Viral Video: Cow And Snake Playing Together Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: ఇదేం విచిత్రం! ఆవు, పాము రెండు అలా..

Published Fri, Aug 4 2023 2:07 PM | Last Updated on Mon, Aug 21 2023 4:46 PM

Viral Video: Cow And Snake Playing Together Goes Viral - Sakshi

రెండు విరుద్ధ జంతువులు ఎదురుపడితే కాసేపు కోట్లాడుకుంటాయి. లేదా తప్పుకోవడమో చేస్తాయి. ఔనా! అదికూడా కాదు అంటే..వాటిలో ఒకటి కాస్త ప్రమాదమైంది అయితే మరోకటి అక్కడ నుంచి పారిపోయేందుకు యత్నిస్తుంది. ఇది కామన్‌. కానీ ఇక్కడ అలా ఇలా కాకుండా ప్రకృతికే విరుద్ధంగా ఓ విచిత్రమైన ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద నెట్టింట పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. నో డౌట్‌!.. ఈ వీడియో చూస్తే కచ్చితంగా షాక్‌ అవ్వుతారు.

ఆ వీడియోలో ఓ పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే..చూస్తే వామ్మో ఏంటిది? అనిపిస్తుంది. అవి అసలు ఎలా ఉన్నాయంటే..ఆ రెండు చాలా అన్యోన్యంగా  ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా ఉంటాయి. పైగా ఏ మాత్రం దాడి చేసుకోకుండా చాలా సఖ్యంగా ఉంటాయి. చూస్తున్నంత సేపు మనకేమో ఆ పాము ఎక్కడ ఆవుపై దాడి చేస్తుందో అని టెన్షన్‌ పడిపోతుంటాం.

కానీ ఆ పాము దానికి సహకరిస్తున్నట్లుగా ఏం చేయదు. పైగా ఆవుతో సరదాగా ఉంటుంది ఆ పాము. దీన్ని 'వివరించడం చాలా కష్టం', ఆ రెండింటి మధ్య చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబోలు అని సదరు అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు కూడా వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: సముద్రగర్భంలో సంగీత కచేర!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement