రెండు గ్రామాల్లో నేడే ఎన్నికలు | Grama panchayati elections in two villages | Sakshi
Sakshi News home page

రెండు గ్రామాల్లో నేడే ఎన్నికలు

Published Thu, Aug 8 2013 4:40 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Grama panchayati elections in two villages

ఇందూరు,న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికలు రద్దయిన గ్రామాల్లో గురువారం జరుగనున్నాయి. వేలం పాటలు నిర్వహించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ నిజామాబాద్ డివిజన్ వేల్పూర్ మండలం కోమన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరిగి వీటికి ఆగస్టు 8న ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నామినేషన్‌ల స్వీకరణ,తిరస్కరణలు పూర్తయ్యా యి. కోమన్‌పల్లిలో సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎనిమిది వార్డు స్థానాలకు గాను ఐదు వార్డులు ఏకగ్రీవం కాగా మూడింటికి ఎన్నికలు నిర్వహిం చనున్నారు. అలాగే వెంకటాపూర్‌లో సర్పం చ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ పంచాయతీలోనూ ఎనిమిది వార్డు స్థానాలకు ఐదు ఏకగ్రీవం కాగా, మిగతా వాటికి ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ఉదయం7 గంటలకు ప్రాంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటల లోగా ఫలి తాలు వెలువడుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement