యువకుడి ప్రాణాన్ని కాపాడిన హోంగార్డు
లంగర్‌హౌస్: గుండెపోటు వచ్చి రోడ్డుపై పడిపోయిన ఓ యువకుడికి ట్రాఫిక్ హోంగార్డు సీపీఆర్ చేసి బతికించిన ఈ ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానల్‌నగర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. సాలార్జంగ్ కాలనీలో నివసిస్తున్న మొహమ్మద్ ఖలీలుద్దీన్ (36) వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. గురువారం సాయంత్రం విధుల్లో భాగంగా గచి్చ»ౌలికి వెళ్లడానికి నానల్‌నగర్ బస్టాప్‌లో వేచి చూస్తున్నాడు.
ఆ సమయంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతడు కింద పడిపోయాడు. అక్కడ ఉన్నవారు బాధితుడి వద్దకు వెళ్లడానికి సాహసించలేదు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న లంగర్‌హౌస్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు సుబ్బారెడ్డి వెంటనే స్పందించాడు. గుండెపోటుతో కిందపడిపోయిన ఖలీలుద్దీన్‌కు సీపీఆర్ చేసి బతికించాడు. అనంతరం దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరి్పంచాడు. ప్రస్తుతం ఖలీలుద్దీన్ కోలుకున్నాడు. సీపీఆర్‌తో యువకుడి ప్రాణాన్ని కాపాడిన సుబ్బారావును ఏసీపీ ధనలక్షి్మ, ఇన్‌స్పెక్టర్ అంజయ్య అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment