biker
-
జస్ట్ మిస్..!
-
పొగరుబోతుకు ఆర్మీ జవాన్ జవాబు!
ఆర్మీ అంటేనే క్రమశిక్షణకు, కట్టుబాట్లకు పేరు.. బెటాలియన్లోనైనా.. బయటనైనా జవాన్లు పద్ధతి ప్రకారం ఉంటారు. మరి.. తమ చుట్టూ ఉన్నవారు పద్ధతి మీరి కనిపిస్తే... పొగరుగా ప్రవర్తిస్తూంటే...? సహించలేరు కదా? ఈ వీడియోలో కూడా అదే జరిగింది. ఇందులో స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తి డివైడర్‌కు ఆవల.. ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంగా నిలబడటమే కాకుండా.. ఆంబులెన్స్కూ దారివ్వకుండా... పక్క నుంచి వెళ్లాల్సిందిగా పొగరుగా వ్యవహరించాడు. ఈ విషయం కాస్తా.. వెనుక ఉన్న ఆర్మీ వాహనం డ్రైవర్ కంట పడింది. కాసేపు ఊరకున్న.. ఆ వ్యక్తి పొగరుగా చేస్తున్న చేష్టలను ఆ జవాను తట్టుకోలేకపోయాడు. వాహనం నుంచి కిందకు దిగి.. ఆ వ్యక్తి హెల్మెట్‌పైనే ఒక్కటిచ్చుకున్నాడు... ‘‘బుద్ధుందా.. ఎదురుగా ఆంబులెన్స్ వచ్చినా దారి ఇవ్వవా’’ అని గడ్డిపెట్టినట్లు ఉన్నాడు. అయినా ఆ వ్యక్తి పక్కకు జరగలేదు సరికదా.. ఇంకాస్తా దురుసుగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఇక లాభం లేదనుకున్నాడో ఏమో ఆ జవాలు.. వాహనంలో ఉంచిన లాఠీని బయటకు తీసి పని చెప్పబోయాడు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసు... ‘‘మీరు ఉండండి సర్. ఇక నేను చూసుకుంటాను కదా’’ అని సర్ది చెప్పింది.ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియదు కానీ.. @shilpa_cn హ్యాండిల్ కలిగిన ‘ఎక్స్’ ఖాతాదారు ఒకరు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆర్మీ జవాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.Satisfying video 🤌🏻Indian Army 😍 pic.twitter.com/H6nnlehIaD— Shilpa (@shilpa_cn) August 25, 2024 -
రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ మృతి..మరో రైడింగ్ గ్రూప్..!
రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ టాట్యానా ఓజోలినా మృతి చెందింది. టర్కీలో జరిగిన మోటార్ బైక్ ప్రమాదంలో మరణించింది. 38 ఏళ్ల ఈ రష్యన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఎరుపు రంగు బీఎండబ్ల్యూ మోటార్ సైకిల్ని రైడ్ చేస్తూ..ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మరణించింది. టాట్యానా తోపాటు వచ్చిన టర్కిష్ బైకర్, ఒనూర్ ఒబుట్ ప్రాణాలతో బయటపడ్డారు కానీ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలోనే ఉన్నారు. సంఘటనా స్థలంలో ఉన్న మూడో బైకర్‌కి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. టాట్యానా తనమోటార్ బైక్ నడుపుతుండగా సడెన్‌గా మరో రైడింగ్ గ్రూప్ అడ్డురావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేసింది. దీంతో టాట్యానా తన బైక్‌పై నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న ట్రక్‌ని ఢీ కొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఈ ఘెర ప్రమాదం సంభవించిన తీరుపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంగా, సోషల్ మీడియాలో మోటో టాన్యాగా పేరుగాంచిని టాట్యానాకు ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. ఇన్‌స్టాగ్రాంలో 10 లక్షల మంది, యూట్యూబ్‌లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. టాట్యానా ప్రపంచవ్యాప్తంగా సాహసోపేతమైన బైక్ రైడింగ్లు చేస్తుంటుంది. తన చివరి ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్ ప్రవేశానికి అనుమతి లేదని రాసుకొచ్చింది. టాట్యానా ఓజోలినా అందానికి, బైక్ రైడింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మోటార్ సైకిళ్లపై ఉన్న అభిరుచి ఆమెను నిరతరం వార్తల్లో నిలిచేలా చేసింది. ఆమెకు 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. టాట్యానా మృతితో ఒక్కసారిగా ఆమె కుటుంబంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. View this post on Instagram A post shared by #мотоТаня❤️🖤#motoTanya (@tanechkaozolina) (చదవండి: 'ఉమామి దినోత్సవం': ఆరు రుచులు కాకుండా మరో టేస్ట్ గురించి విన్నారా?) -
ఉండాల్సింది ధైర్యం మాత్రమే!
ప్రపంచంలో చాలామంది ఒకే తరహా పనిని ఏళ్లుగా చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కొందరు మాత్రం ఏకకాలంలో ఎన్నో పనులు చేస్తూ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ఇందు గుర్జార్. జైపూర్‌వాసి అయిన 32 ఏళ్ల ఇందు గుర్జార్ సింగిల్ పేరెంట్‌గా తన తొమ్మిదేళ్ల కూతురును చూసుకుంటూ, బ్యాంకు ఉద్యోగం చేస్తూ, అంతర్జాతీయ క్రీడాకారిణిగా, మౌంటెనీర్ బైకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. సవాళ్లను అధిగమిస్తూ ఇందు చేస్తున్న ప్రయత్నం ఒడిదొడుకులను ఎదుర్కొనేవారికి స్ఫూర్తిగా నిలుస్తుంది.‘‘సమస్యలు వచ్చేదే మనలోని శక్తిని గుర్తించడానికి. ధైర్యం తెచ్చుకొని ప్రయత్నిస్తే తిరిగి మనకో కొత్త జీవితం ఏర్పడుతుంది. నా చిన్నతనంలో మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మా నాన్నకు టీ కొట్టు ఉండేది. కానీ, దాని నుంచే ఆయన తన కొడుకులలో ఒకరిని డాక్టర్ని చేసి, మా అందరికీ ఉత్తమవిద్యను అందించడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. చిన్ననాటి నుంచి క్రీడలంటే చాలా ఆసక్తి. రాష్ట్రస్థాయిలో బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడాను. కాలేజీలో స్పోర్ట్స్ ఆప్షన్ లేక΄ోవడంతో నా ఇష్టాన్ని అక్కడితో వదిలేయాల్సి వచ్చింది. గృహహింస మా కమ్యూనిటీలో అమ్మాయిలకు పెళ్ళిళ్లు త్వరగా చేస్తారు. కానీ, నా తల్లిదండ్రుల సహకారంతో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. ఆ వెంటనే పెళ్లి చేశారు. పెళ్లి నా జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. బిడ్డను కనాలని, వరకట్నం తేవాలని... ప్రతిరోజూ ఏదో ఒక విషయం మీద నరకం చూసేదాన్ని. అత్తింటివాళ్లు నా తల్లిదండ్రులకు నా మీద ఏవేవో చాడీలు చెప్పేవారు. పాప పుట్టిన తర్వాత పుట్టింటి నుండి తిరిగి అత్తవారింటికి వెళ్లడానికి భయపడ్డాను. కానీ, పెద్దవారిని కూర్చోబెట్టి, ఒప్పించి తిరిగి తీసుకెళ్లారు. కానీ, అక్కడి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు.నెల రోజుల వ్యవధిలోనే మా అత్తింటిని వదిలి, తిరిగి పుట్టింటికి వచ్చేశాను. ఏడాది కాలం పుట్టింట్లోనే ఉన్నాను. పరిస్థితుల్లో మార్పు రాదని గ్రహించి, విడాకులకు కోర్టులో కేసు వేశాను. ఒంటరిగా బిడ్డను పెంచడం నాకు అంత తేలికైన పనికాదు. ఇంటి నిర్వహణకు, నా ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఇంధనం అవసరం. ఆ మనోవర్తి రూపంలో ఆ ఇంధనం రాబట్టుకోవడం కోసం ఏడేళ్లపాటు విడాకుల కేసుపై పోరాడుతూనే ఉన్నాను. కానీ, న్యాయం జరగలేదు.డిప్రెషన్ నుంచి కోలుకొని... ఆటుపోట్లతో ఉన్న జీవితాన్ని చూసి చాలా బాధపడేదాన్ని. ఒక వ్యక్తి జీవితంలో చెడుకాలం వచ్చినప్పుడు పరిస్థితుల ముందు లొంగిపోతాడు. కానీ, నాకు నేనుగా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలనుకున్నాను. బ్యాంకు ఉద్యోగం సంపాదించుకొని, నాకు నేనుగా జీవించడం మొదలుపెట్టాను.ఫిట్‌గా ఉండేందుకు.. ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే కోవిడ్ వచ్చింది. మొదటి వేవ్‌లో కరోనా బాధితురాలిని అయ్యాను. వాడిన మందుల వల్లనేమో కోవిడ్ తర్వాత బరువు పెరగడం మొదలైంది. దీంతో ఫిట్‌గా ఉండేందుకు రోజూ రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసేదాన్ని. ఆ తర్వాత స్టేడియంకు వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ సైక్లిస్టుల బృందాన్ని కలిశాను. ఆ క్రీడలో పాల్గొనడానికి వయోపరిమితి ఏమీ లేదని తెలిసింది.దాంతో నాలో చిన్న ఆశ కలిగింది. బహుశా విధి నాకు అలాంటి అవకాశం ఇచ్చింది అనుకున్నాను. మొదట్లో రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసే నేను ఈ రోజు 50– 100 కిలోమీటర్లు తిరుగుతున్నాను. యూసీఐ (ఇంటర్నేషనల్ సైకిలిస్ట్ యూనియన్) ఎలిమినేటర్ ప్రపంచకప్‌లో పాల్గొన్నాను. ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్గొని, అంతర్జాతీయ సైక్లిస్టులను కలిశాను.పర్వత బైకర్‌గా...వృత్తిరీత్యా బ్యాంకర్గానే కాకుండా మూడేళ్లుగా మౌంటెన్ బైకర్‌గా కూడా ఉన్నాను. పర్వతాల్లో చేసే సాహసోపేతమైన ΄ోటీల్లో విజేతగా నిలుస్తుండేదాన్ని. ఆ పోటీలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. రెండేళ్ల క్రితం లదాఖ్‌లోని లేహ్‌లో జరగిన యుసిఐ ఎలిమినేటర్ ప్రపంచ కప్‌లో ఎలైట్ మహిళల విభాగంలో భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది.శక్తిని గుర్తించాలి..నా కూతురికి ఇప్పుడు తొమ్మిదేళ్లు. ఆమె కూడా క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందుకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాను. చదువుతోపాటు టాలెంట్‌ను కూడా గుర్తించి, దానిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలని అమ్మాయిలకు చెబుతుంటాను. ఈ నెల పదిన జరిగే రేస్‌లో పాల్గొంటున్నాను. గెలుపు – ఓటమి, విజయం – అపజయం అని చింతించకుండా 100 శాతం శక్తినీ, సామర్థ్యాన్నీ వినియోగించి లక్ష్యాన్ని సాధించి, ఫలితాన్ని భగవంతునికే వదిలేయాలి. ఇంకో విషయం.. ఏదైనా కొత్తగా చేయడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చు. మీకుండాల్సింది ధైర్యం మాత్రమే’’ అంటుంది ఇందు. -
Moushmi Kapadia: ఎడారి చీకటి నుంచి వెన్నెల వెలుగులోకి...
‘మీ బిడ్డ నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని వైద్యులు చెప్పినప్పుడు ఎత్తైన చోటు నుంచి చీకటిలోయల్లో పడిపోయినట్లు తల్లడిల్లి పోయింది . మూడు సంవత్సరాలు డిప్రెషన్ చీకట్లో కూరుకుపోయిన మౌష్మి ఒక్కొక్క అడుగు వేస్తూ వెలుగుదారిలోకి వచ్చింది. ఆట–పాటలతో తనలో ఉత్సాహాన్ని నింపుకొంది. ఆ ఉత్సాహాన్ని శక్తి చేసుకుంది. గా దేశాన్ని చుట్టి వచ్చింది. గా ఎన్నో సాహసాలు చేసింది ఇంటి గడప దాటలేడు అనుకున్న కుమారుడికి ప్రపంచం చూపుతూ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తోంది మౌష్మి కపాడియా... మౌష్మి కపాడియా కుమారుడు ఆర్ఎస్ఎమ్డీ) అని నిర్ధారించిన వైద్యులు ‘ఇది నయం చేయలేని వ్యాధి’ అన్నారు. ఆ బాధ మాటలకు అందనిది. తట్టుకోలేనిది. తనలో తాను ఎంతో కుమిలిపోయింది మౌష్మి. పిల్లాడికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఎలా కేర్ తీసుకోవాలో వివరించారు వైద్యులు. వేదాన్షును తీసుకొని దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రియేష్ దగ్గరకు వెళ్లింది. మూడేళ్ల వయసులో వేదాన్ష్ కు గురయ్యాడు. ఐసీయూలో ఉన్న తన బిడ్డను చూసి కుప్పకూలిపోయింది మౌష్మి. ఆ భయానకమైన రోజు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నట్టు ఉంటుంది. బిడ్డ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. తాను చేయగలిగిందల్లా దూరం నుంచి బిడ్డను చూస్తూ మనసులో ఏడ్వడం మాత్రమే. ఆశ కోల్పోయిన వైద్యులు... ‘దేవుడిని ప్రార్థించండి. మేము మా వంతు ప్రయత్నం చేశాం’ అన్నారు. ఈ మాటలు తనను మరింత కృంగిపోయేలా చేశాయి. వెంటిలేటర్‌పై అయిదురోజులు ఉన్నాడు వేదాన్షు. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒకరు మెరుగైన చికిత్స కోసం ఇండియాకు వెళితే మంచిది అని సలహా ఇచ్చాడు. అతడి సలహా ప్రకారం బిడ్డను తీసుకొని భర్తతో కలిసి ముంబైకి వచ్చింది మౌష్మి. అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్లిన రోజును గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది మౌష్మి. ‘ఇరవై ఏళ్ల క్రితం దుబాయ్‌లో వైద్యసదుపాయాలు అంత బాగాలేవు. శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు లేవు’ అని దుబాయ్‌లో ఆనాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. ముంబైలోని హాస్పిటల్లో కొన్నిరోజులు ఉన్న తరువాత వేదాన్షు పరిస్థితి మెరుగుపడింది. ఆశాదీపం ఏదో కనిపించి ఆ క్షణంలో ధైర్యం ఇచ్చింది. అయితే వైద్యులు మాత్రం... ‘నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని చెప్పారు. బలహీనమైన ఊపిరితిత్తుల వల్ల వేదాన్షు ఎన్నోసార్లు నిమోనియా బారిన పడ్డాడు. ‘ఇంటి నుంచి ఆస్పత్రి–ఆస్పత్రి నుంచి ఇంటికి’ అన్నట్లు ఉండేది పరిస్థితి. కొంత కాలం తరువాత మరో బిడ్డకు జన్మనిచ్చింది మౌష్మి. ఇది మౌష్మి జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. డిప్రెషన్ అనే చీకట్లోకి తీసుకెళ్లింది. ‘అకారణంగా కోపం వచ్చేది. చీటికిమాటికి చిరాకు పడేదాన్ని. తలుపులు గట్టిగా వేసేదాన్ని. నేను డిప్రెషన్లో ఉన్నాను అనే విషయం అప్పుడు తెలియదు. ఇలా ఎందుకు చేస్తున్నాను? అని నా గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు కౌన్సిలింగ్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. అయితే మందుల ప్రభావంతో ఆమె బరువు పెరిగింది. ఆ బరువు మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి’ అని చెప్పారు వైద్యులు. అలా తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. కొత్త జీవితానికి మొదటి అడుగు పడింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆడడం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో తన మూడ్ చేంజ్ అవుతున్నట్లు, ఉత్సాహం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. జుంబా క్లాసులలో కూడా చేరి మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. మూడేళ్లపాటు డిప్రెషన్‌తో పోరాడి బయట పడిన మౌష్మి ఇద్దరు బిడ్డలను కంటి పాపల్లా చూసుకోవాలనుకుంది. ‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని బెస్ట్ మామ్ కావాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. మూడు సంవత్సరాలుగా తనను వెంటాడిన నిరాశానిస్పృహలు, విషాదం కోపం లాంటి వాటి నుంచి బయటపడిన తరువాత పిల్లలతో హాయిగా గడిపే కాలం, పిల్లలే నా ప్రపంచం అనే కల కన్నది. బైక్‌పై దేశాన్ని చుట్టి రావాలి... ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించాలి అనేది తన కల. పీడకలలాంటి జీవితం నుంచి బయటపడ్డ మౌష్మి కపాడియా తన కలను నిజం చేసుకుంది. పర్వతారోహణకు సంబంధించి ఎన్నో సాహసాలు చేసింది. ఇంటికే పరిమితం అవుతాడనుకున్న వేదాన్షుకు ప్రపంచాన్ని చూపింది. ‘విషాదం తప్ప అతడికి తోడు ఏదీ లేదు’ అని ఇతరులు సానుభూతి చూపే సమయంలో ‘నిరంతరం ఆనందమే నా బలం’ అని ధైర్యంగా ముందుకువెళ్లేలా చేసింది. బిడ్డతో కలిసి 21 దేశాలకు వెళ్లి వచ్చిన మౌష్మి కపాడియా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. సవాళ్లను అధిగమించేలా... వేదాన్ష్లో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది. ఓటమికి తలవంచని వేదాన్షు నోటి నుంచి తరచుగా వచ్చే మాట ‘హ్యాపీ ఎబౌట్ ఎవ్రీ థింగ్ అండ్ శాడ్ ఎబౌట్ నథింగ్’ ‘జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు పెడుతుంది. వాటిని అధిగమిస్తామా లేదా అనేదానిపైనే మనం ముందుకు వెళ్లే దారి నిర్ణయం అవుతుంది’ అంటాడు వేదాన్ష్. -
ఘోర ప్రమాదం.. కొంపముంచిన ఓవర్టేక్.. ఏడుగురి మృత్యువాత
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న ఓ కారు ఆటోను, బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 13 మంది గాయపడ్డారు. మొత్తం రెండు బైక్‌లు, ఒక ట్రాక్టర్, ఎస్‌యూవీకారు, ఆటోరిక్షా ధ్వంసమయ్యాయి. కోరాపుట్ జిల్లాలోని బోరిగుమ్మ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బోరిగుమ్మలో సింగిల్ రోడ్డుపై ఒక వైపు నుంచి ఎస్యూవీ కారు, ఆటో రిక్షా వస్తున్నాయి. ఎస్యూవీ వేగంగా దూసుకొచ్చి ఆటోరిక్షాను ఓవర్‌టెక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఆటోతోపాటు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఘటన అనంతరం ఎస్యూవీ కారు అక్కడి నుంచి పరారయ్యింది. ఆటో బోల్తా పడటంతో అందులోని 15 మంది ప్రయాణికులు రోడ్డుపై డిపోయారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించాడు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న 13 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వారిని కోరాపుట్‌లోని ఓ మెడికల్ కాలేజీకి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు మూడు లక్ష చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. చదవండి: బిహార్ పాలిటిక్స్.. నితీశ్ సర్కారు కీలక నిర్ణయం Seven people were killed in an #accident in #Odisha’s Borigumma earlier today. Who is in fault in this video?? 😭😭pic.twitter.com/dE8NBX9CfP — Sann (@san_x_m) January 27, 2024 -
బెంగళూరు: అర్ధరాత్రి రోడ్డుపై ప్రాణభయంతో పరుగులు
సాక్షి, బెంగళూరు: ఓ వ్యక్తి ప్రాణభయంతో పరుగు లు తీస్తుండగా వెనుకే ఓ స్కార్పియో వాహనం అతడిని తరుముతోంది. చివరికి అతడిని బలంగా ఢీకొట్టి అంతే వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నగరంలోని పులకేశి నగర్లో అక్టోబర్ 18వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే జరిగిన దారుణమిది. మృతుడిని అస్గర్‌గా గుర్తించిన పోలీసులు, సాధారణ రోడ్డు ప్రమాద కేసుగా భావించారు. అయితే, మృతుడి స్నేహితుడిచ్చిన సమాచారంతో దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు అమ్రీన్, అతడి వెంట ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు వివాదం కారణంగానే తామీ పనికి పూనుకున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అస్గర్ సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ కాగా, అతడి వద్ద అమ్రీన్ కారు కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి అతడు అస్గర్‌కు రూ.4 లక్షలు బకాయి పడ్డాడు. దీనిపై ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అస్గర్ తనపై దాడి చేశాడంటూ అమ్రీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వెనక్కి తీసుకోవాలని అస్గర్ కోరగా అమ్రీన్ నిరాకరిస్తున్నాడు. ఘటన జరిగిన రాత్రి మాట్లాడుకుందాం రమ్మని అస్గర్‌ను అమ్రీన్ పిలిచాడు. చెప్పినచోటుకు రాగానే ప్లాన్ ప్రకారం అతడిని కారుతో ఢీకొ ట్టి, చంపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ఫోన్లో ఈ ఘటన ఆ సాంతం వీడియో తీశాడని పోలీసులు చెప్పారు. A murder committed openly on the streets of #Bengaluru has been captured on a mobile phone wherein a Scorpio runs over a man who was running to save his life. The incident, which occurred on October 18 at around 12:30 am, was recorded on a passerby's mobile phone in the… pic.twitter.com/ZBahJI0RNX — Hate Detector 🔍 (@HateDetectors) October 31, 2023 పారిస్ రైలులో బెదిరింపులు.. పోలీసు కాల్పులు పారిస్: ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో హిజాబ్ ధరించిన ఓ మహిళ(38) రైలులో ప్రయాణి కులను బెదిరింపులకు గురిచేసింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపి ఆమెను గాయపరిచారు. దక్షిణ పారిస్‌లోని 13వ డిస్ట్రిక్ట్ గుండా వెళ్తున్న సబర్బన్ రైలులో ఓ మహిళ ‘అల్లాహూ అక్బర్’ అని అరుస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, సదరు మహిళను పలుమా ర్లు హెచ్చరించారు. తనను తాను పేల్చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో పోలీసులు ఆమెపైకి కాల్పులు జరిపారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరో గ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలి పారు. ఆమె 2021లోనూ భద్రతా అధికారులను ఇలాగే బెదిరింపులకు గురిచేసిందన్నారు. ఈ సంఘటన తర్వాత మానసిక ఆరోగ్య కారణాలతో కొన్ని రోజులపాటు నిర్బంధంలో ఉంచామన్నారు. తాజా ఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఇజ్రాయెల్– హమాస్ యు ద్ధంతో ఫ్రాన్సులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
ట్రాఫిక్ పోలీసులపై యువతి వీరంగం.. చేయి నరికేస్తా అంటూ బెదిరింపులు
ముంబై: మహారాష్ట్రలో ఓ యువతి హల్చల్ చేసింది. నిబంధనలకు విరుద్దంగా రోడ్డుపై డ్రైవ్ చేయడమే కాకుండా.. బైక్ ఆపిన పోలీసులపై రెచ్చిపోయి ప్రవర్తించింది. ట్రాఫిక్ పోలీసులపై దుర్భషలాడుతూ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. ఈ ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ వద్ద జరిగింది. వివరాలు.. నూపుర్ ముఖేష్ పటేల్ అనే 26 ఏళ్ల ఆర్కిటెక్ట్ దక్షణి ముంబై వైపు అతివేగంతో వెళుతోంది. గుర్తించిన బాంద్రా-వర్లీ సీ లింక్ ట్రాఫిక్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే మహిళ తన బైక్‌ను దిగడానికి నిరాకరించింది. దీంతో పోలీసులుర ఆమెను కిందకు దింపేందుకు ప్రయత్నించగా వారితో వాదించడం ప్రారంభించింది. ‘ఈ రోడ్డు నా తండ్రిది. నేను ట్యాక్స్ కడుతున్నాను. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ పోలీసులను బెదిరించింది. బైకర్‌ను ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోకుండా బైక్‌ను నడిరోడ్డుపై నిలిపి ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగింది. ‘నా బైక్‌పై చేయి పెట్టడానికి ఎంత ధైర్యం.. నీ చేయి నరికేస్తాను’ అంటూ రెచ్చిపోయింది. అంతేగాక ఓ కానిస్టేబుల్‌ను నెట్టేసింది. Meet NUPUR PATEL, joyriding on her motorcycle without a #helmet on the Bandra-Worli Sea Link where two-wheelers are not permitted. She started verbally #abusing the police and even allegedly pointed her cigarette lighter, which was shaped like a #pistol, at the police when asked… pic.twitter.com/wGzuSDaUW8 — ShoneeKapoor (@ShoneeKapoor) September 24, 2023 కాగా ట్రాఫిక్ పోలీసులతో మహిళ వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో ఆమె ప్రవర్తించిన విధానాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. యువతిని మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ప్రాంతానికి చెందిన ఆమెగా గుర్తించారు. బుల్లెట్ బైక్ అక్కడి రియల్ ఎస్టేట్ సంస్థలో రిజిస్టర్ అయి ఉన్నట్లు తేలింది. మరోవైపు యువతిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక విచారణకు హాజరు కావాల్సిందిగా సెక్షన్ 41A కింద ఆమెకు నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
స్మార్ట్ టన్నెల్.. సెల్ సిగ్నల్ దొరక్క ప్రాణం పోయింది!
స్మార్ట్ ఫైర్ మేనేజ్ మెంట్, డిజిటల్ సీసీటీవీ కెమెరా సెటప్.. టోటల్‌గా మోడ్రన్ టెక్నాలజీ సెటప్‌ను సంతరించుకున్న టన్నెల్ అది. కానీ, సమయానికి సెల్‌ఫోన్ సిగ్నల్ దొరకలేదు. ఫలితంగా ఒక నిండు ప్రాణం పోయింది. ఢిల్లీ ప్రగతి మైదాన్ టన్నెల్ వద్ద బుధవారం ఓ టీనేజర్ ప్రాణం పోయింది. ఓ బైకర్ ప్రమాదానికి గురికాగా, అతన్ని రక్షించేందుకు అక్కడున్నవాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కారణం.. సెల్‌ఫోన్ సిగ్నల్ దొరక్క ఆంబులెన్స్ చాలా ఆలస్యంగా రావడం. రాజన్ రాయ్(19) అనే కుర్రాడు.. ప్రగతి మైదాన్ టన్నెల్లో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ నుంచి పడిపోయి.. హెల్మెట్ సైతం పగిలిపోయి తలకు బలమైన గాయమైంది. అది చూసి కొందరు వాహనదారులు ఆగి.. ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ చేయబోయారు. కానీ, టన్నెల్లో సిగ్నల్స్ లేకపోవడంతో అది కుదరలేదు. ఈ లోపు కొందరు బయటకు వెళ్లి.. అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆంబులెన్స్ రాక ఆలస్యమైంది. లేడీ హర్డింగే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ట్రీట్మెంట్ మొదలుపెట్టగానే అతను కన్నుమూశాడు. కాస్త ముందు వచ్చి ఉంటే అతని ప్రాణాలు దక్కేవని తెలిపారు వైద్యులు. అయితే.. టన్నెల్ లోపల సిగ్నల్స్ అందకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసుకు కాల్ కలవలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అంది తమ కొడుకు తమకు దక్కేవాడని రాజన్ తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గతేడాది ఈ టన్నెల్‌ను ప్రారంభించింది. Disclaimer Note: ఈ వీడియో మిమ్మల్ని కలవరపర్చొచ్చు! A biker was killed in a road mishap at Pragati Maidan tunnel in Delhi. #CCTV #cctvfootage #pragatimaidan #Delhi #India #viral #viralvideo #viral2023 #ViralVideos #Accidents pic.twitter.com/TcBJrwhGwr — Anjali Choudhury (@AnjaliC16408461) May 25, 2023 -
ఐడియా అదిరింది గురూ.. నదీ ప్రవాహంలో రిస్క్ అవసరమా?
-
నిర్లక్ష్యంగా ఓవర్టేక్ చేయబోయి..
క్రైమ్: కర్ణాటకలో ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యంగా తన ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఓ బైకర్ ఘోరంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్ తుక్కు తుక్కు కాగా, తీవ్ర గాయాలతో అతను ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. కర్ణాటక ముద్బిద్రిలో ఆల్వా కాలేజీ దగ్గర గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లోంచి బస్సు బయటకు రాగా.. ఆ వెనకాలే వస్తున్న బైకర్, బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. ఇంతలో మరో పక్క నుంచి కారు దూసుకువచ్చింది. బైకర్‌ను బలంగా ఢీ కొట్టి కారు దూసుకెళ్లింది. బైక్ ఎత్తులో ఎగిరి తునాతునకలై దూరంగా పడిపోగా.. అతను రోడ్డు మధ్యలో పడిపోయాడు. కదలకుండా పడిపోయిన అతన్ని స్థానికులు కొందరు పక్కకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా ఓవర్ టేక్ చేయడమే కాదు.. కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఆ బైకర్. సీసీటీవీ ఫుటేజీలో యాక్సిడెంట్ దృశ్యాలు నమోదు అయ్యాయి. Shocking visual from #Karnataka. A #CCTV footage from Alva's college near Mudbidri shows a horrific accident where a biker rams into an oncoming car. @dpkBopanna reports pic.twitter.com/BTCTwFdPJu — Mirror Now (@MirrorNow) April 1, 2023 Video Credtis: Mirror Now -
ఈ భూమ్మీద నూకలున్నాయిరా బిడ్డా ..నీకు!
-
ఫుల్ ట్రాఫిక్..అందరూ చూస్తుండగానే రూ.40 లక్షలు స్వాహా!
అందరూ చూస్తుండగానే ఏ మాత్రం భయం లేకుండా చోరికి యత్నించారు. అదికూడా ఒక బైకర్ని అనుసరించిన ముగ్గురు దుండగులు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు రాగానే సొత్తు చోరీ చేసి ఉడాయించారు. ఈ ఘటన మార్చి1న సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెండు కార్లు వాటి మధ్యలో ఓ బైక్ ఆగి ఉన్నాయి. ఇంతలో ముగ్గురు దుండగులు కామ్‌గా ఆ వాహనదారుడి వద్దకు వచ్చి గమనించడం ప్రారంభించారు. ఇంతలో అతని భూజానికి తగిలించి ఉన్న బ్యాగ్‌ని నెమ్మదిగా ఓపెన్ చేసి సుమారు రూ. 40 లక్షలు కొట్టేశారు. జస్ట్ నాలుగే నాలుగు నిమిషాల్లో డబ్బుల కొట్టేసి జారుకున్నారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాసేపటికి అసలు విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగలోకి దిగిన పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో ఈ ఘటన మొత్తం బయటపడింది. దీంతో పోలీసులు ఆ నిందితుల్లో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని సుమారు రూ. 38 లక్షలు రికవరీ చేశారు. నిందితులను ఆకాశ్, అబిషేక్గా గుర్తించారు. ఆ ముఠా వాహనదారులే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: ఆర్ఎస్ఎస్ ఓ రహస్య సమాజం: రాహుల్ గాంధీ) -
హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్..
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఎస్కార్ట్ వాహనం బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హాసన్ జిల్లా అర్సికెరెలోని గండాసి గ్రామంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి చామరాజనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కేత్రమైన మలే మహాదేశ్వర బెట్ట నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఐతే ప్రమాదం జరిగిన తర్వాత జ్ఞానేంద్ర అతని కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఐతే వ్యక్తిని ఢీకొట్టిన ఎస్కార్ట్ వాహనం ప్రధాన కాన్వాయ్‌లో భాగం కాదని, వారి వాహానాల వెనుకే ప్రయాణించిందని కర్ణాటక హోంమంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..) -
హెల్మెట్‌లో దాక్కున్న ప్రమాదకరమైన పాము.. బుస్ బుస్‌మంటూ..
-
Viral Video: ప్రాణాలను కాపాడిన వ్యక్తితో కొంగ స్నేహం.. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్తోంది
-
బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా..
పాట్నాా: బిహార్ సహర్సా జిల్లాలో ఢిల్లీ తరహా ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఆపమని అరుపులు, కేకలు పెట్టినా పట్టించుకోకుండా అలాగే వేగంగా ఆటోను పోనిచ్చాడు. చివరకు ఓ చోట ఆటో ఆపి బైకర్‌ను రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బైకర్ పరిస్థితి విషమంగా ఉందని, అతని కుడి కాలు తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు తెలిపారు. అవసరమైతే కాలును పూర్తిగా తొలగించాల్సి రావచ్చని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డ బైకర్‌ను కోమల్ కిషోర్ సింగ్(25)గా గుర్తించారు. ఇతడు మంగళవారం తన స్వాగ్రామం హేంపూర్ వెళ్తుండగా బిహ్రా బ్రహాం ఆస్థాన్ వద్ద ఆటో ఢీకొట్టింది. దీంతో అతను ఆటో కిందే ఇరుక్కుపోయాడు. అయితే ఆటో డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పారిపోవాలని వాహనాన్ని అలాగే పోనిచ్చాడు. 1.5 కిలోమీటర్లు కిశోర్‌ను ఈడ్చుకెళ్లాడు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు బైకర్‌ను రోడ్డపక్కన పడేసి ఆటోడ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలో జనవరి 1న అంజలి అనే యువతిని కారు ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి దారుణంగా చనిపోయింది. పోలీసులు నిందితులను గంటల్లోనే అరెస్టు చేశారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
రోడ్డు మధ్యలో...హఠాత్తుగా గొయ్యి! అటుగా వచ్చిన బైకర్..
సాక్షి, శివాజీనగర: బెంగళూరులో గుంతల రహదారులతో సతమతమవుతున్న నగరవాసులకు సింక్ హోల్ తరహా ముప్పు ఎదురైంది. ఆకస్మాత్తుగా రోడ్డు మధ్య భాగంలో నేల కుంగిపోగా, ఆ గుంతలోకి బైకిస్టు పడిపోయి గాయపడిన ఉదంతం గురువారం మధ్యాహ్నం సంభవించింది. గత మంగళవారం మెట్రో పిల్లర్ కడ్డీలు కూలిపడి తల్లీ కొడుకు మృతి చెందిన దుర్ఘటన మరువక ముందే ఈ తరహా సంఘటన కలకలం రేపుతోంది. ఏం జరిగిందంటే అశోకనగర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వ్యాప్తిలో జాన్సన్ మార్కెట్ రోడ్డులో రోజులాగానే వాహనాలు వెళ్తుండగా రోడ్డు హఠాత్తుగా కుంగిపోయి 3 అడుగుల వ్యాసం, 3 మీటర్ల లోతుతో గొయ్యి ఏర్పడింది. వేగంగా వెళ్తున్న ఒక బైకిస్టు అదుపుతప్పి పడిపోవడంతో గాయాలు తగిలాయి. అతనిని ఆస్పత్రికి తరలించారు. నడి రోడ్డులో ఏర్పడిన ఈ సింక్ హోల్ అందరికీ ఆందోళన కలిగించింది. సమాచారం అందుకొన్న తూర్పు విభాగపు డీసీపీ కళా కృష్ణమూర్తి స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సంఘటనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఈ రోడ్డు మొత్తాన్ని మూసివేసి ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. భూగర్భంలో మెట్రో రైల్ సొరంగ మార్గం పనుల వల్ల పైన రోడ్డు ఇలా కుంగిపోయిందని అనుమానం ఉంది. (చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?) -
ప్రాణం తీసిన పతంగి దారం.. బైకర్ గొంతు తెగి..
సూరత్: గాలిపటం ఎగరేసే దారం మెడకు చుట్టుకొని ఓ బైకర్ ప్రాణాలు కోల్పోయాడు. మాంజా చాలా పదునుగా ఉంటడంతో అతని గొంతు తెగి చనిపోయాడు. గుజరాత్‌లోని సూరత్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు బల్వంత్ పటేల్(52). కమ్రేజ్‌లోని నవగామ్‌లోని నివాసముంటాడు. వజ్రాల పరిశ్రమలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా శంకర్ నగర్లో ఓ పతంగి దారం అతని మెడకు చుట్టుకుంది. అతను ఎలాగోలా బైక్‌ను ఆపి కిందపడిపోయాడు. మెడ తెగి రక్తం కారుతున్న అతడ్ని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వైద్యులు బల్వంత్ చనిపోయాడని సోమవారం రాత్రి ప్రకటించారు. మాంజా పదునుగా ఉండటంతో గొంతు లోతుగా తెగిందని, ప్రాణాలు కాపాడలేకపోయామని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. ఇంజనీరింగ్ విద్యార్థినిని దారుణంగా కత్తితో.. -
Viral Video: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి..
చెన్నై: తమిళనాడు తూత్తుకూడిలో భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్కు నుంచి వేలాడుతున్న తాడు.. బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో అతను అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బైక్‌పై నుంచి ఎగిరిపడ్డ యువకుడ్ని శ్రీవైకుంఠంకు చెందిన ముత్తుగా గుర్తించారు. అతను కిందపడగానే స్థానికులు వెళ్లి సాయం అందించారు. అదృష్టవశాత్తు ముత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. லாரியில் இருந்து விழுந்த பாசக்கயிறு.. கழுத்தில் மாட்டி தூக்கி வீசப்பட்ட வாலிபர்!!#thoothukudi #accident pic.twitter.com/6MRkUjlFHA — A1 (@Rukmang30340218) December 15, 2022 ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. లోడుపై నుంచి తాడు వేలాడుతున్నా.. దాన్ని పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వాహనాన్ని వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఎదురుగా వచ్చిన బైకర్ మెడకు అది చుట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: రూ.14 లక్షల సుపారీ.. బావమరిది హత్యకు బావ కుట్ర.. -
అమానుషం: నన్నే ఆపుతారా అంటూ... కారుతో తొక్కించి....
ఇటీవల కాలంలో పలువురు వ్యక్తులు చిన్నవాటికే విసుగుపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడోక వ్యక్తి కూడా చిన్న గొడవకే ఆగ్రహంతో చాలా దారుణంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... ఒక వ్యక్తి ఎస్యూవీ కారుతో ఒక ఇరుకైన గల్లీ గుండా వెళ్తున్నాడు. అక్కడే తన ముందు ఉన్న ఒక బైకర్‌తో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఐతే కారు డ్రైవర్ మాత్రం కోపంతో యాక్సిలరేటర్ నొక్కి ఒక్కసారిగా ప్రజలపైకి దూసుకుని పోనిచ్చి... ఇక ఆగకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు. దీంతో ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే సదరు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో వైరల్ అవుతోంది. (చదవండి: ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు) -
ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు
ట్రాఫ్రిక్ నియమాలను ఉల్లంఘించి కొంతమంది పోకిరీలు ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్లపై హల్చల్ చేస్తుంటారు. పోలీసులు వారిని ఛేజింగ్ చేసి పట్టుకునేందుకు యత్నించినా కూడా దొరకకుండా వెళ్లిపోతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తప్పించుకునే క్రమంలో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...అమెరికాలో ఒక వాహనదారుడు నెంబర్‌ప్లేట్ లేకుండా రోడ్డుపై హల్చల్ చేయడంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించారు. ఐతే సదరు వాహనదారుడు పోలీసులకు దొరక్కుండా పారిపోయేందుకు యత్నించే క్రమంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు. దీంతో పోలీసులు అతన్ని నియంత్రించే క్రమంలో టేజర్ అనే ఎలక్ట్రిక్ గన్సాయంతో కాల్పులు జరిపారు. ఐతే ఆ వ్యక్తి ఆ సయంలో తన వీపుకి గ్యాసోలిన్ ప్యాక్‌ని తగిలించుకున్నాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ నుంచే దూకేశాడు. దీంతో పోలీసులు టేజర్‌తో నియంత్రించేందుకు యత్నించారు. అంతే ఒక్కసారిగా ఆ వాహనదారుడు చట్టు భగ్గుమని మంటలు వ్యాపించాయి. ఆ వాహనదారుడు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక యంత్రంతో ఆ మంటలను ఆర్పి తక్షణమే హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తులో సదరు వాహనదారుడిని 38 ఏళ్ల క్రిస్టోఫర్ గేలర్గా గుర్తించారు. అతను ఇన్సూరెన్స్ చేయని బైక్‌పై డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నిర్లక్షపూరితంగా డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. అతను బ్యాక్‌ప్యాక్‌లో ఒక గ్యాలన్ గ్యాసోలిన్‌ని తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. మరికొద్దిరోజుల్లో సదరు వాహనదారుడు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. (చదవండి: డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు) -
ఘోర అగ్ని ప్రమాదం... బస్సు కిందే సజీవ దహనమైన బైకర్లు
పోలీస్ సిబ్బందితో వెళ్తున్న బస్సు బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో ఇంధన ట్యాంకర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటన చప్రా సివాన్ హైవేపై చోటు చేసుకుంది. ఆ బస్సులో బీహార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో వారిలో ఒకరు బైక్‌తో సహా బస్సు కింద ఇరుక్క పోయారు. దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలి అగ్నికీలలు చుట్టుముట్టాయి.ఆ ముగ్గురు వ్యక్తుల బస్సు కిందకు రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు కింద ఇరుక్కన్న బైకర్‌తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో పోలీస్ అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సితాబ్దియారాలో దివగంత రాజకీయ నాయకుడు జయ ప్రకాశ్‌నారాయణ 120వ జయంతి వేడుకల్లో పాల్గోని పోలీస్ సిబ్బంది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. (చదవండి: కుక్క పిల్ల అని తెచ్చుకుంటే.. ) -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్‌పై నుంచి ఎగిరి బస్సు టైర్ కింద..
రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని జరిమానాలు సైతం విధిస్తుంటారు. తాజాగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో కర్నాటక పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ఈ వీడియోలో ఓ బైకర్ స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఓ బస్సు బ్యాక్ టైర్ కిందపడిపోతాడు. అయితే, ఈ సమయంలో బైకర్ ఐఎస్ఐ స్టాండర్డ్ మార్క్ ఉన్న హెల్మెట్‌ను ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో, ప్రతీ ఒక్కరూ విధిగా స్టాండర్ట్ ఉన్న హెల్మెట్‌ను ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಐ ಎಸ್ ಐ ಮಾರ್ಕ್ ಹೆಲ್ಮೆಟ್" ಜೀವರಕ್ಷಕ" Good quality ISI MARK helmet saves life. pic.twitter.com/IUMyH7wE8u — Dr.B.R. Ravikanthe Gowda IPS (@jointcptraffic) July 20, 2022 -
స్కూటర్ని ఢీ కొట్టిన మోటార్ బైక్: షాకింగ్ వీడియో
అతి వేగం ప్రమాదకరం అని చెబుతూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఇంకా ఎక్కడో ఒకచోటా ఏదో ఒక ప్రమాదం జరగుతూనే ఉంటుంది. మనం బాగా నడిపిన అవతల నుంచి వచ్చే వ్యక్తి సరిగి డ్రైవ్ చేయకపోయితే ఇకా అంతే పరిస్థితి. మైనర్లు బండి నడపకూడదని సూచనలు సైతం ఇస్తూన్నా వాటిని సైతం పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలానే ఒక మైనర్ మోటార్ బైక్‌ని అతి వేగంగా నడిపి ఘోరమైన రోడ్డు ప్రమాదానిక కారకుడయ్యాడు. వివరాల్లోకెళ్తే....పాట్నాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మోటార్ బైక్ ఎదురుగా వస్తున్న స్యూటర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పాట్నాలోని గంగా మార్గంలో జరిగింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరికి, బైక్ నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు క్షతగాత్రులను ఆస్పుత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మోటార్ బైక్‌ని నడిపిన వ్యక్తి మైనర్ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. #WATCH | A speeding motorcycle rider hits a scooty coming from the opposite direction at Ganga Pathway in Patna. Scooty riders hospitalised. Police say, "FIR registered. The biker is a minor & hospitalised too. Both vehicles confiscated, investigation on." (Source: Viral video) pic.twitter.com/LyLHK1URa0 — ANI (@ANI) June 8, 2022 (చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల పార్కింగ్‌లో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు, ఫొటోలు వైరల్) -
హోలీ రంగులు ఆరకముందే.. ఆ కుటుంబం ఆశలు ఆవిరయ్యాయి
సాక్షి,శ్రీరాంపూర్(అదిలాబాద్): ఆ ఇంటి ఆశా దీపాలు ఆరాయి. ఎదిగిన కొడుకులు కుటుంబానికి ఆసరాగా ఉంటారని.. పెళ్లి చేస్తే తమ ఇంట్లో మరో పండంటి సంసారం వస్తుందని ఆశపడితే.. రోడ్డు ప్రమాదం అడియాశలు చేసింది. మద్యం మత్తు.. మితిమీరిన వేగం.. వారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. ఉదయం ఆడిన హోలీ రంగులు ఒంటిపై ఆరకముందే సాయంత్రానికి మృత్యు కౌగిలి పాడేపై కుంకుమ రంగు చిందించింది. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద జరిగిన ప్రమాదం ఇద్దరు యువకులను పొట్టన పెట్టుకుంది. వివరాలు ఇలా.. శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీఎం కార్యాలయం జాతీయ రహదారి చౌరస్తా సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. జైపూర్ మండలం రామారావుపేటకు చెందిన బొద్దున నరేశ్ (32) తన బైక్‌పై ఇందారం చెందిన తన స్నేహితుడు తోగేటి ప్రసాద్(31)తో కలిసి శ్రీరాంపూర్ నుంచి తమ స్వగ్రామాలకు వస్తున్నా రు. ఇదే సమయంలో మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి మంచిర్యాలకు వస్తుంది. చౌరస్తాకు వస్తుందనగా ముందు ఉన్న కారును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టారు. దీంతో వెనుకాల కూర్చున్న ప్రసాద్ ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. నరేశ్ బైక్‌తో సహా బస్సు కింద ఇంజన్భాగంలో చిక్కుకుపోయాడు. ఆ వేగంతో బస్సుతో సహా సుమారు 80 మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. నరేశ్, ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై మానస సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు కింద చిక్కుకున్న బైక్‌ను, అందులో కూరుకుపోయిన నరేశ్ మృతదేహాన్ని బయటికి తీయించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల ఆర్టీసీ డీపో మేనేజర్ మల్లేశయ్య, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత సంఘటన స్థలాన్ని సందర్శించారు. బస్సు డ్రైవర్ రమేశ్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్‌లో మద్యం బాటిల్ బైక్‌ను బయటికి తీసిన తర్వాత అందులో మద్యం బాటిల్ లభించగా ఎస్సై స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తు.. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యువకులిద్దరు ఉదయం తమ గ్రామాల్లో హోలీ ఆడారని, సాయంత్రం ఇందారం వద్ద మద్యం తాగారని పేర్కొంటున్నారు. శ్రీరాంపూర్‌లో బిర్యానీ తినేందుకు వచ్చారని కొందరు, స్నేహితులను కలిసి మద్యం విందు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నారని మరికొందరు చెబుతున్నారు. బైక్‌లో దొరికిన మద్యం బాటిల్ ఈ ప్రమాదంలో పగులకుండా ఉండటం గమనార్హం. పెళ్లి సంబంధాలు చూస్తుండగానే.. జైపూర్/శ్రీరాంపూర్: జైపూర్ మండలం రామారావుపేట, ఇందారంలో పండుగ పూట విషాదం నెలకొంది. నరేశ్, ప్రసాద్‌లకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నరేశ్ శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు వాహనాలపై కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నరేశ్ తల్లిండ్రులు జగ్గయ్య–శాంతమ్మ. వీరికి ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. నరేశ్ మూడో వాడు. ఉగాది తర్వాత పెళ్లి చేయాలని చూస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతితో తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది. మరో మృతుడు తొగేటి ప్రసాద్. మంచిర్యాలలోని బంగారుషాపులో గోల్డ్‌స్మిత్‌గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు అమ్మాయి–అనంతరాములు. తండ్రి చిన్నతనంలో మృతిచెందాడు. సోదరి ఉంటే ఇతనే వివాహం జరిపించాడు. వీరిది చాలా పేద కుటుంబం. తల్లి కుమారుడు ప్రసాద్‌కు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. -
Viral Video: రైల్వే ట్రాక్ దాటేక్రమంలో.. చావు తప్పింది.. బైక్ పీస్పీస్ అయింది
Biker narrowly escapes speeding train: రోడ్డు, రైల్వే ట్రాక్ దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వాహనాలు అతి వేగంగా వస్తున్న సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న, తొందర పడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రైల్వే గేట్ వద్ద సిగ్నల్స్ వేసి ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. వివరాలు.. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తుండటం, సిగ్నల్ వేయడంతో గేట్మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా ఆవేశపడి రైలు వచ్చేలోగా గేటును దాటుకొని వెళ్లాలనుకున్నాడు. చదవండి: ఆమె అతడిలా.. అతడు ఆమెలా మారిన జంట ఇది! Smithereens 2022... bike and train🙂🙂🙂 https://t.co/alAgCtMBz5 pic.twitter.com/jBwFDeGGYA — Rajendra B. Aklekar (@rajtoday) February 14, 2022 ఇంతలోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకురావడం గమనించిన ఆ వ్యక్తి.. బైక్‌ను అక్కడ వదిలేసి వెనక్కి వచ్చాడు. రెప్పపాటు క్షణంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ బైక్‌ను బలంగా ఢీకొంటూ ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. దీంతో బైక్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అయితే బైకర్ మాత్రం చావు నుంచి తప్పించుకున్నాడు. చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్ క్లోజ్ చేసి ఉన్నా.. ఎందుకు ట్రాక్ మీదికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు అంటూ మండిపడుతున్నారు. చదవండి: మద్యం మత్తులో తాగుబోతు చేసిన పని... షాక్‌లో పోలీసులు! -
షాకింగ్ వీడియో: సెకను వ్యవధిలో తప్పింది.. చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడు!
నిన్నటి వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి రావడం ఓ సరదా అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూట్టిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే బైకు ప్రయాణం అంటే మజాతో పాటు కాస్త ప్రమాదం కూడా దాగుంటుంది. మరీ కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ మాత్రం వాహనదారుడు అప్రమత్తంగా లేకపోయినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ బైకర్ మృత్యువు అంచులవరకు వెళ్లి వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, లడఖ్‌కు మధ్య మార్గం జోజిలా పాస్‌లో పర్వతాల గుండా ఇద్దరు యువకులు బైకుపై వెళుతున్నారు. అయితే ఆ బైకర్ల కంటే ముందు ఇనుప పైపులతో నిండిన ట్రక్కు వెళ్తోంది. ఇంతలో ఓ బైకర్ ఆ ట్రక్కును ఓవర్టేక్ చేసే ప్రయత్నించబోయాడు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం బురద బురదగా ఉండటం.. ట్రక్ దగ్గరికి వెళ్లగానే బైక్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న లోయలో పడబోయాడు. అదృష్టవశాత్తు అతను బైకుని కంట్రోల్ చేసి కాలు కింద పెట్టి అంతెత్తు పర్వతం నుంచి పడే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియోను అతని వెనుకే ఉన్న మరో బైక్ రైడర్ రికార్డ్ చేశాడు. ఈ ఘటన కొన్ని నెలల కింద జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అలాంటి రైడ్స్ చేసేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: Guinness World Record: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
Eksha Hangma Subba: సూపర్ ఉమన్!
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు విమానాలను కూడా అవలీలగా నడిపేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నైపుణ్యంతో రాణిస్తూంటే ‘ఇక్షా హంగ్మా సుబ్బ’ మాత్రం నాలుగు నైపుణ్యాలతో వందమందిలో ఒక్కటిగా దూసుకుపోతుంది. ఇక్షా హంగ్మా సుబ్బ.. ఏంటీ అనిపిస్తుంది కదూ! అవును ఈ పేరు పలకడానికి, వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నట్టుగానే ఇక్షా వృత్తినైపుణ్యాలు ఒకదానికి ఒకటి పొంతన లేకపోయినప్పటికీ, తనదైన శైలిలో రాణిస్తూ అందరిచేత సూపర్ ఉమన్ అనిపిస్తోంది. బోల్డ్ అండ్ బ్యూటిపుల్‌గా పేరొందిన ఇక్షా.. సిక్కిం పోలీస్ ఆఫీసర్, జాతీయ స్థాయి బాక్సర్, బైకర్, ఎమ్‌టీవీ సూపర్ మోడల్. సిక్కిం రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా సొంబారియా గ్రామంలో ఐతరాజ్, సుకర్ణి సుబ్బా దంపతులకు 2000 సంవత్సరంలో ఇక్షా జన్మిచింది. ఒక సోదరుడు ఉన్నాడు. ప్రైమరీ,సెకండరీ విద్యాభ్యాసం అంతా సొంతూరులోనే పూర్తి చేసింది. తరువాత గ్యాంగ్‌టక్‌లోని బహదూర్ భండారీ కాలేజీలో డిగ్రీలో చేరింది. ఈ సమయం లోనే ఎన్ఎస్ఎస్లోలో చేరింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే ఇక్షాకు నటన అన్నా... మోడలింగ్ అన్నా అమితాసక్తి. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా డిగ్రీ చదువుతూనే పోలీసు ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో సిక్కిం పోలీస్ విభాగంలో చేరింది. 14 నెలల శిక్షణ తరువాత ‘యాంటీ రైట్ ఫోర్స్’ విభాగంలో పోలీస్ ఆధికారిగా చేరింది. ఉద్యోగంలో చేరి, కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతున్నప్పటికీ చిన్నప్పటినుంచి ఉన్న మోడలింగ్ ఆసక్తి వెలితిగా తోచింది తనకు. మిస్ సిక్కిం.. పోలీస్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు వివిధ మోడలింగ్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లలో పాల్గొని గెలిచిన సందర్భాలు, కాలేజీలో ‘మిస్ ఫ్రెషర్’గా టైటిల్‌ను గెలుచుకున్న సందర్భాలు తనకి గుర్తొచ్చేవి. తన గ్రామం నుంచి రాష్ట్రస్థాయి మోడలింగ్ పోటీలలో పాల్గొని మిస్ సిక్కిం టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఇక్షాకు మోడలింగ్‌లోకి వెళ్లేందుకు నమ్మకం కుదిరింది. అక్కడి నుంచి వివిధ రకాల మోడలింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఎమ్‌టీవీ సూపర్ మోడల్ –2 రియాల్టీ షో ఆడిషన్స్‌కు హాజరై సెలక్ట్ అయింది. ఈ సెలక్షన్స్ ద్వారా ఇక్షా గురించి అందరికీ తెలిసింది. మొత్తం పదిహేనుమంది పాల్గొన్న ఈ షోలో మొదట టాప్ నైన్లో చోటు సంపాదించుకుని పాపులర్ అయ్యింది. పోటాపోటీగా జరుగుతున్న ఈ షోలో ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతూ అందర్ని ఆకట్టుకుంటోంది. టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సూపర్ మోడల్‌గా ఇక్షాను పొగుడుతూ ట్వీట్ చేయడం, షో న్యాయనిర్ణేతలు కూడా ఇక్షాను అభినందిస్తుండంతో అంతా ఆమెను అభినందనలలో ముంచెత్తుతున్నారు. ఇక్షా ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శారీరకంగా ఫిట్‌గా ఉండేందుకు ఆటలు బాగా పనికొస్తాయని ప్రోత్సహించడంతో స్థానికంగా నిర్వహించే బాక్సింగ్ తరగతులకు హాజరై బాక్సింగ్ నేర్చుకుని జాతీయస్థాయి బాక్సర్‌గా ఎదిగింది. అలా ఒకపక్క బాక్సింగ్ చేస్తూనే మరోపక్క ఉద్యోగం చేస్తూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ సూపర్ ఉమన్‌గా నిలుస్తోంది. ఇక్షాకు మోడలింగ్‌తోపాటు డ్రైవింగ్ కూడా చాలా ఇష్టం. అందుకే ఆమె కేటీఎమ్ ఆర్సీ 200 మోటర్ బైక్ నడుపుతూ లాంగ్ రైడ్స్‌కు వెళ్తుంటుంది. చిన్న వయసులో ఇన్ని రకాల నైపుణ్యాలతో దూసుకుపోతూ ఎంతోమంది యువతీయువకులకు ప్రేరణగా నిలుస్తోంది ఇక్షా. -
బైకర్పై దాడి.. వ్యక్తి, నెమలి మృతి
తిరువనంతపురం: కేరళలో విషాదం చోటు చేసుకుంది. జనావాసంలోకి వచ్చిన ఓ నెమలి హంగామా సృష్టించింది. ఎగురుతూ వెళ్లి బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తిని తగలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నెమలి మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన బైకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కేరళ అయ్యంతోల్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ప్రమోద్ తన భార్య వీణతో కలిసి బైక్ మీద వెళ్తున్నాడు. ఇంతలో అటుగా ఎగురుతూ వచ్చిన నెమలి.. బైక్ మీద ఉన్న ప్రమోద్ ఛాతీలో పొడిచింది. ఈ క్రమంలో ప్రమోద్ బ్యాలెన్స్ కోల్పోయి.. పక్కనే ఉన్న కంపోజిషన్ గోడకు గుద్దుకున్నాడు. ఈ ఘటనలో నెమలి అక్కడికక్కడే మృతి చెందగా ప్రమోద్, అతడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రమోద్ తీవ్ర గాయాలపాలు కావడంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఓ ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇతర పక్షుల్లాగా నెమళ్లు ఎక్కువ ఎత్తు.. దూరం ఎగరలేవు. అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో నెమళ్లు జనావాసంలోకి రావడం బాగా పెరిగింది’’ అని తెలిపాడు. -
అరాచకం.. స్కూటర్‌ను ఢీకొట్టాడని చితకబాదారు; వీడియో వైరల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక వాహనదారుడిని, అతని మిత్రుడిని నడిరోడ్డుపైనే చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. తమ స్కూటర్‌ను ఢీకొట్టాడని కోపంతో సదరు బండి యజమాని, అతని బంధువులు వారిని రోడ్డుపైనే అడ్డగించి కర్రలతో చితకబాదుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇక వీడియో ఆధారంగా చూసుకుంటే చేతిలో హెల్మెట్ పట్టుకొని ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక వ్యక్తి కర్రతో దాడి చేయగా.. మరో వ్యక్తి అతనిపై ముష్టి యుద్దానికి దిగాడు. ఎవరు చెప్పినా వినిపించుకోకుండా అతనిపై పంచుల వర్షం కురిపించాడు. వాహనదారుడి స్నేహితుడిని కూడా చితకబాదారు. అక్కడే ఉన్న మహిళ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమెను పక్కకు తోసి మరి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ తర్వాత వారిద్దరిని పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ దాడిలో వాహనదారుడి తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని ప్రాణ భయంతో నూతన జంట పరుగు.. వెంటాడి వేటాడి దారుణం दिल्ली के पालम इलाके की साद कॉलोनी में मामूली बात पर रोडरेज में लड़के की पिटाई,बाइक सवार पर रॉड से हमला pic.twitter.com/wHtX3A3pAm — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) June 27, 2021 -
దుర్మార్గుడు.. కుక్క పిల్లలను బైకుతో తొక్కి చంపాడు
-
ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు.. కుక్క పిల్లలను బైకుతో తొక్కి చంపాడు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో క్రూర ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన ఓ వ్యక్తి మూగ జీవుల ప్రాణాలను అన్యాయంగా బలితీసుకున్నాడు. ఆగ్రాలోని సికందరా ప్రాంతంలో రోడ్డు మీద ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లలను బైక్‌పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి బైకుతో ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి చంపేశాడు. ఈ ఘటన జూన్ 14న రాత్రి 10.30 గంటల సమయంలలో జరగగా.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి.. వీడియోను పరిశీలిస్తే.. ముందుగా అతడు రోడ్డు మీద ఆడుకుంటున్న ఓ కుక్క పిల్ల మీదకు బైకు స్పీడ్‌గా ఎక్కించాడు. ఆ ప్రమాదంలో కుక్క పిల్లకు కొంతగాయమవ్వగా. అడ ఉన్న ఆ కుక్క పిల్ల తల్లి, మిగతా కుక్కలన్నీ దాని చుట్టూ చేరాయి. అదే సమయంలో అదే బైకర్ మళ్లీ వెనక్కి వచ్చి.. మరో కుక్క మీద నుంచి తొక్కుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆ రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తోంది. దుండగుడు చేసిన పనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనికరం లేకుండా ప్రవర్తించిన సదరు దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మీద ‘జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం’ కింద కేసు నమోదు చేశారు. చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు? భార్య కోసం ప్రేమగా గజల్ పాడుతున్న భర్త.. కానీ ఆమె మాత్రం! -
బైకర్‌తో ట్రాఫిక్ హోంగార్డు కుమ్ములాట
సాక్షి, హైదరాబాద్ : తన బైక్ ఫొటో తీశాడన్న కోపంతో ట్రాఫిక్ హోంగార్డుతో వాగ్వివాదానికి దిగాడో వ్యక్తి. ఈ నేపథ్యంలో హోంగార్డు అతడిపై చెయ్యి చేసుకోవటం కుమ్మలాటకు దారితీసింది. ఇద్దరూ నడిరోడ్డుపైనే కలబడి కొట్టుకున్నారు. ఈ సంఘటన శంషాబాద్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గగన్ పహాడ్‌కు చెందిన మధుకుమార్ గగన్ పహడ్ నుండి కాటేదాన్ వెళ్లేందుకు నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద తన బైక్‌పై పోతున్నాడు. అదే సమయంలో రోడ్డుపక్కన ఉన్న ట్రాఫిక్ హోంగార్డు మధుకుమార్ బైక్ ఫొటో తీశాడు. దీంతో అతడు హోంగార్డు వద్దకు వచ్చి ఫొటో ఎందుకు తీశావని ప్రశ్నించాడు. ( వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్: పెళ్లి క్యాన్సిల్) ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే ఇంతలో హోంగార్డు బైక్ తాళాలు లాక్కోవటానికి ప్రయత్నించాడు. బైక్ తాళాలు ఎందుకు తీసుకుంటున్నావ్ అని ప్రశ్నించాడు మధు. తనను ప్రశ్నించటంతో ఆగ్రహానికి గురైన హోంగార్డు అతడిపై చేయి చేసుకున్నాడు. చేయి చేసుకోవటంతో మధు హోంగార్డుపై కలబడ్డాడు. ఇద్దరూ నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. -
జస్ట్ మిస్: లేదంటేనా..?
గల్లీ రోడ్డైనా, జాతీయ రహదారైనా ఏదైనా సరే రోడ్లపై రయ్‌రయ్‌మంటూ యమస్పీడ్‌తో బండ్లు నడుపుతారు చాలామంది. ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిమిషం కూడా ఓపిక పట్టలేరు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఇలాంటి కోవకే చెందుతాడు. ఓ ప్రాంతంలో అధికారులు కాసేపటి వరకు రోడ్డుపై రాకపోకలను ఆపివేశారు. ఏనుగులు రోడ్డు దాటేందుకు గాను వాళ్లు ఈ చర్యలు చేపట్టారు. అయితే అవి దాటేంతవరకు ఆగలేని ఓ వాహనదారుడు నిర్లగా తన బండిని ముందుకు పోనిచ్చాడు. సరిగ్గా అదే సమయానికి ఓ గున్న ఏనుగు రోడ్డు దాటేందుకు వచ్చింది. తృటిలో దాన్నుంచి తప్పించుకుని బండిని ముందుకు పోనిచ్చి బతుకుజీవుడా అనుకున్నాడు. కానీ, క్షణం ఆలస్యమైనా ఏనుగును ఢీకొట్టి అటు దాని ప్రాణంతోపాటు, అతని ప్రాణాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టేవాడే. దీనికి సంబంధించిన వీడియోను పర్వీన్ కస్వాన్ అనే అటవీ శాఖ అధికారి శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఏనుగులు రోడ్డు దాటడం కోసం ఆ రహదారిలో వాహనాలను కాసేపటి వరకు నిషేధించాం. దీనికి వాహనదారులు కూడా సహకరించారు. కానీ అతను మాత్రం అవేవీ పట్టించుకోకుండా ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు. సెకన్ ఆలస్యమైనా అతని పని అయిపోయేదే. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడూ చేయకండి’ అని పేర్కొన్నాడు. నెటిజన్లు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రపంచంలో మనుషులే భయంకరమైన జంతువులు’ అంటూ ఓ నెటిజన్ తన కోపాన్ని కామెంట్లో ప్రదర్శించాడు. ‘కొన్నిసార్లు జనాలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారు, కనీస భద్రత పాటించడం తెలుసుకోండి’ అంటూ మరో నెటిజన్ ఘాటుగానే సూచనలు ఇచ్చాడు. చదవండి: కోవా.. కావాలామ్మా! -
‘దిశ’పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.
జోధ్‌పూర్: హైదరాబాద్‌లో ‘దిశ’ ఉదంతంపై ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా స్పందించారు. ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్ యువతి అంటోంది. మహిళలకు ధైర్యాన్నిస్తూ రాజస్తాన్‌లోని బలోత్రా నుంచి కన్యాకుమారికి 3,200 కిలోమీటర్లు ఆమె ఒంటరిగా స్కూటర్ ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలవనున్నట్లు ఆమె చెప్పారు. ఆదివారం జోధ్‌పూర్‌లో కేబినెట్ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తన మిషన్ గురించి తెలియజేశారు. తనను తాను సైనికురాలిగా భావిస్తున్నానని, ఒంటరిగా ప్రయాణించడానికి భయపడనని అన్నారు. తాను ఒంటరిగా వెళ్లడానికి నిర్ణయించుకున్నానని, మధ్యలో వెనుకడుగు వేయబోనని నీతూ చోప్రా స్పష్టం చేశారు. ‘దిశ’ హంతకులను వ్యతిరేకంగా పోరాడటమే తన మిషన్ లక్ష్యమన్నారు. -
మధ్యప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు
-
కాకినాడలో రెచ్చిపోయిన ఆకతాయిలు
-
బైకును ఢీకొన్న హీరోయిన్ కారు.. వ్యక్తి మృతి
హిందీతో పాటు తమిళ, పంజాబీ చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జరీన్ ఖాన్. గోవాలో ఈ నటి ప్రయాణిస్తున్న కారు ఢీ కొనడంతో ఓ యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. బైక్ పై వెళుతున్న వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోకపోవటంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్పందించిన జరీన్ ఆ యువకుడిని ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. జరీన్ కారు డ్రైవర్‌పై యాక్సిడెంట్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా 2010లో తెరకెక్కిన ‘వీర్’ సినిమాతో జరీన్ ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ ఏడాది మొదట్లో విక్రమ్‌భట్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన 1921 సినిమాలో జరీన్ నటించారు. -
సిగ్నల్ జంప్.. జస్ట్ మిస్
చైనా: ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా స్కూటీ నడుపుతూ ఓ చైనా వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకొని బతికి బట్టగట్టాడు. రెడ్ సిగ్నల్ ఉందనే స్పృహ లేకుండా సడెన్‌గా సిగ్నల్ జంప్ చేసి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. దీంతో అటువైపు వేగంగా వస్తున్న కారు స్కూటీని ఢీకొట్టడంతో మనోడు గాల్లో చక్కెర్లు కొడుతూ కింద పడిపోయాడు. గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు. ఆ తర్వాత కారును డ్రైవ్ చేస్తున్న మహిళ అతని దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడసాగింది. అనంతరం ఏమి జరిగిందో తెలియలేదు. జంక్షన్ సీసీటీవీ ఫుటేజి నుంచి ఈ వీడియో తీసుకున్న ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. అతనొక ప్రోఫేషనల్ స్టంట్ మ్యాన్ అంటూ తెగ కామెంట్లోస్తున్నాయి. మీరు చూడండి ఓ సారి.. -
సిగ్నల్ జంప్.. జస్ట్ మిస్
-
వామ్మో దుప్పి.. శరవేగంగా బైకర్పై జంప్!
మనుషులు ప్రయాణాల్లో ఉన్నప్పుడు అడవుల్లోని జంతువులు వారికి తారసపడటం.. ఎదురుపడటం అప్పుడప్పుడు జరుగుతూ ఉండేదే. కానీ అరుదైన రీతిలో ఓ భారీ దుప్పి శరవేగంగా దూసుకొచ్చి.. వేగంగా వెళుతున్న బైకర్ మీద నుంచి దూకేసింది. వర్జినీయాలోని అలెగ్జాండ్రియాలో ఒక బృందంపై బైకులపై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైకర్లు వేగంగా దూసుకెళుతున్న తరుణంలో ఓ భారీ దుప్పి రోడ్డును క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. బైకులు వేగంగా వెళుతున్నా.. తనదైన శైలిలో బైకులపై నుంచి శరవేగంగా దుప్పి జంప్ కొట్టి రోడ్డు దాటింది. ఇలా జంప్ చేసే క్రమంలో ఓ బైకర్‌కు దాని కాళ్లు తగిలాయి. దీంతో బైక్‌ను సంభాళించుకోలేకపోయిన అతను కిందపడ్డాడు. వెనుక వస్తున్న మరో బైకర్ దీనిని వీడియో తీశాడు. ఒళ్లు గగుర్పొడిచేరీతిలో దుప్పి చేసిన ఈ జంప్ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వేలమంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. -
అల్వాల్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
నగరలలోని అల్వాల్ హకీంపేట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
వేగంగా వెళ్లి.. నదిలో పడి..
చెన్నై: బైక్ పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడు ఫుట్ పాత్ మీద పాదచారులను తప్పించబోయి గోడను ఢీ కొట్టి నదిలో పడ్డాడు. ఆఫీస్ అవసరాలకు కావసిన వస్తువులను తెచ్చేందుకు డీ ఇన్ఫాంటో(20) బైక్ మీద పూనమల్లే రోడ్డులో అతి వేగంతో వెళ్తున్నాడు. అంపా స్కైవే దగ్గరకు చేరుకోగానే అతడి బైకు అదుపు తప్పి.. అటువైపు వెళ్తున్న పాదాచారుల వైపు వెళ్లసాగింది. దాంతో వారికి ప్రమాదం జరగకుండా తప్పించాలన్న ప్రయత్నంలో ఇన్ఫాంటో నదిని అనుకుని ఉన్న గోడను ఢీ కొట్టి 25 మీటర్ల లోతుకు నీళ్లలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని రక్షించారు. తలకు బలమైన గాయాలు కావడంతో అతనికి ప్రథమ చికిత్స అందించి నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి డ్రైవింగ్ లైసెన్స్, బైక్ కు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బైకర్ మృతి
నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. బైక్‌పై వెళుతున్న క్రమంలో ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో గుర్తింపు కష్టమైంది. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆలమూరు మండలంలోని మూలస్థాన్ అగ్రహారం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై బైక్,సైకిల్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి(30) అక్కడికక్కడే మర ణించాడు. సైక్లిస్టుకు తీవ్ర గాయాలు అయ్యాయి.