Traffic home guards
-
సీపీఆర్‌తో ఊపిరి పోశాడు!
లంగర్‌హౌస్: గుండెపోటు వచ్చి రోడ్డుపై పడిపోయిన ఓ యువకుడికి ట్రాఫిక్ హోంగార్డు సీపీఆర్ చేసి బతికించిన ఈ ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానల్‌నగర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. సాలార్జంగ్ కాలనీలో నివసిస్తున్న మొహమ్మద్ ఖలీలుద్దీన్ (36) వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. గురువారం సాయంత్రం విధుల్లో భాగంగా గచి్చ»ౌలికి వెళ్లడానికి నానల్‌నగర్ బస్టాప్‌లో వేచి చూస్తున్నాడు. ఆ సమయంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతడు కింద పడిపోయాడు. అక్కడ ఉన్నవారు బాధితుడి వద్దకు వెళ్లడానికి సాహసించలేదు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న లంగర్‌హౌస్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు సుబ్బారెడ్డి వెంటనే స్పందించాడు. గుండెపోటుతో కిందపడిపోయిన ఖలీలుద్దీన్కు సీపీఆర్ చేసి బతికించాడు. అనంతరం దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరి్పంచాడు. ప్రస్తుతం ఖలీలుద్దీన్ కోలుకున్నాడు. సీపీఆర్‌తో యువకుడి ప్రాణాన్ని కాపాడిన సుబ్బారావును ఏసీపీ ధనలక్షి్మ, ఇన్స్పెక్టర్ అంజయ్య అభినందించారు. -
ట్రాఫిక్ హోంగార్డుపై ఆటో వాలా దాడి
బంజారాహిల్స్: రాంగ్రూట్లో వస్తున్నావని ప్రశ్నించిన ట్రాఫిక్ హోంగార్డుపై ఆటోవాలా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. హోంగార్డును ఉరికించి తీవ్రంగా కొడుతూ బండరాయితో హత్య చేసేందుకు యతి్నంచిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్యాల మెహర్ రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ హోంగార్డు జయప్రకాష్ కృష్ణానగర్ ఇందిరానగర్ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆటోడ్రైవర్ ఎండీ ఒమర్ షరీఫ్ ఇందిరానగర్ గడ్డ నుంచి రాంగ్రూట్లో కృష్ణానగర్ వైపు వస్తున్నాడు. ఇదేం పద్ధతి అని, రాంగ్రూట్లో ఎందుకు వస్తున్నావని హోంగార్డు ప్రశ్నించాడు. నన్నే ఆపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆటోడ్రైవర్ షరీఫ్.. హోంగార్డుపై విచక్షణారహితంగా పిడిగుద్దులతో గాయపర్చాడు. నిందితుడి నుంచి తప్పించుకోవడానికి ప్రయతి్నంచిన హోంగార్డును వెంబడించి చితకబాదాడు. అందరూ చూస్తుండగానే అక్కడ ఉన్న బండరాయిని ఎత్తుకుని హోంగార్డును హత్య చేసేందుకు యత్నించగా బాధితుడు త్రుటిలో తప్పించుకుని నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంటల వ్యవధిలోనే పరారీలో ఉన్న ఆటోడ్రైవర్‌ను పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 132, 121, 125 (ఏ), 126 (2), 119, ఎంవీయాక్ట్ 177 కింద కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఎవరిది..? డాక్యుమెంట్లు ఎవరి పేరున ఉన్నాయి..?
హైదరాబాద్: ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా దుర్భాషలాడిన సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్ జాన్‌బీని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. గత నెల 24న రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తాలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హోంగార్డు గొడుగు విఘ్నేష్ కారులో ఓ యువతి రాంగ్రూట్లో వస్తుండగా అడ్డుకున్నాడు. . దీంతో రెచ్చిపోయిన ఆమె హోంగార్డు విఘ్నేష్ పై దాడి చేయడమేగాక దుస్తులు చించేసి అడ్డువచి్చన పోలీసులను కూడా దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న పోలీసులను ఆటంకం కలిగిస్తూ నోటికొచి్చనట్లు తిట్టడంతో పాటు న్యూసెన్స్‌కు కూడా పాల్పడింది. అదే రోజు రాత్రి హోంగార్డు విఘ్నేష్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతిని సినీనటి సౌమ్యాజాను అలియాస్ షేక్జాన్బీగా గుర్తించి ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు బుధవారం ఉదయం ఆమె నివాసానికి వెళ్లి విచారణ కోసం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఆమెకు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఆమె తరపు న్యాయవాదులు పోలీసులకు చూపించారు. అప్పటికప్పుడు ఆమెకు 41ఏ నోటీసు ఇచ్చి రెండు గంటల పాటు విచారించారు. ఆ రోజు నడిపిన జాగ్వార్ కారు ఎవరిది, కారుకు సంబంధించిన డాక్యుమెంట్లను మూడు రోజుల్లో చూపించాలన్నారు. అలాగే మెడిసిన్ కోసం వెళుతున్నట్లుగా ఆమె చెప్పిందని, మెడిసిన్ ప్రిస్కప్షన్ కూడా చూపించాలని ఆదేశించారు. ఆ రోజు రాంగ్రూట్లో వెళ్లడానికి గల కారణం, పోలీసులపై ఎందుకు దుర్భాషలాడారు, హోంగార్డును ఎందుకు అడ్డుకున్నారు అన్న విషయాలపై ఆమెను ప్రశి్నంచారు. మొత్తం ఎనిమిది ప్రశ్నలు సంధించిన పోలీసులు వాటికి జవాబు ఇవ్వాలని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసులో సూచించారు. మూడు రోజుల్లో మరోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని, విచారణకు సహకరించాల్సిందిగా ఆమెను ఆదేశించారు. నేను ఎవరిపైనా దాడి చేయలేదు అనంతరం సౌమ్యాజాను మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరిపై దాడి చేయలేదని తెలిపింది. ఆరోజు తాను నడిపిన జాగ్వార్ కారు తన స్నేహితులదని, తాను రాంగ్ రూట్లో వెళ్లిన మాట వాస్తవవేనని, తనది పొరపాటేనని తెలిపింది. తనపై మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని, త్వరలో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. -
HYD: జూబ్లీహిల్స్‌లో మహిళ వీరంగం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో యువతి హంగామా సృష్టించింది. ట్రాఫిక్ హోంగార్డ్‌పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. రాంగ్ రూట్లో వచ్చిన యువతిని హోంగార్డ్ అడ్డుకోగా, యువతి బూతులు తిడుతూ అతని బట్టలు చింపి దాడికి పాల్పడింది. యువతిపై హోంగార్డ్ విగ్నేష్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెత్తబుట్టలో వేసేందుకు యత్నం.. చిన్నారిని రక్షించిన ట్రాఫిక్ హోంగార్డు
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తాగిన మైకంలో ఓ యాచకురాలు ఏడాదిలోపు వయసున్న చిన్నారిని కోణార్క్ థియేటర్ ముందున్న చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నహోంగార్డు రామకృష్ణకు సమాచారం చేరవేశారు. విషయం తెలుసుకున్న హోంగార్డు.. వెంటనే పరుగులు తీసి చిన్నారిని రక్షించాడు. చిన్నారికి సపర్యలు చేసి తల్లి ఒడికి చేర్చాడు. హోం గార్డు రామకృష్ణ చూపిన మానవత్వానికి పనికి అక్కడున్న స్థానికులు అభినందనలు తెలియజేశారు. -
బైకర్‌తో ట్రాఫిక్ హోంగార్డు కుమ్ములాట
సాక్షి, హైదరాబాద్ : తన బైక్ ఫొటో తీశాడన్న కోపంతో ట్రాఫిక్ హోంగార్డుతో వాగ్వివాదానికి దిగాడో వ్యక్తి. ఈ నేపథ్యంలో హోంగార్డు అతడిపై చెయ్యి చేసుకోవటం కుమ్మలాటకు దారితీసింది. ఇద్దరూ నడిరోడ్డుపైనే కలబడి కొట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గగన్ పహాడ్‌కు చెందిన మధుకుమార్ గగన్ పహడ్ నుండి కాటేదాన్ వెళ్లేందుకు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద తన బైక్‌పై పోతున్నాడు. అదే సమయంలో రోడ్డుపక్కన ఉన్న ట్రాఫిక్ హోంగార్డు మధుకుమార్ బైక్ ఫొటో తీశాడు. దీంతో అతడు హోంగార్డు వద్దకు వచ్చి ఫొటో ఎందుకు తీశావని ప్రశ్నించాడు. ( వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్: పెళ్లి క్యాన్సిల్) ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే ఇంతలో హోంగార్డు బైక్ తాళాలు లాక్కోవటానికి ప్రయత్నించాడు. బైక్ తాళాలు ఎందుకు తీసుకుంటున్నావ్ అని ప్రశ్నించాడు మధు. తనను ప్రశ్నించటంతో ఆగ్రహానికి గురైన హోంగార్డు అతడిపై చేయి చేసుకున్నాడు. చేయి చేసుకోవటంతో మధు హోంగార్డుపై కలబడ్డాడు. ఇద్దరూ నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. -
ట్రాఫిక్ హోంగార్డ్‌పై దాడి చేశాడు
-
ప్రేమజంటను కాపాడిన హోంగార్డు
కరీమాబాద్ : రైలు పట్టాల మధ్య నిలబడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ ప్రేమ జంటను ట్రాఫిక్ హోంగార్డు కాపాడిన సంఘటన నగరంలోని హంటర్‌రోడ్డు రైల్వే మినీ బ్రిడ్జి ట్రాక్‌పై జరిగింది. ట్రాఫిక్ హోంగార్డు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని వరంగల్ లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన ప్రేమికులు(పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) బుధవారం ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై నిలబడి ఆత్మహత్య చేసుకునేందుకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు రవి ఇది గమనించి వారిని ఆత్మహత్య చేసుకోవద్దని వారించడంతో పాటు ట్రాక్ మీద నుంచి బలవంతంగా పక్కకు కిందకు తీసుకెళ్లాడు.అక్కడే ప్రేమికులిద్దరికి తనతో పాటు స్థానికులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు హోంగార్డు రవి వివరించారు. ప్రేమపెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్లనే ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లు వారు చెప్పారని రవి తెలిపాడు. కాగా సమయానికి స్పందించి ప్రేమ జంటను కాపాడిన హోంగార్డు రవిని పలువులు అభినందించారు. -
'పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో అందరికి ఆదర్శంగా నిలవాలని ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. అందుకోసం పోలీసు సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్ నగరంలో పోలీసు సిస్టమ్‌లో పాల్గొనే సిబ్బంది కోసం సిస్కోలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీసు శాఖలో 3600 మంది డ్రైవర్లు, 1500 మంది ట్రాఫిక్ హోంగార్డుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తన బడ్జెట్లో పోలీసు శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా పోలీసు వ్యవస్థకు ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఆగస్టు 15 నుంచి పోలీసు సిస్టమ్స్ ప్రారంభం కానుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లతోపాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.