పొగమంచు కాదు.. పొగే
హైదరాబాద్: మీరు ఈ ఫోటోలలో చూస్తుంది తెల్లవారుజామున కురిసే పొగమంచు కాదు, గాలిలోని హిమబిందువులు అంతకన్నా కాదు.. ఇదంతా పరిశ్రమల నుంచి వెలువడుతున్న హానికారకమైన పొగ. ఇలాంటి దృశ్యాలు పారిశ్రామిక వాడలైన జీడిమెట్ల, గాంధీనగర్‌లలో నిత్యకృత్యమయ్యాయి. స్థానిక పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది.
కొన్ని పరిశ్రమలు పరిమితికి మించి విషవాయువులను పర్యావరణంలోకి వదులుతున్నా.. కాలుష్యాన్ని అరికట్టాల్సిన పీసీబీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. తమకు ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు.