Biker narrowly escapes speeding train: రోడ్డు, రైల్వే ట్రాక్ దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వాహనాలు అతి వేగంగా వస్తున్న సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న, తొందర పడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రైల్వే గేట్ వద్ద సిగ్నల్స్ వేసి ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. వివరాలు.. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తుండటం, సిగ్నల్ వేయడంతో గేట్‌మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా ఆవేశపడి రైలు వచ్చేలోగా గేటును దాటుకొని వెళ్లాలనుకున్నాడు.
చదవండి: ఆమె అతడిలా.. అతడు ఆమెలా మారిన జంట ఇది!
Smithereens 2022... bike and train🙂🙂🙂 https://t.co/alAgCtMBz5 pic.twitter.com/jBwFDeGGYA
— Rajendra B. Aklekar (@rajtoday) February 14, 2022
ఇంతలోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకురావడం గమనించిన ఆ వ్యక్తి.. బైక్‌ను అక్కడ వదిలేసి వెనక్కి వచ్చాడు. రెప్పపాటు క్షణంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ బైక్‌ను బలంగా ఢీకొంటూ ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. దీంతో బైక్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అయితే బైకర్ మాత్రం చావు నుంచి తప్పించుకున్నాడు. చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్ క్లోజ్ చేసి ఉన్నా.. ఎందుకు ట్రాక్ మీదికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు అంటూ మండిపడుతున్నారు.
చదవండి: మద్యం మత్తులో తాగుబోతు చేసిన పని... షాక్‌లో పోలీసులు!
Comments
Please login to add a commentAdd a comment