సాక్షి, హైదరాబాద్ : తన బైక్ ఫొటో తీశాడన్న కోపంతో ట్రాఫిక్ హోంగార్డుతో వాగ్వివాదానికి దిగాడో వ్యక్తి. ఈ నేపథ్యంలో హోంగార్డు అతడిపై చెయ్యి చేసుకోవటం కుమ్మలాటకు దారితీసింది. ఇద్దరూ నడిరోడ్డుపైనే కలబడి కొట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గగన్ పహాడ్‌కు చెందిన మధుకుమార్ గగన్ పహడ్ నుండి కాటేదాన్ వెళ్లేందుకు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద తన బైక్‌పై పోతున్నాడు. అదే సమయంలో రోడ్డుపక్కన ఉన్న ట్రాఫిక్ హోంగార్డు మధుకుమార్ బైక్ ఫొటో తీశాడు. దీంతో అతడు హోంగార్డు వద్దకు వచ్చి ఫొటో ఎందుకు తీశావని ప్రశ్నించాడు. ( వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్: పెళ్లి క్యాన్సిల్)
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే ఇంతలో హోంగార్డు బైక్ తాళాలు లాక్కోవటానికి ప్రయత్నించాడు. బైక్ తాళాలు ఎందుకు తీసుకుంటున్నావ్ అని ప్రశ్నించాడు మధు. తనను ప్రశ్నించటంతో ఆగ్రహానికి గురైన హోంగార్డు అతడిపై చేయి చేసుకున్నాడు. చేయి చేసుకోవటంతో మధు హోంగార్డుపై కలబడ్డాడు. ఇద్దరూ నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment