బంజారాహిల్స్‌లో కారు బీభత్సం | High Speed Car Accident At Banjara Hills, Five Cars And One Auto Were Destroyed In This Accident | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Published Sat, Aug 31 2024 9:22 AM | Last Updated on Sat, Aug 31 2024 10:29 AM

High Speed Car Accident At Banjara Hills

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫుల్‌ స్పీడ్‌లో ఉన్న ఫార్చూనర్‌ కారు ఓ కాంప్లెక్స్‌లో ఉన్న కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి.

వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లో ఓ మైనర్‌ ఫార్చూనర్‌ కారును నడుపుతూ బీభత్సం సృష్టించాడు. ఫుల్‌ స్పీడ్‌లో కారును నడిపి ఓ కాంప్లెక్స్‌లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్‌లో ఉన్న కారును, ఆటోను ఢీకొట్టి కారు పల్టీ కొట్టింది. ఈ ‍ప్రమాదంలో ఐదు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమచారం తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement