
సాక్షి, మద్నూర్(నిజామాబాద్) : మద్నూర్ మండల కేంద్రంలో ఓ పాము చెట్టెక్కి హంగామా చేసింది.. చెట్టుపై ఉన్న గూట్లోకి వెళ్లి పక్షి పిల్లలను తినేసింది. శనివారం మధ్యాహ్నం మండల కేంద్రంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన మెల్లగా చెట్టు ఎక్కిన పాము పక్షి గూడు వద్దకు చేరుకుని తాపీగా పక్షి పిల్లలను మింగేసింది. అనంతరం మెల్లగా చెట్టు దిగి వెళ్లిపోయింది. దీంతో రోడ్డు పక్కనే చెట్టు ఉండడంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రయాణికులు అక్కడే నిలిచిపోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది.
Comments
Please login to add a commentAdd a comment