rajadhani express
-
కావలి వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!
సాక్షి, నెల్లూరు: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, వెంటనే రైలును కావలి రైల్వేస్టేష్టన్‌లో నిలిపివేశారు. వివరాల ప్రకారం.. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం కావాలి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే బీ-5 బోగీ వద్ద చక్రాల నుంచి పొగలు వచ్చాయి. అది గమినించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రయాణీకులకు ప్రమాదం తప్పింది. ఇక, స్వల్ప మరమ్మతుల అనంతరం అరగంట తర్వత రైలు బయలుదేరింది. ఇక, రాజధాని ఎక్స్‌ప్రెస్.. నిజాముద్దీన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా కావలి సమీపంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
Viral Video: రైల్వే ట్రాక్ దాటేక్రమంలో.. చావు తప్పింది.. బైక్ పీస్పీస్ అయింది
Biker narrowly escapes speeding train: రోడ్డు, రైల్వే ట్రాక్ దాటే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వాహనాలు అతి వేగంగా వస్తున్న సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న, తొందర పడినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రైల్వే గేట్ వద్ద సిగ్నల్స్ వేసి ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. వివరాలు.. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తుండటం, సిగ్నల్ వేయడంతో గేట్మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా ఆవేశపడి రైలు వచ్చేలోగా గేటును దాటుకొని వెళ్లాలనుకున్నాడు. చదవండి: ఆమె అతడిలా.. అతడు ఆమెలా మారిన జంట ఇది! Smithereens 2022... bike and train🙂🙂🙂 https://t.co/alAgCtMBz5 pic.twitter.com/jBwFDeGGYA — Rajendra B. Aklekar (@rajtoday) February 14, 2022 ఇంతలోనే రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకురావడం గమనించిన ఆ వ్యక్తి.. బైక్‌ను అక్కడ వదిలేసి వెనక్కి వచ్చాడు. రెప్పపాటు క్షణంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ బైక్‌ను బలంగా ఢీకొంటూ ఫాస్ట్‌గా వెళ్లిపోయింది. దీంతో బైక్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. అయితే బైకర్ మాత్రం చావు నుంచి తప్పించుకున్నాడు. చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే గేట్ క్లోజ్ చేసి ఉన్నా.. ఎందుకు ట్రాక్ మీదికి వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు అంటూ మండిపడుతున్నారు. చదవండి: మద్యం మత్తులో తాగుబోతు చేసిన పని... షాక్‌లో పోలీసులు! -
అయ్యో పాపం ఏ కష్టం వచ్చిందో.. రైలుకు ఎదురెళ్లి..
సాక్షి, పెద్దపల్లి: రామగుండం రైల్వేస్టేషన్లో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్టేషన్లో అందరూ చూస్తుండగానే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా సంజయ్ సికింద్రాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తున్నట్లు తెలిసింది. సంజయ్ మానసిక పరిస్థితి సరిగా లేనట్టు బంధువులు పేర్కొన్నారు. -
నెల ముందు నుంచే ‘రాజధాని’ బుకింగ్
న్యూఢిల్లీ: ఇకపై ప్రత్యేక రాజధాని రైళ్లలో టిక్కెట్లు నెల రోజుల ముందు నుంచే అందుబాటులో ఉంటాయని, రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. గతంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు సహా అన్ని కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ కౌంటర్లు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ల ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో వారం ముందు నుంచి మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్‌కు అవకాశం ఉండేది. అది ఇప్పుడు 30 రోజులకు పెంచారు. అయితే, తత్కాల్ బుకింగ్‌కు అవకాశం లేదు. వెయిటింగ్ లిస్ట్ లోని వారిని ప్రయాణానికి అనుమతించరు. ప్రయాణీకుల తొలి జాబితాను రైలు ప్రారంభానికి 4 గంటల ముందు, రెండో జాబితాను 2 గంటల ముందు సిద్ధం చేస్తారు. తొలి, మలి జాబితాలను సిద్ధం చేసే మధ్య కాలంలో కరంట్ బుకింగ్ ఉంటుంది. -
రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి..
తిరువనంతపురం: ప్రయాణికుల కోసం వేసిన ప్రత్యేక రైళ్లను కేరళలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆపాలని రైల్వే శాఖను ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఎయిర్కండిషన్డ్(ఏసీ) రైళ్లకు బదులుగా నాన్ ఎయిర్ కండిషన్డ్ రైళ్లను నడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏసీ రైళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!) ‘మామూలు సమయాల్లో రాజధాని ఎక్స్‌ప్రెస్ కేరళలో ఎన్ని చోట్ల ఆగుతుందే అదేవిధంగా ప్రత్యేక రాజధాని రైళ్లు కూడా ఆగేందుకు అనుమతించాలని రైల్వే శాఖను కోరాం. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా ముప్పు రాకుండా చూసేందుకు కేరళలోకి ప్రవేశించే వరకు రైళ్లను నాన్ స్టాప్ సర్వీసులుగా నడపాలని అడిగామ’ని మీడియాతో విజయన్ చెప్పారు. ప్రస్తుతం తిరువనంతపురం, ఎర్నాకుళం, కోజికోడ్‌లలో మాత్రమే ప్రత్యేక రాజధాని రైళ్లకు స్టాప్ ఉంది. దీంతో ఉత్తర ప్రాంత జిల్లాలైన కాసర్గడ్, కన్నూరు జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు. వీరంతా కర్ణాటకలోని మంగళూరులో దిగి స్వస్థలాలకు చేరుకోవడానికి చాలా ప్రయాస పడాల్సి వస్తోందని రేల్వే శాఖ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో స్టాప్‌లు పెంచాలని ఆయన కోరారు. మరోవైపు రైల్వే స్టేషన్లలో విస్తృతమైన పరీక్షా ఏర్పాట్లు ఏర్పాటు చేస్తున్నామని, రైళ్లలో వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని విజయన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, కేరళ ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే రైల్వే టికెట్ ఉన్నవారు కోవిడ్ -19 జాగ్రత్త పోర్టల్‌లో రాష్ట్ర ఎంట్రీ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అది లేని వారిని స్టేషన్ నుంచే సంస్థాగత నిర్బంధానికి (ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్) తరలించబడతారు. (లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం) -
పట్టాలెక్కిన రైళ్లు.. ప్రయాణానికి రెడీనా!
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో దాదాపు నెలల విరామం తర్వాత ప్రయాణికుల రైళ్లు మంగళవారం పట్టాలెక్కాయి. ఎనిమిది రాజధాని ఎయిర్కండిషన్డ్ రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలు దేరాయి. మొదటి రోజు 8,121 మంది ప్రయాణికులతో రైళ్లు బయలుదేరినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. (రైలు బండి.. షరతులు ఇవేనండీ) బిలాస్పూర్(చత్తీస్‌గఢ్), దిబబ్రూగఢ్(అసోం), బెంగళూరు (కర్ణాటక) నుంచి మూడు రైళ్లు బయలు దేరాయి. దేశరాజధాని ఢిల్లీ నుంచి హౌరా(పశ్చిమ బెంగాల్), రాజేంద్రనగర్(బిహార్), ముంబై సెంట్రల్(మహారాష్ట్ర), అహ్మదాబాద్(గుజరాత్), బెంగళూరు నగరాలకు మరో ఐదు రైళ్లు వెళ్లాయి. ‘కోవిడ్-19 నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పునరుద్ధరణ తర్వాత న్యూఢిల్లీ-బిలాస్పూర్ రాజధాని సూపర్‌ఫాస్ట్ రైలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి రైలు’ అని రైల్వే మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ రైలు ఢిల్లీ నుంచి మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు బిలాస్‌పూర్‌కు బయలుదేరింది. కాగా, సోమవారం సాయంత్రం నుంచి ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకాలను రైల్వే శాఖ ప్రారంభించింది. 24 గంటల్లో 1,69,039 టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. ఏడు రోజుల ముందువరకు మాత్రమే ఆన్‌లైన బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. మొట్టమొదటగా 15 మార్గాల్లో 15 జతల (30 రానుపోను ప్రయాణాలు) రైళ్లను ప్రారంభించారు. ఇతర రెగ్యులర్ ప్యాసింజర్ సర్వీసెస్, మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబ్ అర్బన్ సర్వీసులను ఇంకా ప్రారంభం కాలేదు. (లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం) -
రాష్ట్రానికి వచ్చేవన్నీ..రాజధాని రైళ్లే!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ప్రకటించాక తొలిసారిగా సాధారణ ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సరుకు రవాణా రైళ్లు మాత్రమే నడిచాయి. ఇటీవల వలస కూలీలను తరలించేందుకు శ్రామిక్ రైళ్లను ప్రారంభించారు. సాధారణ ప్రయాణికుల రైళ్లు మాత్రం మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో మన రాష్ట్రం మీదుగా మూడు రైళ్లు తిరగనున్నాయి. ఢిల్లీ–సికింద్రాబాద్, సికింద్రాబాద్–ఢిల్లీ, ఢిల్లీ–బెంగళూరు, బెంగళూరు–ఢిల్లీ, ఢిల్లీ–చెన్నై, చెన్నై–ఢిల్లీ రైళ్లు ఇందులో ఉన్నాయి. బెంగళూరు రైలు సికింద్రాబాద్ మీదుగా, చెన్నై రైలు వరంగల్ మీదుగా నడుస్తాయి. ఇవన్నీ రాజ ధాని రైళ్లే కావటం విశేషం. ఇవి కాకుండా సాధారణ సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎప్పు డు ప్రారంభించాలనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. (చదవండి: హైదరాబాద్‌కు చేరుకున్న‘వందేభారత్’ ఫ్లైట్) ప్రత్యేక రైళ్లు ఇవే... న్యూఢిల్లీ–సికింద్రాబాద్ ఏసీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ రైలు (02438) ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–న్యూఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ రైలు (02437) ఈ నెల 20న సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1.15కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి ఢిల్లీ చేరుకుంటుంది. ఇది నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతుంది. బెంగళూరు–న్యూఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (02691) ఈ నెల 12న రాత్రి 8.30కి బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 8.05కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.55కు ఢిల్లీ చేరుకుంటుంది. ఢిల్లీ–బెంగళూరు (02692) స్పెషల్ రైలు 12న రాత్రి 9.15కు ఢిల్లీలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.20కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి 6.30కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40కి బెంగళూరు చేరుకుంటుంది. ఇది అనంతపూర్, గుంతకల్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీలలో ఆగుతుంది. న్యూఢిల్లీ–చెన్నై (02434) రైలు 13న (ఇది ప్రతి బుధ, శుక్రవారాల్లో నడుస్తుంది) సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో బయలుదేరి రెండో రోజు రాత్రి 8.40కి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్–న్యూఢిల్లీ (02433) స్పెషల్ రైలు చెన్నై సెంట్రల్ స్టేషన్లో 15న (ఇది ప్రతి శుక్ర, ఆదివారాలు నడుస్తుంది) ఉదయం 6.35కు బయలుదేరి రెండో రోజు ఉదయం 10.30కి ఢిల్లీ చేరుకుంటుంది. ఇది విజయవాడ, వరంగల్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రాలలో ఆగుతుంది. 15 నిమిషాల్లో టికెట్లు క్లోజ్.. చాలా రోజుల తర్వాత ప్రయాణ అవకాశం రావటంతో బుకింగ్ కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి, ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ కూడా చాలాసేపు తెరుచుకోలేదు. ప్రత్యేక రైళ్లకు సోమవారం సాయంత్రం 4 గంటలకు రిజర్వేషన్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్టు రైల్వే ప్రకటించింది. కానీ సాయంత్రం 7.30 గంటల వరకు కూడా బుకింగ్ ఆప్షన్ ఆన్ కాలేదు. ఏడున్నర సమయంలో ఢిల్లీ–బెంగళూరు రైలు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆ రైలులో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న టికెట్లన్నీ కేవలం 15 నిమిషాల్లో అయిపోయాయి. అదే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో.. బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు గంట సేపట్లో అమ్ముడయ్యాయి. రాత్రి తొమ్మిది దాటే వరకు మిగతా రైళ్ల బుకింగ్స్ ఆప్షన్ తెరుచుకోలేదు. -
కరోనా అనుమానితులపై కేసులు
కాజీపేట రూరల్: బెంగళూరు నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయాణించిన ఇండోనేషియా విహారయాత్రకు వెళ్లి వచ్చిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు కాజీపేట జీఆర్పీ ఎస్సై జితేందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. యూపీకి చెందిన భార్యాభర్తలు రోహిత్‌కుమార్, పూజాయాదవ్ ఇటీవల ఇండోనేసియా విహారయాత్రకు వెళ్లి ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చారు. హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన వీరిద్దరూ స్టాంపింగ్‌తో 21న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో యూపీకి వెళుతుండగా.. కాజీపేటలో దింపిన విషయం విదితమే. కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలులోనూ.. ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి వచ్చిన కరోనా అనుమానితుడు రవికిరణ్ బెంగళూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించగా.. భువనగిరిలో అతడిని దింపారు. అతడిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై జితేందర్ రెడ్డి తెలిపారు. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా కలకలం
కాజీపేట రూరల్: ఇండోనేసియాలో పర్యటించి వచ్చిన దంపతులు క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించి శనివారం రైలు ప్రయాణం చేయడం కలకలం సృష్టించింది. వీరికి అధికారులు వచ్చే నెల 5వ తేదీ వరకు క్వారంటైన్ స్టాంపింగ్ వేయగా.. ఎవరికీ చెప్పకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. కొద్ది దూరం ప్రయాణించాక వారి చేతులపై ఉన్న స్టాంప్‌ను గమనించిన రైల్వే సిబ్బంది, సహ ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదుతో వారిని కాజీపేటలో దింపి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు పంపించారు. ఈ సందర్భంగా రైలు గంటన్నర పాటు కాజీపేటలో ఆగింది. ఇండోనేసియాకు విహారయాత్ర.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన భార్యాభర్తలు రోహిత్ కుమార్, పూజా యాదవ్ ఇటీవల ఇండోనేసియాలో విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం వీరు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. పరీక్షల అనంతరం చేతులపై క్వారంటైన్ స్టాంపులు వేసిన అధికారులు.. 14 రోజుల పాటు నిర్బంధం లో ఉండాలని సూచించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు క్వారంటైన్లో ఉండాల్సి ఉన్నా.. ఎవరికీ చెప్పకుండా శనివారం ఉదయం క్వారంటైన్ కేంద్రం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని బెంగళూరు నుంచి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బీ–3 రిజర్వేషన్ కోచ్‌లో ఎక్కారు. వీరి చేతులపై ఉన్న స్టాంప్‌లను గమనించిన తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జీఆర్పీ, సివిల్ పోలీసులు, అధికారులు.. రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోగానే నిలిపివేసి ఈ దంపతులతో మాట్లాడారు. రైలు దిగాల్సిందే... ఆస్పత్రికి తీసుకెళతామని స్టేషన్ అధికారులు చెప్పగా.. రోహిత్ కుమార్, పూజా యాదవ్ దంపతులు అందుకు నిరాకరించారు. వారిని దింపితేనే రైలును కదలనిస్తామని మిగతా ప్రయాణికులు పట్టుబడ్డారు. అధికారులు ఆ దంప తులకు నచ్చచెప్పి స్టేషన్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌కు పంపించారు. తర్వాత ఆ బోగీని శానిటైజేషన్ చేయించారు. దీంతో ఉదయం 10.30 గంటలకు కాజీపేట చేరుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంతో కాజీపేట నుండి 12 గంటలకు బయలుదేరింది. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. మరో ప్రయాణికుడిపై ఫిర్యాదు ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఒక ప్రయాణికుడికి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని సహచర ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని ఆలేరులో దింపి చికిత్స కోసం అక్కడి ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత కృష్ణా ఎక్స్‌ప్రెస్ కోచ్‌ను శానిటైజర్‌తో శుభ్రం చేసి కాజీపేట వైపు పంపించగా కాజీపేటలోనూ శుభ్రం చేసి తిరుపతి వైపు పంపించారు. -
కోవిడ్: కొత్త జంట పరార్
సాక్షి, కాజీపేట: కరోనా వైరస్ మహమ్మారి ఒకవైపువిజృంభిస్తోంటే.. మరోవైపు బాధ్యతగా ఉండాల్సిన పౌరులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనా అనుమానితులను గుర్తించారు. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యులు చేతికి వేసిన స్టాంప్ (క్వారంటైన్ మార్క్) ను కూడా లెక్క చేయకుండా ఓ కొత్త జంట పలువురి రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టిన వైనం కాజీపేట్ రైల్వేస్టేషన్లో వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణికులు అప్రమత్తంగా కావడంతో అలర్ట్ అయిన అధికారులు ఆ జంటను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట ఈ ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. రైలు ఉదయం 9.45 గంటలకు కాజీపేట స్టేషన్‌కు చేరుకుంది. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఉపయోగిస్తుండగా, సహ ప్రయాణికులు చేతిపై ఉన్న ముద్రను గమనించి టీటీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాజీపేటలో రైలు ఆపి వైద్యులతో సహా ప్లాట్‌ఫాంపైకి వచ్చి వారిద్దరినీ అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వారు ప్రయాణిస్తున్న బీ-3 కోచ్‌లోని ప్రయాణికులను మరో బోగీలోకి పంపించారు. అలాగే బీ-3 కోచ్ ను శానిటైజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5 వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్ వైద్యులు హెచ్చరించినా వైద్యుల మాట వినకుండా వీరి ఢిల్లీకి బయలుదేరారని తెలిపారు. కాగా శనివారం నాటికి దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 271 కి చేరింది. -
స్పీడ్ పెరిగింది.. ట్రైన్ జర్నీ తగ్గింది!
న్యూఢిల్లీ: ఢిల్లీ- ముంబై మధ్య ప్రయాణించే ప్రయాణికులు మునుపటి కంటే 5గంటలు ముందుగానే తమ గమ్య స్థానానికి చేరుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్లకు పెంచాలని భారత రైల్వే సంస్థ యోచిస్తోంది. వేగాన్ని పెంచడంతో ప్రస్తుతం 15.5 గంటలు ఉన్న ప్రయాణ సమయం 10 గంటలకు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత, మిషన్ రఫ్తార్లో భాగంగా ముంబై- ఢిల్లీ మధ్యలో నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, దీంతో ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గుతుందని పశ్చిమ రైల్వే ఒక ట్వీట్లో పేర్కొంది. భారత రైల్వే సంస్థ తన 100 రోజుల కార్యాచరణలో భాగంగా, ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించాలని ప్రతిపాదించింది. ఇందుకుగాను ‘మిషన్ రఫ్తార్’ను 2016-17 రైల్వే బడ్జెట్లో మొదటగా ప్రకటించారు. సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం, రానున్న 5 సంవత్సరాలలో నాన్- సబర్బన్ ప్రయాణీకుల రైళ్ల సగటు వేగాన్ని 25 కిలోమీటర్ల మేర పెంచడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. 'మిషన్ రఫ్తార్' కింద వేగం పెంచడానికి స్వర్ణ చతుర్భుజితోపాటు ఆరు ప్రధాన మార్గాలైన ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా, హౌరా- చెన్నై, చెన్నై- ముంబై, ఢిల్లీ- చెన్నై, హౌరా- ముంబైలను లక్ష్యంగా చేసుకొంది. భారత రైల్వే సంస్ధ గుర్తించిన ఈ ఆరు మార్గాలలో 58 శాతం సరుకు రవాణా, 52 శాతం కోచింగ్ ట్రాఫిక్‌ను, 16 శాతం నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. -
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
భువనేశ్వర్ : ఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ఖంటపడ రైల్వే స్టేషన్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. రైలు చివరి పెట్టె అయిన జనరేటర్ బోగిలో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ బోగిని వేరు చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులేవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. Fire broke out in the power car of New Delhi-Bhubaneswar Rajdhani Express near Khantapada, Odisha. The fire has been brought under control and no casualties or injuries have been reported. As safety measure generator car has been detached. pic.twitter.com/stMB9yz5uf — ANI (@ANI) May 11, 2019 గత నెలలో ఇదే రైలులో కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థతతకు గురయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటికప్పుడు రైలును బొకారో రైల్వే స్టేషన్లో ఆపి అస్వస్థతకు గురైన ప్రయాణికులకు చికిత్స అందించారు. -
కలుషిత ఆహారంతో 20 మందికి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కలుషిత ఆహారం తీసుకోవడంతో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 20 మంది అస్వస్ధతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించేందుకు బొకారో స్టేషన్లో రైలును నిలిపివేశారు. నాణ్యత లేని ఆహారం విక్రయించడంపై ప్రయాణీకులు బొకారో రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. సీనియర్ రైల్వే అధికారులు స్టేషన్‌కు చేరుకుని ప్రయాణీకులకు నచ్చచెప్పి వారికి వైద్య చికిత్స ఏర్పాట్లు చేశారు. కాగా, అనారోగ్యానికి గురైన వారిలో చిన్నారులూ ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి శనివారం సాయంత్రం బయలుదేరిన రైలులో రాత్రి సమయంలో ప్రయాణీకులకు ఇచ్చిన ఆహారం తిన్న వెంటనే పలువురు అసౌకర్యానికి గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు అధికారులకు తెలిపారు. కొందరి ప్రయాణీకుల పరిస్థితి మరింత విషమించడంతో బొకారో రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. గంటపాటు ప్రయాణీకులకు చికిత్స అందించిన అనంతరం రైలు తిరిగి బయలుదేరిందని, ఘటనపై విచారణకు ఆదేశించామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. -
ఆ రైలుకు రెండు వైపులా ఇంజన్లు!
మనకు ఊహ తెలిసినప్పటి నుంచి రైలు అంటే ముందు ఒక ఇంజన్ ఉండి, తర్వాత బోగీలు ఉంటాయి. తాజాగా ఒక ట్రైన్‌కు మాత్రం రెండు వైపులా ఇంజన్లు అమర్చారు. పశ్చిమ రైల్వే ఈ ప్రయోగం చేసింది. బాంద్రా నుంచి ఢిల్లీలోని హజ్రత్‌నిజాముద్దీన్ వరకు వెళ్లే ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు రెండు ఇంజిన్లు అమర్చారు. భారతీయ రైల్వే చరిత్రలో ప్రయాణికుల రైలుకు రెండు ఇంజిన్లు జతచేయడం ఇదే మొదటిసారి. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాక, ప్లాట్‌ఫామ్‌పై రైలు వేగంగా కదిలేందుకు ఆ రెండో ఇంజన్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోల్చుకుంటే రెండు ఇంజిన్లు అమర్చిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్ రెండు గంటల సమయం ఆదా అవుతుందన్నారు. అయితే ఈ ప్రయోగాన్ని ఇంతకుముందు గూడ్స్ రైళ్లలో విజయవంతంగా ప్రయోగించారు. ప్రయాణికుల రైలులోనూ పుష్ అండ్ పుల్ టెక్నిక్(ముందు, వెనక ఇంజన్లు అమర్చడం)ను ప్రవేశపెట్టాలని మధ్య రైల్వే (సెంట్రల్ రైల్వే) జనరల్ మేనేజర్ డి.కె. శర్మ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రయోగాన్ని అమలు చేశారు. ‘వెనక వైపు ఇంజన్‌ను అమర్చినా... ముందువైపు ఇంజన్లో ఉన్న లోకో పైలటే రెండో దాన్ని కూడా ఆపరేట్ చేస్తాడు. వేగం, బ్రేకింగ్ విషయంలో లోకోమోటివ్స్‌ల మధ్య ఇంకా సాంకేతికతను అభివృద్ది పరచాల్సి ఉంద’ ని సెంట్రల్రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) రావినర్ భాకర్ తెలిపారు. -
రైల్వే మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కొన్ని సెక్టార్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో కోచ్‌లను మార్చాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఉన్న అన్ని ఏసీ-2 టైర్ కోచ్‌లను ఏసీ-3 టైర్ కోచ్‌లుగా మార్చబోతోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఏడాది అన్ని ఏసీ-2 టైర్ టైర్ కోచ్‌లను తీసేసి, 250 ఏసీ-3 టైర్ కోచ్‌లను ఇన్స్టాల్ చేయబోతోంది. సీనియర్ రైల్వే అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ-2 టైర్ కోచ్‌లు ఉంటాయి. వాటిని కొంతమంది ప్యాసెంజర్లు మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, దీంతో రైల్వేకు రెవెన్యూ నష్టాలు వస్తున్నట్టు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. మరోవైపు ఏసీ-3 టైర్ కోచ్‌లకు రైళ్లలో భారీ ఎత్తున్న డిమాండ్ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఇవి చేధించి, లాభాలను ఆర్జిస్తున్నాయి. కోచ్‌ల మార్పుతో పాటు రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను కూడా సమీక్షించాలని దేశీయ రైల్వే నిర్ణయించింది. దీని స్థానంలో రెంటల్ శ్లాబులను తీసుకురావాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. ఈ శ్లాబులతో ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను మరింత సరళతరం చేయనుంది. ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను 2016 సెప్టెంబర్‌లో దేశీయ రైల్వే లాంచ్ చేసింది. -
రైల్వే ప్రయాణికులు, ఇక విమానంలో జర్నీ
సాక్షి, న్యూఢిల్లీ : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్ కన్ఫామ్ కాలేదా? ప్రయాణం ఎలా చేయాలి అని ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ ఆందోళనేమీ అవసరం లేదట. టిక్కెట్ కన్ఫామ్ కాని రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అన్కన్ఫామ్గా ఉన్న ఏసీ టిక్కెట్ ప్రయాణికులు త్వరలో విమానంలో ప్రయాణించవచ్చట. ఏసీ-1, ఏసీ-2 టిక్కెట్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ-2 ధరలు విమాన టిక్కెట్ ధరలకు ఎక్కువగానే లేదా దానికి కొంచెం దగ్గరగాను ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎంత అడ్వాన్స్‌గా టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, చాలా మంది ప్రయాణికులు వేయిటింగ్ లిస్టులోనే ఉంటాయి. అంటే రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు అంత డిమాండ్ అన్నమాట. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఏసీ టిక్కెట్ ప్రయాణికులకు ఎయిర్ ఇండియాలో ప్రయాణానికి అవకాశం కల్పించాలని రైల్వే ప్లాన్ వేస్తోంది. ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్‌గా ఉన్న అశ్వని లోహాని, ఎయిరిండియాకు చైర్మన్‌గా ఉన్నప్పుడే ఈ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే అప్పట్లో రైల్వే అంత సానుకూలంగా స్పందించలేదు. ప్రస్తుతం రైల్వే బోర్డుకు ఆయనే చైర్మన్‌గా ఉండటంతో, ఒకవేళ ఎయిరిండియా ఈ ప్లాన్‌పై రైల్వేను ఆశ్రయిస్తే, వెంటనే ఆమోదం లభ్యమయ్యేటట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 23న లోహాని రైల్వే బోర్డుకు చైర్మన్‌గా ఎంపికయ్యారు. లోహాని ప్లాన్ ప్రకారం కన్ఫామ్ కాని టిక్కెట్ ప్రయాణికుల వివరాలు, ఎయిరిండియాతో షేర్ చేస్తారు. అదే మార్గానికి విమానంలో టిక్కెట్లుంటే వారికి, వాటిని ఆఫర్ చేస్తారు. లోహాని తొలుత ఈ ప్లాన్‌ను సిద్ధం చేసినప్పుడు, ఢిల్లీ-ముంబై లాంటి పలు ముఖ్యమైన మెట్రో రూట్ల ఏసీ-2 టిక్కెట్లకు విమాన టిక్కెట్లను ఆఫర్ చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. -
రెండు రాజధానుల మధ్య...
సాక్షి,న్యూఢిల్లీ: ఒకటి దేశ రాజధాని..మరోటి దేశానికి ఆర్థిక రాజధాని.. ఈ రెండు రాజధానులను కలుపుతూ సోమవారం నుంచి న్యూ స్పెషల్ రాజధాని ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఢిల్లీ, ముంబయిల మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని కల్పించేందుకు ఈ రైలు సర్వీసును ప్రవేశపెడుతున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైలుకు ఫ్లెక్సి ఫేర్ వర్తించదని, అయితే ముంబయి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే సెకండ్, థర్డ్ ఏసీ చార్జీలు దాదాపు 19 శాతం తక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. రెండు మెట్రో నగరాలను కలుపుతూ ఇప్పటికే రెండు రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, 30 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. న్యూ రాజధాని ఎక్స్‌ప్రెస్ రాకతో రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండు గంటల వరకూ తగ్గుతుందని అధికారులు చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్ మార్గమధ్యంలో కోట, వదోదర, సూరత్‌లలో మాత్రమే ఆగుతుందని తెలిపారు. -
డ్రైవర్ లేకుండా నడిచిన రాజధాని ఎక్స్ ప్రెస్!
మజ్ గావ్-నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ ప్రెస్ కు సోమవారం భారీ ప్రమాదం తప్పింది. ఇంజన్ లో ఏదో లోపం తలెత్తడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర లోకో పైలట్ ఆపరేట్ చేయకుండా నడిచినట్లు సమాచారం. రత్నగిరి రైల్వే స్టేషన్ కు దగ్గరలోని ఓ సొరంగంలో సాయంత్రం 5.50 నిమిషాల సమయంలో ప్రయాణిస్తున్న రైలు ఇంజిన్ లో లోపం తలెత్తింది. దీంతో లోకో పైలట్ రైలును అక్కడికక్కడే నిలిపివేశాడు. రైల్వే టెక్నీషియన్లు లోపాన్ని సరిచేస్తున్న సమయంలో లోకో పైలట్ గార్డు క్యాబిన్ లోకి వెళ్లాడు. లోపాన్ని సరిదిద్దడం పూర్తికాక ముందే రైలు ఇంజిన్ ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభించింది. సొరంగం తర్వాత అంతా దిగువ భాగం కావడంతో దాదాపు 15 కిలోమీటర్ల మేర అలానే ప్రయాణించింది. దీంతో ఉలిక్కిపడిన లోకో పైలట్ ఎగువ భాగంలో రైలు నిదానంగా వెళ్తుడటంతో ఒక్కసారిగా గార్డు క్యాబిన్ నుంచి ఇంజన్ లోకి దూకి రైలును తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. ఇంజిన్ బ్రేక్స్ పాడవటం, పట్టాలు దిగువకు ఉండటంతో రైలు ముందుకు కదిలినట్లు చెబుతున్నారు. కాగా, రైలు స్లో అయిన తర్వాత పైలట్ రైలును నిలిపివేసి మరో ఇంజిన్ ను తెప్పించి పక్కనే ఉన్న చిప్లన్ స్టేషన్ లో రైలును ఆపినట్లు వివరించారు. దీనిపై స్పందించిన కొంకణ్ రైల్వే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా రైలు ఇంజిన్ లోకో పైలట్ లేకుండా ముందుకు వెళ్లిందనే వార్తలను కొట్టిపారేశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
గోవా, ఢిల్లీల మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్
పనాజి: భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆదివారం గోవా- ఢిల్లీల మధ్య రాజధానీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. గోవా నుండి దేశ రాజధానికి ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని గోవా ప్రజలు ఎప్పటినుండో కోరుతున్నారు. కాగా సురేష్ ప్రభు గత గోవా పర్యటనలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం గోవాలోని మడగావ్ నుండి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. మడగావ్ నుండి హజరత్ నిజాముద్దీన్ మధ్య వారానికి రెండు సార్లు ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని కొంకన్ రైల్వే ఛీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వెల్లడించారు. -
త్వరలోనే విశాఖ రైల్వే జోన్
విజయవాడ: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ లాంఛనాలన్నీ పూర్తి చేస్తోందని, త్వరలోనే ప్రకటన విడుదలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జోన్ వచ్చిన తరువాత కొత్త రైళ్లు సాధించేందుకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం నుంచి ప్రారంభించడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం, తిరుపతిల నుంచి బోగీలను తెచ్చి విజయవాడలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కలిపి ఇక్కడ నుంచి నడపాలనే ప్రతిపాదన సరికాదని, బోగీలు రావడం ఆలస్యమైతే రైలు బయలుదేరడం ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.