Climbs Tree
-
వామ్మో.. చుక్క పడకపోతే ఎలా... కరోనా టీకా వద్దంటే వద్దు..
ఈ ఫోటోలో చెట్టెక్కి కూచున్న వ్యక్తి పేరు ముత్తువేల్. పుదుచ్చేరి వాసి. కరోనా టీకా తీసుకోవడానికి నిరాకరిస్తూ ఇలా చెట్టెక్కి కూర్చున్నాడు. పుదుచ్చేరిలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి అందరికీ టీకాలు వేస్తున్నారు. వారిని చూడగానే ముత్తువేల్ ఇదిగో ఇలా చెట్టేక్కాశాడు. ఇదివరకు కూడా అతనిలాగే టీకా తీసుకోకుండా తప్పించుకున్నాడని అధికారులు తర్వాత గుర్తించారు. చదవండి: రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్‌కి అధికం సూది మందు అంటే భయం కాబట్టి ఇలా చేశాడనుకుంటున్నారేమో! అసలు విషయం అది కాదు... కరోనా టీకా తీసుకుంటే కొద్దిరోజులు మద్యం జోలికి వెళ్లొద్దని ముత్తువేల్‌కు చెప్పారు. వామ్మో... చుక్క పడకపోతే ఎలా... అని టీకా వద్దంటే వద్దంటున్నాడు. అరోగ్య కార్యకర్తలు ఎంత బతిమిలాడినా కిందకు దిగలేదు. వారు వెళ్లిపోయిన తర్వాతే దిగాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
చెట్టెక్కింది..పక్షి పిల్లలను మింగేసింది
సాక్షి, మద్నూర్(నిజామాబాద్) : మద్నూర్ మండల కేంద్రంలో ఓ పాము చెట్టెక్కి హంగామా చేసింది.. చెట్టుపై ఉన్న గూట్లోకి వెళ్లి పక్షి పిల్లలను తినేసింది. శనివారం మధ్యాహ్నం మండల కేంద్రంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన మెల్లగా చెట్టు ఎక్కిన పాము పక్షి గూడు వద్దకు చేరుకుని తాపీగా పక్షి పిల్లలను మింగేసింది. అనంతరం మెల్లగా చెట్టు దిగి వెళ్లిపోయింది. దీంతో రోడ్డు పక్కనే చెట్టు ఉండడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు అక్కడే నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది. -
జంతర్ వద్ద చెట్టెక్కి మహిళ హల్చల్
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఓ 50 ఏళ్ల మహిళ హల్ చల్ చేసింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ అక్కడ చెట్టు ఎక్కి కూర్చుంది. తన కుమారుడిని చంపిన హంతకులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. బిహార్‌కు చెందిన బచ్చా దేవీ (50) అనే మహిళ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంటోంది. 2015 అక్టోబర్ లో బిహార్ లో తన కుమారుడిని కొందరు వ్యక్తులు హత్య చేశారని, ఆ నేరస్తులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని గుర్తుచేస్తూ వారిపై చర్యలు డిమాండ్ తో ఆమె ఓ చెట్టు ఎక్కింది. ఢిల్లీకి వచ్చి నాయకులను కలవడం ద్వారా తనకు న్యాయం జరుగుతుందని భావించినట్లు తెలిపింది. తొలుత చుట్టుపక్కల వారు ఎంత బ్రతిమాలినా చెట్టుదిగని ఆమె అనంతరం పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత కిందికొచ్చింది.