
సాక్షి, నెల్లూరు: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, వెంటనే రైలును కావలి రైల్వేస్టేష్టన్‌లో నిలిపివేశారు.
వివరాల ప్రకారం.. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం కావాలి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే బీ-5 బోగీ వద్ద చక్రాల నుంచి పొగలు వచ్చాయి. అది గమినించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రయాణీకులకు ప్రమాదం తప్పింది. ఇక, స్వల్ప మరమ్మతుల అనంతరం అరగంట తర్వత రైలు బయలుదేరింది. ఇక, రాజధాని ఎక్స్‌ప్రెస్.. నిజాముద్దీన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా కావలి సమీపంతో ప్రమాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment