cpr
-
సీపీఆర్‌తో ఊపిరి పోశాడు!
లంగర్‌హౌస్: గుండెపోటు వచ్చి రోడ్డుపై పడిపోయిన ఓ యువకుడికి ట్రాఫిక్ హోంగార్డు సీపీఆర్ చేసి బతికించిన ఈ ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానల్‌నగర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. సాలార్జంగ్ కాలనీలో నివసిస్తున్న మొహమ్మద్ ఖలీలుద్దీన్ (36) వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. గురువారం సాయంత్రం విధుల్లో భాగంగా గచి్చ»ౌలికి వెళ్లడానికి నానల్‌నగర్ బస్టాప్‌లో వేచి చూస్తున్నాడు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతడు కింద పడిపోయాడు. అక్కడ ఉన్నవారు బాధితుడి వద్దకు వెళ్లడానికి సాహసించలేదు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న లంగర్‌హౌస్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు సుబ్బారెడ్డి వెంటనే స్పందించాడు. గుండెపోటుతో కిందపడిపోయిన ఖలీలుద్దీన్కు సీపీఆర్ చేసి బతికించాడు. అనంతరం దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరి్పంచాడు. ప్రస్తుతం ఖలీలుద్దీన్ కోలుకున్నాడు. సీపీఆర్‌తో యువకుడి ప్రాణాన్ని కాపాడిన సుబ్బారావును ఏసీపీ ధనలక్షి్మ, ఇన్స్పెక్టర్ అంజయ్య అభినందించారు. -
సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రాణాపాయంలో ఉన్న వారికి సీపీఆర్ చేసిప్రాణాలను నిలుపుతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా, గుజరాత్ వడోదరలో ఓ వ్యక్తి ఇలానే ప్రాణాపాయంలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి దాని ప్రాణాలు నిలపాడు. నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నిజంగానే జరిగింది. వివరాలు.. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తించిన కొందరు జంతు సంరక్షణ కార్యకర్తలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం దానికి సీపీఆర్ చేయాలని నిర్ణయించింది. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు నిర్జీవంగా పడివున్న పాముపిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. దాని ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న అతడు వెంటనే దానికి నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు. పాము నోరు తెరిచి నోటిలోకి మూడు నిమిషాలు ఊది స్పృహలోకి తీసుకురావడానికి యత్నిచాడు.మొదటి రెండు ప్రయత్నాలలో సీపీఆర్ ఇచ్చినా, దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మూడోసారి పాములో చలనం వచ్చింది. CPR to the snake with his mouth and unconscious snake back to life.This video going viral on social media from Vadodara, Gujarat, India#CPR #Life #Viral #India pic.twitter.com/VZXEOuTXKz— Chaudhary Parvez (@ChaudharyParvez) October 17, 2024 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. -
సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ..
-
మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ
సాక్షి, యాదాద్రి భువనగిరి: వలిగొండలో గుండెపోటుకు గురై ఓ మహిళ స్పృహతప్పి పడిపోయింది. అక్కడే వాహన తనిఖీలు చేస్తున్న వలిగొండ ఎస్ఐ మహేందర్ ఆమెకి సీపీఆర్ చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ భువనగిరి మండలం మన్నెవారిపంపునకు చెందిన బోయిన వెంకటమ్మ గుర్తించారు. పలువురు ఎస్ఐని అభినందించారు. -
CPR: ఒకేసారి 20 లక్షల మందికి సీపీఆర్ నేర్పిస్తే..
ఢిల్లీ: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చి ఎక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఈ రెండు మూడేళ్ల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ, సీపీఆర్ Cardiopulmonary resuscitation (CPR) చేసి బతికిస్తున్న ఘటనలు మాత్రం అరుదుగా చూస్తున్నాం. గణాంకాల్లో పాతికేళ్లలోపు వాళ్లు కూడా ఉంటుండగా.. ఒబెసిటీ లాంటి సమస్యలు లేనివాళ్లు కూడా సడన్‌గా చనిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే ఆపద సమయంలో రక్షించే.. సీపీఆర్‌పై దేశవ్యాప్త అవగాహన కోసం కేంద్రం నడుం బిగించింది. గుండెపోటు హఠాన్మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక కార్యక్రమం నిర్వహించింది. సీపీఆర్‌పై చదువుకున్న వాళ్లకూ అవగాహన లేదని భావిస్తున్న కేంద్రం.. సీపీఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో 20 లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్షుఖ్ మాండవీయ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. సీపీఆర్ టెక్నిక్‌పై శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. आज देश के हर कोने से 20 लाख से अधिक लोगों के साथ नेशनल बोर्ड ऑफ एग्जामिनेशन द्वारा आयोजित CPR प्रशिक्षण में भाग लिया। इस अभियान के माध्यम से अचानक कार्डियक अरेस्ट होने की स्थिति में हम दूसरे की मदद कर सकते ह pic.twitter.com/SOMLvsdBGl — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 6, 2023 అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ తరహా హఠాన్మరణాలు 12.5 శాతం పెరిగాయి. మంచి ఆహారం తీసుకోవాలని, అయినా ఈ తరహా మరణాలు సంభవిస్తుండడంతో సీపీఆర్పైనా అవగాహన ఉండాలని అన్నారాయన. కొవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనాన్ని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. దాదాపు రెండు లక్షల మంది టీచర్లు, కాలేజీ ఫ్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. -
తాజ్ సందర్శకునికి గుండెపోటు.. సీపీఆర్ ఇచ్చి కాపాడిన కుమారుడు!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గల తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఒక వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. అయితే వెంటనే స్పందించిన అతని కుమారుడు సీపీఆర్ (కార్డియో-పల్మనరీ రిససిటేషన్) చేయడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే ఒక వృద్ధుడు కుటుంబ సమేతంగా తాజ్ మహల్ సందర్శనకు వచ్చాడు. అతను తాజ్‌మహల్ కాంప్లెక్స్ లో గుండెపోటుకు గురయ్యాడు. అతని కుమారుడు వెంటనే తండ్రికి సీపీఆర్ ఇచ్చి అతని ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని ఈ వీడియో తెలియజేస్తోంది. సీపీఆర్‌తో కోలుకున్న బాధితుడిని తక్షణం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గుండెపోటుకు గురైన బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య సహాయం అందేలోగా సీపీఆర్ చేయడం ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. బాధితుని శరీరంలో రక్తప్రవాహం కొనసాగేందుకు సీపీఆర్ సహాయ పడుతుంది. తద్వారా వారి ప్రాణాలు నిలిచే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. आगरा ➡ताजमहल के अंदर CPR देते का लाइव वीडियो वायरल ➡पर्यटक को सीपीआर देते का लाइव वीडियो हुआ वायरल ➡ताजमहल देखने आए पर्यटक को आया था हार्ट अटैक ➡काफी देर तक CPR देने के बाद पर्यटक की लौटी जान ➡ताजमहल परिसर के अंदर वीडियो प्लेटफार्म का मामला.#Agra pic.twitter.com/hRxTtDwXIu — भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 15, 2023 -
ఈ పోలీస్ మాములోడు కాదు.. పాముకు సీపీఆర్
మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంనకు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఒక పోలీసు కానిస్టేబుల్ తన నోటి ద్వారా పాముకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నిం చేశారు. ఈ విధంగా పాముకి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. సెమ్రీ హర్చంద్లోని తవా కాలనీలో పాము ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్ అతుల్ శర్మకు సమాచారం అందింది. అతుల్ 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించారు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. తాజా ఘటనలో నీటి పైపులైన్లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానిని బయటకు తెచ్చేందుకు పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్లో వేయగా, ఆ పాము అపస్మారక స్థితికి చేరుకుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఒక పాము అపస్మారక స్థితిలో ఉండటం, దానికి పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? #MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr — NDTV India (@ndtvindia) October 26, 2023 -
ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష
తుని రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య బృందం అందించిన అత్యవసర వైద్య సేవలు ఓ యువకుడి ప్రాణాలు నిలబెట్టాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట శివారు టి.వెంకటాపురంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హెచ్.కొత్తూరుకి చెందిన మలగంటి లోకేష్ ఉన్నట్టుండి ఆయాసంతో కుప్పకూలిపోయాడు. అతడికి మెరుగైన వైద్యం అందించాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని పట్టణానికి తీసుకువెళ్లాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టి.వెంకటాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరుగుతోందని తెలుసుకున్న లోకేష్ బంధువులు వెంటనే అక్కడికి తీసుకువెళ్లారు. వైద్య బృందం 104లో ఉంచి సీపీఆర్ పరికరంతో హృదయ స్పందన, శ్వాస తిరిగి ప్రారంభమయ్యేలా ప్రయత్నం చేశారు. వారి కృషి ఫలించడంతో కొంతసేపటికి హృదయ స్పందన తిరిగి ప్రారంభమై లోకేష్ కళ్లు తెరిచాడు. వెంటనే ఎర్రకోనేరు గ్రామం వరకూ 104లో, అక్కడి నుంచి 108లో తుని ఆస్పత్రికి తరలించారు. గోల్డెన్ సెక్షన్స్‌లో సీపీఆర్ సేవలు అందించడం సత్ఫలితాన్ని ఇచి్చందని వైద్యులు చెప్పారు. -
CPR అవగాహన వీడియో
-
అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్
కీసర: నెలలు పూర్తిగా నిండకుండా.. గుండె చప్పుడు లేకుండా అప్పుడే పుట్టిన మగబిడ్డకు సీపీఆర్ చేసి కీసర 108 సిబ్బంది ప్రాణాలు కాపాడారు. వివరాలివి. కుందన్‌పల్లిలోని కోళ్లఫాంలో పనిచేసే ఆర్తికుమారి పురిటినొప్పులతో కీసరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు నెలలు పూర్తిగా నిండకపోవడం.. పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనందున గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గర్భిణిని 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే ఈఎంటీ చిత్రం రవి వాహనంలోనే ఆమె సుఖప్రసవం చేశారు. పుట్టిన మగబిడ్డ బరువు తక్కువగా ఉండి నాడి, శ్వాస గుండెచప్పుడు లేకపోవడం గమనించి ఈఆర్సీపీ వైద్యుడు మహీద్‌ను ఫోన్లో సంప్రదించారు. ఆయన సూచన మేరకు బిడ్డకు సీపీఆర్ చేసి అంబు బ్యాగ్‌తో శ్వాస అందిస్తూ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల బిడ్డకు ప్రాణాపాయం తప్పిందని పేర్కొని 108 సిబ్బందిని అభినందించారు. -
సీపీఆర్‌పై అవగాహన అవసరం
పంజగుట్ట: మన దేశంలో ప్రతి నిమిషానికి 112 కార్డియాక్ అరెస్టులు సంభవిస్తున్నాయని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 80 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతున్నాయని, సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా సీపీఆర్‌పై ఎన్సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెలలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించనున్న సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ మాదిరిగా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని కోరారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ అశిమా శర్మ మాట్లాడుతూ.. సీపీఆర్ చేసే సమయంలో స్కిల్స్ ఎంతో ముఖ్యమని, బ్రీతింగ్, నాడి చూడాలని, భుజం తట్టి స్పందిస్తున్నారో లేదో చూడాలన్నారు. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు నిమ్స్‌లో పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సీపీఆర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ బి.విజయ్‌భాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, కె.మదన్మోహన్రావు, రమణ పాల్గొన్నారు. -
వెంటాడు... వేటాడు...
పరిశోధన, ప్రజా విధానాలకు సూచన, సలహాల్లో యాభై ఏళ్ళుగా కృషి చేస్తూ, స్వర్ణోత్సవం జరుపుకోవడమనేది ఉత్సాహంగా ముందుకు అడుగేయాల్సిన సందర్భం. కానీ, అందుకు విరుద్ధంగా అడుగులు ముందుకు పడకుండా పాలకులే అడ్డం పడితే? పౌర విధానానికి సంబంధించి దేశంలోకెల్లా అత్యంత గౌరవనీయమైన ఢిల్లీకి చెందిన మేధావుల బృందమైన ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ (సీపీఆర్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అలానే ఉంది. ఆ సంస్థకు విదేశీ విరాళాలు, ఆర్థిక సహాయం అందే వీలు లేకుండా ‘విదేశీ సహాయ (నియంత్రణ) చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్ట్రేషన్‌ను ఆరు నెలల పాటు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27న ఉత్తర్వులివ్వడం జాతీయ, అంతర్జాతీయ మేధావులను ఉలిక్కిపడేలా చేసింది. విద్యావిషయిక కార్యక్రమాలకే లైసెన్స్ ఇచ్చామనీ, కానీ సీపీఆర్ మాత్రం విదేశీ విరాళాలను పుస్తక ప్రచురణ లాంటి వాటికీ వినియోగిస్తోందనీ ఆ ఉత్తర్వుల ఆరోపణ. అయిదు నెలల క్రితం గత సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సీపీఆర్ కార్యాలయం, అలాగే ఆక్స్‌ఫామ్ ఇండియా, పలు డిజిటల్ మీడియా సంస్థలకు నిధులిచ్చే బెంగళూరుకు చెందిన ‘ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండే షన్’ (ఐపీఎస్ఎంఎఫ్)లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విరుచుకుపడింది. సర్వేలు నిర్వహించింది. ఆ వెంటనే సిబ్బందికి సమన్లు వెళ్ళాయి. దానికి కొనసాగింపుగా పన్ను మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తూ, షోకాజ్ నోటీసు వెళ్ళాయి. ఒక రకంగా దాని కొనసాగింపే – ఇప్పుడీ లైసెన్స్ రద్దు. నిజానికి, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా 1976 నుంచి సీపీఆర్‌కు పన్ను మినహాయింపు లభిస్తోంది. వచ్చే 2027 దాకా మినహాయింపు ఉన్నా, ఇప్పుడీ బెదిరింపులు గమనార్హం. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాలుంటే విచారించడం తప్పు కాదు. చట్టం ముందు అందరూ సమానులే గనక ఏమన్నా తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడమూ తప్పనిసరే. కానీ, మనసులో ఏదో పెట్టుకొని, ఏ చిన్న లోపం కనిపించినా, వెంటాడి వేధించాలని అనుకుంటేనే అది హర్షించలేని విషయం. ఆ సంస్థ బాధ్యుల్లోని పరిశోధకులు కొందరు ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఇటీవల రాసిన వ్యాసాలే దీనికి హేతువని ఓ బలమైన విమర్శ. ఎక్కడా, ఏ తప్పూ చేయలేదని తేలినప్పటికీ, సాంకేతిక కారణాలే సాకుగా సీపీఆర్ లాంటి స్వతంత్ర మేధాసంస్థను వేధిస్తున్నారన్నది స్పష్టం. కొండను తవ్వి ఎలుకను పట్టే ఈ దీర్ఘకాల ప్రక్రియతో మానసికంగా వేధించడమే పాలక వర్గాల పరమార్థంగా కనిపిస్తోంది. నిజానికి, సీపీఆర్ అనేది దేశంలోని అగ్రేసర స్వతంత్ర పరిశోధనా సంస్థల్లో ఒకటి. విభిన్నరంగాలకు చెందిన పరిశోధకులు, వృత్తినిపుణులు, విధాన నిర్ణేతలతో కూడిన మేధావుల బృందం ఇది. ఈ లాభాపేక్ష రహిత సంస్థ 50 ఏళ్ళ క్రితం 1973లో ఏర్పాటైంది. ప్రభుత్వ విధానాల్లోని వివిధ అంశాలపై ఈ సంస్థలోని బుద్ధిజీవులు దృష్టి సారిస్తుంటారు. ఆర్థికవేత్త – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్ సహా పలువురు మేధావులు ఈ సంస్థ కార్యవర్గంలో మాజీ సభ్యులు. అనేక కేంద్ర శాఖలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతోనూ కలసి పనిచేసిన ఈ సంస్థను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా పన్ను మినహాయింపూ ఇస్తోంది. గత ఏడాదీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల నుంచి సీపీఆర్‌కు నిధులు వచ్చాయి. మరి, ఉన్నట్టుండి సీపీఆర్ జీవితం మీద పాలకులకు ఎందుకు విరక్తి కలిగినట్టు? దీనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న ‘జన అభివ్యక్తి సామాజిక్ వికాస్ సంస్థ’ (జస్వాస్) సహా దాదాపు 30 సంస్థలకు డేటా సేకరణ, పర్యావరణ చట్టం సహా పలు అంశాల్లో పరిశోధనకు సీపీఆర్ నిధులిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు తిరిగే జీవవైవిధ్య ప్రాంతం హస్‌దేవ్‌లో బొగ్గు గనుల అక్రమ తవ్వకంపై ఆదివాసీ ఉద్యమంలో జస్వాస్ ట్రస్టీ అయిన ఒక పరిశోధకుడి భాగం కూడా ఉంది. ఆ గనులు పాలకుల ఆశీస్సులున్న వ్యాపార సంస్థవనీ, ఆ ఉద్యమానికీ – సీపీఆర్‌తో జస్వాస్ భాగస్వామ్యానికీ సంబంధం లేకున్నా పాలకులకు అది కోప కారణమైందనీ విశ్లేషకుల మాట. కారణాలు ఏమైనా, ఏలినవారికి కోపమొస్తే బండి నడవడం కష్టమనే విషయం తాజా సీపీఆర్ లైసెన్స్ రద్దుతో మరోసారి రుజువు చేస్తోంది. గమనిస్తే – ఐటీ విభాగం తన నోటీసుల్లో పేర్కొన్న పరిశీలనలు, చేసిన ఆరోపణలు దాని పరిధిని దాటి ఉన్నాయి. ఇది పాలకులపై అనుమానాలకు ఊతమిస్తోంది. సీపీఆర్ మాత్రం తమ కార్యకలాపాలన్నీ చట్టబద్ధమైనవేననీ, ప్రభుత్వ సంస్థలు తమ ఆదాయ వ్యవహారాలను ఎప్పటి కప్పుడు ఆడిట్ చేస్తూనే ఉన్నాయనీ స్పందించింది. రాజ్యాంగ విలువల స్ఫూర్తితో ఈ వివాదం వీలైనంత త్వరలో సమసిపోతుందని అభిలషించింది. ఆ అభిలాష వాస్తవరూపం ధరిస్తే సంతో షమే. అయితే, పాలకులు తమ చేతుల్లోని దర్యాప్తు సంస్థలనూ, విభాగాలనూ దుర్వినియోగం చేయ డానికి ఏ మాత్రం వెనుకాడని గతం, వర్తమానమే భయపెడుతున్నాయి. నిబంధనల్లోని సాంకేతిక అంశాలను ఆయుధంగా చేసుకొని, భావప్రకటన స్వేచ్ఛకున్న అవకాశాల్ని అడ్డుకోవాలని పాలకులు చూడడం ఆందోళన రేపుతోంది. ఐటీనైనా, విదేశీ స్వార్థ ప్రయోజనాలు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయరాదని పెట్టుకున్న ఎఫ్సీఆర్ఎ లాంటి నియంత్రణ వ్యవస్థనైనా ప్రభుత్వేతర సంస్థల పీక నులమడానికి వాడితే అది అప్రజాస్వామికమే కాదు... అచ్చమైన ప్రతీకారమే! -
చిన్నవయసులోనే గుండెపోటు సంఘటనలు ఎందుకు?
గుండెపోటు విషయంలో ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తెలిసి వచ్చిన అంశం ఏమిటంటే... ఇది పెద్దవారిలో మాత్రమే కాదు... టీనేజర్లలో... ఆ మాటకొస్తే చిన్నారుల్లో సైతం కనిపిస్తుందని తేలింది. క్రమబద్ధమైన రీతిలో వ్యాయామం చేస్తూ, శిక్షణ పొందే యువ అథ్లెట్లలో సైతం గుండెపోట్లు కనిపించాయి. ఫిఫా (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్) రిజిస్ట్రీలో సైతం 2014 నుంచి 2018 మధ్యకాలంలో 617 మంది యువ అథ్లెట్లు గుండెపోటుతో కుప్పకూలిన దాఖలాలున్నాయి. అంతేకాదు... మనదేశంలో సైతం చాలా పెద్ద సెలబ్రిటీలు మొదలుకుని... మన వీధిలో మనకు తెలిసిన వారిలో అకస్మాత్తు గుండెపోట్లు కనిపించడం, వారు హఠాత్తుగా మరణించడం చాలా ఎక్కువగా కలవరపరిచే విషయాలే. అతి చిన్న వయసులోనే ఎందుకిలా గుండెపోట్లు? అతి చిన్నవయసులో గుండెపోట్లు కనిపించడానికి కొన్ని అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ దోహదపడుతున్నట్లు వెల్లడైంది. ♦ కుటుంబ చరిత్రలోనే చిన్నవయసులో గుండెపోటు సంఘటనలు ఉండటం. ♦ గుండె నిర్మాణంలోనే పుట్టుకతో తేడాలు ఉండటం. ♦ గుండెలో లయబద్ధంగా కొట్టుకోడానికి నిత్యం ఒకే రీతిలో విడుదలయ్యే ఎలక్ట్రిసిటీ కావాలి. అది సయనో ఏట్రియల్ నోడ్ అనే గుండెలోని ఓ కేంద్రం నుంచి వెలువడుతుంది. ఈ కరెంటు వెలువడటంలోని తేడాలు (అబ్నార్మాలిటీస్) కూడా ఇలా యువత అకస్మాత్తు మరణాలకు ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ నష్టాలూ కొంతవరకు కారణం... ఎలాగంటే...? కోవిడ్ అనంతరం వచ్చే కొన్ని సమస్యలు సైతం గుండెపోటుకు కారణమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. గుండె కండరానికి ఇన్ఫ్లమేషన్ తెచ్చిపెట్టే ‘మయోకార్డయిటిస్ ’ సమస్య ఇందుకు ఓ ఉదాహరణ. ఛాతీలో నొప్పి, శ్వాస తగినంతగా అందకపోవడం వంటి లక్షణాలతో కనిపించే మయోకార్డయిటిస్ అన్నది అటు తర్వాత గుండె క్రమబద్ధంగా కొట్టుకునే లయను దెబ్బతీసేలా ‘అరిథ్మియాస్’, హార్ట్ఫెయిల్యూర్లతోపాటు మరికొన్ని ఇతర గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఇదొక్కటే కాదు... కోవిడ్ తర్వాత చాలామందిని పరిశీలించినప్పుడు వారి రక్తప్రసరణ వ్యవస్థలో / రక్తనాళాల్లో రక్తపు ఉండలు (క్లాట్స్) పెరగడం మరో అంశం. ఈ క్లాట్స్ ప్రధాన ధమనుల్లో వచ్చినప్పుడు, గుండెకు తగినంతగా పోషకాలు, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడతాయి. ఇవి కూడా యువతలో గుండెపోట్లకు కారణం. ♦ ఇటీవల యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయింది. ఆదుర్దా పడటం, ఆందోళన చెందడం వంటి అంశాలు యాంగ్జైట్ టీకి దారితీస్తున్నాయి. దీనికి తోడు వైరస్ అనంతర పరిణామాల్లో సామాజిక సమస్యలుగా పరిగణించే ఉపాధి కోల్పోవడం, ఆర్థికంగా దెబ్బతినడం వంటి అంశాలూ యువతలో ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఈ ఒత్తిడి అధిక రక్తపోటుకూ, గుండె వేగం పెరుగుదలకూ, గుండె లయ మార్పుచెందడానికి దోహదపడుతున్నాయి. ఇవన్నీ గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని దెబ్బతీయడం ద్వారా యువతలో చాలా చిన్నవయసులోనే గుండెపోట్లకు దారితీస్తున్నాయి. ♦ దీనికి తోడు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి అంశాలూ,ఇంకా కొనసాగుతున్న వర్క్‌ఫ్రమ్ హోమ్ వంటి పని అలవాట్లు యువతలో వ్యాయామలేమిని పెంచడంతో పాటు... రాత్రి తగినంతగా నిద్రలేకుండా పనిచేయడాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ నిద్రలేమి కూడా యువతలో గుండెపోట్లకు ఓ ప్రధాన కారణమే. ♦ వీటన్నింటికి తోడు మనలో ఒత్తిడినీ, యాంగ్జైట్ టీని పెంచే మరో అంశం కూడా ఉంది. నిజానికి తగిన సమయానికి కోవిడ్ వ్యాక్సిన్ రావడం వల్ల చాలా మరణాలు నివారితమయ్యాయి. పెద్దసంఖ్యలో జనం రక్షణ పొందారు. కానీ ఇటీవల పెరిగిన గుండెపోట్లను వ్యాక్సిన్‌తో ముడిపెడుతూ చాలా వదంతులు వెలువడుతున్నాయి. మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇవీ కారణమవుతున్నాయి. నిజానికి ఈ గుండెపోట్లకూ, వ్యాక్సిన్ కూ సంబంధం ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలూ ఇప్పటివరకు వెలువడలేదు. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. ♦ గుండెపోటుతో మృతి చెందినవారిలో నిర్దిష్ట కారణాలు కనుగొనేందుకు పోస్ట్‌మార్టమ్ అవసరం. యుక్తవయసు గుండెపోట్లను నివారించాలంటే...? ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. క్రమంతప్పకుండా అలాగే శరీరానికి మితిమీరిన శ్రమకలిగించకుండా చేసే వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లు, పొగతాగడం, మద్యం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండడంపై ప్రజల్లో అవగాహన పెంచాలి. నష్టనివారణ కోసం ఎలాంటి పరీక్షలు అవసరమంటే...? ఇటీవల హఠాత్తుగా గుండెపోట్ల పెరుగుదల అన్నది ఇటు డాక్టర్లను, అటు సామాజికవేత్తలనూ బెంబేలెత్తిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధి, పురోగతికి కారణమైన యువత ఇలా అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబాలకే కాదు, దేశానికీ నష్టమే. అందుకే గుండెపోటు మరణాల పట్ల తగినంత అవగాహన, విషయపరిజ్ఞానం, మున్ముందు రాబోయే ఇక్కట్ల నుంచి తమను రక్షించుకునేలా చేయించుకోవాల్సిన తగిన వైద్యపరీక్షల వంటి అంశాల్లో నివారణ ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న వయసువారైనప్పటికీ, తమలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు తప్పనిసరిగా గుండె పరీక్షలు అంటే... ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి డాక్టర్లు చెప్పిన విధంగా తగిన ఇంటర్వెల్స్‌లో చేయించుకోవాలి. ఇవేగాక ప్రాథమిక పరీక్షలైన బీపీ చెక్ అప్, కొలెస్ట్రాల్ స్థాయుల్ని తెలిపే రక్త పరీక్షలు, చక్కెర మోతాదు పరీక్షలు చేయించుకుని, డాక్టర్లు చెప్పిన విధంగా మందులు, జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ప్రాణాలను కాపాడే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్)వంటివి అందరూ నేర్చుకోవాలి. దీనివల్ల అకస్మాత్తు గుండెపోటు మరణాలను చాలావరకు నివారించవచ్చు. ఈ సీపీఆర్‌పై సాధారణ ప్రజలందరికీ శిక్షణ ఇవ్వాలి. ♦ ఇక ప్రజలు ఎక్కువగా తిరగాడే కొన్ని కీలకమైన ప్రదేశాల్లో, కూడళ్లలో, సెంటర్లలో డీ–ఫిబ్రిలేటర్లను (ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేసే ఉపకరణాలు) అమర్చాలి. గుండెపోటు ముప్పును తెచ్చిపెట్టే అంశాలేమిటంటే? మన దేశంలోని యువతలో ఇటీవల ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, కొవ్వు పదార్థాల వినియోగంలో పెరుగుదల... ఫలితంగా బరువు పెరగడం ఓ ప్రధాన ముప్పు. ♦ చాలా తక్కువ వయసులోనే గుండెపోటు ముప్పునకు కారణమయ్యే స్థూలకాయం, హైబీపీ (హైపర్‌టెన్షన్), మధుమేహం (డయాబెటిస్) పెరుగుదల కూడా మరో కారణం. ఒకప్పుడు ఈ తరహా జీవనశైలి సమస్యలు చాలా పెద్ద వయసువారిలోనే కనిపించేవి. కానీ ఇటీవల ఇవి చిన్నవయసు వారిలోనూ వస్తున్నట్లే... దీని చిట్టచివరి ప్రమాదకరమైన ఫలితమైన గుండెపోట్లూ యువతలో పెరుగుతున్నాయి. ♦ ఇటీవల యువత చేపడుతున్న వృత్తులన్నింటిలోనూ కదలకుండా కూర్చుని చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. కనీస కదలికలు కూడా కొరవడటం (సెడెంటరీ) అనే జీవనశైలి వల్ల ఈ ముప్పు యువతలో మరింతగా పెరుగుతోంది. ♦ ఈ అంశాలన్నీ కలగలసి చాలా చిన్నవయసులోనే గుండెపోటు ముప్పును తెచ్చిపెడుతున్నాయి. - డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
శభాష్ కిరణ్..
టేకుమట్ల(రేగొండ): గుండెపోటుతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడికి పోలీస్ కానిస్టేబుల్ సీపీఆర్ ద్వారా ప్రాణం పోశాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్లో పనిచేసే వంశీ (35) నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్క సారిగా గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న బ్లూకోట్ కానిస్టేబుల్ కిరణ్ వెంటనే అతనికి సుమారు 15 నిమిషాలపాటు పీసీఆర్ నిర్వహించగా తిరిగి శ్వాస తీసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పోలీస్ వాహనంలో పరకాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి సీపీఆర్‌తో తిరిగి ప్రాణం పోసిన పోలీసులను స్థానిక ప్రజలు అభినందించారు. -
ఇక సీపీఆర్లోవిస్తృత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన ఒకరికి ఒక ట్రాఫిక్ పోలీసు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేసి అతని ప్రాణాలను కాపాడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత ట్రాఫిక్ పోలీసును అభినందించారు. అంతేకాదు.. ఇలాంటి ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల ప్రాణాలు కాపాడటంపై దృష్టి సారించారు. వచ్చే వారం నుంచి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాలు, జిమ్‌లలో ఎంపిక చేసినవారికి, 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా గుండె ఆగి (సడన్ కార్డియాక్ అరెస్ట్) చనిపోతున్న సంఘటనలు పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఏటా గుండె సంబంధిత వ్యాధులతో రెండున్నర లక్షల మంది చనిపోతున్నారు. వీటిల్లో సడన్ కార్డియాక్ అరెస్టు కేసులు కూడా ఉన్నాయి. గతంలో 40 ఏళ్లు దాటిన వారిలోనే ఇలాంటివి సంభవించేవి. కానీ ఇప్పుడు యువతీయువకుల్లోనూ సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె అకస్మాత్తుగా ఎందుకు ఆగిపోతుంది? ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడటం, గుండె కండరం దళసరిగా ఉండటం, కుటుంబీకులకు ఈ రకమైన చరిత్ర ఉండటం, ఒత్తిడి వంటి ఏదో ఒక కారణంతో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే గుండె మొత్తం ఒకేసారి పని చేయడం ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలొదులుతారు. జంక్ ఫుడ్, స్థూలకాయం, ధూమపానం, మితిమీరిన మద్యపానం, మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం కారణంగా ఎలాంటి గుండె వ్యాధి లేనివారు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ బారినపడుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తే కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడే అవకాశం ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్న వారు వెంటనే సీపీఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ సులభంగా చేసేందుకు వీలున్న టెక్నిక్. కానీ అదేమిటో, ఎలా చేయాలో ఏ కొద్దిమందికో తప్ప చాలామందికి తెలియకపోవడం వల్ల బాధితులు కళ్లెదుటే చనిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. బాధితుల్లో 2 నుంచి 5 శాతం మందికే మన దేశంలో సీపీఆర్ అందుతోంది. సీపీఆర్ చేస్తే ఐదుగురిలో ఒకరు బతుకుతారు. మన దేశంలో పెద్ద ఆసుపత్రుల్లో తప్ప చిన్న ఆసుపత్రుల్లోని సిబ్బందికి కూడా సీపీఆర్‌పై సరైన శిక్షణ లేకపోవడం గమనార్హం. తెలంగాణలో 933 పీహెచ్‌సీలు ఉన్నాయి. అలాగే అనేకచోట్ల సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నా చాలామంది నర్సులు, ఇతర సిబ్బందికి సీపీఆర్ చేయడం తెలియదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీపీఆర్ అంటే.. ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలిపోతే వెంటనే సమీపంలో ఉన్నవారు రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కాలి. అలా 20–30 సార్లు చేయాలి. తర్వాత రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గట్టిగా గాలి ఊదాలి. ఇలా రెండుమూడు సార్లు చేయాలి. దీన్నే సీపీఆర్ అంటారు. ఇలా చేయడంపై శిక్షణ ఇవ్వాలనే ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. సీపీఆర్ వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించడం ద్వారా ప్రాణాలు కాపాడే వీలుంటుంది. -
బాలరాజుకు సీపీఆర్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్
-
అన్ని కాలేజీల్లో సీపీఆర్ శిక్షణ ఇవ్వాలి: గవర్నర్
పంజగుట్ట(హైదరాబాద్): కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణను ఒక జీవితాన్ని కాపాడే మంచిపనిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభివర్ణించారు. విదేశాల్లో 60 నుంచి 65 శాతం సీపీఆర్ శిక్షణ పొందిన వారుంటే భారత్‌లో కేవలం 2 శాతం ఉండటం బాధాకరమన్నారు. ప్రతీ కాలేజీలో సీపీఆర్ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం రాజ్‌భవన్ సంస్కృతిహాల్లో గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్, గాంధీ మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయన్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ హ్యాండ్స్ ఓన్లీ సీపీఆర్’పేరుతో రాజ్‌భవన్ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు సీపీఆర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ ఈ కార్యక్రమంలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లింగమూర్తి పాల్గొన్నారు. -
ఆఫీసులో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్‌తో ప్రాణం నిలిపిన ఐఏఎస్
-
Video: ఐకియాలో గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్‌తో నిమిషాల్లో..
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండెపోటుకు గురవుతున్నారు. అకస్మిక గుండెపోటులో అర్థాతరంగా తనువు చలిస్తున్నారు. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి సరైన సమయానికి కార్డియో పల్మనరీ రిసిటేషన్( సీపీఆర్)చేస్తే బతికే అవకాశం ఉంటుంది. తాజాగా కర్ణాటలో ఇలాంటి ఘటనే జరిగింది.బెంగళూరు ఐకియాలో షాపింగ్‌కు వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. అతను ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోవడంతో అక్కడున్న వారంతా భయపడిపోడిపోయారు. అయితే అదే సమయంలో షాపింగ్‌కు వచ్చిన డాక్టర్(ఆర్థోపెడిక్ సర్జన్) వెంటనే స్పందించాడు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. బాధితుడి ఛాతీపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ కొడుకు రోహిత్ డాక్ కొడుకు ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. My dad saved a life. We happen to be at IKEA Bangalore where someone had an attack and had no pulse. Dad worked on him for more than 10 mins and revived him. Lucky guy that a trained orthopedic surgeon was shopping in the next lane. Doctors are a blessing. Respect !!! pic.twitter.com/QXpXTMBOya — Rohit Dak (@rohitdak) December 29, 2022 దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. సరైన సమయానికి ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ను అభినందిస్తున్నారు. రోగిపట్ల డాక్టర్ చేసిన కృష్టి, అంకితభావాన్ని కొనియాడుతున్నారు. అతడి ఒకరి ప్రాణం కాపాడటం కన్నా సంతృప్తి ఇంకేముంటుంది అంటూ ప్రశంసిస్తున్నారు. సకాలంలో వైద్య సాయం అందించి మృత్యువు నుంచి కాపాడి కొత్త జీవితాన్ని అందించాడు. అతనికి ధన్యవాదాలు చెప్పండంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
Viral Video: గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీస్
భోపాల్: రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళా ఎస్ఐ. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. మహిళా ఎస్ఐ పేరు సోనం పరషార్. రొటీన్ చెకింగ్‌లో భాగంగా రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.. అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అయితే అతడు తీవ్రంగా ఇబ్బందిపడటం చూసి సీపీఆర్ చేసింది. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. హుటాహుటిన అతడ్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ग्वालियर: "राहगीर को आया हार्ट अटैक, लेडी पुलिस ने CPR दे बचाई जान।" लोग ट्रैफिक सूबेदार सोनम पराशर की कर रहे जमकर तारीफ।#gwalior #CPR #heartattack pic.twitter.com/qhrrSF2mwh — The Hint News (@TheHintNews) December 13, 2022 అయితే సదరు వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ఉండకపోతే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అయ్యేదని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
HYD: కరెంట్ షాక్‌తో కుప్పకూలితే.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిబద్ధతను, అంతకు మించి సమయస్ఫూర్తిని కనబరిచే ఉద్యోగులను అభినందించకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటనే నగరంలో ఒకటి జరిగింది. కరెంట్ షాక్‌తో కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాల్ని.. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు శంకర్. డ్యూటీలో ఉండగా.. రోడ్ నెంబర్ 1లోని జీవీకే హౌజ్ మెయిన్ గేట్ ముందర ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో పడిపోయాడని సమాచారం అందుకున్నాడు. కరెంట్ బాక్స్‌కి చెయ్యి తగిలి అతను షాక్‌కి గురయ్యాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి అతన్ని కాపాడాడు శంకర్. ఆపై ఆంబులెన్స్‌లో అతన్ని ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. ఒక ప్రాణం కాపాడిన శంకర్ అక్కడున్న వాళ్లతో పాటు అధికారులు సైతం అభినందిస్తున్నారు. #HYDTPweCareForU Today, Sri Shanker PC of Banjara Hills Tr. PS, while performing duty received information that one person fell down due to Electric shock near GVK House main gate. Immediately PC Shanker rushed to the spot, performed CPR to the victim n saved his life.#savelife pic.twitter.com/XqxoSwhmEl — Hyderabad Traffic Police (@HYDTP) November 22, 2022 -
అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి యాత్రలో పాల్గొన్న ఓ వ్యక్తి ప్రాణాన్ని పోలీస్ అధికారి నిలబెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పాదయాత్ర కొనసాగుతుండగా.. ఓ వ్యక్తి గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. దీంతో అక్కడున్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్ వారి వద్దకు రాలేని పరిస్థితి ఎదురైంది. ఇంతలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న సీఐ త్రినాథ్ వేగంగా స్పందించారు. సీపీఆర్ చేయడంతో అతని ప్రాణం లేచి వచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఆపద సమయంలో వేగంగా స్పందించి ప్రాణం నిలబెట్టిన సీఐ త్రినాథ్‌ను అక్కడున్నవారంతా ప్రశంసించారు. -
జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ దీంతో బేగంపేట మహిళా పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు. -
గుర్తింపులేని పార్టీలపై ఐటీ కన్ను.. దేశవ్యాప్తంగా 110 ప్రాంతాల్లో దాడులు
న్యూఢిల్లీ: రిజిస్టర్ అయినా గుర్తింపులేని రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఆదాయ పన్ను శాఖ మూకుమ్మడి దాడులు జరిపింది. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లోని 110 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. చట్టవ్యతిరేక మార్గాల్లో పొందిన నిధుల గురించీ దర్యాప్తు కొనసాగుతోంది. నమోదైన గుర్తింపులేని రాజకీయ పార్టీలు పన్ను ఎగివేతకు పాల్పడ్డాయని, వాటి చట్టవ్యతిరేక ఆర్థిక లావాదేవీల గుట్టుమట్లు తేల్చేందుకు కేసులు నమోదుచేసి ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్), ఎక్స్‌ఫామ్ ఇండియా, ఒక మీడియా ఫౌండేషన్ కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. విదేశీ నిధుల(నియంత్రణ)చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై దాడులు చేశారు. రాజకీయ పార్టీల సారథులు, పార్టీలతో సంబంధమున్న సంస్థల ఆదాయ వనరులు, వ్యయాలపై అధికారులు ఆరాతీస్తున్నారు. నేరుగా తనిఖీచేసినపుడు ఆయా పార్టీలు మనుగడలో లేవని తేలడంతో 198 పార్టీలను ఈసీ ఇటీవల ఆర్‌యూపీపీ జాబితా నుంచి పక్కన పెట్టి ఐటీ శాఖకు సమాచారమిచ్చింది. నగదు విరాళాలు, కార్యాలయాల చిరునామాల అప్‌గ్రేడ్, పదాధికారుల జాబితా ఇవ్వడం, పారదర్శకత పాటించడంలో విఫలమైన 2,100 పార్టీలపై ఈసీ చర్యలు తీసుకుంటోంది. -
సీపీఆర్ చేస్తే బతికేవారేమో
కోల్‌కతా/ముంబై: గుండెపోటుతో మరణించిన ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే)కు సకాలంలో సీపీఆర్ చేసుంటే ప్రాణాలు నిలిచేవని కోల్‌కతా వైద్యులు అభిప్రాయపడ్డారు. ‘‘ఆయన గుండెలో ఎడమవైపు ధమనిలో 80 శాతం బ్లాకేజీ ఉంది. మిగతా ధమనులు, రక్తనాళాల్లోనూ చిన్నచిన్న బ్లాక్‌లున్నాయి. చాలా రోజులుగా ఈ సమస్య ఉన్నట్టుంది. దీనికి తోడు లైవ్ షోలో ఉద్విగ్నంగా గడపటంతో గుండెకు రక్తం సరిగా అందక మరణానికి దారితీసింది. స్పృహ కోల్పోగానే సీపీఆర్ చేసుంటే బతికేవారు’’ అని ఒక వైద్యుడు పీటీఐకి చెప్పారు. కేకే యాంటాసిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా తీసుకున్నట్టు పోస్టుమార్టంలో తేలింది. గుండెనొప్పిని అజీర్తిగా భావించి వాటిని వాడి ఉంటారని వైద్యులు చెప్పారు. కోల్‌కతా నుంచి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఛాతిలో నొప్పిగా ఉందని, చేతులూ భుజాలూ లాగుతున్నాయని చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. అభిమానుల కన్నీటి నడుమ కేకే అంత్యక్రియలు ముంబై వెర్సొవా హిందు శ్మశానవాటికలో గురువారం జరిగాయి. కుమారుడు నకుల్ అంతిమ సంస్కారం నిర్వహించారు. శ్రేయఘోషల్, అల్కాయాజ్ఞిక్, హరిహరన్, సలీమ్ మర్చంట్ వంటి సింగర్లు నివాళులర్పించారు.