
కాజీపేట రూరల్: బెంగళూరు నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ప్రయాణించిన ఇండోనేషియా విహారయాత్రకు వెళ్లి వచ్చిన దంపతులపై కేసు నమోదు చేసినట్లు కాజీపేట జీఆర్‌పీ ఎస్సై జితేందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. యూపీకి చెందిన భార్యాభర్తలు రోహిత్‌కుమార్, పూజాయాదవ్ ఇటీవల ఇండోనేసియా విహారయాత్రకు వెళ్లి ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చారు. హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన వీరిద్దరూ స్టాంపింగ్‌తో 21న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో యూపీకి వెళుతుండగా.. కాజీపేటలో దింపిన విషయం విదితమే.
కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలులోనూ..
ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి వచ్చిన కరోనా అనుమానితుడు రవికిరణ్ బెంగళూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించగా.. భువనగిరిలో అతడిని దింపారు. అతడిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై జితేందర్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment