snake
-
అక్కడ స్నాక్‌గా స్నేక్‌లు..!
మాములుగా మన దేశంలో చిరుతిండిగా వీధి స్టాల్స్‌లో సమోసాలు, బజ్జీలు, పకోడిలు నోరూరించేలా కనువిందు చేస్తుంటాయి. కానీ ఈ దేశంలో స్నాక్‌గా ఏం ఉంటాయో తెలిస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. మనిషికి అత్యంత హానికరమైన దాంతోనే వంటకం, అదే అక్కడ ఫేమస్ కూడా. ఇంతకీ ఏంటా రెసిపీ అంటే..ఫుడ్ వ్లాగర్లు(Food vloggers) ఇతర దేశాల్లో ఉండే వైవిధ్యభరితమైన వంటకాల విశేషాల గురించి చెప్పడమే గాక ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. అలానే ఒక భారతీయ వ్లాగర్ తన ఇండోనేషియా(Indonesia) పర్యటనలో వీధి దుకాణల్లో అమ్మే ఫేమస్ వంటకాన్ని గురించి తెలసుకుని కంగుతిన్నాడు. చిరుతిండిగా క్రోబ్రా(cobra)తో చేసిని వంటకాన్నే తింటారట. ఆ వంటకం అంటే అక్కడ పడిచస్తారట. అందుకు తగ్గట్టుగానే వరుస దుకాణాల్లో బోనుల్లో అప్పటికప్పుడు తాజాపాముతో ఈ వంటకాన్ని రెడీ చేయడం తదితరాలను చూసి నోటి మాట రాలేందుంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఆ వంటకం కోసం క్యూలో నిలబడటం చూసి మతిపోయిందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు ఫుడ్ వ్లాగర్. అంతేకాదండోయ్ ఇండోనేషియ వాసులు కోబ్రాతో చేసిన వంటక తినడం వల్ల చర్మఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తినికి మంచిదని బలంగా నమ్ముతారట. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక దాదాపు 4 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ పప్పు, బియ్యంతో వంటలు ఎలా వండాలో నేర్పిస్తానని ఒకరూ, మనిషి కంటే ప్రమాదకరమైన జంతువు ఇంకొకటి లేదని మరొకరు రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Akash Chaudhary (@kaash_chaudhary) (చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!) -
అంగన్వాడీ కేంద్రంలో పాము కలకలం
అన్నానగర్: పర్వతాలతో కూడిన కృష్ణగిరి జిల్లాలో తేన్కనికోట అంతెవనపల్లి కొండ గ్రామం ఉంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో గురువారం పాము కలకలం సృష్టించింది. పిల్లలు కేంద్రంలో ఆడుకుంటున్న సమయంలో ఒక్క సారిగా పాము కనిపించడంతో సిబ్బంది చిన్నారులను బయటకు పంపించి తెన్కనికోట్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు పామును పట్టుకుని అడవుల్లోకి వదిలేశారు. -
పాము గుడ్లు కూడా విషపూరితమేనా? తింటే ఏమవుతుంది?
పాము.. ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతుంటారు. కొందరు పామును చూస్తే వణికిపోతారు. పాము సంగతి పక్కనుంచి దాని గుడ్లు విషయానికొస్తే పలువురిలో అనేక అనుమానాలున్నాయి. పాము గుడ్లు తినవచ్చా? లేదా అనేదానిపై చర్చలు కూడా సాగుతుంటాయి.మన దేశంలో కోడి గుడ్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా రకాల ఆహారాలలో గుడ్లను విరివిగా వాడుతుంటారు. అలాగే బాతు, ఉష్ట్రపక్షి గుడ్లను కూడా తింటుంటారు. వీటి గుడ్లను తిన్నప్పుడు మరి పాము గుడ్లు తింటే ఏమవుతుంది? దీనికి మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నివాసి, స్నేక్ క్యాచర్ మహదేవ్ పటేల్ సమాధానం తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన పాము గుడ్లను మనిషి తినడం అనేది అసాధారణమైన ఘటన అని, ఎవరైనా పాము గుడ్డు తింటే, పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పాము గుడ్లలో బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు ఉంటాయని, ఇవి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని మహదేవ్ పటేల్ వివరించారు.సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పాము గుడ్లలో ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుందన్నారు. పాము గుడ్లు తినడం వల్ల అలెర్జీ వస్తుందని, ఇది చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు లేదా అనాఫిలాక్సిస్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. పాము గుడ్లలో విషం ఉండదని, అందుకే వాటిని తిన్న వ్యక్తి మరణించడని మహదేవ్ తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముల గుడ్లలో విషం ఉండదు, ఎందుకంటే పాము కోరల వెనుక ఉన్న గ్రంధులలో విషం తయారవుతుంది. ఇది గుడ్డు దశలో ఏర్పడదు. పాము గుడ్లు తినడం వల్ల మనిషి శరీరంలోకి విషం ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువ.భారతదేశంలో పాములను పూజిస్తారు. అందుకే దాని గుడ్లు తినడం అనే ఆలోచన చేయరు. అయితే విదేశాల్లో పాము గుడ్లు తింటుంటారు. అక్కడివారు పాము గుడ్లను తినాలనుకున్నప్పుడు వాటిని బాగా ఉడికిస్తారు. తద్వారా దానిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులు నాశనమవుతాయి. మరోవైపు పాము గుడ్లు తినడం సాధ్యమేనని, వాటిలో పోషక విలువలు ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే పాము గుడ్డులోని బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగించడం శిక్షార్హమైన నేరమని మహదేవ్ పటేల్ తెలిపారు.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి? -
Tirumala: తిరుమలలో 8 అడుగుల నాగుపాము
తిరుమల: తిరుమలలో మంగళవారం 8 అడుగుల నాగుపాము స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుమలలో స్థానికులు నివాసముంటున్న బీ–టైపు 23వ క్వార్టర్స్ ప్రాంతంలో నాగుపాము వచ్చింది. స్థానికులు టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకు అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. -
HYD: ఎయిర్‌పోర్టులో పాముల కలకలం
సాక్షి,హైదరాబాద్:శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం సృష్టించాయి.సోమవారం(నవంబర్ 25) బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర పాములున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.దీంతో మహిళల బ్యాగులను తనిఖీ చేసిన సిబ్బంది వారి నుంచి విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్నారు. పాములను స్మగ్లింగ్ చేస్తున్నారా లేక దీని వెనుక ఇంకేదైనా వ్యవహారం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పోలీసులకు మహిళ బెదిరింపులు -
10 రోజులుగా ఆటబొమ్మలో నాగుపాము
భువనేశ్వర్: ఆటబొమ్మలో నాగుపాము బుసలు కొడుతూ భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన పూరీ జిల్లా సత్యబాది గ్రామంలో చోటుచేసుకుంది. పెరటి తోటలో వింత శబ్దం రావడంతో వెళ్లిన యజమాని ప్లాస్టిక్ ఆటబొమ్మను పరిశీలించగా నాగు పాము ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే స్నేక్ హెల్ప్ లైనుకు సమాచారం అందించడంతో కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజబండ్రీ అధ్యాపకుడు డాక్టరు ఇంద్రమణి నాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం శస్త్ర చికిత్స పరికరాలతో చేరుకుని పాముని విడుదల చేశారు. సుమారు 10 రోజులుగా ఆహారం లేక నీరసించిన పాము వైద్య సంరక్షణలో పూర్తిగా కోలుకున్నాక అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు. -
సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది. CPR to the snake with his mouth and unconscious snake back to life.This video going viral on social media from Vadodara, Gujarat, India#CPR #Life #Viral #India pic.twitter.com/VZXEOuTXKz— Chaudhary Parvez (@ChaudharyParvez) October 17, 2024 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. -
కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం ?
నాకు తరచు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇది దేనికి సంకేతం?కలలో పాములు కనిపిస్తున్నాయని మీరు ఆందోళన పడనక్కరలేదు. ఇది శుభానికే సంకేతం. మీకు త్వరలో ఆకస్మిక ధన ్రపాప్తి కలగబోతోందనడానికి సూచన అది. అంతేకాదు, మీకు సంతానం కలగబోతోందనడానికి కూడా సంకేతం కావచ్చు. సాధారణంగా కలలో పాములు కనిపించడం అనేది తీరని కోరికలకు సంకేతం. ఒకోసారి ఆ కోరికలు కార్యరూపం దాల్చబోతున్నాయనడానికి కూడా సూచికగా తీసుకోవచ్చు.దిష్టి తీయడానికి ఎర్రనీళ్లనే ఎందుకు ఉపయోగిస్తారు?వివాహాది శుభకార్యాలలో, నూతన వధూవరుల గృహప్రవేశ సమయంలోనూ, ఇంటిలో ఎవరైనా జబ్బుపడి లేచి స్వస్థత చేకూరి ఇంటికి వచ్చేటప్పుడూ ఎర్రనీళ్లతో దిష్టితీస్తారు. పసుపు, సున్నం నీళ్లు కలిపితే ఎర్రనీళ్లు తయారవుతాయి. ఈ ఎర్రనీళ్లను పళ్లెంలో పోసి దిష్టి తీస్తారు. ఆ నీళ్లను ఎవరూ తొక్కనిచోట పారబోస్తారు. గృహప్రవేశానికి ముందు తియ్యగుమ్మకు చిన్న రంధ్రం చేసి పారాణి ముద్దను ఉంచుతారు. దాన్ని దిష్టితీసి పగలగొడతారు. కొంతమంది ఎండుమిరపకాయలతో, మరికొందరు నూనెలో తడిపి వెలిగించిన గుడ్డపీలికలతోటీ దిష్టి తీస్తారు. ఘాటైన పదార్థాలు, ఎర్రని వస్తువులు దిష్టిని పోగొట్టడంలో శక్తిమంతంగా పని చేస్తాయని ఇలా చేస్తారు.ఇంటిలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?తులసి చెట్టు, నిమ్మ, వేప వంటివి ఇంటిలోకి దుష్టశక్తులను రానివ్వకుండా చేస్తాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా దిష్టి తగలకుండా ఉండడం కోసం వాకిలి వద్ద కొంతమంది బూడిద గుమ్మడి కాయలు కట్టుకుంటారు. అదేవిధంగా పటికను ఎర్ర లేదా నల్లటి వస్త్రంలో మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు. ఇష్టదైవానికి సంబంధించిన చిన్న పటాలను గుమ్మానికి తగిలించడం కూడా మంచిదే. -
ఎగిరే పామును చూశారా..?
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా ఎన్నడు చూడని అరుదైన పాము పాడేరులో కనిపించింది. స్థానిక చాకలిపేటలో ఉపాధ్యాయుడు ఒంపురి కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో నలుపు ఎరుపు, గోల్డ్ రంగుల మిశ్రమంలో రింగ్‌లుగా ఉన్న ఈ పామును చూసి స్థానికులంతా భయాందోళన చెందారు. స్థానికుల ఫోన్‌తో వచ్చిన స్నేక్ క్యాచర్ బండారు వాసు చాకచక్యంగా పామును పట్టుకున్నారు. మూడున్నర అడుగులున్న ఈ పాము ఒరంటే ఫ్లయింగ్ స్నేక్ అని వాసు తెలిపారు. ఎగిరే స్వభావంగల ఈ పాము అడవుల్లో రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుందని చెప్పారు. ఆ పామును ఆయన పాడేరు ఘాట్‌లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
పాముకాటు వీరులు
1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం. మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి. పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు. నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన. పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి! -రచయిత, ఫోటోలు : జానకి లెనిన్-అనువాదం : చంద్ర శేఖర్ బండి -
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
గరీభ్‌రథ్ రైలులో పాము.. ప్రయాణీకులు పరుగు..
సాక్షి, ముంబై: ప్రయాణంలో రైలులో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణీకులకు భయాందోళనకు గురిచేసింది. గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్(12187) రైలు ముంబైకి బయలుదేరింది. రైలు నడుస్తుండగానే మార్గ మద్యంలో కాసర రైల్వే స్టేషన్ వద్ద ఏసీ కోచ్ జీ-17లో పాము కనిపించింది. రైలు కోచ్‌లో అప్పర్ బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉంది. ఒక్కసారిగా పామును చూసి భయపడిన ప్రయాణీకులు వేరే కోచ్‌లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో కోచ్ డోర్లు మూసివేశారు.కాసర రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే.. ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం, స్నేక్ క్యాచర్స్ టీమ్ వచ్చి పామును పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Snake in train! Snake in AC G17 coach of 12187 Jabalpur-Mumbai Garib Rath Express train. Passengers sent to another coach and G17 locked. pic.twitter.com/VYrtDNgIIY— Rajendra B. Aklekar (@rajtoday) September 22, 2024 ఇది కూడా చదవండి: పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య! -
రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము.. ప్రయాణికుల పరుగులు
పాములంటే అందరికీ భయమే.. అవి కనిపిస్తే ఆమడదూరం పరిగెడుతుంటారు. ఈ మధ్య ఇళ్లలోకి, రోడ్లపైకి, ఆఖరికి బైక్, షూవంటి వాటిల్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రైల్వే స్టేషన్లో పాము ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పామును చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఈ సంఘటన జరిగింది.శుక్రవారం ఉదయం రిషికేశ్‌లోని యోగనగరి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై ఆరు అడుగుల పొడవైన పాము కనిపించింది. ఆ పాము పాకుతూ ప్లాట్‌ఫారమ్‌పైకి చేరింది. కాగా పామును చూసి ఆ ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి దూరంగా పరుగెత్తారు. కొందరు తమ లగేజ్ వదిలేసి పరుగులు తీశారు. ఆ ప్లాట్‌ఫారమ్‌పై పాము ఉన్నట్లు అక్కడున్న వారిని అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.#उत्तराखंड : आप स्टेशन पर ट्रेन का इंतजार कर रहे हों और सामने सांप आ जाए तो क्या होगा...। #ऋषिकेश रेलवे स्टेशन का एक वीडियो वायरल है। प्लेटफार्म पर अचानक एक लंबे सांप को रेंगता देख यात्रियों में अफरा-तफरी मच गई। #Uttarakhand #Rishikesh pic.twitter.com/qN3HAGt893— अनुराग शुक्ला/Anurag Shukla 🇮🇳 (@anuraganu83) September 20, 2024 వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పామును పట్టి సురక్షితంగా సమీపంలో అడవిలో వదిలారు. అయితే ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద పాము పాకుతూ వెళ్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
పులి భయపడింది
-
బంగారం దగ్గర పాములు ఎందుకున్నాయి?
‘తంగలాన్’ సినిమాలో బంగారానికి పాములు కాపలా కాస్తున్నట్లు దర్శకుడు చూపించాడు. గుప్త నిధులు ఉన్న దగ్గర పాములు ఉంటాయని పూర్వం చందమామ కథల్లో విఠలాచార్య సినిమాల్లో చూపించేవారు. తంగలాన్‌లో బంగారం కోసం వెళ్లిన ప్రతిసారి పాములు వచ్చి కాటేస్తుంటాయి. బంగారం గునుల్లో, నిధుల దగ్గర పాములు నిజంగానే ఉంటాయా? కొందరు శాస్త్రవేత్తలు ఏమంటారంటే హెవీ మెటల్స్ ఉన్న దగ్గర పాములు ఉంటాయి అని. బంగారం, యురేనియం, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ ఉండే ప్రదేశాల్లో పాములు సంచరిస్తాయని వారి అధ్యయనంలో కనిపించింది. పాములు తమ శరీరంలో ఉండే లుసుల్లో హెవీ మెటల్స్ను దాస్తాయట. పాములు బయో ఇండికేటర్స్‌గా పని చేస్తాయని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. యురేనియం దోరికే ప్రాంతాల్లో గాని బంగారం దొరికే కోలార్ వంటి ప్రాంతాల్లోగాని పాములు ఎక్కువగా సంచరిస్తుండేది అందుకే అని పర్యావరణవేత్తలు కూడా చెబుతున్నారు. -
పడక గదిలో కింగ్ కోబ్రా
శివమొగ్గ: ఇంటిలో ఒక చిన్న ఎలుక సంచరిస్తేనే మనకు రాత్రంతా భయంగా ఉంటుంది. అలాంటిది పడకగదిలోనే మహాసర్పం ఒకటి తిష్ట వేస్తే ఇక ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తీర్థహళ్లి తాలూకా ఆగుంబె సమీపంలోని సిగువ సోమేశ్వర గ్రామంలో ఎదురైంది. అక్కడి ఇంటి పడకగదిలోకి సుమారు 9 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా ఒకటి చేరింది. ఒక పాత్రలో చేరి దర్జాగా పడకేసింది. ఇంటివారు చూసి వణికిపోయారు. అటవీసిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలుచుకొచ్చి సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. -
బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్‌పై పామును విసిరి...
