Khammam district
-
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి..
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయామని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రుణమాఫీ విషయంలో మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడంతో తెలంగాణ అధోగతి పాలైంది. ప్రజలు తిడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చింది. సీఎం నియోజకవర్గంతోపాటు తెలంగాణలోని ప్రతీ పనికి సంబంధించిన కాంట్రాక్టు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతున్నాయి. కాంట్రాక్టుల మంత్రి ఇచ్చే కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం 30శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.ప్రత్యేక కారణాలతోనే బీఆర్ఎస్కు నష్టం‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అసాధారణ అభివృద్ధి జరిగినా అక్కడి ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా వరదల సమయంలో ప్రజలకు పైసా ఉపయోగ పడలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినా ఏడాది కాలంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.ఈ ఎన్నికల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకగ్రీవాల కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంటుంది’ అని కేటీఆర్ హెచ్చరించారు. త్వరలో తాను ఖమ్మం జిల్లాలో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.కేసీఆర్ పుట్టిన రోజున ‘వృక్షార్చన’బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న ప్రతీ ఒక్కరూ మూడు మొక్కల చొప్పున నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘వృక్షార్చన’ పేరిట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ మంగళవారం విడుదల చేశారు. -
పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం.. వైరా మండలంలో పర్యటించిన మంత్రి.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కి మంత్రి ఫోన్లో సూచించారు.పంచాయతీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఆ దిశగా మార్పులు, చేర్పులతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి 3న ప్రకటించాలని పేర్కొంది.4న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి తుది జాబితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల పంచాయతీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్,కాంగ్రెస్‌కు ఎంపీ లక్ష్మణ్ ఛాలెంజ్ -
మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హనుమకొండలో ఆదివారం జరిగిన అధికారిక సమీక్షలో పాల్గొన్న ఆయన, అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. రాత్రి 8–45 గంటల సమ యాన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ఎడమపక్క రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం మంత్రి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. హనుమ కొండ నుంచి వస్తున్న క్రమంలో టైర్లు వేడెక్కి పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. -
ఖమ్మం.. చారిత్రక గుమ్మం!
ఖమ్మం మయూరి సెంటర్: చారిత్రక నేపథ్యం కలిగిన ఖమ్మం జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఖమ్మం జిల్లా.. వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. ఈ జిల్లా భూభాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేరుగా ఉంది. ఖమ్మం నగరం మధ్యలోని స్తంభాద్రి నుంచే మండపాలు, స్తంభాలకు కావల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు.. నగరంలోని నృసింహాద్రి అని పిలిచే నారసింహాలయం నుంచి వచి్చనట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతి స్తంభం అని.. అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచి్చనట్లు మరో వాదన ఉంది. నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా.. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలుతీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు. ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం.. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వా«దీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్షాహి పాలనలో ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు 10 ద్వారాలున్నాయి. పశి్చమం వైపు దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపు రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోట లోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌టౌలి అనే బావి కూడా ఉంది. కోట ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. అభివృద్ధి వైపు అడుగులు.. ఖమ్మం కోటగా కీర్తి గడించిన ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కోటలోని జాఫర్‌టౌలి (బావి)ని ఆధునికీకరించారు. కోటపైకి పర్యాటకులు వెళ్లేందుకు రోప్ వే నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. రోప్‌వే నిర్మాణం జరిగితే ఖిల్లాను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, దీనిద్వారా కోటకు ఉన్న ఘనమైన చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
లవర్స్‌కు అనుమతి లేదు !
ఎక్కడైనా పార్క్‌ల వద్ద సైకిళ్లు, వాహనాలు తీసుకురావొద్దని, చెత్తాచెదారం పడేయొద్దనే సూచనలతో బోర్డులు చూస్తుంటాం. కానీ ఖమ్మంలోని మున్సిపల్ కార్పొరేషన్ పక్కన ఉన్న ఫ్రీడమ్ పార్క్ వద్ద ఏర్పాటుచేసిన బోర్డును మాత్రం ప్రతిఒక్కరు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ బోర్డుపై సైకిళ్లు పార్క్ లోపలికి తీసుకురావొద్దని, సాయంత్రం 4 గంటల తర్వాత క్రికెట్ ఆడొద్దనేవి రెండు సూచనలు ఉన్నాయి. ఇక మూడోది మాత్రం ‘లవర్స్‌కు అనుమతి లేదు’ అని రాశారు. పార్క్‌కు చిన్నాపెద్ద వాకింగ్ కోసం వస్తుండగా గంటల తరబడి తిష్ట వేస్తున్న కొన్ని జంటలు ప్రవర్తిస్తున్న తీరుతో ఇబ్బందులు వస్తుండడంతోనే ఇలా బోర్డు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. – ఖమ్మంమయూరిసెంటర్ -
నేను చనిపోయినా.. మీరు బతుకుతారు...
ఖమ్మం క్రైం: ‘అందరినీ కలిపి హత్య చేయాలనుకుంటున్నారు.. దీన్ని ఆపేందుకు నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. అప్పుడు మిగతా ఐదుగురైనా బతుకుతారు.. నా మృతదేహం వద్దకు చిన్నకుమారుడైన శేఖర్–సుజాతను రానివ్వొద్దు’ అంటూ పోలీసు కమిషనర్‌కు లేఖ రాసి.. ఖమ్మంకు చెందిన చిట్‌ఫండ్ వ్యాపారి చేకూరి సత్యంబాబు (77) ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలో ఈ ఘటన కలకలం రేపింది. వివరాలు..ఖమ్మం వీడీవోస్ కాలనీకి చెందిన చేకూరి సత్యంబాబు చిట్‌ఫండ్ వ్యాపారంతో పాటు కుమారులైన శ్రీధర్, శేఖర్‌తో కలిసి ఇంకొన్ని వ్యాపారాలు చేశాడు. కొన్నాళ్ల క్రితం వ్యాపారాల నిమిత్తం చేసిన అప్పుల కారణంగా శ్రీధర్– శేఖర్‌కు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో శేఖర్ వేరుగా ఉంటున్నాడు. సత్యంబాబు – నాగేంద్రమ్మ, వీరి పెద్దకుమారు డైన శ్రీధర్ కుటుంబం కలిసి ఉంటోంది. కాగా, లావా దేవీలు, అప్పులకు సంబంధించి 2017 నుంచి గొడవలు పెరగడంతో సత్యంబాబు, ఆయన పెద్దకుమారుడు, కుటుంబసభ్యులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోద య్యాయి. ఈ క్రమంలో చిన్నకుమారుడైన శేఖర్, ఆయన భార్య సుజాత, ఆమె సోదరుడైన తాళ్లూరి గంగాధర్‌తో పాటు డాక్టర్ మహేంద్రనాథ్, పి.కృష్ణమోహన్ తమను వేధిస్తు న్నారని సత్యం కొన్నాళ్లుగా చెబుతున్నట్లు సమాచారం. అలాగే సత్యంబాబు–నాగేంద్రమ్మ, శ్రీధర్–ప్రవీణ దంపతులతో పాటు వారి పిల్లలు చైతన్య, చాణ క్యలను హత్య చేయాలని కొందరు కుట్ర పన్నారని సత్యంబాబు పలువురితో వెల్లడించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తానొక్కడినే చనిపోతే మిగతా ఐదుగురు బతుకుతారనే భావనతో లేఖ రాసిన ఆయన.. అందులో తన కుటుంబ వివాదాలతో పాటు ఆత్మహత్యకు కారణంగా ఐదుగురి పేర్లు రాశారు. తన మృతదేహం వద్దకు చిన్నకుమారుడైన శేఖర్ దంపతులను రానివ్వొద్దని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి గదిలో ఒంటరిగా పడుకున్న ఆయన సోమవారం ఉదయం ఎంత పిలిచినా పలకలేదు. దీంతో కుటుంబీకులు తలుపులు పగులకొట్టి చూడగా విషం తాగి మృతి చెంది ఉన్నాడు. ఈమేరకు ఖమ్మం టూటౌన్ ఎస్ఐ రవికుమార్ వివరాలు ఆరాతీశారు. ఐదుగురి వేధింపులతో తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, వారివల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని శ్రీధర్ వెల్లడించారు. కాగా, ఐదు రోజుల క్రితం ఒక కుటుంబం తమకు రూ.2 కోట్లకు పైగా సత్యంబాబు బాకీ ఉన్నాడని ఆయన ఇంటి ఎదుట నిరసన తెలిపింది. -
మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఓవరాక్షన్..
-
చిత్తశుద్ధి, దూరదృష్టితోనే అభివృద్ధి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: నిధులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరగదని.. దూరదృష్టి, చిత్తశుద్ధితోనే అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు దక్కుతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శుక్రవా రం ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల య పండితులు ఆయనకు పరివట్టం కట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ రమా దేవి స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు.తర్వాత రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తలసేమియా, సికిల్‌సెల్ ప్రత్యేక వార్డులను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనులకు రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా అమూల్యమైన సేవలు అందటం అభినందనీయమని అన్నారు. భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిని కేంద్రం నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించారు. కలెక్టరేట్లలో భేటీలు: ఈ పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొత్తగూడెం కలెక్టరేట్, ఖమ్మం కలెక్టరేట్ల లో అధికారులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖులతో భేటీ అయ్యారు. అలాగే, శాఖల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో గవర్నర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద, గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించి వారు మెరుగైన జీవితం గడి పేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించా రు. భద్రాద్రి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు బాగుందని అభినందించారు. ఖమ్మంలో గవర్నర్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మాదిరిగా తాను సైతం పర్యావరణ వేత్తగా కెరీర్‌ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన అందరిలో ఉండా లని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీలు బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే లు వెంకట్రావు, కూనంనేని సాంబశివరావు, రెండు జిల్లాల కలెక్టర్లు జితేశ్ వి.పాటిల్, ముజమ్మిల్ ఖాన్, ఎస్పీ రోహిత్‌రాజ్, సీపీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు. -
జడ్జి గుర్తింపు కార్డు లాక్కున్నారు
నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి టోల్గేట్ సిబ్బంది.. ఓ న్యాయమూర్తి కుటుంబం వెళ్తున్న కారుకు టోల్ ఫీజు చెల్లించినా జడ్జి గుర్తింపు కార్డు లాక్కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గురువారం ఓ జిల్లా జడ్జి కుటుంబ సభ్యులు కారులో ఖమ్మం వస్తున్నారు. ఈ క్రమంలో పైనంపల్లి టోల్గేట్ వద్ద డ్రైవర్.. న్యాయమూర్తి కారు అని చెప్పినా వినకుండా రుసుము చెల్లించాలని సిబ్బంది వాదనకు దిగారు. దీంతో డ్రైవర్ రుసుము చెల్లించారు. ఆపై న్యాయమూర్తికి చెందిన గుర్తింపు కార్డు చూపించగా.. సిబ్బంది దానిని లాక్కుని ఒరిజినల్ కార్డా, కాదా? అని తెలుసుకుని తర్వాత పంపిస్తామని దురుసుగా బదులిచ్చారు. ఈ విషయం తెలియడంతో ఆ న్యాయ మూర్తి టోల్గేట్ వద్దకు వచ్చి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సూర్యాపేట జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌తో పాటు నేలకొండపల్లి పోలీసులు సైతం వచ్చి రుసుము చెల్లించినా న్యాయమూర్తి ఐడీ కార్డు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టోల్గేట్ సిబ్బంది నుంచి కార్డు తిరిగి తీసుకున్నారు. ఈ ఘటనపై టోల్గేట్ సిబ్బంది మాట్లాడుతూ, చాలామంది నకిలీ కార్డులతో వస్తుండటంతో అనుమానం వచ్చి అడిగామని చెప్పడం గమనార్హం. -
కన్నీరు మున్నేరు
-
ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
ఖమ్మం, సాక్షి: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా బొడ్రాస్ కుంట వద్ద రెండు బైకులు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో కారేపల్లి మండలం గుట్ట కింద గుంపుకు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉసిరికాయలపల్లి సోలార్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.చదవండి: మతపరమైన ర్యాలీల్లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం: సీవీ ఆనంద్ -
8 శాఖలు.. రూ.339.46 కోట్లు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో ఎనిమిది శాఖల పరిధిలో ప్రధానంగా నష్టం ఎదురైందని అ«ధికార యంత్రాంగం గుర్తించింది. ఆయా శాఖల పరిధిలో రూ. 339.46 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తంగా 15,201 ఇళ్లు దెబ్బతినగా అందులో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 6,500, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 8 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని లెక్కగట్టింది. రెవెన్యూ, పశుసంవర్థక శాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ, మత్స్య శాఖల పరిధిలో నష్టంపై ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక పంపింది. ముఖ్యంగా 53,528 మంది రైతులకు సంబంధించి 79,914 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రూ. 111.87 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా వరదలతో 76 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే 45 చెరువులకు గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారంపై బాధితులు మండిపడుతున్నారు. వరద ఉధృతికి ఇళ్లు కొట్టుకుపోయిన తమకు ప్రభుత్వం అరకొర సాయం చేస్తే ఎలా సరిపోతుందని ప్రశి్నస్తున్నారు. -
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు
-
5 లక్షలకు మనవడిని అమ్మేసిన నాయనమ్మ
-
సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు
సాక్షి, ఖమ్మం: సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం పుసుగూడెం, కమలాపురం పంప్ హౌస్‌లను మంత్రులు పరిశీలించారుఅనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామన్న ఉత్తమ్.. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ అధికారులు పనులు వేగవంతం చేయాలని ఉత్తమ్ అన్నారు.‘‘గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు ఎటువంటి అనుమతులు లేవు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు తీసుకుని వచ్చాం. సీతారామ ప్రాజెక్ట్‌కు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నాం. 2026న ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి గోదావరి జలాలు అందిస్తాం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ ద్వారా లక్షా 52 వేలు సాగులోకి వస్తుంది. పాలేరు లింకు కెనాల్‌కి నీళ్లు అందిస్తాం. పాలేరు కింద నాగార్జున సాగర్ కింద భూములకు నీరు అందుతుంది. భద్రాచలం, ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు వచ్చేలా చేస్తాం’’ అని ఉత్తమ్ తెలిపారు. -
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
భద్రాచలం వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు కాగా, 9,18,164 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.కాగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగులు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. -
ఖమ్మం: లేడీ టీచర్ వికృత చేష్టలు.. విద్యార్థుల జుట్టు కత్తిరించి...
సాక్షి, ఖమ్మం జిల్లా: జుట్టు పెంచుకొని స్కూల్‌కి వస్తున్నారంటూ ఓ టీచర్ కత్తెర పట్టుకుని స్వయంగా తానే విద్యార్థులకు పేనుకొరుకుడు మాదిరిగా కటింగ్ చేసి వికృత చేష్టలకు పాల్పడింది. ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల హెయిర్ స్టైల్ చూసి అవాక్కైన తల్లిదండ్రులు స్కూలు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు.ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిరీష అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల జుట్టు కత్తిరించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు విద్యార్థులు జుట్టు పెంచి రోజు తరగతులకు హాజరవుతున్నారని, ఎన్నిసార్లు కటింగ్ చేయించుకుని స్కూల్‌కి రావాలని హెచ్చరించిన మాట వినడం లేదని స్వయంగా ఉపాధ్యాయురాలు శిరీషనే బార్బర్ అవతారమెత్తింది.ఓ కత్తెర తీసుకొని తనకి వచ్చిన విధంగా 8 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించింది. తలపై అక్కడక్కడ జుట్టు కత్తిరించడంతో ఎలుకలు కొరికినట్టుగా మారింది. అయితే విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయం తెలపగా పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకొని ఆందోళన చేపట్టారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటని,అవమానభారంతో తమ పిల్లలు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించారు. అయితే టీచర్ చేసిన పనికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. -
చనిపోయిన తర్వాత వస్తారా?
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్టుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ భూసమస్యతో ఆత్మహత్య చేసుకోగా.. ఆయన వ్యవసాయ భూమిని పరిశీలించేందుకు బుధవారం తహసీల్దార్ రమేశ్ గ్రామానికి వచ్చారు. దీంతో ప్రభాకర్ కుటుంబసభ్యులు ఆయనను అడ్డుకున్నారు. భూసమస్యపై ఫిర్యాదు అందగానే అధికారులు స్పందిస్తే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేవాడు కాదని ఆయన తండ్రి బోజెడ్ల పెద్దవీరభద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు హడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. గత వేసవిలో సుమారు రూ.8 లక్షలు వెచ్చించి తమ భూమిలోకి మొరం మట్టి తోలించగా, చెరువు శిఖాన్ని ఆక్రమించారంటూ మత్స్యశాఖ సొసైటీ మూడు ఎకరాల్లో మట్టి తొలగించిందని తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయాడు. ఈ నేపథ్యంలో తహసీల్దార్‌ను పొలంలోకి రాకుండా అడ్డుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎస్సై నాగుల్‌మీరా వారికి సర్దిచెప్పి తహసీల్దార్‌ను కారు ఎక్కించారు. అయినప్పటికీ వారు కారుకు అడ్డుగా కూర్చోవడంతో సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పగా వారు శాంతించారు. విచారణలో వేగం: రైతు ప్రభాకర్ ఆత్మహత్యను సీరియస్‌గా పరిగణించిన సీఎం రేవంత్‌రెడ్డి, పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేÔశారు. రైతు ఆత్మహత్య చేసుకునే ముందు ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకునేందుకు సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాక పోలీసులు తమకు లభించిన వీడియోలను సైతం పరిశీలిస్తున్నారు. -
‘రైతు ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం’
హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి చనిపోతున్నానని చెప్పాడని, సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమన్నారు హరీష్‌రావు. ప్రభాకర్ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన హరీష్‌రావు.. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. అదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.రైతు ఆత్మహత్యపై స్పందించిన సీఎం రేవంత్రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి తన ఆదేశాల్లో పేర్కొన్నారు. -
Farmer Suicide: సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి...
చింతకాని/జనగామ /లింగాల/గద్వాల రూరల్: వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యతి్నంచారు. నాలుగు జిల్లాల పరిధిలో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి... ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజెడ్ల ప్రభాకర్ (45) కుటుంబానికి 7.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోని చెరువు శిఖం పక్కనే ఉన్న తన భూమిలో ప్రభాకర్ గత వేసవిలో రూ.8 లక్షలు వెచి్చంచి మట్టి తోలించాడు. అయితే చెరువు శిఖంలో మట్టి పోశారంటూ గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో ప్రభాకర్ పొలంలోని మట్టిని తొలగించారు. దీనిపై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేయగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి మట్టి తొలగించొద్దని సొసైటీ సభ్యులకు చెప్పారు. అయినా వారు దౌర్జన్యంగా మట్టి తొలగించగా, గ్రీవెన్స్‌లో కలెక్టర్, సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు తన తండ్రితో కలిసి ప్రభాకర్ సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌కు వెళ్లాడు. అక్కడ కలెక్టర్ కలవకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్.. భోజనం చేసి వస్తానంటూ తండ్రితో చెప్పి ఖమ్మంలోని గొల్లగూడెం – కొత్తగూడెం మార్గంలో గల చెరుకూరి గార్డెన్ వద్దకు పురుగుల మందు డబ్బాతో చేరుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. గ్రామంలోని కొందరు కాంగ్రెస్, టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే తన పొలాన్ని నాశనం చేశారని వివరిస్తూ తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు పంపించాలని, తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభాకర్ కోరాడు. గోలీలు మింగి...కిరోసిన్ డబ్బాతో... ⇒జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు దేవులపల్లి జ్యోతి, స్వప్నల పేరిట తాత లక్ష్మయ్య 1.04 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించి గార్డియన్‌గా ఉన్నాడు. ఆ విషయం అక్కాచెల్లెళ్లకు తెలియదు.2014లో లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జ్యోతి, స్వప్నలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ట్రంకు పెట్టె సర్దుతుండగా, భూమి విషయం తెలిసింది. వెంటనే జ్యోతి గ్రామానికి చెందిన సదరు వ్యక్తిని భూమి విషయం అడగ్గా, మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. న్యాయం కోసం జ్యోతి గతంలో నర్మెట పీఎస్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కేసు నడుస్తోంది. భూమి వస్తుందో రాదో అన్న ఆవేదనతో జ్యోతి కొన్ని మందుగోలీలు మింగి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచి్చంది. ప్రజావాణి ప్రారంభమయ్యే క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యతి్నంచగా, పోలీసులు అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇతరుల పేరిట పట్టా చేశారని... ∙నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన మహిళారైతు గాలేటి జయమ్మకు గ్రామ శివారులో 1.37 ఎకరాల భూమి వారసత్వంగా దక్కాల్సి ఉంది. ఆ భూమిని పదేళ్ల కిందట అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో ఆందోళనకు గురైన జయమ్మ సోమవారం పెట్రోల్‌తో లింగాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పోసుకునేందుకు ప్రయతి్నంచింది. గమనించిన చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. నేతలు భూమి కబ్జా చేశారని... ∙జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరుశరాముడికి అదే గ్రామ శివారులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామనేతలు కబ్జా చేశారు. దీనిపై పరుశరాముడు పలుమార్లు రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేశాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ బీఎం.సంతోష్ ఆ«ధ్వర్యంలో ఫిర్యాదుల దినోత్సవం కొనసాగుతుండగానే పరుశరాముడు తన వెంట తీసుకొచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
మత్తులో.. చిత్తు కావొద్దు
ఖమ్మం: దేశాభివృద్ధిలో కీలకమైన యువత మాదకద్రవ్యాల బారిన పడుతోంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుండడంతో పదిహేనేళ్ల లోపు పిల్లలు మొదలు యువత వరకు పలువురు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని తెలుస్తోంది. మత్తు పదార్థాలు వివిధ రూపాల్లో లభిస్తుండడంతో ధూమపానం, మద్యపానం వంటివి క్రమంగా జీవితంలో భాగమై పలువురు విచక్షణ మరిచి నేరాలకు పాల్పడుతున్నారు.అంతేకాక ఈ అలవాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పడు మారుమూల పల్లెలకు సైతం పాకింది. ఈనేపథ్యాన నేడు(బుధవారం) అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు.విద్యాసంస్థలే లక్ష్యంగా దందా..యువతే టార్గెట్‌గా ఉమ్మడి జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. కౌమారదశలో ఉన్న విద్యార్ధులు మంచి, చెడు గుర్తించలేక త్వరగా అలవాటయ్యే అవకాశముండడంతో సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వ్యాపారుల కన్ను వారిపై పడింది. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇన్నాళ్లు పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో మాదకద్రవ్యాల అమ్మకం, వాడకం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజు గంజాయి పట్టుబడుతుండడం.. ప్రతీ పాన్‌షాపు, కిరాణ షాపుల్లోనూ లభిస్తున్నట్లు తెలుస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.సరదాగా మొదలు.. ఆపై వ్యసనంయుక్తవయస్సు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంటుంది. దీంతో ఇలాంటి వారిని మత్తు పదార్థాలు ఆకర్షించే అవకాశముంది. ధూమపానం, మద్యపానం ఇతర మత్తుపదార్థాలు తొలినాళ్లలో సరదాగా అలవాటవుతున్నా ఆ తర్వాత వ్యసనంలా మారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. గంజాయిలో ఉండే టెట్రా హైడ్రోకెనబినాయిడ్(టీహెచ్‌సీ) రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది.అది మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీయడమే కాక చురుకుదనాన్ని తగ్గిస్తుంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన తర్వాత వ్యక్తుల్లో భ్రమలు మొదలై నేరప్రవృత్తి పెరగడంతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు సైతం వస్తుంటాయి. దీంతో తమను తాము గాయపర్చుకోవడమే కాక దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదముంది.తల్లిదండ్రులు గమనించాలి..పిల్లలు, యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా అడ్డుకోవడంలో తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం లేదంటే మౌనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. ఇలాంటి వారిని నిత్యం పర్యవేక్షిస్తూ వారి గదులు, బ్యాగులను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. అంతేకాక ఎవరిరెవరితో తిరుగుతున్నారో పరిశీలిస్తే అవసరానికి మించి డబ్బు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని చెబుతున్నారు.మెదడుపై తీవ్ర ప్రభావం..మత్తుపదార్థాల వాడకం సరదాగా ప్రారంభమైనా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తుపదార్థాలు తీసుకున్న వారి మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. తద్వారా శరీరం ఉత్తేజంగా ఉన్నట్లు అనిపించి.. కాసేపటికి మళ్లీమళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. క్రమంగా తీవ్రమైన మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. – డాక్టర్ అప్పారావు ఎండీ, డీఎం (న్యూరాలజీ)అందరూ భాగస్వాములు కావాలి : సీపీ సునీల్ దత్ఖమ్మంక్రైం: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నివర్గాల ప్రజలు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరాలని కోరారు.ఈమేరకు వారం పాటు మాదకద్రవ్యాల వినియోగం, దుష్పలితాలపై విద్యాసంస్థల్లో అవగాహన కల్పించడమే కాక ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. అలాగే, ఐసీడీఎస్, పోలీస్ శాఖలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యాన బుధవారం ఉదయం 7గంటలకు సర్ధార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు. -
పోలీస్ ఇన్స్పెక్టర్ రాసలీలలు?
హసన్‌పర్తి: ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పాడు పనికి ఒడిగట్టాడు. యువతితో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హనుమకొండ నగరంలోని చింతగట్టు సమీపాన ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సదరు అధికారి ఖమ్మం జిల్లాలో ఎస్ఐబీ విభాగంలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2009లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన 2014లో ఎస్సైగా, ఆతర్వాత ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. ఆ ఇన్స్పెక్టర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అయితే, మంగళవారం సదరు ఇన్స్పెక్టర్ తన ప్రియురాలితోపాటు మరికొందరు స్నేహితులతో కలిసి చింతగట్టు సమీపాన ఫంక్షన్ హాల్లో విందు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఓ గదిలో స్నేహితులు మద్యం సేవిస్తుండగా, ఇంకో గదిలో యువతితో ఆ సీఐ రాసలీలల్లో మునిగి తేలినట్లు తెలిసింది.ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో వారు వెళ్లి యువతితో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ను చూసి షాక్‌కు గురైనట్లు సమాచారం. అయితే, టాస్క్‌ఫోర్స్ పోలీసులను గమనించిన ఇన్స్పెక్టర్ స్నేహితులతోపాటు యువతి పారిపోయినట్లు తెలిసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, సదరు ఇన్స్పెక్టర్ స్నేహితులను, యువతిని పోలీసులే తప్పించారా లేక పరారయ్యారా అన్నది చర్చ జరుగుతోంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. -
రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రాకేశ్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ‘‘ రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు సాధ్యమైనంతగా కష్టపడ్డారు. ఫలితాలు ఎప్పుడు కూడా ఆశించినట్లుగా ఉండవు. మీరు దృఢంగా, పాజిటివ్‌గా ఉండండి. ఇదే కష్టాన్ని కొనసాగిద్దాం’’అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.You did your best Rakesh. Results are not always in expected linesStay strong, positive and let’s continue to work hard https://t.co/M6Dkx5Sdnm— KTR (@KTRBRS) June 8, 2024అంతకుముందు రాకేశ్ రెడ్డి తనకు అవకాశమిచ్చిన కేసీఆర్‌కు, తనకు మద్దతుగా ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. అందరి అంచనాలకు తగినట్లు భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. ఇప్పుడు మాత్రం అంచనాలు అందుకోలేకపోయినందుకు క్షమించాలన్నారు. పార్టీలోకి వచ్చిన అతితక్కువ సమయంలో తనను గుండెలకు అద్దుకున్న బీఆర్ఎస్ శ్రేణులకు, పార్టీలకు అతీతంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాని తెలిపారు.ధన్యవాదాలు 💐🙏వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు @KCRBRSPresident గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏ఈ ఎమ్మెల్సీ…— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 8, 2024 ఇక..వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతపండు నవీన్‌కుమార్ (తీన్మార్ మల్లన్న) విజయం సాధించారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిజల్ట్.. కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్
వరంగల్, ఖమ్మం, నల్లగొంఎ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అప్ డేట్నల్లగొండపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అప్ డేట్ఇంకా కొనసాగుతోన్న మొదటి రౌండ్ కౌంటింగ్సాయంత్రం మూడున్నరకు ప్రారంభమైన మొదటి రౌండ్ కౌంటింగ్నాలుగు రౌండ్ల పాటు సాగనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఒక్కో రౌండ్ లో 96 వేల చొప్పున లెక్కింపునల్లగొండప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియమధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసిన బండిల్స్ కట్టె ప్రక్రియమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభంఇంకా కొనసాగుతున్న బెండల్స్ కట్టే ప్రక్రియసాయంత్రం 5 తర్వాతనే ఓట్ల లెక్కింపు ప్రారంభంపట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 4 రౌండ్లలో బ్యాలెట్ ఓట్ల బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తి అయింది ఇంకా మూడు రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మూడు గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందిఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 2,100 మంది సిబ్బందిని కేటాయించారు.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లానేడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుతిప్పర్తి మండలం దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడన్స్ లో లెక్కింపుఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం4 హాల్స్ లలో ఒక్కో హాల్ కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కింపుఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్ధులుమొత్తం ఓటర్లు: 4,63,839పోలైన ఓట్లు: 3,36,013పోలింగ్ శాతం: 72.44రోజుకు మూడు షిఫ్టుల్లో కొనసాగనున్న లెక్కింపుఒక్కో షిఫ్టులో 900 సిబ్బందిమొదటగా బండిల్స్ కట్టే ప్రక్రియఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశంఆతర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయనున్న సిబ్బందిచెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారు గెలిచినట్లు ప్రకటనమొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే చివరి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియఎలిమినేట్ అయిన అభ్యర్థి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారో చూసి వారికి యాడింగ్అలా కలిపిన తర్వాత యాభై శాతానికి మించి వస్తే గెలిచినట్లు ప్రకటననేడు ‘పట్టభద్రుల’ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ బుధవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 52 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మూడు విడతల్లో లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించినందున ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగనుంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఈ ప్ర క్రియ ప్రారంభం అవుతుంది. నా లుగు హాళ్లలో 96 టేబుళ్లపై పోలైన 3,36,013 ఓట్ల లెక్కింపు చేపడతారు. -
ఖమ్మం చంద్రాయపాలెంలో ఉద్రిక్తత.. పోలీసులపై గిరిజనుల దాడి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుంది. పోడుభూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్న పోలీసులపైనే గిరిజనలు దాడికి దిగారు. పోలీసులపై పెద్దసంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పపడ్డారు. ఈ క్రమంలో సతత్తుపల్లి సీఐ కిరణ్, నలుగురు సిబ్బదికి గాయాలు అయ్యాయి. బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల విషయంతో ఘర్షణ చోటు చేసుంది. ఈ ఘర్షణను అడ్డగించిన పోలిసులను వెంటపడి మరీ గిరిజనలు కర్రలతో కొట్టారు. ఒక్కసారిగా అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. -
విజయవాడ మార్గంలో నిలిచిన రైళ్లు
సాక్షి, ఖమ్మం: వరంగల్-విజయవాడ రైలు మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద శనివారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 113వ గేటు సమీపంలోకి రైలు రాగానే భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో లోకోపైలట్ రైలును నిలిపివేశారు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగినట్లు గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని రైల్వే సిబ్బంది వెల్లడించారు. దీంతో కాజీపేట నుంచి విజయవాడ వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వీలైనంత త్వరగా పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారాయన. -
సైబీరియన్ కొంగలు ఎక్కడ ?
-
భక్తరామదాసు విగ్రహం ఇదిగో!
నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు. విగ్రహం ఎలా ఉందంటే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు ఎలా చేరింది? నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు. -
ఎందుకిలా జరిగింది?.. బీఆర్ఎస్కు ఆ జిల్లా గుదిబండగా మారిందా?
బీఆర్ఎస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా అసలు కలిసి రావటంలేదు.. గత మూడు ఎన్నికల్లో కూడ ఒక్క సీటు మాత్రమే గెలుపోందింది. 2014, 2018 ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఈసారి కూడ అదే సెంటిమెంట్‌లో భాగంగా ఒక్క సీటు వచ్చిన రివర్స్‌గా అధికారం కోల్పోయింది గులాబీ పార్టీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రక్షాళన అవసరమని సొంత పార్టీ నేతలే నుంచే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమాయనికి అయిన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి మారుతుందా? రాష్ట్రంలో బీఆర్ఎస్కు అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని చెప్పాలి. ప్రతిసారి ఇక్కడి ఫలితాలు గులాబీ పార్టీ అధిష్టానంకు నిరాశ గురిచేస్తున్నాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు ఒక గుదిబండలాగా మారిందనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నేత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని శపథం చేసి మరి పది స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో గెలిపించడం బీఆర్ఎస్ పార్టీకి అసలు మింగుడుపడటంలేదు. సవాల్ చేసి మరి మాట నిలబెట్టుకున్నాడన్ వాదన బీఆర్ఏస్ పార్టీలో సైతం వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్తితి ఉందంటేనే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. గత మూడు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికి పరిమితమవుతూ వస్తుంది.. ఏమాత్రం మార్పు రావటంలేదు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఏమ్మేల్యే జలగం వెంకట్రావు గెలుపోందగా.. 2018 ఎన్నికల్లో సైతం అవే ఫలితాలు రిపిట్ అయ్యాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు. అయితే ఈసారి అయిన పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న గులాబీ అధిష్టానానికి మళ్లీ దెబ్బ పడింది. అతి కష్టం మీద మళ్లీ ఉమ్మడి జిల్లాలో ఒకే స్థానం గెలుపొందింది.. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. అయితే ఏప్పుడు సెంటిమెంట్‌లో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానం వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న వాదన వినబడుతు వచ్చింది. దానిలో భాగంగానే 2014,2018లో ఓకే స్థానం గెలిచిన రాష్ట్రంలో అధికారంలో మాత్రం బీఆర్ఏస్ వచ్చింది. అయితే ఈసారి కూడ ఒకే స్థానం గెలిచిన రివర్స్‌గా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో అటు సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు ఇటు మళ్లీ ఒకే స్థానం గెలిచిందన్న భావన ఏర్పడిందన్న గుసగుసలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీని పూర్తిస్తాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సొంత పార్టీ నేతలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. భట్టి విక్కమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు బలమైన నేతలు మంత్రులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెంచకొవాలంటే ఆషామాషీ వ్యవహరం కాదు.. జిల్లాలో నాయకత్వాన్ని మరింత గ్రౌండ్ లెవల్లో పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. ఇలానే వదిలిస్తే జిల్లాలో పార్టీ మరింత వీక్ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కు అసలు కలిసిరావటంలేదనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల సమయానికి అయిన గాడినపడుతుందో చూడాలి ఇదీ చదవండి: భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల -
శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు తమ ప్రభుత్వం ఒప్పుకోలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ జిల్లాకు చెందిన ఇతర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయం మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్కను అదనంగా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించే అంశంపై గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై త్వరలో రాష్ట్ర శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టులో భారీ దోపిడీ: భట్టి విక్రమార్క సీతారామ–సీతమ్మసాగర్ ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.792 కోట్లతో రాజీవ్‌సాగర్, రూ.760 కోట్లతో ఇందిరాసాగర్ మిగులు పనులు పూర్తి చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.3లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభించేదన్నారు. మొత్తం రూ.1552 కోట్లతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో కలిపేసి సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చడంతోపాటు అంచనా వ్యయం రూ.13,057 కోట్లకు చేరిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆ తర్వాత రూ.18,500 కోట్లకు పెంచిందని ఆరోపించారు. అదనపు నీటినిల్వ సామర్థ్యం కోసం రూ.3481 కోట్లతో సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం చేపట్టి తర్వాత దీని వ్యయం సైతం రూ.4481 కోట్లకు పెంచిందన్నారు. ఇలా సీతారామ–సీతమ్మప్రాజెక్టుల అంచనాలను మొత్తం రూ.22,981 కోట్లకు పెంచారని విమర్శించారు. రూ.1552 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టు అంచనాలను రూ.22,981 కోట్లకు పెంచి ఇప్పటికే రూ. 8వేల కోట్లను ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. శబరి, గోదావరి కలిసే చోట పోలవరం వద్ద ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఇందిరాసాగర్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం విరమించుకోవడంతో 365 రోజులు ప్రవహించే శబరి నదిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. దేశ చరిత్రలో ఇంత దోపిడీ జరిగి ఉండదు: ఉత్తమ్ భారతదేశ చరిత్రలో ఇలాంటి దోపిడీ జరగడం చాలా అరుదు అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రూ.10, రూ.20 కోట్లకే ఉద్యోగాలు పోతాయని, ప్రభుత్వాలు కూలుతాయన్నారు. రోజురోజుకు బయటకు వస్తున్న విషయాలను చూసి నీటిపారుదలశాఖ మంత్రిగా నిర్ఘాంతపోతున్నట్టు పేర్కొన్నారు. ఎన్నో కుంభకోణాలు జరిగాయని, విచారణకు ఎంత మందో జడ్జిలు కావాలో అన్న అంశంపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు సీజేకు లేఖ రాశామని, కేసీఆర్, హరీశ్‌రావులు నీటిపారుదలశాఖ మంత్రులుగా వ్యవహరించి ఆ శాఖను ధ్వంసం చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులనే ఇంకా కొనసాగించడంపై విలేకరులు ప్రశ్నించగా, త్వరలో మార్పులు చూస్తారని బదులిచ్చారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తామని చెప్పారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కలి్పంచే విధానం లేదని, బదులుగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కేంద్ర పథకాల కింద 60శాతం నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జాతీయ హోదాపై మాట్లాడేందుకు హరీశ్‌రావుకు సిగ్గుశరం ఉండాలన్నారు. గతంలో 2–4శాతం వడ్డీలతో ప్రభుత్వాలు రుణాలు తెచ్చాయని, తెలంగాణ వచ్చాక 10.5శాతం వరకు అధిక వడ్డీలతో గత ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి మనందరి జీవితాలను తాకట్టు పెట్టిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రుణాల తిరిగి చెల్లింపులకే రూ.18వేల కోట్లు, జీతాలకు మరో రూ..2వేల కోట్లు, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల చెల్లింపులకు మరో రూ. 9500 కోట్లు అవసరమన్నారు. తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో వడ్డీలను తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కర్ణాటకకు వెళ్లి తాగునీటి అవస రాల కోసం 10 టీఎంసీలను విడుదల చేయాలని కోరుతామని చెప్పారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా? శ్రీశైలం ప్రాజెక్టు వెనుకభాగంలో ఏపీ లిఫ్ట్‌లు కట్టుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా? అని నిలదీశారు. ఏపీ చేపట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టుపై ఒక్కసారైనా కేసీఆర్, హరీశ్ మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలతోపాటు సీలేరు ప్రాజెక్టును కేంద్రం ఏపీకి కేటాయించినా ఏం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
వంద రోజుల్లో అమల్లోకి అన్ని గ్యారంటీలు..
ఖమ్మం వన్‌టౌన్: రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆదివారం ఆయన ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళా సాధికారతకు తొలి అడుగు వేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామనీ, పేదల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని వెల్లడించారు. రానున్న వంద రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారంటీలను అమలు చేస్తామని, అన్ని వర్గాల ప్రజలకు సంపదను పంచి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని భరోసానిచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి ఒకరు ఇంగితజ్ఞానం లేకుండా రెండు రోజులు గడవక ముందే తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, కొంచెమైనా జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్మంతా పందికొక్కుల్లా తిన్నారని, అదంతా కక్కించి తీరుతామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అనేక అవకతవకలు, లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతామని, రాష్ట్రం నష్టాల్లో ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు. సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద ముగ్గురు మంత్రులకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికి గజమాలలతో సత్కరించారు. అక్కడి నుంచి మంత్రులు భారీ కాన్వాయ్‌తో ఖమ్మం చేరుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. -
నల్లగొండ జిల్లా దేవరకొండ మొదటి రౌండ్ ఫలితాలు
-
ఖమ్మం జిల్లా మర్లపాడులో గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం
-
కేసీఆర్ పోరాట యోధుడు అధికారం మళ్లీ మాదే..
-
ప్రజా ఆశీర్వాద సభ
-
కారుకు...నో ఎంట్రీ
రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఐదో పర్యాయం భారత్ రాష్ట్ర సమితి పేరిట శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లోనూ ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఇలా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా నేటికీ కొన్ని సెగ్మెంట్లలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. కొరకరాని కొయ్యలుగా మిగిలిన ఆ సెగ్మెంట్లపై ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించిన బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ఈసారైనా పాగా వేయాలని భావిస్తోంది. నేటికీ గెలుపు తీరాలకు చేరని నియోజకవర్గాలివే.. ఉమ్మడిఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. వీటితో పాటు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పాగా వేయలేకపోయింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీలకు చెందిన అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. వీరిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మినహా మిగతా ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికలో బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగుతున్నారు. ♦ 2004లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల కూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. ♦ 2009లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది ♦ 2014, 2018లో రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆయా చోట్ల ఇలా... 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 17 చోట్ల ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది. మరో 39 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఒక్కసారే గెలుపొందగా, 37 నియోజకవర్గాల్లో రెండేసి పర్యాయాలు విజయం సాధించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు 26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుతీరాలకు చేరారు. 2001 నుంచి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు సిద్దిపేటలో అత్యధికంగా ఎనిమిది పర్యాయాలు, హుజూరాబాద్‌లో ఆరు పర్యాయాలు, వరంగల్ పశ్చిమలో ఐదుసార్లు గెలుపొందారు. పాతబస్తీలో ఎంఐఎంతో దోస్తీ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పాతబస్తీలో పరిమిత సీట్లలో పోటీ చేసినా 2014, 2018 ఎన్నికల్లో మాత్రం అన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే మజ్లిస్ పార్టీతో మిత్రబంధం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో బీఆర్ఎస్ స్నేహపూర్వక పోటీ పేరిట నామమాత్ర పోటీకి పరిమితమవుతోంది. అక్కడ ఈసారీ నామమాత్రపు పోటీనే? ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలతో పాటు ఆ పార్టీ బలంగా ఉన్న మరో రెండు సీట్లు నాంపల్లి, గోషామహల్లో ఈసారి కూడా బీఆర్ఎస్ నామమాత్ర పోటీకీ పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్ పాత బస్తీలోని ఏడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా, వారికి ఇప్పటికీ బీ ఫారాలు ఇవ్వలేదు. మరోవైపు నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ నేటికీ ఖరారు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చిక్కని పట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా బీఆర్ఎస్కు పట్టు చిక్కడం లేదు. 2014లో కొత్తగూడెంలో మాత్రమే పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. పాలేరుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలవడంతో పార్టీ బలం రెండుకు చేరింది. ఆ తర్వాత చేరికల ద్వారా బలపడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నా 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే విజయం సాధ్యమైంది. చేరికల వ్యూహంతో మరోమారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని లోటును పూడ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అయితే చేరికల వ్యూహం వికటించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో చేరికల ద్వారా బలపడేందుకు అనుసరించిన వ్యూహం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. -కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
ప్రేమజంట ఆత్మహత్య
బోనకల్/వైరా: తెలిసీతెలియని వయస్సు.. ప్రేమలో పడ్డారు.. విషయం తెలియడంతో వారి కుటుంబసభ్యులు మందలించారు. ఇక పెళ్లికి వారెప్పటికీ ఒప్పుకోరనే ఆవేదనతో ఆ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో గురువారంరాత్రి చోటుచేసుకుంది. బోనకల్ మండలం రాపల్లికి చెందిన చింతల సుమంత్(18), బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య(17) ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా బ్రాహ్మణపల్లిలో పనిచేసే సమయంలో ఐశ్వర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం ఇద్దరి కుటుంబసభ్యులకు తెలియటంతో మందలించారు. దీంతో సుమంత్ ట్రాక్టర్ డ్రైవర్ పని మానేసి మూడునెలల క్రితం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐశ్వర్య ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బోనకల్ పోలీసులకు 31వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే, ఐశ్వర్య హైదరాబాద్‌లో ఉన్న సుమంత్ వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై గురువారంరాత్రి వైరా రిజర్వాయర్ వద్దకు చేరుకుని ఓ చెట్టుకు ఉరేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వైరా ఏసీపీ రెహమాన్ ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
ఖమ్మంజిల్లా మునిగేపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి ఎన్నికల ప్రచారం
-
టీడీపీ కార్యకర్తల పేరుతో ఖమ్మంలో ఓ వర్గం ఓవరాక్షన్
-
తుమ్మల ఫైర్.. మంత్రి పువ్వాడపై సంచలన ఆరోపణలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక, తాజాగా ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పీడ్ పెంచారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. కాగా, తుమ్మల శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడుతూ.. నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఖమ్మం మైనార్టీలు నాకు అండగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమంతో పాటు వారికి ఎన్నో రాజకీయ అవకాశాలు దక్కేలా పాటుపడ్డాను. ఖమ్మంలో ఎంతో అభివృద్ధి చేశాను. అరాచక, అవినీతి లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో మంత్రి అజయ్ కుమార్‌ను కాశీం రజ్వీతో పోల్చారు తుమ్మల. తాను మంత్రిగా ఉన్నప్పుడు కేవలం అభివృద్ధి కావాలని జనాలు అడిగేవారు. కానీ, ఇప్పుడు మాత్రం మా భూములు కబ్జా అయ్యాయని జనం లిస్ట్ తీసుకువచ్చి నాకు చెబుతున్నారు. పోలీసులు కూడా అధికారం ఉన్న వారి వైపే ఉన్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రిగా అజయ్ కుమార్ మంచి చేయాల్సింది పోయి నాలుగేళ్ల కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైరయ్యారు. ఈరోజుల్లో కూడా ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే మనందరికీ సిగ్గుచేటు. చిన్నతనం నుంచి పోరాడేతత్వం నాది. ప్రజలను భయపెట్టాలని భావించే వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాడాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు.. -
ఇక్కడ తీరువేరు వార్ వేరు
రెండు ఎన్నికల్లోనూ .. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, ఇల్లెందు, పాలేరు, మధిర స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పినపాక, వైరా, అశ్వారావుపేట స్థానాలను దక్కించుకోగా,భద్రాచలంలో సీపీఎం గెలుపొందింది. అప్పుడే ఏర్పడిన కొత్త రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించడం విశేషం. ఇక సత్తుపల్లిలో టీడీపీ, కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2016లో జరిగిన ఉప ఎన్నికలో పాలేరు నుంచి టీఆర్ఎస్ గెలుపొందింది. ఇక 2018 ఎన్నికల్లో మధిర, పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, భద్రాచలం స్థానాలను కాంగ్రెస్, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలను టీడీపీ దక్కించుకోగా.. వైరాలో ఇండిపెండెంట్ అభ్యరి్థ, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇలా రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలిచింది. అయితే 2018 ఎన్నికల తర్వాత పరిణామాలతో పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. ఇక గత రెండు ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు చేరడం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో బలం పెంచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నజర్ పెట్టి ఇక్కడ సభలు కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. జలగం హవా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఎక్కువకాలం జలగం కుటుంబం ఆధిపత్యం చెలాయించింది. 1957లో జలగం కొండల్రావు, 1962, 1967,1972లో వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు విజయ బావుటా ఎగురవేశారు. అనంతరం 1978లో వేంసూరు కాస్తా సత్తుపల్లి నియోజకవర్గంగా ఏర్పడడంతో వెంగళరావు గెలుపొందారు. ఆయన కాసు, పీవీ మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం లోక్‌సభ నుంచి ఎన్నికై కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఆయన సోదరుడు కొండల్రావు సైతం ఎంపీగా ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు పెద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వెంగళరావు చిన్న కుమారుడు వెంకట్రావు 2004లో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరి కొత్తగూడెం నుంచి పోటీచేసి గెలిచారు. 40 ఏళ్ల తర్వాత... గత నలభై ఏళ్లుగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే ప్రతీసారి విపక్షంలోనే ఉంటూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తిరగరాశారు. 1978లో కాంగ్రెస్ తరఫున కీసర అనంతరెడ్డి గెలుపొందగా.. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వర్టీ ది. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ 2018లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున పువ్వాడ అజయ్‌కుమార్ విజయం సాధించగా.. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టగా, ఆయనకు మంత్రి పదవి దక్కింది. కమ్యూనిస్టుల కోటకు బీటలు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నా క్రమంగా బీటలు వారుతూ వర్టీ ది. గత రెండు ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం భద్రాచలం సీటును గెలుచుకుంది. గతమెంతో ఘనం అన్నట్లు ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టులు ఇతర పార్టీ లతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సత్తా చాటిన తుమ్మల ఇక సత్తుపల్లి రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు కొత్త ఒరవడి సృష్టించారు. 1983లో తెలుగుదేశం తరఫున ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి,2009లో ఖమ్మం నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఖమ్మంలో ఓటమి పాలయ్యారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆÆŠḥఎస్ తరఫున గెలిచినా, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఓటమి పాలయ్యారు. తుమ్మల ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్లో పనిచేశారు. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు భిన్నమైన తీర్పును ఇస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్ఎస్ విజయం సాధించి పాలనాపగ్గాలు చేపట్టినా ఇక్కడ మాత్రం ఒకటీ రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉండగా.. గతంలో సత్తా చాటిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయారు. -
పాలేరు కోసం సీపీఎం.. మునుగోడు కోసం సీపీఐ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలకు చెరి రెండేసి అసెంబ్లీ స్థానాలు, చెరో ఎమ్మెల్సీ ఇచ్చేలా అంగీకారం కుదిరింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు కోరుతుండగా, సీపీఎం మాత్రం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను ప్రతిపాదించింది. సీపీఐకి కొత్తగూడెం స్థానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్, మునుగోడుకు బదులు చెన్నూరు స్థానాన్ని ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే చెన్నూరు తమకు వద్దని, మునుగోడు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. ఒకటి మీరడిగేది.. రెండు మేమిచ్చేది తీసుకోండి కాంగ్రెస్ మాత్రం ‘మీరడుగుతున్న రెండు స్థానాల్లో ఒకటి మీరు కోరుకున్న సీటు ఇస్తాం. మరోటి మేం ఇచ్చే సీటు తీసుకోవాలని’చెబుతోంది. దీంతో సీపీఐ కంగుతింది. ఇక సీపీఎం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే సూత్రాన్ని అమలు చేయనుంది. దీంతో కాంగ్రెస్ చెప్పిన ఏదో ఒక స్థానంలో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్, మరో స్థానం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. పాలేరు నుంచి పొంగులేటి? పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. భద్రాచలం ఇచ్చినా బాగుండేదంటున్న సీపీఎం... సీపీఎం మాత్రం పాలేరు లేదా భద్రాచలం కోరింది. అయితే భద్రాచలంలో తమ అభ్యర్థిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎలా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో ఇప్పుడు పాలేరు స్థానంపై సీపీఎం పట్టుబడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపించడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉండగా, మిగిలినవన్నీ రిజర్వుడు స్థానాలు. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో రెండు జనరల్ స్థానాలే మిగిలాయి. వాటిల్లో సీపీఎంకు పాలేరు ఇస్తే జనరల్ స్థానం ఖమ్మం ఒకటే మిగులుతుంది. కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలకమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులకు టికెట్ ఇవ్వాల్సి ఉంది. -
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సత్తుపల్లిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల వర్గీయలు బిగ్ షాకిచ్చారు. దీంతో, అక్కడి రాజకీయం హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. సత్తుపల్లిలో బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తుమ్మల వర్గీయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల నాగేశ్వరరావును అవమానించేలా కేటీఆర్ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి 500 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్.. మరోవైపు ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న కేటీఆర్‌కు ప్రపంచజ్ఞానం ఉందనుకున్నాను. 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై వారెంటీ లేదు.. గ్యారెంటీ లేదు.. ముసలి నక్కా అని మాట్లాడం అదేం భాష. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పుకోండి.. కానీ, ఇదేం పద్దతి. నీ కంటే ఎక్కువ భాష మాట్లాడగలను. సభ్యతా, సంస్కారం అడ్డు వస్తోంది. ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ఉండాలి. ప్రజలు ఇచ్చే దరఖాస్తు తీసుకునే ధైర్యం నీకు లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు.. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు 75-80 సీట్లు ఇవ్వబోతున్నారు. మేము ఆరు గ్యారెంటీలు ప్రకటించాం.. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వాటిని అమలు చేస్తాం. గ్యారెంటీలు ప్రజలకు చెందకుండా మీరు కుట్ర చేస్తున్నారు. మేము ప్రకటించాం.. బాగాలేకపోతే లేదని చెప్పండి. మీ కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం కాదు.. ప్రజల కోసం గ్యారెంటీలు పెట్టాం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓట్లు కాంగ్రెస్‌కు వేస్తారు.. మీ బెదిరింపులకు కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ప్రజలకు బుద్ధి చెబుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్.. -
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మీటీంగ్‌లో రసాభాస
-
‘పామ్’ తోటల ఖమ్మం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ సాగుకు చిరునామాగా మారుతోంది. గత పదిహేనేళ్లుగా పామ్ తోటలు సాగుచేసే రైతులు నెమ్మదిగా పెరుగుతున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పామాయిల్‌కు డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం కూడా రైతులకు రాయితీలు కల్పిస్తూ ఈ పంట సాగును ప్రోత్సహిస్తోంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మంలో 17,834 ఎకరాల్లో రైతులు పామాయిల్ సాగు చేయగా.. ప్రస్తుతం అది 73,938 ఎకరాలకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈ పంట సాగు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో సాగుకు అనుకూలమైన వాతావరణం, నేలలు ఉండటంతో ఒక వైపు పంట సాగు విస్తరిస్తుండగా, పామాయిల్‌ను ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటల్లో టీఎస్ ఆయిల్‌ఫెడ్ కంపెనీ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మరో ఐదు వరకు ఫ్యాక్టరీలు రానున్నాయి. సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వాల దృష్టి.. గ్లోబల్ ఈడిబుల్ ఆయిల్ మార్కెట్లో వ్యాపారం సాగే తొమ్మిది ప్రధాన నూనెల్లో పామాయిల్ ఒకటి. కాగా, ప్రపంచ మార్కెట్లో ఇండోనేసియా, మలేసియా మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రపంచ ముడి పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ రెండు దేశాల నుంచి 90 శాతం వరకు వాటా ఉంది. ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ పామాయిల్‌కు డిమాండ్ పెరగడంతో ఇక్కడ కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతోంది. 2020 వరకు తెలంగాణలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్, రుచిసోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే మూడు కంపెనీలు ఉండగా, ప్రస్తుతం వీటితోపాటు మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఎస్ ఆయిల్‌ఫెడ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా ఫ్యాక్టరీ జోన్లలో నర్సరీలు కూడా ఏర్పాటయ్యాయి. ప్రాసెసింగ్ ప్లాంట్లకు ప్రాధాన్యం.. పామాయిల్ దీర్ఘకాల పంట కావడంతో దేశీయంగా నూనె లభ్యతను పెంపొందించే ప్రక్రియలో ఆయిల్‌పామ్ సాగు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకోసం ప్రభుత్వాలు సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాయి. 2000 సంవత్సరంలో ఈ పంట 17,834 ఎకరాల్లో సాగవగా, 2020 నాటికి 42,899 ఎకరాలకు, ప్రస్తుతం 73,938 ఎకరాలకు చేరుకుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. డిమాండ్ పెరగడంతో ధర కూడా పెరుగుతూ వచ్చింది. 2010లో టన్ను గెలల ధర రూ.సగటున రూ.5,136 ఉండగా 2022 నాటికి రూ.18,069కి చేరింది మొదట్లో రెండు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి.. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. తొలుత 5 టన్నుల సామర్థ్యంతో ప్రారంభించగా, పలు దఫాలుగా సామర్థ్యం పెరుగుతూ, ప్రస్తుతం 60 టన్నులకు చేరింది. ఇక్కడ పామాయిల్ గెలలను 120 నుంచి 160 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు స్టీమ్ చేస్తారు. ఆ తర్వాత యంత్రాలతో గెలల నుంచి ముడి నూనెను తీసి, నేరుగా పైపులైన్ల ద్వారా పెద్ద ట్యాంకుల్లోకి పంపి నిల్వ ఉంచుతారు. ఇలా నిల్వ చేసిన క్రూడాయిల్‌ను లారీ ట్యాంకర్లలో ప్రాసెస్ యూనిట్లకు తరలిస్తారు. స్టీమ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలను, నూనె గింజలను (నెట్) వేరు చేస్తారు. గెలల వ్యర్థాలను టన్నుల లెక్కన ఇతర అనుబంధ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. అశ్వరావుపేట తర్వాత దమ్మపేట మండలం అప్పారావుపేటలో 2017 ఏప్రిల్‌లో మరో ఫ్యాక్టరీ ప్రారంభమైంది. రూ.80 కోట్ల వ్యయం, మలేసియా టెక్నాలజీతో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించారు. తొలుత ఇది 60 టన్నుల సామర్థ్యంతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 90 టన్నులకు పెరిగింది. ఈ ఫ్యాక్టరీకి 2018లో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ రంగ విభాగంలో ఉత్తమ ఫ్యాక్టరీ అవార్డు దక్కింది. అదే ఏడాది కేంద్రం ద్వారా గ్లోబల్ అవార్డు వచ్చింది. కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 3 ఫ్యాక్టరీలు ఉండగా.. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరిగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అశ్వాపురం మండలం బి.జె.కొత్తూరు, ములకలపల్లి గ్రామాల్లో నూతనంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో పామాయిల్ తోటల సాగు మరింతగా విస్తరించి దేశీయంగా నెలకొన్న కొరతను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈయనే సాగు మొదలు పెట్టింది.. 1991లో ప్రభుత్వ సబ్సిడీ ఏమీ లేకుండా.. అశ్వారావుపేటకు చెందిన పిన్నమనేని మురళి అనే రైతు ఆయిల్‌పామ్ పంట సాగును ప్రయోగాత్మకంగా మొదట ఐదు ఎకరాల్లో ప్రారంభించారు. మొదట్లో ఆయన మొక్క రూ.25 చొప్పున కొనుగోలు చేశారు. సమీపంలో గెలల కొనుగోలు, ఫ్యాక్టరీ లేనప్పటికీ.. ఆయన ఈ పంట సాగు చేయడంతో మిగిలిన రైతులు కూడా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం మురళి 100 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండటం, ఫ్యాక్టరీలు అందుబాటులో ఉండటంతో ఈ పంట ఆదాయం మెరుగ్గా మారిందని మురళి చెప్పారు. లాభదాయకమైన పంట.. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ఏటా లక్షల్లో ఆదాయం వస్తుంది. పంట సాగు చేసిన నాలుగేళ్లలో ఆదాయం ప్రారంభమవుతుంది. సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పామాయిల్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఫ్యాక్టరీలు సైతం రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. –జినుగు మరియన్న, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం ఎకరం ఆయిల్‌పామ్‌సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ.. మొక్కలకు(ఎకరానికి 57 మొక్కలు): రూ.11,600 ఎరువులు, అంతర పంటలకు ఏడాదికి రూ.4,200 చొప్పున నాలుగేళ్లు: రూ.16,800 బిందు సేద్యం: రూ.22,518 మొత్తం రూ. 50,918 -
టిప్పర్ ఢీకొని.. కాపాడండని వేడుకుని..
ఖమ్మం క్రైం: అతి వేగంతో వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొని ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.. టిప్పర్ కింద చిక్కుకుపోయిన యువకుడు తనను కాపాడాలని వేడు కున్నాడు.. పోలీసులు స్పందించి యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరా లివి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన దొప్పా వీరబాబు కుమారుడు విజయ్‌కుమార్ ఖ మ్మంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖమ్మం శ్రీని వాసనగర్‌లో ఉంటున్న ఆయన మంగళవారం గదికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. పక్కనే అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ కుడివైపునకు తిరగడంతో విజయ్‌కుమార్‌ను ఢీకొంది. విజయ్ అదుపు తప్పి లారీ చక్రాల కింద పడిపోయాడు. ఆయన నడుం భాగంపైకి టైర్లు ఎక్కడంతో శరీరం నుజ్జునుజ్జయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ.. తన ప్రాణాలు కాపా డాలని ఆ యువకుడు వేడు కున్నాడు. సమాచారం అందుకున్న ఖమ్మం త్రీటౌన్ సీఐ బత్తుల సత్యనారాయణ చేరుకుని విజయ్ను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి నిర్లక్ష్యంగా టిప్పర్ నడిపిన డ్రైవర్ బుడిగ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. -
తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది. ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్ కట్టబెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌కే తుమ్మల అనుచరులు జై.. పాలేరు బీఅర్ఎస్లో అసమ్మతి సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్న ఆయన అనుచరుల.. కాంగ్రెస్ వైపు మొగ్గుచుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులు ఉన్నారు. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు సమాచారం. కాగా, వైరా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తానే మళ్లీ పోటీలో ఉంటానని రాములునాయక్ నిబ్బరంగా ఉన్నా.. ఈ స్థానంలో మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో రాములునాయక్ ప్రగతిభవన్‌కు వెళ్లి టికెట్ తనకే ఇవ్వాలని అభ్యర్థించినా నిరాశే ఎదురైంది. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఆమైవెపే మొగ్గు చూపింది. -
ఆ ‘మూడు’పై కాంగ్రెస్ గురి.. లెక్క కుదిరిందా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ మూడు జనరల్ స్థానాలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. మూడు చోట్ల బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి యాక్షన్ మొదలు పెట్టింది. ఇప్పటికే ఖమ్మంకు లెక్క కుదిరింది. ఇక వారికి కావాల్సింది కొత్తగూడెం, పాలేరులోనే.. దీంతో బీఆర్ఎస్లో ఉన్న ఆ రెండు నియోజకవర్గాల్లోని కీలక నేతలను హస్తం గూటికి చేర్చుకునేందుకు చర్చలు మొదలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంతకీ ఎవరు ఆ నేతలు.. చర్చలు ఎంత వరకు వచ్చాయి. కాంగ్రెస్ గురిపెట్టిన ఆ మూడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ స్థానాలు టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మొదలు పెట్టింది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మూడు నియోజకర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. అయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని దింపడం దాదాపు ఖారారు అయినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన రెండు నియోజకవర్గాలైన పాలేరు, కొత్తగూడెంలో ఆ పార్టీకి అభ్యర్థులు ఉన్నా.. ఇంకా బలమైన అభ్యర్థుల కోసం వేచి చూస్తోంది. దీనిలో భాగంగానే పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి వస్తే పాలేరు టికెట్ ఇస్తామని హమీ ఇస్తున్నారు. మరోవైపు తుమ్మల సైతం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పాలేరు నుంచి పోటీ చేయాల్సిందేనని డిసైడ్ అయిపోయారు. అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ కందాలకు టికెట్ ఇస్తే అప్పుడు తుమ్మల పార్టీలో ఉంటారా లేక ఆప్షన్ ఇస్తున్న కాంగ్రెస్‌లో జంప్ అవుతారా అన్నది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుమ్మల మాత్రం పార్టీ మారే ఆలోచనలో లేకపోయిన అనుచరుల ఒత్తిడి ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్న టాక్ సైతం లోకల్‌గా వినిపిస్తుంది. మరోవైపు కొత్తగూడెం జనరల్ స్థానంలో సైతం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నంలో ఉంది. పార్టీలోకి వస్తే కొత్తగూడెం టికెట్ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు జలగంతో సంప్రందిపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌తో జలగం చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని త్వరలోనే జలగం పార్టీ మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. అటు బీఆర్ఎస్ అధిష్టానం సైతం జలగంకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అదే విషయంపై జలగంకు సైతం ఇటివలే ఒక క్లారిటీ వచ్చిందన్న ప్రచారం ఉంది. దీంతో జలగం ఏ సమయంలోనైన హస్తం గూటికి చేరిపోయే అవకాశాలు ఉన్నాయి. చదవండి: సంగారెడ్డి: బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితి! కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నట్లు జరిగితే ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు, పాలేరు నుంచి తుమ్మల నాగేశ్వరరావు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఖమ్మం రాజకీయాలు మాత్రం హట్ హట్‌గా మారుతున్నాయనే చెప్పాలి. -
ఖమ్మంలో ఉగ్రరూపం దాల్చిన మున్నేరు
-
భద్రాచలం రామాలయం చుట్టూ వరద నీరు.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గంట గంటకు వరద పెరుగుతోంది. 44.40 అడుగులకు నీటిమట్టం చేరింది. రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. అన్నదాన సత్రం నీటమునిగింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి దిగువకు 9.92 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం డివిజన్ లోని ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే స్థానిక అధికారులకు సహకరించి పునరావస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రావతి ప్రాణహిత నదుల్లో నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరుతుంది. కాలేశ్వరం మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి కూడా లక్షల కొద్ది క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. చర్ల మండలంలోని తల్లి పేరు ప్రాజెక్టు నుంచి కూడా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతున్నదని ముంపు ప్రాంత గ్రామాలపై యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికార యంత్రాగాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చదవండి: కొట్టుకుపోతుంటే.. ప్రాణాలకు తెగించి మరీ భద్రాచలం నుండి చర్ల వెళ్ళు రహదారిపైకి సత్యనారాయణపురం, ఆర్ కొత్తగూడెం వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరినందున రాక పోకలు నియంత్రణ చేయాలని చెప్పారు. ప్రజలు రవాణా చేయకుండా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుందని, ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళొద్దని, ప్రజలు కూడా దాటే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని పేర్కొన్నారు. పశువులను మేతకు బయటికి వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, వరద చేరిన సందర్భంగా పశువులను ఎతైన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అత్యవసర సేవలకు ప్రజలు కంట్రోల్ రూం నంబర్లకు కాల్ చేయాలన్నారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. -
సాగర్ కాల్వలో యువతి మృతదేహం లభ్యం!
ఖమ్మం: నగరంలోని ప్రశాంతినగర్ సమీపంలో సాగర్ ప్రధానకాల్వలో ఆదివారం ఓ గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. కాల్వలోని నీటిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడటంతో ఖమ్మం అర్బన్ పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావుతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద లభించిన పర్సులో రూ.6,600 నగదు ఉందని అన్నం శ్రీనివాసరావు తెలిపారు. యువతి వయస్సు 20 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు చెప్పారు. -
కర్మకాండలు సైతం పూర్తి..తిరిగొచ్చిన అమ్మ...
-
ఖమ్మం జిల్లాలో విషాదం.. మామిడితోటలో కుటుంబం ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం జిల్లా: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పెనుబల్లి మండలం పాత కారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు సుహాసిని దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు కార్తిక్ బెంగుళూరులో జాబ్ చేస్తుండగా, కూతురు అమృత ఇంటర్ పూర్తి చేసుకొని బిటెక్‌లో సీట్ కోసం ఎదురు చూస్తూ ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుంది. వెంకట కృష్ణారావు తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణారావు భార్య సుహసిని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతుంది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నెల రోజుల క్రితం కడుపు నొప్పికి సంబంధించిన సర్జరీ కూడా చేపించుకున్నారు. కడుపులో ఉన్న గడ్డను తొలిగించిన వైద్యులు టెస్టులకు పంపించారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయని హాస్పటల్ నుండి సమాచారం రావటంతో వెంకట కృష్ణారావు తన భార్య, కూతురుని బైక్‌పై తీసుకుని హాస్పటల్‌కు వెళ్లారు. రిపోర్ట్స్‌లో క్యాన్సర్ అని నిర్ధారణ అవటంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో తిరువూరులో ఆత్మహత్య చేసుకునేందుకు కొత్త తాడులు, చిన్న పీటలు(Chairs) కొనుగోలు చేసి వాటన్నింటినీ సంచిలో వేసుకుని ఇంటికి చేరుకున్నారు. బెంగుళూరులో జాబ్ చేస్తున్న కొడుకు కార్తీక్‌ను కూడా నిన్ననే ఇంటికి పిలిపించారు. అయితే రాత్రి సమయంలో కుమారుడిని ఇంటి దగ్గరే ఉంచి కృష్ణారావు తన భార్య సుహసిని, కూతురు అమృతని బైక్ ఎక్కించుకొని గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లోని తమ పొలం పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి తమతో తెచ్చుకున్న సామగ్రితో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డారు. చదవండి: భర్తను యాదాద్రికి పంపించి.. హైదరాబాద్‌లో తల్లీకూతురు ఆత్మహత్య భార్య సుహసినికి క్యాన్సర్ వ్యాధి సొకటంతో మనోవేదనకు గురైన ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విచారణ చేపడతామని సత్తుపల్లి రూరల్ సీఐ హాణుక్ తెలిపారు. ఘటన స్థలాన్ని కల్లూరు ఏసీపీ రామానుజం పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ హాస్పటల్ లోని మార్చురీకి తరలించారు. గ్రామంలో అన్యోన్యంగా జీవించే వెంకట కృష్ణారావు కుటుంబ సభ్యులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న సమాచారంతో గ్రామస్థులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తన కుమారుడికి పార్టీ అవకాశం ఇస్తే పోటీలో ఉంటారని పేర్కొన్నారు. జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేవి సహజమని చెప్పారు. రేవంత్, బండి సంజయ్‌కు రాష్ట్రంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్కు 2018 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లేకుండా కూటమి అని కేసీఆర్ అన్నారని, అందుకే విపక్ష సమావేశాలకు కేసీఆర్ వెళ్లడం లేదని తెలిపారు. వేముల విరేశం కాంగ్రెస్‌లోకి వెళ్తారనేది అవాస్తమని పేర్కొన్నారు. వారసుల కోసం తాము వేరే పార్టీలోకి వెళ్లమని, అవకాశం రాకపోతే పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలు కేవలం గుర్తింపు వరకు మాత్రమే పనిచేస్తాయని.. గెలుపు కోసం పనికిరావని అన్నారు. ‘రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదు. రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా? రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చాడు. ఫిరాయింపులు ఆపేందుకు చట్టం తేవాల్సింది కేంద్రమే. అలాంటి కేంద్రమే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందే తప్ప ఒక్క న్యాయం చేయలేదు. రెండు రాష్ట్రాల విభజన హామీలు కేంద్రం పరిష్కరించడంలో విఫలం అయింది’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా: కేటీఆర్ -
మిర్చి ఘాటు.. ఏఐ చెబుతుంది!
రైతులు మార్కెట్ యార్డుకు పంటను తీసుకెళ్తే.. అక్కడి వ్యాపారులు, నిపుణులు ఆ పంటను పరిశీలించి, వాసన చూసి, తేమ ఎంత ఉంటుందో అంచనా వేసి ధర కడతారు. అలా కాకుండా కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే యంత్రాలే.. కాస్త శాంపిల్ చూసి పంట నాణ్యత, తేమశాతం కచ్చితంగా చెప్పేస్తే రైతులకు ఎంతో ఊరట. పని త్వరగా పూర్తవుతుంది, మోసాలకు తావుండదు. వ్యాపారులు కొర్రీపెట్టి ధర తగ్గించేసే అవకాశం ఉండదు. ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్), ఏజీనెక్ట్స్ స్టార్టప్ సంస్థల సహకారంతో ఇలా ఏఐతో పనిచేసే మెషీన్లతో మిర్చి పంట విక్రయాలు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ (ఏఐ4ఏఐ)’కార్యక్రమంలో భాగంగా.. ‘సాగు–బాగు’పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. దీనితో మొత్తం ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – ఖమ్మం వ్యవసాయం మూడు యంత్రాలతో.. మూడు ప్రమాణాల గుర్తింపు మిర్చి పంట నాణ్యతను తేల్చేందుకు ఏఐ ఆధారిత ‘విజియో బాక్స్, 7స్పెక్‌ఎక్స్ ప్రో, 7స్పెక్‌ఎక్స్ కనెక్ట్’గా పిలిచే మూడు యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనిలో విజియో బాక్స్‌లో మిర్చిని పెడితే.. అది కాయ పరిమాణం, రంగు, మచ్చలు ఇతర అంశాలను పరిశీలించి నాణ్యతను నిర్ధారిస్తుంది. ♦ 100 గ్రాముల మిర్చిని పరిశీలించి నాణ్యత, రసాయనాల శాతం, తేమశాతాన్ని పరిశీలించడం కేవలం 20–25 నిమిషాల్లో పూర్తవుతుంది. అదే ప్రస్తుత సాధారణ పద్ధతిలో ఒక రోజు వరకు పడుతుంది. ♦ ఏఐ పరికరాల్లో పరిశీలన పూర్తయిన వెంటనే.. మిర్చికి ఏ, బీ, సీ, డీ అంటూ గ్రేడింగ్ ఇస్తుంది. ఈ వివరాలతో ఆటోమేటిగ్గా రైతుల ఫోన్ నంబర్లకు సంబంధిత ఎస్సెమ్మెస్ కూడా వస్తుంది. ♦ నిపుణులు, రైతుల సహకారంతో మిర్చికి సంబంధించిన వేలాది ఫొటోలను అప్లోడ్ చేసి ఏఐ ప్రోగ్రామ్‌ను రూపొందించామని.. దీనితో మంచి నిపుణులతో పోల్చితే 98శాతం కచ్చితత్వంతో ఏఐ యంత్రాలు పనిచేస్తున్నాయని ఏజీ నెక్ట్స్ స్టార్టప్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. పొలాల వద్దే మిర్చి కొనుగోళ్లు కూడా.. రాష్ట్ర ప్రభుత్వం ‘సాగు– బాగు’కార్యక్రమాన్ని మిర్చి సాగు మొదలు పంట అమ్మకం వరకు తగిన సాయం అందేలా రూపొందించింది. ఈ పైలట్ ప్రాజెక్టు కోసం.. ఎగుమతులకు పేరున్న ‘తేజ’రకం మిర్చిని సాగుచేసే ఖమ్మం జిల్లా కూసుమంచి వ్యవసాయ డివిజన్లోని ఏడు వేల మంది రైతులను ఎంపిక చేశారు. వారికి కొత్త విధానంపై అవగాహన కల్పించేందుకు 25 మంది సీఆర్పీలను నియమించారు. రైతుల భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి.. ఎరువులు, పురుగు మందుల వాడకం తదితర అంశాలపై తగిన సూచనలు అందించారు. రైతులు మిర్చి పంటను పొలాల వద్దే విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకోసం రైతువేదికల్లో పంట నాణ్యత పరిశీలన కోసం ఏఐ మెషీన్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది ప్రాజెక్టు అమలు చేసిన మూడు మండలాల్లో 150 టన్నుల మిర్చిని విక్రయించగా.. క్వింటాల్‌కు రూ.19,500 నుంచి రూ.22వేల వరకు ధర దక్కడం గమనార్హం. పొలం వద్దే పంట విక్రయించా.. మిర్చి తోటలోనే పంటను విక్రయించా. సాగు–బాగు ప్రాజెక్టు ప్రయోజనకరంగా ఉంది. నేరుగా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇచ్చారు. పంట నాణ్యతను రైతువేదిక వద్దే పరీక్షించి, తోటలోనే విక్రయించాను. మార్కెట్లో కంటే మెరుగ్గా క్వింటాల్‌కు రూ.22 వేల ధర లభించింది. కమీషన్, రవాణా చార్జీలు కూడా మిగిలాయి. వెంటనే సొమ్ము చెల్లించారు. – వి.రమేశ్, లింగారం తండా, కూసుమంచి మండలం -
ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిలకు అస్వస్థత
-
చీమలపాడు దుర్ఘటనలో మరొకరు మృతి
కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఈ నెల 12న బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనం సందర్భంగా బాణాసంచా కాల్చే క్రమంలో సిలిండర్ పేలిన ఘటనలో మృతులసంఖ్య నాలుగుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మృతి చెందగా, రెండుకాళ్లు కోల్పోయి తీవ్రంగా గాయపడిన చిందివారి సందీప్(36) హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అతడికి భార్య మమత అలియాస్ మొమీన్, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేయి తాలూకా మింగరి గ్రామానికి చెందిన చిందివారి సందీప్ బతుకుదెరువు కోసం పదిహేనేళ్ల క్రితం తెలంగాణకు వచ్చాడు. తల్లిదండ్రులు, సోదరి పోషణ బాధ్యతలు సందీప్ చూసు కుంటున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సందీప్ సుతారీ పనులు చేసే క్రమంలో ఒడిశా ప్రాంతానికి చెంది మొమీన్ పరిచయం కావటంతో ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కృష్ణ ఉన్నాడు. ఏడాది క్రితం పొట్ట చేతపట్టుకొని కారేపల్లి మండలం చీమలపాడుకు సందీప్, మొమీన్ వచ్చారు. భార్య గ్రామంలో వ్యవసాయకూలీ పనులకు వెళ్తుండగా, సందీ ప్ సుతారీ పనులు చేసేవాడు. ఈ నెల 12న మొమీన్ మిర్చి తోటలో పనికి వెళ్లగా, గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి సందీప్ హాజరయ్యాడు. ఆరోజు గుడిసె కాలి పోతుండటంతో అందరితోపాటు మంటలు ఆర్పే క్రమంలో సిలిండర్ శకలాలు దూసుకురావడంతో సందీప్ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. తొలుత ఖమ్మం ప్రభు త్వ ఆస్పత్రికి, తర్వాత నిమ్స్‌కు తరలించగా శుక్రవారం మృతి చెందాడు. ఊరుగాని ఊరిలో భర్తను కోల్పోయిన మొమీన్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
విషాదంలోనే మూడు గ్రామాలు
కారేపల్లి: చీమలపాడు సిలిండర్ పేలుడు ఘటన విషాదం ఇంకా వీడలేదు. ప్రమాదంలో కన్నుమూసిన ముగ్గురి అంత్యక్రియలు గురువారం పూర్తయ్యాయి. నిన్నటి వరకు తమతో గడిపినవారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఖమ్మం జిల్లా చీమలపాడులో బుధవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకర్తలు పేల్చిన బాణసంచాతో గుడిసెకు నిప్పంటుకుని, అందులోని సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు బుధవారం రాత్రే పోస్టుమార్టం పూర్తిచేసి స్వగ్రామాలకు తరలించారు. గురువారం ఉదయం చీమలపాడులో అజ్మీరా మంగు, స్టేషన్ చీమలపాడులో బానోతు రమేశ్, గేటురేలకాయలపల్లిలో ధరంసోత్ లక్ష్మాల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మరికొందరు నేతలు మూడు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మె ల్యే రాములునాయక్.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదంపై పోలీసుల ఆరా.. చీమలపాడు ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం దర్యాప్తు చేపట్టారు. గుడిసెకు నిప్పంటుకోవడం, సిలిండర్ పేలడంపై ఆరా తీశారు. ఆధారాలు చెరిగిపోకుండా.. గుడిసెతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను సీజ్ చేసి పరిశీలించారు. ఈ ఘటనకు నిరసనగా ప్రతిపక్షాలు గురువారం కారేపల్లి బంద్ చేపట్టాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు చీమలపాడుకు వస్తున్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిని పోలీసులు కామేపల్లిలోనే అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఇల్లెందు–ఖమ్మం రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తర్వాత రేణుకా చౌదరి పోలీసుల కళ్లుగప్పి.. ఇల్లెందు మీదుగా గేటురేలకాయలపల్లికి చేరుకుని ధరంసోత్ లక్ష్మా కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యే రాములునాయక్, ఎంపీ నామా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. కామేపల్లి ఘటనకు సంబంధించి రేణుకా చౌదరి, మరికొందరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తలకొరివి పెట్టిన తనయ చీమలపాడులో మృతిచెందిన బానోతు లక్ష్మాకు భార్య సరోజ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక వారు చేసిన రోదనలు అందరినీ కన్నీళ్లు పెట్టించాయి. లక్ష్మాకు ఆయన పెద్ద కుమార్తె సరస్వతి తలకొరివి పెట్టింది. -
ఖమ్మంలో కేడర్ తప్ప లీడర్లు కనిపించడం లేదు..!
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో గెలిపించినవారిలో భట్టి విక్రమార్క మినహా మిగిలినవారంతా కారెక్కి వెళ్ళిపోయారు. దీంతో ఇప్పుడు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేడర్ తప్ప లీడర్లు కనిపించడంలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ స్థితిలో పార్టీని నడిపించే నాథులు కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది. జిల్లాను ఉద్దరించే నేతల కోసం హస్తం పార్టీ నాయకత్వం పక్క పార్టీల వైపు చూస్తోందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో మధిర మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి నాయకులే లేరు. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించిన నేతలు గులాబీ గూటికి చేరిపోయారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కడే ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎన్నికలు వచ్చినపుడు మధిరలో ఇతర పార్టీలను ఎదుర్కొని గెలవడానికి భట్టి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో అసలు పోటీ చేయడానికి అభ్యర్థులే కనిపించడంలేదని అక్కడి కార్యకర్తలు వాపోతున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనే హస్తం పార్టీకి ఖమ్మం జిల్లాలో దుర్భర పరిస్తితులు ఏర్పడ్డాయి. ఖమ్మంతో పాటు పాలేరు, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడమంటే అంత తేలికైన పనికాదు. క్యాడర్ తో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి అవసరం. ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హ్యాట్రిక్ సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. ఆయన్ను ఓడించాలంటే పాటు స్థానికంగా అర్థబలం, అంగబలం ఉన్న శక్తివంతమైన నేత కాంగ్రెస్‌కు అవసరం. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడకు గట్టి పోటి ఇచ్చే స్థాయి గల నేత ఒక్కరు కూడా లేరని అంటున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఉన్నా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి మినహా పువ్వాడను ఎదుర్కొనేంత శక్తి ఆయనకు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోను అదే పరిస్తితి నెలకోంది. సత్తుపల్లి కాంగ్రెస్ లో మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, మానవతరాయ్ ఉన్నా బీఆర్ఎస్ నుంచి బలంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లాంటి నేతను ఓడించాలంటే స్థానికంగా ఆ స్థాయి నేత ఉండటం అవసరం. వచ్చే ఎన్నికల్లో పాలేరు హట్ సీట్ గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ రాయల నాగేశ్వర్ రావు కొంత యాక్టీవ్ గా పనిచేస్తున్నా..లోకల్ గా పార్టీ పుంజుకునే పరిస్తితి కనబడటంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో పాటు వైఎస్సార్ టీపీ నుంచి వైఎస్ షర్మిల బరిలో నిలిచే అవకాశం ఉండటంతో గట్టి అభ్యర్థి కోసం చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అన్వేసిస్తోంది. వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లాగా మారింది. టికెట్ ఆశిస్తున్న వారు అరడజను పైనే ఉన్నప్పటికీ..ఇందులో ఒక్కరికి కూడా గెలిచే సత్తా లేదని కాంగ్రెస్‌లోనే ప్రచారం జరుగుతోంది. పైగా వారిలో ఎవరికీ మరొకరితో పడదు. నాయకుల మధ్య ఉన్న గ్రూప్ తగాదాల కారణంగా వైరాలో రోజు రోజు పార్టీ మరింత బలహీనంగా మారుతోందని చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న ఓ బలమైన నేతను చేర్పించుకోని టికెట్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గులాబీ పార్టీకి చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతటా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే విషయమై ఇంతవరకు స్పష్టత ఇవ్వడంలేదు. ఈ నెలలోనే ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారని పొంగులేటి అనుచరులు చెబుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే జిల్లాలో నాయకత్వ సమస్య పూర్తిగా తీరిపోతుందని భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. -
విషాదం: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
సాక్షి, ఖమ్మం: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక మూల వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాeయి. అంబర్‌పేట ఘటన మరవకముందే ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. ఈ విషాదం రఘునాథపాలెం పుఠానితండాలో సోమవారం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు బానోతు భరత్(5) పై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి.. మీదపడి కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తల్లిదండడ్రులు చిన్నారిని ఖమ్మంలోని రెండు, మూడు ఆసుపత్రులకు తీసుకువెళ్లగా సిరియస్‌గా ఉండటంతో ఎవరూ ఆడ్మిట్ చేసుకోలేదు. దీంతో.. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కాగా బానోతు రవీందర్, సంధ్య దంపతులకు భరత్ చిన్న కుమారుడు. బాలుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం...స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
-
కామారెడ్డి జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటన
-
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వస్తున్న డాక్టర్లు
-
విజయవాడలో ఖమ్మం వైద్యవిద్యార్థి ఆత్మహత్య
ఏన్కూరు: ఖమ్మం జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండాకు చెందిన బానోతు నవీన్‌కుమార్ (23) విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో మెడిసిన్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 15వ తేదీన అతను విజయవాడలోని తన గదిలో పురుగు మందు తాగగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి చిక్సిత పొందుతున్న నవీన్ శనివారం ఉదయం మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా, నవీన్ ఆత్మహత్యకు కారణాలు తెలియల్సి ఉందని అంటున్నారు. -
ఏన్కూరులో ఎల్లో చిల్లీ!
ఏళ్ల తరబడి మనం ఆకుపచ్చ రంగులో ఉండే పచ్చిమిర్చిని, ఎర్ర రంగులో ఉండే ఎండుమిర్చిని చూస్తున్నాం.. వంటల్లో వాడుతున్నాం.. కానీ పసుపు రంగు మిర్చిని ఎప్పుడైనా చూశారా? కూరగాయలు అమ్మే కొన్ని పెద్ద దుకాణాల్లో పసుపు రంగులో ఉండే క్యాప్సికం (బెంగళూరు మిర్చి) కన్పిస్తుంది. కానీ ఎల్లో మిర్చి కనబడదనే చెప్పాలి. అయితే ఖమ్మం జిల్లాలో ఓ రైతు మాత్రం ఈ వెరైటీ మిరపను సాగు చేస్తున్నాడు. దీని దిగుబడి, ధర ఆశాజనకంగా ఉందని ఆయన చెబుతున్నాడు. ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన రైతు కొండపల్లి నరేష్ ఓ రోజు యూట్యూబ్‌లో సాధారణ మిర్చి సాగుకు సంబంధించిన వీడియోలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకచోట పసుపు రంగులో ఉన్న మిర్చి అతని దృష్టిని ఆకర్షించింది. ఒకింత లోతుగా పరిశీలించే సరికి కొన్నిచోట్ల ఈ పసుపు రంగు మిరప పంటను సాగు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వివరాలు ఆరా తీశాడు. వరంగల్, గుంటూరు వ్యాపారులు ఈ రకం మిర్చిని కొనుగోలు చేస్తారని తెలిసింది. గతేడాది క్వింటాల్‌కు రూ.65 వేల వరకు ధర పలికిందని కూడా తెలుసుకున్నాడు. దీంతో వరంగల్ వ్యాపారులను సంప్రదించాడు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టడమే కాకుండా వారి వద్దే ఎల్లో మిర్చి విత్తనాలు కొనుగోలు చేశాడు. తన ఎకరం పది కుంటల భూమిలో పంట వేశాడు. సాధారణ మిర్చి పంటలాగే సాగు పద్ధతులు అవలంబించగా రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చు అయింది. తాజాగా తొలి తీతలో ఐదు క్వింటాళ్ల దిగుబడి రాగా ఇంకా ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడికి అవకాశముందని నరేష్ చెబుతున్నాడు. ఈ రకం మిర్చికి తెగుళ్ల బెడద తక్కువేనని.. సాధారణ మిర్చితో పోలిస్తే 50 శాతం తక్కువ వైరస్లు సోకుతాయని చెప్పాడు. నల్లి ప్రభావం తక్కువగా ఉండగా, తెల్లదోమ మాత్రం కాస్త సోకిందని తెలిపాడు. మందులు, రంగులు, చిప్స్‌లో.. పసుపు రంగు మిర్చి సాగు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది క్వింటాల్‌కు రూ.65 వేల ధర పలకగా ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేల మధ్యే ఉంది. ధర పెరిగేవరకు ఆగుదామని కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేశా. ఈ మిర్చిని మందులు, రంగుల తయారీతో పాటు బ్రాండెడ్ కంపెనీల చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. – కొండపల్లి నరేష్, రైతు ఎల్లో మిర్చికి మంచి డిమాండ్ ఉంది ఖమ్మం జిల్లాలో పసుపు రంగు మిర్చి సాగు ఇటీవలే మా దృష్టికి వచ్చింది. మార్కెట్లో ఈ రంగు మిర్చికి డిమాండ్ ఉంది. ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. రైతులు పంట మార్చిడి చేయడం వల్ల దిగుబడులు పెరుగుతాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ పంట సాగుపై వివరాలు సేకరిస్తున్నాం. – పి.అపర్ణ, వైరా నియోజకవర్గ ఉద్యానవన అధికారి -
వైరా మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇటీవల జైపాల్‌తోపాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు మాజీ ఎంపీ పొంగులేటికి మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేయగా, మరో ముగ్గురు కౌన్సిలర్లు పార్టీకి రాజీ నామా ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం 14 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మంతనాలు జరి పారు. అనంతరం వీరంతా ఎమ్మెల్యే నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం నోటీసును కలెక్టర్‌కు అందజేశారు. పొంగులేటి వర్గం కావడంతో.. వైరా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకుగాను బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ రెండు, స్వతంత్రులు రెండు, సీపీఎం ఒక స్థానం గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఇద్దరు స్వ తంత్ర అభ్యర్థులు, సీపీఎం కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరా రు. బీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమాలకు జైపాల్ హాజరయ్యారు. దీంతో ఆయనపై బీఆర్ఎస్ వేటువేసింది. ఆ తర్వాత మరో ముగ్గురు కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనా మా చేసి పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎజెండా కాపీలను కౌన్సిల్ సమావేశాలకు ముందు అందజేయడంలేదని, అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆయనపై మిగిలిన కౌన్సిర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం గమనార్హం. -
ఆదర్శ రైతు ఇంట.. ‘ఆర్గానిక్’ పెళ్లంట
నేటి ఆధునిక కాలంలో పెళ్లిళ్ల తంతు అంతా కృత్రిమమే... ఫంక్షన్ హాళ్లు, సెట్టింగ్‌లు మొదలు పందిళ్లు, తోరణాలు, చివరకు గ్లాసులు, విస్తళ్ల వరకు అన్నీ ప్లాస్టిక్‌మయమే... కానీ ఆ ఇంట మాత్రం కొబ్బరాకులు, అరిటాకులు, అరటికాయలు, పూలతో తయారు చేసిన పెళ్లి మండపం.. పింగాణి ప్లేట్ల స్థానంలో మోదుగు, అడ్డాకుల ప్లేట్లలో భోజనం, కూల్‌డ్రింక్‌ల స్థానంలో చెరకు, ద్రాక్ష రసం.. చికెన్, మటన్ బదులు సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరల భోజనం.. ఇదీ ఓ ఆదర్శ రైతు ఇంట జరిగిన ‘ఆర్గానిక్’ వివాహం. ఒంటికి ఆరోగ్యం, కంటికి ఆహ్లాదం కలిగేలా నిర్వహించిన ఈ వివాహం ప్రత్యేకంగా నిలవడమే కాక ఆ రైతుకు ప్రకతిపై ఉన్న ప్రేమను చాటిచెప్పింది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు తన కుమారుడు కిరణ్ వివాహాన్ని సైతం అందరికీ ఆదర్శంగా నిర్వహించాడు. పెళ్లి ప్రక్రియలో ఆసాంతం ప్రకతికి పెద్దపీట వేశాడు. రామారావుకు తల్లిదండ్రులు రంగమ్మ, సత్యం, భార్య రమణతోపాటు ఇద్దరు కుమారులు కిరణ్, సురేశ్ ఉన్నారు. పెద్ద కుమారుడు కిరణ్ కోయంబత్తూరులో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి నాలుగేళ్లుగా ఖమ్మంలో ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆయన వివాహం బంధువుల అమ్మాయి ఉదయశ్రీతో నిశ్చయమైంది. శుక్రవారం జరిగిన ఈ వివాహాన్ని మధురమైన జ్ఞాపకంగా చేసుకోవడంతోపాటు ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు మంచి ఆహారం అందించాలని రైతు రామారావు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా, ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంట్లోనే పెళ్లి చేశాడు. పెళ్లి మండపాన్ని జమ్మిగడ్డి, కొబ్బరికాయలు, అరటిగెలలు, పూలతో చూపరులను ఆకట్టుకునేలా అలంకరించారు. భోజనాలకు బెంగళూరు నుంచి అడ్డాకు ప్లేట్లు, ఇతర ప్రాంతాల నుంచి మోదుగు ఆకు ప్లేట్లు తెప్పించారు. ఇక వంటలకు తమ పొలంలో ఎటువంటి రసాయన ఎరువులను వాడకుండా పండించిన కూరగాయలనే వాడారు. వంటకాల కోసం చెక్కగానుగ నూనె, రాక్ సాల్ట్, దేశీయ స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి, సహజంగా తయారు చేసిన బెల్లం, పెనగంచిప్రోలు నుంచి ఎండుమిర్చి కారం, ఏలూరు నుంచి కొబ్బరిబొండాలు, అరటిగెలలు, దమ్మపేట నుంచి కొబ్బరి మొక్కలు తెప్పించారు. వివిధ ప్రాంతాల ఆదర్శ రైతులతో వధూవరులు పెళ్లి వంటకాలు ఇవే.. పెళ్లిలో మాంసాహారానికి బదులు ముద్దపప్పు, నెయ్యి, వడియాల చారు, గోంగూర పచ్చడి, నాటుదోసకాయ పచ్చడి, వంకాయ, నాటు చిక్కుడుకాయ కూరలు, మష్రూమ్ ధమ్ బిర్కానీ, ఖద్దూకా ఖీర్, చెరుకు రసం, ద్రాక్ష జ్యూస్ ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి బంధువులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్త పురుషోత్తం, ఏలూరు, అనంతపురం, జహీరాబాద్, చిక్‌బళ్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి 300 మంది ఆదర్శ రైతులు, కేవీకే, జేడీఏ, హార్టికల్చర్ అధికారులను ఆహ్వానించారు. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంటికి తాళం వేయొద్దని.. ఫంక్షన్హాల్లో వివాహం చేసుకుంటే హడావుడి తప్ప ఆనందం ఉండదు. అదే ఇంటి వద్ద అయితే రెండు, మూడు రోజులు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఫంక్షన్ హాల్లో పెళ్లయితే ఇంటికి తాళం వేసి అంతా వెళ్లాలి. అలా చేయడం నాకు, మా నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఇంటి వద్ద వివాహం చేసుకున్నా. – చెరుకూరి కిరణ్, పెళ్లి కుమారుడు ప్రకృతికి విరుద్ధంగా ఉండొద్దనే.. ప్రకతి మనకు ఎన్నో ఇచ్చింది. అలాంటి ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించొద్దనే ఉద్దేశంతోనే పెళ్లి ప్రక్రియలో ఎక్కడా ప్లాస్టిక్‌ను వాడలేదు. అతిథులు మరిచిపోలేని విధంగా సేంద్రియ ఆహారం వడ్డించాం. – చెరుకూరి రామారావు, ఆదర్శ రైతు -
‘నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్’
వైరా: ‘నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చెయ్’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ‘పార్టీ నిన్ను బహిష్కరిస్తే సానుభూతి పొందాలని చూస్తున్నావు.. చర్యలు తీసుకునే ఎజెండా మాది కాదు’ అని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. పిల్లి ఊపులకు సీఎం కేసీఆర్ భయపడే రకం కాదన్నారు. కేసీఆర్ చేయి వదిలిన వారు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ జెండాను వదిలితే వారి బొంద వారే తవ్వుకున్నట్లు అవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. వైరా ఎమ్మెల్యేగా రాములునాయక్ ఉండగానే మరో వ్యక్తిని వైరా నియోజకవర్గ అభ్యర్థిగా ఎలా ప్రకటించారో చెప్పాలని ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదేనని, కేసీఆర్‌కు ద్రోహం తలపెట్టాలనుకునే వారు పార్టీ నుండి వెళ్లిపోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, జెడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. -
అదే జరిగితే భట్టి విక్రమార్కకి మైనస్‌గా అవుతుందా?
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో మల్లు భట్టి విక్రమార్క పేరు తెలియనివారుండరు. ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం నుంచి మూడు సార్లుగా ఆయన విజయం సాధిస్తున్నారు. నాలుగోసారి కూడా విజయం నాదే అంటున్నారాయన. సీఎల్పీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా భట్టి విక్రమార్క నియోజకవర్గంలో మంచి మార్కులు తెచ్చుకున్నారా?. మధిరలో ఆయన పని తీరు ఎలా ఉంది?. ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు?. ఆయన ప్రత్యర్థులు ఎవరు?. భట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది? మధిరలో ఢీ అంటే ఢీ అటు కాంగ్రెస్, ఇటు సీపీఎంలకు కంచుకోటగా పేరు తెచ్చుకున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం రాజకీయాల మీద పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఎస్సీ రిజర్వుడు నుంచి జనరల్ సీటుగా మారిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ వరుసగా కాంగ్రెస్ తరపున భట్టి విక్రమార్క విజయం సాధించారు. కమలారాజ్ రెండు సార్లు సీపీఎం అభ్యర్థిగా, ఒకసారి గులాబీ పార్టీ అభ్యర్థిగా మధిర నుంచి పోటీ చేసి.. భట్టి విక్రమార్క చేతిలో మూడుసార్లు ఓటమి చెందారు. నాలుగోసారి పోటీ చేసి సత్తా చాటేందుకు భట్టి విక్రమార్క రెడీ అవుతుండగా.. ఆయన మీదే మూడు సార్లు ఓడిపోయిన కమల్‌రాజ్‌కు నాలుగోసారి కూడా బీఆర్ఎస్ అవకాశం ఇస్తుందా లేదా చూడాలి. 2 లక్షల 9 వేల 945 మంది ఓటర్లున్న మధిరలో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 16 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటి వరకు 8 సార్లు కాంగ్రెస్, 6 సార్లు సీపీఎం విజయం సాధించాయి. కమ్యూనిస్టులు వర్సెస్ కాంగ్రెస్ 1985 నుంచి మధిరలో సీపీఎం పాగా వేయగా.. రిజర్వుడు సీటుగా మారిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురేస్తోంది. 2014లో రెండోసారి మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఓటమి చెందిన కమల్ రాజ్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయుడుగా ముద్రవేసుకున్న కమల్ రాజు ఆయనతో కలిసి అప్పటి ఆఖ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా మూడవసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన మల్లు భట్టివిక్రమార్క ఆఖ అభ్యర్థిగా బరిలో దిగిన కమల్ రాజుపై గెలుపొందారు. వరుసగా మూడుసార్లు లింగాల కమల్ రాజ్ పై భట్టి విక్కమార్క విజయం సాధించారు. పరిస్తితులు తలక్రిందులు కావడంతో స్థానిక ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున మధిర జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపోందారు లింగాల కమల్ రాజ్. తర్వాత ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పొంగులేటితో విభేదాలు రావడంతో ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గీయుడిగా కొనసాగుతున్నారు. ఇక నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ హోదాలో కమల్ రాజ్ విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ పెద్దగా పట్టు సాధించలేకపోతున్నారనే టాక్ ఉంది. వరుసగా మూడసార్లు ఓటమి పాలుకావడంతో అసలు నాల్గవసారి టికెట్ వస్తుందా.. ఒకవేళ వస్తే భట్టి విక్రమార్కపై గెలిచేంత గ్రౌండ్ కనకరాజ్‌కు ఉందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. భట్టి గట్టి పట్టు 2009 నుంచి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన భట్టి విక్రమార్క ముదిగొండ నుంచి జమలాపురం వరకు బీటీ రోడ్లు వేశారు. జాలిముడి ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చి పూర్తి చేశారు. మధిర మండలం మడుపల్లిలో లెదర్ పార్క్ కి ఇచ్చిన హామీ, మీనవోలు లో పరిశ్రమ ఏర్పాటుకు, బోనకల్లులో ఇందిర క్రాంతి మహిళా డైరీ కేంద్రం ఏర్పాటు, సాగర్ కాలువను థర్డ్ జోన్ నుంచి సెకండ్ జోన్ కి తీసుకొచ్చే హామీలు పెండింగ్ లో ఉండి పోయాయి. వాటిని కూడ పూర్తయ్యేలా చూడాలని మధిర వాసులు ఎమ్మెల్యే విక్రమార్కను కోరుతున్నారు. చింతకాని మండలం కోమట్ల గూడెంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును ఉద్యమంగా మలిచి రాష్ట్రస్థాయిలో మంచి మైలేజ్ తెచ్చుకున్నారు భట్టి విక్కమార్క. ఈ నేపథ్యంలోనే దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టును చింతకాని మండలంలో అమలుచేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని పలు సమావేశాల్లో భట్టి విక్కమార్క చెప్పుకొచ్చారు. దళితబంధు పథకం భట్టికి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. సీఎల్పీ నేతగా రాష్ట్రస్థాయిలో బిజీగా ఉండటం వల్ల నియోజకవర్గ మీద పెద్దగా దృష్టి పెట్టడంలేదనే లేదని విమర్శ సైతం భట్టి విక్రమార్క మీద ప్రభావం చూపే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారు సీటు ఎవరికి? ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఆఖ పార్టీ తరుపున ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఉద్యమకారుడైన బొమ్మెర రాంమూర్తి, కోట రాంబాబు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కమల్‌రాజ్ మూడు సార్లు ఓడిపోయిన అనుభవం ఉన్నందున ఈ సారి ఆయనకు అది ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేయడం ఖాయం. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్, ఆఖ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉంది. చదవండి: మంత్రి పువ్వాడకు ప్లస్ ఏంటీ? మైనస్ ఏంటీ? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు భట్టికి మరోసారి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. పొంగులేటి గులాబీ గూటి నుంచి కమలం గూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన గనుక పార్టీ మారితే ఆ పార్టీ సైతం గట్టి అభ్యర్థిని పోటీలో పెట్టే అవకాశం ఉంటుంది. పొంగులేటి బీజేపీలోనే చేరితే గనుక మధిరలో త్రిముఖ పోటీ తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నందున మల్లు ప్రత్యర్థుల ఓట్లన్నీ చీలిపోతే... నాలుగోసారి ఆయన విజయం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, వామపక్షాల పొత్తు ఖాయమంటున్నారు గనుక.. అదే జరిగితే భట్టికి కొంత మైనస్‌గా మారే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సీపీఎంకు బలమైన నియోజకవర్గం గనుక ఇప్పటికీ ఆ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉందంటున్నారు. అందువల్ల బీఆర్ఎస్, లెఫ్ట్ మధ్య పొత్తు కుదిరితే మల్లు కష్టపడాల్సి వస్తుంది. కాని ఎన్నికల నాటికి పొలిటికల్ ఈక్వేషన్స్ ఇంకా ఎన్ని రకాలుగా మారతాయో ఇప్పుడే చెప్పడం కష్టమే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
వాడ వాడ పువ్వాడ! కానీ, రంగంలోకి పొంగులేటి వస్తే.. పరిస్థితి ఏంటి?
ఖమ్మం జిల్లా కేంద్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారిపోతున్నాయి. జిల్లాలోని కీలక నేతలు ఖమ్మం సీటు మీదే గురి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే వాడ వాడ పువ్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యర్ధి ఎవరైనా బలంగా ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు పువ్వాడ. కాంగ్రెస్, బీజేపీలు కూడా బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. మంత్రి వువ్వాడ అజయ్ గురించి ఖమ్మం ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ హాట్ సీట్ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్‌గా మారబోతోంది. ఇప్పటికి రెండుసార్లు గెలిచి మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ సాధించాలనే ఉత్సాహంతో ఉన్నారు. దీనిలో భాగంగానే వాడ వాడ పువ్వాడ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంతో జనంకి మరింత చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. మతోన్మాద పార్టీలకు ఖమ్మంలో చోటు లేదనే స్లోగన్ తో ముందుకు సాగుతున్నారు. బీజేపీ నుంచి ఒకవేళ గట్టి అభ్యర్థి బరిలో ఉన్నా గెలుపోందే విధంగా పక్కా కార్యాచరణ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పువ్వాడ..2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి విజయం సాధించి మంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. 2004లో సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం గెలుపొందారు. గత నాలుగు ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుపోందారు. ఖమ్మంలో బలంగా ఉన్న కమ్మ, మైనార్టీ, కాపు వర్గాల్లో రెండు సామాజికవర్గాలు ఏ పార్టీవైపు మొగ్గితే ఆ పార్టీకే విజయం దక్కుతుంది. కన్నేసిన పొంగులేటి ఇదిలా అంటే బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు. పొంగులేటి బీఅర్ఎస్ పార్టీని వీడటం దాదాపు ఖరారు అయినప్పటికీ... ఏ పార్టీలో చేరతారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఫిబ్రవరి ఆఖరు నాటికి ఏ పార్టీలో చేరతారన్న విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జనరల్ స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరుల్లో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే పొంగులేటి అనుచరుల్లో మెజారిటీ మాత్రం ఖమ్మం నుంచే పోటీ చేయాలని గట్టిగా సూచిస్తున్నారు. జనవరి ఒకటో తారీఖున నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నవారంతా ఖమ్మం నుంచే పోటీ చేయాలని కోరారు. అందువల్ల ఖమ్మంకే తొలి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఖమ్మంలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. చేతి పార్టీలో ఎవరు? మరో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఖమ్మం నియోజవర్గంపై సీరియస్ గా గురిపెట్టింది. అయితే అజయ్ లాంటి బలమైన నేతను ఢీకొట్టడానికి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. అందుకే మాజీ ఎంపీ రేణుకచౌదరి ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఖమ్మంలో నూతన క్యాంప్ కార్యాలయాన్ని కూడా రేణుక చౌదరి ప్రారంభించారు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేత కావడం.. లోకల్ గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం బలంగా ఉండటంతో రేణుక చౌదరి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో లోకల్ గా గ్రూపుల గొడవలు ఉండటంతో వ్యతిరేక వర్గం రేణుకకు ఏ మేర సపోర్ట్ చేస్తుందన్న అనుమానాలూ ఉన్నాయి. కారుతో కమ్యూనిస్టుల జోడి ఇక బీజేపీకి కూడా ఖమ్మం నియోజకవర్గంలో బలమైన నేతలు ఎవరూ లేరు. ఇతర పార్టీల నుంచి నేతలు చేరితే తప్ప ఖమ్మంలో కాషాయపార్టీ పుంజుకునే అవకాశాలు లేవు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బిజెపి బలం పెరిగే అవకాశం ఉంది. పొంగులేటి పోటీ చేస్తే అజయ్ కు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. లెఫ్ట్ పార్టీలు సైతం ఖమ్మం నియోజకవర్గంలో బలంగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీఅర్ఎస్తో పొత్తు దాదాపు ఖరారైంది. ఇది గులాబీ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి పనులు మంత్రి అజయ్ కు బాగా కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. 22 కోట్లతో లకారం ట్యాంక్ బండ్ , 8 కోట్లతో తీగల వంతెనను నిర్మించారు. తీగల వంతెన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నూతన బస్టాండ్, ఐటీ హబ్, గొల్లపాడు చానల్ ఆధునీకరణ, నూతన కార్పొరేషన్ భవనం, సమీకృత నూతన కలెక్టరేట్ భవనాలు వంటివి అజయ్ కుమార్‌కు కలిసి వచ్చే అంశాలే. ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెంను ఖమ్మం టౌన్ తో పాటుగా అభివృద్ధి చేశారు. ఖమ్మం నుంచి ఇల్లందు రోడ్డును నాలుగు లైన్లకు విస్తరింపచేశారు. రఘునాధపాలెం మండలం సాగు నీటి సమస్య తీర్చేందుకు బుగ్గ వాగు ప్రాజెక్టు చేపట్టారు. కాని ఇంతవరకు అది పూర్తికాకపోవడంతో రైతులకు సమస్యగా మారింది. ఖమ్మం నగరం అభివృద్ధి చెందుతుండటంతో.. ట్రాఫిక్ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కరించలేకపోయారన్న విమర్శ స్థానికుల్లో ఉంది. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఉంటే వర్షాకాలం వరద ముంపు సమస్య పరిష్కారం అవుతుందని..అందువల్ల ఆ విషయాన్ని ఆలోచించాలని నగరవాసులు కోరుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. చదవండి: పాలకుర్తిలో ‘పవర్’ ఎవరికి?.. మంత్రి ఎర్రబెల్లి గెలుస్తారా? కొందరు బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు విచ్చలవిడిగా భూకబ్జాలు చేస్తున్నారన్న టాక్ సైతం లోకల్ గా వినిపిస్తోంది. వారిని అదుపులో పెట్టుకోకపోతే అజయ్ కు మైనస్ అయ్యే అవకాశాలు సైతం లేకపోలేదనే వార్నింగ్‌లు ఇస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు సైతం మంత్రికి ఇబ్బందులు తెస్తున్నాయి. కీలక నేతల చూపు ఖమ్మం అసెంబ్లీ సీటు వైపు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం హట్ సీట్ గా మారనుంది. ఏ పార్టీ అయినా ఖమ్మం అసెంబ్లీ స్థానంలో బలమైన అభ్యర్థిని రంగంలో దించితే దాని ఎఫెక్ట్ పాలేరు, వైరా స్థానాలపై పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
విజయ డెయిరీలో ఏం జరుగుతోంది.. ప్రత్యేక బృందం పరీశీలన!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ)లో జరుగుతున్న అక్రమాలపై ఐదుగురు అధికారులు, ఉద్యోగులపై వేటు వేసిన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయిస్తున్నారు. ఈ బృందంలో రాష్ట్ర జనరల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం డెయిరీ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్‌తో పాటు గతంలో ఇక్కడ పనిచేసిన మేనేజర్ కోడిరెక్క రవికుమార్ ఉన్నారు. మూడు రోజులుగా వీరు ఖమ్మంలోనే మకాం వేసి అక్రమాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఖమ్మం డెయిరీలో అక్రమాలపై రెండేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.లక్షల విలువైన వెన్న, రైతులకు విడుదల చేసిన పాల ప్రోత్సాహకాలు కూడా పక్కదారి పట్టించడమే కాక, రెండు జిల్లాల పరిధిలోని బల్‌్కమిల్క్ సెంటర్ల నిర్వహణ, పాడిపశువులు, పనిముట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈమేరకు 2021 నవంబర్‌లో రాష్ట్ర సంస్థ రాష్ట్ర పాడి పరిశ్రమల డైరెక్టర్ లక్ష్మీ మంజూషతో పాటు మరో ఇద్దరు అధికారుల బృందం ఇక్కడ విచారణ జరపగా, కొందరు ఉద్యోగులను బదిలీ చేశారు. ఇదే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ భరతలక్ష్మి కోర్టును ఆశ్రయించి మళ్లీ ఇక్కడే కొనసాగుతుండగా.. వర్గవిభేదాలు సద్దుమణగలేదు. దీంతో ఉన్నతాధికారులు ఖమ్మం డెయిరీ డీడీ సత్యనారాయణను మాతృసంస్థకు పంపించి, నల్లగొండకు బదిలీ అయిన మేనేజర్ నరేష్, ప్రస్తుతం ఇక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న భరతలక్షి్మతో పాటు ల్యాబ్ అసిస్టెంట్ నాగశ్రీ ప్లాంట్ ఆపరేటర్ మణిని తాజాగా సస్పెండ్ చేశారు. అక్రమాలపై ప్రత్యేక బృందం పరిశీలన ఖమ్మం పాడి పరిశ్రమలో రూ.40 లక్షలకు పైగా జరిగిన అక్రమాలపై జనరల్ మేనేజర్ మల్లయ్య నేతృత్వంలోనే బృందం మూడు రోజులుగా విచారణ చేస్తోంది. రెండేళ్లకు సంబంధించి ప్లాంట్ నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడమే కాక ఇల్లెందు, కొత్తగూడెం సెంటర్లలో తనిఖీ చేశారు. ఇంకా రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరుపై విచారణ చేపట్టి, అక్రమాలకు ఎవరు సహకరిస్తున్నారనే అంశంపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ బృందంలోని అధికారులు సోమవారం కలెక్టర్ వీ.పీ.గౌతమ్‌ను కలిసి అన్ని అంశాలను వివరించినట్లు తెలిసింది. ఆపై ఉన్నతాధికారులకు ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా విచారణ కోసం ఇంకో కమిటీని నియమించనున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఖమ్మం పాడి పరిశ్రమలో చోటు చేసుకున్న అక్రమాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. ఆ నివేదిక ఆధారంగా విచారణకు కమిటీని నియమించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో త్వరలోనే 5 లక్షల లీటర్ల సామర్ద్యం కలిగిన మెగా డెయిరీ ఏర్పాటవుతోంది. ఈ డెయిరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పాల సమీకరణ కోసం కృషి చేస్తున్నాం. – మల్లయ్య, జనరల్ మేనేజర్. -
హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోండి
బోనకల్: బీఆర్ఎస్ నేతలు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఎంతమేరకు అమలు చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధిర నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తాను, ఖమ్మం జిల్లా ప్రజల అభిమానంతో ఎంపీగా గెలి చానని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు టీఆర్ఎస్లో చేరాన న్నా రు. అయితే, కేసీఆర్, కేటీఆర్ ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని, ఏడున్నరేళ్ల పాటు తాను అనేక అవమానాలను ఎదుర్కొన్నా నని తెలి పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యు త్, రైతులకు రుణమాఫీ వంటి వాగ్దానాలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు కలగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిమానం పొందలేక ఓడిపోయిన అభ్యర్థులందరినీ తానే ఓడించాననే అపనింద మోపి ఎంపీ టికెట్ ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశానని పొంగులేటి తెలిపారు. జిలాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు సహకారం అందించానన్నారు. -
‘నవోదయ’లో విద్యార్థులకు అస్వస్థత
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో సుమారు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా పలువురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా, శుక్రవారం వీరి సంఖ్య పెరగడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు స్థానిక వైద్య సిబ్బంది చికిత్స చేశారు. అయితే, విద్యార్థులు అస్వస్థతకు గురికావటానికి గల కారణాలు స్పష్టంగా తెలియడంలేదు. విద్యార్థులకు మెనూ ప్రకారం బుధవారం చికెన్ వడ్డించగా, అది తిన్నాక కడుపునొప్పి, వాంతులు అయ్యాయని విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఇటీవల విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చినప్పుడు తెచ్చుకున్న పిండి వంటలు తినడంతోనే ఇలా జరిగిందని ప్రిన్సిపాల్ చంద్రబాబు వివరణ ఇచ్చారు. విద్యార్థుల పరిస్థితిపై డీఎంహెచ్ఓ డాక్టర్ మాలతి పాఠశాలకు వచ్చి మెడికల్ ఆఫీసర్ కిషోర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పిండివంటలతో పాటు భోజనం తయారీలో వాడే సరుకుల శాంపిళ్లను సేక రించారు. విద్యార్థులకు చికిత్స కొనసాగుతోందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని డీఎంహెచ్ఓ వెల్లడించారు. -
ప్రజాసమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తా
ఎర్రుపాలెం: వచ్చే నెల 3వ తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామంలో గురువారం రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన ఆయన హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రారంభించారు. గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ మిర్చి రైతుల కష్టాలు, కూలీలు సమస్యలు వినడంతో పాటు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రధాని, కేంద్రమంత్రి అమిత్‌షా కలిసి దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఏ కాయ కష్టం చేయకుండానే అంబానీ, అదానీలు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని భట్టి ప్రశ్నించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం లౌకిక వాదాన్ని పక్కకు పెట్టి మతం పేరిట ప్రజలను విడగొట్టి వైషమ్యాలను పెంచుతూ లబ్ధికి యత్నిస్తోందని ధ్వజమెత్తారు. -
ఖమ్మం సభలో ముఖ్యమంత్రుల వ్యాఖ్యలపై గవర్నర్ ఆగ్రహం
-
‘బీఆర్ఎస్ సభలో కానరాని బీజేపీ వ్యతిరేక ఎజెండా’
ఖమ్మం సహకారనగర్: దేశ సంస్కృతి, సంపదతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు, వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎజెండా ప్రకటిస్తారని జరిగిన ప్రచార ఆర్భాటానికి తగ్గట్టుగా ఖమ్మం బీఆర్ఎస్ సభ లేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. కనీసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పనికొచ్చే ఎజెండా కూడా లేదని అన్నారు. గురువారం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ఆర్భాటంగా నిర్వహించిన సభలో దేశానికి దశదిశ ఇచ్చే ఎజెండా లేకపోవడం, ప్రజలు ఆశించినవి కూడా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. పోడుపట్టాలు, పేదలకు ఇళ్లస్థలాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, సింగరేణి ప్రైవేటీకరణ, బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీల ఊసెత్తలేదని ఆరోపించారు. ప్రజలను విభజించి, విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీని కట్టడి చేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని భట్టి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. కాగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మీడియా సాక్షిగా ఆహ్వానిస్తున్నట్టు భట్టి తెలిపారు. ఆయన కాంగ్రెస్‌లోకి రావడానికి తాను అడ్డుగా లేనని చెప్పారు. -
సీఎంలు ‘ఏమిటీ జనం?’ అని ఆశ్చర్యపోయారు..’శభాష్ అజయ్’
సాక్షి, ఖమ్మం: ‘శభాష్ అజయ్.. ఆవిర్భావ సభ సక్సెస్ చేశారు. ఖమ్మం చరిత్రలోనే ఇలాంటి సభ ఎన్నడూ జరగలేదు. కమ్యూనిస్టు నాయకులు, మిగతా నేతలు అందరూ సభ అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ‘ఏమిటీ జనం?’ అంటూ ఆశ్చర్యపోయారు..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను అభినందించారు. సభావేదిక పైనే కాకుండా సభ ముగించుకుని వెళ్లిన తర్వాత కూడా సీఎం ప్రత్యేకంగా మంత్రికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. హెలి కాప్టర్ నుంచి ముఖ్యమంత్రులు దారి పొడవునా ఉన్న జనాన్ని చూసి ‘ఇంతమంది జనమా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని కేసీఆర్ చెప్పారు. భవిష్యత్ ఉందంటూ కొనియాడారు. ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ ప్రకటన నాటి నుంచి మంత్రి అజయ్ సభను విజయవంతం చేసేందుకు సర్వశక్తులొడ్డారు. ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీగా జన సమీకరణకు కసరత్తు చేశారు. అంతేకాకుండా ఒక్క ఖమ్మం నియోజకవర్గం నుంచే వెయ్యి మంది వలంటీర్లను ఏర్పాటు చేసి సభ ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా ముగిసేలా చూశారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
ఉద్యమాల గడ్డ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ
-
బీఆర్ఎస్ సభ: 2024లో మోదీ ఇంటికి.. మేము ఢిల్లీకి: కేసీఆర్
Upadates: Time 5.45 PM చివరగా అథితులుగా వచ్చిన సీఎంలు, నేతలకు ఘన సత్కారంతో సభను ముగించారు. Time 5. 40 PM దేశంలో ప్రబలమైన మార్పునకు ఖమ్మం బీఆర్ఎస్ భేరి ఒక సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాకు వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు. 589 గ్రామాలకు రూ. 10లక్షల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు ప్రకటించారు. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా?. దేశంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. విదేశీ సాయం అవసరం లేనంత వనరులు దేశంలోనే ఉన్నాయి. లక్ష కోట్ల ఆస్తి మన దేశం సొత్తు. దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములున్నాయి. కానీ, ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండాలి?. ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఇంకా రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు అవసరమా?. అన్ని సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. ఫర్వాలేదు.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ వాటిని వెనక్కి తీసుకువస్తాము. అగ్నిపథ్‌కు కూడా రద్దు చేస్తాము. ఎల్ఐసీని ప్రభుత్వపరం చేస్తాము. రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ది నేషనలైజేషన్. తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంట్ అందిస్తాము. Time 5.20 PM కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమం అంటూ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్.. కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. Time 4.41 PM భారతదేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారు. సబ్కా సాథ్.. సబ్కా వికాస్ అన్న మోదీ.. ఇప్పుడు ఎవరితో ఉన్నారు?. మోదీ పేదవాళ్లను వదిలేసి.. కార్పొరేటర్లతో తిరుగుతున్నారు. అలాగే.. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బంది పెడుతున్నారు. ఇదేనా ఫెడరల్ స్ఫూర్తి అంటే అని కేంద్రానికి ఏకిపడేశారు. చివరికి.. వన్ నేషన్.. వన్ లీడర్.. వన్ పార్టీ అనే రీతిలో వ్యవహరిస్తోంది బీజేపీ. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడిందన్న రాజా.. బీజేపీ దేశానికి ప్రమాదకారిగా పరిణమించిందని డి. రాజా పేర్కొన్నారు. Time 4.02 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఇవాళ్టితో ఇంకా 399 రోజులే మిగిలి ఉన్నాయి. కేంద్రానికి కౌంట్ డౌన్ మొదలైంది. రైతుల్ని ఆదుకుంటామన్నారు.. మాట తప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు.. చేతులెత్తేశారు. తెలంగాణలో మాదిరే యూపీలోనూ బీజేపీ ప్రక్షాళన జరుగుతుందని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. Time 3.56 PM దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం. రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీకి వ్యతిరేకండా పోరాడాలి. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన ఉంటోంది. కులాలు, మతాల వారీగా ప్రజలను వేరు చేయడాన్ని వ్యతిరేకించాలి. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వీకేంద్రీకరణ జరుగుతోంది. పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు. కేసీఆర్ పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని కేరళ సీఎం ప్రకటించారు. Time: 3.35 PM సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్, డి. రాజా ఉన్నారు. Time: 2.30 PM ►రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జాతీయ నేతలు, సీఎంల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. Time: 02.00PM ►యాదాద్రి నుంచి హెలీకాప్టర్లలో ఖమ్మం చేరుకున్న ముఖ్యమంత్రులు, జాతీయ నేతలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత చాంబర్లో కలెక్టర్ వీపీ గౌతమ్‌ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను జాతీయ నేతలు తిలకించారు. అనంతరం కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జాతీయ నేతల చేతులమీదుగా కళ్లజోళ్ల పంపిణీ చేయనున్నారు. Time: 12.30PM సీఎం కేసీఆర్‌తో కలిసి ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయ గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసక్తిగా పరిశీలించారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్ఠతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. తరువాత ఆలయ అర్చకులు ముఖ్యమంత్రులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. Time: 11.30AM ► తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర జాతీయ నేతలు యాదాద్రి చేరుకున్నారు. కేసీఆర్‌తోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు .లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం తర్వాత ఖమ్మం సభకు నేతలు వెళ్లనున్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్, సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా దైవ దర్శనానికి వెళ్లలేదు. గెస్ట్‌హౌజ్‌లోనే ఉండిపోయారు. సాక్షి, ఖమ్మం: చారిత్రక సభకు ఆతిథ్యమిచ్చేందుకు ఖమ్మం సిద్ధమైంది. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మంలో జరగనుండడంతో సభావేదిక, చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నగరమంతా గులాబీ నగిషీలు తొడుక్కుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సారథ్యాన ఏర్పాట్లు పూర్తి కాగా, మరోపక్క నూతన కలెక్టరేట్ సముదాయం పుష్పగుచ్ఛంలా ముస్తాబైంది. ముఖ్యఅతిథులు తొలుత కలెక్టరేట్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటివెలుగును ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించాక ఆవిర్భావ సభకు హాజరవుతారు. జాతరలా తరలివచ్చేలా.. బీఆర్ఎస్ తొలి సభ ఖమ్మంలో ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి పార్టీ యంత్రాంగం జన సమీకరణకు సర్వశక్తులొడ్డుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఆరుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 18 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తొలి సభ కావడం, నాలుగు రాష్టాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు వస్తుండడంతో విజయవంతాన్ని ఈ బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభావేదిక ప్రత్యేకతలు.. సభా ప్రాంగణం : 100 ఎకరాలు వేదిక : జర్మనీ టెక్నాలజీ వాటర్, ఫైర్ రూఫ్ (గులాబీరంగు) హాజరయ్యే జనం (అంచనా : 5 లక్షలు ప్రాంగణంలో కుర్చీలు : లక్ష వేదికపై కూర్చునేది : సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్‌సింగ్‌మాన్, మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, సీపీఎం, పీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు పువ్వాడ నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు సభావేదిక ముందు: ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య అతిథులు అధ్యక్షత : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించేది: సీఎంలు పినరయ్ విజయన్, భగవంత్ సింగ్మాన్, కేజ్రీవాల్,అఖిలేష్ యాదవ్, డి.రాజా, చివరన సీఎం కేసీఆర్ సభా సమయం : మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు. సీఎంల పర్యటన షెడ్యూల్ ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బీఆర్ఎస్ తొలి సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా బుధవారం ఖమ్మం రానున్నారు. వీరి పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ► సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ► సీఎం కేసీఆర్‌తో కలిసి బుధవారం ఉదయం 10.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలీకాప్టర్లలో బయలుదేరి 10.35 గంటలకు యాదగిరిగుట్ట చేరుకుంటారు. అక్కడ 10.40గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాక 11.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. ► ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌తోపాటు కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ► మధ్యాహ్నం 2.25 గంటలకు కలెక్టరేట్ కాంప్లెక్స్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు బీఆర్ఎస్ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. ► ఈ సభలో తొలుత ముందుగా సీఎం పినరయి విజయన్ మాట్లాడగానే హెలీకాప్టర్‌లో విజయవాడ బయలుదేరతారు. ఆ తర్వాత మిగతా అతిథులు ప్రసంగిస్తారు. సభ ముగిశాక కేజ్రీవాల్, భగవంత్ మాన్ సాయంత్రం 5 గంటలకు, ఆతర్వాత అఖిలేష్ యాదవ్ విజయవాడ వెళ్లి అక్కడి నుంచి విమానాల్లో వారి రాష్ట్రాలకు వెళ్తారు. ► సీఎం కేసీఆర్ కూడా ఖమ్మం నుంచి నేరుగా హెలీకాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరతారు. తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లకు బాధ్యతలు ఖమ్మం నగరాన్ని పోలీసులు గుప్పిట్లోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ తదితరులు వస్తున్నారు. వీరిలో కేజ్రీవాల్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండడంతో పంజాబ్, ఢిల్లీకి సంబంధించిన సీఎంల సెక్యూరిటీ వింగ్ అధికారులు చేరుకుని సభావేదిక, ప్రాంగణం, నూతన కలెక్టరేట్‌ను పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలో నలుగురు సీఎంలు తొలిసారి ఒకే వేదికపైకి రానుండడంతో నిఘా కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు బుధవారం ఉదయం 6నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు. బందోబస్తు బాధ్యతలను తొమ్మిది మంది సీనియర్ ఐపీఎస్‌లు పర్యవేక్షిస్తుండగా, 5,210 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. కాగా, కలెక్టరేట్ నుంచి పది వాహనాలతో సభావేదిక వద్దకు కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అలాగే, పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌తో పాటు పోలీసు కమిషనరేట్‌లో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేశారు. నిఘా నీడలో ఖమ్మం! బీఆర్ఎస్ సభ సందర్భంగా నాలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలే కాకుండా ఐదు లక్షల మంది మేర కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, రామగుండం ప్రాంతాల నుంచి నుంచి పోలీసు సిబ్బందికి విధులు కేటాయించగా వారంతా జిల్లాకు చేరుకున్నారు. వీరిలో డీఎస్పీ ఆపైస్థాయి అధికారులకు గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస ఏర్పాటు చేయగా మిగతా వారికి కళ్యాణమండపాలు, హాస్టళ్లలో వసతి కల్పించారు. అలాగే, నగరంలోని వాసవీ గార్డెన్స్, మంచికంటి భవన్, తనికెళ్ల, బైపాస్‌రోడ్లలోని ఫంక్షన్ హాళ్లలో మెస్‌లు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు 5,200మంది ఖమ్మంతోపాటు ఇతర జిల్లాలనుంచి సుమారు 5,210మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. ఇందులో ఏఎస్పీలు పది మంది, ఏసీపీలు 39, సీఐలు, ఆర్ఐలు 139మంది, ఎస్సైలు 409మంది, ఏఎస్సైలు 530మంది, కానిస్టేబుళ్లు 1,772మంది, మహిళా కానిస్టేబుళ్లు 169మంది, హోంగార్డులు 1,005 మందితో పాటు స్పెషల్ పార్టీలు, రోప్ పార్టీ సిబ్బంది ఉన్నారు. ఇక భారీగా జనం హాజరుకానుండడంతో పిక్ పాకెటర్లు, పాత నేరస్తులపై సీసీఎస్ పోలీసులు నిఘా వేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి 150మంది ఇంటిలెజెన్స్ సిబ్బంది చేరుకోగా, వీరిలో ఐజీ స్థాయి మొదలు ఉద్యోగులు ఉన్నారు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి బహిరంగ సభకు వివిధ జిలాల్ల నుంచి కార్యకర్తలు హాజరుకానుండడంతో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించగా, అక్కడ వాహనాలు నిలిపి సభకు వెళ్లేలా సూచనలు చేశారు. అలాగే, వాహనాలు వచ్చివెళ్లే మార్గాలను కూడా ప్రకటించారు. రహదారులు, బ్రిడ్జిలపై వాహనాలు ఎక్కడైనా ఆగిపోతే వెంటనే పక్కకు తొలగించేలా బోయింగ్ వాహనాలు సిద్ధం చేశారు. ప్రారంభానికి ముస్తాబు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ – ఐడీఓసీ) ప్రారంభానికి ముస్తాబైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మూడు రాష్ట్రాల సీఎంలు కలెక్టరేట్‌తో పాటు ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగును బుధవారం ప్రారంభించనుండడంతో మంగళవారం రాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఐడీఓసీ మొత్తాన్ని అందంగా పూలతో అలంకరించి లైట్లు అమర్చడంతో రాత్రివేళ జిగేల్మంటూ కనిపించింది. సీఎంలు, ఇతర ముఖ్యులు కలెక్టరేట్లోనే మధ్యాహ్న భోజనం చేయనుండడంతో మొదటి అంతస్తు స్టేట్ చాంబర్ పక్కనే ఉన్న చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ) చాంబర్లో ఏర్పాట్లు చేశారు.