smoke
-
టపాసుల ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన పొగ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం(నవంబర్ 1) తెల్లవారుజామున పొగ కమ్మేసింది. గురువారం రాత్రి దీపావళి సందర్భంగా ఢిల్లీ వాసులు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మరీ టపాసులు కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. ఢిల్లీ ఎన్సీఆర్లోని నోయిడా, గురుగ్రామ్‌లో వాయు కాలుష్యం ఒక్కసారిగా ఒక్కసారిగా పెరిగిపోయింది. రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)పై వాయునాణ్యత శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 395(వెరీపూర్)గా నమోదైంది. ఈ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు పొరుగునే ఉన్న పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ వాయునాణ్యత ఒక్కసారిగా క్షీణించింది.#WATCH | Delhi: A thin layer of smog engulfs the National Capital as the air quality continues to deteriorate.As per the CPCB, the AQI of the area is 317, in the 'very poor' category. (Visuals from India Gate) pic.twitter.com/nKvFMOPZrd— ANI (@ANI) November 1, 2024 కాగా, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఢిల్లీ కాలుష్యం శీతాకాలం ప్రారంభమవగానే పెరిగిపోతోంది. పంట వ్యర్థాలకు తోడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే డీజిల్ వాహనాలు కూడా కారణమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం దీపావళి రోజు టపాసులను కాల్చడాన్ని నిషేధించింది. అయితే ఢిల్లీ వాసులు ఈ నిషేధాన్ని పట్టించుకోకుండా టపాసులు కాల్చి పండుగ జరుపుకోవడంతో కాలుష్యం పెరిగిపోయింది. ఇదీ చదవండి: బాణసంచా కాల్చేవారిపై పోలీసుల దృష్టి -
అమెజాన్‌లో కార్చిచ్చులు..బ్రెజిల్‌ను కమ్మేసిన పొగ
బ్రసిలియా: అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు దావానలంలా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చుల దెబ్బకు 80శాతం బ్రెజిల్‌ను పొగకమ్మేసింది. రెండేళ్ల క్రితం పక్కకు పెట్టిన కొవిడ్ మాస్కులకు బ్రెజిల్ ప్రజలు మళ్లీ పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. గత 14 ఏళ్లలో ఇంతటి కార్చిచ్చులు రాలేదని ఈయూ కోపర్నికస్ అబ్జర్వేటరీ పేర్కొంది. ఓవైపు బ్రెజిల్ తీవ్రమైన కరువులో అల్లాడుతుంటే మరోవైపు కార్చిచ్చులు ఉన్న పచ్చదనాన్ని దహనం చేస్తున్నాయి. అమెజాన్ పరివాహక ప్రాంతాల్లోని ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, పెరూల్లో లక్షల హెక్టార్ల అటవీ భూమి, పొలాలు దహనమైపోయాయి.భూమిపై అమెజాన్ బేసిన్‌కు అత్యంత తేమ ప్రాంతంగా పేరుంది. కార్చిచ్చులతో కమ్మేసిన పొగ పీలిస్తే రోజుకు ఐదు సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ వల్ల రాజధాని బ్రసిలియాలో ఆస్పత్రులకు చాలామంది రోగులు శ్వాస సంబంధ ఇబ్బందులతో చికిత్స కోసం వస్తున్నారు. బ్రసిలియాలో దాదాపు 160 రోజులుగా చుక్క వర్షం పడలేదు. దీంతో ప్రజలు తడి గుడ్డలపై ఫ్యాన్ గాలి వచ్చేలా చేసి పొడి వాతావరణం నుంచి ఉపశమనం పొందుతున్నారు. సాగుకు వినియోగించేందుకుగాను అటవీభూమికి ప్రజలు నిప్పుపెడుతున్నట్లు గుర్తించారు. సోమవారం(సెప్టెంబర్30) బ్రెజిల్ పొరుగునున్న బొలీవియాలో కార్చిచ్చులను నేషనల్ డిజాస్టర్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం -
స్మోక్ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు
ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్ పాన్, స్మోక్ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్ పాన్ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు. -
ఆజానబాహుడిలా ఉండే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే!
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూడాటానికి ఆజానుబాహుడిలా యువ హీరోలకి తీసిపోని బాడీ ఫిజిక్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. చూడటానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు. ఇప్పటికీ సినిమాల్లో షర్ట్ తీసేసి మంచి దేహదారుఢ్యంతో కనిపిస్తాడు. ఐదుపదుల వయసొచ్చిన అదే ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. చాలామంది హీరోలు యంగ్ హీరోలా లుక్ మెయింటెయిన్ చేసినా.. యువకుడి మాదిరి కండలు తిరిగిన దేహం మెయింటెయిన్ చేయడం కుదరదు. అందుకే చాలామంది పెద్ద హీరోలు ఓ ఏజ్ తర్వాత షర్ట్ తీసి కెమెరా ముందుకు రారు. కానీ జాన్ అబ్రహం అలా కాదు. దర్శకులు సైతం అతని బాడీ ఫీగర్ సినిమాలో కచ్చితంగా కనిపించేలా చూసుకుంటారు. అంతలా జాన్ అబ్రహం తన ఫిజిక్‌ని మెయింటెయిన్ చేస్తాడు. బ్రిటిష్-పాకిస్తానీ నటుడు అలీఖాన్ జాన్ అబ్రహంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అతడి ఫిట్నెస్ సీక్రెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. జాన్ తన శరీరాకృతి కారణంగానే హీరోగా నిలదొక్కుకున్నాడా అని ఓ ఇంటర్యూలో యాంకర్ ప్రశ్నించగా..అందుకు అలీ ప్రతిభ లేకుండా ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం జాన్ అబ్రహం వయసు 51 అయినా..ఈ వయసులో కూడా చొక్కా లేకుండానే సినిమాల్లో కనిపిస్తుంటాడని అలీ సతీమణి చాందిని నవ్వుతూ చెప్పారు. అందుకు అతడు అనుసరించే కఠిన జీవనశైలేనని అన్నారు. జాన్ 25 ఏళ్లుగా అస్సలు చక్కెర రుచే చూడలేదని చెప్పారు. చక్కెరకు ప్రత్యామ్నయాలను మాత్రమే తీసుకుంటాడని చెప్పారు. అలాగే మద్యం, సిగరెట్ వంటి వాటిని సరదాకి కూడా ట్రై చేయలేదని, అదే అతడి బాడీ ఫిట్నెస్ సీక్రెట్ అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హీరోలలో మంచి శరీరాకృతికి పేరుగాంచినవాడు జాన్. ఇక జాన్ శిల్పాశెట్టితో కలిసి ఒక షోలో సందడి చేశారు. ఆ షోలో తన లైఫ్ స్టయిల్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు జాన్. తాను రైతు మాదిరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నారు. ముఖ్యంగా తాను తీసుకునే ఆహారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఫిటెనెస్ మెయిటెయిన్ చేయడం అనేది ప్రధానంగా మూడింటి మీద ఆధారపడి ఉంటుందని, అందులో ఒకటి ఆహారం, వ్యాయామం, చివరిగా నిద్ర అని చెప్పుకొచ్చారు జాన్. వాటిలో ఏది సరిగా లేకపోయినా.. మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం అనేది సాధ్యం కాదని అన్నారు. అలాగే తాను ప్రతిరోజు ఉదయం 4.30 గంటల కల్లా నిద్ర లేస్తానని, పైగా తనకెంతో ఇష్టమైన కాజు కల్తీ డెజర్ట్‌ని మూడు దశాబ్దలకు పైగా రుచి చూడకుండా నోటిని అదుపులో ఉంచినట్లు తెలిపారు. తన వద్ద ఎలాంటి ఎరేటెడ్ డ్రింక్స్ కూడా ఉండవని, తన దృష్టిలో చక్కెర అనేది అతిపెద్ద విషం అని ప్రగాఢంగా నమ్ముతానని చెప్పుకొచ్చాడు జాన్. అంతేగాదు సిగరెట్ కంటే పాయిజన్ చక్కెరే అని జాన్ చెబుతున్నాడు. ఎంతటి సెలబ్రిటీలైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సిందే. అది కూడా వాళ్లు ఆరోగ్యకరమైన రీతిలో ఫాలో అయ్యి అందరికీ ఆదర్శంగా నిలవడం విశేషం. మనం కనీసం వారిలా కాకపోయినా ఆరోగ్యంగా ఉండేందుకైనా మంచి జీవనశైలిని పాటించేందుకు యత్నించడం బెటర్ కదూ..!(చదవండి: ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్) -
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లేజర్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికులు గాయపడ్డారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు లేజర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనెజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్‌కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నట్టుండి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కొందరు వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Following an APU failure aboard a <a href="https://twitter.com/laserairlines?ref_src=twsrc%5Etfw">@laserairlines</a> MD-80, passengers were evacuated due to smoke in the cabin. Regrettably, most passengers exited with their carry-on luggage, resulting in avoidable hazards. <a href="https://t.co/7FsfZ3Zkuk">pic.twitter.com/7FsfZ3Zkuk</a></p>&mdash; Enrique Perrella (@Enrique77W) <a href="https://twitter.com/Enrique77W/status/1784737773464735912?ref_src=twsrc%5Etfw">April 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
ఛీ.. ఇదేం పని.. మ్యాచ్ మధ్యలోనే పాక్ క్రికెటర్ ఇలా! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటడ్ నిలిచింది. ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించిన ఇస్లామాబాద్ యునైటెడ్.. మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ విజయంలో ఇస్లామాబాద్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం కీలక పాత్ర పోషించాడు. తొలుత బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన వసీం.. అనంతరం బ్యాటింగ్‌లోనూ కీలకమైన 19 పరుగులు చేశాడు. దీంతో అతడికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే తన ప్రదర్శనతో అందరిని అకట్టుకున్న ఇమాద్ వసీం.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూంలో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వసీం సిగరెట్ వెలగించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు 'పీఎసీఎల్ అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదు.. పాకిస్తాన్ స్మోకింగ్ లీగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్!? PAKISTAN "SMOKING" LEAGUE 🚬🔥🔥#HBLPSL9 #HBLPSLFinal pic.twitter.com/pwpaj4bLh8 — Farid Khan (@_FaridKhan) March 18, 2024 -
భోగి పండుగను ఇలా మాత్రం చెయ్యొద్దు!
అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఊళ్లు, పల్లెలు జనసందోహంతో కళకళలాడిపోతుంటాయి. ఎంతెంత దూరమైనా వ్యయప్రయాసలు కోర్చి మరీ పట్టణాలు, విదేశాల నుంచి సోంతూళ్లకి పయనమైపోతుంటారు. అంతటి సరదాలు, ఆనందాలు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ నాలుగు రోజుల పండుగకి ఉన్న క్రేజ్ మరే పండుగకి ఉండదేమో అన్నంతలా చిన్న పెద్ద భేదం లేకుండా జరుపుకునే పండుగ. అలాంటి ఈ పండుగను మన పూర్వీకులు ఏ ఉద్దేశ్యంతో ఇలానే జరుపుకోండని మనకు ఒక సంప్రదాయన్ని అందిస్తే దానికి తిలోదాకాలు ఇచ్చేసి తప్పుగా అర్థం చేసుకుంటూ పిచ్చిపిచ్చిగా జరుపుకుంటున్నాం. అజ్ఞానంతో పర్యావరణానికి హాని కలిగించడమే గాకుండా లేనిపోనీ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ఈ విషయమై పర్యావరణ అధికారులు, వైద్యులు, ఆయా పాలనాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దయచేసి ఇలా చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు. ఇంతకీ ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలాంటివి చెయ్యకూడదు?. వాళ్లంతా భయాందోళనలు వ్యక్తం చేయడానికి రీజన్? నిజానికి ఈ సంక్రాంతి పండుగలో భోగితో మొదలయ్యే తొలి పండుగ అంటే అందరికీ సరదానే. ఎందుకంటే? బోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సఓ సంబరంలా అంతా ఒక చోట చేరి ఐక్యమత్యంగా జరుపుకుంటారు. అయితే ఈ భోగి మంటలకు కావాల్సిన కలప, పిడకలు, వంటివి నగరాల్లో అందుబాటులో ఉండవు. అదీగాక అభివృద్ధి పేరుతో ఓ టౌన్ మాదిరివి కూడా నగరాల్లో మారిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటవన్నీ అందుబాటులో ఉండవు. పైగా అందరికి వ్యయప్రయాసలు కోర్చి మరి సొంతూళ్లుకు వెళ్లడం కూడా కుదరదు. దీంతో వారంతా ఈ భోగమంటను ఇంట్లోని పాత వస్తువులను తగలబెట్టి భోగి మంట వేసుకోవడం లేదా టైర్లు, వేస్ట్ ప్లాస్టిక్‌ని తగలబెట్టడం వంట పనులు చేస్తారు. ఇలాంటి చలిమంట వల్ల పర్యావరణ కాలుష్యమే గాక, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్య సమస్యల బారినపడతారు. ముఖ్యంగా ప్లాస్టిక్, టైర్లు వంటివి కాల్చడం వల్ల చాలా విషపూరితమైన వాయువులు గాల్లోకి విడుదల అవుతాయి. వీటిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యనిపుణులు, పర్యావరణ అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ అనేది మనకు కొత్త ఉత్తేజన్ని తీసుకొచ్చి ఆనందంగా గడిపేలా ఉండాలే కానీ మన వినాశనానికి కారణమయ్యేలా ఉండకూదనేది వారి ఆవేదన. కానీ చాలామంది ఇలానే చేసి చేజేతులారా తమ ఆరోగ్యాన్ని పక్కవారి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అస్సలు మన పూర్వీకులు ఎందుకని పండగను ఇలా భోగిమంటలతో చేసుకోవాలని చెప్పారు? దానిలో దాగున్న అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానంతో తప్పుగా జరుపుకుని లేనిపోనీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఇంతకీ ఎలా చేసుకోవాలంటే.. పర్యావరణ హితంగా మంచి ఔషధ చెట్ల కలప లేదా ఆవుపిడకలతో వేసిన భోగిమంటే అన్ని విధాల మంచిది. దీని నుంచి విడుదలయ్యే వాయువులు పీల్చేతే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు. మన పూర్వీకులు ఈ భోగి మంటల వేయడానికి కారణం కూడా ఈ రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా రావి, వేప వంటి ఔషధ గుణాలు గల చెట్ల దుంగల్ని తెచ్చి మంట వేస్తారు. అందులోనే దేశీ ఆవు నెయ్యి, పిడకలు వంటివి కూడా వేస్తారు. ఇలా భోగిమంటను వేసి దాని నుంచి విడుదలయ్యే గాలిని పీల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యల రావు. పైగా శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు. ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, ఆయాసం వంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లోని పాత వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, పాత టైర్లతో చలిమంటలు వేసుకుని అనారోగ్యం పాలవ్వుతున్నారు. తెలియకుండానే అటు దేవుడి అనుగ్రహానికి నోచుకోక పోగా, ఇటు ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నవారవమవుతున్నాం అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల దయచేసి ఇలా మాత్రం చేసుకోవద్దు. అవన్నీ అందుబాటులో లేకపోతే కనీసం కొబ్బరి చిప్పలు, వేపాకులు వంటివి తెచ్చుకుని భోగిమంట వేసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదే అని హితవు చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అందువల్ల అందరం ఈ పండుగను ఆరోగ్యకరమైన రీతీలో పర్యావరణ హితంగా జరుపుకుని ఆరోగ్యమనే భాగ్యాన్ని, సంతోషమనే సంపదను పొందుదాం. -
Parliament security breach: వారి ‘ఫేస్బుక్’ వివరాలివ్వండి
న్యూఢిల్లీ: లోక్‌సభలో పొగబెట్టిన ఉదంతంలో అరెస్టయిన నిందితుల ‘ఫేస్బుక్’ ఖాతాల వివరాలు ఇవ్వాలని ‘మెటా’ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. నిందితులు సభ్యులుగా ఉన్న, ప్రస్తుతం మనుగడలో లేని ‘భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ ఫేస్బుక్ పేజీ వివరాలను అందించాలని ‘మెటా’కు ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసిందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఈ ఫేస్బుక్ పేజీని నిందితులే క్రియేట్ చేసి ఘటన తర్వాత డిలీట్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు ‘మెటా’ మాతృసంస్థ. ఈ నేపథ్యంలో నిందితుల మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్లనూ తమకు ఇవ్వాలని పోలీసులు ‘మెటా’ను కోరారు. -
నిరుద్యోగం, అధిక ధరలే కారణం
న్యూఢిల్లీ: ఈ నెల 13వ తేదీన పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న ‘పొగ’ అలజడికి దేశంలో తీవ్రమైన నిరుద్యోగం, పెరుగుతున్న ధరలే కారణమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఉద్యోగాలు లభించని యువతే లోక్‌సభలో అలజడి సృష్టించిందని చెప్పారు. యువతలో ఎంతో కాలంగా పెరుగుతూ వస్తు న్న ఆగ్రహం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ‘దేశంలో అత్యంత తీవ్రమైన అంశం నిరుద్యోగం. దేశమంతటా ఈ సమస్య తో యువత రగులుతోంది. మోదీ జీ విధానాల ఫలితంగానే యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు’అని ఆయన మీడియాతో అన్నారు. పార్లమెంట్ వద్ద జరిగిన ఘటనకు భద్రతా వైఫల్యమనే కారణమనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది. కానీ, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమే దీనికి కారణం’అని అనంతరం ఆయన ‘ఎక్స్’లో తెలిపారు. -
Parliament security breach: ఆత్మాహుతికి ప్లాన్ వేశారు!
న్యూఢిల్లీ: లోక్‌సభలో అలజడి సృష్టించిన నిందితులు తొలుత సులువుగా మంటలంటుకునే జెల్ వంటిది ఒంటినిండా పూసుకుని తమను తాము తగలబెట్టుకుందామని అనుకున్నారట. పార్లమెంటు లోపలికి చొచ్చుకెళ్లి సభ్యులందరికీ అందేలా కరపత్రాలు విసిరితే ఎలా ఉంటుందని కూడా ఆలోచించారట. ‘‘తమ నిరసనను, తాము ఇవ్వదలచిన సందేశాన్ని వీలైనంత ప్రభావవంతంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చేందుకు ఇలాంటి పలు అవకాశాలను పరిశీలించారు. చివరికి లోక్‌సభలోకి దూకి పొగ గొట్టాలు విసిరి అలజడి సృష్టించాలని నిర్ణయించుకుని అమలు చేశారు’’అని నిందితులను విచారిస్తున్న పోలీసు బృందంలోని అధికారి ఒకరు వెల్లడించారు. గత బుధవారం లోక్‌సభ లోపల, బయట పొగ గొట్టాలు విసిరిన కలకలం రేపిన సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్‌సభ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్‌సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్‌కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్‌లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్‌ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్‌లో తలదాచుకున్న నగౌర్‌కు కూడా తీసుకెళ్లనున్నారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించనున్నారు. పార్లమెంటు భద్రతపై సమీక్షకు కమిటీ: స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు భద్రతపై తాను కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించినట్టు లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఇలాంటి భద్రతా వైఫల్యాలు పునరావృతం కాకుండా అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించి దాన్ని కట్టుదిట్టం చేసేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ సూచిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభ సభ్యులకు ఆయన లేఖ రాశారు. దీనిపై కేంద్ర హోం శాఖ నియమించిన విచారణ కమిటీ నివేదికను కూడా సభ ముందుంచుతామని తెలిపారు. ఇల్లు వదిలి వెళ్లకండి మైసూరు: పార్లమెంటులో అలజడి సృష్టించిన కేసులో నిందితుడు మనోరంజన్ కుటుంబ సభ్యులెవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని కేంద్ర నిఘా విభాగం అధికారులు ఆదేశించారు. మైసూరు విజయనగరలోని మనోరంజన్ ఇంటిని నిఘా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి విప్లవ సాహిత్యాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మనోరంజన్ కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లవద్దని ఆదేశించారు. అత్యçవసర పరిస్థితి వస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బంధువులు, ఇతరులెవరూ ఆ ఇంటికి వెళ్లరాదని, ఎవరైనా ఫోన్లు చేస్తే సంబంధిత వివరాలను అందజేయాలని సూచించారు. మహేశ్‌కు ఏడు రోజుల కస్టడీ ఈ కేసులో అరెస్టయిన ఆరో నిందితుడు మహేశ్ కుమావత్‌ను ఢిల్లీ కోర్టు శనివారం ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. అతడు కనీసం రెండేళ్లుగా ఈ కుట్రలో నిందితులకు సహకరిస్తున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీన్ని పూర్తిగా ఛేదించాలంటే అతన్ని లోతుగా విచారించాల్సి ఉందన్నారు. దాంతో ప్రత్యేక జడ్జి హర్దీప్ కౌర్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై మహేశ్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్‌తో పాటు అతను తనంత తానుగా లొంగిపోవడం తెలిసిందే. -
జూలైలోనే పక్కాగా రెక్కీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటులో పొగగొట్టాలతో కలకలం రేపిన నిందితులు ఇందుకు కొద్ది నెలల క్రితమే పక్కా ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్లమెంట్‌లోకి పొగగొట్టాలను ఎలా దాచి తీసుకెళ్లాలన్న దానిపై రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌కు వచి్చన వారి షూలను తనిఖీ చేయట్లేరనే విషయాన్ని ‘రెక్కీ’ సందర్భంగా వీరు కనుగొన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఒకరైన మనోరంజన్ జులైలోనే ఈ మేరకు ఒకసారి సందర్శకుల పాస్‌తో లోపలికి వచ్చి రెక్కీ నిర్వహించాడని తెల్సింది. షూలు విప్పి తనిఖీలు చేయట్లేరనే విషయం గమనించి పొగ గొట్టాలను షూలో దాచి తెచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా లక్నోలో షూలను తయారుచేయించారట. మరోవైపు పార్లమెంట్లో ‘పొగ’ ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝాను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పాల్గొన్న మరో నలుగురిపాటు వారికి ఆశ్రయం కలి్పంచిన మరో వ్యక్తినీ అరెస్ట్‌చేశారు. లోక్‌సభ లోపల, వెలుపల పొగ గొట్టాలను విసిరిన నలుగురిపై కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నలుగురికీ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు పంపించింది. ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కోల్‌కతాకు చెందిన ఇతడు విప్లవ యోధుడు భగత్ సింగ్ వీరాభిమాని. లలిత్, సాగర్, మనోరంజన్ ఏడాది క్రితం మైసూర్లో కలిశారు. అప్పుడే పార్లమెంట్ లోపలికి చొరబడేందుకు ప్రణాళిక రచించారు. వీరికి తర్వాత నీలమ్ దేవి, అమోల్ షిండే తోడయ్యారు. ఫేస్బుక్లో భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో సృష్టించిన పేజీలో వీరంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేవారు. లలిత్ వీరిని ముందుండి నడిపాడు. ప్రణాళిక ప్రకారమే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద మనోరంజన్ రెక్కీ నిర్వహించాడు. జూలైలో సందర్శకుల పాస్‌తో పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చాడు. భద్రతా సిబ్బంది సందర్శకుల షూలను విప్పి తనిఖీ చేయడం లేదని విషయం గమనించాడు. ఆ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విశాల్ శర్మ అలియాస్ వికీ ఇంట్లో సాగర్, మనోరంజన్, అమోల్, నీలం, లలిత్‌లు బస చేశారు. ఉదయం అందరూ కలిసి పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు. వీరి సెల్ఫోన్లను లలిత్ తన వద్దే ఉంచుకున్నాడు. పాస్‌లు ఇద్దరికి మాత్రమే రావడంతో మిగతా ముగ్గురు బయటే ఉండిపోయారు. అమోల్, నీలమ్‌లు పార్లమెంట్ ఆవరణలో పొగ గొట్టాలు విసురుతుండగా లలిత్ వీడియో చిత్రీకరించాడు. అనంతరం ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతాకు చెందిన ఒక ఎన్జీవో నిర్వాహకుడు నీలా„Š అయి‹Ùతో స్పెషల్ సెల్ పోలీసులు మాట్లాడారు. ఈ ఎన్జీవోతోనే లలిత్ ఝాకు సంబంధాలున్నట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు గురువారం రాత్రి లలిత్ ఝాను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే పార్లమెంట్ ఘటన వెనుక నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వారం రోజుల రిమాండ్ పార్లమెంట్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కేసులో పట్టుబడిన నలుగురిపై ఉపా చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. గురువారం మనోరంజన్, సాగర్, అమోల్, నీలమ్‌లను ‘పటియాలా’ కోర్టుకు తీసుకొచ్చి ఎన్ఐఏ కేసులను విచారించే జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జి ఏడు రోజుల రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఒకే రకమైన సమాధానాలు సాగర్ శర్మ(26), మనోరంజన్(34), అమోల్ షిండే(25), నీలమ్ దేవి(37)లకు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో వైద్యుల బృందంతో పోలీసులు మెడికల్ పరీక్షలు చేయించారు. అనంతరం వీరిని చాణక్యపురిలోని డిప్లొమాటిక్ సెక్యూరిటీ ఫోర్స్(డీఎస్ఎఫ్) కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ముందుగా, నీలమ్, అమోల్‌లను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు, తర్వాత డీఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించారు. విచారణలో వీరు రెండు సంస్థల పేరు వెల్లడించారు. నిందితులు చెబుతున్న సమాధానాలన్నీ ఒకే రకంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. ‘దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్‌లో హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డాం. ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం కోసం, ఎంపీలు పై అంశాలపై చర్చ జరపాలనే ఉద్దేశంతో రంగుల పొగను వినియోగించాం. బ్రిటిష్ పాలనలో విప్లవయోధుడు భగత్ సింగ్ చేసినట్లుగా పార్లమెంట్లో అలజడి సృష్టించడం ద్వారా దేశ ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మారాలని భావించాం’ అని నలుగురు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. ఆధారాలు దొరక్కండా చేసేందుకే లలిత్ ఝా వీరి ఫోన్లను వెంటతీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. బహుశా అతడు వీటిని ధ్వంసం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
లోక్‌సభలో దాడి ఘటన.. పట్టుబడ్డ ఆగంతకుల నేపథ్యం ఇదే..!
లోకసభలోకి ఆరుగురు ఆగంతకులు చొరబడి సృష్టించిన అలజడి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక్కసారిగా సరిగ్గా అదే రోజు (2001 డిసెంబర్ 13)22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి యత్నించిన ఉదంతం కళ్లముందు మెదిలింది. అలాంటి ఉగ్రదాడేనా! అని అనుమానాలు లేవెనెత్తాయి. రెండు దశాబ్దాల కిందట జరిగిన దాడే మాయని మచ్చలా చాన్నాళ్లు వెంటాడింది. అది మరువక మునుపే కొత్తగా ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన పార్లమెంటు వద్ద మళ్లీ అలాంటి కల్లోలం అందర్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు ప్రాంగణం లేదా బయట వైపు కాకుండా ఏకంగా దిగువసభలోకే ఆగంతకులు చొరబడటం పార్లమెంట్‌లోని భద్రతా వైఫల్యం గురించి అనుమానాలు లేవనెత్తింది . అదీగాక ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త పార్లమెంట్ తీర్చిదిద్దిన విధానం గురించి ఎంతలా ప్రచారం చేశారో కూడా తెలిసిందే. ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభమైంది కూడా ఈ ఏడాది మేలోనే, ఇంతలోనే ఈ దాడి అందర్నీ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అయితే ఈ పార్లమెంట్‌లోకి చొరబడ్డ ఆ ఆగంతకుల్లో కొందరీ బ్యాగ్రౌండ్ మాములగా లేదు. వారి నేపథ్యం విని అధికారులే ఆశ్చర్యపోయారు. ఇంతటి ఉన్నత విద్యావంతులు ఇలాంటి దారుణానికి ఎందుకు దిగారంటే.. కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవాలని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చిన పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లెవరంటే..? పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విక్కీ శర్మను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో విక్కీ శర్మ ఇంట్లో నే ఉంటున్నట్టు విచారణలో తెలిసింది. ఆగంతకుల బ్యాగ్రౌండ్... పట్టుబడ్డ నిందుతుల్లో నీలమ్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఎం.ఫిల్ పూర్తి చేసింది. అలాగే టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించే సెంట్రల్ ఎగ్జామినేషన్‌లో కూడా పాసయ్యింది. కానీ ఉద్యోగం లేదు. ఉన్నత విద్యావంతురాలైనప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో నీలమ్ తీవ్ర డిప్రెషన్‌కి లోనయ్యినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చదువుకున్నా.. సరైన ఉద్యోగం లేదు రోజుకు రెండుపూట్ల తిండి కూడా తినలేకపోతున్నానని ఆవేదన చెందేదని, తరుచుగా చనిపోతానని ఏడ్చేదని నీలమ్ తల్లి చెబుతోంది. ఆమె సోదరుడు రామ్నివాస్ నీలమ్‌కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, కానీ ఆమె ఎందుకిలా చేసిందనేది కూడా మాకు తెలియదు. తమ బంధువులు ఫోన్ చేసి టీవి చూడమని చెప్పేంత వరకు తమకు దీని గురించి తెలియదని అన్నాడు. నీలమ్ పోటీపరీక్షలకు ప్రీపేర్ అయ్యేందకు హర్యానాలో జింద్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఆమె బీఏ, ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. పైగా నెట్లో కూడా మంచి ఉత్తీర్ణతతో పాసయ్యింది. ప్రస్తుతం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు కూడా ప్రిపరవ్వుతుందని ఆమె కుటుంబసభ్యలు చెబుతున్నారు. కాగా నీలమ్ తరచూ నిరసనల్లో నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతుండేదని, పైగా మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సమీపంలో ఏడాదిపాటు జరిగిన రైతుల నిరసనలో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక మరో నిందితుడు మనోరంజన్(34) మైసూర్‌కి చెందినవాడు. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్. అతడి తండ్రి దేవరాజేగౌడ మాట్లాడుతూ.. తన కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఉరి తీయాలని అన్నారు. పార్లమెంటు మాది... మహాత్మా గాంధీ నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకు చాలా మంది ఆ ఆలయాన్ని నిర్మించారు.. నా కొడుకు అయినా ఆ గుడి విషయంలో ఎవరైనా ఇలా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదు అని నిందుతుడి తండ్రి పేర్కొనడం గమనార్హం. నీలం అజాద్‌తో కలసి పార్లమెంట్ వెలుపల పొగ గొట్టలు విసిరిన అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్ గ్రామానికి చెందిన వాడు. అతడి తల్లిదండ్రులు కూలీలు. పోలీసు, ఆర్మీ రిక్రూట్మెంట్ వంటి పోటీ పరీక్షల్లో చాలా సార్లు విఫలమయ్యాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అతను పోలీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అలాగే లక్నో నివాసి, సాగర్ శర్మ, అతనితో సహా అతని కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. శర్మ జీవనోపాధి కోసం ఇ-రిక్షా కూడా నడుపుతున్నాడు. నిరసనలో పాల్గొనేందుకు రెండు రోజుల పాటు ఢిల్లీకి వెళతానని చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిగా ఆ నిందితులకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ అతడి భార్య రేఖను కూడా అదుపులో తీసుకున్నారు. విక్కీ ఎగుమతుల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వారందరిపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్ట కింద కేసులు నమోదు చేశారు. ఆ ఆగంతుకులు ఒక్కొకరిది ఒక్కో నేపథ్యం. కానీ వారంతా ఎంతోకొంత చదువుకున్న వారు. సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నవాళ్లు, ఏదీ మంచి ఏదీ చెడు తెలిసిన వివేకవంతులే. కానీ ఇలా తాము ఎదుర్కొన్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలతో తప్పుడు దోవ ఎంచుకున్నారో లేక మరేవరి ప్రమేయం లేదా ప్రభావం ఉందో తెలియదు గానీ చాలామంది యువత ఇలానే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ వాళ్లకు అన్యాయం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అన్యాయమైపోయిన వాడు తనలా మరెవరు కాకుడదన్న మనస్తత్వంతో ఉండాలి. తనను నమ్ముకున్నవాళ్లు లేదా తనపై ఆధారపడిన వాళ్ల గురించి అయినా ఆలోచించాలి. ఇలాంటి మార్గంలో మాత్రం పయనించడు. దీన్ని యువత గుర్తించుకోవాలి. మన చుట్టు ఉన్నవాళ్లలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో పెరిగి నెగ్గుకొచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అంతెందుకు మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఎంతటి దారిద్యాన్ని అనుభవించాడో తెలిసిందే. ఆ రోజుల్లోనే అతను అందరికంటే ఉన్నత విద్యాను అభ్యసించాడు అయినా వెనుకబడి కులం వాడన్న ఒక్క కారణంతో హేళనలకు గురిచేశారు. అంటరానివాడని అవమానించారు. కనీసం సాటి మనిషిలా కూడా గౌరవం ఇవ్వకపోయినా తట్టుకుని నిలబడి ఛీత్కారంతో చూసిన వారిచేత శభాష్ అని సలాం కొట్టించుకున్నాడు. ఇలాంటి ఎందరో మహనీయుల మన మాతృభూమికి మంచి పేరుతెచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశానికి యువత ఓ ఆయుధం. వారు దేశాన్ని అభివృద్ధిపథంలోకి నడిపించేలా ఉండాలి కానీ కానీ కళంకంలా ఉండకూడదు. కఠిన పరిస్థితులను తట్టుకుని రాటుదేలి.. మహనీయుడిలా మారాలే కానీ అలజడులు సృష్టించే ఉగ్రవాదులు లేదా నేరస్తులుగా మారకూడదు. (చదవండి: లోక్‌సభకు పొగ) -
Parliament: లోక్‌సభకు పొగ
కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవా’లని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చి న పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు తేల్చారు. సరిగ్గా 22 ఏళ్ల కింద పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచిన రోజే జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. దీనిపై పార్టీలకతీతంగా ఎంపీలు, నేతలు ఆందోళన వెలిబుచ్చారు. సభలోకి దూకిన వారు మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహ సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీ పాస్ సంపాదించినట్టు తేలింది. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం. ఒంటి గంట సమయం. లోక్‌సభలో జీరో అవర్ ముగింపుకు వచ్చింది. బీజేపీ సభ్యుడు ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం! ఏమైందో అర్థం కాక లోక్‌సభ సభ్యులంతా ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఎవరో సభలోకి పడిపోయారని తొలుత భావించారు. అదేమీ కాదని, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సభలోకి దూకాడని అర్థమై బిత్తరపోయారు. ఆలోపే మరో వ్యక్తి కూడా సభలోకి దూకి మరింత కలకలం రేపాడు. ఇద్దరూ బెంచీలపై గెంతుతూ స్పీకర్‌ను చేరుకునేందుకు వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బూట్లలోంచి పొగ గొట్టాలు తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పొగ హాలంతటా కమ్ముకుంది. ఈ పరిణామాలతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు లోనై అటూ ఇటూ పరుగులు తీశారు. చివరికి ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణం బయట కూడా పొగ గొట్టాలు విసిరి కలకలం రేపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 2001లో సరిగ్గా డిసెంబర్ 13వ తేదీనే పాకిస్తాన్‌లోని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంపై దాడికి తెగబడి విచ్చలవిడి కాల్పులతో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. తాజా ఉదంతంపై కేంద్ర హోం శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. తీవ్ర భద్రతా లోపం: ఎంపీలు ఘటన అనంతరం మధ్యాహ్నం రెండింటికి లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. 2001 దాడి అనంతరం ఇది అతి తీవ్రమైన భద్రతా లోపమంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతానంటూ ఖలీస్థానీ వేర్పాటువాది గురుపర్వత్ సింగ్ పన్ను హెచ్చరించిన విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు. మొదటి వ్యక్తి తన సమీపంలోనే సభలోకి దూకాడని జేడీ(యూ) ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ చెప్పారు. తామంతా తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశామన్నారు. వాళ్ల దగ్గర బాంబు, మారణాయుధాలుంటే పరిస్థితేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను వాయిదా వేసి ఈ ఉదంతంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్రం తక్షణం క్షమాపణ చెప్పాలని, పార్లామెంటు భద్రతను తక్షణం మరింత కట్టుదిట్టం చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దుండగులకు పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ సింహాను విచారించాలన్నారు. ఆయన్ను తక్షణం సభ నుంచి బహిష్కరించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలా జరిగింది... సభలోకి దూకి కలకలం రేపిన వారిని కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.మనోరంజన్ (34), యూపీలోని లక్నోకు చెందిన సాగర్ శర్మ (26)గా గుర్తించారు. జీరో అవర్ కాసేపట్లో ముగుస్తుందనగా ముందుగా సాగర్ ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. దాంతో ఎంపీలు షాక్‌కు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆరెల్పీ ఎంపీ హనుమాన్ బెనీవాల్ అతన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తుండగానే మరో వ్యక్తి కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. ఇద్దరూ వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తిని బెనీవాల్ తదితర ఎంపీలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నియంతృత్వం చెల్లదని అతను నినాదాలు చేశాడు. ‘‘దగ్గరికి రావద్దు. మేం దేశభక్తులం. నిరంకుశత్వంపై నిరసన తెలపడానికే వచ్చాం’’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇద్దరూ తమ బూట్ల నుంచి పొగ గొట్టం వంటివాటిని తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పసుపు రంగు పొగ సభ అంతటా వ్యాపించడంతో ఎంపీలంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తర్వాత ఎంపీలంతా కలిసి వారిని నిర్బంధించారు. బాగా దేహశుద్ధి చేసి పార్లమెంటు సిబ్బందికి అప్పగించారు. వెంటనే సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గంటపాటు వాయిదా వేశారు. సభలో లేని మోదీ, అమిత్ షా ఘటన జరిగినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్‌రామ్ మేఘ్వాల్తో పాటు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాందీ, అదీర్ రంజన్ చౌధరి సహా మొత్తం 100 మందికి పైగా ఎంపీలు సభలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేరు. ఆరుగురూ ఒకే ఇంట్లో... పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విశాల్‌ను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో లలిత్ ఇంట్లో నే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు 3 నెలలుగా పార్లమెంటు పాస్‌ల కోసం ప్రయతి్నస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరీ సింహా? దుండగులకు విజిటర్స్ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ జర్నలిస్టు. కర్ణాటకలోని మైసూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాశారు. పార్లమెంటు కార్యకలాపాలు చూస్తామంటూ మనోరంజన్ పాస్‌లు తీసుకున్నట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఇలా నియోజకవర్గాల ప్రజలకు ఎంపీలు పాస్‌లు జారీ చేయడం మామూలేనంది. తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంటులోకి సందర్శకులకు పాస్‌ల జారీని నిలిపేశారు. -
ఢిల్లీలో పొగమంచు.. విమానాలు మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ: పొగ మంచు కమ్మేయడంతో దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. విజిబిలిటీ తగ్గిపోవడంతో శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న 20 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్సర్ ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి లక్నో, జైపూర్, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రన్‌వే పైనే నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్లో పొగలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులుట్రైన్ దిగి పరుగులు తీశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న రైలులో వంగపల్లి వద్దకు రాగానే పొగలు రావడాన్ని గుర్తించారు. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే సిబ్బంది ఎయిర్ పైప్‌కు మరమ్మత్తులు చేసి రైలును పంపించారు. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: ఈయన ఓటేశారు.. ఆ తర్వాత ఏమన్నారంటే.. -
పంజాబ్‌ను నీళ్లడిగాం..పొగ కాదు: హరియాణా మినిస్టర్
చండీగఢ్: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై హరియాణా మంత్రిప్రకాష్ దలాల్ మండిపడ్డారు.తాము పంజాబ్‌ను నీళ్లడిగామని, పొగ కాదని సెటైర్ వేశారు. మూడురోజులుగా పంజాబ్,హరియాణాల్లోని పొలాల్లో తగలబెడుతున్న పంటవ్యర్థాల గణాంకాలను దలాల్ శనివారం ట్విటర్లో వెల్లడించారు.పంజాబ్‌లోనే ఎక్కువగా పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారని ఆరోపించారు. కాగా,దలాల్ ఆరోపణలపై పంజాబ్ సర్కారు స్పందించింది.హరియాణా మంత్రి అన్నీఅబద్ధాలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. దేశంలోని 52 అత్యంత కాలుష్య జిల్లాల్లో ఎక్కువ హర్యానాలో ఉన్నవేనని కౌంటర్ ఇచ్చింది. -
శృంగార తార అనే ముద్ర చెరిపేందుకే ‘స్మోక్’ చేశా: నటి
తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనా. ముఖ్యంగా శృంగార తార అనే ముద్రను వేసుకున్నారు. ఇదే తనకు నచ్చలేదని సోమవారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నటి సోనా దర్శకురాలిగా పరిచయం అవుతూ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ స్మోక్. సోనా జీవిత చరిత్రతో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ వివరాలను సోనా వెల్లడించారు. తాను నటిగా 2000 సంవత్సరంలో పరిచయం అయ్యానని చెప్పారు. అలా ఈ 23 ఏళ్లు ఎంతో సంతోషాన్ని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నానన్నారు. శారీరకంగానూ మానసికంగానూ చాలా గాయపడ్డారని చెప్పారు. ఒకానొక సమయంలో సినిమాలు వద్దనుకొని ఇంట్లోనే గడిపానన్నారు. పలు భాషల్లో సుమారు 150 కి పైగా చిత్రాల్లో నటించానని చెప్పారు. తనపై శృంగార తార ముద్ర పడడంతో అందుకు గల కారణాలను వెతుకున్నానని, పుట్టుకతో ఎవరు చెడ్డవారు కాదని వారికి జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, సమస్యలు కారణంగా జీవితాలు మలుపు తిరుగుతాయని పేర్కొన్నారు. ఆ విధంగా తనపై పడ్డ శృంగార తార అనే ముద్రను చెరుపుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ స్మోక్ అని చెప్పారు. తాను దర్శకురాలిగా మారడానికి ముందు ఫిలిం ఇన్స్టిట్యూట్లో దర్శకత్వం, చాయాగ్రహణం శాఖల్లో శిక్షణ పొందినట్లు చెప్పారు. తన జీవితంలో 99.9% వాస్తవాలను ఆవిష్కరించే వెబ్ సిరీస్‌గా స్మోక్ ఉంటుందన్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రచారం అయిన తర్వాత పరిహాసాలు విమర్శలు ఎదురవ్వవచ్చన్నారు. ఇది పూర్తిగా తన జీవిత చరిత్ర అని ఇందులో ఎలాంటి రాజకీయాలు ఉండవని చెప్పారు. దీనికి షార్ట్ ఫ్లిక్ ఓటీటీ సంస్థ సహకారం ఉందని చెప్పారు. -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. వారంలో రెండో ఘటన
సాక్షి, వరంగల్: హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలో సోమవారం ఉదయం 12 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో పొగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు.. చెయిన్ లాగి రైలును ఆపారు. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో భయందోళన చెందిన ట్రైన్ దిగి పరుగులు పెట్టారు. రైలులోని డ్రైవర్లు, గార్డు పరిస్థితిని సమీక్షించి.. రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున పొగలు బోగీలను కమ్మేశాయి. కాగా బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇక హౌరా ఎక్స్‌ప్రెస్ లో పొగలు రావడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం కొరివి మండలం గుండ్రాతిమడుగు వద్ద కూడా రైలుతో పొగలు వ్యాపించాయి. చదవండి: చక్రం తిప్పడం పక్కా.. ఈ బరువు నాకొక లెక్కా -
ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
-
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి- ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు(17405) ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం పొగలు వచ్చాయి. వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఏసీ కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.అనంతం రైల్వే కోపైలట్, సిబ్బంది ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్ యథావిధిగా బయల్దేరింది. సరైన సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగడంతో ప్రమాదం తప్పింది. -
‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని..
హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లి ఒక వ్యక్తి సెలూన్ యజమాని కుమారునితో ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అని అన్నాడు. ఈ మాట విన్న ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జరుగున్న సంఘటనను అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయి చూశారు. దేశరాజధాని ఢిల్లీలో సిగరెట్ తాగే విషయంలో చోటు చేసుకున్న వివాదం దారుణానికి దారితీసింది. ఈ ఉదంతం ఢిల్లీలోని కిషన్గఢ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తిపై దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో సెలూన్‌కు వచ్చిన ఒక యువకుడు అక్కడే ఉంటున్న 38 ఏళ్ల వ్యక్తిపై కత్తెరతో పలుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అభయ్ కుమార్ అనే వ్యక్తి హెయిర్ కంటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లాడు. అదే సమయంలో దుకాణం యజమాని కుమారుడు మెహిత్ మహలావత్(22) అక్కడికి వచ్చాడు. అతను మద్యం మత్తులో ఉండి, సిగరెట్ కాలుస్తున్నాడు. దీంతో అభయ్ అతనితో ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే మోహిత్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడేవున్న కత్తెర తీసుకుని పలుమార్లు అభయ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో అభయ్ శరీరంపై 9 చోట్ల గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే.. -
అడవి మంటలు.. అక్కడ గాలి కూడా డేంజరే..
కెనడాలో కొనసాగుతున్న అడవి మంటల కారణంగా అధికారులు ఉత్తర అమెరికా అంతటా మిలియన్ల మంది ప్రజలకు హై-రిస్క్ ఎయిర్ క్వాలిటీ హెచ్చరికలు జారీ చేశారు. కెనడియన్ రాజధానిలోని ప్రస్తుతమున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యానికి చాలా అధిక ప్రమాదంగా మారినట్లు అధికారులు పేర్కొన్నారు. టొరంటోతో పాటు దాని పరిసర ప్రాంతాలలో, గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువ సేపు బయట ఉన్నట్లయితే అనారోగ్యబారిన పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈశాన్య అమెరికాలో చాలా వరకు గాలి నాణ్యతను అనారోగ్యకరంగా మారినట్లు తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న శ్వాసకోశ సమస్యలున్న వ్యక్తులకు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ఈ పొగ ఉత్తరాన బోస్టన్ వరకు, దక్షిణాన పిట్స్బర్గ్, వాషింగ్టన్ డీసీ వరకు విస్తరించి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూ ఇంగ్లండ్‌లోని కొన్ని ప్రాంతాలులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ టాప్ 200లో ఉన్నాయి, అంటే ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. న్యూయార్క్‌లో, మంగళవారం ఉదయం తీసిన ఫోటోలు కెనడా నుండి దక్షిణ దిశగా ప్రయాణించిన అడవి మంటల పొగ కారణంగా నగరం స్కైలైన్పై నారింజ పొగమంచు కప్పినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలతో ఉన్న వ్యక్తులను ఈ పొగ అలుముకున్న ప్రాంతాల నుంచి ఖాళీ చేస్తున్నారు. కెనడా సాధారణం కంటే ఈ ఏడాది ఎక్కువ అడవి మంటలను సెగను చవి చూడాల్సి వస్తోంది. ప్రస్తుత సీజన్లో చాలా వరకు పొడి, వేడి పరిస్థితుల కారణంగా ఈ వేసవిలో కెనడాలో అతిపెద్ద మంటలు సంభవించవచ్చని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు. చదవండి: ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్ లేదు -
కావలి వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!
సాక్షి, నెల్లూరు: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో, వెంటనే రైలును కావలి రైల్వేస్టేష్టన్‌లో నిలిపివేశారు. వివరాల ప్రకారం.. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం కావాలి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే బీ-5 బోగీ వద్ద చక్రాల నుంచి పొగలు వచ్చాయి. అది గమినించిన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశాడు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రయాణీకులకు ప్రమాదం తప్పింది. ఇక, స్వల్ప మరమ్మతుల అనంతరం అరగంట తర్వత రైలు బయలుదేరింది. ఇక, రాజధాని ఎక్స్‌ప్రెస్.. నిజాముద్దీన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా కావలి సమీపంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
స్పైస్‌జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్‌జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్‌టైం విమానం ట్రిప్‌కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్‌లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్‌రూమ్‌లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్‌లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెనుప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే.. ఎయిర్‌పోర్ట్‌లో సేప్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. -
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. కొచ్చి రావాల్సిన ఎయిరిండియా విమానం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో విమానంలో ఉన్నట్టుండి పొగలు వ్యాపించడం ఆందోళన రేపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఒమన్ నివేదించింది. మస్కట్ నుండి కొచ్చిన్‌కు రావాల్సిన ఐఎక్స్-442 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంటలంటుకున్నాయి. టేకాఫ్ సమయంలో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది స్లైడ్ల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. విమానం మస్కట్నుంచి కొచ్చికి బయలు దేరాల్సి ఉంది. ప్రయాణికులు అందరినీ (141+ 4గురు శిశువులు) ఖాళీ చేయించామనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంబంధఙత అధికారి తెలిపారు. అయితే ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వరుస ఘటనల కలకలం: ఇండిగో విమానం క్యాబిన్లో పొగలు
న్యూఢిల్లీ: అసలే వర్షాకాలం. దీనికి తోడు పలు సంస్థల విమానాల్లో వెలుగులోకి వస్తున్న సాంకేతిక లోపాలు విమాన ప్రయాణీకుల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్ విమానంలో వరుస ఘటనలు, విస్తారా విమానంలో ఇంజన్ ఫెయిల్ లాంటి అంశాలు ఆందోళన రేపాయి. ఇపుడిక ఈ జాబితాలో ఇండిగో చేరింది. ఇండోర్‌లో విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇండిగో విమానంలో పొగలు వ్యాపించడం కలకలం రేపింది రాయ్‌పూర్-ఇండోర్ ఇండిగో విమానం మంగళవారం ల్యాండ్ అయిన తర్వాత క్యాబిన్లో పొగలు వచ్చినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలిపింది. అయితే ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ, ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీజీసీఏ వెల్లడించింది. గత మూడు వారాల్లో అసాధారణ సంఘటనలు నమోదవుతున్నాయి. గో-అరౌండ్, మిస్డ్ అప్రోచ్‌లు, డైవర్షన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఎమర్జెనీ ల్యాండింగ్, క్యాబిన్లో పొగలు, వాతావరణం, టెక్నికల్, బర్డ్ హిట్లు ఉన్నాయి. కాగా గత 18 రోజుల్లో ఎనిమిది సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో డీజీసీఏ బుధవారం స్పైస్‌జెట్‌కి షో-కాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
క్యాబిన్లో పొగలు: స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ఢిల్లీ: ప్రైవేటురంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు అలుముకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్త మయ్యారు. తక్షణమే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. #WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk — ANI (@ANI) July 2, 2022 ఢిల్లీ నుంచి జబల్పూర్కు వెళుతున్న విమానంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లోకి ఎగిరి, సుమారు 5వేల అడుగుల ఎత్తుకు చేరిన తరువాత క్యాబిన్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన పైలట్లు, సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. SpiceJet: On July 2 @flyspicejet Q400 aircraft was operating SG-2962 (Delhi-Jabalpur). While passing 5000ft, the crew noticed smoke in the cabin. The pilots decided to return back to Delhi. Aircraft landed safely & passengers were safely disembarked. pic.twitter.com/N6cu7kFj0e — Poulomi Saha (@PoulomiMSaha) July 2, 2022 -
హైదరాబాద్ ప్రజలకు ఊపిరి ఆడట్లే.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీలో వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో ‘భూస్థాయి ఓజోన్ (పొగ కారణంగా విడుదలయ్యే వాయువు)’ మోతాదు ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలంలో అనూహ్యంగా పెరిగింది. మూడు నెలల్లో సుమారు 43 రోజులపాటు భూస్థాయి ఓజోన్ మోతాదు పరిమితులు దాటింది. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గత మూడేళ్లుగా వేసవిలో భూస్థాయి ఓజోన్ మోతాదుపై ఆరు నగరాల డేటాను పరిశీలించింది. ఇందులో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా మెట్రో నగరాలు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో గ్రేటర్ సిటీ నాలుగోస్థానంలో నిలవడం గమనార్హం. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలియడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహించిందని పేర్కొంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 మైక్రోగ్రాములుగా నమోదయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... ►అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి ►గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. ►ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం. కట్టడి ఇలా.. ►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించాలి. ►కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్ వల్ల కలి గే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ►కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. ►గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ►పతీ వాహనాని కి ఏటా పొల్యూషన్ చెక్ పరీక్ష లను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. ►ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. -
పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్ యుద్ధం!
Lot of smoke in Kyiv, people can't breathe properly: రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ మొత్తం దట్టమైన పొగ మేఘంతో కప్పబడి ఉంది. దీంతో ఉక్రెయిన్ అధికారులు గాలి నాణ్యత.. అనారోగ్యకరమైన స్థాయిలో ఉందని నివాసితులు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా తమ ఇళ్లను విడిచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక వాయు నాణ్యత మార్గదర్శక విలువ కంటే ప్రస్తుతం కీవ్‌లోని గాలిలో కాలుష్య కారకాల సాంద్రత 27.8 రెట్లు ఎక్కువగా ఉందని ఓ నివేదిక తెలిపింది. మార్చి19 నుంచి వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు కీవ్‌లో పొగ ఎక్కువగా ఉందని, ప్రజలు సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. అతేకాదు గాలిలో పొగలు కమ్ముకుంటున్నందున ప్రజలు తమ కిటికీలు తెరవవద్దని, అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నగర పాలక సంస్థ కూడా ప్రజలను కోరింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి కీవ్‌లో అనేక పేలుళ్లు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్- రష్యా వార్ ముఖ్యాంశాలు ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ప్రకటించి 24 రోజులైంది. ఐక్యరాజ్యసమిది నివేదిక ప్రకారం, 3.2 మిలియన్ల మంది ప్రజలు దేశం నుంచి పారిపోగా, మరో 6.5 మిలియన్ల మంది ఉక్రెయిన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ యుద్ధంలో వందలాది మంది పౌరులతో పాటు, 112 మంది పిల్లలు మరణించారని దాదాపు 13 వేల మంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధాన్ని ఆపడానికి, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే, అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ, నాటో నేరుగా పాల్గొనడానికి లేదా ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. ఉక్రెయిన్, రష్యాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఉక్రేనియన్ అధికారులతో చర్చలు జరుపుతున్న రష్యా ప్రతినిధి బృందం శుక్రవారం ఒక ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని చెప్పారు. (చదవండి: పాపం మూగజీవాలు..యుద్ధం వల్ల మనుషులకే కాదు పశువులకు ఇబ్బందులే!) -
వైరల్ వీడియో: రింగులు రింగులుగా పొగ వదిలిని పెళ్లి కుమార్తె
-
వైరల్: వధువు నోరు, ముక్కు నుంచి పొగ!
గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలే ట్రెండ్ అవుతున్నాయి. కావాలని చేస్తున్నారో.. లేక నిజంగానే జరుగుతున్నాయో తెలియదు కానీ పెళ్లి మంటపం వేదికగా పలు విచిత్ర, విభిన్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో పెళ్లి కుమార్తె ఏకంగా వరుడు, బంధువుల సమక్షంలో కెమరా ముందు రింగులు రింగులుగా పొగ వదులుతూ కనిపించింది. ఈ సీన్ చూసిన వారు వెంటనే ఛీ సిగ్గు లేదు.. సిగరెట్ తాగుతున్నావా అని తిడదామనుకుంటారు. కానీ తర్వాత కనిపించే దృష్యంతో అసలు విషయం తెలుస్తుంది. సర్వర్ పొగలు కక్కే ఆహారా పదార్థాన్ని ఒకదాన్ని ఆమె నోటికి అందిస్తాడు. దాన్ని తిన్న వధువు ఇలా నోరు, ముక్కు నుంచి రింగులురింగులుగా పొగ వదులుతుంది. సడెన్‌గా చూసిన వారికి స్మోకింగ్ చేస్తుందా ఏంటి అనిపిస్తుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు లేవు కానీ.. ఈ వీడియో చూసిన వారంతా యాంకర్ సుమను గుర్తు చేసుకుంటున్నారు. గతంలో సుమ కూడా ఇలానే ఐస్‌క్రీం తిని నోరు, ముక్కులోనుంచి పొగలు వదిలి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. చదవండి: అతడికి 23, ఆమెకు 60.. ‘‘నానమ్మలాంటి ఆమెతో లవ్వేంటిరా బాబు’’! -
క్షణాల్లో వ్యాపించిన మంటలు, ఆలస్యం అయ్యుంటే..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఉన్న బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దట్టంగా పొగ అలుముకుంది. అయితే డ్రైవర్ అప్రపమత్తతో ప్రమాదం తప్పింది. పాయకరావుపేట జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద ఈ ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. మంగళవారం ఒడిషా నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు పాయకరావుపేట వై జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ క్రమంలోనే బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగి పొగలు రావడం ప్రారంభమైంది. అప్రత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులను కిందకు దించారు. చూస్తుండగానే బస్సులో మంటలు అంతకంతకూ ఎక్కువయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతో సురక్షితంగా బయటపడ్డ ప్రమాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
ఆందోళనల 'పొగ'
మల్కాపురం (విశాఖ పశ్చిమ): మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పులు చెరుగుతున్న వేళ.. కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఉక్కుపోత, చెమటతో ఇళ్లలో ఉండలేక.. చాలామంది ఆరుబయటికొచ్చారు. సరిగ్గా అదే సమయంలో సమీపంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) రిఫైనరీ వద్ద గోధుమ వర్ణంలో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమేస్తున్న దృశ్యం చూసి మల్కాపురం, వెంకటాపురం తదితర చుట్టుపక్కల ప్రాంతాలవారు బెంబేలెత్తిపోయారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన ఇంకా కళ్లముందే మెదులుతుండగానే.. హెచ్‌పీసీల్ నుంచి రేగుతున్న ఈ పొగ స్థానికుల్లో ఆందోళనను రాజేసింది. మళ్లీ ఏ విపత్తు ముంచుకొస్తుందోన్న భయంతో ఇళ్లలో ఉన్నవారు సైతం రోడ్లపైకి వచ్చేసి దూరప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. ఇంకొందరు రిఫైనరీ గేటు వద్దకు చేరుకొని వాకబు చేయసాగారు. ఇంతలోనే ఐదు పది నిమిషాల వ్యవధిలోనే పొగలు ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పొగలు రావడం సాధారణమేనని.. అయితే ఈసారి కాస్త మోతాదు పెరిగిందని, దీని వల్ల ఎటువంటి ప్రమాదం లేదని హెచ్‌పీసీఎల్ అధికారులు వివరించారు. ఎఫ్‌సీసీఎల్ యూనిట్–1 కంబర్షన్ సమయంలో పైప్‌లైన్‌లో నిలిచిన వ్యర్థాల కారణంగా పొగ ఎక్కువగా వచ్చిందని.. ఇందులో ఎటువంటి రసాయనాలు గానీ, విషవాయువులు గానీ లేవని భరోసా ఇచ్చారు. దాంతో కొంత శాంతించినప్పటికీ.. భవిష్యత్తులో పెనువిపత్తులు సంభవించకుండా తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న కలెక్టర్ వినయ్ చంద్ ములగాడ తహసీల్దార్ రమామణిని అప్రమత్తం చేశారు. వెంటనే హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్న ఆమె సంస్థ ప్రతినిధులతో చర్చించి వివరాలు సేకరించారు. స్థానికులకు పరిస్థితిని వివరించి ఆందోళన విరమింపజేశారు. ఇది ప్రమాదమే కాదు యూనిట్లో కంబర్షన్లో స్వల్ప లోపం తలెత్తడం వల్లే ఒక్కసారిగా పొగ వ్యాపించింది. ప్లాంట్‌లో ఇది సర్వసాధారణమే తప్ప ఎలాంటి ప్రమాదం వాటిల్లదు. స్థానికులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా పొగను అదుపులోకి తీసుకొచ్చాం. 35 నుంచి 40 డిగ్రీల మధ్యలో ట్యాంకు ఉష్ణోగ్రత ఉంటుంది. దాన్ని హయ్యర్ టెంపరేచర్ వద్ద మండించి వేపర్ చేసి రకరకాల చర్యలతో ఉత్పత్తులు తయారవుతాయి.– నారిశెట్టి రాజారావు, సీనియర్ జనరల్ మేనేజర్, హెచ్‌పీసీఎల్ ప్రాణాలు పోతాయని భయమేసింది పొగ చూడగానే ఏడుపు వచ్చింది. ప్రాణాలు పోతాయని భయమేసింది. వీధిలో ఉన్న అందరం బిగ్గరగా అరిచాం. ఇళ్ల నుంచి బయటికి వచ్చి అందరం రోడ్లపై నిలుచున్నాం. పొగ మొత్తం కమ్మేసింది. అయితే కొద్ది నిమిషాల్లోనే మాయమైపోవడంతో ఊపిరి పీల్చుకున్నాం. – బి.స్వప్న, ప్రియదర్శిని కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం మధ్యాహ్నం కరెంట్ లేకపోవడంతో ఇంటి నుంచి బయటికి వచ్చాం. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ కనిపించడంతో భయపడ్డాం. ఎల్జీ పాలిమర్స్లోలా ప్రమాదం జరిగిందేమోనని ఉలిక్కిపడ్డాం. ఇళ్ల నుంచి వెళ్లిపోదామనుకునేలోగా పొగ మాయమైపోయింది. –చట్టి నూకరాజు యాదవ్, మల్కాపురం -
హెచ్‌పీసీఎల్ నుంచి భారీగా పొగలు, కలకలం
-
విశాఖలో భారీగా పొగలు, కలకలం
సాక్షి, విశాఖపట్నం: హిందూస్టాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో విశాఖపట్నంలో కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో సీడీయూ-3ని తెరిచే క్రమంలో గాలిలోకి దట్టమైన పొగలు వెలువడ్డాయి. గోధుమ రంగు పొగలు దట్టంగా గాలిలోకి వ్యాపించడంతో విశాఖ నగర వాసులు ఆందోళనకు గురయ్యారు. అయితే కొంతసేపటికి పొగలు రావడం ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. ఫ్లూయిడ్ క్యాటలిక్ క్రాకింగ్ సమయంలో దట్టమైన పొగలు వస్తాయని తెలిపారు. ఎల్జీ పాలీమర్స్ గ్యాస్‌లీక్ దుర్ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంట్ను విశాఖ వాసులు హెచ్‌పీసీఎల్ రిఫైనరీ నుంచి భారీగా పొగలు రావడం చూసి భయాందోళనకు గురయ్యారు. అయితే గతంలోనూ ఇదేవిధంగా పొగలు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. కాగా, 2013, ఆగస్టు 23న హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది కార్మికులు మృతి చెందగా, 18 మంది కాలిన గాయాలపాలయ్యారు. కూలింగ్ టవర్ పేలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. (గ్యాస్‌లీక్ బాధితులకు పరిహారం సంపూర్ణం) -
రాత్రిళ్లు హైవేలపై బైక్ ప్రయాణం నిషేధం
గుంటూరు వెస్ట్: రాత్రిళ్లు మంచు ఎక్కువగా కురుస్తుండటంతో అధిక సంఖ్యలో ద్విచక్ర వాహన ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాల ప్రయాణాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవరసరంగా ప్రయాణించాల్సి వస్తే బస్సు, మరేదైనా పెద్ద వాహనంలో వెళ్లాలని సూచించారు. అవసరం కంటే ప్రాణం విలువైనదన్నారు. ట్రక్కులు, ట్రాక్టర్ల వల్ల కూడా ప్రయాణాలు అధికంగా జరుగుతున్నాయని, వారు రాత్రిళ్లు ప్రయాణించేటప్పుడు వెనుక రేడియం స్టిక్కర్లు వేయించుకోవాలన్నారు. డ్రైవర్లు మితిమీరిన వేగంతోపాటు నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే అతడిపై ఆధారపడే కుటుంబం గురించి ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో జాతీయ రహదారులు, ఆర్టీఓ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో చర్చించారు. సమావేశంలో అర్బన్, రూరల్ ఎస్పీలు విజయరావు, రాజశేఖరబాబు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పొగమంచు
గుంటూరు, కంచికచర్ల (నందిగామ) : పొగమంచు దట్టంగా వ్యాపించడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, 11 మంది గాయాలపాలైన ఘటన కంచికచర్లలో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. హైద్రాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన 9 ఈవెంట్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన 12మంది కాకినాడలో జరిగే ఓ ఫంక్షన్లో క్యాటరింగ్ చేసేందుకు కారులో హైద్రాబాద్ నుంచి రాత్రి 2.30గంటలకు బయలుదేరారు. వీరిలో ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఖాళీ సమయాల్లో క్యాటరింగ్ పనులకు వెళ్తుంటారు. వీరు ప్రయాణించే కారు కంచికచర్ల కంచలమ్మ చెరువు కట్టపైకి రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొని, ఆ తర్వాత అదే రూట్లో ముందున్న రోడ్డు రోలర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. అయితే తెల్లవారుజాము కావటంతో రోడ్డుపై దట్టంగా పొగమంచు అలుముకుని ఉంది. దీంతో ముందు వెళ్తున్న వాహనాలు సక్రమంగా కనిపించకపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తటకంటి గణేష్ (25) అనే వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. అతనికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్యతో సహా క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాడు. ఈ ప్రమాదంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. భర్త గణేష్ మృతదేహాన్ని చూసి ఉమామహేశ్వరి బోరున విలపించింది. కారులో ఉన్న డ్రైవర్‌తోపాటు మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో అద్దరపు నాగరాజు, తడకంటి ఉమామహేశ్వరి, అద్దరపు లక్ష్మి, జూపూడి భార్గవి, కే పూజ, గర్రె మహేష్, గర్రె సంధ్య, వాంకుడోత్ సంగీత, కోడూరు మధుసూదనరెడ్డి, కొలిమి మహేష్, మహ్మద్ అజీమ్ ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న కంచికచర్ల 108 అంబులెన్స్ వాహన సిబ్బంది, నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ దాడి చంద్రశేఖర్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. అంతేకాకుండా కారు డ్రైవర్ కూడా నిద్రమత్తులోకి జారుకున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. -
కాటేసిన పొగమంచు
గుంటూరు, దాచేపల్లి : క్రిస్మస్ పండుగను ఆనందంతో జరుపుకున్న ఓ కుటుంబాన్ని పొగమంచు కాటేసింది. క్రిస్మస్ పండుగకు కుమారుడు, కుమార్తెకు కావాల్సిన దుస్తులు..ఇతర వస్తువులను తాత, తండ్రి కలిసి కొన్నారు. పండుగ సందర్భంగా చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను పలకరించేందుకు తండ్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి బయలు దేరారు. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుతామని అనుకుంటున్న సమయంలో మృత్యువు పొగమంచు రూపంలో వచ్చి కాటేసింది. దాచేపల్లి గ్రామ సమీపంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై భవ్య పెట్రోల్ బంక్ ఎదురుగా బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెనాలికి చెందిన బేతపూడి పరంజ్యోతి(60), బేతపూడి బిపిన్‌చంద్(34) అక్కడికక్కడే మృతిచెందగా బిపిన్‌చంద్ భార్య చైతన్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. దాచేపల్లి ఎస్ఐ షేక్ మహ్మద్ రఫీ కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలికి చెందిన బేతపూడి పరంజ్యోతి దంపతులు, వారి కుమారుడు బిపిన్‌చంద్, చైతన్య దంపతులు, బిపిన్ చంద్ కుమారుడు, కుమార్తె అర్నాల్డ్, ఏంజిలిన్తో కలిసి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. బిపిన్‌చంద్ ట్రావెల్స్ సర్వీస్‌ను నడుపుతున్నాడు. క్రిస్మస్ వేడుకలను ముగించుకుని తెనాలిలో అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను పలకరించేందుకు బిపిన్‌చంద్ భార్య, పిల్లలు, తండ్రి పరంజ్యోతితో కలిసి ఏపీ09 ఎజెడ్ 7703 నంబర్ కారులో బయలు దేరారు. మార్గమధ్యంలో దాచేపల్లిలో ఆగి టీ తాగారు. అనంతరం బిపిన్‌చంద్ కారు నడుపుతూ తెనాలికి బయలు దేరారు. పొగమంచు బాగా కురుస్తుండటం వలన రోడ్డు సక్రమంగా కన్పించలేదు. ఈ క్రమంలో భవ్య పెట్రోల్‌బంక్ ఎదురుగా ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు బలంగా ఢీకొట్టింది. కంటైనర్ లారీ వెనుకభాగంలో ఉన్న టైర్ల వరకు కారు దూసుకుపోవటంతో టాప్ లేచి నుజ్జునుజ్జు అయ్యింది. కారు నడుపుతున్న బిపిన్‌చంద్, ముందు సీట్లో కుర్చున్న పరంజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వెనుక సీట్లో కుర్చోన్న బిపిన్ చంద్ భార్య చైతన్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయి మృతిచెందిన బిపిన్‌చంద్, పరంజ్యోతిల మృతదేహాలను ఎంతో శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన చైతన్యను హైవే అంబులెన్స్ వాహనం ద్వారా పిడుగురాళ్లకు తరలించారు. మృత్యుంజయులు రోడ్డు ప్రమాదంలో బిపిన్‌చంద్ కుమారుడు అర్నాల్డ్, కుమార్తె ఏంజిలిన్ మృత్యుంజయులుగా బయటపడ్డారు. కారు వెనుక సీట్లో తల్లి చైతన్య పక్కనే కూర్చున్న వీరు స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నారు. లారీని కారు ఢీకొట్టిన వెంటనే కారు వెనుకడోర్లు తెరుచుకొని వీరు కిందపడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. కళ్లముందు మృతిచెందిన తాత, తండ్రి మృతదేహల వద్ద అర్నాల్డ్, ఏంజిలిన్లు భోరున విలపించారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లిని అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు. -
తల్లి, కొడుకు అనుమానాస్పద మృతి
-
జూబ్లీహిల్స్‌లో విషాదం
సాక్షి, హైదరాబాద్: జూబ్లిహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో తల్లి, కొడుకు మృతి చెందారు. చలి వేస్తుందని ఇంట్లో బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్న తల్లీకుమారుడు ఇళ్లంతా పొగ నిండుకుని ఊపిరాడక మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ప్లాట్ నెంబర్ 306లో కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పెథాయ్ తుపాను కారణంగా బాగా చలి గాలులు వీస్తుండటంతో వారు ఉండే గదిలో బుచ్చివేణి ఆమె కుమారుడు పద్మరాజు బొగ్గుల కుంపటి ఏర్పాటు పెట్టుకున్నారు. వేడిగా ఉండటానికి తలుపులు, కిటికీలు కూడా మూసేశారు. వారిద్దరూ నిద్రలోకి ఉపక్రమించిన తర్వాత ఇంట్లో పొగ కమ్ముకుని పడుకున్న చోటే మృతి చెందారు. బయటి నుంచి సత్యబాబు ఎంతసేపు తలుపుకొట్టినా తీయకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా బుచ్చివేణి, పద్మరాజు నిర్జీవంగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. యజమాని ఇంట్లో కుక్క కూడా బుధవారమే చనిపోయింది. ఈ విషయంపై ఏదైనా గొడవ జరిగి వారేమైనా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బొగ్గుల కుంపటి కారణంగానే చనిపోయారా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు. మృతుడు పద్మరాజు మృతురాలు బుచ్చివేణి -
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
సాక్షి, కోలకతా: ఇండిగో ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం మరోసారి ప్రమాదంలో పడింది. ఇండిగో నియోఎయిర్ బస్-300విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో కోలకతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. జైపూర్‌నుంచి కోలకతా బయలుదేరిన ఇండిగో విమానంలో ఆకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బందికి కాసేపు గందరలోళానికి లోనయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి తరలించారు. కాక్‌పిట్‌లో పొగలను గమనించిన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని ఎయిర్‌లైన్స్ వివరించింది. 136 మంది ప్రయాణికులు క్షేమమని వెల్లడించింది. IndiGo flight 6E-237 operating on Jaipur-Kolkata route made an emergency landing due to suspected smoke in the cabin on December 10. All passengers and crew safe. pic.twitter.com/std4XqdbW9 — Debanish Achom (@journeybasket) December 11, 2018 -
ప్రైవేటు బస్సు నుంచి పోగలు
-
పొగ మాన్పించేందుకు కొత్త ఎంజైమ్!
పొగతాగడం మానేయాలనుకుంటున్న వారికి ఓ శుభవార్త. ఏటా 50 నుంచి 60 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ అలవాటును మాన్పించేందుకు స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. పొగతాగిన వెంటనే రక్తంలోకి చేరే నికోటిన్‌ను అక్కడికక్కడే నాశనం చేయగల ఎంజైమ్‌ను వీరు అభివృద్ధి చేశారు. పొగాకు పొలం నేలలో ఉండే సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియా స్రవించే ఎంజైమ్ నిక్–ఏ2ను మూడేళ్ల క్రితమే స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ గుర్తించింది. అప్పటి నుంచి దీన్ని కృత్రిమంగా తయారు చేయడంతో పాటు.. నికోటిన్‌ను నాశనం చేయగల దాని శక్తిని మరింత వృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వీరు అభివృద్ధి చేసిన నిక్–ఏ2–జే1 ఎంజైమ్‌ను ఎలుకలపై ప్రయోగించి చూసినప్పుడు అది చాలా సమర్థంగా రక్తంలోని నికోటిన్ మోతాదులను తగ్గించినట్లు తెలిసింది. మెదడును చేరేలోపు రక్తంలోని నికోటిన్ నాశనమవుతోంది కాబట్టి పొగ తాగడం ఒక వ్యసనంగా మారదని అంచనా. ఇప్పటివరకూ ఈ ప్రయోగాలు ఎలుకలకు మాత్రమే పరిమితం. భవిష్యత్తులో మానవుల్లోనూ ఇదే రకమైన ఫలితాలను రాబట్టగలిగితే ఈ ఎంజైమ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏర్పడుతుంది. -
ఢిల్లీని వదిలి.. దక్షిణాది బాట..
న్యూఢిల్లీ : నానాటికీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో చాలామంది ప్రొఫెషనల్స్ ఢిల్లీని వీడి దక్షిణ భారతదేశ ప్రాంతాలకు వలస వస్తున్నారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రికలో కథనం వెలువడింది. కాలుష్యం కారణంగా కుటుంబపరమైన సమస్యలతోనే ఢిల్లీ వాసులు బెంగళూరు, గోవా, హైదరాబాద్‌లకు తరలివెళ్తున్నట్లు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థల రిపోర్టులు చెబుతున్నాయి. ఏడాదిన్నరగా ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిపోవడంతో ఎక్కువమంది ప్రొఫెషనల్స్ పిల్లలు, తల్లిదండ్రులు స్మాగ్ కారణంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీంతో సొంత ఇళ్లను అమ్ముకుని మరీ దక్షిణాది ప్రాంతాలకు వారు వలస వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో గ్రీనరీతో పాటు గాలి నాణ్యత అధికంగా ఉంటుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
త్రుటిలో తప్పింది..
తూర్పు గోదావరి : బుధవారం..రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్..సమయం ఉదయం 9.45 గంటలుడిబ్రూఘర్ టౌన్ నుంచి తాంబరం వెళుతున్న 15930 నంబర్‌గల ఎక్స్ప్రెస్రైలు మొదటి ప్లాట్‌ఫాంపై ఆగింది.రైలు నిర్ణీతసమయంలో ప్లాట్‌ఫాం నుంచి విజయవాడవైపు బయల్దేరింది.ఆ సమయంలో సీటీఐ కార్యాయంలో విధులు నిర్వహిస్తున్న సీటీఐ కేశవభట్ల శ్రీనివాసరావు నడుస్తున్న రైలు ఏస్–4 బోగీ కింద నుంచి పొగలు రావడం గమనించారు. తక్షణమే అప్రమత్తమై స్టేషన్‌లోని డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్‌నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు.రైలును తక్షణమే నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న ట్రైన్ లైటింగ్, ఎలక్ట్రికల్ స్టాఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పొగలు వస్తున్న బ్యాటరీ గ్యారేజ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చాయని సకాలంలో గుర్తించడం వల్ల అగ్నిప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. రైలు ఇదే విధంగా మందుకు వెళితే విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. పొగలు వస్తున్న బ్యాటరీ వైర్లను తొలగించి రైలును విజయవాడ వైపు తరలించారు. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై సీటీఐ కేÔశవభట్ల శ్రీనివాసరావును వివరణ కోరగా బోగీ కింద నుంచి పొగలు రావడం చూస్తే ఇటీవల రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం గుర్తుకు వచ్చిందన్నారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించానన్నారు. వారు తక్షణమే స్పందించి ఏవిధమైన ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా కేశవభట్లను స్టేషన్ సిబ్బంది అభినందించారు. -
డేంజర్ జోన్లో ఢిల్లీ
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి ముంచుకొచ్చినా ఢిల్లీని విషవాయువులు వీడటం లేదు. విపరీతమైన వాయు కాలుష్యం రాజధానిని కమ్మేసింది. శీతాకాలంలో అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన వాయుకాలుష్యం ఇప్పటికీ అదే స్ధాయిలో కొనసాగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీలో మంగళవారం ఉదయం ప్రమాదకర పీఎం 2.5 స్ధాయి 200గా నమోదైంది. ఇది సురక్షిత స్ధాయి 100 కంటే రెట్టింపు కావడం గమనార్హం. ఇక లోధి రోడ్లో పీఎం 2.5 స్థాయి 190గా నమోదవగా, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరంగా 463గా నమోదైంది. దేశ రాజధానిలో నెలకొన్న వాతావరణం ప్రమాదభరితమని, కలుషిత వాయువులతో ప్రజల ఆరోగ్యానికి పెను సవాల్ ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా అధికారుల్లో కదలిక లేదు. పరిస్థితి విషమించేలా ఎలాంటి ఆంక్షలు లేకుండా వాహన ట్రాఫిక్ యథావిధిగా కొనసాగుతూ నిర్మాణ పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. నవంబర్, డిసెంబర్ మాసాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్ధాలను తగలబెట్టడం ఢిల్లీ వాయు కాలుష్యానికి కారణమని అధికారులు అప్పట్లో చెప్పినా వేసవి ప్రారంభమైనా నగరంలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. కాలం చెల్లిన వాహనాలపై కఠిన ఆంక్షలు విధించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటైన ఇంధనాలను వాడేలా వాహనాలను అప్‌గ్రేడ్ చేయడంలో అధికారుల అలసత్వం పరిస్థితి తీవ్రతకు కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘పొగ’ కష్టాలు తప్పట్లేదు
సత్తుపల్లిరూరల్ : మధ్యాహ్న భోజనాన్ని కట్టెల పొయ్యిలపై చేసేందుకు వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టెలు దొరకక పోవటం.. అటవీ ప్రాంతాల నుంచి పుల్లలు తీసుకొచ్చే వీలు లేకుండా పోవటంతో కట్టెలకు కూడా డిమాండ్ పెరిగింది. పదిహేడేళ్లుగా కట్టెల పొగతో వంట చేస్తుండటంతో కళ్ల మంటలు వచ్చి కంటిచూపు తగ్గిపోతుందని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 2017 నాటికే మధ్యాహ్న భోజనం చేసేందుకు గ్యాస్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు అమలుకు నోచుకోవటం లేదని మధ్యాహ్న భోజన వర్కర్లు వాపోతున్నారు. క్లాసురూంల్లోకి ఈ పొగ వెళ్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. ఇప్పటికైన ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్లకు గ్యాస్‌ను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. వర్షం వస్తే గొడుగుల కిందే.. వర్షం వస్తే వంట షెడ్లు లేకపోవటంతో మధ్యాహ్న భోజన కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. భవనాల సన్‌సైడ్ కిందో.. గొడుగుల కింద వంటలు చేయాల్సి వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన వంట పాత్రలు పాడైపోవటంతో సొంతంగా వంట పాత్రలు కొనుగోలు చేసుకొని వంట వండాల్సి వస్తోందంటున్నారు. పదిహేడేళ్ల నుంచి చేస్తున్నా.. కనీస వేతన చట్టం అమలుకు నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వడ్డించే బిల్లులు రెండు నెలలుగా అందక పోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పు, నూనె, కారం వంటి సరుకులు అప్పులు తెచ్చి వంట చేస్తున్నామని.. ప్రభుత్వం ఏ నెల బిల్లులు ఆ నెలలోనే చెల్లిస్తే తమ కష్టాలు తప్పుతాయంటున్నారు. గుడ్డు ధర పెరిగింది.. మార్కెట్లో కోడి గుడ్డు ధర రూ.5 ఉండగా ప్రభుత్వం మాత్రం రూ.4 మాత్రమే చెల్లిస్తుండటంతో వారానికి రెండు సార్లు వడ్డించాలంటే నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేయాలని కోరుతున్నారు. కళ్ల మంటలతో.. కట్టెల పోయ్యి మీద వండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పొగతో కళ్లు మంటలు వస్తున్నాయి. ప్రభుత్వ గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పినా అమలుకు నోచుకోవటం లేదు. పొగతో విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. – పూచి సీత, వర్కర్, సత్తుపల్లి -
పొగమంచులోనూ రైళ్లకు మరింత వేగం
న్యూఢిల్లీ: పొగమంచు వంటి అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైళ్లను గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. పొగమంచు వంటి అవాంతరాలు ఎదురైన సందర్భాల్లో ప్రస్తుతం ఉన్న 60 కిలోమీటర్లకు బదులు 75 కి.మీ వరకు వేగంతో రైళ్లను నడిపేలా డ్రైవర్లకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు రైల్వే బోర్డు అన్ని జోన్ల అధికారులకు లేఖలు రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాక్ స్పష్టంగా కనిపించేందుకు అవసరమైన పరికరాలను వాడుకోవాలని సూచించింది. ఆర్థికంగా లాభసాటి కాని స్టేషన్లలో రైళ్లను ఆపవద్దని, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ పాయింట్లను, సమయాన్ని తగ్గించటం వంటి చర్యలతో వేగం పెంచుకోవాలని జోన్లకు తెలిపింది. -
ఆ పెద్దాయన కోరిక ఎంత పని చేసింది..!
సాక్షి, ముంబై: విమాన ప్రయాణ నిబంధనల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఓ పెద్దాయన ..ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాదు తోటి ప్రయాణీకుల గుండెల్ని గుభేల్మనిపించారు కూడా. ఆయన చేసిన పనికి అకస్మాత్తుగా విమానంలో గందరగోళం, భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దు మణిగింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే హర్యానాలోని ఇజ్జర్ నివాసి రాజ్‌కుమార్ లక్ష్మీనారాయణ్ గార్గ్(65) మొదటిసారి విమానంలో ముంబై బయలుదేరారు. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యే నిమిత్తం అత్యవసరంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి జనవరి 9న రాయ్‌పూర్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో (6ఈ-802) బయలుదేరారు. ఇంతలో బీడీ తాగాలన్న కోరికను నియంత్రించుకోలేని లక్ష్మీనారాయణ్...వెంటనే విమానంలోని టాయ్లెట్లోకి దూరి, పనికానివ్వడం మొదలుపెట్టారు. అంతే..విమానంలో ఫైర్ అలారంలు తమ పని కానిచ్చాయి. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో వణికిపోయారు. సిబ్బంది పరిశీలనతో...పెద్దాయన వ్యవహారం బయటపడింది. వెంటనే వారు కెప్టెన్ రితేష్ మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్స్ నియమాలు, నిబంధనలు గురించి ఆయనకు కెప్టెన్ వివరించారు. అనంతరం విమానం ముంబై చేరున్నాక.. విమానాశ్రయం పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 336, ఎయిర్‌లైన్ రూల్ ఆఫ్ 25ఎ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో లక్ష్మీనారాయణ్, ఆయన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
నేడు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్– న్యూఢిల్లీ(12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బుధవారం(3న) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. నాంపల్లి నుంచి ఉదయం 6.25కు బదులు మధ్యాహ్నం 2.25కు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకల్లో అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలిపారు. -
కొత్తేడాది మొదటిరోజే కాలుష్యం కాటు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ దేశ రాజధానిలో వాయు కాలుష్యం మరోసారి పెరిగిపోయింది. పొగమంచుతో పాటు కొత్త ఏడాది సందర్భంగా బాణాసంచా కాల్చడంతో ఢిల్లీలో కాలుష్య స్థాయి 400 పాయింట్లుగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. సోమవారం 6 గంటల వరకు గాలిలో కాలుష్య కారకాలైన పీఎం 2.5 రేణువులు 311గా, పీఎం10 రేణువులు 471.5గా నమోదైనట్లు వెల్లడించింది. పొగమంచు ప్రభావంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం 550 విమానాలు ఆలస్యం కాగా, 23 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా ఇండియాగేట్ వద్దకు ప్రజలు తరలిరావడంతో మధ్య సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద భారీ రద్దీ నెలకొంది. దీంతో ప్రజల్ని అదుపు చేసేందుకు పలు మార్గాలను మూసేశారు. దాదాపు 2.25 లక్షల మంది ప్రజలు సోమవారం సాయంత్రం నాటికి ఇండియా గేట్‌ను సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. పొగమంచు కారణంగా మంగళవారం 20 విమానాలు ఆలస్యం కాగా, ఆరు విమాన సర్వీసులు రద్దయ్యాయి. 64 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 24 రైళ్లను రీషెడ్యూల్ చేయగా, 21 రైళ్ల సర్వీసులు రద్దు చేశారు. -
ఇక తట్టుకోలేక పెద్ద గన్ తెప్పించిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : 'పొమ్మనలేక పొగబెట్టినట్లు' అనేది సామెత. ఇంటికొచ్చిన చుట్టాన్ని నేరుగా వెళ్లిపోండి అని చెప్పలేక పొగపెట్టడంతో ఆ బాధ తట్టుకోలేక ఆ వచ్చిన చుట్టం వెళ్లిపోతాడంట అనేది దాని వివరణ. అయితే, ఢిల్లీకి మాత్రం పొగే చుట్టమై వచ్చింది. ఎన్నిరకాలుగా బ్రతిమాలినా పోయే పరిస్థితి లేదు. దీంతో ఆ పొగను బెదిరించి పారిపోయేలా చేసేందుకు కేజ్రీవాల్ ఒక పెద్ద గన్ తీసుకొచ్చారు. అది మాములు గన్ కాదు కాలుష్యంతో నిండిన పొగను మాయం చేసే గన్ అన్నమాట. ఇప్పుడు ఆ గన్ పట్లుకొని వివిధ ప్రాంతాల్లో ప్రయోగాలు చేయిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యంతో నిండిన పొగ నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పొగను మాయం చేసే ప్రత్యేక గన్ను తెప్పించి పరీక్ష కూడా చేశారు. ఓ వాహనంపై ఉన్ననీటి ట్యాంక్‌కు అనుసంధానం చేసి ఈ గన్ను ఉపయోగిస్తారు. నేరుగా గాల్లోకి ఈ గన్ను పేల్చడం ద్వారా అది కాస్త దాదాపు వర్షం కురిసినట్లుగా సన్నటి నీటి బిందువులను కురిపిస్తుంది. దీంతో దట్టంగా దుమ్మూధూళి కణాలతో పేరుకుపోయిన పొగ కాస్త విడిపోయి మాయమయ్యేట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ గన్ను ఢిల్లీలోని సెక్రటేరియట్ వద్ద పరీక్షించగా దానిని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇతర అధికారులు పర్యవేక్షించారు. ఈ మెషిన్ గన్ను ఒక వాహనాకి అమర్చి ఉన్న నేపథ్యంలో ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లి ప్రయోగించేందుకు వీలుంది. ఈ పరికరం దాదాపు రూ.20లక్షలు అవుతుందని, అన్ని చోట్లతో దీనిని ఉపయోగించడానికి ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఈ సందర్భంగా సిసోడియా తెలిపారు. ఢిల్లీ సరిహద్దులో ఎక్కువగా పొగపేరుకుపోయిన ఆనంద్ విహార్ ప్రాంతంలో బుధవారం ఈ గన్ను ప్రయోగించనున్నారు. ఈ గన్ నీటిని 50 మీటర్ల ఎత్తులోకి వర్షం మాదిరిగా నీటి తుంపర్లను పంపించగలదు. దీనికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఢిల్లీలో పేరుకుపోయే పొగకు ఇదే కీలక పరిష్కారం కానుంది. -
ఇటు చలి..అటు కాలుష్యం
-
భాగ్యనగరంలో విభిన్న వాతావరణం
సాక్షి, హైదరాబాద్ : అటు సాధారణం కంటే తగ్గిన గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఇటు శీతల గాలుల ఉధృతి.. మరోవైపు కమ్ముకుంటున్న మేఘాలు.. వీటన్నింటి కారణంగా ఎక్కడికక్కడే ఆవరిస్తున్న కాలుష్యం.. ఊపిరాడని పరిస్థితి.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నెలకొన్న విభిన్నమైన వాతావరణ పరిస్థితి ఇది. చలికాలం కావడం, మేఘాలు ఆవరిస్తుండటంతో.. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న పొగ వాతావరణంలో కలసిపోకుండా ఎక్కడిక్కడే కమ్ముకుంటోంది. దీనికి దుమ్ము, ధూళి కూడా తోడవుతోంది. శ్వాసకోశ సమస్యలున్నవారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అసలు హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించే అంశంపై కాలుష్య నియంత్రణ మండలిగానీ, ప్రభుత్వం గానీ దృష్టి సారించకపోవడంతో ఏటేటా పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. అటు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న వారికి జైలుశిక్ష, జరిమానాలు విధించాలన్న నిర్ణయం కూడా కాగితాలకే పరిమితమవుతోంది. తేమ పెరిగిపోవడంతో.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సీజన్లో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర నమోదవుతాయి. కానీ మంగళవారం గరిష్టంగా 28.5 డిగ్రీలు, కనిష్టంగా 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో మేఘాలు ఆవరించి ఉన్నాయి. తేమతో కూడిన శీతల గాలులు ఉధృతంగా వీస్తున్నాయి. గాలిలో తేమ 48 శాతంగా నమోదైంది. దీంతో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, సూక్ష్మ, స్థూల ధూళి కణాలు.. వాతావరణంలో కలసిపోకుండా గాలిలోనే ఆవరించి ఉంటున్నాయి. దీంతో సరిగా శ్వాస తీసుకోలేని ఇబ్బందికర పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఏటా పెరిగిపోతున్న వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల సంఖ్య ఏటేటా పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం నగరంలో అన్ని రకాల వాహనాలు కలిపి 50 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇందులో సుమారు 15 లక్షల వరకు చెల్లిన వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగలో ప్రమాదకర వాయువులు ఎక్కువగా ఉంటున్నాయి. అటు పరిశ్రమలు కూడా పరిమితికి మించి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. దీనివల్ల నగరంలో ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’ఎక్కడ? జపాన్ రాజధాని టోక్యోలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’ని ఏర్పాటు చేశారు. దాని కఠిన నిబంధనలు, మార్గదర్శకాల కారణంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న టోక్యో నగరంలో కాలుష్యం స్థాయిలు నియంత్రణలో ఉండడం గమనార్హం. ఆ తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’ఏర్పాటుచేసి, విస్తృత అధికారాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం టోక్యోలో అథారిటీ విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, రవాణా, పరిశ్రమలు, జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలకు చెందిన అధికారుల బృందం ఆ నగరంలో పర్యటించి వచ్చింది. ఇది గడిచి ఆరునెలలైనా.. ఇక్కడ కనీస కార్యాచరణ కూడా మొదలుకాకపోవడం గమనార్హం. టోక్యోలో ఇలా.. విశ్వనగరంగా భాసిల్లుతున్న టోక్యో నగరంతో పాటు దాని సమీపంలోని 22 పట్టణాల్లో వాయు, జల, నేల కాలుష్యాన్ని జపాన్ ప్రభుత్వం గణనీయంగా కట్టడి చేసింది. రవాణా, స్థానిక సంస్థలు, పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలిల భాగస్వామ్యంతో ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’ని ఏర్పాటు చేసింది. ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్, ఈ–వేస్ట్, జీవ వ్యర్థాలను ఆధునిక సాంకేతిక విధానాల ద్వారా శుద్ధిచేసి పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటోంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల డంపింగ్, తగలబెట్టడం వంటి చర్యలకు స్వస్తి పలికింది. ఉద్గారాలను అధిక మొత్తంలో వెదజల్లుతున్న పరిశ్రమలను కట్టడి చేసింది. కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించింది. కాలుష్యానికి పాల్పడినవారికి జైలుశిక్ష, భారీగా జరిమానాలు విధిస్తోంది. మరో వారం ఇదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితులు, కాలుష్యం తీవ్రత మరో వారం పాటు ఇదే స్థాయిలో ఉండే అవకాశాలున్నట్లు పీసీబీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు మాస్కులు ధరించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు, హృద్రోగులు, వృద్ధులు, చిన్నారులు కాలుష్యం నుంచి, చలి తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. -
ఢిల్లీలో మళ్లీ సరి–బేసి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పొగ మంచు కారణంగా కాలుష్యం పెరిగిన నేపథ్యంలో ఈ నెల 13 నుంచి ఐదు రోజుల పాటు వాహనాల సరి–బేసి విధానాన్ని మళ్లీ అమలుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. రోజురోజుకీ క్షీణిస్తున్న వాయు నాణ్యతను పరిరక్షించేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) గురువారం పలు చర్యలు ప్రకటించింది. ఢిల్లీ, పొరుగు రాష్ట్రాల్లో నిర్మాణ పనులు, వ్యర్థాల దహనాన్ని నిషేధించడంతో పాటు, రాజధాని ప్రాంతంలోకి ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించింది. మరోవైపు, ఇదే వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఢిల్లీ, పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో కాలుష్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ పరిష్కార మార్గాలు సిఫార్సు చేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. రాజధానిలో ‘కాలుష్య అత్యయిక’ పరిస్థితి వరసగా మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. శనివారం వరకు పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. వాయు నాణ్యత సూచీ 500 పాయింట్ల స్కేలుపై 486గా నమోదైంది. ద్విచక్ర, మహిళలకు మినహాయింపు ఢిల్లీలో మరో దఫా సరి–బేసి విధానానికి రంగం సిద్ధమైంది. నవంబర్ 13 నుంచి ఈ విధానాన్ని ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఐదు రోజులు అమలుచేస్తారు. ద్విచక్ర వాహనాలు, మహిళలు, సీఎన్జీ ఇంధనంతో నడిచే వాహ నాలకు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ వెల్లడించారు. కాలుష్యంతో జీవించే హక్కు ఉల్లంఘన ఢిల్లీలో పరిస్థితిపై ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంఘాలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టొద్దని, అలాగే కాలుష్య కారకాలు వెదజల్లుతున్న అన్ని పారిశ్రామిక కార్యకలాలపై నవంబర్ 14 వరకు నిషేధం విధిస్తున్నట్లు చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్æ కుమార్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. పదేళ్లకు పైబడిన డీజిల్ ట్రక్కులను ఢిల్లీలోకి అనుమతించకూడదని ఆదేశించింది. కా లు ష్యాన్ని ఎదుర్కొనేందుకు ఏమేం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ రెండు వారా ల్లోగా నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఢిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి నోటీసులు పంపింది. కాలుష్యాన్ని విస్మరించడం జీవించే హక్కును ఉల్లంఘించడంతో సమానమని వ్యాఖ్యానించింది. కృత్రిమ వర్షం కురిపించండి: ఢిల్లీ హైకోర్టు పొగమంచు కట్టడికి ఢిల్లీ హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. దుమ్ము, ధూళి గాల్లోకి చేరకుండా నిరోధించేలా మేఘ మథనం ద్వారా కృత్రిమ వర్షం కురిపించే అవకాశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీ పట్టణంలో నిర్మాణ పనులు సాధ్యమైనంత ఎక్కువ కాలం నిలిపివేసేందుకు తగిన మార్గాలను కనుగొనాలని కోరింది. ప్రస్తుతం ఢిల్లీలో చూస్తున్న పరిస్థితిని లండన్ ఇది వరకే ఎదుర్కొందని పేర్కొంది. -
పాకిస్తాన్ వింత ఆరోపణ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ వింత, వితండ వాదన చూస్తుంటే.. ఆడలేనమ్మ మద్దెల ఓడు అన్నట్లుంది. భారత్ వల్లే పాకిస్తాన్లో పర్యావరణం దెబ్బతింటోందనే వింత వాదన పాకిస్తాన్ కొత్తగా తెరమీదకు తెచ్చింది. పాకిస్తాన్లో ఏర్పడే పొగమంచు, కాలుష్యానికి భారత రైతులు కారణమంటూ.. పాకిస్తాన్ పర్యావరణ పరిరక్షణ విభాగం పేర్కొంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రజలు గుండె, ఊపిరి తిత్తుల వ్యాధుతో బాధపడుతున్నారని.. ఇందుకు భారత్ సరిహద్దులోని రైతులే కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. సరిహద్దులోని రైతులు వ్యవసాయం పూర్తయ్యాక.. పంటను పొలాల్లోనే అలాగే తగలబెట్టడంతో కాలుష్యం పంజాబ్ ప్రావిన్స్‌లోకి వస్తోందని ఐక్యసమితికి పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. -
లోకమాన్య తిలక్ లో పొగలు
సాక్షి, జనగామ: విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తున్న లోకమాన్య తిలక్ (ఎల్టీటీ) ఎక్స్‌ప్రెస్‌లో పొగలు కమ్ముకోవడంతో జనగామ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. బ్రేకులు పట్టేయడంతో సాంకేతిక సమస్య తలెత్తి పొగలు వెలువడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. ఒక్కసారిగా రైళ్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సహాయ చర్యలు చేపడుతున్నామని సమస్య పరిష్కారం కాగానే యధావిధిగా రైలు ముందుకు వెళ్తుందని తెలియడంతో ఆంతా ఊపిరిపీల్చుకున్నారు. -
పొగపెట్టినా..పోవడం లేదు..!
ఒక శుభవార్త.. గతంతో పోలిస్తే.. మన దేశంలో పొగాకు వినియోగిస్తున్న వారి సంఖ్య తగ్గిందట.. ఒక దుర్వార్త.. కొంతవరకూ తగ్గించినా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పొగాకు వినియోగిస్తున్న వారి సంఖ్యలో మన దేశం రెండోస్థానంలో ఉందట. మొదటి స్థానం చైనాది. అంతకుముందు రెండు దశాబ్దాలతో పోలిస్తే.. ప్రజల్లో పొగాకు దుష్పరిణామాలపై అవగాహన పెరిగిందని.. దీని వల్ల 2015–16లో పొగాకు వినియోగిస్తున్న భారతీయుల సంఖ్య తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే తెలిపింది. ముఖ్యంగా ఈ ఏడాదిలో పొగాకు వినియోగాన్ని మానేయడానికి ప్రయత్నించిన వారిలో పురుషుల విషయానికొస్తే.. తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 42.3 శాతం మంది పొగాకు మానేయడానికి ప్రయత్నించారట. ఏపీలో ఈ శాతం 33.1గా ఉంది. అదే మహిళల విషయానికొస్తే.. మానేయడానికి యత్నిం చిన వారి శాతం ఏపీలో ఎక్కువగా ఉంది. ఇక్కడ 37.8 శాతం మంది యత్నిస్తే.. తెలంగాణలో అది 35 శాతంగా ఉంది. – సాక్షి, తెలంగాణ డెస్క్ దేశంలో పొగాకు వినియోగం మగవారు: 44% మహిళలు: 30.5% ► ఈశాన్య భారత్‌లో అధికం... (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2015–16) మేరకు..) ► ముఖ్యంగా ఈశాన్య భారత్‌లో పొగాకు వినియోగదారులు ఎక్కువ. మిజోరాం, నాగాలాండ్, మేఘాలయా, మణిపూర్, త్రిపుర, అస్సాంలో మగవారి సగటు 70.7% ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి 1000 మరణాల్లో కేన్సర్‌తో చనిపోతున్నవారు. 172 దేశంలో కేన్సర్‌తో చనిపోతున్నవారి సగటు 91 పొగాకు వాడకంలో అత్యల్పం (శాతాల్లో) 19.2% పంజాబ్ ,14.4% పుదుచ్చేరి -
పొగను పీల్చుకునే ఫ్యాక్టరీ
‘ఏంటి...? గాల్లో కార్బన్‌డైయాక్సైడ్ పెరిగిపోతోందా? అయితే పీల్చేస్తే పోలా’ అంటోంది క్లైమ్ వర్క్స్. అనడం మాత్రమే కాదు.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉన్న ఈ కంపెనీ ఇందుకోసం ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టేసింది. చెత్తను మండించే ఫ్యాక్టరీ పైకప్పుపై దీన్ని ఏర్పాటు చేశారు. కింద చెత్తను మండించినప్పుడు వెలువడే గాలిని పీల్చేసుకుని అందులోంచి కార్బన్‌డైయాక్సైడ్‌ను ఇది వేరుచేస్తుంది. మిగిలినదాన్ని వదిలేస్తుంది. ఫొటోల్లో కనిపిస్తున్నది ఆ ఫ్యాక్టరీ చిత్రాలే. వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువులు పెరిగిపోయి భూగోళం వేడెక్కుతోందని, ఫలితంగా అనేక దుష్పరిణామాలు ఎదురు కానున్నాయని తరచూ వింటూ ఉన్నాం. ఈ శతాబ్దం అంతానికి భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువగానే ఉంచాలని ప్రపంచదేశాలు కూడా ప్యారిస్ ఒప్పందం ద్వారా అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే క్లైమ్ వర్క్స్ అభివృద్ధి చేసిన ఈ ఫ్యాక్టరీకి ప్రాముఖ్యం ఏర్పడింది. మూడు షిప్పింగ్ కంటెయినర్ల సైజుండే ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 900 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను వేరు చేయగలదు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఓ 7.50 లక్షలు ఏర్పాటు చేస్తే భూతాపోన్నతిని విజయవంతంగా అడ్డుకోవచ్చునని అంటున్నాడు... క్లైమ్ వర్క్స్ డైరెక్టర్ క్రిస్టోఫ్ గెబాల్డ్. బాగానే ఉందిగానీ.. వేరు చేసిన కార్బన్‌డైయాక్సైడ్ వాయువును ఏం చేయాలి? అని ప్రశ్నిస్తే.. అబ్బో అందుకు బోలెడు మార్గాలు ఉన్నాయంటున్నారు ఆయన. ‘‘మా ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వాయువును అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఓ గ్రీన్‌హౌస్‌కు అమ్ముతున్నాం. వాళ్లు దాన్ని పంటలు ఏపుగా పెరిగేందుకు వాడుతున్నారు’’ అంటారు ఆయన. దీంతోపాటు ఈ వాయువును కూల్‌డ్రింక్స్, లేదా ఇంధనం తయారీకి కూడా వాడుకోవచ్చునని చెబుతున్నారు. ఇంకో ఎనిమిదేళ్లకు అంటే... 2025 నాటికల్లా భూమ్మీద ఉన్న గాలిలో కనీసం ఒకశాతాన్ని శుద్ధి చేయాలన్నది క్లైమ్ వర్క్స్’ లక్ష్యమట! గుడ్‌లక్ చెప్పేద్దాం! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
20 నిమిషాలు నిలిచిపోయిన రైలు రాజంపేట: తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం రాత్రి ఎస్–11 బోగి వద్ద పొగలు రావడంతో రైలు 20 నిమిషాలు నిలిచిపోయింది. రాత్రి 8.50 నిమిషాలకు రైలు వైఎస్సార్ జిల్లా రాజంపేట స్టేషన్ హోం సిగ్నల్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ఎస్–11 బోగీ బ్రేక్ బైండింగ్ పట్టుకుపోయింది. దీంతో కొద్దిపాటి మంటలు, పొగలు వచ్చాయి. రాజంపేట రైల్వేస్టేషన్ హోం సిగ్నల్ వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. బోగీ కింద పొగలు, మంటలను చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే చైన్ లాగడంతో డ్రైవర్ రైలును ఆపారు. ఆగ్రహంతో ఉన్న ప్రయాణికులు బోగి వద్దకు వచ్చిన గార్డుతో వాదులాటకు దిగారు. వాకీటాకీ లాక్కున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. గార్డు బ్రేక్‌ను సరిచేయడంతో ప్రయాణికులు శాంతించి, వాకీటాకీని తిరిగి ఇచ్చారు. రైలు 9.10 నిమిషాలకు బయలుదేరింది. బ్రేక్ బైండింగ్ పట్టుకుపోవడం సహజమేనని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందిలేదని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైలు లూప్లైన్లోకి వెళ్లేటప్పుడు డ్రైవర్ బ్రేక్ వేసిన సమయంలో బ్రేక్ బైండింగ్‌లో స్పార్క్ వస్తుందని తెలిపారు. కాగా తరచుగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
మహబూబ్‌నగర్ : దేవరకద్ర రైల్వేస్టేషన్ దాటుతున్న క్రమంలో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కొంత సేపు నిలిపేశారు. రైలు ఆపేసిన వెంటనే జనం కిందకు పరుగులు పెట్టారు. రైలును ఆపి పరిశీలించగా బ్రేకులు పట్టి వేయడంతో పొగలు వచ్చినట్లుగా గుర్తించారు. కొద్ది సేపటి తర్వాత రైలు మళ్లీ కదిలింది. రైలు తిరుపతి నుంచి కాచిగూడ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. -
పొగ మానేయాలనుకుంటున్నారా?
31 మేలు 31 మే వరల్డ్ నో టొబాకో డే పొగాకు నమలడం, పొగతాగడం ఎంత హానికరమోఅందరికీ తెలియజేయడం కోసం డబ్ల్యూహెచ్ఓ ఎంచుకున్న రోజు. పొగాకు వ్యసనాన్ని మానేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉన్నా ఈ అలవాటు మానలేకపోతున్నారు. వీళ్లకు సహాయం చేద్దామని ‘సాక్షి’ ఈ కొన్ని మేలు మార్గాలు చూపిస్తోంది. మే 31న పొగాకు అలవాటును మానేసి ఇతరులకు మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈ మేళ్లు ఎంతోమందికి మైలురాళ్లు కావాలి. ‘ముప్ఫయి రోజుల్లో...’ అనేది చాలా జనాకర్షణ కలిగిన అంశం. ముప్ఫయి రోజుల్లో ఆంగ్ల భాష, ముప్ఫయి రోజుల్లో కరాటే... ఇలా. దాదాపు నెల రోజుల తర్వాత... సరిగ్గా ఈ నెల 31న ‘యాంటీ టొబాకో డే’. పొగాకు వల్ల, పొగతాగడం వల్ల కలిగే అనర్థాలు ఇప్పటికే అందరికీ తెలిసినవే. కానీ తెలిసి కూడా మానలేకపోవడమే సిగరెట్ బలం... దాన్ని తాగేవారి బలహీనత. దీన్ని అధిగమించడానికీ మార్గాలున్నాయి. ఈ నెల రోజుల్లో పొగతాగడం మానేయడానికి అనేక మంది నిపుణులు సూచించిన కొన్ని మార్గాలను మీకు అందిస్తున్నాం. ఈ నెల 31న వచ్చే యాంటీ టొబాకో డే నాటికి మీరు పొగ మానేస్తారనే లక్ష్యంతో... మీకు మేము వినమ్రంగా అందిస్తున్న కథనం ఇది. పొగాకులో దాదాపు నాలుగు వేలకు పైగా హానికర రసాయనాలు ఉంటాయి. వాటిలోని ఆక్సిడెంట్స్ వల్ల వయసు పైబడిన కొద్దీ దుష్ప్రభావాలు ఎదురవు తుంటాయి. పొగలో ఉండే కార్సినోజెన్స్ వల్ల క్యాన్సర్స్ కూడా రావచ్చు. 1. ఫ్రెండ్స్ సిగరెట్ తాగుతున్నది చూసి ఎడతెరిపి లేకుండా దగ్గు వచ్చినా సరే, స్నేహితుల ముందు చిన్నబోకూడదని పంతంపట్టి మొదలుపెడతారు. 2 భార్యాపిల్లలు ‘ఎప్పుడు మానేస్తారు’ అని ఎంతగా బతిమిలాడుతున్నా అదేపనిగా కొనసాగిస్తారు. 3.ఆస్తమా లేదా ఇతర ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు మానేద్దామనుకొని మళ్లీ ప్రారంభిస్తారు. 4. కానీ తప్పక మానేయడానికీ 4వ తేదీ నుంచి ప్రయత్నం చేయండి. ఆయా సూచనలు పాటించండి. ఆల్ ద బెస్ట్! 5.ముందుగా క్యాలెండర్లో సిగరెట్/పొగాకు మానాల్సిన రోజును మార్క్ చేసుకొని, అది నిత్యం మీకు కనిపిస్తుండేలా అమర్చుకోండి. 6.సిగరెట్/పొగాకుకు పురిగొల్పుతున్న అంశాల జాబితాను రాయండి. ఈ జాబితాను పూర్తి చిత్తశుద్ధితో రాయాలి. జాబితాలోని అంశాలను సమీక్షించుకుంటూ... ఆ సందర్భాలలో పొగతాగకుండా ఎందుకు ఉండలేరో ఆలోచించుకోండి. 7.భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువుల నుంచి మీ పొగతాగే అలవాటు గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మీ అలవాటు వల్ల వారు పడ్డ మనోవేదన, ఇక్కట్లు, కష్టాలను ఆలోచించండి. మీ అలవాటుతో వారిని బాధపెట్టారని పదే పదే గుర్తుతెచ్చుకోండి. 8.మంచి మూడ్‌లో ఉన్నప్పుడే సిగరెట్‌ను వదిలేయండి. ఇలా మంచిమూడ్‌లో ఉన్నప్పుడు వదిలేస్తే... ఆ అలవాటు మళ్లీ దరిదాపుల్లోకి రాదు. ఎక్కువ మందిలో ఇది నిరూపితమైందని అధ్యయనాలు చెబుతున్నాయి. 9.మీరు సిగరెట్ మానేసిన విషయం మీ భార్యకు, స్నేహితులకు, పిల్లలకు, మీ కొలీగ్స్‌కు చెప్పండి. బహిరంగంగా ఇలా ప్రకటించాక వారి ముందు మళ్లీ సిగరెట్ తాగాలంటే బిడియంగా ఉంటుంది. ఒకవేళ తీసినా పిల్లలు నేరుగా ప్రశ్నిస్తారేమోనని సిగ్గనిపిస్తుంది. 10.సిగరెట్ తాగాలనిపించినప్పుడు పంటికింద నమలడానికి ఆరోగ్యకరమైన పదార్థాలు... అంటే పల్లీలు, నట్స్ వంటివి అందుబాటులో పెట్టుకోండి. అవి మీ బరువును పెంచుతాయనుకుంటే చిన్న కప్పు గ్రీన్ టీ తాగండి. 11.మీరు సిగరెట్ బయటకు తీయగానే ముఖం ముడుచుకొని పక్కకు వెళ్లేవారినీ, మీరు సిగరెట్ తాగి రాగానే ఆ వాసన సోకిన వెంటనే ముఖం చిట్లించుకునే వారిని గుర్తుకు తెచ్చుకోండి. ఇంతటి అసహ్యాన్ని పెంచడం అవసరమా?... ఆలోచించండి. 12.మీ పనిలో బ్రేక్ వచ్చినప్పుడల్లా సిగరెట్‌కు వెళ్లడానికి బదులు కంప్యూటర్గేమ్లో నిమగ్నం కండి. ఆ తర్వాత మళ్లీ మీ పని మొదలుపెట్టేయండి. ఇంక సిగరెట్ తాగడానికి దొరికే బ్రేక్ ఎక్కడ? మీ పనిలో బ్రేక్ పడే అవకాశమెక్కడ? 13.సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా టెన్నిస్, స్క్వాష్ ఆటలు ఆడుతున్నట్లుగా ఊహించుకోండి. మర్నాడు ఆడాలని నిశ్చయించుకోండి. అందుకు ఊపిరితిత్తులకు మరింత శక్తి కావాలి కదా. సిగరెట్‌తో వాటిని కోల్పోతారన్న సంగతి గుర్తు తెచ్చుకోండి. 14.ఎప్పుడూ నో–స్మోకింగ్ జోన్లో ఉండటానికి ప్రయత్నించండి. దగ్గర సిగరెట్లు ఉంచుకోకండి. తపన (క్రేవింగ్) పుట్టినప్పుడు సిగరెట్ కొనడానికి బయటకు వెళ్తారు. చాలా సందర్భాల్లో బయటికెళ్లే సమయం లేక పొగతాగకుండా ఉండకతప్పని పరిస్థితి వస్తుంది. 15.స్మోకింగ్‌తో వచ్చే అనారోగ్యాలను జాబితా రాయండి. దాని అనేక కాపీలు తీయండి. ఇంట్లో అన్ని గదుల్లోనూ మీకు ప్రస్ఫుటంగా కనిపించేలా, మీరు నడయాడే ప్రతి చోటా అతికించండి. స్మోకింగ్‌ను కొనసాగిస్తే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరని అర్థమవుతుంది. 16.మీరు రెగ్యులర్‌గా తీసుకునే పాన్–షాప్ వైపునకు కాకుండా... వేరే దారుల్లో ఆఫీసుకు వెళ్లండి. అదే దారిలో వెళ్తే కాళ్లు అక్కడ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కొత్త మార్గాల్లో ఎక్కడ పాన్–షాపు ఉంటుందో తెలియదు కాబట్టి అంత తేలిగ్గా మీకు సిగరెట్ దొరకదు. 17.గతంలో మీరు నిర్వహించిన అతి కష్టమైన, టాస్క్‌లను, సులువుగా పూర్తి చేసిన వ్యవహారాలను గుర్తు తెచ్చుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని, మనోనిబ్బరాన్ని తలచుకోండి. అంత కష్టమైనవే చేశారు. ఈ పొగాకూ / సిగరెట్లు మానేయడం అనగా ఎంత? 18.సిగరెట్ మానేశాక ఇంట్లో వాళ్ల ఫీలింగ్ తెలుసుకోండి. ఆ ఫీడ్‌బ్యాక్ సిగరెట్‌కు దూరంగా ఉంచుతుంది. అగ్గిపెట్టె, లైటర్, యాష్‌ట్రే, సిగరెట్ హోల్డర్ వంటివేవీ దగ్గర ఉంచుకోకండి. అవి కళ్ల ముందు ఉంటే... మనసు సిగరెట్ మీదకు మళ్లుతుంది. 19.మీ ఫ్రెండ్స్‌లో డాక్టర్స్, పల్మనాలజిస్ట్స్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ వారు ఉంటే తరచూ వారినే కలుస్తూ సిగరెట్ నుంచి వచ్చే అనర్థాలు, ఆరోగ్యానికి ముప్పుల గురించి చర్చిస్తూ ఉండండి. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. 20.సిగరెట్ మానే ప్రయత్నంలో ఒకసారి ఫెయిలైతే మరోసారి ప్రయత్నించండి. పదో ప్రయత్నంలో విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. 21.సిగరెట్ మానేసే ప్రయత్నంలో.. అరెరె... ఈ ఆనందానికి దూరం కావాలా అని బెంగపడకండి. ఎప్పుడు కావాలంటే అప్పడు సిగరెట్ దొరుకుతుంది, తాగగలను. కాకపోతే ఇప్పుడు తాగడం లేదు. అంతే...! అనుకోండి. అప్పుడు తప్పక మానేయగలరు. 22.సిగరెట్ తాగినప్పుడల్లా ఉల్లి, వెల్లుల్లి తిన్నవారి నుంచి వచ్చే వాసనను గుర్తు తెచ్చుకోండి. ఆరోగ్యాన్నిచ్చే వాటిని తినే మీటింగ్‌కు వెళ్లాలంటేనే వెనకాడుతాం. అనారోగ్యకరమైన పొగాకు, సిగరెట్‌కు, ఆ కంపునకు ఆమోదం ఉంటుందా? ఆలోచించండి. 23.సిగరెట్ తాగాలనే కోరిక పుట్టినప్పుడల్లా మీరు అమితంగా గౌరవించే పెద్దల(సిగరెట్ తాగి వెళ్లలేనివారి) దగ్గరకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. అలా సిగరెట్‌కూ, సిగరెట్‌కూ మధ్య వ్యవధి పెరుగుతుంది. సిగరెట్ అలవాటు దూరం అవుతుంది. 24.సిగరెట్ మానడానికి ఈ–సిగరెట్‌ను ఆశ్రయించదలచుకున్నారా? వద్దనే వద్దు. పొగతాగడం మానేయాలనుకుంటే పూర్తిగా మానేయండి. ఈ ప్రత్యామ్నాయం సరికాదు. ఈ–సిగరెట్ సైతం ఆరోగ్యానికి హాని చేసేదే అని గుర్తుంచుకోండి. 25.తరచూ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచండి. ఇందులో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్స్‌ను, క్యాన్సర్ విభాగాలను సందర్శించండి. అక్కడ కనిపించే దృశ్యాలు మీ మనసు మార్చి, మీ దురలవాటును తప్పించే అవకాశం ఎక్కువ. 26.ఎడతెరిపి లేనంత పనిలో నిమగ్నం అయిపోండి. ఇది ఒత్తిడి లేని పనిౖ అయివుండాలి. మీరు పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పుడు అసలు సిగరెట్ తహతహ (క్రేవింగ్) కలగని తీరును గుర్తించండి. 27.నికోటిన్ తపనను తగ్గించే చ్యూయింగ్ గమ్స్, ప్యాచ్‌ల వంటి వాటిపై ఆధారపడండి. అవి సిగరెట్ తాగాలనే తహతహను తగ్గించి క్రమంగా ఆ అలవాటు నుంచి దూరం చేస్తాయి. 28.ధూమపానం మానడానికి వ్యాయామం మంచి మార్గం. అంత కష్టపడి వ్యాయామం చేసి సంపాదించుకున్న ఆరోగ్యాన్ని, సౌష్ఠవాన్ని కేవలం సిగరెట్‌తో బుగ్గి చేసుకోవడం సరికాదనే భావన పెరుగుతుంది. 29.బోర్ అనిపించినప్పుడు దాన్ని అధిగమించడానికి ఇతరత్రా మంచి హాబీలను పెంపొందించుకోండి. బోర్ అనిపించినప్పుడు సిగరెట్ తాగడం వల్ల బోర్డమ్ మరింత పెరుగుతుందని గుర్తుంచుకోండి. 30.ఎవరినైనా ఆపద నుంచి రక్షించడానికి మీ బలాన్ని ప్రదర్శించాల్సి వచ్చిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. మీరు సిగరెట్ తాగుతూ ఉంటే అదే స్టామినాను ప్రదర్శించడం సాధ్యపడేది కాదన్న విషయాన్ని గుర్తించండి. పై మార్గాలన్నీ విఫలం అయితే కౌన్సెలర్ వద్ద సలహా తీసుకోండి. సపోర్ట్ గ్రూప్‌ల సహాయం తీసుకోండి. చివరగా మీ డాక్టర్ / సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. 31.వరల్డ్ నో టొబాకో డే... కొన్ని అనర్థాలు లంగ్‌క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, అనేక రకాల లుకేమియా, గుండెజబ్బులు, హైబీపీ, డయాబెటిస్ ముప్పు, డిప్రెషన్, అలై్జమర్స్ డిసీజ్, సంతానలేమి, పుంసత్వం తగ్గడం, ఎముకలు పలచబారడం, నాలుకకు రుచి తెలికయకపోవడం, ముక్కుకు వాసనలు తెలియకపోవడం... మొదలైనవి. ఆలోచించండి ఎలా మొదలైనా... ఇలా వదిలేయచ్చు! మీరు సిగరెట్ తాగే చోట మీరెప్పుడూ గౌరవించే వారి ఫొటో పెట్టుకోండి. ఎంతైనా అక్కడ సిగరెట్ కాల్చడానికి మీ మనసు అంగీకరించదు.మీ పిల్లలకు ముద్దు పెట్టే సమయంలో మీ నుంచి వచ్చే సిగరెట్ కంపు కారణంగా వాళ్లు ముఖం చిట్లించుకోవడం గుర్తు చేసుకోండి. మరోసారి సిగరెట్ జోలికి పోరు.మంచి చేయాలనీ, మంచిని అనుసరించాలని మనం సమాజానికి చెబుతుంటాం. మరి మనం ఏం చేయకూడదన్నది మరొకరు చెప్పడం అవసరమా?ఏదైనా ఒకటి వదిలిపెట్టాలంటే కాశీ దాకా వెళనక్కర్లేదు. సిగరెట్ తాగీ తాగీ ఆరోగ్యం చెడగొట్టుకొని మన ఆత్మీయుడు మనల్ని వీడి వెళ్లిపోతే అతడి జ్ఞాపకార్థం శ్మశానంలోనూ దాన్ని వదిలేస్తే చాలు కదా.టీనేజ్‌లో స్నేహితుడెవరో చేశారని సిగరెట్ తాగడం అవసరమా? ఆ స్నేహితుడు వదిలిపోయినా, ఈ పని వల్ల జీవితాంతం ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడతారు. దీనిని కొనసాగించడం ఎంతవరకు సబబు? పల్మనాలజిస్ట్ ను సంప్రదించండి ప్లానింగ్ ఈ నెల 31న వరల్డ్ నో టొబాకో డే. ఆ తేదీకి దాదాపు నాలుగు వారాల గడువుంది. ఈ నాలుగు వారాల్లో పొతతాగడం మానేయాలనుకున్న వారు వరుసగా ఒక్కోవారంలో వేసుకోవాల్సిన ప్రణాళిక, చేయాల్సిన పని ఇదీ! మొదటివారం సిగరెట్ మానేయాలనే ఉత్సాహం, ఉద్వేగం మొదటివారం ఉంటాయి. తొలి 72 గంటల పాటు నికోటిన్ లోపం వల్ల తహతహ, తపన కలుగుతాయి. కానీ నాలుగు, ఐదో రోజు నుంచి అంతా మామూలవుతుంది. చెమటలు పట్టడం, ఊపిరి అందనట్లుగా అనిపించడం, ఉద్వేగం వల్ల అనర్థాలేమీ ఉండవు. ఈ వారంలో చ్యూయింగ్ గమ్స్, ప్యాచెస్ దగ్గర ఉంచుకోవాలి. అలవాటు వదిలాక మీకు అధికపాళ్లలో ఆక్సిజన్ అందడాన్ని మీరే గమనిస్తుంటారు. రెండో వారం ఇది మొదటివారం అంత గడ్డుగా ఏమీ గడవదు. చాలా రిలాక్స్ అవుతారు. పొగమానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ మీకే కనిపిస్తుంటాయి. మీరు తినే ఆహారం మరింత రుచికరంగా ఉంటుంది. మీకు అనేక పరిమళాలు అందుతుంటాయి. ఇంతకాలం ఏం కోల్పోయారో కొద్దికొద్దిగా మీరు అర్థమయ్యేది ఈ వారంలోనే. మీరు కోల్పోయిన వాటిని ఆస్వాదిస్తూ ఈ వారం గడుస్తుండటం వల్ల ఇది తేలిగ్గా గడవడం మీకే తెలుస్తుంది. హ్యాపీగా అనిపిస్తుంది. మూడో వారం ఈ వారానికి మీ ఒళ్లంతా తేలిగ్గానూ, మీ ఊపిరితిత్తులు మంచి గాలితో నిండుగానూ ఉన్న అనుభూతిని మీరు అనుభవిస్తుంటారు. ఈ వారంలో కాస్త కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మళ్లీ సిగరెట్‌ను ప్రేరేపించే అవకాశం ఉంది. ఈ వారంలో ఏరోబిక్స్, ధాన్యం మొదలుపెట్టడం మంచిది. ఈ వారంలో మీరు ఒకింత బరువు పెరుగుతారు. కానీ ఆందోళన వద్దు. ఆ పెరిగిన బరువుకు విరుగుడే ఈ వారంలో మీరు చేసే ఏరోబిక్స్. నాలుగో వారం ఈ వారం పొగతాగే రోజులకూ, మానేసిన రోజులకూ తేడాను సమీక్ష చేసుకుంటూ ఉంటే చాలు... అదే మీ సంకల్పాన్ని మరింత దృఢతరం చేస్తుంది. డబ్బు, ఆరోగ్యం, జీవనశైలిలో మీరు అనుభవిస్తున్న తేలికదనం (ఈజ్), ఫిజికల్ ఫిట్నెస్... ఈజీగా గడిచేలా చేస్తాయి. 31 వచ్చిందా? నెల పూర్తయ్యిందా? ఇక మిమ్మల్ని ఎవరూ నియంత్రించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆఫర్ చేసినా మీరే సిగరెట్‌ను తోసిపుచ్చుతారు. – డాక్టర్ కె. శైలజ, కన్సల్టెంట్, పల్మనాలజిస్ట్, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
పొగచూరుతున్న బతుకులు
► దీనావస్థలో కొందుర్గు పరిసర గ్రామాలు ► రాత్రి వేళల్లో పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు ► పరిశ్రమ వ్యర్థాలతో శరీరంపై దద్దుర్లు ► దట్టమైన పొగ, దుర్వాసనతో అల్లాడుతున్న జనం కొందుర్గు: కొందుర్గుతోపాటు పరిసర గ్రామాలైన గంగన్నగూడ, చెర్కుపల్లి, విశ్వనాథ్‌పూర్, చెక్కలోనిగూడ, తూంపల్లి తదితర గ్రామాలకు సంబంధించిన ప్రజలకు చర్మంపై విపరీతమైన దురద ఏర్పడి దద్దుర్లు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ దురద వల్ల వచ్చిన దద్దుర్లు ఎర్రగా ఏర్పడి మచ్చలుగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందులు వాడిన తగ్గడం లేదని.. ఇక చిన్నారులపై ఈ దురద ప్రభావం మరింత ఎక్కవగా చూపుతుందని పేర్కొంటున్నారు. పరిశ్రమల కాలుష్యం వల్లనే.. కొందుర్గు పరిసర ప్రాంతంలో ఉన్న దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, స్కాన్ ఎనర్జీ పరిశ్రమ, బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ, దిలీప్ టెక్స్టైల్స్ తదితర పరిశ్రమల వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్లనే తమకు ఈ దురదలు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మొదటగా చిన్న కురుపులుగా ఏర్పడి, పెద్దగా దద్దుర్లు వస్తున్నాయని అనంతరం మచ్చలుగా మారుతున్నాయని తెలిపారు. పరిశ్రమల నిర్వాహకులు పగలంతా వ్యర్థాలను నిల్వచేసి, రాత్రివేళల్లో విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు పరిశ్రమ నుంచి వెలువడిన రసాయనాలతో కూడిన వ్యర్థపదార్థాలను పరిశ్రమ ఆవరణలో నిప్పంటించడం వల్ల చుట్టుపక్కల దట్టమైన పొగవస్తుందని, రోడ్డుపై వాహనాలు వెళ్లడానికి కూడా వీలుకావడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ నుంచి రాత్రి సమయంలో విడుదలవుతున్న దట్టమైన పొగవల్ల గ్రామాల్లో ఒకరికికొకరు కనిపించడం లేదంటున్నారు. పొగతో ఇళ్లముందు ఉన్న వస్తువులు కూడా నల్లగా మారుతున్నాయంటున్నారు. ఇలాగే కొనసాగితే ప్రజల జీవన మనుగడ అసాధ్యమేనంటున్నారు. పొగవల్లనే దురదలు.. పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదిలే పొగవల్లనే ఇలా దురదలు వస్తున్నాయి. దురదల కారణంగా పిల్లలు రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. ముఖ్యంగా కొందుర్గు శివారులోని దివ్యశక్తి పేపర్ పరిశ్రమ, కొందుర్గు స్కాన్ ఐరన్ పరిశ్రమ వారు వదులుతున్న పొగ ప్రభావం తీవ్రంగా ఉంది. కాలుష్యం నియంత్రించకుంటే ఇబ్బందులు తప్పవు. – సరిత, ఎంపీటీసీ, ఉత్తరాసిపల్లి వస్తువులన్నీ మసిబారుతున్నాయి.. దివ్యశక్తి పరిశ్రమ నిర్వాహకులు రాత్రివేళల్లో వదులుతున్న పొగవల్ల ఇళ్ల ముందు ఉన్న వస్తువులన్నీ మసిబారుతున్నాయి. ఆహార పదార్థాలతోపాటు, కనీసం తాగే నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ విషయమై పలుసార్లు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – చంద్రశేఖర్, ఛత్రపతి యూత్ అధ్యక్షుడు కొందుర్గు వీపును గోడకేసి రాస్తున్నాడు.. మా బాబుకు శరీరంపై మొత్తం దురద ఏర్పడి రాత్రివేళల్లో నిద్ర కూడా పోవడం లేదు. దురదకు భరించలేక వీపును గోడకేసి రాస్తున్నాడు. మా బాబుతోపాటు గ్రామంలో దాదాపు 20 మందికి పైనే ఇలాగే దురద పెట్టి శరీరమంతా దద్దుర్లు పోయాయి. రాత్రివేళల్లో గ్రామమంతా దట్టమైన పొగ కమ్ముకుంటుంది. ఈ పొగకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. – సిద్దులూరి స్వర్ణలత, గంగన్నగూడ -
బష్ ఎక్షా పోశా!
హ్యూమర్ ప్లస్ రాశి ఫలాల్లో వాహనయోగం అని వుంటే ఏంటో అనుకున్నా. టూ వీలర్ చెడిపోయి బస్సెక్కడం అనుకోలేదు. బైక్ సైలెన్సర్ సైలెంట్‌గా వుండక దగ్గడం మొదలుపెట్టింది. వంద సిగరెట్లు తాగిన దానిలా పొగ వదలసాగింది. నల్లటి దట్టమైన పొగకి, నా వెనుక వస్తున్నవాళ్ళు కకావికలైపోతున్నారు. జిపిఎస్ లాగా నేనెక్కడున్నానో ఆ పొగని చూసి గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. పోకుండా, పొగపెట్టిన ఆ బండిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాను. నాడి పట్టి పరిశీలించి పెదవి విరిచాడు. దింపుడు కళ్ళెం ఆశ వదిలేసి కర్మకాండ జరిపించమన్నాడు.తరువాత సిటీబస్సు ఎక్కడం ప్రారంభించాను. దీంట్లో వున్న సుఖం ఏమంటే మనం నడపక్కరలేదు, మనల్ని ఎవరో నడుపుతారు. కాకపోతే రన్నింగ్‌లో ఎక్కి రన్నింగ్‌లో దిగడం తెలిసుండాలి. ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడ ఎక్కుతున్నానో, దిగుతున్నానో తెలిసేది కాదు. చిల్లరదో సమస్య. టికెట్ వెనుక కండక్టర్లు రాస్తారు. చిన్నప్పుడు చూసిన షోలే సినిమాలో డైలాగులు గుర్తుంటాయి కానీ, చిల్లర గుర్తుండదు. చెల్లని చెక్కుల్లా జేబులో టికెట్లు మిగిలిపోతున్నాయి.డబ్బులు లేకపోయాయి కానీ, బస్సులో బోలెడంత కాలక్షేపం, కామెడీ. ఈమధ్య ఫిల్మ్‌నగర్ సిగ్నల్ దగ్గర ఒకడు వుండలా దొర్లుకుంటూ ఎక్కాడు, లేదా ఎగబ్రాకాడు. సీటులో సగమే కూచుని ‘బష్ ఎక్షా పోశా’ అన్నాడు. అదే రకం భాషో లేడీ కండక్టర్‌కి అర్థం కాలేదు. ‘టికెట్’ అంది తన భాషలో. ‘బష్ ఎక్షాపోశా కక్ర్’ అని వాడు మరాఠీ బెంగాలీ కలిపి వాగాడు. ఫుల్‌గా తాగినట్టున్నాడు. కిక్కెక్కినపుడు బస్సు ఎందుకు ఎక్కాడో అర్థం కాలేదు. ‘‘ఏమంటున్నాడన్నా వీడు’’ అడిగింది కండక్టర్. వాడి భాషపై నాక్కొంచెం భాషాభిమానం వుండడం వల్ల అనువాదం చేసి ‘‘బస్సు ఎక్కడికి పోతుంది కండక్టర్’’ అని అడుగుతున్నాడని చెప్పాను. ‘‘నువ్వెక్కడికి పోవాలా’’ అడిగింది కండక్టర్. మనవాడు సేమ్ డైలాగ్ పాములాంటి బుసతో రిపీట్ చేశాడు. లేడీ కండక్టర్ బాడీ బిల్డర్‌లా మారి విజిల్ కొట్టి బస్సు ఆపి వాడిని బయటికి విసిరేసింది. జిమ్నాస్టిక్స్ చేస్తూ ఒక కరెంటు పోల్ కింద సెటిలయ్యాడు. ∙∙ ఇంకోసారి ఒక సీనియర్ సిటిజన్ తగిలాడు. రూల్స్‌కి రోల్ మోడల్లా వున్నాడు. చిరిగిపోయి వంద రూపాయలిచ్చి టికెటివ్వమన్నాడు. నోట్ వేరేది ఇవ్వమన్నాడు కండక్టర్.‘‘నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయివి అవునా కాదా?’’ అని అడిగాడు సిటిజన్. అవునన్నాడు కండక్టర్ అయోమయంగా.‘‘మరి మీ గవర్నమెంట్ ప్రింట్ చేసిన నోట్‌ని, గవర్నమెంట్ ఎంప్లాయిగా నువ్వెందుకు తీసుకోవు?’’‘‘అన్నా, ఆ నోటు నేనియ్యలే కదా నీకు’’ అన్నాడు.‘‘ఇచ్చింది మీ గవర్నమెంటే కదా’’‘‘అరే, లొల్లి చేయకురా భయ్’’సిటిజన్ వినలేదు. దాంతో కండక్టర్‌కు ఏం చేయాలో తెలియక సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, బస్సుని స్లోగా నడుపుతున్న డ్రయివర్ వరకూ అందర్నీ తిట్టాడు. ఎందుకు తిట్టాడో అతనికి కూడా తెలియదు. ‘‘మీ గవర్నమెంట్ మీద మీకే గౌరవం లేకపోతే మాకెందుకుండాలి?’’ అని సిటిజన్ దిగిపోయాడు. ‘‘ఎక్కణ్నుంచి వస్తార్రా ఈ ఎర్రగడ్డ బ్యాచంతా’’ అని కండక్టర్ గొణుక్కుంటూ రైట్ చెప్పాడు. బస్సులు లేనపుడు సర్వీస్ ఆటోల్లో ఎక్కడానికి ప్రయత్నించాను కానీ అదంత సులభం కాదు. డ్రైవర్ మీద ప్రయాణీకులు కూచుంటారో, ప్రయాణీకుల మీదే డ్రైవర్ కూచుంటాడో అర్థం కాదు. ఒక్కోసారి డ్రైవర్ నిలబడి కూడా డ్రైవ్ చేస్తాడు. గోతులు, స్పీడ్ బ్రేకర్లు దేన్నీ లెక్కచేయడు. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. తిరుపతిలో జెవిఆర్కె రెడ్డి అని మంచి మిత్రుడున్నాడు. మనిషి ఎంత మృదువో, డ్రైవింగ్‌లో అంత కఠినం. స్పీడ్‌బ్రేకర్ల దగ్గర బ్రేక్ వేయకూడదని ఆయన సిద్ధాంతం. ఆయన బండిలో కూచుంటే ఇంటికే పోతామో, డాక్టర్ దగ్గరికి పోతామో చెప్పలేం. వాహనాల గురించి ఎప్పుడు రాసినా, ఆయన్ని స్మరించకుండా వుండలేను. – జి.ఆర్. మహర్షి -
ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు
లండన్: మామూలు సిగరెట్ కంటే ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఎలుకలపై జరిపిన వేరువేరుగా జరిపిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 10 రోజుల పాటు ఈ-సిగరెట్ పొగ ప్రభావానికి గురిచేసిన ఎలుకల్లో గుండె, నరాలు బాగా దెబ్బతిన్నాయని, ఇది ఎలుకల్లో మామూలు సిగరెట్ పొగ చూపే దుష్ప్రభావం కంటే అధికంగా ఉందని టెక్సాస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఈ-సిగరెట్ ప్రభావానికి గురైన ఎలుకల్లో మెదడు గ్లూకోజ్‌ను తీసుకునే పరిమాణం బాగా తగ్గిపోయిందని, తద్వారా మెదడు యాక్టీవ్‌గా పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఇక రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ఎంజైమ్‌పై రెండు రకాల సిగరెట్లు తీవ్ర దుష్ఫలితాలు చూపుతున్నాయని వెల్లడించారు. -
రెడ్ అలర్ట్ ప్రకటించిన చైనా
బీజింగ్: చైనాను దట్టమైన పొగమంచు ఊపిరాడకుండా చేస్తుంది. అక్కడి గాలి కాలుష్య రీడింగ్‌లు ఈ ఏడాదిలో అత్యధికంగా నమోదవుతూ.. ఆరోగ్యానికి తీవ్ర అపాయం కలిగించే స్థాయిని సూచిస్తూన్నాయి. ఉత్తర చైనాలో పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని 20కి పైగా నగరాల్లో రెడ్ అలర్ట్‌ను ప్రకటించగా.. 50 నగరాల్లో రెండో ప్రమాద తీవ్రత స్థాయిని తెలిపే ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. ముఖ్యంగా హెబీ, హినాన్ ప్రావిన్స్‌లలో కాలుష్య తీవ్రత క్యూబిక్ మీటర్‌కు 500 మైక్రోగ్రామ్‌లకు చేరుకుంది. షిజియాజుయాంగ్లోని ఓ వాతావరణ కేంద్రం వద్ద 1000 మైక్రోగ్రామ్‌లు దాటిందని అధికారులు వెల్లడించారు. బీజింగ్‌లో సైతం విజిబిలిటీ 500 మీటర్ల లోపు నమోదైంది. దట్టమైన పొగమంచు మూలంగా టియాంజిన్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 131 విమానాలను అధికారులు రద్దు చేశారు. -
చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి బర్డ్ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన ఓపీడీ బ్లాక్‌ను ప్రారంభించడానికి ఆయన బస్సులో బయలుదేరారు. అయితే, బస్సు అవిలాల వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పొగలు వచ్చి బస్సు నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు ముఖ్యమంత్రిని మరో వాహనంలో అక్కడి నుంచి తరలించారు. బస్సులో పొగలు రావడంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
పొగచూరిన బతుకులు
– తీరని మధ్యాహ్నభోజన వంట ఏజెన్సీల కష్టాలు – ఏళ్లు గడుస్తున్నా కట్టెలపొయ్యిలపైనే వంటలు – ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైన గ్యాస్ కనెక్షన్లు మధ్యాహ్నభోజనం పథకం వంట ఏజెన్సీల కష్టాలు తీరడం లేదు. అదిగో గ్యాస్ పోయ్యిలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పడం తప్ప ఆచరణలో పెట్టింది లేదు. నేటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కట్టెల పోయ్యిలపైనే నిర్వాహకులు వంటలు చేస్తున్నారు. పొగ ఎఫెక్ట్‌కు ఇప్పటికే కొందరు కంటి, శా్వస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమన్య కింద ప్రాథమిక పాఠశాలలు1928, ప్రాథమికోన్నత పాఠశాలలు 481, ఉన్నత పాఠశాలలు 448 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వారికి నాణ్యమైన షౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం 2003 నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఆహార పదార్థాల తయారీ బాధ్యత పొదుపు మహిళల (వంట ఏజెన్సీ)కు అప్పగించింది. ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తూ మిగతా సరుకులకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు ఒక్కోరికి రూ. 5.13, హైస్కూల్ విద్యార్థులకు రూ. 7.18 ప్రకారం నిరా్వహకులకు చెల్లిస్తోంది. అందులోనే వంట చేసేందుకు అవసరమైన కట్టెలను కొనుగోలు చేయాల్సి ఉంది. దరిచేరని గ్యాస్‌పోయ్యిలు కట్టెల పొయ్యిలపై వంట చేస్తుండటంతో నిర్వాహకుల ఆరోగ్యం దెబ్బతింటుందని, గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే దాదాపు 13 ఏళ్లు గడస్తున్నా అమలు కాలేదు. ఇంత వరకు ఒక్కరికి కూడా ఒక్క కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తుండడంతో అందులో నుంచి వచ్చే పొగకు చాలామంది కంటి చూపు తగ్గడం, తలనొప్పులు రావడం మొదలైంది. మరికొందరు ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఇటీవలే గ్యాస్ కనెక్షన్ల కోసం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ సారైనా అనుమతులు ఇస్తుందో లేదోననే వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. కట్టెలపై వంటలు చేయలేకపోతున్నాం – లలితమ్మ, కల్లూరు జడ్పీ హైస్కూల్ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు పిల్లలకు వంట చేసేందుకు గ్యాస్‌పొయ్యిలు లేకపోవడంతో కట్టెలపైనే చేస్తున్నాం. వానా కాలం కట్టెలు చిక్కని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వాటిపై వంట చేస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకోపోయాం. -
పొగ కాలుష్యం... హుష్‌కాకి!
వాయు కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోందని, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా పిల్లలకూ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క వాయు కాలుష్యం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు నాలుగు లక్షల మంది మరణిస్తున్నట్లు అంచనా. ఈ సమస్యను అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలూ తక్కువేమీ కాదు. ఢిల్లీలో వాహనాల సరిబేసి సంఖ్యల స్కీమ్‌లు ప్రవేశపెట్టినా, చైనాలో గంటకు 30 వేల ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేయగల టవర్లను పెట్టడం ఇందుకోసమే. అయితే వీటితోపాటు ఇంకా అనేక టెక్నాలజీలు, డిజైన్లు గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతు సాయమందిస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటిని మనం పక్క ఫొటోల్లో చూడవచ్చు. మొదటి ఫొటో... మెక్సికో నగరంలోని మాన్యుల్ గియా గొంజాల్వెజ్ ఆసుపత్రి. తేనే తుట్టె ఆకారంలో ఉన్న భవనం ముందువైపును చూశారు కదా. దాంట్లో ఉపయోగించిన టైల్స్‌పై అత్యంత పలుచగా టైటానియం డయాక్సైడ్ రసాయనాన్ని పూశారు. వెలుతురు సోకగానే గాలిలోని కాలుష్యకారక కణాలన్నీ దీనికి అతుక్కుపోతాయి. ఇక రెండవ ఫొటో... ఈ రంగు రంగుల పెంకులను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా, రివర్సైడ్ విద్యార్థులు తయారు చేశారు. ఇది కూడా టైటానియం డయాకై ్సడ్ పూత ద్వారా గాలిలోని నైట్రోజన్ ఆకై ్సడ్‌ను 88 నుంచి 97 శాతం వరకూ తగ్గిస్తుంది. బంకమట్టితో తయారు చేశారు కాబట్టి పెద్దగా ఖర్చు కూడా కాదన్నమాట. మూడవ ఫొటో... పచ్చటి చెట్లతో కళకళలాడుతున్న బిల్డింగ్ ఉందే... ఇటలీలోని మిలాన్ నగరంలో కట్టేస్తున్నారు దీన్ని. దీనిపై నాటిన మొక్కల విస్తీర్ణం 2.5 ఎకరాల అడవితో సమానం. గాలిలోని కార్బన్ డయాకై ్సడ్‌ను మింగేయడంతో పాటు, రణగొణధ్వనులు, సూర్యుడి ప్రతాపాన్ని తగ్గించి... ప్రశాంతతను ఇస్తాయి ఇవి. ఇక మిగిలింది నాలుగో ఫొటో... హోర్డింగ్ తాలూకుది. ఒక్కదెబ్బకు రెండుపిట్టలంటారే... ఆ టైప్ ఇది. హోర్డింగ్‌పై వాణిజ్య ప్రకటనలు కొత్త విషయం కాకపోవచ్చు గానీ, పెరూ రాజధాని లిమాలో ఉన్న ఈ హోర్డింగ్ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఇది రోజుకు దాదాపు లక్ష ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేస్తుంది. టైటానియం డయాకై ్సడ్ కాకుండా... నీటి ఆధారంగా పనిచేసే మరో రసాయనాన్ని వాడారు దీంట్లో. వాహనాల పొగలోని కాలుష్యాన్ని మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, సూక్ష్మ కణాలను కూడా శుభ్రం చేయడం దీనికున్న అదనపు సామర్థ్యం! -
మూడు రాష్ట్రాలకు తలంటేసిన ఎన్జీటీ
న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యంపై పంజాబ్, ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) తలంటేసింది. కాలుష్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రశ్నాస్త్రాలు సంధించింది. కాలుష్యం నివారణకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకున్నారని సూటిగా ప్రశ్నించింది. దీపావళి, పంటల దహనం కారణంగా కాలుష్యం పెరుగుతుందని తెలుసు కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్ లో ఏమైనా సమావేశాలు నిర్వహించారా? పొగమంచు తగ్గినట్టు ఏమైనా గణంకాలు ఉన్నాయా? హెలికాప్టర్ల ద్వారా కాకుండా క్రేన్లతో ఎందుకు నీళ్లు చల్లుతున్నారు? అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. కాలుష్యాన్ని నియంత్రించకపోతే మనం మాస్కులు ధరించినా ఫలితం ఉండబోదని హెచ్చరించింది. వాయు కాలుష్యం కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు, దీనిపై అధ్యయనం చేయమని శాస్త్రవేత్తలు ఎవరినైనా అడిగారా అని నిలదీసింది. పంటలను దహనం చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని పంజాబ్ సర్కారును అడిగింది. వ్యవసాయ వ్యర్థాలు తొలగించడానికి రైతులకు ఎన్ని యంత్రాలు సమకూర్చారని సూటిగా ప్రశ్నించింది. అన్నదాతలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తే పంట వ్యర్థాలను వారు తగలబెట్టరని సూచించింది. పొగమంచు, కాలుష్యం నివారణకు హర్యానా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఢిల్లీలో 3 రోజుల పాటు పాఠశాలల మూసివేత
-
మళ్లీ సరి-బేసి విధానం!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలకు ప్రకటించిన సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి తర్వాత రాజధాని నగరంలో కమ్ముకున్న కాలుష్యవాయువులను తొలగించేందుకు అత్యవసర కేబినేట్ భేటీని ఆదివారం నిర్వహించింది. సరి-బేసి రవాణా విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఐదు రోజుల్లో ఎన్సీఆర్ పరిధిలో నిర్మాణాల పనులను నిలిపివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నగరంలో జనరేటర్ల వినియోగంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. కాలుష్యం విషయంలో రాజకీయాలను వదిలిపెట్టి పరిష్కార మార్గాన్ని వెతకాలని అన్నారు. నిపుణుల సూచనల మేరకు కొన్ని అత్యవసర నిర్ణయాలను తీసుకుంటున్నట్లు చెప్పారు. దక్షిణ ఢిల్లీలో గల బొగ్గు ఆధారిత విద్యుత్తు తయారీ కేంద్రాన్ని 10 రోజుల పాటు మూసివేయనున్నట్లు వెల్లడించారు. ప్లాంటు నుంచి వెలువడే యాష్ పై నీటిని చిలకరించాలని చెప్పారు. అలాగే రోడ్లపై కూడా నీటిని చల్లనున్నట్లు తెలిపారు. నగర వాసులందరూ ఇంటి నుంచే తమ కార్యకలాపాలను సాగించుకోవాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ నుంచి పీడబ్ల్యూ శాఖ కాలి నడక వంతెనలపై దుమ్ము, ధూళిని వ్యాక్యూమ్ క్లీనర్ల ద్వారా శుద్ది చేస్తుందని చెప్పారు. డీజిల్ జనరేటర్లను ఉపయోగించే వారు విద్యుత్తు కనెక్షన్ ను కోరితే అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఢిల్లీని కప్పివేసిన పొగ సోమవారం తర్వాత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో గాలి వేగం నెమ్మదించడంతో పాటు గాలిలో తేమ అధికంగా ఉండటమే పొగ ఇన్ని రోజులు నిలిచి ఉండటానికి కారణమని చెప్పారు. -
కమ్మేసిన పొగమంచు:మ్యాచ్‌లు రద్దు!
న్యూఢిల్లీ: గతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు ప్రమాదస్థాయిని మించిపోయాయి. దాంతో ఢిల్లీ ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ సెగ క్రికెట్ మ్యాచ్‌లనూ వీడలేదు. పొగమంచు కారణంగా నగరంలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో, కర్నైల్ సింగ్ స్టేడియంలో శనివారం జరగాల్సిన మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ వాయు కాలుష్యం ఊపిరిత్తుల సమస్యతో పాటు, కంటి చూపుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు మ్యాచ్‌లు ఆడటానికి వెనకడుగు వేశారు. గ్రూప్-ఎలో భాగంగా బెంగాల్-గుజరాత్ జట్ల మధ్య ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఒక మ్యాచ్, గ్రూప్-సిలో త్రిపుర-హైదరాబాద్ జట్ల మధ్య కర్నైల్ సింగ్ స్టేడియంలో మరో మ్యాచ్ తొలి రోజు ఆట రద్దయ్యింది. వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యం ఢిల్లీ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతుంటే, ఇటీవల జరిగిన దీపావళి పండగ కూడా వాయు కాలుష్యానికి ఆజ్యం పోసింది. స్టేడియాల్లో కనుచూపు మేర ఏమీ కనిపించక పోగా, గాలిలో కూడా నాణ్యత లోపించడంతో తొలి రోజు మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల వరకూ వాతావరణాన్ని పలుమార్లు పరీక్షించిన తరువాత మ్యాచ్ లను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే ఆదివారం రెండో రోజు ఆట కూడా సాగే అవకాశం దాదాపు కనబడుట లేదు. ఇప్పటికే త్రిపుర-హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన రెండో రోజు ఆటను రద్దు చేశారు. -
భయంతో బస్సులో నుంచి దూకేశారు..
-
భయంతో బస్సులో నుంచి దూకేశారు..
నందిగామ: ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో.. భయాందోళనలకు గురైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకేశారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా నందిగామ బైపాస్ రోడ్డుపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న రాజధాని ట్రావెల్స్ బస్సు నందిగామ వద్దకు చేరుకోగానే ఏసీలో నుంచి గాలికి బదులు పొగలు వచ్చాయి. దీంతో బస్సు మొత్తం పొగతో నిండిపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు అద్దాలు పగ లగొట్టుకొని బయటకు దూకారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చైనాలో స్వచ్ఛ టవర్!
పీల్చే గాలి కలుషితమైపోతోంది. అది ఢిల్లీ... ముంబై... షాంఘై ఏదైనా కావచ్చు. రోడ్లపై తిరిగే వాహనాలను నియంత్రించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రయోగం చేసి గమ్మున ఉండిపోయింది. అంటే వర్కవుట్ కాలేదని! అయితే చైనా దీనికి భిన్నంగా ఒకదాని తరువాత ఒకటి ప్రయత్నాలు చేస్తూ పోతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఫొటోలో కనిపిస్తున్న ‘స్మాగ్ టవర్’. వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే అతిసూక్ష్మమైన కాలుష్య పదార్థాలను స్మాగ్ అంటారు. ఈ టవర్ గాల్లో ఉండే స్మాగ్‌ను పీల్చేసుకుని స్వచ్ఛమైన గాలిని బయటకు వదులుతుంది. దాదాపు 21 అడుగుల పొడవుండే ఈ స్మాగ్ టవర్స్ ఒకొక్కటి గంటకు 30 వేల ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేయగలదు. టవర్లోపల నెగటివ్ చార్జ్‌తో ఉండే ఉపరితలంపై పాజిటివ్ అయాన్లు, దుమ్మూధూళి, స్మాగ్ అతుక్కుపోతాయి. నెదర్లాండ్స్‌కు చెందిన డాన్ రూస్‌గార్డే డిజైన్ చేసిన ఈ టవర్లు కేవలం 1400 వాట్ల విద్యుత్తుతో పనిచేస్తాయి. ఇంకోలా చెప్పాలంటే రెండు మిక్సీలు వాడేంత విద్యుత్తు అన్నమాట. సరే... అంతా బాగానే ఉందిగానీ ఈ యంత్రం నుంచి స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకొస్తూంటే... స్మాగ్ అంతా ఏమవుతుంది? రెండో ఫొటోలో ఓ ఉంగరం కనిపిస్తోందా? దాని మధ్యలో నల్లగా కనిపిస్తోందే.. అది ఈ టవర్ సేకరించిన స్మాగ్. ఈ ఒక్క ఉంగరంలో ఉన్న స్మాగ్ వెయ్యి ఘనపు మీటర్ల గాలిని శుద్ధి చేస్తే వచ్చింది. ఈ లెక్కన ఈ టవర్ రోజుకు 300 ఉంగరాలకు సరిపడా స్మాగ్‌ను సేకరిస్తుందన్నమాట. రూస్‌గార్డే ఈ ఉంగరాలు ఒకొక్కదాన్ని 250 యూరోల చొప్పున విక్రయిస్తున్నారు. భలే ఐడియా కదూ...! వాతావరణంలోంచి టవర్ తన లోపలికి లాగేస్తున్న స్మాగ్... ఇదిగో ఈ ఉంగరం లాంటి పరికరం (స్మాగ్ రింగ్) లోకి చేరుతుంది. -
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
వరంగల్: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం పొగలు వచ్చాయి. ఆ విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వరంగల్ జిల్లా డోర్నకల్ స్టేషన్లో నిలిపి వేశారు. రైలులో పొగలు వస్తున్న ఎస్ 9, ఎస్12 బోగీలను పరిశీలించారు. లైనర్లు పట్టివేయడం వల్లే పొగలు కమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరమ్మతులు వేగవంతం చేశారు. -
గాల్లో విమానం.. అందులో పొగలు!
-
గాల్లో విమానం.. అందులో పొగలు!
గాలిలో ప్రయాణిస్తుండగా ఉన్నట్టుండి విమానంలో పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాంతో జెట్‌స్టార్ విమానంలోని ఒక ఇంజన్‌ను ఆపేసిన పైలట్.. దాన్ని బ్రిస్బేన్‌కు దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సిడ్నీ నుంచి కెయిర్న్స్ వెళ్తున్న విమానంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఎయిర్‌బస్ ఎ 320 విమానానికి ఉన్న రెండు ఇంజన్లలో ఒకదాంట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముందుజాగ్రత్త చర్యగానే ఒక ఇంజన్‌ను పైలట్ ఆపేశారని, దాన్ని బ్రిస్బేన్ మళ్లించారని జెట్‌స్టార్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తమ ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరిస్తున్నారంది. ఇలా విమానంలో పొగలు రావడం చాలా అసాధారణంగా జరుగుతుందని, ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై తమ సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చామని కూడా సదరు సంస్థ వివరించింది. విమానం మొత్తం పొగలు వ్యాపించి ఉండగా ఓ ప్రయాణికుడు తీసిన వీడియోను ఏబీసీ సంస్థ ప్రసారం చేసింది. ఇది తన జీవితంలోనే అత్యంత భయానకమైన క్షణమని సదరు ప్రయాణికుడు ఆండ్రా థాంప్సన్ తన ఫేస్బుక్లో రాశారు. విమానానికి మంటలు అంటుకున్నాయని, అందువల్లే కేబిన్ మొత్తం పొగతో నిండిపోయిందని అన్నారు. తనకు పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాతే విమానంలోకి పొగ వచ్చిందని.. దాదాపు గంట పాటు అది అలాగే ఉందని వెంటే పెర్కిన్స్ అనే మరో ప్రయాణికురాలు తెలిపారు. కొద్ది సెకండ్లలోనే తన కాళ్ల వద్దకు, ముఖం మీదకు, తన పక్క సీటులో కూర్చున్న వ్యక్తి మీదకు ఆ పొగలు వ్యాపించాయని చెప్పారు. తర్వాత విమానంలో ప్రెజర్ కూడా తగ్గిపోయిందన్నారు. అయితే జెట్ స్టార్ సంస్థ మాత్రం ఈ వాదనలను ఖండించింది. విమానం బ్రిస్బేన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాతే పొగలు కనిపించాయని ఆ సంస్థ తెలిపింది. వీడియో కూడా విమానం ల్యాండ్ అయిన తర్వాత తీసిందేనని చెబుతోంది. ఏసీ యూనిట్ ద్వారా ఈ పొగలు క్యాబిన్లోకి వచ్చి ఉంటాయని చెప్పింది.