ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.
తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు.
దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది.
CPR to the snake with his mouth and unconscious snake back to life.
This video going viral on social media from Vadodara, Gujarat, India#CPR #Life #Viral #India pic.twitter.com/VZXEOuTXKz— Chaudhary Parvez (@ChaudharyParvez) October 17, 2024
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment