పొగమంచుతో ప్రమాదం: ఆరుగురు మృతి | Car Falls Into Canal Near Delhi Due To Fog And Six Dead | Sakshi
Sakshi News home page

పొగమంచుతో కారు ప్రమాదం: ఆరుగురు మృతి

Published Mon, Dec 30 2019 8:45 AM | Last Updated on Mon, Dec 30 2019 10:53 AM

Car Falls Into Canal Near Delhi Due To Fog And Six Dead - Sakshi

నోయిడా: ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  దాన్కర్ ప్రాంతంలో మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి కెనాల్‌లో పడింది.  ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 11.30 గంటలకు ఢిల్లీకి వెళ్తుండగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారులో 11 మంది ప్రయాణిస్తుండగా అందులో ఇద్దరు చిన్నారులతో పాటు, మరో నలుగురు మృతిచెందారు. మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

పొగమంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై వెలుతురు తగ్గిపోటం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కారులో ప్రయాణించిన వారంతా ఉత్తరప్రదేశ్‌లోని సంబల్‌ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement