
ఈ ఫోటోలో చెట్టెక్కి కూచున్న వ్యక్తి పేరు ముత్తువేల్. పుదుచ్చేరి వాసి. కరోనా టీకా తీసుకోవడానికి నిరాకరిస్తూ ఇలా చెట్టెక్కి కూర్చున్నాడు. పుదుచ్చేరిలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అందరికీ టీకాలు వేస్తున్నారు. వారిని చూడగానే ముత్తువేల్ ఇదిగో ఇలా చెట్టేక్కాశాడు. ఇదివరకు కూడా అతనిలాగే టీకా తీసుకోకుండా తప్పించుకున్నాడని అధికారులు తర్వాత గుర్తించారు.
చదవండి: రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్‌కి అధికం
సూది మందు అంటే భయం కాబట్టి ఇలా చేశాడనుకుంటున్నారేమో! అసలు విషయం అది కాదు... కరోనా టీకా తీసుకుంటే కొద్దిరోజులు మద్యం జోలికి వెళ్లొద్దని ముత్తువేల్‌కు చెప్పారు. వామ్మో... చుక్క పడకపోతే ఎలా... అని టీకా వద్దంటే వద్దంటున్నాడు. అరోగ్య కార్యకర్తలు ఎంత బతిమిలాడినా కిందకు దిగలేదు. వారు వెళ్లిపోయిన తర్వాతే దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment