Panchayat election
-
చాయ్ వాలాగా మారిన సీఎం మమతా.. ఇదంతా అందుకోసమే!
కోల్‌కతా: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు ఓటర్లు ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అవుతుంటారు. ఇందుకోసం లీడర్లు చిత్రవిచిత్రాలు చేస్తుంటారు. రానున్న పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఛాయ్ వాలా అవతారమెత్తారు. రోడ్డు పక్క ఉన్న ఓ హోటల్లో స్వయంగా టీ తయారు చేసి, అక్కడున్న వారికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం మమతా ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్ నుండి జూలై 8 పంచాయతీ ఎన్నికల కోసం.. పూర్తి స్థాయి ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. కాషాయ పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను బీఎస్ఎప్ భయపెడుతోందని, ఈ క్రమంలో వారి కార్యకలాపాలపై నిశితంగా పరిశీలించాలని పోలీసులను కోరారు. పంచాయతీ ఎన్నికలకు ముందు, కొంతమంది బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఓటర్లను బెదిరించి, ఓటు వేయవద్దని బలవంతం చేస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. వారి బెదిరిపులకు భయపడకుండా ఎన్నికలలో నిర్భయంగా పాల్గొనాలని ఆమె ప్రజలను పిలుపునిచ్చారు. మూడంచెల గ్రామీణ ఎన్నికలలో తృణమూల్ బీజేపీని ఓడిస్తుందని మమతా నొక్కి చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించి, దేశంలో అభివృద్ధి ఆధారిత ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు. జూలై 8న ఒకే దశలో ఎన్నికలు జరుగనుండగా, జూలై 11న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | West Bengal CM Mamata Banerjee makes tea and serves it to people at a tea stall in Jalpaiguri's Malbazar, as a part of her campaign for upcoming Panchayat polls pic.twitter.com/s2TiVIdyET — ANI (@ANI) June 26, 2023 చదవండి: 'సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం' ప్రముఖ గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు.. -
బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేంద్ర బలగాల మోహరింపుపై సుప్రీం ఓకే..
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర బలగాలను మోహరించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఎన్నికలను నిర్వహించడమంటే.. హింసకు లైసెన్స్ ఇవ్వడం కాదని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ)ని ధర్మాసనం తప్పుబట్టింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం ఎస్ఈసీ విధి అని స్పష్టం చేసింది. హింస జరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ సంయుక్తంగా ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాళు చేస్తూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఇందులో ఎలాంటి తప్పు లేదని తీర్పులో పేర్కొంది. ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు..సుప్రీంను చేరిన బెంగాల్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేళ రాష్ట్రంలో హింస చెలరేగింది. జూన్ 9న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బెంగాల్ అంతటా పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. అల్లరిమూకలు బాంబులు విసిరారు. ఇందులో 9 మంది మృతి చెందారు. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, సీపీఐఎంలు అధికార టీఎంసీని విమర్శించాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వమే అందోళనకారులకు మద్దతునిస్తోందని ఆరోపించారు. జులై 8న పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 75వేల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 61 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. జులై 11న ఒట్ల లెక్కింపు జరగనుంది. ఇదీ చదవండి: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థి కుటుంబ సభ్యుని హత్య -
పిచ్చి పీక్స్.. వీధి కుక్కలకి ప్రచార పోస్టర్లు..
లక్నో: రాజకీయ నాయకులు గెలుపు కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారని తెలుసు. కానీ, ఇప్పుడు ప్రచారానికి దేన్నైనా వాడేస్తారని నిరూపించారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజకీయనేతలు. వారు తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు మూగజీవాలను కూడా వాడేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు వింత పోకడలకి పోయారు. అక్కడి వీధి కుక్కలకి తమ ప్రచార పోస్టర్లు అంటించారు. తమకే ఓటు వెయ్యాలని ఆ పోస్టర్లపై కోరారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు వారిపై ఫైర్ అయ్యారు. జంతు కార్యకర్త అయిన రీనా మిశ్రా మాట్లాడుతూ ‘ఎన్నికల సమయంలో ఇలాంటి స్టిక్కర్లు మనుషుల ముఖం మీద అంటించుకోమంటే ఎవరైనా అలా చేస్తారా?.. నోరు లేని జీవాలను ఈ విధంగా వాడుకోవడం సరికాదని’ మండిపడ్డారు. తక్షణమే పోలీసులు స్పందించి పోస్టర్లు అంటించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విమర్శలను అభ్యర్థులు తోసిపుచ్చుతున్నారు. ప్రచారంలో జంతువులను ఉపయోగించరాదనే ఎటువంటి నియమం లేదు. అయినా మేము జంతువులకు ఏ విధంగానూ హాని చేయటం లేదు. వాటికి ఆహారం పెట్టి, పోస్టర్లను అంటిస్తున్నాం. ఇందులో తప్పేముందని, తమ పనిని వారు సమర్థించుకుంటున్నారు. ( చదవండి: మద్యాన్ని జుర్రుకున్న కోతులు! ) -
టీడీపీ నేతలు నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు
విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మధ్య రగడ మొదలైంది. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలు పణంగా పెట్టి తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు వక్రీకరిస్తున్నారని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం తమకు కల్పించిందని, మా ప్రాణాలకు రాజ్యాంగం ఏం విలువ ఇచ్చిందని మాత్రమే తాను ప్రశ్నించానని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలను కాదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కొందరు టీడీపీ నేతలు తనను వాడూ వీడూ అని సంబోధిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ ఆయన వాపోయారు. తనను విమర్శించే నేతలను తాను కూడా అరేయ్ ఒరేయ్ అనగలనని, అలా మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోలేనని అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికలు జరిగే వాతవరణమే లేదని, ఈ విషయం నిమ్మగడ్డకు కూడా తెలుసునని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా, నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితే కూడా లేదని వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు జరుపుకుంటే తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులను రాజకీయ అనసరాల కోసం వాడుకుంది టీడీపీనేనని, ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నం అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఓ మాజీ ఉద్యోగ సంఘ నేత వల్లే ఉద్యోగులకు రాజకీయాలతో ముడి పెట్టడం మొదలైందని అన్నారు. అతనితోనే ఆ రాజకీయం ఆగిపోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే ఆయన ఉద్యోగులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారన్నారు. తనపై దాడికి టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంపై రేపు డీజీపీని కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీజీఈఎఫ్ జనరల్ సెక్రటరీ అరవపాల్ పాల్గొన్నారు. -
ఒకవైపు టీకా.. మరోవైపు ఎన్నికలా? సాధ్యం కాదు
ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఎన్నికల విధుల్లో కూడా వీరే కీలకం. వాళ్లే ముందు వ్యాక్సిన్ తీసుకోవాలన్న కేంద్ర మార్గదర్శకాల మేరకే ముందుకు వెళుతున్నాం. ప్రధానంగా వ్యాక్సిన్ తీసుకున్న వారు కొద్ది రోజుల పాటు పరిశీలనలో (అబ్జర్వేషన్) ఉండటం తప్పనిసరి. ఏవైనా అలర్జీలు, రియాక్షన్లు తలెత్తుతున్నాయా? ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయా? తదితర అంశాలను నిరంతరం పరిశీలించాలి. వారు రెండో డోసు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కొంత వ్యవధి తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఆచరణ సాధ్యం కాదు. మరోవైపు హైకోర్టు కూడా ఎన్నికలతో పాటు వ్యాక్సినేషన్ కూడా ముఖ్యమేనని స్పష్టంగా చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహిస్తూనే అదే సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడం ఆచరణ సాధ్యం కాదు కాబట్టే సుప్రీంకోర్టుకు వెళుతున్నాం. అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై సోమవారం విచారణ జరగనుంది. అంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎస్ఈసీని కోరుతున్నాం. – ఎస్ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలకు తాము వ్యతిరేకం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టంగా చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ... రాష్ట్రంలో కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టామని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారికి వ్యాక్సిన్ అందించాల్సి ఉందని తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు శుక్రవారం ఆయనొక లేఖ రాశారు. ‘‘కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ రెండు డోసులివ్వాలి. మొదటి, రెండో డోసులకు మధ్య నాలుగు వారాల వ్యవధి అవసరం. రెండో డోసులూ తీసుకున్న నాలుగు వారాల తర్వాతే వారిలో పూర్తిస్థాయి యాంటీ బాడీస్ వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఆ విధుల్లో కూడా ఈ ఫ్రంట్‌లైన్ వారియర్సే కీలకమవుతారు. మరి వారికి టీకా ఇవ్వటం ఎలా? ఇవ్వకపోతే కేంద్ర మార్గదర్శకాలను పాటించనట్లే. పైపెచ్చు వారి ఆరోగ్యాన్ని, ప్రాణాలను ఫణంగా పెడుతున్నట్టే’’ అని ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేంద్ర నిబంధనలను ఉల్లంఘించినట్లే’ అని లేఖలో స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్పెల్పీ) దాఖలు చేసిందని, ఇది సోమవారం విచారణకు రానున్నదని సీఎస్ తన లేఖలో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన 60 రోజుల తర్వాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజారోగ్యం, ప్రజాభ్యుదయం దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని ఎస్ఈసీని తన లేఖలో దాస్ అభ్యర్థించారు. ఈ లేఖను అందచేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లగా వారిని కలిసేందుకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇష్టపడలేదు. తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా ఆ లేఖను తీసుకున్నారు. ఎస్ఈసీకి సీఎస్ రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► హైకోర్టు ఆదేశాలతోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఎస్ఈసీ కొందరు అధికారులను నిబంధనలను పాటించకుండా తొలగించారు. ఆ అధికారులు ‘కోవిడ్–19 వ్యాక్సినేషన్’ కార్యక్రమం అమలులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో తొలగింపును వాయిదా వేస్తున్నాం. ► రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ► ఎన్నికల షెడ్యూలు జారీ చేయక ముందే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో అర్థవంతమైన సంప్రతింపులు జరిపి ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధంగా ఉందో లేదో అంచనా వేసుకోవాలి. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అవి రెండూ ముఖ్యమేనని స్పష్టం చేసింది. ► ఎస్ఈసీపై రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత గౌరవం ఉంది. అవసరమైనంత మేరకు సిబ్బందిని ఎస్ఈసీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ► ఎన్నికల షెడ్యూలుపై హైకోర్టు ఉత్తర్వుల తర్వాత పోలీసు శాఖ, ఎన్నికల ప్రక్రియలో భారీ ఎత్తున పాల్గొనే వివిధ శాఖల అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మీ దృష్టికి తెస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను నిర్వహించే ఈ శాఖల సిబ్బందికి మొదటి, రెండో విడతల కింద వ్యాక్సినేషన్ అందించాలి. ఈ సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ► ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేయడం సాధ్యం కాదు. ఎన్డీఎంఏ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన 60 రోజుల తర్వాతే ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ► ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. ఈ రెండు కార్యక్రమాలను సజావుగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో ఎస్ఈసీ మీద కూడా అంతే ఉందనే విషయం మీకు తెలియంది కాదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను సజావుగా నిర్వహించాలంటే ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూలును సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ► ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారి ఆరోగ్యం, బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నది మీకు తెలుసు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాధి నిరోధక శక్తి పెంపొందినప్పుడు వారిని ఎన్నికల విధులకు వినియోగిస్తాం. ► పంచాయతీ ఎన్నికల షెడ్యూలు ప్రభావం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై పడుతుందనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడానికి షెడ్యూలులో కేంద్రం ఏవైనా మార్పులు సూచిస్తే ఆ మేరకు వ్యవహరిస్తాం. ఈ అంశాలను వివరిస్తూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్సెల్పీ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ► ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వ్యాక్సినేషన్, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి వీలుగా కొత్త షెడ్యూలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నికలు, పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వ్యాక్సిన్ ఇచ్చి వారిలో నైతిక స్థైర్యం నింపడానికి సిద్ధంగా ఉంది. -
డీజీపీతో నాగిరెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ వి.నాగిరెడ్డి కోరినట్టు సమాచారం. కొన్ని తండాల్లో చోటుచేసుకున్న ఉదం తాలను కూడా డీజీపీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 17 ఎఫ్ఐఆర్లను నమో దు చేసి, 12 కేసుల్లో చర్యలు తీసుకున్నట్టు ఎస్ఈసీ తెలిపింది. మరో 2 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలియజేసింది. గురువారం ఈ మేరకు డీజీపీకి ఎస్ఈసీ ఒక నివేదికను అందజేశారు. గురువారం జగిత్యాల జిల్లాలో 5 కేసు లు (వాటిలో రెండు కేసుల్లో రాజకీయపార్టీ, అభ్యర్థుల ప్రమేయం), వనపర్తి, ఖమ్మం జిల్లాల్లో నాలుగేసి కేసులు, సైబరాబాద్‌లో ఒక కేసు నమోదు చేసినట్టు పేర్కొంది. ఈ ఎన్నిక ల్లో భాగంగా దాదాపు రూ. 1.18 కోట్ల వరకు (మొత్తం ఖమ్మం జిల్లాల్లోనే) డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. జగిత్యాల, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, రామగుండం జిల్లాల్లో రూ. 3 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఈ నివేదికలో తెలిపింది. వారిపై చర్యలు తీసుకోండి బలవంతపు ఒత్తిళ్లు, బహిరంగవేలం పాటల ద్వారా ఏకగ్రీవాలు లేదా ఒకే నామినేషన్ దాఖ లైనట్టుగా చూపిన వాటి ఫలితాల ప్రకటన నిలుపుదల చేయాలని నాగిరెడ్డిని తెలంగాణ ఎలక్షన్ వాచ్ సమన్వయకర్తలు ఎం.పద్మనాభరెడ్డి, చెలికానిరావు కోరారు. ఇవే పద్ధతులు నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగే అవకాశాలున్నాయన్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు రూ. 15 లక్షల ప్రోత్సాహకం అందిస్తామంటూ ఎమ్మెల్యేలు హామీనివ్వడం ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికమిటీలు, కుల సంఘా లు ఇతరత్రాల సంఘాల ద్వారా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికల కోసం ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. ఎక్కువ మొత్తం పాడే వాళ్లకు వేలం ద్వారా ఒకరే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్టుగా చూపిస్తున్నారన్నారు. -
రంగంలోకి కలెక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారులో కొంత జాప్యం చోటుచేసుకుంది. దీంతో జిల్లా కలెక్టర్ మొదలు ఇతర ముఖ్య అధికారులు పరిస్థితిని చక్కదిద్దే చర్యలు తీసుకున్నారు. అయినా ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఆదివారమే రిజర్వేషన్ల లెక్కలు తేలే అవకాశాలున్నాయి. జిల్లాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసి శనివారంలోగా పంపించాలని ఇదివరకే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంపై శనివారం స్వయంగా కలెక్టర్లే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి కుదించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయిల్లో సర్పంచ్, వార్డు స్థానాల కేటాయింపుల్లో కొన్నిచోట్ల తప్పులు దొర్లడంతో హుటాహుటిన వాటిని సరిచేసే చర్యలను అధికారులు చేపట్టారు. కొన్ని మండలాల్లో సర్పంచ్ స్థానాలు, మరికొన్ని చోట్ల వార్డు సభ్యుల రిజర్వేషన్లలో లెక్కలు తేలకపోవడంతో మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టరేట్లకే రప్పించి ఎక్కడ లోపాలున్నాయో చూసి, సరిదిద్దే చర్యలు తీసుకున్నారు. కొన్నిచోట్ల మహిళల రిజర్వేషన్లు 50 శాతానికి పైగా మించి 60 నుంచి 70 శాతానికి చేరుకోవడం, అనుకున్న స్థాయిలో బీసీ రిజర్వేషన్లు తేలకపోవడం, వార్డు సభ్యుల వారీగా రిజర్వేషన్ల ఖరారులో ఇబ్బందులు వంటివి తలెత్తాయి. కొన్ని జిల్లాల్లో మండల కోటాలు ఖరారయ్యాక ఆర్డీవోల ఆధ్వర్యంలో వార్డుల రిజర్వేషన్లపై ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు కసరత్తు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రికల్లా మెజారిటీ జిల్లాల్లో రిజర్వేషన్ల ఖరారు పూర్తి అవుతుందనే విశ్వాసాన్ని పీఆర్ అధికారులు వ్యక్తం చేశారు. మిగిలిపోయిన కొన్ని జిల్లాల రిజర్వేషన్లు ఆదివారం నాటికి తేలవచ్చునని తెలుస్తోంది. గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు చేసిన కొన్ని జిల్లాల కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కసరత్తు పూర్తయిన ఏ జిల్లాకు ఆ జిల్లాలో గెజిట్లను ప్రచురించే అవకాశాలున్నాయి. అదేరోజు వీటన్నింటిని క్రోడీకరించి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) పంచాయతీరాజ్ శాఖ అందజేయను న్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా ల్లోని సర్పంచ్, వార్డులకు ఖరారు చేసిన రిజర్వేషన్లను సూక్ష్మంగా పరిశీలించి, ఆయా అంశాలపై న్యాయసలహా తీసుకున్నాక ఒకట్రెండు రోజుల్లో ఎస్ఈసీ పంచాయతీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. కలెక్టర్లకు పీఆర్ కమిషనర్ ఆదేశాలు.. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కసరత్తు పూర్తికాని జిల్లాలు ఆదివారం సాయంత్రంలోగా ఆ ప్రక్రియను పూర్తిచేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే కమిషనర్ కార్యాలయానికి కలెక్టర్లు తెలియజేయాలని సూచించారు. రిజర్వేషన్ల ఖరారు పూర్తికాని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆమె ఈ మేరకు వర్తమానం పంపించారు. గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికి సంబంధించి సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపించాల్సి ఉన్నందున అప్పటిలోగా ఈ అంశాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. -
బీసీ గణన పూర్తి చేసిన తర్వాతే పచాయితీ ఎన్నికలు జరపాలి: చాడ
-
మాకు అన్యాయం జరిగితే ఖబడ్దార్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56 శాతం పెంచాలని తాము పోరాడుతుంటే ప్రభుత్వం మాత్రం 34 నుంచి 27 శాతానికి తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీ వ్యతిరేక వైఖరిని విడనాడకపోతే ప్రభుత్వానికి తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష పార్టీల సమావేశం సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఆ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, 70 ఏళ్లుగా బీసీలకు దక్కాల్సిన రాజకీయ వాటాను అగ్రకులాలే అనుభవిస్తున్నాయని, ఇప్పుడు బీసీలకు జనాభా దమాషా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీసీలు సర్పంచులైతే వీళ్ల జాగీర్లు పోయినట్టు జడ్జిమెంట్ ఇప్పించారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 28 మంది అగ్రకులాల వారే ముఖ్యమంత్రులు అయ్యారని, తాము కనీసం సర్పంచ్‌లు అవుతామంటే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే సుప్రీంలో స్టే వచ్చేలా వాదనలు వినిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అఖిలపక్ష సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసేలా ప్రధానిపై ఒత్తిడి తేవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈసారి బీసీల వాటా బీసీలకివ్వాల్సిందే, అదేమీ భిక్ష కాదని, ప్రజాస్వామిక హక్కు అని పేర్కొన్నారు. బీసీలకు జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలను కేసీఆర్ మోసం చేశారు: ఉత్తమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బీసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపుల నుంచి పంచాయతీరాజ్ రిజర్వేషన్ల వరకు అదే వైఖరి అవలంబించారని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చి అసలు విషయాల్లో బీసీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ నుంచి గెంటివేశారని, బీసీ ఓట్ల గణన కూడా సరిగా చేయలేదన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన 37 మందిలో 27 మంది బీసీలే ఉన్నారని, టీఆర్ఎస్లో అది సాధ్యమవుతుందా అని ఉత్తమ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుట్ర పూరితంగా కొన్ని ఉత్తర్వులు ఇస్తారని, ఆ ఉత్వర్వులను కోర్టు కొట్టివేస్తే ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టడం అలవాటుగా మారిందని విమర్శించారు. బీసీలకు పంచాయతీరాజ్‌లో 54 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తే తాము సంపూర్ణ మద్దతిస్తామన్నారు. ఎన్నికల వాయిదాకు కేసీఆర్ కుట్ర... పంచాయతీ ఎన్నికల వాయిదాకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ఆరోపించారు. కోర్టులో ప్రభుత్వం తరఫున సరైన వాదనలు కూడా వినిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ అంశంలో ప్రథమ ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇందుకు టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. బీసీల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ మద్దతిస్తుందన్నారు. సమావేశంలో బాలమల్లేశ్ (సీపీఐ), బీజేపీ రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీల నేతలు హాజరై తమ మద్దతు ప్రకటించారు. బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప సర్పంచ్ ఎన్నికలో హైడ్రామా
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : మండలంలోని పాల్మాకుల పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అవిశ్వాస తీర్మాణంతో ఉప సర్పంచ్ పదవి కోల్పోగా.. ఆ తర్వాత చోటుచే సుకుంటున్న వరుస ఘటనలు చర్చనీయాంశం అయ్యాయి. ఖాళీ అయిన వార్డుకు ఉప ఎన్నిక నిర్వహించిన రెండు రోజులకే మరో వార్డు సభ్యుడు రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పంచాయతీలో మొత్తం 14 వార్డులుండగా.. గతేడాది సెప్టెంబరు 26న ఉప సర్పంచ్ హరీందర్గౌడ్పై అవిశ్వాసం పెట్టారు. 9 మంది వార్డు సభ్యులు, సర్పంచ్ సరిత అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. కొత్తగా ఉప సర్పంచ్ ఎన్నికను అడ్డుకునేందుకు.. హరీందర్‌గౌడ్ వర్గీయులు ఎత్తులు వేశారు. పంచాయతీ 3వ వార్డు స్థానానికి సభ్యురాలు బాలమణి గత అక్టోబరు 10న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా.. గత నెల 29న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉప సర్పంచ్ ఎన్నిక జరపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో హరీందర్‌గౌడ్ వర్గీయులు కొత్త షాక్ ఇచ్చారు. రెండు రోజుల కిందట పంచాయతీ 5వ వార్డు సభ్యుడు నవీన్‌కుమార్ రాజీనామాను ఎంపీడీఓకు అందజేశారు. వార్డు స్థానం ఖాళీ ఉండగా.. ఉప సర్పంచ్ ఎన్నిక జరిపే అవకాశం లేదనే ఆలోచనతో రాజీనామా చేయించినట్లు సమాచారం. ఇది వరకే నోటిఫికేషన్ జారీ.. ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయడానికి హరీందర్‌గౌడ్ వర్గీయులు పావులు కదువుతుండగా.. అప్పటికే నోటిఫికేషన్ జారీ కావడం గమనార్హం. గత నెల 29న వార్డు స్థానానికి ఉప ఎన్నిక పూర్తయిన మరుసటి రోజు 30వ తేదీన ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 9న ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ రాగా.. తాజాగా మరో వార్డు సభ్యుడు రాజీనామా చేయడంతో ఉప సర్పంచ్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వార్డు స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో ఉప సర్పంచ్ ఎన్నిక జరిపే అవకాశాలు ఎంత వరకు అనుకూలంగా ఉంటాయో తెలియని అయోమయం నెలకొంది. ఇదిలా ఉండగా.. వార్డు సభ్యుడు చేసిన రాజీనామా ఇంకా ఆమోదం పొందనట్లు సమాచారం. న్యాయ సలహా తీసుకుంటాం పాల్మాకుల పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. అయితే వార్డు సభ్యుడు రాజీనామా చేసిన నేపథ్యంలో ఎన్నికను జరిపే అంశాన్ని న్యాయ సలహా మేరకు ముందుకు వెళ్తాం. – ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి -
సమరానికి సై..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అధికార టీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలు పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అధికార పార్టీ ఒకడుగు ముందుకేసి పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయ కేతనం ఎగురవేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించేందుకు బుధవారం రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చారు. అలాగే స్థానిక సమరం ఈసారి హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న ఆయా రాజకీయ పక్షాలు కార్యకర్తలకు చేరువయ్యేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. టీఆర్ఎస్ మాత్రం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇతర పార్టీల్లో బలమైన నాయకులుగా ఉండి.. రాజకీయంగా కొంత నిరాశావాదంతో ఉన్న నేతలపై దృష్టి సారించింది. మండల, గ్రామస్థాయిలో అధికార పార్టీ వైపు మొగ్గుచూపే నేతలతో సమాలోచనలు జరపాలని ఇప్పటికే ముఖ్య నేతలకు పార్టీ నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ద్వితీయ శ్రేణి నాయకులకు, జిల్లా నేతలకు ఎప్పటికప్పుడు నొక్కిచెబుతున్న మంత్రి తుమ్మల.. పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఎలా సన్నద్ధం కావాలో.. ఏయే అంశాలపై దృష్టి సారించాలో.. అభివృద్ది కార్యక్రమాలను గ్రామాలవారీగా టీఆర్ఎస్ చేపట్టిన తీరును విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. వ్యూహాల్లో నిమగ్నం.. గత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జిల్లాలో పెద్దగా స్థానాలు గెలవనప్పటికీ.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మంత్రి తుమ్మలతోపాటు టీడీపీ నుంచి అలాగే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండలస్థాయి కీలక నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పంచాయతీ ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించినా.. పరోక్షంగా నిర్వహించినా.. గ్రామాల్లో తిరుగులేని విధంగా ఎన్నికల వ్యూహం ఉండేలా చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు బలమున్న ప్రాంతాల్లో కీలక స్థానాలను గెలుచుకుని జిల్లాలో తమకు గల పట్టు నిరూపించుకున్నాయి. ఇదే క్రమంలో ఈసారి వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలు మళ్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో మంత్రి తుమ్మలతోపాటు పాల్గొన్న ప్రతి నేత పంచాయతీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా తమ ప్రసంగాలను కొనసాగించడం, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో పంచాయతీ ఎన్నికల సమరానికి టీఆర్ఎస్ ముందుందన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్లయిందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికలకు సమయం ఇంకా నెల రోజులున్నప్పటికీ మంత్రి తుమ్మలతోపాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, బానోతు మదన్‌లాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమై.. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సమస్యలు ఇతర అంశాలపై సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నారు. పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన గ్రామ, మండలస్థాయి నాయకులు ఇతర పార్టీల్లో ఎవరెవరున్నారనే అంశంపై టీఆర్ఎస్ ఆరా తీసే పనిలో నిమగ్నమైంది. ఆయా రాజకీయ పక్షాల్లో వారి పరిస్థితి తమవైపు మొగ్గు చూపేందుకు గల సానుకూల అంశాలను పరిశీలించే బాధ్యతను మండల, నియోజకవర్గ స్థాయి నాయకులకు పార్టీ నాయకత్వం అప్పగించినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో జిల్లాలోని అనేక తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి. కొత్త జీపీలు ఏర్పడితే ఆయా గ్రామ పంచాయతీల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశంపై ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. తమకు తండాల్లో ఉన్న పట్టుపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా ఏ సమయంలోనైనా మోగే అవకాశం ఉండటంతో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులు మరింత వేగవంతం చేస్తున్నారు. మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు, పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
‘పంచాయతీ’పరేషాన్!
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ కసరత్తుతో ఉమ్మడి జిల్లాలోని పల్లెల్లో సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో మార్పులపై ఉప సంఘాన్ని ఏర్పాటు చేయడంతో కొత్త విధానాలు రానున్నాయి. ఒక పంచాయతీకి రెండుసార్లు ఒకే రిజర్వేషన్ ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తుండడంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే ఆశావహులు ఆరాట పడుతున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో మొత్తం 1176 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 1,170 పంచాయతీలకు సర్పంచ్‌లుండగా, 6 పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సర్పంచ్‌ల్లో మహిళలదే అగ్రభాగం.. మహిళా సర్పంచ్‌లు 619 మంది ఉండగా, పురుషులు 551 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా చూస్తే అత్యధికంగా బీసీ సర్పంచ్‌లు 558 మంది ఉన్నారు. జనరల్, రిజర్వుడ్ స్థానాల్లో కూడా పోటీ చేసి విజయం సాధించడంతో బీసీ సర్పంచ్‌లు అత్యధికంగా ఉన్నారు. ఓపెన్ కేటగిరిలో అన్ని అన్ని కులాలకు చెందిన వారు సర్పంచ్‌లుగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన పంచాయతీల్లో ఆ కేటగిరికి చెందిన వారే పోటీ పడ్డారు. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో నూతనంగా మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మార్పుల్లో ప్రధానంగా రెండుసార్లు ఒకే రిజర్వేషన్ తెరమీదికి వచ్చింది. ఇది కొంతమంది ఆశావాహులకు సంతోషాన్ని కలిగిస్తున్నా.. మరికొంత మందికి మాత్రం రెండుసార్లా..? అంటూ ఆందోళనలో ఉన్నారు. ఏ రిజర్వేషన్ వస్తుందోనని .. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లు, పోటీ చేయాలనుకునే ఆశావాహుల్లో ఏ పంచాయతీ ఏ కేటగిరికి రిజర్వు అవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒక్కసారి రిజర్వు అయితే పదేళ్ల వరకు అదే కేటగిరి వ్యక్తి సర్పంచ్ కానుండడంతో మిగతా కేటగిరిల ఆశావాహులు ఈ పదవుల పందెరంపై ఆశలు వదులుకోవాల్సిందే. పదేళ్ల తర్వాత రిజర్వేషన్ మారితే తమ రాజకీయ భవిష్యత్ కలిసివస్తుందో లేదోనని హైరానా పడుతున్నారు. తమకు తెలిసిన అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఇప్పటికే ఏ పంచాయతీ, ఏ రిజర్వేషన్ అవుతుందోనని ఆరా తీస్తున్నారు. మరోవైపు సర్పంచ్‌లు నేరుగా కాకుండా పరోక్ష పద్ధతిన అంటే ఎన్నికైన వార్డుసభ్యుల్లో ఒకరిని ఎన్నుకునే దానిపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో ఇప్పుడున్న సర్పంచ్‌లు మళ్లీ అవకాశం వస్తుందో ...? లేదోనని ఆలోచిస్తున్నారు. సర్పంచ్ పదవిపై మోజు తగ్గని వారు వార్డు సభ్యుడిగా కూడా పోటీచేసి సర్పంచ్ పదవికి పోటీ పడేందుకు సై అంటున్నారు. కూడికలు .. తీసివేతలు .. మండల కేంద్రాల్లో సర్పంచ్‌లు ఎక్కడ కలిసినా ఈ ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. ‘ఈ సారి మా పంచాయతీ మళ్లీ మా కేటగిరికే రిజర్వే అవుతుందని ఒకరు.. లేదు వేరే కేటగిరి అవుతుందని మరొకరు’ ఇలా ఎవరికివారు నలుగురు కూడిన చోట కేటగిరిల కూడికలు.. తీసివేతల్లో మునుగుతున్నారు. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎన్నికలంటే చిన్నపాటి సార్వత్రిక ఎన్నికలను తలపిస్తాయి. ఈ పంచాయతీల్లో నిధులు దండిగా ఉండడంతో ఇక్కడ ఉన్న ఆశావాహులు, సర్పంచ్‌లు తమ పంచాయతీ ఏ కేటగిరికి రిజర్వు అవుతుందోనని తమ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి చర్చిస్తున్నారు. ప్రభుత్వం ఈసారినుంచి ఎన్నికైన సర్పంచ్‌లకు ఇప్పటికి ఉన్న వాటికి తోడు మరికొన్ని అధికారాలు కట్టబెడుతుండడంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం అప్పుడే షురూ అయింది. రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తుపై ఈ ఎన్నికలు ఉండవన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రాజకీయ పార్టీల మద్దతుదారులుగా ఈ ఎన్నికల్లో పోటీపడే వారు బరిలో నిలుస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఏం మార్పులు తీసుకొస్తుందోనని ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా తమ పార్టీకి పట్టుగొమ్మలైన పల్లెల్లో ఈ ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలన్న వ్యూహాలకు పదునుపెట్టనున్నాయి. -
టీడీపీ దళిత సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
కంబదూరు: టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు తనను తరచూ అవమానిస్తున్నారంటూ అదే పార్టీకి చెందిన దళిత సర్పంచ్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో సోమవారం ‘జన్మభూమి– మా ఊరు’ సభలో అధికారుల ఎదుటే చోటుచేసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాకే నరసింహులు గత పంచాయతీ ఎన్నికల్లో నూతిమడుగు నుంచి టీడీపీ మద్దతుదారుడిగా పోటీచేసి సర్పంచ్‌గా గెలిచాడు. అయితే, దళితుడన్న ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వకుండా స్థానిక టీడీపీ నాయకులు, నూతిమడుగు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు అడుగడుగునా అవమానిస్తున్నారు. ఈ విషయాన్ని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే నూతిమడుగులో సోమవారం ఉదయం ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమం ప్రారంభం కాగా.. అధ్యక్షతన వహించిన సర్పంచ్ నరసింహులు సభకు నమస్కారం చేసి వెంటనే నిష్క్రమించి తిరిగి కొద్ది సేపటికి అక్కడికి చేరుకుని వేదిక కింద కూర్చుని తాను తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. స్థానికులు అడ్డుకున్నా.. అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు దళిత సర్పంచ్ ఆవేదనను అర్థం చేసుకోకుండానే గ్రామసభను నిర్వహించి వెళ్లిపోయారు. -
వీళ్లు.. మనుషులా.. రాక్షసులా?
అలీగఢ్: పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాడనే నెపంతో ఓ వ్యక్తిని చితక్కొట్టారు. ఏమాత్రం జాలి, కరుణ దయ లేకుండా నిర్ధాక్షిణ్యంగా కిందపడేసి చావు దెబ్బలు కొట్టారు. ఇంత జరుగుతున్న అక్కడ చుట్టూఉన్నవారంతా తాఫీగా ప్రేక్షకులుగా చూస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగు చూసిన ఈ వీడియో పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ వీడియోలో చూపించిన ప్రకారం ఓ యువకుడిని ముందుగా కిందపడేశారు. మరో వ్యక్తి అతడిని కదలకుండా పట్టుకోగా ఓ వ్యక్తి చేతిలో పెద్ద కర్ర తీసుకొని గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ తర్వాత ఓ రాయి తీసుకొచ్చి కాళ్లపైన, ముఖంపైన అదే పనిగా దాడి చేశాడు. దీంతో ఆ యువకుడు సొమ్మసిల్లిపోయాడు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
ఆ ‘పంచాయతీ’ ఎన్నికలు ప్రశాంతం
కెరామెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లోని పరందోలి గ్రామ పంచాయతీకి మంగళవారం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కెరామెరి మండల పరిధిలో పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయతీలు అటు మహారాష్టతోపాటు ఇటు తెలంగాణ ప్రభుత్వాల పాలనలో కొనసాగుతున్నాయి. వీటిలో పరందోలి గ్రామ పంచాయతీకి మంగళవారం జరిగిన ఎన్నికల్లో 1,012 ఓటర్లకు గాను 839 మంది ఓటేశారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఐదు గ్రామాలు ఉన్నాయి. కాగా, ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. -
డుమ్మా కొట్టారు... సస్పెండయ్యారు
ముజఫర్‌నగర్: ఎన్నికల విధులు నిర్వహణకు డుమ్మా కొట్టిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు గురువారం జరిగాయి. మహభారత్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎస్ కె బల్యన్, మరో పాఠశాలకు చెందిన రోహత్ కౌశిక్‌లు ఈ ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. దీంతో వారిద్దరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దాంతో విచారణకు ఆదేశించారు. ఆ వెంటనే వారిని సెస్పెన్షన్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు శుక్రవారం ప్రకటించారు. అనంతరం ఆదేశాలు జారీ చేశారు. అలాగే బల్యన్‌ను జిల్లా టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. -
పల్లెల్లో ఉప పోరు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో పంచాయతీ పోరుకు మళ్లీ తెరలేవనుంది. 2013 సంవత్సరంలో ఎన్నికలు జరగని స్థానాలతో పాటు, పదువులు దక్కించుకున్న అనంతరం మరణించిన వారి స్థానాలను భర్తీ చే సేందుకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మూడు సర్పంచ్, 31వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. తొలుతుగా పోలింగ్స్టేషన్ల జాబితాను ప్రకటించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఆ పనిలో పడ్డారు. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం ఈనెల 19న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ ఏడాది మార్చి 10న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. 2013 సంవత్సరంలో పంచాయతీ ఎన్నికల నిర్వహించిన సందర్బంలో వినియోగించిన గుర్తులనే ఈ ఎన్నికలకు కేటాయించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏర్పాట్లు పూర్తి చేస్తే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆదేశాల్లో పేర్కొంది. అలాగు బడ్జెట్‌ను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ అధికారులు ఉప పోరుకు సన్నాహాలు చేసే పనిలో పడ్డారు. ఎన్నికలు జరిగే స్థానాలు లక్కవరపుకోట మండలం ఖాసాపేట పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి గత ఏడాది మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ రెండు స్థానాలకు అధికారులు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేందుకు ఏ ఒక్క అభ్యర్థీ ముందుకు రాకపోవడంతో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సారి కూడా అవే రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు చెబుతుండడంతో అదే పరిస్థితి పునరావృతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పంచాయతీల్లోని 31 వార్డు అభ్యర్థుల ఎన్నిక జరగనుంది. ఇందులో చీపురుపల్లి మండలం పెదనడిపల్లి పంచాయతీ పరిధిలో గల 10వ వార్డు, చీపురుపల్లి మేజర్ పంచాయతీలో 8వ వార్డు స్థానానికి, ఇదే మండలంలో గల నిమ్మలవలస పంచాయతీ 4వ వార్డుకు ఉప ఎన్నిక జరగనుంది. బొండపల్లి మండలం జి.పి.అగ్రహారం పంచాయతీ పరిధిలో గల 3వ వార్డు, గుర్ల మండలం ఎస్ఎస్ఆర్పేట పంచాయతీలో గల 9వ వార్డు, గుర్ల మండలం గూడెం పంచాయతీలో 8వ వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గంట్యాడ మండలం రావివలస పంచాయతీలో 8వ వార్డుకు, దత్తిరాజేరు మండలం ఎస్బూర్జవలస పంచాయతీలో 4వ వార్డుకు, లక్కవరపుకోట మర్లపల్లి పంచాయతీలో 8వ వార్డుకు, కొత్తవలస మేజర్ పంచాయతీలో మొదటి వార్డు ఎన్నికలు జరిగే జాబితాలో ఉన్నాయి. సాలూరు మండలం నేరళ్లవలస పంచాయతీలో 7వ వార్డు, సీతానగరం మండలం బక్కుపేట పంచాయతీలో 7వ వార్డు , సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలో 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బలిజిపేటమండలం బర్లి పంచాయతీలో 1వ వార్డు, బొబ్బిలి మండలం జగన్నాథపురం పంచాయతీలో 5వ వార్డు, బొబ్బిలి మండ లం ఎంబూర్జవలస పంచాయతీలో 8వ వార్డు, జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం పంచాయతీలో 4వ వార్డు, రామభద్రాపురం మండలం గొల్లపేట పంచాయతీలో 6వ వార్డుకు, గరుగుబిల్లి మండలం పెద్దూరు పంచాయతీలో 4వ వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మెంటాడ మండలం ఉద్దంగి పంచాయతీలో 3వ వార్డు, పూసపాటిరేగ మండలం చింతపల్లి పంచాయతీలో 4, 12 స్థానాలకు, నెల్లిమర్ల మండలం దన్నానపేట పంచాయతీలో 5వ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
సీమాంధ్రలో టీడీపీ ముందంజ
జిల్లా, మండల పరిషత్ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి 653 జెడ్పీటీసీల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 275, టీడీపీకి 373 స్థానాలు 10,092 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీకి 4,199, టీడీపీకి 5,216 హైదరాబాద్: సీమాంధ్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం పార్టీ కొంత ముందంజలో ఉంది. మొత్తం 653 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్సార్ సీపీకి 275, టీడీపీకి 373 స్థానాలు వచ్చాయి. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ పీఠాలను వైఎస్సార్ సీపీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. మిగతా జిల్లాలను టీడీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం వల్ల మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఓట్ల లెక్కింపు సాగింది. తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. గత పదేళ్లు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా జెడ్పీ ఎన్నికల్లో కనిపించలేదు. ఒక్క కర్నూలు జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. సీమాంధ్రలోని మిగతా 12 జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీకి చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క స్థానం దక్కింది. ఇక.. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పన ఇండిపెండెట్లు విజయం సాధించారు. మిగతా 11 జిల్లాల్లో ఎక్కడా ఇండిపెండెంట్లు సత్తా చూపలేకపోయారు. బీఎస్పీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా తదితర పార్టీలు పలు స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఎక్కడా ఒక్క జెడ్పీటీసీ స్థానాన్నీ గెలవలేకపోయాయి. ఎంపీటీసీల ఫలితాలు ఇలా... సీమాంధ్రలోని మొత్తం 10,092 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 11 స్థానాలకు సంబంధించి న్యాయస్థానాల్లో వివాదాలు ఉండటంతో ఆయా స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరగలేదు. మిగతా 10,081 స్థానాల్లో టీడీపీ 5,216 స్థానాలను గెలుచుకోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ 4,199 స్థానాలను కైవసం చేసుకుంది. జెడ్పీటీసీల్లో కేవలం రెండే స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్.. ఎంపీటీసీల్లో కాస్తంత మెరుగ్గా 172 స్థానాలను గెలుచుకోగలిగింది. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కాంగ్రెస్‌కు రెండంకెల సీట్లు రాగా.. మిగతా జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ప్రకాశం జిల్లాలో బోణీ చేయలేకపోయింది. ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కంటే అధికంగా 428 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీల్లో సీపీఎం 24, సీపీఐ 14, బీజేపీ 13, బీఎస్పీ 2 స్థానాలను గెలుచుకున్నాయి. జిల్లా మొత్తం వైఎస్సార్ తెలుగు కాంగ్రెస్ ఇతరులు జెడ్పీటీసీలు కాంగ్రెస్ దేశం పార్టీ }M>Mుళం 38 16 22 0 0 విజయనగరం 34 10 24 0 0 విశాఖపట్నం 39 15 24 0 0 తూర్పుగోదావరి 57 14 43 0 0 ప.గోదావరి 46 3 43 0 0 కృష్ణా 49 15 34 0 0 గుంటూరు 57 23 34 0 0 {పకాశం 56 31 25 0 0 నెల్లూరు 46 31 15 0 0 చిత్తూరు 65 27 37 0 1(జేఎస్పీ) వైఎస్సార్ జిల్లా 50 39 11 0 0 కర్నూలు 53 30 20 2 1 అనంతపురం 63 21 41 0 1 మొత్తం 653 275 373 2 2 జిల్లా మొత్తం వైఎస్సార్ టీడీపీ కాంగ్రెస్ సీపీఐ సీపీఎం బీజేపీ ఇతరులు ఇండి పెండింగ్ ఎంపీటీసీలు కాంగ్రెస్ పెండెంట్లు }M>Mుళం 675 276 351 8 1 1 0 1 37 0 విజయనగరం 549 169 297 60 0 0 1 0 0 0 విశాఖపట్నం 656 254 332 17 3 5 0 1 41 2 తూ.గోదావరి 1063 391 608 2 0 0 0 0 62 0 ప.గోదావరి 903 233 597 2 0 1 3 0 67 0 కృష్ణా 836 328 468 2 3 3 3 0 29 0 గుంటూరు 913 409 469 4 1 3 0 0 26 1 {పకాశం 790 405 344 0 0 0 0 1 34 6 నెల్లూరు 583 308 226 16 1 6 4 0 21 1 చిత్తూరు 901 387 459 4 0 1 1 0 49 0 వైఎస్సార్ జిల్లా 559 341 203 9 0 0 0 0 6 0 కర్నూలు 815 395 333 43 4 4 0 12 23 1 అనంతపురం 849 303 529 5 1 0 0 0 11 0 మొత్తం 10,092 4,199 5,216 172 14 24 13 15 428 11 -
మళ్లీ పంచాయతీ
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. గత ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అభ్యంతరాలు, వివాదాలు తదితర కారణాలతో పలు పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. ఆ పంచాయతీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. ఎన్నికల ప్రధానాధికారి పి.రమాకాంత్‌రెడ్డి విడుదల చేసిన ఉత్తర్వులు జిల్లాకు చేరాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న మండలాల్లో నోటిఫికేషన్ విడుదల నుంచి ఫలితాల వెల్లడి తేది వరకు ‘ఎన్నికల కోడ్’ అమల్లో ఉంటుంది. జిల్లాలో మొత్తం 19 మండలాల్లో ఎన్నికల కోడ్ బుధవారం సాయంత్రం నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే పంచాయతీలు... సర్పంచ్ల స్థానాలు ఇవే... శాసనం (కంచిలి), పట్టుపురం (కోటబొమ్మాళి), బుడితి (సారవకోట), కొల్లివలస (ఆమదాలవలస), బుడుమూరు (లావేరు), చల్లయ్యవలస (పోలాకి), పొన్నుటూరు (కొత్తూరు), సంతబొమ్మాళి గ్రామ పంచాయతీ సర్పంచ్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. బుడుమూరు, సంతబొమ్మాళిల సర్పంచ్‌లు అకాల మృతితో ఎన్నిక జరుగుతోంది. వార్డు స్థానాలు శాసనం (కంచిలి)- మొత్తం 10 వార్డులు, పట్టుపురం (కోటబొమ్మాళి)- 8 వార్డులు, బుడితి (సారవకోట)- 12 వార్డులకు సర్పంచ్ స్థానాలతో సహా పూర్తి పాలకమండలికి ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరు మండలంలోని పొన్నుటూరులో 7వవార్డు, కలిగాంలో 3వ వార్డులకు, బూర్జ మండలంలోని లంకాంలో 6వ వార్డు, లావేరు మండలంలోని పెద్దరావుపల్లిలో 2వ వార్డు, సారవకోట మండలానికి చెందిన కరడశింగిలో 1వ,4వ,7వ వార్డులకు, ఆర్కె.పురంలో 7వ, తొగిరిలో 1వ,3వ,4వవార్డులు, చీడిపూడిలో 4వ వార్డుకు ఎన్నిక జరగనుంది. సంతకవిటి మండలంలోని జిఎన్.పురంలో 1, 6వ వార్డులకు, మెళియాపుట్టి మండలంలోని గంగరాజపురంలో 4వ, 5వ వార్డులకు, పద్ద పంచాయితీలోని 3వ వార్డుకు, కంచిలి మండలం కె.బి.నవగాంలో 5, 6, 7, 9, 10వ వార్డులకు ఎన్నిక జరుగుతుంది. సోంపేట మండలంలోని టి.శాసనాంలో 4వ వార్డుకు, నందిగాం మండలంలోని మహాలింగపురంలో 7వవార్డు, ఇచ్ఛాపురం మండలంలోని పైతారిలో 7వ వార్డుకు, కోటబొమ్మాళి మండలంలోని దంతలో 4వవార్డు, కస్తూరిపాడులో 7వవార్డు, టెక్కలి మండలంలోని ముఖలింగాపురంలో 6వవార్డుకు ఎన్నికలు జరుగుతాయి. కవిటి మండలంలోని కొజ్జీరియాలో 4, జగతిలో 3, 12వ వార్డులకు, డి.జి.పుట్టుగలో 1, 10వ వార్డులకు, వజ్రపుకొత్తూరు మండలంలోని పల్లిసారధిలో 10, పలాస మండలంలోని మామిడిమెట్టలో 7, నరసన్నపేట మండలంలోని జమ్ము పంచాయతీలోని 10వ వార్డుల స్థానానికి ఎన్నిక జరగనుంది. బిజీబిజీగా పంచాయతీ అధికారులు నూతన సంవత్సరం తొలి రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో పంచాయతీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. గతంలోలా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈనెల 3 నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో నేడు సంబంధిత పంచాయతీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను ప్రదర్శనలో పెట్టనున్నారు. ఈమేరకు బుధవారం సాయంత్రమే పంచాయితీ అధికారులకు సమాచారం పంపించారు. వివాదాలు తలెత్తే పంచాయతీల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు సమాలోచనలు ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ జిల్లాలో మొత్తం 8 పంచాయతీ సర్పంచ్ల స్థానాలకు, 66 వార్డు స్థానాలకు ఈనెల 18న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 3 నుంచి 6 వతేది సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 7న ఉదయం11 గంటల నుంచి నామినేషన్ల స్క్రూట్నీ 8న సాయంత్రం 5 గంటల వరకు ఆర్డీవో కార్యాలయంలో పలు అప్పీళ్లు స్వీకరణ, 9న ఆర్డీవో సమక్షంలో అప్పీళ్ల డిస్పోజల్ ఈనెల 10న (మధ్యాహ్నం 3గంటల లోగా) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, తర్వాత తుది జాబితా విడుదల 18న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 18న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి... పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా ఉండాలనేది ప్రధానం. -
పగలకు వేదికలవుతున్న గణేష్ ఉత్సవాలు!
దోమ, న్యూస్‌లైన్: సంతోషంగా జరుపుకోవాల్సిన వినాయక చవితి ఉత్సవాలు పలు గ్రామాల్లో పగలు, ప్రతీకారాలకు వేదికలవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో తలెత్తిన వైషమ్యాలు ఉత్సవాల్లో పడగ విప్పుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర రూపం దాల్చిన విభేదాల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండల పరిధిలోని కిష్టాపూర్ అనుబంధ గ్రామం పలుగు తండాలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, నిమజ్జనం సమయంలో అతడిని శత్రువులే హత్య చేశారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వర్గం నాయకులు కొందరు యువకులను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టించే యత్నం చేస్తున్నారు. మంగళ, గురు వారాల్లో జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో శత్రువులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడడానికి రంగం సిద్ధం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వార్థపూరిత నాయకులు యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళల్లో భజన కార్యక్రమాల పేరుతో అంగడి బజార్లో వినాయకుడిని ఏర్పాటు చేసిన ఓ ముగ్గురు యువకులు పలువురు స్థానికులపై పాత కక్షల నేపథ్యంలో గొడవలకు దిగి దాడులకు పాల్పడడం, బాధితులు స్టేషన్ దాకా వెళ్లడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మండల పరిధిలోని దొంగెన్కెపల్లి, కొండాయిపల్లి, బడెంపల్లి, దిర్సంపల్లి, రాకొండ తదితర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. పలువురు ఉత్సవ కమిటీల నాయకులు ముందు జాగ్రత్త చర్యగా తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం సాయంత్రం 6 గంటల లోపు పూర్తి చేసేలా పోలీసులు కఠిన నిబంధనలు రూపొందించాలని పలువురు కోరుతున్నారు. గొడవలు సృష్టించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే అవాంఛనీయ ఘటనకు తావుండదని చెబుతున్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో లెక్కలు ఇవ్వకుంటే అనర్హులే!
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, న్యూస్‌లైన్: ‘‘మేం గెలుస్తామనుకోలేదు.. ఎ వరికీ పోటీ ఇవ్వలేదు. ఏదో అదృష్టం పరీక్షించుకుందామని పంచాయతీ ఎన్నికల్లో పోటీచేశామంతే!, ఎలాగు గెలిచి తీరాం.. లెక్కలు మాకెందుకు’ అని ఏ మాత్రం నిర్లక్ష్యం వహించారో ఇక అంతే సంగతులు. వారు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా భావించాల్సి ఉంటుం దని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా లెక్క లు మాత్రం విధిగా ఇవ్వాల్సిందే. లెక్కలు ఇవ్వని వారిపై కొరడా ఝుళిపించి మూడేళ్లపాటు వారిని ఎన్నికలకు అనర్హులుగా ప్ర కటించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. లెక్కల విషయం తేల్చేందుకు 45 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు నిబంధనావళి ప్రకారం కచ్చితంగా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి. అయితే జిల్లాలో చాలామంది అభ్యర్థులు ఇప్పటివరకు లెక్కలు చూపలేదు. గతంలో కేవలం గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే అధికారులకు లెక్కలు స మర్పించేవారు. తాజాగా ఓడిపోయిన అ భ్యర్థులు కూడా లెక్కలు చూపాలని అధికార యంత్రాంగం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది పోటీదారులకు సంకటస్థితి ఏర్పడింది. జిల్లాలో 1324 పంచాయతీలు ఉండగా, 13464 వార్డు స్థానాలు ఉన్నా యి. సర్పంచ్ స్థానాలకు 3843 మంది, వార్డు స్థానాలకు 27,655 మంది పోటీచేశారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో చేసిన ఖర్చుల వివరాలను తెలుపాల్సి ఉంది. కాగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఖర్చుల వివరాలు, నమోదు తదితర వాటి నమోదు కోసం మండలానికి ఒక ఆడిటర్‌ను నియమించింది. ఆడిటర్లు ఇచ్చే ఖర్చుల వివరాలను ఆయా ఎంపీడీఓలకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ ఖర్చుల జాబితా వివరాలను నేటికీ జిల్లా శాఖ కార్యాలయాలకు సమర్పించలేదు. విచ్చలవిడిగా డ బ్బు ఖర్చు ఎన్నికల నిబంధనల ప్రకారం 10వేల జ నా భా గల పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థు లు రూ.40వేలు, వార్డు అభ్యర్థులు రూ.10 వేలు, అలాగే మైనార్ పంచాయతీల్లో సర్పంచ్ అ భ్యర్థులు రూ.10 వేలు, వార్డు అభ్యర్థులు ఐదువేలను ఎన్నికల కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. అయితే జిల్లా లో గతనెల 23, 27, 31 తేదీల్లో మూడు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో మేజర్, మైనర్ పంచాయతీ అనే తేడా లేకుండా చాలా మంది లక్షల్లో ఖర్చుచేశారు. మద్యం ఏరులై పారింది. కొన్నిచోట్ల డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేయ గా.. మరికొన్ని చోట్ల చీరలు, ఇతర వస్త్రా లు పంపిణీ చేశారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో రూ.10లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చుచేశారు. వీటన్నింటికి అభ్యర్థులు లెక్కలు ఎలా చూపుతారో వేచిచూడాల్సిందే.. 45 రోజల్లో సమర్పించాలి.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధిం చిన ఖర్చుల వివరాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే వారిపై అనర్హత వేటువేయక తప్పదు. లెక్కలు సమర్పించేందుకు ప్రభుత్వం 45 రోజుల గడువు విధించింది. జాబితాను ఎంపీడీఓల ద్వారా తీసుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. - రవీందర్, డీపీఓ -
రెండు గ్రామాల్లో నేడే ఎన్నికలు
ఇందూరు,న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికలు రద్దయిన గ్రామాల్లో గురువారం జరుగనున్నాయి. వేలం పాటలు నిర్వహించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ నిజామాబాద్ డివిజన్ వేల్పూర్ మండలం కోమన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరిగి వీటికి ఆగస్టు 8న ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ,తిరస్కరణలు పూర్తయ్యా యి. కోమన్‌పల్లిలో సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎనిమిది వార్డు స్థానాలకు గాను ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా మూడింటికి ఎన్నికలు నిర్వహిం చనున్నారు. అలాగే వెంకటాపూర్‌లో సర్పం చ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ పంచాయతీలోనూ ఎనిమిది వార్డు స్థానాలకు ఐదు ఏకగ్రీవం కాగా, మిగతా వాటికి ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ఉదయం7 గంటలకు ప్రాంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటల లోగా ఫలి తాలు వెలువడుతాయి. -
పల్లె పీఠంపై నారీమణులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పంచాయతీ సమరంలో మహిళ లే పైచేయి సాధించారు. పంచాయతీ రాజ్ ప్రాతినిథ్య చట్ట సవరణతో తొలి సారిగా 50 శాతం స్థానాల్లో పోటీచేసే అవకాశం మహిళలకు దక్కింది. దీంతో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పంచాయతీల్లో ఓటర్లు పెద్ద పీట వేశారు. జిల్లాలో 1,066 పంచాయతీలకు గాను 533 సర్పంచ్ పదవులను మహిళలకు రిజర్వు చేశారు. రెండు చోట్ల ఎన్నిక వాయిదా పడటంతో 1,064 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ కోటా కంటే అదనంగా మరో 35 పంచాయతీల్లో మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. సాధారణంగా రిజర్వుడు స్థానాల్లో చక్రం తిప్పేందుకు చోటా మోటా నేతలు ఉప సర్పంచ్ పదవిపై కన్నేస్తూ వుంటారు. అయితే సుమారు 27 శాతం పంచాయతీ ల్లో మహిళలే ఉప సర్పంచ్ పదవులు చేపట్టారు. 10,444 వార్డుల్లోనూ సగానికి పైగా స్థానాల్లో మహిళలకు ప్రాతినిథ్యం దక్కింది. సుమారు 50 పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవుల్లో మహిళలే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో పాలన ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అందరూ మహిళలే.. నారాయణఖేడ్ మండలం పైడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఎనిమిది వార్డులకు గాను నాలుగుచోట్ల మహిళలకు కేటాయించారు. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవితో పాటు అన్ని వార్డుల్లోనూ మహిళలనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా క్యాస సంధ్యారాణి, ఉప సర్పంచ్‌గా మాదారం పద్మమ్మ, వార్డు సభ్యులు పల్లె సునీత, ఎండీ ఇస్మాయిల్ బీ, గొట్టపు లక్ష్మి, బేలూరు నర్సమ్మ, పొట్పల్లి బసమ్మ, మూలిగె బసమ్మ, అశ్విని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఇద్దరు పురుషులు ముందుకు వచ్చినా గ్రామస్థులు నచ్చజెప్పారు. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం లక్ష్యంగా పనిచేస్తామంటూ పంచాయతీ పాలకమండలి ముక్తకంఠంతో చెప్తోంది. పురుషుల చేతుల్లోనే? సంఖ్యాపరంగా పంచాయతీల్లో మహిళల ప్రాతినిథ్యం సగానికిపైగా ఉన్నప్పటికీ పాలనలో పురుషుల జోక్యం తప్పేలా లేదు. చాలాచోట్ల భర్తలు, కుమారులు, సోదరులు చక్రం తిప్పుతుండటంతో కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్ల పాలనపై ఆసక్తి నెలకొంది. పంచాయతీ పాలన, నిధులు, విధులు తదితరాలపై అవగాహన లేకపోవడం కొత్త సమస్యలకు దారితీసేలా ఉంది. శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు పాలనపై అవగాహన కలిగించేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. పాలన, విధులు, చట్టాలు తదితరాలపై రూపొందించిన ప్రత్యేక మెటీరియల్‌ను అందజేస్తాం. మహిళలు సర్పంచ్‌గా వున్న చోట స్వయం నిర్ణయాధికారం అలవడేలా శాయశక్తులా ప్రయత్నిస్తాం. - డీపీఓ అరుణ