ఓ మనిషికి ప్రాణం పోసిన యువతి | A race against death! Female student rescues elderly man at railway station | Sakshi
Sakshi News home page

ఓ మనిషికి ప్రాణం పోసిన యువతి

Published Mon, Jul 23 2018 10:13 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

చైనాలో ఓ యువతి సమయస్పూర్తి ఓ మనిషి ప్రాణాలను కాపాడగలిగింది. చైనాలోని జింజూ సమీపంలోని రైల్వే స్టేషన్‌లో 81 ఏళ్ల వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్నో యువతి వెంటనే స్పందించింది. వృద్ధుడిని పడుకోబెట్టి, అతని పై మోకాళ్ల మీద కూర్చుని రెండుచేతులనూ కలిపి బలంగా అతని ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కింది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించింది. ఇలా అరగంట పాటూ ఈ ప్రక్రియను కొనసాగించింది. సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సీటేషన్) ప్రక్రియ ద్వారా కుప్పకూలిన మనిషికి తిరిగి ప్రాణం పోసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement