Car Accident
-
టీడీపీ నేత కారు బీభత్సం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు.. మైలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొడుకు.. టీడీపీ నేత ఉయ్యూరు వెంకటరమణ శనివారం బెజవాడలో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో కారును నడిపి రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు.. తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ నందమూరినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాలివీ..మద్యం మత్తులో.. మహిళతో కారు నడిపిస్తూ?మైలవరం నియోజకవర్గం జి.కొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు కొడుకు వెంకటరమణ తన ఏపీ 16 ఈఎఫ్ 4979 కారులో విజయవాడ నుంచి తన ఇంటికి శనివారం మధ్యాహ్నం బయల్దేరాడు. సింగ్‌నగర్ ఫ్లైఓవర్ దిగి నందమూరినగర్ సాయిబాబా గుడి దాటిన తరువాత కారు వేగాన్ని పెంచి వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డు వెంబడి ఉన్న బడ్డీకొట్టును ఢీకొని ఆ పక్కనే ఉన్న తోపుడు బండ్ల వైపు దూసుకువెళ్లి 20 అడుగుల ఎత్తుకు ఎగిరి చివరకు స్తంభాన్ని ఢీకొని ఆగింది. ఈ ఘటనలో అక్కడే తోపుడు బండిపై శనక్కాయలు అమ్ముకుంటున్న నందమూరినగర్ తోటవారి వీధికి చెందిన పీకా కోటేశ్వరరావు (49) అనే చిరువ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు నడిపింది ఓ మహిళ అని, పోలీసులు వచ్చేసరికి ఆమెను తప్పించి వెంకటరమణను చూపుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.నిందితులను చూస్తుంటే వారు మద్యం సేవించినట్లుగా ఉన్నారని.. అతివేగంతో ఆ మహిళ కారును నడపడంవల్లే ఈ ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. ఇక నిందితులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని.. చికిత్స నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి పంపామని సింగ్‌నగర్ సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితులు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని, కారు నడిపింది మహిళ కాదు తానే అని నిందితుడు వెంకటరమణ చెబుతున్నాడని ఆయన చెప్పారు. అయితే కారు ఎవరు నడిపారు.. ప్రమాదం ఎలా జరిగిందనే అంశాలకు సంబంధించి సంఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని.. అవి వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. నిందితుడిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు.. నిందితుడు వెంకటరమణను తప్పించేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
విజయవాడలో టీడీపీ నేత కారు బీభత్సం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రభ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునే వ్యక్తిని టీడీపీ నేత కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో పికా కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఉయ్యూరు వెంకటరమణదిగా గుర్తించారు. కారుపై జై టీడీపీ, జై వసంత, టీమ్ రమణ అని రాసి ఉన్న స్టిక్కర్‌తో కూడిన ఎమ్మెల్యే ఫోటో ఉంది. ప్రమాద ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రన్నింగ్ కారులో మంటలుచిత్తూరు జిల్లా: పలమనేరు రూరల్ మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు దగ్ధమైంది. ఐదుగురితో తిరువన్నమలై నుండి ముల్బాగల్ వెళ్తుండగా ఘటన జరిగింది. హఠాత్తుగా ఇంజన్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఇదీ చదవండి: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?.. -
పెళ్లికి హాజరై వెళ్తూ.. అనంతలోకాలకు
వేములవాడరూరల్: కూతురితో కలిసి బంధువుల పెళ్లికి హాజరయ్యారు.. అందరితో సంతోషంగా గడిపి, తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్త, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వేములవాడరూరల్ మండలంలోని లింగంపల్లికి చెందిన కొలిపాక సుమన్ హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. భార్య రోషిణి(24), కూతురితో కలిసి అక్కడే ఉంటున్నాడు. ముగ్గురూ వేములవాడలో జరిగిన బంధువుల వివాహానికి కారులో వచ్చారు. బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్ వెళ్లారు. రింగ్ రోడ్డుపై కారు అదుపుతప్పి, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోషిణి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె భర్త సుమన్, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో పంచనామా అనంతరం రోషిణి మృతదేహాన్ని బంధువులు స్వగ్రామం లింగంపల్లికి తీసుకొచ్చారు. -
నాంపల్లిలో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు అదుపు తప్పి.. జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అనంతరం, మద్యం తాగి కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు.వివరాల ప్రకారం..నాంపల్లిలోని రెడ్‌హిల్స్ నీలోఫర్ కేఫ్ వద్ద గురువారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం తాగి కారు నడపడంలో అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం, మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నల్లగొండ జిల్లా కేతేపల్లిలో రోడ్డు ప్రమాదం
-
పనికెళ్లి తిరిగొస్తుండగా..
పెద్దపల్లి రూరల్: కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే ఇద్దరు అభాగ్యులను కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి శివారులో మంగళవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రంగంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌కు సోమవారం రాత్రి ఓ విందు పనికి వెళ్లిన కుక్క భాగ్య (46), కుక్క అమృత (48), కుక్క పద్మ, కుక్క కాంత పని ముగించుకుని మంగళవారం వేకువజామున తమ ఇళ్లకు బయలుదేరారు. కాలినడకన రాజీవ్ రహదారి పక్కనుంచి వస్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భాగ్య, అమృత ఘటనా స్థలంలోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన పద్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాంత గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరంతా పెద్దపల్లి ఉదయ్‌నగర్‌కు చెందిన పాలెవాళ్లుగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భాగ్యకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురికి వివాహమవగా, దివ్యాంగురాలైన మరో కూతురు నవ్య ఇంటి వద్దే ఉంటోంది. భర్త కనకయ్య హమాలీగా పనిచేస్తున్నాడు. అమృత భర్త నర్సయ్య కూడా హమాలీగా పనిచేస్తున్నాడు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఏసీసీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌కుమార్ సందర్శించారు. -
ఘోర కారు ప్రమాదం.. ఆరుగురి మృతి
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఓఎన్జీసీ క్రాసింగ్ వద్ద తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కార్గో ట్రక్కును ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే కాంట్ పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రయాణికుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మృతులు, తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డెహ్రాడూన్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్నోవా కారు బల్లూపూర్ నుంచి కాంట్ ప్రాంతం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.A tragic road accident occurred in Dehradun, in which six people lost their lives and one person was seriously injured. The incident took place near the ONGC Chowk in Dehradun, when a speeding truck collided violently with an Innova car.#DehradunAccident #TragicCrash pic.twitter.com/za532tIPBz— Archana Pandey (@p_archana99) November 12, 2024 -
కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు కుటుంబంలో విషాదం
సాక్షి, జగిత్యాల జిల్లా: పచ్చని పందిళ్లు..మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాలతో వధూవరులు ఏకమయ్యారు. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ వధువు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వధువు తల్లిదండ్రులు చావు బతుకులు మద్య కొట్టుమిట్టాడుతుంటే అన్న , అతని స్నేహితురాలు ప్రాణాలు కోల్పోయారు. వధువు వివాహం జరిగిన గంటల వ్యవధిలో ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయిజగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండలో రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వధువు అన్న సంకీర్త్, స్నేహితురాలు రాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వెనుక సీట్లో కూర్చున్న వధువు తల్లి,దండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం
-
మైనర్ కారు డ్రైవింగ్.. యువతి బలి
-
ఏపీ కార్మికశాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ కు కారు ప్రమాదం...
-
ఓవర్ టేక్ చేయబోయి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఐఏఎస్ వాణి ప్రసాద్ కారు
సాక్షి, సూర్యాపేట జిల్లా : మునగాల మండలం ఆకుపాముల సమీపంలో జరిగిన కారు ప్రమాదం నుంచి ఐఏఎస్ అధికారిణి, ఏపీ కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ సురక్షితంగా భయటపడ్డారు. ఆకు పాముల సమీపంలో ఐఏఎస్ వాణీ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్.. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారు ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు ఐఏఎస్ వాణి ప్రసాద్‌ను సురక్షితంగా తరలించారు. మరోవైపు కారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదం గురించి ఆరా తీశారు. -
పోలీసుల్ని ఢీకొట్టి.. 20 మీటర్లు ఈడ్చుకెళ్లి!
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను ఢీకొట్టిన కారు, వారిని 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఢిల్లీలోని వేదాంత్ దేశికా మార్గ్‌లోని బెర్ సరాయ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శనివారం రాత్రి 7.45 గంటల సమయంలో చోటుచేసుకుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఏఎస్ఐ) ప్రమోద్, హెడ్ కానిస్టేబుల్ శైలేశ్ చౌహాన్ ట్రాఫిక్ ఉల్లంఘనుల వాహనాలకు చలాన్లు రాస్తున్నారు. అదే సమయంలో ఓ కారు రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వేగంగా దూసుకువచి్చంది. దాంతో శైలేశ్, ప్రమోద్ ఆ కారును ఆపారు. అయితే అది ఒక్కసారిగా స్పీడందుకుని ఇద్దరినీ 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి మాయమైంది. గాయపడ్డ పోలీసులను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. వారు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారని అధికారులు తెలిపారు. కారు యజమానిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే బాబు కుట్రలు
నెల్లూరు(బారకాసు)/ఒంగోలు సిటీ/ప్రొద్దుటూరు: ‘దుష్ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు రెండు కళ్లు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదచల్లుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మ కారుకు ప్రమాదం.. అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ఎండగట్టారు. మేం మాట్లాడితే తట్టుకోలేరు: కాకాణి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 50లక్షల మందికి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ వ్యవహారాలపై కొందరు పిచి్చపిచ్చి విమర్శలు చేస్తున్నారు. మేం కూడా అదేవిధంగా మాట్లాడితే తట్టుకోలేరు. ఎనీ్టఆర్ ఎవరి వల్ల చనిపోయారు? ఆయన స్థాపించిన పారీ్టని ఎలా చేజిక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని వారిని తొక్కిపెట్టి నార తీయండి. హామీలు అమలుచేయని చంద్రబాబు, లోకేశ్‌ను తొక్కి పెట్టి నార తీయాలి.’ అని పవన్‌కళ్యాణ్‌కు కాకాణి సూచించారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే: టీజేఆర్ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిన చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ వమ్ము చేశారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, హామీల అమలుపై ప్రజలు ఇక ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘దేశంలో అనేక రాజకీయ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబుకు గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరితో విబేధాలు లేవా? తమ్ముడు రామ్మూర్తినాయుడుతోపాటు అనేక మంది కుటుంబ సభ్యులతో గొడవలు లేవా? హెరిటేజ్‌లో చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు వాటాలు పంచారా?’ అని ఆయన నిలదీశారు. ‘కూటమి అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే 77మంది మహిళలు మాయమైపోయారని వారి రక్షణ సంగతి చూడండి..’ అని పవన్‌కళ్యాణ్‌కు హితవుపలికారు. తన కుటుంబంలో జరిగిన ఘటనలను కూడా పవన్ గుర్తుచేసుకోవాలని సూచించారు. అవన్నీ కుట్రలేనా బాబూ?: రాచమల్లు వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారాలు, కథనాలను ఆపాలని టీడీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. ‘హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, జూనియర్ ఎనీ్టఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కుట్రలేనా’ అని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికి తాము లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం
-
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తున్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది.కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పామర్రు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను గుడివాడ ఆసుపత్రి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
ఉద్యోగికి యాక్సిడెంట్.. మేనేజర్ రియాక్షన్‌కు షాక్!
ఆఫీసులకు ఆలస్యంగా వస్తే.. ఉద్యోగులు తమ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతారు. కారణం బలమైనదైతే బాస్ కూడా ఏమి అనలేరు. అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఆఫీసుకు లేటుగా రావడానికి కారు ప్రమాదం కారణమని చెప్పినా.. మేనేజర్ వ్యవహరించిన తీరు ఉద్యోగిని చాలా బాధించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఉద్యోగి కారు ప్రమాదానికి గురై ముందు భాగం భారీగా దెబ్బతినింది. ఈ విషయాన్ని మేనేజర్‌ను తెలియజేస్తూ.. దెబ్బతిన్న కారు ఫోటోలను షేర్ చేశారు. ఉద్యోగికి ఏమైందో అడగటం మానేసి.. మీరు ఏ సమయానికి ఆఫీసుకు రావాలనుకుంటున్నారో తెలియజేయండి అని మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే తప్పా గైర్హాజరు క్షమించరానిదని వెల్లడించారు.ఉద్యోగి, మేనేజర్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ మేనేజర్ ఇలా చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు.దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగి క్షేమం గురించి అడగకుండా.. పని గురించే ఆలోచించే మేనేజర్ మీద చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, అని ఒక వ్యక్తి అంటే.. ఆ కంపెనీకి ఇకపై వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం వదిలేసావు అనే విషయాన్ని ఎవరైనా అడిగితే, స్క్రీన్ షాట్స్ చూపించండి అని అన్నారు. మేనేజర్‌కు కూడా ఇలాంటి అవస్థ వచ్చేలా చేస్తానని ఇంకొకరు పేర్కొన్నారు.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 -
ప్రజాభవన్ వద్ద కారు బోల్తా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో దూసుకెళ్లిన కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద శనివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బోల్తా కొట్టడంతో కారు ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాల తెలియాల్సి ఉంది. -
మెదక్: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
సాక్షి, మెదక్: శివంపేట పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు పాము బండ తండాకు చెందిన వారికిగా గుర్తించారు.ఈ ఘటనలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘బిగ్‌బాస్’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్.. తుక్కుతుక్కైన కారు
టాలీవుడ్ హీరోయిన్, బిగ్‌బాస్ ఫేం సుభాశ్రీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ సినిమా షూటింగ్ కోసం కారులో వెళ్తుండగా నాగార్జున సాగర్ మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ బైక్ రైడర్.. ముందు నుంచి స్పీడ్‌గా వచ్చి శుభశ్రీ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయింది. అందరూ క్షేమంగా బయపడినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, శుభశ్రీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో పాటు హీరోయిన్గా నటించింది. అయితే సినిమాల్లో రాని గుర్తింపు బిగ్‌బాస్ రియాల్టీ షోతో వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 7లో శుభశ్రీ పాల్గొంది. తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె హీరోయిన్గా ఓ సినిమా రూపొందుతుంది. ఆ మూవీ షూటింగ్ కోసమే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
Himmatnagar: రోడ్డు ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు.. ఏడుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై అతివేగంలో ఉన్న కారు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.డీఎస్సీ ఏకే పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమ్మత్‌నగర్‌లోని హైవేపై బుధవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. అతివేగంలో ఉన్న ఇన్నోవా కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అహ్మదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించినట్టు చెప్పారు.ఇక, ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయిపోయింది. కారు ముందు భాగంగా పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. #WATCH | Sabarkantha, Gujarat | Himmatnagar Deputy SP, AK Patel says, "Today morning, a car collided with a heavy vehicle on Himmatnagar highway. Seven people travelling in the car are dead, and one person is injured. All of them were residents of Ahmedabad..." https://t.co/bcMBSNrdEg pic.twitter.com/5dBK5SayIG— ANI (@ANI) September 25, 2024 ఇది కూడా చదవండి: తమిళనాడు: చెట్టును ఢీ కొట్టిన వ్యాన్.. ఆరుగురి దుర్మరణం -
కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్త.. తీవ్ర గాయాలు
తెలుగులో తమ్ముడు, నరసింహనాయడు తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది ప్రీతి జింగానియా. ఇప్పుడు ఈమె భర్త ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలు కావడంతో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి ఇతడిని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భర్తకి ప్రమాదం జరగడంపై ప్రీతి కూడా స్పందించింది.'నా కుటుంబమంతా షాక్‌లో ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. తెల్లవారుజామున నా భర్తకి కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగోలేదని డాక్టర్స్ చెప్పరాు. వైద్య పరీక్షలు చేస్తున్నారు' అని ప్రీతి జింగానియా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం)పవన్ కల్యాణ్ 'తమ్ముడు' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి.. ఆ తర్వాత బాలకృష్ణతో 'నరసింహనాయుడు', మోహనబాబుతో 'అధిపతి', రాజేంద్ర ప్రసాద్ 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ 'యమదొంగ'లో ప్రత్యేక గీతంలో నర్తించింది. చివరగా 'విశాఖ ఎక్స్‌ప్రెస్' మూవీలో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయింది.ఇక ఫ్యామిలీ విషయానికొస్తే 2008లో నటుడు, మోడల్ పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పర్వీన్ కూడా హిందీలో 'మాన్సూన్ వెడ్డింగ్', 'ఖోస్లా కా ఘోస్లా', 'రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2' తదితర సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 'శర్మజీ కీ భేటీ' చిత్రంలో కనిపించాడు. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్) -
పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే కుమారుడు సంకేత్ బవాన్కులే మద్య మత్తులో బీభత్సం సృష్టించారు. పూటుగా మద్యం సేవించి ఇతర వాహనాల్ని ఢీకొట్టారు. ఘటన అనంతరం సంకేత్ బవాన్‌కులేతో పాటు అతని స్నేహితులు పరారయ్యారు. సంకేత్ కారులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..సోమవారం అర్ధరాత్రి 1 గంటకు మద్యం మత్తులో ఉన్న సంకేత్ బవాన్కులే ఆడి కారుతో మాన్కాపూర్ ప్రాంతం వైపు వెళుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా ఉన్న వాహనాల్ని ఢీకొట్టాడు. నానా హంగామా చేశాడు. అయితే సంకేత్ తీరుతో కోపోద్రికులైన ఇతర వాహనదారులు.. అతని కారును వెంబడించారు. దీంతో మార్గం మద్యలోనే కారును వదిలేశాడు. అందులో ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్ట్.. ఆపై బెయిల్ప్రమాదంలో తన కారుకు డ్యామేజీ జరిగిందంటూ జితేంద్ర సోన్కాంబ్లే అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంకేత్ బవాన్కులే కారు డ్రైవర్ అర్జున్ హవ్రే, రోనిత్ చిట్టమ్‌వార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది సేపటికే బెయిల్‌పై విడుదలయ్యారు. చట్టం ముందు అందరూ సమానులేఈ సందర్భంగా కారు ప్రమాదంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే స్పందించారు. ఆ ఆడి కారు తన కుమారుడు సంకేత్ పేరిట రిజిస్టర్ అయినట్లు అంగీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి పక్షపాతం లేకుండా క్షుణ్ణంగా,నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి.దోషులకు కఠిన శిక్ష విధించాలి.చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాదీల సజీవదహనం
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు. గత వారం జరిగిన ఈ ప్రమాద ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కార్ పూలింగ్ ద్వారా ఈ నలుగురు బెన్టోన్విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. తర్వాత రోడ్డుపై వీరి వాహనాన్ని వేరే వాహనాలు వెనుకనుంచి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఈ కారులో ఎక్కారు. ప్రమాదం కారణంగా వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. -
హైదరాబాద్ బంజారాహిల్స్ లో కారు బీభత్సం