![Minister Ponguleti Srinivasa Reddy car accident in Khammam district](/styles/webp/s3/article_images/2025/01/13/srinivas-p.jpg.webp?itok=gpyW6qJU)
పేలిన కారు టైర్లు
తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హనుమకొండలో ఆదివారం జరిగిన అధికారిక సమీక్షలో పాల్గొన్న ఆయన, అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. రాత్రి 8–45 గంటల సమ యాన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ఎడమపక్క రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం మంత్రి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. హనుమ కొండ నుంచి వస్తున్న క్రమంలో టైర్లు వేడెక్కి పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment