకే + మిత్రపక్షాలు: 154-162 సీట్లు అన్నాడీఎంకే: 58-66 సీట్లు ఇతరులు: 8-20 సీట్లు అసోం ఈశాన్య ప్రాంతం రాష్ట్రంగా ఉన్న అసోంలో మళ్లీ కమలం విరబూయనుంది. బీజేపీకి రెండోసారి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ+ మిత్రపక్షాలు: 68-76 సీట్లు కాంగ్రెస్ + మిత్రపక్షాలు: 43-51 సీట్లు ఇతరులు: 5-10 సీట్లు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. అయితే ఆ పరిణామాలు బీజేపీకి ప్లస్ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే జరగబోయే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందనుందని ఈ సర్వే తెలిపింది. అధికారంలో బీజేపీకి దక్కేలా ఉంది. బీజేపీ+ మిత్రపక్షాలు: 17-21 సీట్లు కాంగ్రెస్+ మిత్రపక్షాలు: 8-12 సీట్లు ఇతరులు: 1-3 సీట్లు చదవండి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. చదవండి: మూడో కూటమి.. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి -
మోగిన ఎన్నికల నగారా
సాక్షి , న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపిన పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారాను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది. ఐదు అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా విడుదలచేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్లోని 294 నియోజకవర్గాలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలోని 126 స్థానాలకు 3 విడతల్లోను, 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 స్థానాలు ఉన్న కేరళ, 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరిల్లో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ ఐదు అసెంబ్లీల్లోని 824 నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నారు. మొత్తం 18.68 కోట్ల ఓటర్లు 2.7లక్షల పోలింగ్ స్టేషన్లలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్ –19 ముప్పు కారణంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచారు. పోలింగ్ సమయాన్ని కూడా ఒక గంట పాటు పెంచారు. అలాగే, పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందే కోవిడ్–19 టీకా వేస్తామని సీఈసీ అరోరా తెలిపారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని, ఎన్నికల ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేస్తామని వెల్లడించారు. 8 దశల్లో బెంగాల్ ‘దంగల్’ ఈ ఏడాది మే 30వ తేదీతో ముగిసే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని 294 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి 8 దశల్లో జరుగనుంది. మొదటి దశలో ఐదు జిల్లాల్లోని 30 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. మొదటిదశ పోలింగ్ మార్చి 27న జరుగుతుంది. రెండవ దశలో 4 జిల్లాల్లోని 30 స్థానాలకు ఏప్రిల్ 1వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో 3 జిల్లాల్లోని 31 నియోజకవర్గాలకు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగో దశలో 5 జిల్లాల్లోని 44 నియోజకవర్గాలకు ఏప్రిల్ 10వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగబోయే ఐదో దశలో 6 జిల్లాల్లోని 45 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆరో దశలో 4 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఏప్రిల్ 22న జరుగుతుంది. ఏడవ దశ పోలింగ్ ప్రక్రియలో 5 జిల్లాల్లోని 36 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. 4 జిల్లాల్లోని 35 నియోజకవర్గాలకు చివరగా ఎనిమిదవ దశలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాల్లో 68 ఎస్సీ, 16 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయని ఈసీ ప్రకటించింది. 2016లో 7 దశల్లో జరిగిన ఎన్నికలకు 77,413 పోలింగ్ స్టేషన్లను వినియోగించగా, ఈసారి 31.65శాతం పెంచి 1,01,916 పోలింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమిస్తామని, అవసరమైతే మరో పరిశీలకుడిని కూడా ఏర్పాటు చేస్తామని సునీల్ ఈరోరా వెల్లడించారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు అసోంలోని 126 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. మొదటి దశలో 47 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ దాఖలుకు మార్చి 9 ఆఖరు తేదీగా నిర్ణయించారు. మొదటిదశ పోలింగ్ మార్చి 27న జరుగుతుంది. రెండవ దశలో 30 స్థానాలకు మార్చి 5వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ దాఖలుకు మార్చి 12 తేదీని ఆఖరు తేదీగా ప్రకటించారు. రెండోదశ పోలింగ్ ఏప్రిల్ 1వ తేదీన జరుగనుంది. మూడో దశలో 31 నియోజకవర్గాలకు మార్చి 12న నోటిఫికేషన్ జారీ అవుతుంది. మార్చి 19లోగా నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. మూడో దశ పోలింగ్ ప్రక్రియను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు. కోవిడ్–19 ప్రోటోకాల్స్ తప్పనిసరి కరోనా వైరస్ సంక్రమణ దృష్ట్యా ఎన్నికల నిర్వహణలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సునీల్ అరోరా వెల్లడించారు. ఎన్నికలు జరుగబోయే 2.7లక్షల పోలింగ్ స్టేషన్లు అన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటాయని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నామని, నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారి వద్దకు అభ్యర్థితో కలిసి కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇంటింటికి తిరిగి చేసే ప్రచారంలోనూ అభ్యర్థితో కలిసి 5గురికి మాత్రమే అనుమతి ఉంటుందని, రోడ్‌షోలు, ఎన్నికల సభల విషయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈసీ స్పష్టంచేసింది. రోడ్ షోలో గరిష్టంగా ఐదు వాహనాలనే అనుమతిస్తామన్నారు. నిబంధనల ఉల్లంఘనపై సీ విజిల్ యాప్‌ను వినియోగించుకొని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఓటర్ల జాబితాను జనవరిలోనే ముద్రించామని ఈసీ ప్రకటించింది. కౌంటింగ్ ప్రక్రియలో సాధారణంగా ఉండే 14 టేబుల్స్ బదులుగా కోవిడ్ కారణంగా కేవలం 7 టేబుల్స్ వినియాగించాలని నిర్ణయించారు. వీటితో పాటు 14 రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 4 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలను ఈ 5 అసెంబ్లీల ఎన్నికలతో కలిసి నిర్వహిస్తామని అరోరా వెల్లడించారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే దశ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మూడు అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 నియోజకవర్గాలున్న కేరళ, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలకు మార్చి 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు ఆఖరు తేదీ మార్చి 19కాగా, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22 వరకు అవకాశం కల్పించారు. ఈ మూడు అసెంబ్లీలకు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. కేరళలోని మల్లుపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. మహిళలకు తమిళ సీఎం వరాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ తమిళనాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. ఆరు పౌన్ల(48 గ్రాములు) వరకు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి సహకార సొసైటీల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే, సహకార బ్యాంకులు, సొసైటీల్లో స్వయం సహాయ బృందాల్లోని మహిళలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా స్వయం సహాయ బృందాలున్నాయని, వాటిలో 15 లక్షల పేద మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కరోనాతో పాటు భారీ తుపాన్లు రాష్ట్ర ప్రజలను భారీగా దెబ్బతీశాయన్నారు. మోదీ, షా చెప్పారా? పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను 8 విడతలుగా నిర్వహించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా ఈ తేదీలను ప్రకటించారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఈ తేదీలను ప్రకటించారా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. బీజేపీని ఉద్దేశిస్తూ ‘కాషాయ క్యాంప్’ కళ్ల ద్వారా రాష్ట్రాన్ని చూడొద్దంటూ ఎన్నికల సంఘానికి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలను ముగించి, పశ్చిమబెంగాల్లో మాత్రం 8 విడతలుగా ఎన్నికలు నిర్వహిం చడంపై ఈసీపై అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో తృణమూల్ విజయాన్ని అడ్డుకోలేరని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది గంటల ముందు మమతా బెనర్జీ రాష్ట్రంలోని కార్మికులకు వేతన పెంపు ప్రకటించారు. రాష్ట్ర పట్టణ ఉపాధి పథకం ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల దినసరి వేతనాన్ని పెంచుతున్నామన్నారు. నైపుణ్యత లేని కార్మికుల రోజువారీ వేతనాన్ని రూ. 144 నుంచి రూ. 202కి, సాధారణ నైపుణ్యాలున్న కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 172 నుంచి రూ. 303కి పెంచుతున్నామన్నారు. కొత్తగా నిపుణులైన కార్మికుల విభాగాన్ని కూడా ప్రారంభిస్తున్నామని, వారికి రూ. 404 దినసరి వేతనంగా నిర్ధారించామని తెలిపారు. మీడియా సమావేశం అనంతరం సీఈసీ సునీల్ అరోరా, కమిషనర్లు సుశీల్ చంద్ర, రాజీవ్‌కుమార్ -
అసెంబ్లీ ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురు చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల భేరి మోగింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 27–ఏప్రిల్ 29మధ్య వివిధ రాష్ట్రాల్లో వివిధ దశల్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన వోట్ల లెక్కింపు మే 2న వుంటుంది. ఈ నాలుగు రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలుం డగా... 18.68 కోట్లమంది వోటర్లు తమ తీర్పునివ్వాల్సివుంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో మార్చి 27–ఏప్రిల్ 29 మధ్య 8 దశల్లో పోలింగ్ నిర్వహించబోతుండగా... అస్సాంలో మార్చి 27– ఏప్రిల్ 6 మధ్య మూడు దశలుగా పోలింగ్ వుంటుంది. 234 సీట్లున్న తమిళనాడులో, 140 సీట్లున్న కేరళలో, 30 సీట్లున్న పుదుచ్చేరిలో మాత్రం ఒకే దశలో... అంటే ఏప్రిల్ 6న పోలింగ్ వుంటుంది. వీటిల్లో కేవలం ఒకే ఒకచోట–అస్సాంలో బీజేపీ అధికారంలో వుంది. పుదుచ్చేరిలో ఈమధ్యే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించారు. గత మూడు నెలలుగా పరస్పర వాగ్యుద్ధాలతో, నిందారోపణలతో... దాడులు, ప్రతి దాడులతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్‌కు ఎనిమిది దశల పోలింగ్ ప్రకటించటం సహజంగానే అక్కడి అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌కు ఆగ్రహావేశాలు కలిగించింది. తమ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఇచ్చిన ఎన్నికల కేలం డర్‌ను యధాతథంగా ప్రకటించారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల సంఘంపై విరుచుకుపడిన తీరు కూడా గమనించదగ్గది. 8 దశల పోలింగ్‌పై ఆమె అసహనంగా వున్నారు. రానున్న రోజుల్లో ఆమె బీజేపీతోపాటు ఎన్నికల సంఘంతో కూడా లడాయికి దిగడానికి వెనకాడరని ఈ ప్రకటన తేటతెల్లం చేస్తోంది. ఇప్పటికే తృణమూల్‌నుంచి పలువురు నేతలు బీజేపీలోకి ఫిరా యించారు. మమత సన్నిహిత బంధువులతోపాటు పలువురు తృణమూల్ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కూడా మొదలైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి మూడు స్థానాలు గెల్చుకుని బోణీ కొట్టిన బీజేపీ ఈసారి అధికారం తమదేనన్నంతగా హడావుడి చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో సాధించిన విజయమే ఈ దూకుడుకు కారణం. అయితే అధికారం దక్కడం అసాధ్యమని కొన్నాళ్లక్రితం వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. తృణమూల్ ఇప్పటికే ‘బెంగాల్ తన కుమార్తెను తప్ప మరెవరినీ కోరుకోవటం లేద’న్న ప్రధాన నినాదంతో బరిలో నిలిచింది. మమత చిత్రం, ఆ నినాదంవున్న హోర్డింగ్‌లు రాష్ట్రం నలుమూలలా వెలిశాయి. బెంగాల్‌ను బెంగాలీలు తప్ప బయటివారు పాలించటానికి ప్రజానీకం అంగీకరించ బోరని పలు బహిరంగసభల్లో మమత తరచు చెబుతున్నారు. అలాగే ఈసారి ‘జై శ్రీరాం’కూ...‘జై బంగ్లా’కూ మధ్య పోటీ జరగబోతోందని, బెంగాల్‌ను గుజరాతీలు పాలించడానికి వీల్లేదని ఆమె చేస్తున్న ప్రకటనలు చూస్తే బీజేపీని ఎదుర్కొనడానికి బెంగాలీ సెంటిమెంటును ఆమె బలంగా ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది. అయితే తమిళనాడులో జాతీయ పార్టీలను గత కొన్ని దశాబ్దాలుగా నిలువనీడ లేకుండా చేస్తున్న ‘ద్రవిడ’ సెంటిమెంటు స్థాయిలో ఇది పని చేస్తుందా అన్నది వేచిచూడాలి. రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలేలిన వామపక్షాలు అత్యంత బలహీ నమైన స్థితిలో పడటం, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ సైతం అసంగతంగా మారటం ఇన్నాళ్లూ తృణమూల్‌కు వరమైంది. ఇప్పుడు బీజేపీ రూపంలో కొత్తగా వచ్చిపడిన సవాలును ఎదుర్కొ నవలసి రావటం ఆ పార్టీకి కష్టంగానే వుంది. ఒకపక్క అవినీతి ఆరోపణలు, మరోపక్క అంతంత మాత్రం అభివృద్ధి తృణమూల్‌కు సమస్యాత్మకమైనవి. వీటిని ఆ పార్టీ ఎలా అధిగమిస్తుందో చూడాలి. మరో ప్రధాన రాష్ట్రం తమిళనాడులో ఈసారి తమ పార్టీ మెరుగైన స్థానంలో వుండాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. తమిళనాడులో వెయ్యి మెగావాట్ల నైవేలీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించటంతోసహా అనేక కొత్త ప్రాజెక్టులు ఆ రాష్ట్రానికి ప్రకటించారు. అటు పుదుచ్చేరికి కూడా చిన్నతరహా పోర్టుతో సహా అనేకం మంజూరయ్యాయి. అదే సమయంలో డీఎంకేకు ప్రధాన వనరుగా వుండే ఓబీసీలనూ, దళితులనూ దగ్గర చేసుకోవటానికి ఆ వర్గాలకు చెందిన నేతలకు పార్టీలోనూ, బయటా ప్రాధాన్యమిస్తున్నారు. అయితే శశికళ పార్టీకి ఎలాంటి ఆద రణ లభిస్తుందో, అన్నాడీఎంకే సర్కారు ప్రభావమెంతో, బీజేపీతో చెలిమి ఆ పార్టీకి లాభిస్తుందో లేదో చూడాల్సివుంది. కేరళలో వరసగా రెండోసారి అధికారం చేజిక్కించుకుని కొత్త రికార్డు నెల కొల్పాలని అక్కడి ఎల్డీఎఫ్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అటు శబరిమల ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవటంతోపాటు ఇటు సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక ఆందోళనకారులపై పెట్టిన కేసుల్ని కూడా ఆ ప్రభుత్వం ఎత్తేసింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన గెలుపు ఎల్డీఎఫ్ ఆశల్ని పెంచింది. అస్సాంలో అధికార పక్షంగా వున్న బీజేపీకి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నుంచి గట్టి సవాలే ఎదురుకాబోతోంది. చట్టవిరుద్ధ వలసలను అరికట్టేం దుకు ఉద్దేశించిన ఎన్ఆర్సీ, సీఏఏలు గత ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ఆయుధాలు. ఈసారి వాటి ప్రస్తావన లేకుండానే బీజేపీ బరిలో దిగుతోంది. మొత్తానికి ఎంతో ఆసక్తికరంగా సాగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఎలాంటి అపశ్రుతులూ చోటుచేసుకోరాదని ఆశించాలి. -
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే..
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అస్సోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం ప్రకటించారు. కేరళ 140, అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీకి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు. షెడ్యూల్లో ముఖ్యాంశాలు మొత్తం ఐదు అసెంబ్లీలలోని స్థానాలు 824 మొత్తం ఓటర్లు 18.68 కోట్ల మంది మొత్తం 2.70 లక్షల పోలింగ్ స్టేషన్లు ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితోపాటు నలుగురే పాల్గొనాలి. రోడ్ షోలో ఐదు వాహనాలకే అనుమతి 80 ఏళ్ల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి అవకాశం కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రం ప్రతి వెయ్యి మందికి ఒకటి ఏర్పాటు. గతంలో1,500 మంది ఓటర్లకు ఒక బూత్ ఉండేది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్. ఈసారి ఎప్పుడు లేని విధంగా ఆన్లైన్ విధానంలో అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు అవకాశం కల్పించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్చి 27వ తేదీ నుంచి ఎన్నికలు జరగనున్నాయి. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాల ప్రకటన ఐదు రాష్ట్రాలు అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అసోం మూడు విడతల్లో 126 స్థానాలకు ఎన్నికలు. మార్చి 27వ తేదీన తొలి విడత పోలింగ్ (47 అసెంబ్లీ స్థానాలు). ఏప్రిల్ 1, 6వ తేదీల్లో రెండు, మూడో విడతలకు ఎన్నికలు. 33 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. తమిళనాడు 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్. 89 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేరళ 140 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ఏప్రిల్ 6వ తేదీన ఎన్నిక. 40 వేల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ చేపట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ 294 స్థానాలతో అతిపెద్ద అసెంబ్లీగా ఉన్న పశ్చిమబెంగాల్లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 1, 6, 10, 17, 22, 26, 29 పోలింగ్ చేపట్టనున్నారు. 8 విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పుదుచ్చేరి 30 స్థానాలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్. 1,500 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. మొత్తం అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు. -
కాంగ్రెస్ అబద్ధాలకోరు పార్టీ
సాక్షి ప్రతినిధి, చెన్నై/పుదుచ్చేరి: ‘విభజించు, అబద్ధమాడు, పాలించు’ అనేదే కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశంలో కాంగ్రెస్ సంస్కృతి అయిన ఫ్యూడల్, వారసత్వ రాజకీయాలు ముగిసిపోయాయని అన్నారు. దేశమంతటా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీలో బంగారు, వెండి, రజత పతక విజేతలున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో గురువారం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన నుంచి పుదుచ్చేరి స్వేచ్ఛ పొందిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి ‘హైకమాండ్’ ప్రభుత్వానికి నేతృత్వం వహించారని, ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రయోజనాల కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నారాయణస్వామి కాంగ్రెస్ పెద్దల చెప్పులు మోయడంలో సిద్ధహస్తుడని మండిపడ్డారు. పుదుచ్చేరిని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఎన్డీయే కోరుకుంటున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిని వ్యాపార, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు. పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు విభజించు, పాలించు అనేది వలస పాలకుల సిద్ధాంతమైతే.. విభజించు, అబద్ధాలు చెప్పు, పాలించు అనేది కాంగ్రెస్ విధానమని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రాంతాలకు మధ్య, వర్గాలకు మధ్య తగువు పెడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని రాహుల్ గాంధీ మంగళవారం కేరళలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మత్స్యశాఖ లేదన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. 2019లో మత్స్య శాఖను ఏర్పాటు చేశామని, బడ్జెట్లో ఆ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని గుర్తుచేశారు. పుదుచ్చేరి ప్రజలు 2016లో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, వారి ఆశలన్నీ అడియాసలయ్యాయన్నారు. పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు వీస్తున్నాయని చెప్పారు. అన్నదాత బాగుంటే.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ తమిళుల కలలను సాకారం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆయన గురువారం పుదుచ్చేరితోపాటు తమిళనాడులోని కోయంబత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘మోదీ గో బ్యాక్’ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేత, నీట్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్‌ను నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోయంబత్తూరులో నల్లజెండాలతో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. నల్ల బెలూన్లను గాలిలోకి వదిలి ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినదించారు. ఇద్దరు యువతులు సహా 77 మందిని విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. లాస్‌పేటలో నల్లబెలూన్లు ఎగురవేసిన తమిళగ వాళ్వురిమై కట్చి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలన్న ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలిపారు. సీఎం నారాయణ స్వామి రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు ముందుకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రపతి అనుమతి తరువాత అసెంబ్లీ రద్దవుతుందన్నారు. 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాక ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందన్నారు. గురువారం పుదుచ్చేరిలో బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రూ.కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించనున్నారు. పుదుచ్చేరిని తమిళనాడులో చేర్చేందుకు బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీలు కుట్ర పన్నుతున్నాయని నారాయణస్వామి బుధవారం ఆరోపించారు. -
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన!
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పతానంతరం కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.రంగస్వామి బీజేపీ అగ్రనేతలతో రహస్య చర్చలు జరిపి, ప్రభుత్వం ఏర్పాటుకు తాము సుముఖంగా లేమని తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షం కూడా వెనక్కి తగ్గడంతో పుదుచ్చేరీలో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. 14 మంది సభ్యుల బలం వున్న ప్రతిపక్షం ప్రభుత్వ ఏ ర్పాటుకు నిరాకరించింది. గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు.కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడగానే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. సీఎం, కేబినెట్ రాజీనామా ఆమోదం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆయన మంత్రివర్గం రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. రాజీనామాల ఆమోదం సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అసెంబ్లీలో బల నిరూపణ కంటే ముందే సీఎం, ఆయన మంత్రివర్గం సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
పుదుచ్చేరిలో కుప్పకూలిన ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూప్పకూలింది. బలనిరూపణలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. బలపరీక్ష కోసం సోమవారం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామాను సమర్పించారు. ఆధిపత్యపోరు.. పుదుచ్చేరిలో 30 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2016లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్– డీఎంకే, బీజేపీ–ఎన్ఆర్ కాంగ్రెస్ కూటములు బరిలోకి దిగాయి. 15 సీట్లు గెలుపొందడం ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముగ్గురు డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. సీఎం నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కిరణ్‌బేడీ మధ్య అధిపత్య పోరు ఆరంభంలో మొదలైంది. పతనం దిశగా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పార్టీ ఎమ్మెల్యే ధనవేలును ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. నెల క్రితం మంత్రి నమశ్శివాయం తన పదవికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన అనుచరుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపాయన్దన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు మంత్రి పదవికి, ఈనెల 15న ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. వరుసగా ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్‌కుమార్ రాజీనామా చేయడంతో సర్కార్ సంక్షోభంలో పడింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 10కి పడింది. అయినా, ముగ్గురు డీఎంకే, ఒక స్వతంత్ర అభ్యర్థితో కలుపుకుని తమకు 14 మంది సభ్యుల బలం ఉందని సీఎం చెప్పారు. ప్రతిపక్షానికి ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో 14 సభ్యుల బలం ఉంది. బలపరీక్షకు సిద్దం కావాలని ఎల్జీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సీఎంను ఆదేశించారు. 21న∙కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ బలం స్పీకర్, స్వతంత్య్ర ఎమ్మెల్యేను కలుపుకున్నా 12కే పరిమితమైంది. గరంగరంగా అసెంబ్లీ సమావేశం సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అధికార పక్షంలో సీఎం నేతృత్వంలో డీఎంకే, స్వతంత్య్ర ఎమ్మెల్యే , స్పీకర్ వీపీ శివకొళుందు (కాంగ్రెస్) కలుపుకుని 12 మందితో బలనిరూపణకు సిద్దమయ్యారు. ప్రధాన ప్రతిపక్షనేత రంగస్వామిసహా మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బలపరీక్ష తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, గత ఎల్జీ కిరణ్‌బేడీ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. తర్వాత సీఎం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోగా అధికార పక్ష సభ్యులు ఆయనతో పాటు వాకౌట్ చేశారు. దాంతో, విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే.. సీఎం ప్రవేశపెట్టిన బలపరీక్ష తీర్మానం వీగిపోయింది, అసెంబ్లీలో ఆయన బలాన్ని నిరూపించుకోలేక పోయారని స్పీకర్ ప్రకటించారు. సీఎం నారాయణస్వామి అసెంబ్లీ నుంచి నేరుగా రాజ్‌నివాస్‌కు చేరుకుని మంత్రివర్గ రాజీనామా పత్రాన్ని ఎల్జీకి సమర్పించారు. అనంతరం, విశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టకపోవడంపై స్పీకర్‌ను నారాయణస్వామి తప్పుబట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆనందరామన్ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారని, అయినా, ఆయన స్పందించలేదని పేర్కొన్నారు. నిబంధనలను స్పీకర్ పాటించలేదని, ఓటింగ్ జరపకుండానే తీర్మానం వీగిపోయిందని ప్రకటించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం అధికార పక్ష సభ్యులు వాకౌట్ చేసినా, స్పీకర్ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్, విపక్ష నేత ఎన్‌రంగస్వామి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం లేదని, రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్‌లతో కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామినాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖ సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షం కూడా సిద్ధంగా లేని పరిస్థితి నెలకొనడంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోంది. -
చేజారిన పుదుచ్చేరి
చిన్నదే కావొచ్చుగానీ... దక్షిణాదిన కాంగ్రెస్‌కున్న ఏకైక స్థావరం చేజారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమ ప్రభుత్వ బలం క్షీణించిందని గ్రహించిన ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి సోమవారం విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ జరగటానికి ముందే రాజీనామా చేశారు. గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడనాడటాన్ని గమనించి ఆయన ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని చాలామంది అంచనా వేశారు. పదవీకాలం మరో నెలలో ముగియాల్సివున్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు కప్పదాట్లకు సిద్ధపడటం విచిత్రమనిపిస్తుంది. ఇందులో తమ బాధ్యతేమీ లేదని అందరూ అనుకోవటం కోసమే కేంద్ర ప్రభుత్వం తొలుత కిరణ్ బేడీని అర్థంతరంగా పంపించివుండొచ్చని విశ్లేషకులు చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్రంలో అధికార కూటమి బీటలు వారే అవకాశమున్నదని తెలిస్తే కేంద్రంలోని పాలక కూటమి నిర్లిప్తంగా వుండే రోజులు ఎప్పుడో పోయాయి. ఆ దుష్ట సంప్రదాయానికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీయే. సుప్రీంకోర్టు బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పు ఆ ధోరణిని ఎంతో కొంత నియంత్రించగలిగింది. కానీ దాన్ని పూర్తిగా మాయం చేయలేకపోయింది. న్యాయస్థానాలు దృఢంగా నిలబడి ఈ మాదిరి చర్యలను అడ్డుకుని ప్రభుత్వాలను పునరుద్ధరించిన ఉదంతాలు లేకపోలేదు. కానీ ఆ వెసులుబాటును ఉపయోగించుకోగలిగిన స్థితిలో కూడా పాలకపక్షాలుండాలి. రాజస్తానే అందుకు ఉదాహరణ. అక్కడ కాంగ్రెస్ అంతర్గత కలహాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పు ముంచుకురాగా... ఆ పార్టీ దాన్ని నివారించటంలో సఫలీకృతమైంది. కానీ ఆ పార్టీయే అంతక్రితం మధ్యప్రదేశ్‌లో విఫలమైంది. అక్కడ బీజేపీ జయప్రదంగా అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. స్వల్ప మెజారిటీతో అధికార పక్షాలు నెట్టుకొస్తున్న రాష్ట్రాల్లోనూ... తక్కువమంది శాసనసభ్యులుండే చిన్న రాష్ట్రాల్లోనూ ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించటం ఎప్పుడైనా సులభమవుతుంది. పాలకపక్షానికి చెందిన అధినాయకత్వం సంస్థాగత అంశాలను నిర్లక్ష్యం చేస్తే, శాసనసభ్యుల్లో వున్న అసంతృప్తిని సకాలంలో గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోనట్టయితే సహజంగానే ప్రత్యర్థి పార్టీలకు అది వరంగా మారుతుంది. ఈమధ్యే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పుదుచ్చేరి సందర్శించారు. కానీ అప్పటికే అంతా తారుమారైంది. ఆయన వచ్చే ముందు కొందరూ, వచ్చి వెళ్లాక మరికొందరు పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా కిరణ్ బేడీ తీసుకుంటున్న చర్యలు నారాయణస్వామి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తూనే వున్నాయి. ఎప్పటికప్పుడు కిరణ్ బేడీ తీరును ఆయన గట్టిగా వ్యతిరేకించటం, ఆ సమస్య ఒక కొలిక్కి వచ్చిందనుకునేలోగా మళ్లీ కొత్త సమస్య నెత్తిన పడటం రివాజుగా మారింది. అదే సమయంలో ఆయన కూడా నిరంకుశంగానే ప్రవర్తించారు. నిరుడు జూలైలో సీఎంపై అవినీతి ఆరోపణలు చేసిన పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి వెళ్లగొట్టడంతోపాటు ఆయన శాసనసభ్యత్వం సైతం రద్దయ్యేలా చేశారు. పార్టీ అధినాయకత్వం అందరితో మాట్లాడి చక్కదిద్దటం, కిరణ్ బేడీ తీరుపై ఆయన చేస్తున్న పోరాటానికి నైతిక మద్దతు కూడగట్టటం వంటివి సరిగా చేయలేకపోయింది. పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరుండాలనే అంశం చుట్టూనే ఇటీవల కాంగ్రెస్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇదంతా ప్రత్యర్థి పక్షానికి ఉపయోగపడింది. అటు ఇందులో తమ అపరాధం కాస్తయినా లేదని చెప్పటానికి ఎన్డీఏ పెద్దలు పడిన తాపత్రయం బాహాటంగా కనబడుతూనే వుంది. అందుకోసం కొన్ని నెలల్లో పదవీకాలం పూర్తవుతున్న కిరణ్ బేడీ హఠాత్తుగా నిష్క్రమించాల్సివచ్చింది. రాష్ట్రంలో ఆమె చర్యలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టదాయకం కావొచ్చునని బీజేపీ కూడా భావించే స్థితి ఏర్పడటం గమనించాల్సిన అంశం. తాము నియమించిన గవర్నరే అయినా రాజీనామా కూడా కోరకుండా తొలగించిన సందర్భాలు దాదాపు లేవు. ఒక్క అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వున్న జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా విషయంలో మాత్రమే అలా జరిగింది. ఆయనపై చర్య తీసుకున్నది కూడా నరేంద్ర మోదీ సర్కారే. అంతకుముందు పాత పాలకపక్షం నియమించిన గవర్నర్లను మాత్రమే తొలగించిన ఉదంతాలుండేవి. గవర్నర్లు సక్రమంగా తమ విధులను నిర్వర్తించకపోతే సంక్షోభాలు తలెత్తుతాయి. వారిని అర్థంతరంగా తొలగించినా అదే జరుగుతుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని, ప్రభుత్వాన్ని పడగొట్టిందని నారాయణస్వామి ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు గనుక ప్రజలను ఆ విషయంలో ఒప్పించగలిగితే మళ్లీ ఆయన పార్టీకి అధికారం దక్కే అవకాశం వుండొచ్చు. కానీ ఈ మాదిరి సమస్యలే పునరావృతమైతే? పుదుచ్చేరి సంక్షోభానికి బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం విమర్శించటంలో తప్పేమీ లేదు. కానీ తనవైపుగా సరిదిద్దుకోవాల్సిన అంశాలేమిటో గుర్తించటం కూడా ముఖ్యమని ఆ పార్టీ గ్రహించకపోతే దాన్నెవరూ కాపాడలేరు. అలాగే గతంలో గవర్నర్లను ఇష్టానుసారం తొలగించటం తప్పిదమేనని, ఈ సంప్రదాయం నెలకొల్పినందుకు క్షమాపణ కోరుతున్నామని ప్రకటించి, భవిష్యత్తులో అలా జరగబోదని హామీ ఇవ్వగలగాలి. గవర్నర్ల విషయంలోనైనా, మరే అంశంలోనైనా రాజ్యాంగ విహితంగా నడుచుకోవాలని, అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే జనం మెచ్చరని బీజేపీ కూడా తెలుసుకోవాలి. -
కాంగ్రెస్‌కు భంగపాటు: ఏడాదిలో రెండో ప్రభుత్వం
హైదరాబాద్: జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఇప్పటికే లోక్‌సభలో ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న హస్తం పార్టీ ఇప్పుడు తన చేతిలో ఉన్నరాష్ట్రాలను కూడా చేజార్చుకుంటోంది. బీజేపీ వ్యూహాలకు తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. ఏడాది వ్యవధిలోనే రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కాంగ్రెస్ నుంచి బీజేపీ లాక్కుంది. పుదుచ్చేరి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో (పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్) అధికారంలో ఉండగా.. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం (మహారాష్ట్ర, జార్ఖండ్)లో భాగస్వామిగా ఉంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అయితే బీజేపీ వేసిన రాజకీయ బాణాలకు కాంగ్రెస్ చతికిలి పడి ఇప్పుడు బలం నిరూపించుకోలేక ప్రభుత్వాన్ని కోల్పోయింది. గతంలో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి రాజకీయమే జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించారు. వారి రాజీనామాలతో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. 2020 మార్చ్ 20న ఈ పరిణామం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన15 నెలల్లోనే కూలిపోయింది. ఏడాది తిరగకముందే ఇప్పుడు పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో కోల్పోయింది. ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో బలం నిరూపించుకోలేక నారాయణస్వామి ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నాలుగున్నరేళ్ల పాలన సాఫీగానే సాగింది. అయితే గతేడాది ఎమ్మెల్యే ధనవేల్ తిరుగుబాటు నుంచి ప్రభుత్వానికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తుండడంతో చివరకు ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చింది. అంతకుముందు కర్నాటకలో మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా బీజేపీ పాచికలకు కుప్పకూలిన విషయం తెలిసిందే. గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి చివరకు ఏర్పాటు చేయలేదు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కీలక రాష్ట్రం రాజస్థాన్‌లో కూడా పరిస్థితులు సక్రమంగా లేవు. అసంతృప్తులు భగ్గుమంటూనే ఉన్నాయి. సచిన్ పైలెట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య విబేధాలతో ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే రాజస్థాన్ కూడా చేజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. చదవండి: మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు -
పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ సర్కార్
సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో రసవత్తరంగా సాగిన పుదుచ్చేరి రాజకీయాలకు తెర పడింది. బల నిరూపణలో నారాయణస్వామి సర్కార్ విఫలమయ్యింది. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. సరైనా సంఖ్యబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లి పోయారు. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణ స్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్ జరగకముందే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో సభ నుంచి బయటకు వెళ్లి పోయారు. దాంతో విశ్వాసం తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలందు ప్రకటించారు. బలనిరూపణలో ఓడిపోయిన సీఎం నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మీద నిప్పులు చెరిగారు నారాయణ స్వామి. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్‌తో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారు ప్రజల ముందుకు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. 2016 ఎన్నికల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. గడిచిన నాలుగున్నరేళ్లు సాఫీగానే సాగింది. ఇలా ఉండగా గతేడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిగురుబావుటా ఎగురవేశారు. ఇక నాటి నుంచి నారాయణ స్వామికి ఇబ్బందులు మొదలయ్యాయి. 33 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 17 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో ప్రభుత్వం మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాతో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. తాజాగా నేడు నిర్వహించని బల పరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం విఫలం అవడంతో ఆయన రాజీనామా చేశారు. -
ఐసీయూలో ‘నారాయణ’ సర్కార్
సాక్షి, చెన్నై: ఊహించని మలుపులతో పుదుచ్చేరి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీఎం నారాయణస్వామి సర్కారు పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్లా మారింది. ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అసెంబ్లీలో సోమవారం బల పరీక్ష సాగేనా అనే చర్చ బయలు దేరింది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ‘నారాయణ’ సర్కారు భవిత తేలనుంది. పుదుచ్చేరిలో సాగుతున్న రసవత్తర రాజకీయం గురించి తెలిసిందే. మైనారిటీలో పడ్డ సీఎం నారాయణస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఇన్చార్జ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలతో సోమవారం బలపరీక్షకు నారాయణ స్వామి సిద్ధమవుతున్న సమయంలో ఆదివారం ఊహించని మలుపులు తప్పలేదు. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్‌డౌన్..మొదలైనట్టుగానే పరిస్థితులు నెలకొన్నాయి. మరో ఇద్దరు రాజీనామా.. 2016 ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతాన్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ చేజిక్కించుకుంది. నాలుగున్నరేళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడితో అధికార వార్కే అధిక సమయం కేటాయించిన సీఎం నారాయణస్వామి, తాజాగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోకతప్పలేదు. గత ఏడాది పార్టీ ఎమ్మెల్యే ధనవేల్ తిరుగుబావుటా ఎగురవేసిన నాటి నుంచి దినదిన గండం అన్నట్టుగా ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి నారాయణస్వామికి తప్పలేదు. 28 మందితో కూడిన పుదుచ్చేరి అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు 15 మంది సభ్యుల మద్దతు అవశ్యం. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మె ల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాలు చేస్తూ వెళ్తుండడంతో మైనారిటీలో ప్రభుత్వం పడింది. ఈ సమయంలో ఊహించని రీతిలో ఆదివారం రాజ్‌భవన్ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడం, మరికొన్ని గంటల్లోనే మిత్ర పక్షం డీఎంకేకు చెందిన తట్టాన్ చావడి ఎమ్మెల్యే వెంకటేషన్ రాజీనామాతో నారాయణ సర్కారును ఐసీయూలోకి నెట్టినట్టు అయింది. వరుస రాజీనామాలతో ప్రస్తుతం సభలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 9కిచేరగా, మిత్రపక్షం డీఎంకే సంఖ్య 2 తగ్గింది. స్వతంత్ర అభ్యర్థి అండగా ఉన్నా, అధికార బలాన్ని నిరూపించుకునేంత సంఖ్య నారాయణ చేతిలో ప్రస్తుతం లేదని చెప్పవచ్చు. నారాయణ మాట్లాడుతూ తాజా పరిమాణాలపై చర్చించామని రేపు నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. బలపరీక్ష సాగేనా?.... ప్రస్తుతం డీఎంకే–కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిని కలుపుకుంటే అధికార పక్షం సభ్యుల సంఖ్య 12గా ఉంది. ప్రతి పక్షాల విషయానికి వస్తే ఎన్ఆర్ కాంగ్రెస్–7, అన్నాడీఎంకే–4, బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటే, అధికార పక్షం కన్నా, ప్రతి పక్ష బలమే ఎక్కువ. ఈ దృష్ట్యా, బల పరీక్ష సాగేనా లేదా తన పదవికి నారాయణ రాజీనామా చేసేనా ప్రశ్న బయలురింది. తాజా పరిణామాల గురించి స్పీకర్ శివకొళుందు మీడియాతో మాట్లాడుతూ మరో ఇద్దరు రాజీనామా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. చట్టనిపుణులతో చర్చించి బలపరీక్షకు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది సోమవారం ఉదయం తేలుతుందన్నారు. వెంకటేషన్ తన పదవికి రాజీనామా చేసినా, తాను డీఎంకేలోనే ఉన్నట్టు ప్రకటించడం గమనార్హం. చదవండి: సొంత పార్టీ నేతలపై కార్తీ చిదంబరం విమర్శలు కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం -
మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో కాంగ్రెస్– డీఎంకేల అధికార కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి సర్కారుకు ఇద్దరు అధికార పక్ష ఎమ్మెల్యేల రాజీనామా రూపంలో మరో సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బలపరీక్షపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా, ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కే లక్ష్మి నారాయణ, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను స్వయంగా స్పీకర్ వీపీ శివకొలుందుకు అందజేశారు. ఈ రాజీనామాలతో అధికార పక్షం బలం ఒక ఇండిపెండెంట్ సభ్యుడితో కలుపుకుని 12కి చేరింది. తమకు మద్దతిస్తున్న నామినేటెడ్ సభ్యులు ముగ్గురితో కలుపుకుని విపక్ష సభ్యుల సంఖ్య 14గా ఉంది. మొత్తం 33(ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కలుపుకుని) మంది సభ్యుల అసెంబ్లీలో ఏడు ఖాళీలున్నాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షపై సీఎం నారాయణస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు నామినేటెడ్ సభ్యులకు ఉంటుందా? ఉండదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. నామినేటెడ్ సభ్యులకు బలపరీక్ష సందర్భంగా ఓటు వేసే హక్కు ఉండదని, అయినా, ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుంటున్నామని ఇప్పటికే సీఎం నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని రాజీనామా అనంతరం లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేశానన్నారు. అయితే, వెంకటేశన్ మాత్రం తాను డీఎంకేలోనే కొనసాగుతానని, ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులను విడుదల చేయడం లేదని, దాంతో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేశానని వివరించారు. ఇద్దరు మాజీ మంత్రులు నమశ్శివాయ, మల్లాడి కృష్ణారావు సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యారు. -
కాంగ్రెస్‌లో సంక్షోభం: సీఎం రాజీనామా..!
సాక్షి, యానాం : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు శాసససభ్యులు పదవులకు రాజీనామాలు సమర్పించగా.. ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యే సీఎంకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు లక్ష్మీనారాయణన్, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేషన్ ప్రకటించారు. రాజీనామా లేఖలను స్పీకర్‌కు పంపించారు. బలపరీక్షకు ముందే వీరు వైదొలగడం ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగించాలని, విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలని తమిళసై పేర్కొన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ వైపు కేవలం 9 మంది మాత్రమే మిగిలిపోయారు. అయితే ఇద్దరు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. దీంతో అసెంబ్లీ బలపరీక్షకంటే ముందే నారాయణస్వామి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బలపరీక్ష నిర్వహించిన సరిపడ బలం లేకపోవడంతో ముందుగానే రాజీనామాను సమర్పిస్తారని తెలుస్తోంది. -
పుదుచ్చేరి సంక్షోభం: తమిళిసై కీలక నిర్ణయం
పుదుచ్చేరి: ఎమ్మెల్యేల రాజీనామాలతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధం కావాలని తెలిపారు. దీనికోసం ఈనెల 22వ తేదీన పుదుచ్చేరి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న కిరణ్ బేడిని తొలగించి తమిళిసైకి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సమావేశంలో ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సూచించారు. ప్రస్తుతం అసెంబ్లీలో రెండు పార్టీలకు ఎమ్మెల్యేలు సమానంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి భవితవ్యం సోమవారం తేలనుంది. 30 మంది సభ్యులున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నలుగురి రాజీనామాలతో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 28కి చేరింది. గతంలో మంత్రి నమశివ్వాయం, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్తో మరో ఇద్దరు రాజీనామాలు చేశారు. వీరందరి రాజీనామాతో ప్రస్తుతం ప్రభుత్వానికి 14 మంది (కాంగ్రెస్ 10, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. దీనికి సమానంగా ప్రతిపక్షాల బలం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. చదవండి: కిరణ్ బేడికి బై బై.. తమిళిసైకి బాధ్యతలు మంత్రి రాజీనామా.. ప్రమాదంలో ప్రభుత్వం -
తండ్రి హత్యపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
పుదుచ్చేరి: అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో ప్రమాదంలో పడిన ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కొందరు రాజీవ్‌గాంధీ హత్య, హంతకులపై మీ అభిప్రాయం చెప్పండి అని రాహుల్‌ను అడిగారు. దీంతో రాహుల్ గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. మా నాన్న హత్య చేసిన వారిని క్షమిస్తున్నా అని ప్రకటించారు. వారిపై (హంతకులు) తనకేం కోపం లేదని స్పష్టం చేశారు. ‘నా తండ్రిని కోల్పోయాను. అది అత్యంత కఠిన కాలం. కాకపోతే నాకు ఎవరిపై కోపం లేదు. మీకు ఎవరైనా గుండెకోత కలిగిస్తారో.. నాకు అంతకంటే ఎక్కువగా బాధ ఉంది. అయినా కూడా నాకు ఎవరిపై కోపం లేదు. వారిని క్షమిస్తున్నా. నా తండ్రి నాలో ఉన్నాడని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా పాల్గొన్నారు. అనంతరం పుదుచ్చేరిలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, అకస్మాత్తుగా రాత్రికి రాత్రి గవర్నర్ మార్పు అంశాలపై స్పందించారు. అనంతరం తమిళనాడులో కూడా రాహుల్ పర్యటించారు. తమిళ రాజకీయాలపై స్పందించారు. -
మంత్రి రాజీనామా.. ప్రమాదంలో ప్రభుత్వం
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి కృష్ణారావు తన శాసన సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. యానాంకు చెందిన ఆయన 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజీనామాతో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ప్రతిపక్షం ఒక సభ్యుడిని తమ వైపునకు లాగేసుకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ‘ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు’ చెప్పి గత నెల జనవరి 7వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఆమోదించకపోవడంతో తాజాగా ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. రాజకీయంగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రజలకు సేవ చేస్తానని మల్లాడి కృష్ణారావు తెలిపారు. నెల రోజులుగా కృష్ణారావు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికార నివాసాన్ని కూడా ఆయన ఖాళీ చేశారు. అధికారికంగా కేటాయించిన కారును వినియోగించడం లేదు. తాజాగా ఆయన రాజీనామాతో సీఎం నారాయణ్‌స్వామి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. పుదుచ్చేరి ప్రభుత్వంలో మొత్తం 33 (నామినేటెడ్‌తో కలిపి) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మంత్రి నమశిశ్వాయం, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్ రాజీనామాలు చేయగా, మరో సభ్యుడు ధనవేలు అనర్హత వేటు పడింది. ఇప్పుడు కృష్ణారావు రాజీనామాతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుత ప్రభుత్వానికి 15 మంది (కాంగ్రెస్ 11, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రతిపక్షాల బలం 14 (ఎన్ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. ప్రభుత్వ బలం బార్డర్లో ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఒక స్వతంత్రుడిని ప్రతిపక్షం లాగేసుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే పుదుచ్చేరి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. 1996 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. -
మోదీనీ చంపుతానని ప్రకటించిన వ్యక్తి అరెస్టు
పుదుచ్చేరి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు తాను సిద్ధమని, ఎవరైనా రూ.5 కోట్లు ఇస్తే ఆ పని చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించిన వ్యక్తి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. పుదుచ్చేరిలోని అర్యణ్‌కుప్పం గ్రామానికి చెందిన సత్యానందం (43) రియల్ ఎస్టేట్ వ్యాపారి. తాను అడిగినంత నగదు ఇస్తే మోదీని చంపేందుకు సిద్ధమని ఫేస్బుక్లో ప్రకటన చేయడంతో కలకలం ఏర్పడింది. అతడిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఓ ట్యాక్సీ డ్రైవర్ సహాయంతో శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఫేస్బుక్లో సత్యానందం.. ‘ఎవరైనా రూ.5 కోట్లు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపుతా’ అని సంచలన ప్రకటన చేశాడు. ఆ పోస్ట్‌ను చూసిన ఓ ట్యాక్సి డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ‘సత్య సత్య’ అనే ఫేస్బుక్ ఖాతాను పోలీసులు ట్రేస్ చేశారు. చివరకు అతడు పుదుచ్చేరికి సమీపంలో ఉన్న సత్యానందం అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రజల మధ్య అల్లర్లు సృష్టించడం, శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలపై ఐపీసీ సెక్షన్లు 505 (1), 505 (2) కింద సత్యానందంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. -
నిప్పులు చెరిగిన శాంత మూర్తి
ముంబై: ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆదివారం సంచలన ఫలితం నమోదైంది. ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో భాగంగా పుదుచ్చేరి ఆరు వికెట్ల తేడాతో పటిష్ట ముంబై జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అబ్బురపరిచిన పుదుచ్చేరి... ఆదివారం ముంబై జట్టును 19 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్యపరిచింది. 41 ఏళ్ల 129 రోజుల వయస్సున్న పుదుచ్చేరి మీడియం పేస్ బౌలర్ శాంత మూర్తి నిప్పులు చెరిగే బంతులతో ముంబై బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. శాంత మూర్తి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దాంతో ముంబై 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, ఆదిత్య తారే, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేశ్ లాడ్, సుజీత్ నాయక్‌లను శాంత మూర్తి అవుట్ చేశాడు. శాంత మూర్తి స్పెల్ ముగిశాక ముంబై మరో 52 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. 95 పరుగుల లక్ష్యాన్ని పుదుచ్చేరి 19 ఓవర్లలో నాలుగు వికెట్లు చేజార్చుకొని అందుకుంది. ఈ టోర్నీలో ముంబైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. 19న జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో ముంబై ఆడుతుంది. టి20 క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన పెద్ద వయస్కుడిగా శాంత మూర్తి ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కెనూటి టులోచ్ (కేమన్ ఐలాండ్స్–41 ఏళ్ల 7 రోజులు) పేరిట ఉండేది. 2006 జూలైలో స్టాన్‌ఫర్డ్ టి20 టోర్నీలో భాగంగా సెయింట్ లూసియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టులోచ్ 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
పుదుచ్చేరి జిల్లా కలెక్టర్‌పై విష ప్రయోగం?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి జిల్లా కలెక్టర్ పూర్వ గార్గ్‌పై విష ప్రయోగం జరిగిందన్న అభియోగాలతో సీబీ–సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వైఖరిని వ్యతిరేకిస్తూ సీఎం నారాయణస్వామి నేతృత్వంలో శుక్రవారం రాజ్‌నివాస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో అధికారులు గురువారం సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ప్రైవేటు కంపెనీకి చెందిన తాగునీటి సీసాలను అందజేశారు. కలెక్టర్ పూర్వగార్గ్ వాటర్ బాటిల్ తెరవగానే స్పిరిట్ వంటి రసాయనం వాసన గుప్పుమనడంతో తాగకుండా అధికారులకు అప్పగించారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. మిగతా బాటిళ్లలో మాత్రం స్వచ్ఛమైన నీరే ఉంది. జిల్లా కలెక్టర్‌కు అందజేసిన బాటిల్లోని నీరు మాత్రమే విషతుల్యంగా ఉండడంతో అధికారులు హతాశులయ్యారు.ఈ ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కి వ్యతిరేకంగా సీఎం నారాయణస్వామి శుక్రవారం ధర్నా చేశారు. -
ప్రజాస్వామ్యంపై మీ పాఠాలా?
న్యూఢిల్లీ/జమ్మూ: ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం, ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం దేశానికి గర్వించే క్షణమని చెప్పారు. ఆయన శనివారం జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక్కడ మూడంచెల పంచాయతీ వ్యవస్థ పూర్తిరూపం సంతరించుకుందని మోదీ తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని అన్నారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన కొద్ది కాలంలోనే పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ప్రభుత్వం(కాంగ్రెస్) స్థానిక ఎన్నికలు ఇంకా నిర్వహించలేదని ఆక్షేపించారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రజాస్వామ్యంపై వారికున్న గౌరవం ఇదేనా? ‘‘ఢిల్లీలో కూర్చున్న కొందరు వ్యక్తులు నన్ను నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు. అభ్యంతరకర పదజాలం వాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి నాకు రోజూ పాఠాలు చెబుతున్నారు. వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతా. ప్రజాస్వామ్యం గురించి నాకు బోధిస్తున్న పార్టీ పుదుచ్చేరిలో అధికారంలో ఉంది. ఆ పార్టీ అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. పుదుచ్చేరిలో చివరిసారిగా 2006లో స్థానిక ఎన్నికలు జరిగాయి. పదవీ కాలం 2011లోనే ముగిసింది. అయినా ఎన్నికలే జరపడం లేదు. అంటే వారు చెప్పేదానికి, చేసేదానికి ఏమాత్రం పొంతన లేదని దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. ప్రజాస్వామ్యం పట్ల వారికున్న గౌరవం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కొత్త నాయకత్వానికి శ్రీకారం జమ్మూకశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. ప్రతికూల వాతావరణం, కరోనా భయం ఉన్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేశారు. నాకెంతో గర్వంగా ఉంది. దేశానికి ఇదొక గర్వించే క్షణం. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం, భద్రతా సిబ్బంది అహోరాత్రులు శ్రమించారు. ప్రజల కోసం పని చేసినవారు ఎన్నికల్లో గెలిచారు. కొత్త దశాబ్దంలో కొత్త నాయకత్వానికి ఇది శ్రీకారం. గతంలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌తో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో ప్రజలు వారి హక్కులను వారు పొందారు. పాత చరిత్రను వెనక్కి నెట్టేసి, కొత్త భవిష్యత్తు కోసం ఓటేశారు.’’ ‘ఫెరాన్’ ధరించిన మోదీ జమ్మూకశ్మీర్‌లో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కశ్మీరీ సంప్రదాయ ఫెరాన్ వస్త్రాలు ధరించారు. ఈ వస్త్రాలను గత ఏడాది కశ్మీర్ వ్యవసాయ కూలీ ఒకరు మోదీకి బహూకరించారు. కశ్మీర్ పర్యటనలో ఈ వస్త్రాలు ధరించాలని మోదీ భావించినప్పటికీ కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా అది సాధ్యం కాలేదు. ఇది చరిత్రాత్మక దినం ‘‘ఆయుష్మాన్ భారత్ పథకంతో జమ్మూకశ్మీర్‌లో ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాకు అర్హులవుతారు. ఈ ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం. జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో దశాబ్దాలపాటు అధికారం చెలాయించిన నేతలు సరిహద్దు రాష్ట్రాల అభివృద్ధిని విస్మరించారు. ఆ తప్పిదాన్ని మేము సరిచేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో 12 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మోదీ పాలనలో జమ్మూకశ్మీర్‌లో శాంతి: అమిత్ షా ప్రధానమంత్రి మోదీ ఆరేళ్ల పాలనాకాలం జమ్మూకశ్మీర్‌లో చరిత్రలో 1990 తర్వాత అత్యంత శాంతియుతమైన కాలంగా గుర్తుండిపోతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ప్రారంభోత్సవం లో ఆయన ప్రధాని మోదీతోపాటు గువాహటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ప్రజలతో నరేంద్ర మోదీకి ప్రత్యేక అనుబంధం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. ఆయనను తాను ఎప్పుడు కలిసినా జమ్మూకశ్మీర్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి, ప్రజల బాగోగులు, శాంతి భద్రతల గురించి కచ్చితంగా ప్రస్తావిస్తుంటారని గుర్తుచేశారు. 2019 ఆగస్టు 5 తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రతిరంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. శాంతి లేకుంటే అభివృద్ధి జరగదని వ్యాఖ్యానించారు. యువత కలలు నిజం కావాలంటే శాంతి చాలా ముఖ్యమని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన అన్ని హామీలను ప్రధాని మోదీ తప్పనిసరిగా నెరవేరుస్తారని ఉద్ఘాటించారు. -
గాన గంధర్వుడికి అపూర్వనివాళి
పుదుచ్చేరి: 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సంగీతాభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసిన వార్త గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం. కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన సెప్టెంబర్ 25న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా పుదుచ్చేరిలోని ఒక బేకరి సంస్థ బాలుకి విభిన్నంగా నివాళులర్పిస్తోంది. చాక్లెట్‌తో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటుచేసే సాంప్రదాయాన్ని పాటిస్తున సంస్థ తాజాగా ఎస్పీబీకి నివాళిగా ఏకంగా 339 కిలోలతో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న చాక్లెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఒక శకం ముగిసింది!) పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకోవడం ఏర్పాటు చేయడం జునిక బేకరీకి అలవాటు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రాహాన్ని కూడా పూర్తిగా చాక్లెట్‌తో మాత్రమే రూపొందించి ప్రదర్శనకు ఉంచింది. ఇది జనవరి 3వరకు ప్రదర్శనలో ఉంటుందని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసిన చెఫ్ రాజేంద్రన్ చెప్పారు. 339 కిలోల బరువున్నఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటలు పట్టిందని తెలిపారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో బేకరీ యజమాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కోయంబత్తూరులో సిరితుళి అనే స్వచ్ఛంద సంస్థ ఎస్పీబీ వనం పేరుతో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పనస, మామిడి, ఎర్ర చందనం, సాండర్స్, టేకు, రోజ్‌వుడ్, వెదురు, మహోగనితోపాటు ఇతర చెట్లను పెంచనున్నారు. కాగా ఇంతకుముందు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలం చాకొలెట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 600 కిలోలసూపర్ స్టార్ రజనీకాంత్ చాకొలేట్ విగ్రహాన్ని తయారుచేసిన కబాలీ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. అలాగే కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ విగ్రహాలను కూడా రూపొందించింది. -
మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుపాన్ రూపంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక జిల్లాల్లో జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. ఉబరి నీటి విడుదల సాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చెన్నై శివార్లలో అనేక చోట్ల నీటిని తొలగించినా, కొన్ని చోట్ల మాత్రం కష్టతరంగా మారింది. దీంతో తాంబరం పరిసరవాసులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. ఇక్కడికి భారీ మోటార్ల ద్వారా నీటిని తరలించేందుకు చర్యల్ని అధికారులు చేపట్టారు. నివర్ రూపంలో రైతులకు నష్టాలు ఎక్కువే. చేతికి పంట అంది వచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో కన్నీళ్లు తప్పడం లేదు. దీంతో నష్ట పరిహారం చెల్లింపునకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పనిలో పడ్డాయి. ఇందుకు తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టే పనిలో పడింది. ప్రస్తుతం నీట మునిగిన ప్రాంతాలలో భవిష్యత్తులో మరో ముప్పు ఎదురుకాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం పళనిస్వామి ఆదేశించారు. ప్రధానంగా తాంబరం పరిసరాలపై తొలుత దృష్టి పెట్టనున్నారు. నివర్ ప్రభావం కారణంగా మరణించిన కుటుంబాలకు రూ. 12 లక్షలు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయో అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో పోలీసుల పాత్రపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో వెయ్యి మందిని తమ భుజాలపై వేసుకుని మరీ సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించడం అభినందనీయం. చదవండి: (బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి) సాగరంలో ద్రోణి.. నివర్ సహాయక చర్యలు సాగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం శనివారం మధ్యాహ్నం బయలుదేరింది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారి, తుపాన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ద్రోణి పశ్చిమ దిశలో పయనిస్తుండడంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి వర్షాలు పడనున్నాయి. ఇది తుపాన్‌గా మారనున్న దృష్ట్యా, దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ద్రోణి తుపాన్‌గా మారినానంతరం డెల్టా జిల్లాల వైపు లేదా, దక్షిణ తమిళనాడు వైపు దూసుకొచ్చేనా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి దక్షిణ తమిళనాడు, సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి తేలిక పాటి వర్షం మొదలై, క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ ఒకటి, రెండు, మూడు తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. జాలర్లు వేటకు దూరంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో గాలి వేగం గంటకు 55 కి.మీ వరకు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మేట్టుపట్టిలో 9 సె.మీ, అవినాశిలో 8 సె.మీ, చోళవందాన్, వాడి పట్టిలో 7 సె.మీ మేరకు వర్షం పడింది. బురేవి తర్వాత మరో తుపాన్‌కు అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: (మానవత్వంతో ఆదుకోండి) రూ. వంద కోట్లు ఇవ్వండి.. పుదుచ్చేరి, రాష్ట్రంలోని నివర్ బాధిత ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందో పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ఢిల్లీ నుంచి సోమ వారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. దీంతో నష్టం నివేదిక తయారీకి అధికారులు పరుగులు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో పుదుచ్చేరికి రూ. 400 కోట్లు నష్టం జరిగినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి శనివారం ప్రకటించారు. అధికారులతో సమావేశానంతరం నష్టం తీవ్రతను పరిగణించి, సహాయక చర్యల కోసం రూ. 100 కోట్లు తక్షణం కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తూ ఆయన లేఖ రాశారు. -
ఏపీ అప్రమత్తం: దూసుకొస్తున్న నివార్..
సాక్షి, అమరావతి: రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా ‘నివార్’ మారనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: ప్రాణ నష్టం లేకుండా చూడాలి : సీఎం జగన్) తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. ముందస్తుగా సహాయక చర్యల కోసం నెల్లూరు జిల్లాకు 2 ఎస్డీఆర్ఎఫ్, 1 ఎన్డీఆర్ఎఫ్.. చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు విపత్తుల శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అప్రమత్తం చేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తీర,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. (చదవండి: నివార్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు) -
నివర్ తుఫాన్: ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన నివర్ తుఫాను రేపు మరింత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన నివర్ చెన్నై ఆగ్నేయం దిశగా 420 కిమీ వేగంతో పుదుచ్చెరి చుట్టూ కారైకల్, మామల్లపురం, తమిళనాడు తీరాలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో 24 గంటల్లో నివర్ తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల రేపు, ఎల్లుండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చెరిల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వాలు రక్షణ చర్యల్లో భాగంగా సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం ఇక రేపు(బుధవారం) మామళ్లపురం- కరైకల్ తీరం వెంబడి 65-85 కిమీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భార వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున్న మత్సకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేగాక నెల్లూరు జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలను సిద్దం చేస్తుండగా.. కాకినాడ, అమలాపురం, పెద్దాపురంలోని 13 మండలాలు అధికారులకు ఏపీ ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఇక కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్ అలీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. చెన్నైలో 100 కి.మీ వేగంతో ఈదురు గాలులు అయితే నిన్నటి నుంచి చెన్నై, కరైకల్, నాగపట్నంలో కురిసిన వర్షం కారణంగా చెన్నై పోర్టులో 6వ నంబర్ వద్ద తమిళనాడు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో 100 కి.మీ వేగంతో గాలులు వీచే సూచనలు ఉండటంతో కడలూరు పోర్టులో 7వ నంబర్ వద్ద అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కడలూరు, మహాబలిపురం, పెరబలూరులో కూడా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
పుదుచ్చేరిలో ఘోరం
సాక్షి,చెన్నై: అభం శుభం తెలియని చిన్నారుల చేత వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అంతటితో ఆగక, రోజూ పదిమందికి పైగా వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన దారుణ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. పోలీసులు సోమవారం వెల్లడించిన వివరాల మేరకు కోర్కాడు చెరువు సమీపంలో బాతుల పెంపకం ఫాంలో వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు చిన్నారుల చేత వెట్టి చాకిరీ చేయిస్తుంటారు. వీరిలో శివగంగై జిల్లాకు చెందిన ఐదుగురు బాలికలు ఉన్నారు. ఫాంలో పనిపూర్తికాగానే ఈ అయిదుగురిని బయటకు వెళ్లే వీలులేకుండా ఒక గదిలో బంధించి అన్నం పెడుతుంటారు. ఈ ఐదుగురు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం అందడంతో ఫాంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అయిదుగురు చిన్నారులను రక్షించారు. పుదుచ్చేరి బాలల సంక్షేమ సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పలు ప్రాంతాలకు చెందిన 10 మంది సామూహిక లైంగిక దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ఫాం యజమాని సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. (పెళ్లి చేసుకోమని కోరితే ప్రాణాలు తీశాడు) -
‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు
-
‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు
పుదుచ్చేరి: ఎవరి బాధ్యతను వారు విస్మరించినపుడు వేరొకరి చేత ఆ బాధ్యతను గుర్తు చేయించుకోవలసిన దుస్థితి వస్తుంది. గుర్తు చేసినా వాళ్లు ఆ బాధ్యతను చేతుల్లోకి తీసుకోక పోతుంటే?! మల్లాది కృష్ణారావు గారు ఏం చేశారో చూడండి. ఆయన మన తెలుగువారు. పుదుచ్చేరిలో కీలకమైన వ్యక్తిగా పెద్ద స్థానంలో ఉన్నారు. శనివారం ఆయన ఇన్స్పెక్షన్కి వెళ్లారు. కోవిడ్ ఇన్స్పెక్షన్. ఎక్కడంటే.. ‘ఇందిరాగాంధీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’లో. పేషెంట్లను పలకరించారు. ఏ పడక దగ్గరకు వెళ్లినా ఒకటే కంప్లయింట్. ‘టాయిలెట్స్ శుభ్రంగా ఉండటం లేదు సర్’ అని. ఆసుపత్రి అధికారులను పిలిపించడం, వాళ్లు పరుగున రావడం ఏం లేదు. వాళ్లు ఆయన పక్కన లేకుంటే కదా! ‘ఏమిటిది?’ అన్నట్లు వాళ్ల వైపు చూశారు కృష్ణారావు. (శశికళకు షాక్ ఇచ్చిన ఐటీ?) ఆ వెంటనే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. చట్టం అంటే.. చీపురు, నీళ్ల బకెట్, క్లీనింగ్ లిక్విడ్స్! నేరుగా అక్కడి ఒక టాయిలెట్ గదికి వెళ్లి క్లీన్ చెయ్యడం మొదలు పెట్టారు!! ‘సార్.. సార్..’ అంటున్నా ఆగలేదు. ఎవరి పని వారు చెయ్యకపోతుంటే ‘ఎందుకు చెయ్యరు?’ అని నిలదీసి చేయించడం ఒక పద్దతి. అయితే ఎంత నిలదీసినా కదలని ఉచ్ఛస్థితి లోకి వచ్చేసిన వాళ్లు ఉంటారు. వాళ్ల చేత ఐక్యరాజ్యసమితి కూడా పని చేయించలేదు. ఇక కృష్ణారావు గారెంత? ఆఫ్టాల్ర్ ఆరోగ్యశాఖ మంత్రి. శుభ్రతే దైవం అంటారు. వృత్తిని దైవంలా భావించని వారి కారణంగానే దైవానికి భూమి మీద శుభ్రమైన చోటు లేకుండా పోతోంది. (మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..) -
'నా మంత్రివర్గంలో ఇద్దరికి కరోనా సోకింది'
పుదుచ్చేరి : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సీనీ పలువురు సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, వ్యవసాయ శాఖ కైలాష్ చౌదరితో సహా పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది. తాజాగా పుదుచ్ఛేరి మంత్రివర్గంలోనూ కరోనా కలకలం రేగింది. తన క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులు కందసామి, కమలకన్నన్ లకు కరోనా సోకిందని ముఖ్యమంత్రి వీ నారాయణ సామి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. కరోనా భారిన పడిన మంత్రులతో సన్నిహితంగా మెలిగిన వారందరూ క్వారంటైన్‌కి వెళ్లాల్సిందిగా సీఎం కోరారు. మంత్రులిద్దరూ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 53,601 పాజిటివ్ కేసులు నమోదుకాగా 871 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. (దేశంలో మరో 53,601 కరోనా కేసులు) Two of my ministers in the Cabinet, Kandasamy and Kamalakannan tested positive for COVID-19. I appeal to people moved with them to go for testing: Puducherry Chief Minister, V Narayanasamy pic.twitter.com/25G8YFJUt6 — ANI (@ANI) August 11, 2020 -
దుకాణదారుల నిర్లక్ష్యం..ఇకపై సహించం : కిరణ్ బేడి
పుదుచ్చేరి : కరోనా నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి బుధవారం హెచ్చరించారు. ఒక దుకాణదారుడు నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టివేసినట్లే అవుతుందన్నారు. అంతేకాకుండా షాపు యజమాని కుటుంబంతో సహా ఎంతోమంది జోవనోపాదిపై ఈ ప్రభావం పడుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఒకరిద్దరు దుకాణాదారుల నిర్లక్ష్యంతో వందల మందికి కరోనా సోకే అవకాశం ఉందని, దుకాణాదారులందరూ తమ ప్రాంగణాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోలన్నారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నా భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో మాత్రం విఫలమవుతున్నారని పేర్కొన్నారు. (అంబేడ్కర్ ఇంటిపై దాడి ) మార్కెట్ అసోసియేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లు కరోనా నివారణ చర్యల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కిరణ్ బేడీ కోరారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పుదుచ్చేరి వ్యాప్తంగా రోజుకి 70 కిపైగా కేసులు నమోదవుతున్నందున ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇందులో ప్రజల సహకారం ఉండాలని ఈ సందర్భంగా కోరారు. ఇక గడిచిన 24 గంటల్లో పుదుచ్చేరిలో 112 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (‘ఆర్థిక సంక్షోభం తీవ్రతరం’ ) -
మాస్కుల పరిశ్రమలో 70 మందికి కరోనా
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్లాంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే 70 మంది కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. (పరుగో పరుగు!) దీనికి కారణమైన సదరు ప్లాంట్‌ను వెంటనే సీల్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక దీన్ని నడుపుతున్న ప్రైవేటు కంపెనీపైనా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. వైరస్ సోకిన కార్మికులు ఫ్యాక్టరీకి ఏయే గ్రామాల నుంచి వస్తారో వాటిపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయా గ్రామాల్లో వీరికి సన్నిహితంగా మెదిలిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పుదుచ్చేరిలో ఇప్పటివరకు 461 కేసులు నమోదవగా ఇందులో 276 యాక్టివ్ కేసులున్నాయి. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు) -
కరోనా పేషెంట్ శవాన్ని విసిరేసి..
-
చనిపోయిన కరోనా రోగి పట్ల అమానుషం
పుదుచ్చేరి: మృతి చెందిన కరోనా రోగి పట్ల వైద్య సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. మృతదేహాన్ని నిర్లక్ష్యంగా గోతిలో విసిరేసి వెళ్లిన దారుణ ఘటన పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పుదుచ్చేరిలో పీపీఈ కిట్లు ధరించిన నలుగురు వైద్య సిబ్బంది అంబులెన్స్ నుంచి కోవిడ్-19తో మరణించిన వ్యక్తిని కిందకు తీశారు. అనంతరం హడావుడిగా సదరు వ్యక్తి శవాన్ని గొయ్యిలోకి విసిరేశారు. ఇందులో ఒకరు శవాన్ని విసిరేశామని చెప్పగానే అక్కడున్న అధికారి అంగీకారంగా వేలు చూపించాడు. (కౌంట్‌డౌన్ మొదలైంది!) పైగా చనిపోయిన వ్యక్తిని సంచిలో ఉంచకుండా కేవలం తెల్లని వస్త్రంతో చుట్టి ఉంచి ప్రోటోకాల్ నిబంధనలను సైతం ఉల్లంఘించారు. మరోవైపు పూడ్చే సమయంలో శవంపై ఉన్న తెల్లని వస్త్రం సరిగా కప్పనేలేదు. దీనివల్ల వారికి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలు మృతదేహాన్ని సరిగా పూడ్చారా? లేదా? అన్నదానిపై కూడా స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు పొక్కడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం) -
సీఎం జగన్‌ను కలిసిన పుదుచ్చేరి మంత్రి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పుదుచ్చేరి ఆరోగ్య, పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు బుధవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యానాంకు సంబంధించిన పలు అంశాలను ఆయన చర్చించినట్టు తెలిసింది. సీఎం జగన్ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని అభినందించారు. అనంతరం వివిధ అంశాలపై సీఎంకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచిన విషయం తెలిసిందే. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) -
కౌంట్‌డౌన్ మొదలైంది!
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు పెట్టారు. ఈసందర్భంగా తన సేవలను గుర్తు చేస్తూ పుదుచ్చేరి ప్రజలకు ఆమె ఓ లేఖ రాయడమే కాదు, చివరగా కౌంట్‌డౌన్ మొదలైందంటూ ముగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి 2016లో మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు స్వీకరించడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య నాలుగేళ్లుగా అధికార వార్ కొనసాగుతూనే వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం తాను లెఫ్టినెంట్ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు ముగించి, ఐదో వసంతంలోకి అడుగు పెట్టడంతో ప్రజలకు కిరణ్ ఓ లేఖాస్త్రం సంధించారు. అందులో తాను బాధ్యతలు స్వీకరించడం, ప్రజాహితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. రాజ్ నివాస్ సేవల్ని, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. ప్రజాహిత కార్యక్రమాల్ని ఎన్నడూ రాజ్ నివాస్ అడ్డుకోలేదని వివరించారు. రాజ్ నివాసన్ ప్రజల నివాస్‌గా మారిందన్నారు. వారంలో ఓ రోజు ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు సాగిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు కరోనా అందుకు అడ్డు వచ్చినట్టు పేర్కొన్నారు. మున్ముందు ఈ కార్యక్రమాలు కొనసాగేనా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ పరమైన సిద్ధాంతాల్ని పునఃపరిశీలించాల్సి ఉందని వివరించారు. మద్యం దుకాణాల వేలం, ఆస్తి, వినోద పన్నుల బకాయిల వసూళ్లు, కొన్నేళ్లుగా చెల్లించకుండా ఉన్న ప్రభుత్వ స్థలాల లీజుకు సంబంధించిన అద్దెల వసూళ్లు అంశాలపై పునఃపరిశీలన తప్పనిసరిగా పేర్కొన్నారు. కరోనా రూపంలో పర్యాటక ఆదాయం పూర్తిగా కోల్పోవడం జరిగిందని పేర్కొంటూ, ప్రస్తుతం చేతిలో ఉన్న ఆస్తుల ఆధారంగా ఆదాయం పెంచుకోవాల్సిన ఉందన్నారు. విజయన్ కమిటీ నివేదికను అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నియమించ బడ్డ లేదా ఎంపిక చేసిన అధికారులు నిబద్ధత, నిజాయితీతో పనిచేసి ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, ఆర్థిక పరిస్థితుల మెరుగు దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇలా అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ, చివరగా పుదుచ్చేరికి సేవ చేయడానికి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిందని, ఐదో ఏట అడుగు పెట్టానని, ఇక, తన కౌంట్‌డౌన్ మొదలైందని ముగించారు. ఈ దృష్ట్యా, మళ్లీ అవకాశం ఇచ్చినా, ఆ పదవిలో కిరణ్ కొనసాగేది అనుమానమేనా అన్న చర్చ బయలు దేరింది. -
దశలవారీగా లాక్డౌన్ ఎత్తివేస్తాం : సీఎం
పుదుచ్చేరి : రాష్ర్టంలో దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి నారాయణ స్వామి బుధవారం ప్రకటించారు. మే 3 తర్వాత క్రమంగా ఆంక్షలను సడలిస్తామని తెలిపారు. రాష్ర్ట మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మే 3 తర్వాత లాక్డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఒకేసారి కాకుండా, దశల వారిగా లాక్డౌన్ ఎత్తివేతకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో ముగ్గురు మాత్రమే కరోనాతో చికిత్స పొందుతున్నారని , మంగళవారం 49 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. (సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! ) ఇక ఇతర రాష్ర్టాల్లో చిక్కుకున్న కార్మికులు, వలస కూలీలు, విద్యార్థులకు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇతర రాష్ర్టాల్లో చిక్కుకున్న పుదుచ్చేరి వాసులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలందరికీ మూడునెలలపాటు ఉచితంగా బియ్యాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31, 787 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వారిలో 7,796 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటవరకు 1,008 మంది మృత్యువాత పడినట్లు పేర్కొంది. -
కరోనా: కేరళలో మూడో మరణం!
తిరువనంతపురం: పుదుచ్చేరికి చెందిన ఓ వృద్ధుడు కరోనా వైరస్(కోవిడ్-19)తో కేరళలో మరణించాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. హృద్రోగం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 71 ఏళ్ల వ్యక్తిని చికిత్స నిమిత్తం తొలుత తలస్సెరిలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి పెరియారం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి.. ఈ తర్వాత కన్నూరు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో చికిత్స పొందుతూ కన్నూరులోని ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. (100 రోజుల కరోనా; కేరళ కేసుల వివరాలు!) ఈ విషయాన్ని కన్నూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. నారాయణ నాయక్ వెల్లడించారు. మృతుడి స్వస్థలం పుదుచ్చేరి అని.. నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా శుక్రవారం కేరళలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రాణాంతక వైరస్ సోకిన వారి సంఖ్య 364కు చేరింది. వీరిలో 124 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. ఏప్రిల్ 10 నాటికి రెండు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇక కరోనా తొలి కేసు నమోదైన కేరళలో 1,29,751 మందిని అబ్వర్జేషన్లో ఉంచినట్లు సమాచారం. వీరిలో 1,29.021 మంది ఇంట్లో ఉండగా.. 703 మందిని ఆస్పత్రి క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. (నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు) ముఖ్యమంత్రి చొరవ.. ఈ చిన్నారి హ్యాపీ.. -
‘లాక్డౌన్ పొడిగించే అవకాశముంది’
సాక్షి, కాకినాడ: లాక్‌డౌన్‌ను ప్రజలు కచ్చితంగా పాటించాలని పుదుచ్చేరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చేపడుతున్న చర్యలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకే ఉన్న లాక్‌డౌన్‌ను కేంద్రం కొన్ని రోజులు పొడిగించే అవకాశముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. (లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..) కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం కంటే ముందుగానే తమ పుదుచ్చేరి సీఎం నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు పుదుచ్చేరి పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు. కేరళలో ఉన్న మాహీలో మాత్రమే పాజిటివ్ కేసు నమోదయ్యిందని.. ఆ కేసు కూడా వైద్యం అందడంతో నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. (మందు బాబులను ఆగమాగం చేస్తోంది...) కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి యానాంలో లక్ష మందికి మాస్క్‌లు, సబ్బులు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. యానాంలో ఉన్న 22 రేషన్‌షాపులు, ఐదు కోపరేటివ్ లిక్కర్ షాపులను మూసివేశామని తెలిపారు. ప్రజలకు రేషన్‌తో పాటు నిత్యావసరాలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఆ సరుకులను హోల్‌సేల్ ధరలకే హోం డెలివరీ చేస్తామన్నారు. (కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!) -
కరోనా ఎఫెక్ట్.. బార్లు బంద్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా వైరస్(కోవిడ్-19) అరికట్టడానికి అన్ని దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచనలు జారీచేసింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు మూసేశాయి. రద్దీగా ఉండే ప్రాంతలలో జనసమూహం లేకుండా చూసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది. మార్చి 19 నుంచి మద్యం బార్లు మూసివేయనున్నట్లు పుదుచ్చేరి సీఎం వీ నారాయణ స్వామి వెల్లడించారు. పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో ఇప్పటివరకు 151 మందికి సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. -
ప్రేమ జంట తలుపు తట్టి.. ప్రియుని కళ్లెదుటే
సాక్షి, చెన్నై: ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన రక్షక భటులే భక్షించిన సంఘటన పుదుచ్చేరిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన పుదుచ్చేరికి ప్రతి వారాంతపు రోజుల్లో పలువురు ప్రేమజంటలు రావడం పరిపాటి. ఇలా శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన రెండు ప్రేమ జంటలు పరిసరాల చుట్టి అక్కడ బసచేశారు. గస్తీ విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు సతీష్ కుమార్, సురేష్ ప్రేమ జంటలు ఉన్న గదులు తలుపు తట్టారు. ఒక ప్రేమ జంట తలుపు తట్టి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతామని, కేసులు పెడతామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ ప్రేమ జంట వారికి రూ. 20 వేలు ఇచ్చి సర్దుబాటు చేసుకుంది. ఆ తర్వాత మరో ప్రేమజంట వద్దకు వెళ్లగా వారి వద్ద తగిన డబ్బు లేకపోవడంతో ప్రియుని కళ్లెదుటే అతని ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. జరిగిన సంఘటనను బయటకు చెబితే పరువు పోతుందని భావించిన ఆ జంట పుదుచ్చేరి వదిలివెళ్లిపోయారు. అయితే ఈ వ్యవహారం బయటకు రావడంతో సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. అత్యాచారం, మామూళ్ల వసూళ్ల సంఘటనలు నిర్ధారణ కావడంతో కానిస్టేబుళ్లు సతీష్ కుమార్, సురేష్లను సస్పెండ్ చేశారు. -
పుదుచ్చేరి సీఎంకు షాక్
సాక్షి, చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అధికార సమరంలో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆమె తీసుకున్న నిర్ణయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గవర్నర్ నిర్ణయాలతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి సర్కారుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. తాజాగా ఎన్నికల కమిషనర్ నియామకంలో ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి సర్కారుకు పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మారారు. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికార సమరం రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. ఉచిత బియ్యం పంపిణీకి ప్రభుత్వం సిద్ధం కాగా, దానిని అడ్డుకున్నారు. ఉచిత బియ్యంకు బదులుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపిణీకి తగ్గ ఉత్తర్వులు ఇచ్చి సీఎంకు ఆమె షాక్ ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కోర్టు సైతం సమర్థించింది. దీనిని వ్యతిరేకిస్తూ నారాయణ స్వామి అప్పీలుకు వెళ్లి ఉన్నారు. అదే సమయంలో పర్యాటకంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న పుదుచ్చేరిలో రాష్ట్ర ప్రభుత్వం క్యాసినో క్లబ్స్ (పేకాట) ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంలో కిరణ్ జోక్యం చేసుకున్నారు. క్యాసినోకు నో చెప్పేస్తూనే, చెక్ పెట్టేశారు. ఈ పరిణామాలు సీఎం నారాయణ స్వామి సర్కారును ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో దెబ్బ ఆ సర్కారుకు తప్పలేదు. చదవండి: సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది! ఎన్నికల కమిషనర్ నియమకంలో.. పుదుచ్చేరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ బాలకృష్ణన్‌ను సీఎం నారాయణస్వామి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి చెక్ పెడుతూ కిరణ్ కొత్త బాట వేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల అధికారి నియమకానికి సంబంధించి పత్రికలకు ప్రత్యేక ప్రకటనలు ఇచ్చి, అర్హులైన వారిని ఎంపిక చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాలకృష్ణన్ బాధ్యతలు స్వీకరించడంతో, ఆయన నియమక ఉత్తర్వులను రద్దుచేస్తూ కిరణ్ మరో ఉత్తర్వులిచ్చారు. వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని మంత్రి నమశివాయం కోర్టు తలుపులు తట్టారు. కొన్ని నెలలుగా విచారణలో ఉంటూ వచ్చిన ఈ పిటిషన్ గురువారం తిరస్కరణకు గురైంది. అఖిల భారత స్థాయిలో దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన వారిని ఎన్నికల కమిషనర్ పదవికి ఎంపిక చేయడం అన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది కొత్త మార్గం అని, దీనిని ఆహ్వానించాల్సిన అవసరం ఉందంటూ, ఎన్నికల కమిషనర్ నియమకాన్ని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి సమర్థించారు. ఎన్నికల కమిషనర్ నియమకంలో నారాయణ సర్కారు భంగ పాటే కాదు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా పరిస్థితి మారింది. వరుసగా తమ సర్కారుకు ఎదురు దెబ్బలు కోర్టు రూపంలో తగులు తుండడంతో నారాయణకు సంక్లిష్ట పరిస్థితులు తప్పడం లేదు. చదవండి: సీఎంకి షాక్ ఇచ్చేలా హైకోర్టు ఉత్తర్వులు -
బైక్‌పై దూసుకొచ్చి మంత్రి ఫోన్‌ను కాజేశారు..
చెన్నై : ఆదమరిస్తే దొంగలు ఎంతటి దుస్సాహసానికైనా ఒడిగడతారనేందుకు ఉదాహరణగా పుదుచ్చేరిలో ఓ ఘటన వెలుగు చూసింది. పుదుచ్చేరి విద్యా శాఖ మంత్రి ఆర్ కమలకణ్ణన్ బీచ్ రోడ్లో సెక్యూరిటీ లేకుండా వాకింగ్ చేస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు ఆయన మొబైల్ ఫోన్‌ను లాక్కుని పరారయ్యారు. మంత్రి ఫిర్యాదుపై చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. పోన్‌ను కాజేసిన దుండగులను అదుపులోకి తీసుకునేందుకు బీచ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి : రూ. 473 కోట్ల విలువైన ఆభరణాల చోరీ -
పాపాయితో హైలెవల్ మీటింగ్‌కి
పుదుచ్చేరిలోని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆఫీస్‌లో మంగళవారం అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడి! వివిధ శాఖల కార్యదర్శులు ఈ హైలెవల్ మీటింగ్‌కి హాజరయ్యారు. వారిలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ఓ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు. సమావేశం గంభీరంగా సాగుతోంది. అంతలో.. మీటింగ్ హాలు బయట నుంచి పసిబిడ్డ ఏడుపు! ఆ ఏడుపు వింటూ మహిళా కార్యదర్శి స్థిమితంగా ఉండలేకపోయారు. అది గమనించారు కిరణ్ బేడి. ‘ఏమైంది?’ అన్నట్లు ఆమె వైపు చూశారు. ‘‘బయట ఏడుస్తున్నది నా కూతురే. పది నెలలు. నేను కనిపించకపోతే ఏడ్చేస్తుంది. వాళ్ల అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టి వచ్చాను’’ అని చెప్పారు ఆ ఆఫీసర్. పసికందు ఏడుపు ఆపడం లేదు. ‘‘వెళ్లి పాపను తెచ్చుకోండి’’ అన్నారు కిరణ్ బేడీ. ఆమె ముఖంలో సంతోషం. పరుగున వెళ్లి, పాపను ఎత్తుకుని తనతోపాటు లోపలికి తెచ్చుకుంది. ఆమె రాగానే మళ్లీ మీటింగ్ మొదలైంది. తల్లి ఒడిలో కూర్చొని ఉన్న పాప కూడా ఏడుపు మాని కిరణ్ బేడీ వైపే గంభీరంగా చూడ్డం మొదలు పెట్టింది. ఆ తల్లీ బిడ్డల ఫొటోను కిరణ్ బేడీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అని కామెంట్ రాశారు. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని కిరణ్‌బేడీకి పేరు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారి. కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు ఉద్యోగాలను సరిగా చేయలేరు అనే మాటను కిరణ్ ఒప్పుకోరు. బిడ్డ ఏడుస్తుంటే పనిపై ధ్యాసపెట్టడం తల్లికి కష్టమే. బిడ్డ దగ్గర ఉంటే ఆ తల్లి ఇంకా బాగా పనిచేస్తుంది అంటారు ఆమె. ఇప్పుడీ ట్విట్టర్లో కూడా కిరణ్ బేడీ ‘చైల్డ్ ఈజ్ హ్యాపీ’ అన్నారు కానీ.. ‘మదర్ ఈజ్ హ్యాపీ’ అని అనలేదు. దానర్థం.. పిల్లల లాలన కూడా డ్యూటీలో భాగమేనని. పిల్లల బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్లసంతోషం తల్లిని సంతోషంగా ఉంచుతుంది. పనిలో తల్లి సామర్థ్యాన్ని పెంచుతుంది. -
సీఎం.. నాతో పెట్టుకోవద్దు : గవర్నర్
పుదుచ్చేరి ప్రభుత్వంలో రాజ్యాంగాధినేత, ముఖ్యమంత్రి నడుమ వైషమ్యాలు కొత్తేమి కాదు. నారాయణస్వామి సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్‌బేడి నియమితులైన రోజు నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే పరిణామాలు భగ్గుమంటున్నాయి. సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో గవర్నర్ జోక్యం తగదని సీఎం నారాయణస్వామి, కేంద్రపాలిత ప్రాంతంలో గవర్నరే పాలనాధికారి అంటూ కిరణ్‌బేడి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. సీఎం అనేకసార్లు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ దశలో ఇరువురూ తాజాగా ఒకరిపై ఒకరు మరోసారి సవాళ్లు విసురుకున్నారు. పుదుచ్చేరి పాగూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తంగవేలు ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. నారాయణస్వామి, ఆయన కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లు, అందుకు ఆధారాలు కూడా ఉన్నట్లు తంగవేలు గవర్నర్ కిరణ్‌బేడీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తంగవేలు తనను కలిసి సీఎంపై చేసిన ఫిర్యాదులపై గవర్నర్ పత్రికాప్రకటన కూడా విడుదల చేశారు. నిరూపిస్తే రాజీనామా: సీఎం నారాయణస్వామి ‘నేను, నా కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లుగా ఆధారాలతో నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. అయితే ఆరోపణలు నిరూపించకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు కిరణ్‌బేడీ సిద్ధమా’ అని ముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తంగవేలు గవర్నర్‌ను కలిసినపుడు తాను, తన కుమారుడు భూఅపరణ కేసులు ఎదుర్కొంటున్నట్లుగా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. అంతేగాక అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె అనడమేగాక రాజ్‌నివాస్ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిందని సీఎం చెప్పారు. ఈ ఆరోపణలను నారాయణస్వామి ఖండించారు. ఆధారాలు, పత్రాలు లేకుండానే కేవలం మౌఖికంగా ఆమె ఈ ఆరోపణలు చేశారని విమర్శించారు. ఫిర్యాదుపై విచారణ జరపకుండానే నిర్ధారించుకున్నారని అన్నారు. దీనిని బట్టి ఆమెకు పరిపాలన తెలియదని తేటతెల్లమైందని దుయ్యబట్టారు. తానే కాదు నా కుటుంబసభ్యులెవరైనా భూ అపహరణ కేసులను ఎదుర్కొంటున్నట్లు రుజువుచేస్తే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. నిరూపించలేకుంటే ప్రజాజీవితం నుంచి తప్పుకునేందుకు ఆమె సిద్ధమాని ప్రశ్నించారు. నాతో ఢీకొనవద్దు: కిరణ్‌బేడి సీఎం నారాయణస్వామి విసిరిన సవాల్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. సీఎం సవాల్ విసరాల్సింది నాకు కాదు.. వారి ఎమ్మెల్యేకు. సదరు ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఆరోపణలు చేసింది వారి ఎమ్మెల్యేనే. తండ్రీ, కొడుకులు భూ అపహరణకు సంబంధించి ఆధారాలున్నట్లు చెప్పింది కూడా ఎమ్మెల్యే తంగవేలే. ఆధారాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని మీ ఎమ్మెల్యేకు సవాల్ విసరుకోండి. లేదా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆధారాలను సమర్పించాలని కోరండి. ఆధారాలుంటే సీబీఐకి అప్పగించాల్సిందిగా హితవు పలికాను కాబట్టి నాపై సవాళ్లు విసరొద్దు. సీబీఐ విచారణకు వస్తే ఆరోపణలను ఎదుర్కోండి. అంతేగానీ దయచేసి నాతో ఢీకొనవద్దు. -
మేడం.. ఇవేనా మీరు ప్రచారం చేసేది..!
పుదుచ్చేరి : సోషల్ మీడియా విసృతి పెరగడంతో వాస్తవాల కంటే అసత్య వార్తలే ఎక్కువగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌లో చాలామంది తమకు వచ్చిన మెజేజ్లలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే మరొకరికి ఫార్వార్డ్ చేస్తున్నారు. దాంతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. సచిన్ టెండూల్కర్, ఆనంద్ మహింద్ర వంటి వారు స్ఫూర్తిమంతమైన వార్తల్ని ప్రచారం చేస్తుండగా.. కొందరు ప్రముఖులు మాత్రం అనాలోచితంగా మెసేజ్‌లు ఫార్వార్డ్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ తాజాగా ఆ జాబితాలో చేరారు. ఎన్నో నెలలుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ అసత్య వార్తను ఆమె ట్విటర్లో పోస్టు చేసి ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆమె ఓ వీడియోను పోస్టు చేసి.. ‘సూర్యుడి నుంచి వస్తున్న ఓంకార శబ్దాన్ని నాసా రికార్డు చేసింది’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. నాసా గతంలో విడుదల చేసిన అసలు వీడియోను పోస్టు చేసి.. వాస్తవాలు తెలుసుకోండి మేడం..! అని కామెంట్లు చేస్తున్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉన్న వ్యక్తి ఇలాంటి నమ్మకాలను, అసత్యాలను ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ట్వీట్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోండి అని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, 40 రోజులపాటు సూర్యుడు, హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ (ఎస్‌వోహెచ్‌వో)కి చెందిన డేటాను మిచెల్సన్ డాప్లర్ ఇమేజర్ సాయంతో ఎ.కొసొవికెవ్ అనే శాస్త్రవేత్త ప్రాసెస్ చేశారు. ఈ వీడియోను 2018లో నాసా యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. pic.twitter.com/ArRwljjDVE — Kiran Bedi (@thekiranbedi) January 4, 2020 -
సీఎం గారూ.. మీ ప్రవర్తన హద్దుమీరింది!
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కిరణ్ బేడీ పదవి బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచే సీఎం నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రతిగా సీఎం నారాయణస్వామి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కాగా.. గత కొద్దిరోజులుగా వీరిరువురి మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. పుదుచ్చేరి ఆదాయం పెంచుకునేందుకు కాసినోలు, మద్యం తయారీ సంస్థలు, లాటరీ కంపెనీలు స్థాపించాలని సీఎం నారాయణస్వామి భావిస్తుండగా, కిరణ్ బేడీ అందుకు అభ్యంతరం చెబుతుండడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం నెలకొంది. చదవండి: 'పాకిస్తాన్ వెళ్లమంటారా అంటూ కేంద్రమంత్రి సీరియస్' ఈ క్రమంలో సీఎం నారాయణస్వామి కిరణ్ బేడీ గురించి ప్రస్తావిస్తూ.. ఆమె దెయ్యం, మనస్సాక్షి లేని వ్యక్తి, జర్మనీ నియంత హిట్లర్‌కు చెల్లెలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ బేడీ కూడా కాస్త ఘాటుగా స్పందించింది. సీఎం కాస్త హుందాగా నడుచుకుంటే మంచిదని హితువు పలికారు. కొన్నిరోజులుగా మీరు నన్ను అనేక పేర్లతో దూషిస్తున్న విధానం గమనిస్తున్నాను. ఇటీవలే మీ ప్రవర్తన హద్దుమీరింది. లెఫ్టినెంట్ గవర్నర్‌గా నేనెప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా బుద్ధుడు పేర్కొన్న హితోక్తిని కూడా కిరణ్ బేడీ ప్రస్తావించారు. 'ఎవరైనా ఒకర్ని దూషించినప్పుడు రెండో వ్యక్తి ఆ తిట్లను స్వీకరించకపోతే, ఆ తిట్లు మొదటి వ్యక్తి వద్దే ఉంటాయి' అంటూ వ్యాఖ్యానించారు. -
అమానుషం: ఫొటోలు తీశారు గానీ...
పుదుచ్చేరి : ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు పరిశీలిస్తే మానవత్వం మంటగలిసి పోతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి.. సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న బాధితులకు... సహాయం కోసం అర్థిస్తున్న అభాగ్యులకు వీలైతే సహాయం చేయాల్సింది పోయి.. వారిని ఫొటోల్లోనూ, వీడియోల్లోనూ బంధించి ఆనందించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ వ్యక్తిని అతడి బంధువులు తోపుడు బండిలో తీసుకెళ్తుంటే బాటసారులు చోద్యం చూశారే తప్ప అంబులెన్సుకో లేదా మరేదైనా వాహనానికో ఫోన్ చేయలేదు. పరోక్షంగా అతడి మరణానికి కారణమయ్యారు. వివరాలు... తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి తన భార్య సోదరి కుటుంబాన్ని కలిసేందుకు పుదుచ్చేరిలోని సుతుకేనికి వచ్చాడు. క్షయ వ్యాధితో బాధపడుతున్న అతడి ఆరోగ్యం బుధవారం మధ్యాహ్నం పూర్తిగా క్షీణించింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ఉపక్రమించారు. అయితే రోజూవారీ కూలీలైన సుబ్రమణి బంధువుల వద్ద కనీసం మొబైల్ ఫోన్ కూడా లేకపోవడంతో వారు అంబులెన్సుకు ఫోన్ చేయలేకపోయారు. దీంతో తమ ఇంట్లో ఉన్న తోపుడు బండిలో తీసుకుని భార్యభర్తలిద్దరూ సుబ్రమణిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు మీద వాళ్లను చూసిన బాటసారులు ఫొటోలు, వీడియోలు తీశారు గానీ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కాగా తోపుడు బండిపై ఆస్పత్రికి చేరుకునే సమయానికే సుబ్రమణి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే అక్కడ మరోసారి వాళ్లకు చేదు అనుభవమే ఎదురైంది. పుదుచ్చేరి సరిహద్దు నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు పుదుచ్చేరి వాహనాలకు అనుమతి లేకపోవడంతో.. శవంతో ఆస్పత్రి వద్దే ఉండిపోయారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసు అధికారి మురుగనందన్ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన అంబులెన్సును రప్పించి సుబ్రమణి శవాన్ని సొంతూరికి తరలించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ‘ ఇరులా తెగకు చెందిన సుబ్రమణి టీబీతో బాధపడుతున్నాడు. వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లిన క్రమంలో అతడి ఆరోగ్యం క్షీణించింది. అయితే వాహన సదుపాయం లేకపోవడంతో సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లక పోవడంతో అతడు మరణించాడు. మార్గమధ్యలో ఎంతో మంది వారిని చూశారే గానీ ఒక్కరూ సహాయం చేయలేదు. ఒకవేళ ఎవరైనా వెంటనే స్పందించి ఉంటే అతడి ప్రాణాలు నిలిచేవి’ అని పేర్కొన్నారు. -
భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిండా ముప్పై ఏళ్లు కూడా రాకమునుపే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లాడాడు. ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడిగా ఒకేచోట కాపురం చేస్తూ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం, భర్త శవం కోసం ముగ్గురు పెళ్లాలు పోరాటానికి దిగిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు... పుదుచ్చేరి కేంద్రపాలిత రాష్ట్రం రెడ్డియార్‌పాళంకు చెందిన సింగారవేలు(30) అనే యువకుడు సత్య అనే యువతిని వివాహమాడాడు. అయినా పెళ్లిపై మోజు తీరక ధనలక్ష్మి, కావ్య అనే మరో ఇద్దరిని వరుసగా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముగ్గురు భార్యలతో కలిసి కాపురం చేసేవాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కుటుంబసమస్యల కారణంగా సింగారవేలు సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి శవాన్ని పుదుచ్చేరీలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఆసుపత్రికి చేరుకున్న ముగ్గురు భార్యలు భర్త శవాన్ని తమకే అప్పగించాలంటూ ఎవరికి వారు పోటీపడ్డారు. ఒక దశలో వివాదం ముదిరిపోగా ముగ్గురు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని మంగళవారం పంచాయితీ చేసి పెద్దభార్య సత్యకు సింగారవేలు శవాన్ని అప్పగించారు. -
పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమిస్తున్నానని అంటే నమ్మింది. సన్నిహితంగా మెలగడంతో గర్భందాల్చింది. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో ప్రియుని చేతిలో సజీవదహనమై పోయింది. పుదుచ్చేరిలో చోటుచేసుకున్న ఈ ఘోర ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరి ఆరోరాలోని జీడిమామిడి తోటలో కాలిపోయిన స్థితిలో సుమారు 20 ఏళ్ల వయసున్న యువతి శవాన్ని గతనెల 30న పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. యువతి ముఖం పూర్తిగా కాలిపోయి ఉండడంతో ఆమె ఎవరో గుర్తించేందుకు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈనెల 2న ఆరోరా పోలీసుస్టేషన్‌కు అప్పాదురై అనే యువకుడు వచ్చి తన అక్క మూడురోజులుగా కనపడడం లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అప్పాదురై, అతని తల్లి మనోరంజితం, ఇద్దరు సోదరిలను పుదుచ్చేరి బీమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి యువతి శవాన్ని చూపగా ఆమె లక్ష్మీనేనని గుర్తించి గుండెలవిసేలా రోదించారు. హతురాలు లక్ష్మి పుదుచ్చేరి నెహ్రూ వీధిలోని దుకాణంలో పనిచేస్తుండగా అదే దుకాణానికి చెందిన వాహన డ్రైవర్ అరుణకుమార్‌తో స్నేహం ఏర్పడిందని, గత నెల 29న దుకాణానికి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన లక్ష్మి తిరిగి రాలేదని తల్లి మనోరంజింతం పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు అరుణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన స్నేహితునితో కలిసి లక్ష్మీని హత్యచేసినట్లు అంగీకరించాడు. -
పుదుచ్చేరి సీఎంకు కేజ్రీవాల్ మద్దతు
-
ఐదో రోజుకు నారాయణస్వామి ధర్నా
పుదుచ్చేరి: లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి వైఖరికి నిరసనగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి రాజ్‌నివాస్ బయట చేస్తున్న ధర్నా ఆదివారం ఐదోరోజుకు చేరింది. సం క్షేమ పథకాలపై ప్రభుత్వ ప్రతిపాదనలకు బేడి ఆమోదం తెలపకుంటే నిరసనను తీవ్రతరం చేసి జైల్‌భరో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉచిత బియ్య పంపిణీ పథకంతోపాటు మరో 39 సంక్షేమ పథకాల ప్రతిపాదనలు, పరిపాలనా సంబంధ నిర్ణయాల్ని లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బేడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేశారు. తమ నిరసన తెలిపేందుకు నల్ల జెండాలు ఎగరవేసే స్థాయికి చేరడం దురదృష్టకరమని నారాయణస్వామి పేర్కొన్నారు. విభేదాలపై ఫిబ్రవరి 21న బహిరంగ చర్చకు వస్తానని బేడి చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని చెప్పారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పుదుచ్చేరి వెళ్లి నారాయణస్వామి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలుకు అడ్డుపడుతున్న కిరణ్ బేడిని కేంద్రం వెనక్కి పిలవాల ని డిమాండ్ చేశారు. బేడి ప్రజాస్వామిక విలు వల్ని అణగదొక్కుతున్నారని ఆరోపించారు. -
అట్టుడుకుతున్న పుదుచ్చేరి..
సాక్షి, చెన్నై : ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదంతో పుదుచ్చేరి అట్టుడుకుతుంది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి.. ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కొన్ని రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తక్షణమే పాటించాలంటూ కిరణ్ బేడి ప్రజలను ఒత్తిడి చేస్తుండటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ బేడి చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు పిలుపున్వివడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో భాగంగా బుధవారం నారాయణ స్వామి కిరణ్ బేడి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీదే నిద్రపోయారు. సీఎంకు మద్దతుగా మంత్రులు, డీఎంకే కార్యకర్తలు కూడా అక్కడే బైఠాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఈ విషయం గురించి నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను దశల వారిగా అమలు చేయాలి. అంతేతప్ప తక్షణమే జరిగిపోవాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. కిరణ్ బేడి చర్యల వల్ల ప్రజల్లో మాపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆమె చర్యలను వ్యతిరేకిస్తూ.. రాజ్‌భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చాన’ని పేర్కొన్నారు. అంతేకాక నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే కిరణ్ బేడి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నారాయణస్వామి చేపట్టిన ధర్నాకు డీఎంకే కూడా మద్దతు పలకటంతో భారీ సంఖ్యలో జనాలు రాజ్ భవన్ ముందుకు చేరుకున్నారు. -
ఈసారి కళ తప్పుతున్న ‘పుదుచ్ఛేరి’
సాక్షి, న్యూఢిల్లీ : ఈసారి పుదుచ్చేరిలో జరిగే నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న పర్యాటకులకు ఆశాభంగం తప్పదు. పుదుచ్ఛేరి హోటళ్లు ఈసారి ఆడంబరంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించడం లేదు. ముఖ్యంగా సంగీత విభావరి లాంటి కార్యక్రమాలకు స్వస్తి చెబుతున్నాయి. అందుకు కారణం వాటిపైన 25 శాతం వినోద పన్నును వేయడమే కాకుండా 28 శాతం జీఎస్టీని వసూలు చేయడం. అంతేకాకుండా మ్యూజిక్ లైసెన్సింగ్ కంపెనీలు సంగీత విభావరి నిర్వహించే ప్రతి హోటల్ లక్ష రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ షరతు పెట్టడం కూడా కారణమే. ఈ చట్టాలు కొత్తగా వచ్చినవేవి కావు. కానీ ఈ సారి చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించడమే హోటళ్ల యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. గతంలో ప్రేక్షకుల ఎంట్రీ టిక్కెట్‌ను ఆహారానికి ఇంత, మద్యానికి ఇంత, వినోదానికి ఇంత అని విభజించి, వినోదానికయ్యే మొత్తంపైనే పన్ను కట్టేవాళ్లట. ఇక ఆ పప్పులు ఉడకవని, ప్రేక్షకుడి ఎంట్రీ టిక్కెట్ మొత్తంపైన వినోద పన్ను, జీఎస్టీలు కట్టాలని కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయించడమే కారణమట. ఈ విషయాన్ని షేన్‌బాగ హోటల్ మేనేజర్ విమల్ తెలిపారు. ఈ పన్నులు కడితే తమకు మిగిలేది ఏమీ ఉండదని సన్వే మనోర్ హోటల్స్ ఉపాధ్యక్షుడు డీ. లారెన్స్ చెప్పారు. సాధారణ సమయాల్లోకెల్లా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డీజేలు తమ ఫీజును పదింతలు పెంచుతారని ఆయన అన్నారు. తాము నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా కూడా ఈ సారి ఎలాంటి సంగీత కార్యక్రమాలను నిర్వహించదల్చుకోలేదని ఆయన తెలిపారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుదుచ్చేరి ఒకటి. గతేడాది 16.63 లక్షల మంది పర్యాటకులు వచ్చారని, వారిలో 15.31 లక్షల మంది భారతీయులే ఉన్నారని టూరిజం విభాగం లెక్కలు తెలియజేస్తున్నాయి. -
భయంకర సునామీకి 14 ఏళ్లు
-
దాటవేతే మోదీ జవాబు
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరిలకు చెందిన బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఇటీవల మాట్లాడటం తెలిసిందే. ఇందులో ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నను మోదీ దాటవేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యంగ్యంగా స్పందించారు. ‘బీజేపీ తనిఖీ చేసిన తర్వాతనే ప్రశ్నలను అనుమతించడం చాలా మంచి ఉపాయం. మోదీ చెప్పే సమాధానాలను కూడా ఆ పార్టీ తనిఖీ చేస్తే మరింత బాగుంటుంది’ అని రాహుల్ అన్నారు. ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనం ప్రకారం తమిళనాడుకు చెందిన కార్యకర్త ఒకరు మోదీని ‘మీ ప్రభుత్వం మధ్యతరగతి వారి నుంచి పన్నులు ఎక్కువగా వసూలు చేస్తూ వారి బాగోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు?’ అని అడిగారు . వెంటనే మోదీ అతని ప్రశ్నను పక్కనబెట్టి పుదుచ్చేరి కార్యకర్తలతో సంభాషణ ప్రారంభించారు. దీనిపై రాహుల్ ట్వీట్ చేస్తూ, ‘వణక్కం పుదుచ్చేరి! కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ ఇచ్చిన బదులిదే. ఇకపై కార్యకర్తల ప్రశ్నలనే కాదు, మోదీ సమాధానాలను కూడా బీజేపీ తనిఖీ చేసుకుని అనుమతించాలి. విలేకరుల సమావేశంలో అడిగే ప్రశ్నలకే కాదు, తమ పార్టీ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కూడా మోదీకి చేతకాదు’ అని విమర్శించారు. -
‘మోదీకి నేనంటే చాలా ఇష్టం.. అందుకే’
సాక్షి, విశాఖపట్నం : దేశంలో నిరంకుశ పాలన అంతం కావాలంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఉద్వాసన పలకడం ఒక్కటే మార్గమని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ‘ మేము(కాంగ్రెస్) ఆయనను బయటికి పంపాల్సిన అవసరం లేదు. ఆయన పాలన పట్ల ప్రతీ ఒక్కరిలో అసంతృప్తి రగులుతోంది. ఈ కారణంగా ఆయన సొంత మనుషులు, పార్టీ వాళ్లే ఏదో ఒకరోజు ఆయనను బయటికి నెట్టివేస్తారు. కేవలం ఇద్దరు మనుషుల చేతుల్లో బీజేపీ నలిగిపోతుందని ఆ పార్టీ నాయకులే నా దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పదవి నుంచి దిగిపోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం... ప్రధాని మోదీకి ముఖ్యమంత్రులతో మాట్లాడే సమయమే ఉండదని నారాయణ స్వామి విమర్శించారు. గతంలో ఆయన అపాయింట్మెంట్ కోసం ఆరు సార్లు ప్రయత్నిస్తే కనీసం రెండుసార్లైనా దొరికేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ మోదీకి నేనంటే ఎంతో ఇష్టం. అందుకే కిరణ్‌బేడీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపించారు’ అని నారాయణ స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా పాలన పరమైన విషయాల్లో కిరణ్‌బేడి అతిగా జోక్యం చేసుకుంటున్నారని, లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేకంటే ఓ చౌకీదార్‌లా ఉండేందుకే ఆమె ఉత్సాహం చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. -
సాగరగర్భంలో తొలి మ్యూజియం!
సాక్షి, చెన్నై: దేశంలో తొలిసారిగా పుదుచ్చేరిలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం రూపకల్పనకు బీజం పడింది. 26 అడుగుల మేరకు నిర్మాణాలు సాగరంలో జరగనున్నాయి. పుదుచ్చేరి సముద్ర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రెంచ్ వారి హయాంలో నిర్మించిన పురాతన చిహ్నాలు ఎన్నో ఈ తీరంలో ఉంటాయి. పుదుచ్చేరికి ఆదాయం విదేశీ, స్వదేశీ పర్యాటకుల ద్వారానే ఎక్కువగా వస్తోంది. దీంతో పర్యాటకంగా పుదుచ్చేరిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం ఏర్పాటుకు కార్యాచరణపై దృష్టి పెట్టింది. కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో సమష్టి భాగస్వామ్యంలో నిర్మాణాలపై కసరత్తు జరుగుతోంది. నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కడలూరు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఈ జలాంతర్గామిని మ్యూజియం కోసం ఎంపిక చేశారు. 61.3 మీటర్ల పొడవు, 10.2 మీటర్ల వెడల్పు, 11.98 మీటర్ల ఎత్తు కల్గిన ఈ జలాంతర్గామిలో ఉన్న యంత్రాలు, ఇతర పరికరాల్ని తొలగించి మ్యూజియంగా మార్చడానికి అవసరమైన పనులు విశాఖపట్నంలో సాగుతున్నాయి. ఈ మ్యూజియంలోకి వెళ్లే మార్గంలో డాల్ఫిన్‌తో పాటు సముద్ర జలరాశుల్ని వీక్షించేందుకు తగ్గట్టుగా అద్దాలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. -
వేకువజామునే ధమాకా
న్యూఢిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి మత సంప్రదాయాలకు అనుగుణంగా దీపావళి, ఇతర పండగల సందర్భంగా ఆ రాష్ట్రాల్లో వేకువజామునే 4.30–6.30వరకు బాణసంచా కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. టపాసులు పేల్చే సమయాన్ని మార్చుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని, కానీ అందుకు పరిమితి రెండు గంటలే అని పేర్కొంది. తక్కువ శబ్దం, కాలుష్యం వెదజల్లే గ్రీన్ క్రాకర్స్‌కు సంబంధించి తాము జారీచేసిన మార్గదర్శకాలు ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికే పరిమితమని కోర్టు స్పష్టతనిచ్చింది. తమ మత సంప్రదాయాల ప్రకారం దీపావళి పర్వదినాన ఉదయం పూట బాణసంచా కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని తమిళనాడు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారిస్తూ తాజా ఆదేశాలు జారీచేసింది. దీపావళి, ఇతర పండగల సందర్భంగా రాత్రి 8–10 గంటల మధ్యే టపాసులు కాల్చాలని అక్టోబర్ 23న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు..గ్రీన్ క్రాకర్స్ వాడకంపై తామిచ్చిన ఆదేశాలు దేశమంతటికీ వర్తించవని, తీవ్ర కాలుష్యానికి లోనవుతున్న ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికే పరిమితమని పేర్కొంది. బేరియం సాల్ట్‌పై నిషేధాన్ని ప్రస్తావించిన తయారీదారుల తరఫు లాయర్..ఆ రసాయనం లేకుండా బాణసంచా తయారుచేయడం అసాధ్యమని పేర్కొన్నారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణి స్పందిస్తూ.. బేరియం సాల్ట్ లేకుండానే బాణసంచా తయారుచేయొచ్చని, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తానని కోర్టుకు చెప్పారు. -
1 నుంచి ఈశాన్య రుతుపవనాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రుతుపవనాలు నవంబర్ 1న ప్రారంభమయ్యే అవకాశముందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనావేసింది. ఈ సీజన్లో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళలలో ఎక్కువగా వర్షపాతం కురుస్తుంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 20నే ప్రారంభమవుతాయి. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ సర్క్యులేషన్ వల్ల ఈసారి కాస్త ఆలస్యమవుతోందని ఐఎండీ తెలిపింది. మరోవైపు, అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వెనుదిరిగాయని వెల్లడించింది. -
ఉడికిన కోడిగుడ్లు మింగేందుకు ప్రయత్నించి..
తూర్పు గోదావరి, యానాం: కోడిగుడ్లు తినకుండా ఒక్కసారే మింగడానికి ప్రయత్నించడం వ్యక్తి ప్రాణాలను తీసింది. పుదుచ్ఛేరిలో బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ముదలియార్‌పేట పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. కోమ్బక్కమ్కుప్పనపేటకు చెందిన రోజువారి కూలి గుణశేఖరన్ ఇంట్లో కూర వండడానికి ఉడకబెట్టిన రెండు కోడిగుడ్లును మింగేందుకు ప్రయత్నించాడని ఈ నేపథ్యంలో అవికాస్తా గొంతు మధ్యలో ఉండిపోవడంతో ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో అమస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని తెలిపారు. భార్య పునీత, స్థానికులు అతడిని స్థానిక ఇందిరా గాంధీ ప్రభుత్వసాధారణ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుణశేఖరన్ మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ముదలియార్‌పేట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘పామునే కాదు..నిన్నూ పట్టుకుంటా’
సాక్షి ప్రతినిధి, చెన్నై: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు గురిచేయడంలో తమకేమీ మినహాయింపు లేదని పుదుచ్చేరి ప్రభుత్వ ఉన్నతాధికారి జుగుప్సాకరమైన తీరులో రుజువు చేసుకున్నాడు. సదరు దుశ్సాసన అధికారిని శిక్షించేందుకు పుదుచ్చేరి గవర్నర్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించినా మహిళల ఫిర్యాదుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా కోర్టు నుంచే రక్షణ పొంది కాలక్షేపం చేస్తున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వశాఖలు, ప్రయివేటు సంస్థల్లో పనిచేసే మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు గవర్నర్ కిరణ్‌బేడీకి ఇటీవల కాలంలో తరచూ ఫిర్యాదులు అందాయి. దీంతో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పుదుచ్చేరి బాలల రక్షణ, సంక్షేమ కమిటీ చైర్మన్, డాక్టర్ విద్యా రామ్‌కుమార్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటైంది. అనేక ప్రభుత్వ శాఖల, ప్రయివేటు సంస్థల ఉద్యోగులు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు పలువురు బాధితులు విద్యా రామ్‌కుమార్‌కు చెప్పుకుని వాపోయారు. ప్రభుత్వంలో సంచాలకుల స్థాయిలోని ముగ్గురు అధికారులు సహా పదిమంది తమను వేధిస్తున్నట్లు 27 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. లైంగిక కార్యకలాపాలకు తలొగ్గకుంటే బదిలీ చేస్తామని బెదిరింపులు, ఇతరత్రా ఇబ్బందులు పెడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. నేరుగా వచ్చి సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సదరు సంచాలకులకు విద్యారామ్కుమార్ సమన్లు పంపారు. అయితే సమన్లు అందినా బుధవారం ఆయన హాజరుకాలేదు. అంతేగాక విద్యా రామ్‌కుమార్ తనను విచారించేందుకు వీలులేదంటూ మద్రాసు హైకోర్టు ద్వారా ఆయన స్టే పొందారు. దీంతో కోర్టు మంజూరు చేసిన స్టేను ఎత్తివేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. విచారణ కమిటీకి అందిన ఆడియో ఇద్దరు మహిళా ఉద్యోగినులతో తప్పుడు సంకేతాలతో సంచాలకులు జరిపిన సెల్‌ఫోన్ సంభాషణ ఆడియోను ఉద్యోగినులు బయటపెట్టారు. విధుల్లో పడుతున్న ఇబ్బందులు చెప్పుకున్నçప్పుడు ద్వంద్వార్థాలతో బదులివ్వడం, నన్ను గమనించుకుంటే నీకు కష్టాలే ఉండవు అనడం, ఆఫీసు పరిసరాల్లో పాములు వస్తున్నాయి సార్ అంటే.. నేను స్వయంగా వచ్చి పాములూ పట్టుకుంటా.. నిన్నూ పట్టుకుంటానని వెకిలిగా మాట్లాడిన సెల్ సంభాషణల ఆడియోను మహిళా ఉద్యోగినులు విచారణ కమిటీకి అందజేశారు. సదరు సంచాలకులకు వ్యతిరేకంగా మరికొందరు ఉద్యోగినులు కొన్ని వీడియో టేపులను సైతం గురువారం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. -
మోదీ వస్తే.. కుటుంబంతో ఆత్మహత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై : తన తల్లి, ఇద్దరు సోదరిల ఆత్యహత్యకు కారణమైన పుదుచ్చేరిలోని అరవింద్ ఆశ్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినట్లయితే మిగిలిన కుటుంబసభ్యులతో కలసి ఆత్మహత్య చేసుకుంటానని జార్ఖండ్‌కు చెందిన హేమలత హెచ్చరించారు. చెన్నైలో శనివారం ‘అమ్మ ద్విచక్ర వాహన పథకం’ను ప్రారంభించిన మోదీ ఆదివారం పుదుచ్చేరిలో అర వింద్ ఆశ్రమ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హేమలత మీడియాకు చెప్పిన వివరాలు.. పుదుచ్చేరి అరవింద్ ఆశ్రమంలో హేమలత, ఆమె నలుగురు సోదరిలు జయశ్రీ, అరుణశ్రీ, రాజ్యశ్రీ, నివేదిత ఉండేవారు. 2002లో ఆశ్రమ నిర్వాహకులు, సభ్యు లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వీరు ఆరోపించడంతో నిర్వాహకులు వీరిని బలవంతంగా బయటకు పంపారు. దీంతో వీరి కుటుంబం 2014 డిసెంబర్ 18వ తేదీ తెల్ల వారుజామున హేమలత, అరుణశ్రీ, నివేదిత, జయశ్రీ, రాజ్యశ్రీ వారి తల్లిదండ్రు లు ప్రసాద్, శాంతిదేవితో కలసి పుదుచ్చేరి సముద్రంలోకి దిగారు. ఈ సంఘటనలో అరుణశ్రీ (52), రాజ్యశ్రీ (48), తల్లి శాంతిదేవి (78) చనిపోయారు. అలల్లో కొట్టుమిట్టాడుతున్న నివేదిత, హేమలత, జయశ్రీ, తండ్రి ప్రసాద్‌ను జాలర్లు రక్షించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తమకు తిరిగి ఆశ్రమంలో నివసించే అవకాశం కల్పించనందుకు బాధితులు అనేక పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం పుదుచ్చేరిలో అరవింద్ ఆశ్రమ కార్యక్రమానికి వస్తే తామంతా ఆత్మ హత్య చేసుకుంటామని ఆమె హెచ్చరించారు. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు
సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఒకే వేదిక మీదకు వచ్చారు. పుదుచ్చేరిలో నారాయణస్వామి అధికారం చేపట్టినప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి పక్కలో బల్లెంలా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. గవర్నర్ కావాలనే తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. పలు సార్లు కిరణ్‌బేడీ పర్యటనలను కూడా అడ్డుకునే విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్ నిర్ణయాల్ని సీఎం వ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి. దీంతో వీరివురి సమస్యకు పరిష్కారం లేదా అనే సందేహం చాలమంది అధికారపార్టీ నేతల్లో ఉండేది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం ప్రాముఖ్యత సంతరించుకుంది. వేదిక ముఖ్యమంత్రి, గవర్నర్లు అందరిని ఆశ్చర్యపరుస్తూ, ఆకర్షించే రీతిలో కనిపించారు. ఇప్పటికైనా ఇరువురు తమ పంతాలను పక్కన పెట్టి సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమించాలని అటు ప్రజలు, ఇటు పార్టీల నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య సమరం..
-
సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య సమరం..
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఏ మాత్రం తగ్గడం లేదు. తన మీద పాలకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక, ప్రభుత్వం నుంచి రాజ్ నివాస్‌కు వచ్చే అన్ని రకాల ఫైల్స్, అందులోని వివరాలు, ఆమోద ముద్ర వరకు ప్రజలకు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. అన్ని విషయాల్ని బహిర్గతం చేస్తామంటూ రాజ్‌నివాస్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రకటించడం విశేషం. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వానికి, పథకాలకు వ్యతిరేకంగా కిరణ్ వ్యవహరిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంపించే ఫైల్స్‌ను తుంగలో తొక్కుతున్నారని, అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజాహిత కార్యక్రమాలన్నీ గవర్నర్ రూపంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొంటూ వస్తున్నారు. ఇది కాస్త ప్రజల్లో ఆగ్రహాన్ని రేపింది. కిరణ్ పర్యటన సాగే ప్రాంతాల్లో ఆందోళనలు, వ్యతిరేకత తప్పడం లేదు. ఆమెను ఘెరావ్ చేయడం, వెనక్కు వెళ్లాలన్న నినాదంతో ప్రజలతో కలిసి పాలకులు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాను ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టుగా కిరణ్ దూకుడు పెంచడం గమనార్హం. సీఎం నారాయణస్వామి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టే విధంగా కొత్త ఎత్తుగడ వేశారు. ఇక, అన్నీ బహిర్గతం: తాను ఫైల్స్‌ను పక్కన పెడుతున్నట్టు, పథకాలకు ఆమోదం ఇవ్వడం లేదని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి నిర్ణయం తీసుకున్నారు. రాజ్ నివాస్‌కు వచ్చే అన్ని ఫైల్స్, ఇతర వివరాలను ప్రజలకు తెలియజేయనున్నట్టు ప్రకటించారు. తమ ఆమోదానికి తగ్గ అన్ని వివరాలను రాజ్ నివాస్ వెబ్సైట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. ఆ మేరకు ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాజ్ నివాస్‌కు వచ్చిన ఫైల్స్, తాము వేసిన ఆమోద ముద్ర వివరాలను ప్రకటించారు. ఇందులో ఉచిత బియ్యం పంపిణీకి రూ.1931 కోట్ల కేటాయింపునకు తగ్గ ఫైల్, ఠాకూర్ కళాశాల పేరు మార్పు, ఆరోగ్యశాఖలో వైద్యుల పోస్టుల భర్తీ, ఆయా సంస్థలకు ట్రస్టీల నియామకం, నామినేటెడ్ పోస్టులు వంటి అంశాలతో కూడిన ఫైల్స్ ఉన్నాయి. ఇక, మీద ప్రతి బుధ, శనివారాల్లో రాజ్ నివాస్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫైల్స్, వాటి స్థితి, ఆమోదం వరకు అన్ని వివరాలను తెలియజేస్తామని కిరణ్ పేర్కొనడం గమనార్హం. తాజాగా, తమను ఢీకొట్టే విధంగా కిరణ్ అడుగుల వేగాన్ని పెంచడం పాలకులకు మింగుడు పడడం లేదని చెప్పవచ్చు. -
బాత్రూమ్ లేని హీరోయిన్
‘నా సౌందర్య రహస్యం లక్స్’... అని నున్నటి జబ్బల మీద సబ్బును వయ్యారంగా రాసుకుంటూ స్టేట్మెంట్స్ ఇచ్చే హీరోయిన్లని కదా చూశాం. హీరోయిన్ అంటే డబ్బుంటుంది... లగ్జరీ ఉంటుంది... లంకంత బాత్రూములు ఉంటాయి... వాటిలో గండిపేట చెరువంత బాత్టబ్లుంటాయని మన ఎక్స్పెక్టేషన్. కాని అమలాపాల్ ఇంట్లో బాత్రూమే లేదట. మరి ‘ఠండే ఠండే పానీసే నహానా చాహియే’.. అని అమ్మడు ఎక్కడ జలకాలాడుతుందా అని అధికారులకు డౌటనుమానం వచ్చేసింది. అసలు సంగతి ఏమిటంటే అమలాపాల్ కొత్త కారు కొనుక్కుని పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ పెట్టుకుంది. అందుకోసమని ఒక లోకల్ అడ్రస్ కూడా పడేసింది. కాని అధికారులు చెక్ చేస్తే అదొక పిచ్చి ఇల్లు. దానికి బాత్రూమ్ కూడా లేదు. చెన్నైలోనో తిరువనంతపురంలోనో రిజిస్టర్ చేయించుకుంటే టాక్స్ బాగా పడుతుందని పాండిచ్చేరిలో నాలుగు డబ్బుల్స్ మిగులుతాయని అమలా ఆశా దోశా అప్పడం. కాని బండారం బయటపడటంతో ఆ అప్పడం కాస్త పచక్మంది. కొత్త టైరుకు గాలి తీసేసినట్టయ్యింది. సరైన నివాస పత్రాలు లేకుండా రిజిస్ట్రేషను జాన్తానై అని చెప్పడానికి అధికారులు టైలు, నడుం మీద బెల్టులు సరి చేసుకుంటూ బయల్దేరారు. అదీ సంగతి. -
కిరణ్ బేడీకి షాక్
పుదుచ్చేరి: పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి షాక్ తగిలినట్లయింది. ఆమె ప్రమాణస్వీకారం చేయించిన ముగ్గురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదని అసెంబ్లీ కార్యదర్శి తేల్చారు. కిరణ్ బేడి నిర్ణయాన్ని శాసనసభ కార్యదర్శి విన్సెంట్ రాయ్ తప్పుబట్టారు. కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో బేడీ పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయించిన విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారం అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించడానికి నిబంధనలు ఒప్పుకుంటాయని ట్వీటర్ ద్వారా బేడీ పేర్కొన్నారు. కాగా, బేడీ నిర్ణయాన్ని అప్పట్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు వ్యతిరేకించాయి. -
ఏమో... ఎవరికి తెలుసు?
పుదుచెర్రీ : మాజీ ఐపీఎస్ అధికారిణి, పుదుచెర్రీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ బాలుడికి అప్యాయ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా గవర్నర్ కుర్చీలోనే అతన్ని కూర్చోబెట్టారు. రాజ్ నివాస్(పుదుచ్చేరి రాజ్ భవన్)కు ప్రజల సందర్శనార్థం అనుమతి ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఓ కుటుంబం అక్కడికి రాగా.. అదే సమయంలో కిరణ్ బేడీ కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆ కుటుంబసభ్యులతో వెళ్లి ఆమెను కలిశారు. వారితో కాసేపు మాట్లాడిన బేడీ, బాలుడిని ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, తన కుర్చీలో కూర్చోమని స్వయంగా కిరణ్ బేడీయే ఆ బాలుడితో అన్నారు. దీంతో, ఆ బాలుడు ఆ కుర్చీలో కూర్చుని ఆనందపడ్డాడు. ఈ విషయాన్ని కిరణ్ బేడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సందర్శనార్థం వచ్చే చిన్నారులను కొంచెం సేపు లెఫ్టినెంట్ గవర్నర్ కుర్చీలో కూర్చోబెడతానని ఆమె ట్విట్టర్లో తెలిపారు. ‘‘ఏమో దీనిని స్ఫూర్తి పొంది.. ఏదో ఓ రోజున వాళ్లే ఈ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారేమో, ఎవరికి తెలుసు?’’అని ఆ ట్వీట్ లో స్ఫూర్తిదాయక ట్వీట్ ను బేడీ చేశారు. Our youngest visitor for today received a pleasant surprise when HLG @thekiranbedi asked him to sit in her chair! ☺ pic.twitter.com/7tjKE2YvMb — Lt. Gov. Puducherry (@LGov_Puducherry) October 28, 2017 -
గోడ దూకిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : ధైర్య సాహసాలకు మరోపేరైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మరో సాహసం చేశారు. గురువారం ఆమె కరైకల్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందుతున్న సదుపాయాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న ‘అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్‘ గదిని గమనించారు. ఆ గదికి చుట్టూ 4 అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేట్ పెట్టారు. అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ గదిని సందర్శించాలని కిరణ్ బేడీ ఆసుపత్రి అధికారులకు తెలిపారు. గేట్ చాలాకాలం పాటు మూసివుంచడంతో.. తాళం చెవులు ఎక్కడపెట్టారో అధికారులు మర్చిపోయారు. కొద్దిసేపు తాళం చెవుల కోసం ఎదురు చూసిన కిరణ్ బేడి.. చివరకు గోడను ఎక్కి అవతలకు దూకి షెడ్లోకి వెళ్లారు. దీంతో చేసేదీలేక.. కరైకల్ కలెక్టర్ ఆర్. కేశవన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీజే చంద్రన్, మరికొందరు అధికారులు కూడా గోడ దూకి షెడ్లోకి వెళ్లారు. -
గవర్నర్‌పై కేసు పెడతాం : సీఎం వార్నింగ్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తున్న కిరణ్ బేడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలిపారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ భేడి మధ్య వివాదం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ప్రైవేటు కళాశాలల్లో వైద్య సీట్ల భర్తీలో అవకతవకలు గవర్నర్-సీఎంల మధ్య వివాదానికి దారి తీశాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అర్థంలో గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. కాగా, శనివారం హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటుచేసిన సీఎం నారాయణస్వామి.. బేడీ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోన్న కిరణ్ బేడిపై పరువునష్టం దావా వేయనున్నట్టు ప్రకటించారు. ‘‘అధికారుల్ని, మంత్రుల్ని బెదిరిస్తూ, హెచ్చరికలతో ముందుకు సాగుతున్న కిరణ్ బేడీపై అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అసలు ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అర్హురాలేకాదు. కానీ కేంద్రం ఆమెను మాపై పడేసింది. ఇప్పుడు మాకు ఆమె శిరోభారంగా మారింది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా, అందుకు ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేరుస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు దారుణం, ఖండనీయం’’ అని సీఎం నారాయణస్వామి ఘాటుగా వ్యాఖ్యానించారు. -
పుదుచ్చేరిలో 770 ఎంబీబీఎస్ అడ్మిషన్లు రద్దు
పుదుచ్చేరి: పుదుచ్చేరిలోని పలు డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని 770 ఎంబీబీఎస్ అడ్మిషన్లను మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రీకృత కౌన్సిలింగ్ నిర్వహించకపోవడమే గాకుండా గడువు ముగిసిన అనంతరం గతేడాది ప్రవేశాల ప్రక్రియ నిర్వహించారని ఎంసీఐ పేర్కొంది. 2016–17 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన మొత్తం 770 మంది ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అడ్మిషన్లను రద్దు చేయాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య సేవల విభాగం డైరెక్టర్‌కు సెప్టెంబర్ 7న ఎంసీఐ లేఖ రాసింది. -
బ్లూవేల్ భూతం!
♦ పుదుచ్చేరిలో విద్యార్థి ఆత్మహత్య ♦ కోవై, నెల్లై ఆస్పత్రుల్లో మరో ఇద్దరు ♦ ఆండ్రాయిడ్ సెల్ఫోన్లతో అరచేతుల్లో ప్రాణాంతక క్రీడ ♦ బ్లూవేల్ ఉచ్చులో పదివేల మంది యువత ♦ తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త ‘బ్లూవేల్’. దేశ ప్రజలను తీవ్రంగా భయపెడుతున్న మూడుఆన్లైన్ క్రీడాక్షరాలు ఇవి. ‘నీవు చనిపో లేకుంటే మీకుటుంబంలోని వ్యక్తిని మేమే చంపేస్తాం’ అనే సందేశాలనుఅందుకున్న భయంతో బ్లూవేల్ ఛాలెంజ్ ఆన్లైన్ క్రీడ మోజులోఅశువులుబాస్తున్నారు. మదురైకి చెందిన విఘ్నేష్ అనే డిగ్రీ విద్యార్థి బ్లూవేల్ క్రీడలో బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మొత్తం రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందేపుదుచ్చేరిలో ఎంబీఏ విద్యార్థి శశి హంబాబోరీ గురువారం రాత్రిఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ అంటే ఏమిటి, తమిళనాడులో దాని ప్రభావం.. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: రష్యాలో పుట్టి ఐరోపా, అమెరికా ఖండాంతరాలను దాటి తమిళనాడులోకి ప్రవేశించి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మూడువేల మందిని పొట్టనపెట్టుకుంది బ్లూవేల్. ఆన్లైన్ గేముల అలవాటున్న యువత, విద్యార్థులు బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఊబిలోకి దిగుతున్నారు. బ్లూవేల్ క్రీడతో ఆత్మహత్యకు పురిగొల్పుతున్న నేరానికి రష్యాకు చెందిన 17 ఏళ్ల బాలికను ఆ దేశ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారంటే ఈ రాక్షస క్రీడలోని తీవ్రత తెలుసుకోవచ్చు. గేమ్‌లోని ప్రమాద తీవ్రత దృష్ట్యా భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉండే ఈ క్రీడలోకి యువత ఆదే ఉత్సాహంతో దిగుతున్నారు. ఈ వరుసలో మదురైకి చెందిన విఘ్నేష్ ఈ క్రీడకు బానిసగా మారి 19 ఏళ్లకే రెండు రోజుల క్రితం ప్రాణాలు వదిలాడు. 50 రోజుల పాటు కొనసాగే ఈ క్రీడలో రోజుకొక టాస్క్‌ను ఇస్తారు. ఈ బ్లూవేల్‌లో 50 టాస్క్‌లు ఉంటాయి. ఈ సమయంలో బ్లూవేల్ నిర్వాహకుల వైపు నుంచి ఏదో ఒక సందేశం వస్తుంది. అందులో చేతి మీద బ్లేడుతో మూడు సార్లు కోసుకొని ఆ ఫొటోను పంపాలని, అలాగే తెల్లవారుజామున మిద్దెపైకి వెళ్లి అక్కడి ఏదో ఒక భయంకరమైన సన్నివేశాన్ని ఫొటో తీసి పంపాలని, అర్ధరాత్రి వేళల్లో శ్మశానాలకు వెళ్లాలని, తాము చెప్పిన వారికి సంబంధించిన నాలుగు గోడల మధ్య రహస్య సన్నివేశాల ఫొటోలను పంపాలని, వంటి టాస్క్‌లు ఇస్తారు. ఈ క్రీడలో 30వ టాస్క్ సమయంలో సదరు వ్యక్తి ఆత్మహత్య దశకు చేరుకుంటాడు. ఇవన్నీ తాను ఎందుకు చేయాలని నిర్వాహకులను నిలదీయగానే వారి వికృత భావాలను భయటపెడతారు. క్రీడలోకి ఒక సారి వస్తే వెనుకకు వెళ్లడానికి వీలుకాని పరిస్థితులను కల్పిస్తారు. క్రీడాకారుని సెల్‌ఫోన్‌ను బ్లూవేల్ (అడ్మిన్) నిర్వాహకులు హ్యాక్ చేసి అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఇంత కాలంగా సెల్‌ఫోన్ ద్వారా చేసిన సంభాషణలు, చూసిన వెబ్సైట్లు, ఇతర గోప్యమైన వివరాలన్నీ నిర్వాహకులు తెలుసుకుని ఆ జాబితాను పంపుతారు. తాము చెప్పినట్టు చేయకుంటే ఈ విషయాలన్నీ బాహ్య ప్రపంచానికి చేరవేస్తామని భయపెడతారు. ఉదాహరణగా కొన్ని విషయాలను బయటపెడతారు. దీంతో భీతిల్లిన యువత తమ పరువు పోతుందనే ఆందోళనతో ఉరివేసుకోవడం తదితర ఆత్మహత్యలకు పాల్పడతారు. ఒంటరిగా, మానసిక న్యూనతకు లోనైన యువత ఎక్కువగా ఈ క్రీడ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇదేందో చూద్దాం అనే ఉత్సాహంతో బ్లూవేల్లోకి చొరబడి బయటకు రాలేకపోతున్నారు వీరిలో అత్యధిక శాతం ఉన్నత విద్యావంతులు కావడం విషాదకరం. పుదుచ్చేరి విద్యార్థి బలి ఇదిలా ఉండగా, అసోం రాష్ట్రం జామాజీ ప్రాంతానికి చెందిన రామ్‌కుమార్ బోరీ కుమారుడైన శశి హంబాబేరీ (21) పుదుచ్చేరి కాలాపట్టు యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వర్సిటీకే చెందిన హాస్టల్లోని ఒక పెద్ద హాలులో కొందరు విద్యార్థులతో కలిసి నాలుగు నెలలుగా ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి ఆన్లైన్ గేమ్‌లు ఆడడం అతనికి హాబీ. యథాప్రకారం గురువారం రాత్రి తన తోటి స్నేహితులను బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌కు పిలిచాడు. ప్రమాదకరమైన ఈ గేమ్ గురించి తెలిసిన ఇతర విద్యార్థులు అతనితో ఆడేందుకు నిరాకరించారు. దీంతో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో హాస్టల్ నుంచి వెళ్లిన శశి ఒంటరిగా కూర్చుని బ్లూవేల్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. మరికొంత సేపటికి హాస్టల్ గదికి వచ్చి తన సెల్‌ఫోన్‌ను పెట్టి వెళ్లిపోయాడు. శశి ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన విద్యార్థులకు హాస్టల్‌కు 50 మీటర్ల దూరంలోని మారుమూల ప్రాంతంలో వేప చెట్టుకు ఉరివేసుకుని శవంగా వేళాతుండగా గుర్తించారు. మృతుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా బ్లూవేల్ వల్లనే శశి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. పోస్టుమార్టం తరువాత పూర్తి వివరాలు తెలుపుతామని పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో పదివేల మంది బ్లూవేల్ బాధితులు– ఆస్పత్రుల్లో మరో ఇద్దరు విద్యార్థులు: గురు, శుక్రవారాల్లో చోటుచేసుకుంటున్న సంఘటనల ఆధారంగా విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు రాష్ట్రంలో పదివేల మంది విద్యార్థులు బ్లూవేల్ గేమ్‌కు బానిసలుగా మారినట్లు గుర్తించారు. బ్లూవేల్ గేమ్ మోజులో పడి ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థులను శుక్రవారం సకాలంలో గుర్తించి ఆస్పత్రుల్లో చేర్పించారు. తిరునెల్వేలి జిల్లా వెల్లియూర్లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి బ్లూవేల్ గేమ్‌లోకి దిగి ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో గుర్తించారు. అతని చేతిపై బ్లేడుతో గాట్లు, ఒంటి నిండా వాతలు పెట్టుకున్న గాయాలను గుర్తించి ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా ఎస్పీ అరుణ్శక్తి కుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అలాగే కోయంబత్తూరు జిల్లా కులియముత్తూరులోని ఒక ప్రయివేటు మెట్రిక్ స్కూల్ విద్యార్థి తన చేతిపై బ్లూవేల్ చిహ్నాన్ని చేతిపై బ్లేడుతో గీసుకుని ఉండడాన్ని గుర్తించిన పాఠాశాల యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనికి కౌన్సిల్ ఇచ్చి పంపివేయగా, ఆన్లైన్ ఆటలో కొనసాగాలని బ్లూవేల్ నిర్వాహకుల నుంచి సదరు విద్యార్థికి బెదిరింపులు వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ గేమ్‌లో ఏముందో అనే ఆసక్తితో దిగాం, ఆ తరువాత బైటకు రాలేకపోయామని బాధిత విద్యార్థులు పోలీసులకు వివరించారు. తన కుమారునితో 75 మంది విద్యార్థులు బ్లూవేల్ గేమ్ అడుతున్నట్లు తనకు తెలుసని మదురైలో గురువారం ఆత్మహత్యకు పాల్ప డిన విఘ్నేష్ తల్లి జయమణి మీడియాకు తెలిపారు. విద్యాసంస్థల్లో హెచ్చరికలు: బ్లూవేల్ క్రీడలోని ప్రమాదపు పోకడలను వివరిస్తూ, మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అనే సందేశంతో రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో బోర్డులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశింది. విద్యార్థుల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని అన్ని జిల్లాల ఎస్పీలను డీజీపీ టీకే రాజేంద్రన్ ఆదేశించారు. -
రాత్రివేళ స్కూటీపై మహిళా గవర్నర్!
పుదుచ్చేరి: రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో పరిశీలించటానికి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓ సాహసం చేశారు. శుక్రవారం రాత్రి సహాయకురాలితో కలిసి ఆమె స్కూటీపై కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తిరిగారు. తననెవరూ గుర్తుపట్టకుండా బేడీ శాలువా కప్పుకున్నారు. ‘పుదుచ్చేరిలో రాత్రిపూట మహిళలు సురక్షితమే..అయినప్పటికీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’ అని బేడీ ట్వీటర్లో తెలిపారు. ప్రజలకు సమస్యలేమైనా ఉంటే పీసీఆర్ లేదా 100కు ఫోన్ చేయాలని సూచించారు. కిరణ్‌బేడీ చర్యను పలువురు నెటిజన్లు ప్రశంసించారు. అయితే స్కూటీని నడుపుతున్న మహిళతో పాటు బేడీ కూడా హెల్మెట్ ధరించకపోవడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో రాత్రిపూట తాము నిస్సహాయంగా కనిపించడంతో పాటు ఆ సమయంలో స్కూటీ నడిపే సగటు మహిళ పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికే హెల్మెట్ ధరించలేదని బేడీ వివరణ ఇచ్చారు. -
రాత్రివేళ ఒంటరిగా బైక్‌పై మహిళా గవర్నర్ !
-
లోయలో పడిన యాత్రికుల బస్సు
- పలువురికి గాయాలు పుదుచ్చేరి : పుదుచ్చేరి సమీపంలోని నాగూర్ నాగపట్నం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో పలువురు యాత్రికులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు. బాధితులంతా నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుకు చెందినవారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పుదుచ్చేరి అధికారులతో మాట్లాడుతున్నారు. -
మళ్లీ చెక్
► కిరణ్‌బేడీ తంత్రం ► నారాయణలో ఆగ్రహం ► హిట్లర్ గవర్నర్ సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో సాగుతున్న ఆధిపత్య చదరంగంలో ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మళ్లీ చెక్ పెట్టారు. వివిధ సంక్షేమ బోర్డుల నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్యే నియామకాలకు మోకాలొడ్డారు. అర్హతల మేరకే పదవులు అని ఫైల్‌ను ప్రభుత్వానికి వెనక్కు తిప్పి పంపడం వివాదానికి దారి తీసింది.దీంతో గవర్నర్‌ను హిట్లర్‌గా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ వర్గాలు పోస్టర్లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ మారిన విషయం తెలిసిందే. నిత్యం పాలకులు, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య ఏదో ఒక వివాదం సాగుతోంది. నియమ నిబంధనల్ని పాటించడంలో కిరణ్ సాగిస్తున్న దూకుడు పాలకుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. సీఎంగా నారాయణస్వామి అధికా ర పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నామినేటెడ్ ఎమ్మెల్యే నియమకం వరకు వివాదాలే. ఈ రాజకీయ ఆధిపత్య చదరంగంలో పలు సందర్భాల్లో నారాయణ సర్కారుకు కి రణ్ చెక్ పెడుతూనే ఉన్నారు. తాజాగా మరోచెక్ పెట్ట డం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. సంతకం నిరాకరణ: పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు 15 మంది, మిత్ర పక్షం డీఎంకేకు ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు. వీరిలో సీఎంతో పాటు ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఒకరు, డిప్యూటీగా మరొకరు, విప్, సీఎం ఢిల్లీ ప్రతినిధిగా ఒక్కొక్కరు చొప్పున మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు అదనపు పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు, డీఎంకే ఎమ్మెల్యేలు ఇద్దరికి ఎలాంటి అదనపు పదవులు లేవు. వీరికి గృహ నిర్మాణ, విద్యుత్ బోర్డులతో పాటుగా పలు సంక్షేమ బోర్డుల్లో అధ్యక్ష పదవుల్ని నామినేటెడ్‌గా అప్పగించేందుకు సీఎం నారాయణస్వామి నిర్ణయించారు. ఈ నామినేటెడ్ ప్రక్రియ అనాధిగా వస్తున్న దృష్ట్యా, మంత్రి వర్గంలో చర్చించి ఆమోద ముద్రేశారు. మంత్రి వర్గం ఆమోదంతో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఫైల్‌ను చూసిన కిరణ్ సంతకం పెట్టేందుకు నిరాకరించి ఉండడం గమనార్హం. ఆయా పదువులకు ఎంపిక కానున్న వారి అర్హతలను పరిశీలించి, ఆ పదవులకు వారు న్యాయం చేకూర్చగలరా, అస్సలు వారు అర్హులేనా అన్నది తేల్చుకున్నానంతరం తదుపరి అడుగులు వేయడానికి కిరణ్ నిర్ణయించి, అందుకు తగ్గ ఆదేశాలను తన అధికారులకు ఇచ్చి ఉన్నారు. తమ ఫైల్ వెనక్కు రావడంతో నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం వర్గాలు అగ్గి మీద బుగ్గిలా రాజ్‌భవన్ వర్గాల మీద మండి పడుతున్నారు. దీంతో ఈ వివాదం మరి కొంత కాలంగా వేడెక్కే రీతిలో రాజుకోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో గురువారం కిరణ్‌బేడీని హిట్లర్‌గా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ వర్గాలు పోస్టర్లు ఏర్పాటు చేయడం గమనించాల్సిన విషయం. -
మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
చెన్నై: పుదుచ్చేరిలోని ఓ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి కొత్త బస్టాండ్ సమీపంలోని మరైమలైయడిగల్ రోడ్డులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మసాజ్ సెంటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఓ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను మఫ్టీలో మసాజ్ చేయించుకునేందకు సెంటర్‌కు పంపారు. వీరు మసాజ్ సెంటర్‌కు వెళ్లగానే తలా మూడు వేల రూపాయిలు తీసుకుని ఆరుగురు మహిళలను అక్కడ నిలబెట్టారు. పోలీసులు ఎంపిక చేసుకున్న ఇద్దరు మహిళలు అసభ్యంగా ప్రవర్తించసాగారు. వెంటనే బయట ఉన్న అధికారులకు ఎస్ఎంఎస్ పంపగా వారు మసాజ్ సెంటర్లోని ఆరుగురు మహిళలను రక్షించారు. వారిలో పుదుచ్చేరి సామిపిల్లై తోటకు చెందిన శశి(32), తమిళ్‌సెల్వి(31), దిండివనంకు చెందిన కార్తిక్(23), లాస్పేట్‌కు చెందిన గురుసామి(33)గా తెలిసింది. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు ముత్యాలపేటకు చెందిన రాధిక అలియాస్ ఆరోగ్యమేరి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన నలుగురిని శుక్రవారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి కాలాపట్టు జైలులో ఉంచారు. -
రెండునెలల్లో కమల పీఠం
♦ పుదుచ్చేరిపై అమిత్‌షా వ్యూహం ♦ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు యత్నం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. మరో రెండు నెలల్లో కమలనాధుడు అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని ఢిల్లీ వర్గాల సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: పుదుచ్చేరి రాజకీయం రసకందాయంగా మారింది. అధికారం కోసం బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తగిన రీతిలో ఢీకొనేందుకు మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్‌బేడీని కేంద్రం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమించింది. కేంద్రం ఏ ఉద్దేశ్యంతో పంపిందో దానిని ఆమె అక్షరాల అమలుచేస్తున్నారు.గవర్నర్, సీఎంల నేతృత్వంలో పుదుచ్చేరిలో రెండు తరహా పాలనలు సాగుతున్నాయి.బొటాబొటి బలంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను బలహీనం చేయడం ద్వారా అధికారం చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా తన రాజకీయ చతురతను పణంగా పెట్టారు. 30 మంది ఎమ్మెల్యేలు కలిగిన పుదుచ్చేరిలో కాంగ్రెస్ తన 15 మంది ఎమ్మెల్యేలతో ఇద్దరు డీఎంకే, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యేని కలుపుకుని అధికారంలోకి వచ్చింది.8మంది ఎన్ఆర్ కాంగ్రెస్, నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన ఉన్నారు. ఇటీవల ముగ్గురిని ఎమ్మెల్యేలుగా బీజేపీ నామినేట్ చేసింది. దీంతో ప్రతిపక్ష బలం 15కు చేరుకుంది. ఎమ్మెల్యేలుగా ఉన్నవారు మరే ప్రభుత్వ పదవిలోనూ ఉండకూడదనే నిబంధనను కారణంగా చూపి ఢిల్లీలోని 21 మంది ఆమ్ఆద్మీ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే నిబంధనను పుదుచ్చేరిలో కూడా అమలుచేసి 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయాలనేది అమిత్‌షా వ్యూహంగా ఉంది.పనిలోపనిగా కాంగ్రెస్‌లోని కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలపై ఆకర్‡్ష మంత్రం ప్రయోగించాలని, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రంగస్వామిని బీజేపీలోకి చేర్చుకోవడం ఎత్తుగడగా ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా ఉండిన బీమాఖండ్ తన మద్దతుదారులతో బీజేపీలో చేరిపోయి సీఎంగా కొనసాగుతున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, స్వాతంత్య్ర దినోత్సవం ముగియగానే పుదుచ్చేరిలో సైతం ఇదే ప్రయోగాన్ని అమలు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఢిల్లీలో ప్రత్యర్థుల మకాం పుదుచ్చేరిలోని కాంగ్రెస్, డీఎంకే కూటమి ప్రభుత్వాన్ని కబళించేందుకే నామినేషన్ పద్ధతిలో ముగ్గురిని ఎమ్మెల్యేలుగా నియమించిందని బీజేపీపై విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలను ఏకపక్ష ధోరణిలో ఎంపిక చేశారని కాంగ్రెస్ తప్పుపట్టగా, వారిచేత పదవీ ప్రమాణం చేయించేందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో గవర్నర్ కిరణ్‌బేడీ ఆ ముగ్గురిని రాజ్‌భవన్‌కు రప్పించుకుని మమ అనిపించారు. గవర్నర్ చేయించిన ప్రమాణం చెల్లదని ఆక్షేపించిన స్పీకర్ వారిని అసెంబ్లీలోకి అనుమతించబోమని స్పష్టంచేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇరుపక్షాలకూ ప్రతిష్టాత్మకంగా మారడంతో గవర్నర్ కిరణ్‌బేడీ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి, హోంమంత్రి, కేంద్ర హోంశాఖను కిరణ్‌బేడీ కలవనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న స్పీకర్ వైద్యలింగం సైతం నామినేటెడ్ ఎమ్మెల్యేల వివాదంపై తాడోపేడో తేల్చుకునేందుకు సోమవారం రాత్రి ఢిల్లీ విమానం ఎక్కేశారు. పుదుచ్చేరి రాజకీయాల్లోని ఇద్దరు ప్రత్యర్థులు ఢిల్లీ ఒకేసారి మకాం వేయడం రాష్ట్రంలో రసవత్తరమైన చర్చకు దారితీసింది. -
గవర్నర్ల పాలి‘ట్రిక్స్’
విపక్షాల ఏలుబడిలో ఉండే రాష్ట్రాల్లో గవర్నర్‌కూ, ముఖ్యమంత్రికీ మధ్య విభేదాలు రావడం, వారు ఘర్షణ పడటం చాలా పాత వార్త. అందువల్లే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ మధ్య... పుదుచ్చేరిలో సీఎం వి. నారాయణస్వామి, గవర్నర్ కిరణ్ బేడీల మధ్య ఏర్పడిన విభేదాల గురించి ఎవరూ ఆశ్చర్యపోవడం లేదు. కాకపోతే మన గవర్నర్ల వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా అన్న నిరాశ మాత్రం అందరి లోనూ ఏర్పడుతోంది. ఇటీవలకాలంలో గోవా గవర్నర్ మృదులా సిన్హా, మణి పూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, త్రిపుర గవర్నర్ తథాగత్ రాయ్‌లు... ఇంతక్రితం ఢిల్లీ గవర్నర్‌గా పనిచేసిన నవాబ్ జంగ్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా చేసిన రాజ్‌ఖోవా ఈ మాదిరే వివాదాస్పదులుగా ముద్రపడ్డారు. నిజానికి రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న రాజ్‌నాథ్ కోవింద్ వివిధ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నది ఇలాంటి వ్యవహారశైలికి దూరంగా ఉండటం వల్లనే. బిహార్ గవర్నర్‌గా నియమితులైనప్పుడూ, రాష్ట్రపతి పదవికి ఎంపికైననాడూ తప్ప మధ్యలో ఎప్పుడూ ఆయన వార్తల్లో లేరు. ఏనాడూ బిహార్ సీఎం, జేడీ(యూ) నేత నితీష్‌కుమార్‌తో ఘర్షణపడింది లేదు. చిత్రమేమంటే కోవింద్లాగే కేసరినాథ్ త్రిపాఠీ, కిరణ్‌బేడీ తదితరులను గవర్నర్లుగా ఎంపిక చేసింది కూడా బీజేపీయే. ఇప్పుడు పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ గవర్నర్లు తప్పుకోవాలి లేదా రాష్ట్రపతి వారిద్దరినీ తొలగించాలి అంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వీరిద్దరూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ఆదేశానుసారం నడుచుకుంటూ రాజ్యాంగ విధులను అతిక్రమిస్తున్నారన్నది ఆ పార్టీ ఆరోపణ. నిజానికి గవర్నర్ల వ్యవస్థను ఈ స్థాయిలో భ్రష్టుపట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండటం వల్ల అందరికన్నా ఎక్కువగా ఆ వ్యవస్థను ధ్వంసం చేయడం కాంగ్రెస్‌కే సాధ్యపడింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఎన్నో మార్గదర్శకాలివ్వడం వల్ల రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను చీటికీ మాటికీ కూల దోయడం సాధ్యపడటం లేదు గానీ... ఆ ప్రభుత్వాలను ఎలా తిప్పలు పెట్టాలన్న విషయంలో ప్రయత్నలోపం ఉండటం లేదు. అలా జరిగే ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించాల్సింది గవర్నర్లే. అందువల్లే ఆ వ్యవస్థ వివాదాస్పదమైనంతగా మరేదీ కాలేదు. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి రాజ్భవన్లు బ్రాంచి ఆఫీసులుగా మారుతున్నాయని, వారు కేంద్రం ఏజెంట్లుగా పనిచేస్తున్నారని తరచు ఆరోపణలొచ్చేది అందువల్లే. సీఎంగా ఉన్నప్పుడు తాను రుచి చూసిన చేదు అనుభవాల కారణంగా స్వర్గీయ ఎన్టీ రామారావు అసలు గవర్నర్ల వ్యవస్థే నిరర్ధకమని అనేవారు. దాన్ని రద్దు చేయాలనేవారు. పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో ఏర్పడ్డ మత ఉద్రిక్తతల విష యంలో గవర్నర్ త్రిపాఠీ ఫోన్ చేసి తనను అవమానించారని, బెదిరించారని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇదంతా అబద్ధమని కొట్టిపారేస్తూ శాంతి భద్రతలను కాపాడలేని ప్రభుత్వ అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఆరోపి స్తున్నారని త్రిపాఠీ జవాబిచ్చారు. అక్కడేర్పడిన ఉద్రిక్తతలను చల్లార్చడంలో ప్రభుత్వం విఫలం కావడం సంగతలా ఉంచి, గుజరాత్లో ఎప్పుడో జరిగిన విధ్వంసకాండ ఫొటోలను, ఒక చలనచిత్రంలోని సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి అవి ఉద్రిక్తతలున్న ప్రాంతంలో జరిగినట్టుగా చిత్రీకరించి బీజేపీ చేసిన పొరపాటు గవర్నర్ దృష్టికి వచ్చినట్టు లేదు. ఒకపక్క డార్జిలింగ్ గూర్ఖా ఉద్యమంతో... 24 పరగణాల జిల్లా మత ఉద్రిక్తతలతో అట్టుడుకుతుంటే బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు వాగ్యుద్ధానికి దిగడంఎలాంటి సంకేతాలు పంపుతుంది? పుదుచ్చేరిలో కిరణ్‌బేడీ వ్యవహారశైలి కూడా ఇలాగే ఉంది. ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల ఎంపికలో నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి నారాయణస్వామిని సంప్రదించాల్సి ఉండగా తానే సొంతంగా నిర్ణయం తీసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయడం, అక్కడినుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే వారితో రాత్రికి రాత్రి తానే ప్రమాణస్వీకారం చేయించడం విమర్శలకు తావిచ్చింది. గవర్నర్‌గా తాను చేయాల్సిందేమిటో చేయకపోవడం, స్పీకర్ చేయా ల్సిన పనిని తన నెత్తినేసుకోవడం రాజ్యాంగ మర్యాదలను అతిక్రమించడమే అవుతుందని ఆమెకు తెలియదనుకోలేం. పీజీ మెడికల్ అడ్మిషన్ల వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలని పదిరోజులక్రితం కేంద్రానికి లేఖ రాయడంపై వచ్చిన దుమారం చల్లారకముందే ఆమె కొత్త వివాదాన్ని రేపారు. ఆమధ్య ఢిల్లీ మున్సి పల్ ఎన్నికల సమయంలోనూ బీజేపీకి ఓటేయమని పరోక్షంగా కోరుతూ ఆమె చేసిన ట్వీట్లు సంచలనం కలిగించాయి. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ గవర్నర్ల నియా మకాలపై కొన్ని సూచనలు చేసింది. ఆ పదవికి ఎంపికయ్యేవారు రాజకీయాలకు సంబంధంలేనివారు అయి ఉండాలని చెప్పింది. ఆ పదవుల్ని రాజకీయ పున రావాసంగా మార్చవద్దని సూచించింది. త్రిపాఠీ సంగతలా ఉంచి కిరణ్‌బేడీ తీరు గమనిస్తే ఆ కమిషన్ తన వైఖరిని మార్చుకోకతప్పదు. కిరణ్‌బేడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థి కావొచ్చుగానీ ఆ పార్టీ పూర్తికాలం నాయకురాలిగా ఎప్పుడూ లేరు. పైగా ఆమెకు ఐపీఎస్ అధికారిగా అపారమైన పాలనానుభవం ఉంది. అందుకు భిన్నంగా కోవింద్ బీజేపీ ఎంపీగా రెండు దఫాలు పనిచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. కానీ వివాదాస్పద గవర్నర్ అనిపించుకోలేదు. గవర్నర్లుగా పనిచేస్తున్నవారు అత్యు త్సాహం ప్రదర్శిస్తే, అతిగా వ్యవహరిస్తే అది ఆ వ్యవస్థకు మచ్చ తీసుకురావడం మాత్రమే కాదు...వారిని ఎంపిక చేసిన తమపై కూడా నింద పడుతుందని ఎన్డీఏ పెద్దలు గ్రహించాలి. కాంగ్రెస్ చరిత్ర చూపి స్వీయ సమర్ధనకు దిగి ప్రయోజనం లేదు. -
కిరణ్‌బేడీపై కాంగ్రెస్ ఫైర్
⇒ గవర్నర్‌ను రీకాల్ చేయాలని బంద్ పాటించిన డీఎంకే ⇒ బీజేపీ నామినేటెడ్ ఎమ్మెల్యేపై సీఎం ఆగ్రహం ఉప్పు నిప్పుగా సాగుతున్న సీఎం నారాయణస్వామి, గవర్నర్ కిరణ్‌బేడీల సమష్టిపాలన మరో అంకానికి చేరుకుంది. కయ్యానికి కాలు దువ్వుతున్న కిరణ్‌బేడీని రీకాల్ చేయాలనే డిమాండ్‌పై శనివారం బంద్ పాటించడం ద్వారా మిత్రపక్ష డీఎంకే తన స్నేహధర్మాన్ని చాటుకుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై : పుదుచ్చేరిలో అధికార పార్టీతో సంబంధం లేకుండా కేంద్రం ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను నియమించడంపై కాంగ్రెస్, మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోంది. అసెంబ్లీలో ముగ్గురు నామినేటెడ్ సభ్యుల స్థానాలను ప్రభుత్వ సిఫార్సు మేరకు భర్తీ చేయాల్సి ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎమ్మెల్యేలుగా నామినేట్ చేసింది. ఆ నియామకాలను ఖరారు చేస్తూ గవర్నర్ కిరణ్‌బేడీ ముగ్గురి చేత ప్రమాణస్వీకారం చేయించారు. 30 మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో 15 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ మిత్రపక్ష డీఎంకే (2) సభ్యుల మద్దతులో అధికారం చేపట్టింది. ఎన్డీఏ పక్షం ఉన్న ఎన్ఆర్ కాంగ్రెస్ (8), అన్నాడీఎంకే (4), ఒక స్వతంత్య్ర అభ్యర్థితో నామినేటెడ్ ఎమ్మెల్యేలను కలిపి మరో ఇద్దరిపై ఆకర్‡్ష మంత్రం ప్రయోగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన సీఎం నారాయణస్వామి మరోసారి గవర్నర్‌పై నిరసన పంజా విసిరారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ తీరుకు నిరసనగా బంద్ అధికారంలో ఉండి బంద్ నిర్వహిస్తే ఆక్షేపణకు గురికాక తప్పదని భావించిన సీఎం నారాయణ స్వామి మిత్రపక్ష డీఎంకే సాయం కోరారు. పుదుచ్చేరి ఎన్నికల్లో మద్దతుపలికిన సీపీఐ, సీపీఎం, విసీకే తదితర పార్టీలతో కలిసి శనివారం ఉదయాన్నే రోడ్లపైకి చేరి బంద్ పాటించాయి. దీంతో పుదుచ్చేరి నుంచి బయలుదేరాల్సిన 500 బస్సులు బస్‌స్టేషన్‌కే పరిమితమయ్యాయి. పుదుచ్చేరిలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. తమిళనాడు నుంచి పుదుచ్చేరికి బయలుదేరిన బస్సులు సరిహద్దు ప్రాంతాలైన కోట్టకుప్పం, కోరిమేడు ప్రాంతల్లో ప్రయాణికులను దింపివేశాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. గవర్నర్‌ను రీకాల్ చేయాలని కోరుతూ పుదుచ్చేరిలోని అనేక కూడళ్లలో రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించి నినాదాలు చేశారు. బంద్‌ను లెక్కచేయకుండా చెన్నై నుంచి పుదుచ్చేరి మీదుగా కడలూరు వెళుతున్న ప్రభుత్వ బస్సు ముందువైపు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. -
సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్!
పుదుచ్చేరి: పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మధ్య మళ్లీ ఘర్షణ తారాస్థాయికి చేరింది. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మంగళవారం కేంద్రం నామినేట్ చేసిన ముగ్గురు వ్యక్తులతో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించారు. బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వీ స్వామినాథన్, పార్టీ కోశాధికారి కేజీ శంకర్, విద్యావేత్త ఎస్ సెల్వ గణపతిలతో ఆమె హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. దీనిపై నారాయణస్వామి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నది. మరోవైపు ఈ నియామకాలపై స్టే విధించాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నర్ ఎలా ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారని, ఇది సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకమని సీఎం వీ నారాయణస్వామి అంటుండగా.. ఆయన ఆరోపణలను కిరణ్ బేడీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నట్టు ఆమె తెలిపారు. ‘కేబినెట్ మంత్రులు నా దగ్గరకు వచ్చి.. మీరు ఎందుకు ప్రజలను కలుస్తున్నారు? వారి సమస్యలను ఎందుకు పరిష్కరిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. మీరు రబ్బర్‌స్టాంప్‌లా ఉండాలని మంత్రులు అంటున్నారు’ అని కిరణ్ బేడీ అన్నారు. -
హైదరాబాద్ యువతిపై కీచకపర్వం
చెన్నై: హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని ఆటోడ్రైవర్ అటకాయించి, అసభ్యంగా ప్రవర్తించిన తీరు స్థానికంగా కలకలం రేపింది. పుదుచ్చేరిలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలోని ఓ ఎలక్ట్రానిక్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురూ విహాయాత్ర కోసమని పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకుని, పలు ప్రాంతాలను తిలకించారు. ఆదివారం రాత్రి వారు అన్నాసాలై ప్రాంతంలో నిలబడి మాట్లాడుకుంటుండగా.. ఆ పక్కగా నిలబడి ఉన్న ఆటో డ్రైవర్ హఠాత్తుగా ఓ యువతిని అటకాయించి, కౌగిలించుకుని ముద్దుపెట్టాడు. కీచకుడి చర్యతో నిర్ఘాంతపోయిన యువతులు కేకలు వేశారు. ఈలోపు ఆ యువకుడు ఆటోలో తప్పించుకుని పారిపోయాడు. ఆటో నంబర్‌ను నోట్ చేసుకున్న యువతులు సరాసరి ఒదియంజాలై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆటో నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం పుదుచ్చేరిలోని చిన్నయాపురం అక్కాస్వామి కోవిల్ వీధికి చెందిన స్టాలిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మద్యం మత్తులోనే తానా పని చేసినట్లు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు స్టాలిన్‌ను అరెస్టు చేసి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. -
కిరణ్‌కు అభయం
►కేంద్రం అధికారాలు సీఎంకు హోం శాఖ వివరణ ►ఇక, సంకటంలో నారాయణ సర్కారు చెన్నై : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి కేంద్రం అభయం ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి సర్కారును సంకటంలోకి నెట్టే రీతిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సీఎం నారాయణ స్వామి ఇచ్చిన ఫిర్యాదుకు కేంద్ర హోం శాఖ ఇచ్చిన వివరణ మున్ముందు పుదుచ్చేరిలో ఎలాంటి వివాదాలకు ఆజ్యం పోస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందుకు అస్త్రంగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికి పైగా అవుతున్నా, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సీఎం నారాయణ స్వామి మధ్య నిత్యం సమరమే. వీరిద్దరి మధ్య చాప కింద నీరులా సాగుతున్న వివాదం చివరకు ముదిరి పాకాన పడింది. ప్రభుత్వానికి అండగా అన్నాడీఎంకే, డీఎంకే అండగా నిలవడంతో కిరణ్‌ను రీకాల్ చేయడానికి తగ్గ ప్రయత్నాలు సాగాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం, తమకు కల్పించిన హక్కులను కాలరాసే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపణలతో కిరణ్‌ను బర్తరఫ్ చేయాలని లేదా, వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదులు చేరాయి. అయితే, ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన కేంద్ర హోం శాఖ కిరణ్‌కు మరింత అభయాన్ని ఇస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలను వివరిస్తూ సీఎం నారాయణ స్వామికి సవవిరంగా లేఖాస్త్రాన్ని సంధించడం గమనార్హం. నారాయణ ప్రభుత్వానికి సంకట పరిస్థితులు రాష్ట్రాల గవర్నర్ల కన్నా, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ అందులో వివరించారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి వర్గంతో సంబంధం లేకుండా, ముందుకు సాగే అవకాశం ఉందని, అవసరం అయితే, అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సైతం వీలుందని వివరించడం గమనార్హం. అలాగే, మంత్రివర్గం నుంచి వచ్చే ఫైల్స్‌లో ఏదేని అనుమానాలు ఉన్నా, అధికారుల్ని పిలిపించి సమీక్షించడం, అవసరం అయితే, సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు సైతం అధికారం ఉన్నట్టు అందులో పేర్కొనడం బట్టి చూస్తే, మున్ముందు నారాయణ సర్కారుకు కిరణ్రూపంలో మరిన్ని సంకట పరిస్థితులు తప్పవని స్పష్టం అవుతోంది. అలాగే విభేదాలు తలెత్తినా, అభిప్రాయభేదాలు ఎదురైనా, సమస్యలు తాండవించినా.. కీలక నిర్ణయం తీసుకునేందుకు తగ్గ సిఫార్సును రాష్ట్రపతికి చేసే అధికారం కూడా లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్నట్టు అందులో హెచ్చరించి ఉండడం గమనార్హం. అయితే, వీటన్నింటి గురించి పట్టించుకోకుండా, పుదుచ్చేరి ప్రగతి తనకు లక్ష్యం అని నారాయణ ముందుకు సాగుతున్నారు. ఆగస్టులో పుదుచ్చేరి హార్బర్ నుంచి సరకుల రవాణా విస్తృతం, సెప్టెంబరులో పుదుచ్చేరి విమానాశ్రయం నుంచి విమాన సేవలు సాగేందుకు తగ్గ ఏర్పాట్లలో మునిగారు.