నల్లకుంట (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నల్లకుంట ప్రాంతంలో హల్చల్ చేసింది. చెయ్యెత్తినా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడమే కాకుండా.. ప్రశ్నించిన లేడీ కండక్టర్‌పై పామును విసిరేసింది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన బేగం (50) గురువారం సాయంత్రం విద్యానగర్–ఎన్సీసీ గేటు మధ్య రహదారిపై నిలుచుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైన రోడ్డులోని లక్కీ ఎక్స్ రోడ్ వద్ద సిటీ బస్సుల్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ‘107 వీ’సర్వీస్ నెంబర్ కలిగిన బస్సు అక్కడకు రావడంతో ఆపాలంటూ బేగం చెయ్యి ఎత్తింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకున్న డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్ బాటిల్ తీసి బస్సు వైపు విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో కిందికి దిగి వచ్చిన కండక్టర్ స్వప్న బేగంను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరారు. పాము పక్కకు పడటంతో కండక్టర్‌కు ముప్పు తప్పింది. బేగం అంతటితో ఆగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈలోపు సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పాము కోసం స్నేక్ క్యాచర్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. కండక్టర్ ఫిర్యాదు మేరకు బేగంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బేగంపై బస్సు అద్దాన్ని «ధ్వంసం చేయడం, కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించడం, పాము పట్ల అమానుషంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలతో కేసు నమోదైంది. -
పీకలదాకా తాగి పాముతో ఆటలు..
-
వికాస్‌ను ఎనిమిదో‘సారీ’ కాటేసిన పాము!
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ ద్వివేదికి సంబంధించిన ‘పాము కాటు’ ఉదంతం ఆసక్తికరంగా మారింది. తనకు బద్దశత్రువుగా మారిన సర్పం పీడను వదిలించుకోవడానికి 11 రోజులుగా వికాస్ రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నాడు. అయినా కూడా వికాస్ ఎనిమిదోసారి పాము కాటుకు గురైనట్లు సమాచారం. అయితే..దేవుని దయతో వికాస్‌కు ఏమీకాలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాము కాటు వేసిన తర్వాత కూడా వికాస్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే పాము వికాస్ దగ్గరకు రావడాన్ని, వెళ్లడాన్ని తాము చూడలేదని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏడుసార్లు పాము కాటుకు గురైన వికాస్ వికాస్ జూలై 13న మెహందీపూర్ బాలాజీ ఆశ్రమానికి వచ్చాడు. ఆయన జూలై 14న మీడియాతో మాట్లాడుతూ.. తనకు కలలో పాము కనిపించిందని, జూలై 20న పాము తనను ఎనిమిదవసారి కాటేస్తుందని చెప్పాడు. అయితే అలాంటి ఘటనేమీ జరగలేదు. కానీ, 22న సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో పాము మరోసారి వికాస్‌ను కాటేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.వికాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పాము తనను కాటు వేయడానికి వచ్చినప్పుడల్లా, తన ఎడమ కన్ను కొట్టుకుంటుందని తెలిపాడు. సోమవారం కూడా అలానే జరిగిందని చెప్పాడు. మరోవైపు ఇటీవల తనకు కూడా పాము కల వచ్చిందని వికాస్ తండ్రి సురేంద్ర ద్వివేది తెలిపారు. తన కుమారుడిని పాము కాటువేయగా, అతను చనిపోవడాన్ని తాను కలలో చూశానని పేర్కొన్నాడు. కాగా బాలాజీ టెంపుల్ ట్రస్టు వికాస్‌కు ఆశ్రయం కల్పిస్తూ సాయం అందిస్తోంది. -
శ్రీశైలంలో అద్భుతం..
-
భార్యను కాటేసిన పాము.. ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఏం చేశాడంటే
సాధారణంగా పామును చూస్తేనే దానికి దూరం పరుగెత్తుతారు. ఒకవేళ పాము కాటుకు గురైతే భయపడిపోయి ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తాం. కానీ బీహార్ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పాముకాటుకు గురైన మహిళను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకురాగా ఆమెతోపాటు కాటు వేసిన పామును కూడా తీసుకురావడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు.సబౌర్‌లోని జుర్ఖురియా గ్రామంలో నిషా అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురైంది. సాయం కోసం కేకలు వేయడంతో, భర్త రాహుల్ ఆమె దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. ఈ లోపు పాము పారిపోతుంటే దాని వెంట వెళ్లి ఇంట్లో దేవుడి ఫోటోల వెనక్కి నక్కిన పాము కనిపించింది.వెంటనే కర్రతో దానిని తీసి బకెట్లో వేశాడు. అప్పటికే నిషా స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను తన బైక్‌పై కూర్చోబెట్టి, బకెట్లో పాముతోపాటు బైక్ హ్యాండిల్‌కు వేలాడదీశాడు. భాగల్పూర్ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత వైద్యులు మొదట పామును చూసి భయపడిపోయారు.అయితే ఆ పాము తన భార్యను కరిచిందని చెబుతూ.. ఆమెను కాపాడాల్సిందిగా వైద్యులను వేడుకున్నాడు నిషా భర్త.. అనంతరం దానిని దూరంగా ఉంచమని చెప్పి.. మహిళను చికిత్స కోసం అత్యవసర విభాగానికి పంపారు. ఆ పాము విషాన్ని అంచనా వేయడం ద్వారా ఆమెకు వైద్యులు చికిత్స చేశారు. ప్రస్తుతం నిషా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పామును మళ్లీ అడవిలో విడిచిపెట్టారు. -
కాటు వేసిందని పామునే కరిచి చంపేయడంతో..!
పాము కాటుకి గురైతే సాధారణంగా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం చేస్తాం. మరికొందరూ సదరు పాముని చంపి, దాన్ని పట్టుకుని వెళ్లి మరీ చికిత్స పొందిన ఘటనలు చూసి చూశాం. కానీ ఏకంగా ఆ పాముని కరిచి చంపేయడం గురించి విన్నారా. ఈ దిగ్భ్రాంతికర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..35 ఏళ్ల సంతోష్ లోహార్ అనే వ్యక్తి ఒకరోజు రైల్వే లైన్లు వేసే పనిని ముగించుకుని తన బేస్ క్యాంపులో నిద్రిస్తుండగా ఓ పాము అతనిపై దాడి చేసింది. దీంతో అతడు వెంటనే ఆ పాముని చేతుల్లోకి తీసుకుని రెండు సార్లు కసితీరా కరిచేశాడు. ఈ అసాధారణ చర్యకు పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుశ్చర్య తర్వాత లోహార్ ఆస్పత్రిపాలయ్యాడు. ఓ రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు. అయితే సదరు వ్యక్తి కాటు వేసిన పాముని తిరిగి కొరికేస్తే విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో చేశాడట. ఈ విషయం తెలుసుకుని అక్కడ ఆస్పత్రి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఇలా పాము కాటుకి గురయ్యితే ఏం చేయాలో తెలుసుకుందాం..పాము కాటుకి గురైనప్పుడు త్వరగా చర్య తీసుకోవాలని, వైద్య సహాయం కోరాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ తక్షణ వైద్య సంరక్షణ అనేది పలు సమస్యలను నివారించడమే గాక దీర్ఘకాలికి వైకల్యం లేదా మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తప్పక చేయాల్సినవి..పాము కరిచినట్లయితే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం వంటివి చేయాలి. కాటే వేసిన ప్రదేశంలో బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి. ప్రభావిత అవయవాన్ని కదలకుండా ఉంచి, బాధితుడిని తక్షణమే సురక్షితంగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు వైద్య సహాయం కోసం ఎదరుచూస్తున్నప్పుడూ ప్రభావిత అవయవాన్ని గుండె స్థాయికి దిగువున ఉంచి ప్రాథమి చికిత్స అందించాలి. అలాగే బాధితుడికి తినేందుకు, తాగడానికి ఏమి ఇవ్వకూడదని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..
వేలూరు: కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ సమయంలో రైతు వేలాయుధం కాలుపై పాము కరిచినట్లు కనిపించింది. దీంతో అక్కడ కనిపించిన నాగు పామును కొట్టి చంపి దాన్ని ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వెంటనే తిరుపత్తూరు ప్రభు త్వాస్పత్రికి తెచ్చాడు. దాన్ని చూ సిన అత్యవసర విభాగంలోని వైద్యులు అవాక్కయ్యారు. కాగా వేలాయుధం తనను ఈ పాము కరిచిందని వెంటనే వైద్యం అందజేయాలని తెలిపి స్పృహ త ప్పి పడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రైతుకు వైద్యం చేశారు. -
అమెజాన్ పార్సిల్ లో పాము కలకలం
-
పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు. ఒంగోలు టౌన్: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి. పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు: జూన్ నుంచి అక్టోబర్ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్‌కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మందిమహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి: జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి. లక్షణాలను ఇలా గుర్తించాలి... పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్ జనరల్ ఫిజీషియన్ డా.కళ్యాణి చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు: పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.విష పాములను గుర్తించడం ఎలా...? పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.జిల్లాలో 72 పీహెచ్‌సీలు.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్సీల ఒక ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్‌సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడింది.సకాలంలో వైద్యశాలకు తరలించాలి ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది. –డాక్టర్ ఎన్.కళ్యాణి, జనరల్ ఫిజీషీయన్, హెచ్ఓడీప్రజల్లో అవగాహన కలిగించాలి అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్‌లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – డాక్టర్ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు.