
బయటకు తీసిన పాము పిల్లలు
సాక్షి, వనపర్తి: వనపర్తి శివారు నాగవరం వద్ద ఉన్న రామన్‌పాడు మెయిన్ వాల్వ్‌కు లీకేజీ ఏర్పడింది. బుధవారం మరమ్మతు చేసేందుకు సిబ్బంది అందులోకి దిగారు. అందులో కుప్పలుగా పాములు, పిల్లలు కనిపించడంతో ఒక్కసారిగా బయటకు వచ్చారు. వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకొని మెయిన్ వాల్వ్‌లో ఉన్న 3 పెద్దపాములు, 50 దాకా పాము పిల్లలను బయటకు తీసి సురక్షితంగా అడవిలో వదిలేశారు. పట్టుకున్న పాములు నీరుకట్ట అని కృష్ణసాగర్ తెలిపారు.
చదవండి: నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై..