సాక్షి, ఖమ్మం: పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం.. వైరా మండలంలో పర్యటించిన మంత్రి.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కి మంత్రి ఫోన్‌లో సూచించారు.
పంచాయతీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఆ దిశగా మార్పులు, చేర్పులతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి 3న ప్రకటించాలని పేర్కొంది.
4న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి తుది జాబితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల పంచాయతీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్,కాంగ్రెస్‌కు ఎంపీ లక్ష్మణ్ ఛాలెంజ్
Comments
Please login to add a commentAdd a comment