sarpanch
-
వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు. -
ఆదుకునేవారు లేక అనాథగా మాజీ సర్పంచ్
కామారెడ్డి: కొందరు ప్రజాప్రతినిధుల్లా పర్సంటేజీలకు ఆశపడలేదు..ఆస్తులు అంతస్తులు కూడగట్టుకోలేదు ఆ మాజీ మహిళా సర్పంచ్. గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులను కూడా వెచ్చించింది. ప్రస్తుతం ఆదుకునేవారు లేక అనాథగా మారింది. రామారెడ్డి మండలం కన్నాపూర్ సర్పంచ్‌గా బాల్‌రాజవ్వ 2006 నుంచి 2011 వరకు పనిచేసింది నీటి సమస్య పరిష్కారానికి బోరుబావులను తవ్వచింది. ఇటీవల కాలంలో భర్త చనిపోయాడు. ఉన్న ఇల్లు కాస్త కాలిపోవడంతో గ్రామ కచేరీ ఆ మాజీ సర్పంచ్‌కు నివాస గృహంగా మారింది. ఆ ఊరి ప్రజలే అన్నం పెట్టి సాదుతున్నారు. భర్త చనిపోయిన తర్వాత బాల్‌రాజవ్వ మానసిక పరిస్థితి బాగాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. బాల్‌రాజవ్వ ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు చనిపోగా, మరో కూతురు ఉన్నా, పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అండగా నిలిచి బాల్రాజవ్వకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే వైద్యం అందించాలని కోరుతున్నారు. -
మాజీ సర్పంచ్ దారుణ హత్య.. నూతనకల్ మండలంలో ఉద్రిక్తత
సాక్షి,సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిర్యాల మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్(61) పై గొడ్డలితో దుండగుల దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన బాధితుణ్ని అతని కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.అయితే హత్యకు పాల్పడిన నిందితుల ఇంటిపై బాధితుడి బంధువుల దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు మోహరించారు. -
అమెరికాలో రోడ్డుప్రమాదం తెలంగాణ వాసులు దుర్మరణం
-
సర్పంచ్‌గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వగ్రామానికి తరలివచ్చాడు. మెదక్ జిల్లా (Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ అమెరికాలో పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా (Software Engineer) పనిచేస్తున్నారు. గతంలో 25 ఏళ్లు చిన్నశంకరంపేట సర్పంచ్‌గా పనిచేసిన తన తాత శంకరప్ప స్ఫూర్తితో.. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పించారు. దీంతో చంద్రశేఖర్ దంపతులు అమెరికా నుంచి బుధవారం చిన్నశంకరంపేట (Chinna Shankarampeta) చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు అనంత పద్మనాభస్వామి గుట్ట నుంచి సోమేశ్వరాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వారికి స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తాత స్ఫూర్తితో గ్రామానికి సేవ చేసేందుకు స్వగ్రామానికి వచ్చానని చంద్రశేఖర్ తెలిపారు.చదవండి: లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు -
పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!
‘ఒక దేశ ఉజ్వల భవిష్యత్ ఆ దేశ గ్రామీణాభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది’ అనేది తిరుగులేని చారిత్రక సత్యం.పల్లెపచ్చగా కళ కళలాడాలంటే, ఆకలి డొక్కలతో పట్నానికి వలసపోకుండా ఉండాలంటే.. పల్లెతల్లిని కంటిపాపలా కాపాడుకోవాలి. ఈ మహిళా సర్పంచులు అదే పని చేశారు. గ్రామ ఆర్థికవృద్ధి నుంచి సర్వతోముఖాభివృద్ధి వరకు అంకితభావంతో పనిచేశారు. వారి సేవలకు గుర్తింపుగా ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం రావడమే కాదు, అక్కడకు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ‘ఉత్తమ గ్రామ సర్పంచ్’ అవార్డ్ అందుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన వేదికపై ప్రసంగించారు.ఘనత అనేది ‘నేను ఈ ఊరి సర్పంచు(Sarpanch)ని’ అని ఘనంగా చెప్పుకోవడంలో ఉండదు. సర్పంచుగా ఆ ఊరికి ఎలాంటి మంచి పనులు చేశారనేదే అసలు సిసలు ఘనత. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మేజర్ పంచాయతీల్లో ఒకటైన ఈడుపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పి.ఇందిర ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులను చేపడుతోంది. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది.అర్హులకు సంక్షేమ పథకాలు అందించటం, హర్‌ఘర్ జల్ యోజన, మిషన్ ఇంద్రధనుష్, ప్రధాన మంత్రి జెన్ ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, పీఎం మాతృవందన యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం పోషణ యోజన, పీఎం ముద్ర యోజన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సద్వినియోగంలో 90 శాతానికి పైగా ప్రగతి సాధించారు.‘ఉత్తమ సర్పంచ్‌గా ఢిల్లీ(Delhi)లో రాష్ట్రప(President)తి సమక్షంలో అవార్డు అందుకోవడం, ప్రసంగించే అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నా బాధ్యతను రెట్టింపు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం దిశగా మరింత అంకితభావంతో పని చేస్తాను’ అంటోంది ఇందిర.మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి...గ్రామ పంచాయతీలో లేబర్ కాంట్రాక్టరుగా, గుమస్తాగా పనిచేసిన తన భర్త అనుభవాన్ని కూడగట్టుకొని తన ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం లో విజయం సాధించింది ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం పొందుగల గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు కోటమ్మ. ఉత్తమ గ్రామ సర్పంచ్‌గా ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ(Republic day) వేడుకలలో అవార్డ్ అందుకుంది. వేదిక ఎక్కి ప్రసంగించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, టాటాట్రస్టు సహకారం, జలజీవన్ మిషన్ నిధులు... ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రూ.40 కోట్లతో గ్రామ అభివృద్ధి, సంక్షేమంపై ఖర్చు చేసింది. జలజీవన్ మిషన్‌లో భాగంగా రెండు వాటర్ ట్యాంకులు, ఇంటింటికి సురక్షితమైన నీటిని అందించేందుకు గ్రామంలో 350 ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేసింది. టాటా ట్రస్టు సహకారంతో ఐఓటీ సిస్టమ్ ఏర్పాటు చేసి నీటి సరఫరా లెక్కింపుతోపాటు క్లోరినేషన్ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చేసిన మొదటి గ్రామంగా పొందుగలను నిలిపింది. నీటి వినియోగం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు, సేంద్రియ ఎరువుల తయారీలో విజయం సాధించింది. ‘ఊరు అంటే సొంత తల్లిలాంటిది. మా అమ్మ ఎప్పుడూ బాగుండాలి. అందుకోసం ఎంతైనా కష్టపడతాను’ అంటుంది గుగులోతు కోటమ్మ.– ఇ.శివప్రసాద్, సాక్షి, కంకిపాడు, వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి, సాక్షి, జి.కొండూరుకార్పొరేట్ వరల్డ్ నుంచి పల్లె ప్రపంచానికి...ఎంబీఏ(MBA) చేసిన చేబ్రోలు లక్ష్మీమౌనిక మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్(Medical Transcription) సంస్థలో ఉద్యోగం చేసింది. ఆ తరువాత పంచాయితీ ఎన్నికల బరిలోకి దిగి పదివేల జనాభా, నాలుగు శివారు గ్రామాలతో కూడిన కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి మేజర్ గ్రామపంచాయతీకి సర్పంచ్‌గా ఎన్నికయ్యింది. హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటు, గృహసముదాయాల పన్నుల ద్వారా గ్రామపంచాయతీ వార్షిక ఆదాయాన్ని రూ. 45 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెంచింది. గ్రామంలో పారిశుధ్య వ్యవస్ధను మరింత మెరుగు పరచడంతోపాటు సుమారు రూ. 2 కోట్లు వ్యయంతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, కొత్తగా తాగునీటి పైపులైన్లను ఏర్పాటు చేసింది. మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె సేవలను గుర్తించిన పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు దిల్లీలో జాతీయస్థాయిలో జరిగిన గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళికలపై జరిగిన వర్క్‌షాప్‌కు ఆంధ్రప్రదేశ్ నుండి లక్ష్మీమౌనికను ఎంపిక చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఈ వర్క్‌షాపుకు హాజరైన లక్ష్మీమౌనిక తన అభిప్రాయాలను తెలియజేసింది. మైసూర్లో జరిగిన ‘పంచాయతీరాజ్ వ్యవస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం’పై జరిగిన జాతీయ సదస్సుకు కూడా లక్ష్మీమౌనిక ఎంపికయింది.– కొడాలి ప్రేమ్‌చంద్, సాక్షి, గన్నవరం (చదవండి: వందేళ్ల నాటి పైథానీ చీరలో బరోడా మహారాణి రాధికా రాజే..! అచ్చమైన బంగారంతో..) -
ఏసీబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ
-
యువకులపై ఏనుగుల దాడి..ఒకరు మృతి
-
తెలంగాణ మాజీ సర్పంచ్ల ఆందోళన
-
మాజీ సర్పంచులు అరెస్ట్ .. అసలు కారణం ఇదే ?
-
ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులతో మహిళా VRO ఆత్మహత్యాయత్నం
-
ఇంగ్లిష్ స్పీచ్‌తో అదరగొట్టిన మహిళా సర్పంచ్..ఆశ్చర్యపోయిన ఐఏఎస్ ఆఫీసర్!
ఓ సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఇంగ్లీష్ స్పీచ్‌కి అందరూ ఫిదా అయ్యిపోయారు. ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఆమె ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..రాజస్తాన్ బార్మర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి గౌరవ అతిథిగా కలెక్టర్ టీనాదాబి విచ్చేశారు. ఆ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ సోను కన్వర్ రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి కలెక్టర్‌కి ఆంగ్లంలో స్వాగతం పలికింది. " ఈరోజులో తాను కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నాను. ముందుగా మా కలెక్టర్ టీనా మేడమ్ స్వాగం పలుకుతారు. ఓ మహిళగా ఆమెను స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నా" అంటూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నీటి సంరక్షణపై కూడా ప్రసంగించింది. ఆ వేదికపై మహిళా సర్పంచ్ అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. అంతేగాదు ఒక్కసారిగా ఆ వేదిక మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆ సర్పంచ్ ఆంగ్ల భాషా నైపుణ్యం చూసి టీనా సైతం ఆశ్చర్యంగా అలా చూస్తుండిపోయారు. కాగా, 2015లో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (UPSC) పరీక్షలో తన మొదటి ప్రయత్నంలోనే అగ్రస్థానంలో నిలిచి కలెక్టర్‌గా అజ్మీర్ నుంచి కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం టీనా దాబీ జైపూర్‌లో ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవలే బార్మర్ జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. बाड़मेर में IAS टीना डाबी @dabi_tina के सामने जब राजपूती पोशाक और घूँघट में जालीपा महिला सरपंच सोनू कँवर ने जब अपना उद्बोधन अंग्रेज़ी से शुरू किया तो उपस्थित सब लोग चौंक गए और टीना डाबी के चेहरे की मुस्कान बयां कर रही है l..जिला कलेक्टर खुद को ताली बजाने से नही रोक पाए pic.twitter.com/fLYuo0gqJo— Kailash Singh Sodha (@KailashSodha_94) September 14, 2024 (చదవండి: రైతాలో ఉల్లిపాయలు జోడించి తీసుకుంటున్నారా..!) -
పెరిగిపోతున్న టీడీపీ అరాచకాలు.. గ్రామ సభలో వైఎస్సార్సీపీ సర్పంచ్ పై దాడి
-
టీడీపీ దాడిపై వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆవేదన
-
పంద్రాగస్టుకు ఎర్రకోటపై నారీశక్తి ప్రదర్శన
ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈసారి ఎర్రకోటపై జరిగే వేడుకలలో నారీశక్తి ప్రదర్శన ప్రధాన ఆకర్షణ కానుంది. వివిధ సమస్యల నుంచి తమ పంచాయతీలకు విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రతినిధులు ఎర్రకోట నుంచి మహిళా సాధికారత సందేశాన్ని ఇవ్వనున్నారు.పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలవారీగా ఎంపికచేసిన 150 మంది మహిళా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీ అధ్యక్షురాళ్లు, జిల్లా పంచాయతీ అధ్యక్షురాళ్లు తదితర మహిళా పంచాయతీ ప్రతినిధులు ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సత్కరించనుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పాటుపడుతోంది.ఇటీవల పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖ రాసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆయా రాష్ట్రాలకు చెందిన మహిళా పంచాయతీ ప్రతినిధులను ఆహ్వానించింది. వీరికి ఆగస్టు 14న న్యూఢిల్లీలోని డాక్టర్ భీంరావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి ‘పంచాయతీరాజ్‌లో మహిళా నాయకత్వం’ అనే అంశంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. -
పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్, షోపియాన్లలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ అజాజ్ అహ్మద్ షేక్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం షోపియాన్‌లోని హీర్పోరాలో చోటుచేసుకుంది. #WATCH | Anantnag, J&K: Terrorists fired upon and injured a lady Farha, resident of Jaipur and spouse of Tabrez at Yannar. Injured evacuated to hospital for treatment.(Video source: Local) https://t.co/7UUq9YXR8Y pic.twitter.com/im1NZ2hSEm— ANI (@ANI) May 18, 2024 జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజాజ్ అహ్మద్ షేక్ ఇటీవలే బీజేపీలో చేరారు. అతనిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటన అనంత్‌నాగ్‌లో చోటుచేసుకుంది. ఇక్కడి యన్నార్ ప్రాంతంలో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఫర్హా అనే మహిళ, ఆమె భర్త తబ్రేజ్‌లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలు జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఈ రెండు ఉగ్రవాద దాడులపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో తన స్పందనను తెలిపారు. ‘ఈరోజు పహల్గామ్లో ఇద్దరు పర్యాటకులు గాయపడిన ఘటనను, షోపియాన్‌లోని హీర్పోరాలో సర్పంచ్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.Terrorist fired upon a person Aijaz Ahmad at Heerpora, Shopian. Injured evacuated. Area cordoned off. Further details to follow: Kashmir Zone Police pic.twitter.com/Y31BJouz0J— ANI (@ANI) May 18, 2024 -
ఐరాసలో జగన్ విజన్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పక్షపాతం, పైరవీలకు, అవినీతికి తావులేకుండా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లే విప్లవాత్మక పాలనా సంస్కరణలతో పాటు మహిళా సాధికారత లక్ష్యంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి ఆవిష్కృతమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించడం.. మహిళా సాధికారిత కోసం ఆయా దేశాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై ఐరాస ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకు హేమకుమారి హాజరయ్యారు. ఈమెతోపాటు త్రిపురకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్ దత్తా, రాజస్థాన్‌కు చెందిన మరో సర్పంచ్ నీరూ యాదవ్‌లు ‘లోకలైజింగ్ ది ఎస్డీజీ–‘విమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లీడ్ ది వే’ పేరుతో జరిగిన సదస్సులో మహిళా సాధికారిత కోసం భారత్‌లో జరుగుతున్న కార్యక్రమాలపై వీరు తమ ప్రజంటేషన్ ఇచ్చారు.ఈ సందర్భంగా కుసుమ హేమకుమారి ఏపీలో మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే దిశగా సీఎం జగన్ అమలుచేసిన వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రస్తావించారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మహిళల అప్పు మొత్తం రూ.25,570.79 కోట్లను నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆయా మహిళలకు అందజేసిందని చెప్పారు. దీంతోపాటు పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించే వారికి వారి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే భరించే సున్నావడ్డీ పథకాన్ని కూడా ఆమె ఈ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు.పేద మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించేలా..ఇక సొంతంగా వ్యాపార అవకాశాలు మెరుగుపరుచుకోవడం ద్వారా పేద మహిళలు తమ కలలను సాకారం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు.. మహిళలు ఉన్నత చదువులు చదువుకునేందుకు వీలుగా విద్యాదీవెన వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సైతం లక్పతీ దీదీ లాంటి కార్యక్రమాలు చేపట్టిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో తమ గ్రామంలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు హేమకుమారి వివరించారు.అలాగే, పౌష్టికాహరంపై గర్భిణీలకు అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వమే వారికి పోషకాçహారం అందిస్తూ మాతా, శిశు మరణాల నివారణకు చేపట్టిన కార్యక్రమాలను ఆమె చెప్పారు. ఆర్నెల్ల క్రితం 2023 సెప్టెంబరులో ఇదే వేదికపై జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో మన రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ పాఠశాలల పేద పిల్లలు హాజరైన విషయం తెలిసిందే. వీరు కూడా రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు.‘స్థానిక’ ప్రభుత్వాల్లో 46 శాతం మంది మహిళలే.. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ మాట్లా డుతూ.. భారత్‌లో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 46 శాతం మంది మహిళలేనని తెలిపారు. అలాగే, దేశంలో బాల్య వివాహాలను నిరోధించడం, విద్యను ప్రోత్సహించడం, ఆర్థికంగా నిలదక్కుకోవడం.. జీవనోపాధి అవకాశాలు కల్పించడం.. పర్యావరణ సుస్థిరత.. క్రీడలు వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రభుత్వాల స్థాయిలో కూడా మహిళలు, బాలికలకు సాధికారత కల్పించే కార్యక్రమాలను త్రిపుర, రాజస్థాన్ నుంచి హాజరైన ప్రతినిధులు వివరించారు. -
ఐరాస సదస్సుకు ఏపీ సర్పంచ్
సాక్షి, అమరావతి: అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీన నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ (సీపీడీ) సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారికి దక్కింది. ‘భారత్‌లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐరాస నుంచి ఆహా్వనం అందింది. మే 1వ తేదీన ఆమె న్యూయార్క్‌కు బయలుదేరతారు. హేమకుమారి 2021 ఏప్రిల్‌లో పేకేరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజీలో 2014–19 మధ్య ఐదేళ్లపాటు ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్‌గా పనిచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేసింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమారితో పాటు తిప్రుర రాష్ట్రానికి చెందిన సెపాహిజాల జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్‌దత్తా, రాజస్థాన్‌లోని ఝుంజున్ జిల్లా లంబిఅహీర్ సర్పంచ్ నీరూ యాదవ్‌కు ఆహా్వనాలు అందాయి. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి భారత్ ప్యానల్ తరఫున మన రాష్ట్రంలోనూ, దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతారు. జగన్ పాలనలో అంతర్జాతీయ వేదికలపై అరుదైన గౌరవాలు ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నతస్థాయి అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి అనేక ఆరుదైన గౌరవాలు దక్కాయి. 6 నెలల క్రితం న్యూయార్క్ నగరంలోని యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే లారీ డ్రైవర్ కూతురు, సెక్యూరిటీ గార్డు కూతురు, కౌలు రైతు కొడుకు తదితర 10 మంది పేద విద్యార్థులకు అవకాశం దక్కింది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. మనబడి నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. బడిలో స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి సర్కారు బడి స్థాయిని కూడా ప్రైవేట్ అంతర్జాతీయ స్కూళ్ల స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు సైతం ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనే స్థాయికి ఎదిగారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
సర్పంచ్‌లకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్/ ఢిల్లీ, సాక్షి: తెలంగాణ సర్పంచ్‌లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేపటి నుంచి తమ స్థానంలో ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టును స్టే కోరారు వాళ్లు. అయితే.. అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్ తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. తెలంగాణలో సర్పంచుల పదవీకాలం నేటితో ముగియనుంది. వాళ్ల స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను(శిక్షణతో సహా) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికలు జరిగేంత వరకు తమ పదవీకాలం పొడిగించాలని సర్పంచ్‌లు విజ్క్షప్తి చేయగా.. ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ ఎన్నికల నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే.. ప్రత్యేక అధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: డ్యూటీ ఎక్కకముందే స్పెషల్ ఆఫీసర్లకు వార్నింగులా? ఇక రేపటి నుంచి ప్రత్యేక అధికారులు రంగంలోకి దిగతుండడంతో.. ఇవాళే అన్ని గ్రామ పంచాయితీలలో హడావిడి నెలకొంది. జనరల్ బాడీ సమావేశాలు పెట్టి.. హుటాహుటిన పెండింగ్ అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుకుంటున్నాయి ఆ గ్రామ పంచాయితీలు. ఇప్పటికే వాళ్ల వద్ద ఉన్న రికార్డులను, స్టాంప్స్ అండ్ లెటర్ ప్యాడ్స్ సరెండర్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో.. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్స్ అధీనంలోకి గ్రామ పంచాయితీలు వెళ్లనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల లోపు అన్ని గ్రామ పంచాయితీలలో ఛార్జ్ తీసుకోనున్నారు ప్రత్యేక అధికారులు. ఇప్పటి వరకు సర్పంచ్ ఉపసర్పంచ్ లకు జాయింట్ గా చెక్ పవర్స్ ఉండగా.. రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ - విలేజ్ సెక్రెటరీకి ఆ పవర్ బదిలీ అవుతుంది. ఇక.. ఎల్లుండి(ఫిబ్రవరి 2వ తేదీ) స్పెషల్ ఆఫీసర్స్ తో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తిరిగి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేంతవరకు పంచాయితీలన్నీ వీళ్ల పర్యవేక్షణలోనే పని చేస్తాయి. కిషన్‌రెడ్డి అభ్యంతరం ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించడం రాజ్యాంగానికి విరుద్ధమని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో స్పెషల్ ఆఫీసర్ల తో గ్రామ పంచాయితీల పాలన రాజ్యాంగానికి విరుద్ధం. ఎన్నికలు నిర్వహించలేకపోతే ఇప్పుడున్న సర్పంచులనే కొనసాగించాలి. గ్రామ పంచాయితీలు లేకుంటే గ్రామ సభలు ఎలా పెడతారు?. లబ్ధిదారుల ఎంపికకు గ్రామ సభలనేవి తప్పనిసరి. ఎన్నికల లోపే గ్రామ సభల్లో లబ్ధి దారుల ఎంపిక పూర్తి చేసి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి’’ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. -
నాడు సర్పంచ్.. నేడు న్యాయమూర్తి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కర్రి సంతోషలక్ష్మి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. సంతోషలక్ష్మి ఇదివరకు సర్పంచ్‌గా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత న్యాయ శాస్త్రం చదివి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే న్యాయమూర్తి కావాలన్న ఆశయంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం విడుదలైన జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భర్త దువ్వాడ వెంకటకుమార్ చౌదరి ప్రోత్సాహంతో ఆమె విజయం సాధించారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడంపై అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వ వీసీ హనుమంతు లజపతిరాయ్, రాజ్యలక్ష్మి, పీఎసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ మధుకేశ్వరరావు, సర్పంచ్ దువ్వాడ పద్మావతి, ఎంపీటీసీ బమ్మిడి రాజ్యలక్ష్మి, బి.మోహన్‌రావు, దువ్వాడ జయరాం చౌదరి తదితరులు అభినందనలు తెలియజేశారు. -
ఈ సర్పంచ్ వెరీ స్పెషల్
రాజకీయాన్ని సంపాదనకు మార్గం అనుకునే ప్రస్తుత రోజుల్లో ఓ సర్పంచ్ తీరు ఆదర్శంగా నిలిచింది. సరైన రోడ్డు సదుపాయం లేక గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించిన ఆమె తన సొంత నిధులతో వంతెన నిర్మించారు. నాతవరం మండలంలోని వైబీ అగ్రహారం ఊరగెడ్డపై సర్పంచ్ కోసూరి విజయ నిర్మించిన వంతెన గ్రామస్తుల వెతలను తొలగించింది. వారి మన్ననలు పొందేలా చేసింది. అనకాపల్లి: మండలంలోని వైబీ అగ్రహారం పంచాయతీకి దశాబ్దాలుగా సరైన రోడ్డు సదుపాయం లేదు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనే లేదు. ఈ పంచాయతీ మొదటి నుంచీ టీడీపీకి కంచుకోట. టీడీపీ మండల అధ్యక్షుడే ఈ గ్రామానికి 15 ఏళ్లుగా సర్పంచ్. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పంచాయతీని ఈసారి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఆశీస్సులతో కోసూరి విజయ గెలిచారు. ఇంతటి నమ్మకాన్నిచ్చిన పంచాయతీ ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోయే మంచి పని చేయాలని సర్పంచ్ విజయ, ఆమె భర్త బుజ్జి నిర్ణయించుకున్నారు. 5 కి.మీ. దూరం తగ్గింది దీంతో గ్రామానికి అనుకుని ఉన్న ఊరగెడ్డపై వంతెన నిర్మిస్తే మండల కేంద్రానికి వెళ్లే దూరం 5 కి.మీ. తగ్గనుండటంతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తమ సొంత నిధులు రూ.3.40 లక్షలు వెచ్చించి వంతెనతోపాటు, అనుసంధాన రోడ్డును పూర్తి చేశారు. వంతెన అందుబాటులోకి రావడంతో మండల కేంద్రానికి వెళ్లే దూరం, సమయం తగ్గడంతోపాటు, ఈ ప్రాంతంలో సుమారుగా 500 ఎకరాల భూముల్లో రైతుల పండించే వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఇపుడు ఒకటిన్నర కి.మీ. ప్రయాణిస్తే పంట ఉత్పత్తుల్ని గమ్యస్థానానికి చేరవేయొచ్చు. మరోవైపు నాయుడుపాలెం, మన్యపురట్ల, లింగంపేట, మండల కేంద్రం నాతవరానికి దగ్గర దారి ఏర్పడింది. పెరిగిన భూముల ధరలు వంతెన నిర్మాణంతో చుట్టు పక్కల వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు మార్గం సుగమం కావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంత భూముల ధరలు పెరిగిపోయాయి. నేరుగా పంట పొలాల్లోకి వాహనాలు పోయే మార్గం ఏర్పాటయింది. సర్పంచ్ తన సొంత నిధులతో నిర్మించిన వంతెనను ఆర్భాటాలకు తావులేకుండా వార్డు సభ్యులు, గ్రామపెద్దలతోనే ప్రారంభించి, రాకపోకలు సాగించడం గమనార్హం. దీనిపై సర్పంచ్ విజయ సాక్షితో మాట్లాడుతూ తనకు ఎలాంటి ప్రచారం వద్దని, గ్రామస్తుల హృదయాల్లో తాము చేసిన మంచి నిలిచిపోతే చాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అఽందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
సర్పంచ్ల సతమతం..
నేలకొండపల్లి: పంచాయతీల్లో నిధుల్లేక పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చెత్త తరలించే ట్రాక్టర్లు ఇంధనం నింపడానికి డబ్బులేవు. గుప్పెడు బ్లీచింగ్ పౌడర్ చల్లలేని పరిస్థితి నెలకొంది. 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధా రణ నిధులను గత ప్రభుత్వం తీసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణకు ముందుగా నిధులు ఖర్చు చేసి బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు మన ఊరు – మన బడి, పల్లె ప్రగతి పనులకు కూడా ప్రజాప్రతినిధులే ఖర్చుచేశారు. పనులు పూర్తయ్యాక అధికారులు పరిశీలించాల్సి ఉంది. బిల్లులు కార్యదర్శులు ఖజానాకు అప్లోడ్ చేసిన తరువాత కార్యదర్శి, సర్పంచ్‌లు సంయుక్తంగా సంతకం చేసి నిధులు తీసుకోవాల్సి ఉంటుంది. ఖజానాలో ఏడాదికి పైగా సరిపడా నిధుల్లేక సర్పంచ్‌లు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పంచాయతీల్లో చిన్న సమస్యల పరిష్కారానికి ఉపయోగించే సాధారణ నిధులు (జనరల్ ఫండ్) సైతం లేక సర్పంచ్‌లు ఏమీ చేయలేకపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 గ్రామ పంచాయతీల్లో చాలామంది సర్పంచ్‌లు రూ.లక్షలు అప్పు చేసి అభివృద్ధి పనులు చేశారు. కొన్ని చోట్ల చెక్కులు పంపించినప్పటికీ పాసింగ్ కాక నానా అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రూ.కోట్ల పెండింగ్ బిల్లుల వస్తాయా? లేదా అనే అనుమానంతో సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు పదవీ కాలం ముగిసే గడువు దగ్గరకు వచ్చింది. జవనరి 31తో వారి పదవీ కాలం అయిపోతుండటంతో చేసిన పనులకు బిల్లుల పరిస్థితి ఏమిటో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. పాలకవర్గాలు ఏర్పడిన తరువాత కరోనా వెంటాడి రెండేళ్ల పాటు ఏమీ చేయలేని పరిస్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. మిగతా సమయంలో అప్పటి పాలకులు పంచాయతీలను చిన్న చూపు చూశారని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఒక పక్క పాలకవర్గాల గడువు ముంచుకొస్తోంది. కేవలం 41 రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రతీ పంచాయతీ సర్పంచ్ అప్పులు చేసి అభివృద్ధి చేసిన వాటికి బిల్లులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఈలోగా బిల్లుల బకాయిలు చెల్లించకుంటే ఎన్నికల తరువాత కొత్త, పాత వారికి మధ్య భేదాభిప్రాయాలతో పల్లెల్లో మరో పంచాయితీ మొదలయ్యే అవకాశాలు ఉంటాయిని పలువురు చెబుతున్నారు. -
19 ఏళ్లకే సర్పంచ్ ఆమె!..మద్యానికి బానిసైన తండ్రి, కటిక దారిద్యం..
చిన్నతనంలో చెప్పలేనన్ని కష్టాలు ఫేస్ చేసింది ఆమె. నిత్యం మద్యం సేవించే తండ్రి, దారుణమైన పేదరికంతో పలుబాధలు పడింది. మూడో తరగతి నుంచి చదువు మానేయక తప్పని స్థితి. బాల్యంలోనే పెళ్లి చేస్తారేమోనన్న భయంతో బిక్కుబిక్కుమంది. తన జీవితం మారకపోతుందా అనే ఆశతో అలానే కాలం వెళ్లదీస్తూ ఉంది. అనుకున్నట్లే ఊహించని విధంగా ఎన్జీవో రూపంలో ఆమె జీవితం మారింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని తన గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికై బాలికల విద్య కోసం అహర్నిశలు కృషి చేసింది. ఎందరో బాలికలను బడికి పంపేందుకు ఆమె కథే ప్రేరణగా నిలిచింది. ఆ సాధారణ మహిళ ఎలా ఇన్ని కష్టాలు దాటుకుని సర్పంచ్ స్థాయికి చేరుకుందంటే..? రాజస్థాన్‌లో పాలి జిల్లాలోని సక్దారా గ్రామానికి చెందిన ప్రవీణ అనే మహిళ కేవలం 19 ఏళ్లకే ఏడు గ్రామాలకు సర్పంచ్ అయ్యి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకోసం అమె లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ప్రవీణ తండ్రి మద్యనికి బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు. తనకు నలుగురు తోబుట్టువులు. ఇంటిలోని పేదరికానికి మూడో తరగతి నుంచి బడి మానేయాల్సి వచ్చింది. కానీ ప్రవీణలో ఎలాగైనా చదువుకోవాలి, ఎప్పటికైన చదువుకోగలను అనే ఆశ బలంగా ఉండేది. కుటుంబం కోసం పశువులు మేపుతున్న తన ఆశను మాత్రం చంపుకోలేదు. అందుకోసమే ఎన్జీవో రూపంలో ప్రవీణ ఊరుకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల(కేబీవీ) ప్రారంభమైంది. ఆ ఎన్జీవోలోని ఓ వ్యక్తి ఆ పాఠశాలలో ప్రవీణ ఉచితంగా చదువుకోవచ్చని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించడంతో ఆమె ఆశ నెరవేరింది. అక్కడే ఆమె తన విద్యాభాసాన్ని పూర్తి చేసింది. ప్రవీణ మైనర్‌గా ఉండగానే భవన నిర్మాణ కార్మికుడితో పెళ్లి చేసేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయినప్పటికీ తనలాగా చదవుకోవాలన్న కోరికతో ఉన్న బాలికలుగా తనవంతుగా సాయం చేస్తూనే ఉండేది. తనలా మరెవరూ చదువు కోసం పరితపించకూడదని అనుకుంది. అయితే ఆమె అత్తంటి వారి కుటుంబంలో ఆమె మాత్రమే ఉన్నత విద్యావంతురాలు. అదే ఆమెకు సర్పంచ్‌గా పోటీ చేసే ధైర్యాన్ని ఇచ్చింది. విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయిస్తానన్న హామీతో కనివినీ ఎరుగని మెజార్టీతో సర్పంచ్‌గా గెలిచింది. ఆ చదువు వల్లే తాను సర్పంచ్‌గా పోటీ చేయగలిగాను. లేదంటే ఇంటి పనులు చేసుకుంటూ పశువులు మేపు కోవాల్సిందేనని చెబుతోంది ప్రవీణ. ఈ స్థాయికి చేరుకోవడంతో తన అత్తింటివారు కూడా తనను చూసి గర్వపడుతున్నారని అంటోంది. తన అత్తమామల కుటుంబంలో కూడా బాలికలను పాఠశాలలకు పంపిచడం అనేది లేదని కానీ తాను సర్పంచ్‌గా పోటీ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టేవారు కాదని చెబుతోంది. తన అత్తింటివారు ఆర్థికంగా ఏమి అంత ఉన్నవాళ్లు కాకపోయిన తన ప్రయాణంలో మాత్రం ఆటంకం కలిగించనందుకు వారిని మెచ్చుకోవాలని సంతోషంగా చెప్పింది. అలాగే తాను చెప్పినట్లుగానే విద్యకు గరిష్ట బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలిపింది. అంతేగాక బాలికల కోసం పాఠశాల కూడా నిర్మించానని గర్వంగా చెప్పింది. అంతేగాక తాను గ్రామంలో పాఠశాలకు వెళ్లని బాలికలను వెదికి వారి తల్లిదండ్రలును ఒప్పించి మరీ పంపడం లేదా ఎన్జీవోలతో కలపడం వంటివి చేస్తానని చెబుతోంది. దీంతోపాటు బాలికలను పంపించలేని కుటుంబాలకు ఏమైన ఆర్థికపరమైన అడ్డంకులు ఉన్నాయో అనేది కనుక్కుని ఆ సాయం కూడా అందేలే చేస్తున్నట్లు వివరించింది. అలాగే తమ గ్రామాల్లోని ఉపాధ్యాయులు కూడా విద్య ప్రాముఖ్యత గూర్చి చెప్పమని తనను పాఠశాలకు ఆహ్వానిస్తుంటారని కూడా వెల్లడించింది. ఎందుకంటే తాను అలాంటి బాలికల్లో ఒక్కతిని కాబట్టి వారికి అర్థమయ్యేలా వివరించగలనన్న ఉద్దేశ్యం కాబోలు అంటోంది. ఆమె ఎడ్యుకేట్ గర్ల్స్ ప్రచారం కోసం పనిసచేస్తోంది. ఆమె ఒక్కసారి ఆ ప్రచారఫౌండేషన్ దినోత్సవానికి హజరై ప్రసగిస్తుండగా.. అక్కడ చాలామంది అమ్మాయిలు ఫీల్డ్ వర్కర్లు తన కథను వారి తల్లిదండ్రులకు వివరించారని, ఆ తర్వాతే తమను కూడా స్కూల్‌కి పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చినట్లు ప్రవీణకి తెలిపారు. అప్పుడే తెలిసింది తన కథకు ఇంతమంది స్ఫూర్తినిచ్చిందా అని ప్రవీణ ఆశ్చర్యపోయింది. ఇక ప్రవీణ 2014 నుండి 2019 వరకు రాజస్థాన్‌లోని ఏడు గ్రామాలకు సర్పంచ్‌గా పనిచేశారు. ఈ ఏడాదితో ఆమె సర్పంచ్ పదవీ కాలం ముగియనుందని అయినప్పటికీ బాలికల చదువు కోసం తన పోరాటం మాత్రం ఆగదని సగర్వంగా చెప్పింది ప్రవీణ. (చదవండి: ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఐకాన్!ఏకంగా డిప్యూటీ మంత్రిగా..!) -
మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్,లక్షల ప్యాకేజిని వదిలి..
ఛావీ రాజావత్ రాజస్థాన్‌లోని సోడా గ్రామంలో పుట్టి పెరిగింది. పట్నంలో ఉన్నత చదువులు చదివి, కళ్లు చెదిరే ప్యాకేజీతో కార్పొరేట్ ఉద్యోగంలో చేరింది. కానీ, చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి గ్రామానికి వెళ్లింది. సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడి గెలిచింది. పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేసింది. మొదటి ఎంబీయే మహిళా సర్పంచ్‌గా వార్తల్లో నిలిచి, యుఎన్లో ప్రసంగం చేసింది. గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, హోటల్ వ్యాపారం చేస్తోంది. ఆసక్తి గలవారికి గుర్రపు స్వారీలో శిక్షణ ఇస్తోంది. ‘‘2010లో తొలిసారి సర్పంచ్ అయినప్పుడు గ్రామ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గ్రామం తీవ్ర కరువుతో అల్లాడిపొంయింది. సాగునీరు లేదు. 13–14 సంవత్సరాలుగా రుతుపవనాలు లేవు. భూగర్భ జలాలను వాడుకోలేకపొంయేవారు. 3–4 గంటలకు మించి విద్యుత్ సరఫరా లేదు. రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఈ సవాళ్లతో సోడా పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టాను. మొదటి టర్మ్‌లో కొన్ని పనులు పూర్తయ్యాయి. మా ఊరు తనవైపు లాగింది.. మా తాత బ్రిగేడియర్ రఘుబీర్‌సింగ్ 1990 వరకు సర్పంచ్‌గా చేశారు. నాకు మా ఊరు అంటే ఎప్పుడూ ఇష్టమే. బెంగుళూరులోని రిషి వ్యాలీ స్కూల్, జైపూర్‌లోని మాయో కాలేజీ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. వేసవి సెలవులు వచ్చినప్పుడల్లా మా ఊరిలోనే ఉండేదాన్ని. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్ కాలేజీ నుండి డిగ్రీ తీసుకున్నాక, పూణెలోని బాలాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మోడ్రన్ మేనేజ్మెంట్ నుండి ఎంబీయే పూర్తి చేశాను. ఏడేళ్లపాటు కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేశాను. లక్షల రూపాయల జీతం. కానీ, మా ఊరు వైపు నన్ను తన వైపు లాగింది. మహిళకు రిజర్వ్ అని.. 2010లో మా గ్రామ పంచాయితీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. అప్పుడు మా ఊరి పెద్దలు నన్ను ఎన్నికల్లో నిలబడమని అడిగారు. ఆ సమయంలో సర్పంచ్‌ని అవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. గ్రామస్తులు మా అమ్మనాన్నలను అడిగారు. ‘ఏం చేయాలనుకున్నా తన ఇష్టం, మా బలవంతం ఉండదు’ అని చెప్పారు. నాకు అప్పటి వరకు గ్రామ సభలు ఎలా జరుగుతాయి, పంచాయితీలకు నిధులు ఎలా వస్తాయో తెలియదు. ఆ విషయాలను గ్రామస్తులే చెప్పారు. ఆ విధంగా పంచాయితీ ఎన్నికల్లో నిలబడి, గెలిచాను. మా ఇంట్లో మా తాత తర్వాత నేను సర్పంచ్‌ని అయ్యాను. వర్షపు నీటి సంరక్షణ ముందుగా ఊరి భవితవ్యాన్ని ఒంటరిగా మార్చలేమని, ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేస్తేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని అందరికీ స్పష్టంగా చెప్పాను. నేను వ్యూహంతో పనిచేయడం ప్రారంభించాను. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, గ్రామాలను అనుసంధానించడం, కరువును ఎదుర్కోవడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లు. గ్రామంలోని నీటివనరులన్నీ పూడికతో నిండిపొంయాయి. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి వనరుల్లో పూడిక మట్టిని తొలగించేందుకు లక్షల రూపాయలు సేకరించి, ఖర్చు చేశాం. మహిళలు ముందు గ్రామపంచాయితీ నా కుటుంబం లాంటిది. నేను మీటింగులు పెట్టడం మొదలుపెట్టగానే ఏయేప్రాజెక్టుల్లో ఎలా పనిచేస్తున్నానో చెప్పేదాన్ని. ఈప్రాజెక్టుల గురించి వారు ఏమనుకుంటున్నారో అందరి అభిప్రాయాలు తెలుసుకునేదాన్ని. అలాగే, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా వివరించేదాన్ని. పనులు సజావుగా అయ్యేలా అధికారులను కలిసి ఆరా తీయమని గ్రామస్తులకు చెప్పేదాన్ని. మహిళల బృందం డిజైనర్ ల్యాంప్‌లు, కొవ్వొత్తులు, మసాలా దినుసులు వంటి ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవి మంచి ధరకు అమ్ముడు పొంవడం మొదలయ్యింది. దీంతో మహిళల జీవితం మెరుగుపడింది. రెండేళ్లలో 950 ఇళ్లకు గాను 800 మరుగుదొడ్లు నిర్మించాం. 24 గంటలూ కరెంట్ అందుబాటులోకి వచ్చింది. రోడ్లప్రాధాన్యత నా ఎజెండాలో రోడ్లప్రాధాన్యత స్పష్టంగా ఉంచాను. ముందు ప్రైవేట్ బస్సుల సహాయం తీసుకున్నాను. బాలికల కోసం పాఠశాల, మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాను. మూతపడిన బి.ఎడ్ కాలేజీని స్వాధీనం చేసుకొని దానిని బాలికల చదువుకోసం కేటాయించాను. ఓ ప్రైవేట్ కంపెనీ 200 టేబుళ్లు, బెంచీలను అందజేసి మా వెన్ను తట్టింది. అందరికీ బ్యాంకు ఖాతా.. సర్పంచ్ అయిన ఐదేళ్లలోనే రోడ్లు, డ్రైన్లు, అందరికీ బ్యాంకు ఖాతా తెరిపించాను. ఎప్పుడూ ఫీల్డ్ వర్క్‌లోనే ఉండేదాన్ని. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల, చదువుప్రాముఖ్యతను వివరించేదాన్ని.. నా స్వభావం అందరినీ కలుపుకొని ఉంటుంది. ఐక్యరాజ్యసమితి 11వ ఇన్ఫో పావర్టీ వరల్డ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించినప్పుడు మొదటిసారి భారతదేశం నుండి ఒక మహిళా సర్పంచ్‌గా దేశం తరపునప్రాతినిధ్యం వహించాను. ఇది నాకు గర్వంగా అనిపించింది. అక్కడ వారందరి మదిలో సర్పంచ్ అంటే తలపై ముసుగు వేసుకుని ఉన్న గ్రామస్థురాలు అనుకున్నారు. కానీ, నన్ను కార్పొరేట్ లుక్‌లో చూసి అందరూ ఆశ్చర్యపొంయారు. సోడా విలేజ్ అభివృద్ధికి డబ్బు కంటే వ్యక్తులు, అందరి సమష్టి కృషి అవసరం అని ఫోరమ్‌లో చెప్పాను. రెండుసార్లు సర్పంచ్‌గా నా విధులను నిర్వర్తించాను. తర్వాతి వారికి అవకాశాలు ఇవ్వాలని నేను మళ్లీ పొంటీ చేయలేదు. ఇప్పుడు హోటల్ని నిర్వహిస్తున్నాను. గుర్రపు స్వారీ వచ్చు కాబట్టి, ఆసక్తి గలవారికి శిక్షణ ఇస్తున్నాను’ అని వివరిస్తుంది ఈ యంగ్ లీడర్. -
ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్!
పెళ్లి అనగానే డిస్పోజబుల్ ప్లాస్టిక్‌ను విపరీతంగా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని. అంతే కాదు పల్లెల్లో వాటి వల్ల పేరుకున్న చెత్తతో ఎక్కడలేని మురికి. జబ్బులు. అందుకే ఉత్తరాదిలో చాలామంది మహిళా సర్పంచ్‌లు ‘బర్తన్ బ్యాంక్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఊరికి ఇంతని స్టీలు పెళ్లి సామాను ఇచ్చి అందరూ వాటిని ఫ్రీగా వాడుకునేలా చేస్తున్నారు. ఇది దక్షిణాదికి అందుకోవాల్సి ఉంది. ఇండోర్‌లో మునిసిపల్ అధికారులు రెగ్యులర్‌గా కేటరింగ్ వాళ్లను, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్ హాళ్లను, రెస్టరెంట్లను సందర్శిస్తారు. ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే మొహమాటం లేకుండా ఫైన్ వేస్తారు. ఈ ఫైన్ ఐదు వందలతో మొదలయ్యి 12 లక్షల వరకూ ఉంటుంది. హోటళ్ల వారికి వాళ్లు ఒకటే చెబుతారు– ‘మీరు రోజూ వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల చేసే ఖర్చును స్టీలు వాడకం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు’ అని. ఇండోర్‌కు క్లీన్ సిటీగా పేరు ఉంది. ఆ పేరును నిలబెట్టాలని అధికారుల తాపత్రయం. అంతే కాదు, వారు ఒక ‘బర్తన్ బ్యాంక్’ను కూడా ఏర్పాటు చేశారు. బర్తన్ అంటే గిన్నెలు. పెళ్లికి కావాల్సిన వంట, వడ్డన కోసం కావాల్సిన అన్ని పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు అన్నీ ఒక చోట పెడతారు. 24 గంటల ముందు చెప్పి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించుకున్నాక శుభ్రం చేసి తిరిగి చెల్లించాలి. ఏవైనా డ్యామేజీ అయినా పోయినా డబ్బు కట్టాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఈ బ్యాంక్‌కు పోటెత్తుతున్నారు. ఇదంతా ఎలా మొదలైంది? రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా తదితర రాష్ట్రాలలో కొత్తగా పదవుల్లోకి వచ్చిన మహిళా సర్పంచ్‌లు పల్లెల్లో చెత్తగా పేరుకు పోతున్న ప్లాస్టిక్‌ను చూసి ఇది మొదలెట్టారు. రాజస్థాన్‌లోని జున్జును అనే పల్లెకు నీరూ యాదవ్ అనే ఆవిడ సర్పంచ్ అయ్యాక ఈ సంవత్సరం మొదలులో ‘బర్తన్ బ్యాంక్’ మొదలెట్టింది. ఊరి పెద్దలను ధిక్కరించి నిధులను ఇలాంటి పనులకు ఉపయోగించడం మొదలెట్టిన నీరూ యాదవ్ ‘బర్తన్ బ్యాంక్’ వల్ల ఊరు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రాక్టికల్‌గా చూపించాక అందరూ ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అలా ఈ ఉద్యమం రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. ‘ప్లాస్టిక్ వద్దు చెత్త వద్దు’ నినాదంతో మహిళా సర్పంచ్‌లు తమ గ్రామాల్లో బర్తన్ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామానికి 1000 స్టీలుప్లేట్లు, రెండు వేల కూర గిన్నెలు, రెండు వేల స్టీలు గ్లాసులు, 2 వేల స్పూన్లు, 50 మంచి నీటి జగ్గులు, ఐదారు వంట డేగిసాలు ఏర్పాటు చేస్తూ... గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ బ్యాంక్ నుంచి ఉచితంగా గిన్నెలు పొందే సదుపాయం కల్పిస్తున్నారు. . దీదీ బర్తన్బ్యాంక్ చత్తిస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా అంబికా పూర్లో స్వయంఉపాధి మహిళా బృందాలు తమ ఇళ్లల్లో శుభకార్యాల కోసం ‘దీదీ బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ మహిళల ఈ బ్యాంక్‌లో ఏర్పాటు చేసుకున్న పాత్రలను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే రాను రాను జిల్లా అంతా అందరు ప్రజలూ వాడుకునేలా ఈ ‘దీదీ బర్తన్ బ్యాంక్’లు విస్తరించాయి.‘ప్లాస్టిక్ చెత్త మురుగు నీటికి పెద్ద ప్రతిబంధకం. అది మట్టిలో కలవదు. దానిని రీసైకిల్ చేయడం కూడా వృథా. ఇలాంటి ప్లాస్టిక్‌కు స్టీలు వస్తువులతో విరుగుడు చెప్పాలి’ అంటారు ఈ మహిళలు. ఒడిస్సాలో ఒడిస్సాలో బర్తన్ బ్యాంక్ ఉద్యమం జోరు మీద ఉంది. నౌపాడ జిల్లాలో భలేస్వర్ అనే పంచాయితీ సర్పంచ్ అయిన సరోజ్ దేవి అగర్వాల్ ఊరి పెద్దలను ఎదిరించి మరీ పంచాయితీ నిధుల నుంచి 75 వేలు మంజూరు చేసి ‘బర్తన్ బ్యాంక్’ ఏర్పాటు చేసింది. ‘ప్రతి ఊళ్లో ఇలాంటి బ్యాంక్ ఉండాలి’అంటుందామె. అయితే ఈ బర్తన్ బ్యాంక్‌లు రెండు విధాలుగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కామన్‌గా పాత్రలను ఉంచేస్తే మరికొన్ని చోట్ల ఇంటికి ఇన్నని స్టీలు సామాన్లు ఇచ్చేస్తున్నారు. అంటే పెళ్లికి ఎవరికి పళ్లాలు వాళ్లు తెచ్చుకుని తిని తీసుకెళ్లిపోయేలా. ఇది కూడా బాగానే ఉందంటున్నారు కొందరు. ఏమైనా ఉత్తరాది సంప్రదాయం దక్షిణాదికి కూడా వ్యాపిస్తే బాగుండు. (చదవండి: ఎవరీ గుర్మిత్ కౌర్!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..? -
ఎన్నికల బరిలో జానకీపురం సర్పంచ్ నవ్య
సాక్షి, జనగామ: జానకీపురం సర్పంచ్ నవ్య గుర్తున్నారా? స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై వేధింపుల ఆరోపణలు.. యూట్యూబ్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌గా మారిపోయారామె. ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె ఇవాళ నామినేషన్ వేశారు. కుర్చపల్లి నవ్య స్టేషన్ ఘన్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె.. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నవ్య సర్పంచ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేసి రాజయ్యపై తీవ్ర విమర్శలే చేశారామె. అయితే.. నవ్య చేసిన ఆరోపణల వల్లే తాటికొండ రాజయ్యకు టికెట్ రాలేదన్న వాదన కూడా ఉంది. కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆ మధ్య మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సర్పంచ్ నవ్య.. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్ -
గ్రామంలో నివాసం ఉండగా నోటీసులిస్తారా?
మునగపాక : తాను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా సేవలందిస్తుంటే బీఎల్వో ప్రవీణ తాను గ్రామంలో లేనంటూ తనకు నోటీసు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మెలిపాక సర్పంచ్ అయినంపూడి విజయభాస్కరరాజు ప్రశ్నించారు. సర్పంచ్ స్థానికంగా నివాసం లేరంటూ బీఎల్వో బుధవారం నోటీసు ఇచ్చారు. దీనిపై విజయభాస్కరరాజు స్పందించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది తాను గ్రామంలో నివాసం లేనంటూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టకుండా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. బీఎల్వోలు తమకు వచ్చిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాల్సి ఉండగా కేవలం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా ప్రవర్తించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి మాటలు నమ్మి, తప్పుడు నోటీసులు అందించిన బీఎల్వోపై చర్యలు తీసుకోవాలని విజయభాస్కరరాజు డిమాండ్ చేశారు. -
సర్పంచ్ శ్రీనివాస్‌పై రౌడీషీట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్‌పై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. గత మార్చి 13వ తేదీనే రౌడీషీట్ ఓపెన్‌చేసినట్లు సోషల్‌మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. పురుమల్ల శ్రీనివాస్‌పై 24కుపైగా కేసులు నమోదు అయ్యాయి. ఫోర్జరీ, చీటింగ్, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, దురాక్రమణలు, భూ దందాల నేరాల్లో నిందితుడిగా ఉన్నట్లు సదరులేఖలో ఉంది. శ్రీనివాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి, కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో లేఖ బయటకు రావడం చర్చనీయాంశమైంది. కాగా.. పోలీసులు ముందస్తు వ్యూహంతోనే ఆయనపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. గత సీపీ సత్యనారాయణ పదేపదే శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలతో పీడీయాక్టు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. అతను అధికారపార్టీకి చెందిన వ్యక్తి కావడం, పై నుంచి ఒత్తిడితో వెనకడుకు వేసినట్లు తెలిసింది. ఇటీవల శ్రీనివాస్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలోనే శ్రీనివాస్‌పై నమోదు చేసిన రౌడీషీట్‌ను పోలీసులు తెలివిగా బయటకు తీసినట్లు చర్చ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతనిపై కొన్నిరోజుల్లో పీడీయాక్టు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై సీపీ సుబ్బారాయుడును సంప్రదించగా శ్రీనివాస్‌పై మార్చిలోనే రౌడీషీట్ తెరిచినట్లు స్పష్టం చేశారు. -
‘బలగం’ మూవీ.. సర్పంచ్‌కు కన్నీటి వీడ్కోలు..!
కరీంనగర్: బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించిన కీసరి నర్సింగం అంత్యక్రియలు బుధవారం అభిమానుల కన్నీటి మధ్య పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం కొన్నేళ్లుగా నాటక ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించి అందరి ప్రశంసలు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందారు. నర్సింగంకు భార్య భూమవ్వ, కుమారుడు శ్రీనివాస్, కూతురు అంజలి ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, డీపీఆర్వో మామిండ్ల దశరథం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, సర్పంచ్ లావణ్య–శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రా వు, మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్, నాయకులు రాఘవరెడ్డి, పిట్టల భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ గూడేనికే వెలుతురు నువ్వమ్మా!
‘ఇరవై ఏళ్ల వరకూ మా ఇంట్లో బల్బు చూళ్లేదు’ అంటుంది భాగ్యశ్రీ. మహరాష్ట్రలో నక్సల్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలోని తమ గూడేనికి చాలా కాలం పాటు సర్పంచ్‌గా ఎవరూ నిల్చునే ధైర్యం చేయలేదు. సమస్యలు తీర్చేవారూ లేరు. ‘చివరకు నేనే సర్పంచ్ అవుదామని నిశ్చయించుకున్నా’ అంది భాగ్యశ్రీ. 24 ఏళ్ల ఈ గిరిజన నాయకురాలు తన వారి కోసం పని చేస్తున్న తీరు ప్రతి అణగారిన సమూహానికి చూపుతున్న మార్గం చాలానే ఉంది. మహరాష్ట్రలో ముంబై, పూణె వంటి నగరాలది ఒక ప్రపంచమైతే గడ్చిరోలి వంటి నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాలది మరో ప్రపంచం. ‘మహారాష్ట్రకు ఊపిరితిత్తి’ అని పిలిచే ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి, గిరిజన ఆవాసాలతో ఉంటుంది. అయితే నక్సలైట్ల ప్రభావం వల్ల, గిరిజనులనే నిర్లక్ష్యం వల్ల దారుణమైన వెనుకబాటుతనం ఇక్కడ ఉంటుంది. ‘మా గూడెంలో నాకు ఇరవై ఏళ్లు వచ్చే వరకూ కరెంటు లేదు. మా ఇంట్లో బల్బు వెలగడం చూళ్లేదు’ అంటుంది 24 ఏళ్ల భాగ్యశ్రీ లక్ష్మి. గడ్చిరోలి అడవుల్లో అత్యధిక సంఖ్యలో ఉండే మడియా తెగకు చెందిన ఈ చదువుకున్న అమ్మాయి తన సొంతగూడెం ‘కొటి’ పంచాయితీ కింద ఉన్న 9 గ్రామాలకు సర్పంచ్. ఈ ప్రాంత గిరిజనుల జీవితాలకు ఒక ఆశాదీపం. సర్పంచ్ లేని ఊరు భాగ్యశ్రీ లక్ష్మి పుట్టి పెరిగిన ‘కొటి’ గూడేనికి 2003 నుంచి సర్పంచ్ లేడు. ఎందుకంటే నక్సల్ ప్రభావం వల్ల ఏ సమస్యో అని ఎవరూ నిలబడలేదు. దాంతో ఆ ప్రాంతమంతా అనేక సమస్యలు పేరుకుపోయాయి. బాల్య వివాహాలు, చదువు మానేయడం, నక్సల్ అనే అనుమానంతో అమాయక గిరిజన యువకులను ఏళ్ల తరబడి జైళ్లల్లో పడేయడం.. ఇదీ అక్కడ జరుగుతున్నది. డాక్టర్లు పొరపాటున కూడా రారు. అదేమంటే రోడ్లు లేవంటారు. రోడ్లు వేయమని అధికారుల దగ్గరకు వెళితే వారు మరేవో సమస్యలు చెప్తారు. ‘ఇవన్నీ చూసి చూసి విని విని నేనే సర్పంచ్‌గా మారి ఏదో ఒకటి చేద్దామని బయలుదేరాను’ అంటుంది భాగ్యశ్రీ లక్ష్మి. నేనొచ్చాను భాగ్యశ్రీ లక్ష్మి తల్లి అంగన్వాడి టీచర్. తండ్రి ప్రభుత్వ టీచర్. అందుకే భాగ్యశ్రీని చదివించారు. ‘చంద్రాపూర్‌లో బి.ఏ. ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మంచి వాలీబాల్ ప్లేయర్‌ని నేను. టీచింగ్ రంగంలోకి వెళదామనుకున్నాను. కాని నా చదువు నాకు మాత్రమే ఉపయోగపడితే ఎలా? నా వారికి ఏదైనా చేయాలని సర్పంచ్ అయ్యాను. ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు’ అంది భాగ్యశ్రీ. అయితే ఆమెకు పదవి రావడాన్ని ఊహించని కొంతమంది మగవారు భాగ్యశ్రీ పదవీ స్వీకారం రోజు ఆమెతో దురుసుగా వ్యవహరించారు. మైక్ తీసుకొని మాట్లాడబోతే మాట్లాడనివ్వలేదు. అసభ్యంగా ప్రవర్తించారు. ‘నేను ఇంటికొచ్చి చాలా ఏడ్చాను. అయితే మా అమ్మ– నువ్వు ఇక మీదట మామూలు భాగ్యశ్రీగా ఉండకు. ఒక నాయకురాలు ఎలా ఉంటుందో అలా ఉండు’ అని ధైర్యం చెప్పింది. ఆ క్షణమే నేను గట్టిగా నిలబడాలనుకున్నాను’ అంటుంది భాగ్యశ్రీ. బైక్ మీద తిరుగుతూ... ప్రతి ఉదయం టీ తాగి బైక్ మీద తిరుగుతూ తన అజమాయిషీలో ఉన్న గ్రామాల సమస్యలు పరిష్కరిస్తోంది భాగ్యశ్రీ. ఆమె సర్పంచ్ అయ్యాక గూడేల్లోని తల్లిదండ్రులతో పోట్లాడి మొదటగా చేసిన పని బాల్యవివాహాలు మాన్పించడం... బాలికలను హాస్టళ్లకు పంపి చదివించడం... స్కూళ్లలో తిరిగి చేరేలా చేయడం, టాయిలెట్లు నిర్మించడం... ‘నా కింద తొమ్మిది గ్రామాల్లో ఆరింటికి కరెంటు తెప్పించాను’ అని తెలిపిందామె. ‘అధికారులు ఏది అడిగినా నక్సల్స్ సమస్యను సాకుగా చూపుతారు. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరిస్తే నక్సల్స్ అడ్డుపడరు’ అంది. ‘గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలూ వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి’ అంటుంది భాగ్యశ్రీ. గిరిజనులకు కొన్ని విశ్వాసాలుంటాయి. వారు అన్ని మాటలు వినరు. వారిని ఒప్పించి అభివృద్ధివైపు నడిపించడమే పెద్ద సవాలు. బయటవారు నాయకులు కావడం కంటే లోపలివారు నాయకులైతేనే అది సులభం. ఎవరి సమూహాల మేలు వారే చూసుకోవాలి. -
ఉప ఎన్నికల్లోనూ సగానికిపైగా ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు.. రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం. -
దొంగనుకుని సర్పంచ్‌కు దేహశుద్ధి
సాక్షి, వరంగల్: దొంగగా భావించిన గ్రామస్తులు సర్పంచ్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మామిండ్లవీరయ్యపల్లిలో శుక్రవారంరాత్రి చోటుచేసుకుంది. మామిండ్లవీరయ్యపల్లిలో పెంతల సాంబరెడ్డి, యార రవి మధ్య ఇంటిస్థలం విషయమై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. దీనిపై గ్రామపెద్దల సమక్షంలో శుక్రవారం పంచాయితీ పెట్టారు. అనంతరం రాత్రిపూట ఇరువర్గాల పెద్దమనుషులు వేర్వేరుగా దావత్ చేసుకున్నారు. సర్పంచ్ అమరేందర్‌తోపాటు పలువురు మాటుకాసి సాంబరెడ్డి పెద్దమనుషుల దావత్ దృశ్యాలను మొబైల్లో రికార్డు చేస్తుండగా పలువురు గమనించారు. ‘దొంగ, దొంగా’అని అరుస్తూ సర్పంచ్‌పై దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీసులకు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. -
సఫాయి సర్పంచ్
-
సర్పంచ్ నవ్య వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, ధర్మసాగర్(హన్మకొండ): స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై ధర్మసాగర్ మండలం జాన కీపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చినట్టు తెలిసింది. జూన్ 21న ఎమ్మెల్యే టి.రాజయ్య, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్, నవ్య భర్త ప్రవీణ్‌లపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సర్పంచ్ నవ్య కేసుపై సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించాయి. ఈ క్రమంలో వేధింపులకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్‌లు సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని చెపుతున్నారు. సర్పంచ్ నవ్య నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు బుధవారం పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య.. కేసు నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని చెబుతోంది. చదవండి: ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్కో సీఎండీ వ్యాఖ్యలు -
కూతురు ప్రేమపెళ్లి.. ఇటుకలపల్లిలో సర్పంచ్ వీరంగం..
సాక్షి, వరంగల్ జిల్లా: నర్సంపేట మండలం ఇటికాలపల్లి సర్పంచ్ మండల రవీందర్ వీరంగం సృష్టించారు. కూతురు కావ్యశ్రీ అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తండ్రి సర్పంచ్ ఆగ్రహంతో తన బిడ్డను పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటితో పాటు వారి సహకరించిన ఇద్దరు స్నేహితుల ఇళ్లపై దాడి చేయించాడు. నిప్పంటించడంతో పర్నిచర్ దగ్ధమయ్యింది. ప్రేమజంట హసన్‌పర్తి పరిధిలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ప్రేమపెళ్లి అనంతరం సర్పంచ్ హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కావ్యను తనతో రమ్మని తండ్రి ఎంత బతిమలాడిన రాకపోవడంతో ఆగ్రహంతో స్వగ్రామానికి వెళ్లి రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు మిత్రుల ఇళ్లను దగ్ధం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, సర్పంచ్ వివాదంలో కొత్తమలుపు
-
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వేధింపుల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రామాభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే రాజయ్య ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వడంతో సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమక్షంలో రాజయ్య ఇచ్చిన ప్రొసీడింగ్ లేఖ చూపించి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరంటూ ప్రస్తుతం ఎమ్మెల్యే మంజూరు చేసిన రూ.25 లక్షలు గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వద్ద తన భర్త తీసుకున్న ఏడు లక్షలు ఏదైనా అమ్మి తిరిగి ఇచ్చేయాలని భర్తకు ఆల్టిమేటం ఇచ్చారు. తల తాకట్టు పెట్టైన ఏడు లక్షలు భర్త తిరిగి చెల్లించాల్సిందేనని సూచించారు. నిజాయితీగా ఎమ్మెల్యే వేధింపులపై పోరాటం కొనసాగిస్తానని, ఆధారాలతో మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని నవ్య చెప్పారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదం కొత్త మలుపు
హనుమకొండ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య వేధింపులపై ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు జానకిపురం సర్పంచ్ నవ్య. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య, సరైన ఆధారాలతో రేపు మహిళా కమిషన్‌ను కలుస్తానని తెలిపారు. బెదిరింపు కాల్స్, అసభ్యకరంగా మాట్లాడే కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎంపీపీ కవితతో తనకు ప్రాణహాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కోరారు. తాను ఏ తప్పు చేయలేదని, నిజాయితీగా పోరాడతానని స్పష్టం చేశారు. ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలనే తాను పోరాడతానని నవ్య చెప్పారు. ఎమ్మెల్యే వేధించిన ఆధారాలు అవసరమైనప్పుడు బయటపెడతానని తెలిపారు. చదవండి: అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ -
ఎమ్మెల్యే రాజయ్యను సస్పెండ్ చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల ముందు ప్రజలకు పలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించిన సీఎం కేసీఆర్.. చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు, మహిళపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాజయ్యను తక్షణమే సస్పెండ్ చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాల దగా’ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్టాండ్ సమీపాన అంబేడ్కర్ సర్కిల్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఇందిర మాట్లాడుతూ.. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు ఏమయ్యాయ ని ప్రశ్నించిన ఆమె.. పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అవి నీతి పెరిగిపోయిందని అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లకావత్ ధన్వంతి, పార్టీ నాయకులు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, కీసర దిలీప్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, చింత ఎల్లయ్య, సింగపురం వెంకటయ్య, ఐలపాక శ్రీను, కోరుకొప్పుల మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఫిర్యాదు
సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య మధ్య వేధింపుల పంచాయితీ చినికిచినికి గాలివానగా మారి పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేతోపాటు తన భర్త ప్రవీణ్, ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్‌లపై బుధవారం సాయంత్రం ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని నవ్య స్పష్టం చేశారు. వేధింపులపై మూడు నెలల క్రితం క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే రాజయ్య.. గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు ఇస్తానని చెప్పి నయాపైసా ఇవ్వకపోగా తనకు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రూ.100 బాండ్ పేపర్‌పై అప్పుగా రూ.20 లక్షలు తీసుకున్నట్టు సంతకం పెట్టాలని ఎమ్మెల్యేతోపాటు తన భర్త, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలు వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, తన భర్తపై కూడా ఆరోపణలు చేసిన నవ్య.. ఆయనతో కలిసే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం కొసమెరుపు. డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేశారు.. సర్పంచ్ నవ్య.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆరోపణలు చేశారు. ‘జానకీపురం గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న నన్ను ఎమ్మెల్యే రాజయ్య కొంతకాలంగా వేధిస్తున్నారు. గతంలో నా భర్త ప్రవీణ్ కుమార్ ద్వారా నన్ను బలవంతగా ఒప్పించి, రాజీపడే విధంగా చేసి.. ఎమ్మెల్యే రాజయ్య స్వయంగా మా ఇంటికి వచ్చి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. మీడియా ముఖంగా జానకీపురం గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులనుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన మాటలను నమ్మి రాజీపపడ్డాం. కానీ నేటికీ ఎలాంటి నిధులు మంజూరు చేయకపోగా రూ.25 లక్షలు మాకే ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం ఎమ్మెల్యే చేయించాడు. నెలరోజుల కింద నా భర్త ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాస్ గ్రామానికి నిధులు ఇస్తామని నన్ను హనుమకొండకు రప్పించి నా దగ్గరికి రెండు అగ్రిమెంటు పేపర్లను తీసుకువచ్చారు. ఒకటి గతంలో ఎమ్మెల్యేపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని, నేను తప్పుగా రాజకీయ లబ్ధి కోసం వాటిని చేసినట్లు ఒప్పుకున్నట్టుగా స్టాంపు పేపరుపైన రాయించుకొచ్చారు. మరో పేపర్‌పై రూ.20 లక్షలు నాకు అప్పుగా ఇచ్చినట్లు, తిరిగి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే విధంగా ఒప్పుకున్నట్లు రాసుకొని వచ్చారు. వాటిపై సంతకం పెట్టాలని బలవంతం చేశారు. దీనిని నేను వ్యతిరేకించా. డబ్బు ఆశచూపి నా భర్తను ట్రాప్ చేసి, సంతకం పెడితేనే గ్రామానికి ఒప్పుకున్న నిధులు రూ.25 లక్షలు మంజూరు చేస్తామని వేధింపులకు గురి చేస్తున్నారు. మార్చి 8న జరిగిన వేధింపుల ఘటనలో మధ్యవర్తిత్వం వహించిన ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత ఆ రోజు క్షమించమని ప్రాధేయపడితే.. పోనీ, ఎవరి పాపం వారిది అని పేరు బయట పెట్టలేదు. అయినా నా భర్తకు డబ్బు ఆశచూపి ఒప్పంద పత్రంపై సంతకం చేయించడానికి పన్నాగం పన్నారు. నిజాయితీగా ఉండాలనుకున్న నేను సంతకం చేయకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నందున ఎమ్మెల్యే, ఆయన పీఏ, ఎంపీపీ, నా భర్తపైనా చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నా’అని ఫిర్యాదులో వివరించారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. భర్తతో కలసి నవ్య ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ధర్మసాగర్ పోలీసులు, బుధవారం రాత్రి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎమ్మెల్యే, ఎంపీపీ, ఎమ్మెల్యే పీఏలతో పాటు తనభర్తపైనా నవ్య చేసిన ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ కంటెంట్ లేనందున కేసు నమోదు చేయలేదని, న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాత చర్యలు చేపడతామని ధర్మసాగర్ సీఐ ఒంటేరు రమేశ్ తెలిపారు. -
వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై దాడి
శ్రీకాకుళం: అధికారం దూరమైనా టీడీపీ నాయకులు ఆ దర్పాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నారు. అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక ఏకంగా దాడులకు పాల్పడుతున్నారు. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం సర్పంచ్ బల్లెడ సుమన్‌పై ఇలాగే టీడీపీ మా జీ సర్పంచ్ మాదిన రామారావు, కుటుంబ సభ్యులు సోమవారం దాడి చేశారు. పెద్దశ్రీరాంపురం పంచాయతీ సర్పంచ్ బల్లెడ సుమన్.. గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనం నిర్మాణాలకు అవసరమైన మట్టిని స్థానిక జెడ్పీ హైస్కూల్ వెనుక గల చెరువులో తవ్విస్తుండగా, మాజీ సర్పంచ్ మాదిన రామారావు, ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇక్కడ చెరువులో మట్టి తవ్వడానికి వీల్లేదంటూ వాదనకు దిగారు. దీంతో సుమన్, ట్రాక్టర్ నడుపుతున్న సుమన్ తండ్రి ప్రకాశరావులతో మాజీ సర్పంచ్ రామారావు, మిగతా కుటుంబసభ్యులు ఘర్షణ పడ్డారు. ఈ దశలో సర్పంచ్ సుమన్‌పైన మాజీ సర్పంచ్ రామారావు, ప్రణీత్‌లు కర్రతో దాడి చేయడంతో సర్పంచ్ గాయపడ్డారు. తర్వాత సర్పంచ్ సుమన్ ప్రధాన రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశా రు. గ్రామాభివృద్ధి కోసం పనులు చేస్తుంటే దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు నచ్చజెప్పడంతో నిరసన విరమించి దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాదిన రామారావు కూడా సర్పంచ్, ఆయన అనుచరులు తమపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా.. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. జెడ్పీ చైర్ పర్సన్ పరామర్శ సోంపేట: టీడీపీ నాయకుల దాడిలో గాయపడి న సర్పంచ్ సుమన్, తదితరులు సోంపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఆయనను జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మా జీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పరామర్శించారు. సుమన్‌కు ధైర్యం చెప్పి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మన దాసు, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి, పొడుగు కామేష్, బుద్ధాన శ్రీకృష్ణ, రౌతు విశ్వనాథం, బంగారు పాపారావు, నగిరి శరత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దుర్మరణం
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కొత్తగట్టు–గొల్లపల్లి గ్రామాల మఽ ద్య జాతీయ రహదారి పక్క న కారు చెట్టును ఢీకొన్న ఘటనలో సర్పంచ్ గోపు కొమురారెడ్డి(53) దుర్మరణం చెందాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. హుజురాబాద్ మండలం కనుకులగిద్దె సర్పంచ్ గోపు కొమురారెడ్డి శుక్రవారం భార్య రమతో కలిసి కారులో సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి సమీపంలో శుభకార్యానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం కరీంనగర్లో పని ఉందని కొమురారెడ్డి కారులో ఒక్కడే వచ్చాడు. రాత్రి కరీంనగర్లో నిద్రించి శనివారం వేకువజామున కనుకులగిద్దెకు బయలుదేరాడు. శంకరపట్నం మండలం కొత్తగట్టు–గొల్లపల్లి గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారుతో చెట్టుకు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో బె లూన్లు ఓపెన్ అయినా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాద విషయం తెలుసుకున్న హుజురాబాద్ రూరల్ సీఐ సంతోశ్, ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, కూతుర్లు ఉజ్వల, అఖిల ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కనుకులగిద్దెలో విషాదం హుజూరాబాద్‌రూరల్: మండలంలోని కనుకులగిద్దె సర్పంచ్ కొమురారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కు టుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. రాజకీయాలకతీతంగా అందరితో సన్నిహితంగా ఉంటూ మెలిగిన వ్యక్తి అ కాల మృతిచెందడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా కొమురారెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితుడు. ఈటల టీ ఆర్ఎస్లో ఉన్న సమయంలో మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈటల బీజేపీలో చేరడంతో అత ను సైతం ఆ పార్టీలో చేరాడు. కొమురారెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఈటల దంపతులు హుటా హుటిన గ్రామానికి చేరుకున్నారు. మృతదేహానికి నివాళి అర్పించి, కొమురారెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే పార్థివదేహానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు నివాళి అర్పించారు. -
బిల్లులు ఇవ్వకుంటే పెట్రోల్ పోసుకుంటాం.. సర్పంచులు
-
సర్పంచ్ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం
పరకాల: ఓ సర్పంచ్ కొత్తగా కట్టించిన శ్మశానవాటిక.. ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమయ్యింది. ఈ దురదృష్టకర ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైబోతుపల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి (25) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో సర్పంచ్ గత నెల 29న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చనిపోయాడు. కాగా, ఆ గ్రామాన్ని ఇటీవలే గ్రామపంచాయతీగా ప్రకటించారు. సర్పంచ్ కంచ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామంలో శ్మశాన వాటిక (వైకుంఠధామం) నిర్మించారు. కానీ ప్రారంభించలేదు. ఈ క్రమంలో సర్పంచ్ కుమారస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి అదే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్ కట్టించిన శ్మశాన వాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం కావడంతో గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు. -
కథ వింటే కన్నీళ్లే.. ఇల్లు గడవక కూలీ పనులకు గ్రామ సర్పంచ్
వరంగల్: ఆ గ్రామానికి ఆమె ప్రథమ పౌరురాలు. ఇల్లు గడవక తోటి కూలీలతో కూలీ పనులకు వెళ్తోంది. ఓ పక్క గ్రామసర్పంచ్‌గా విధులు నిర్వహిసూ్తనే, మరో పక్క కుటుంబ పోషణ కోసం దినసరి కూలీగా పనులకు వెళ్తుంది. మండలంలోని వెంకంపాడు గ్రామం ప్రత్యేక తెలంగాణ తర్వాత కొత్త జీపీగా ఏర్పాటైంది. రిజర్వేషన్ కారణంగా 2019 జనవరి 25న సర్పంచ్‌గా తప్పెట్ల ఉప్పమ్మ ఎన్నికైంది. పంచాయతీకి మొదటి సర్పంచ్‌గా ఎన్నిక కావడంపై ఆనాడు ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. సర్పంచ్ ఎన్నికల్లో లక్షల్లో చేసిన అప్పులు తీర్చలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా భారమై కుటుంబం దీనస్థితిలోకి వెళ్లింది. గతంలో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఏరియాలో వైజాగ్ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్‌ప్రసాద్ వద్ద సర్పంచ్ భర్త వెంకన్న వాచ్‌మెన్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో వెంకంపాడు కొత్తగా జీపీగా ఏర్పాటైందని, గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం మీకే ఉందని కొందరు గ్రామపెద్దలు ఆశ చూపించారు. వారు చెప్పిన మాటలు విని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని పట్టణం నుంచి మూట ముల్లె సదురుకొని పల్లెకు బాట చేరుకున్నారు. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులతో పాటు మరికొన్ని అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. గత మూడేళ్లుగా అరకొర వచ్చిన నిధులతో గ్రామాభివృద్ధికి సరిపోక మరికొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏడాదిగా చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయామని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. సర్పంచ్‌గా గౌరవ వేతనం అందడం లేదు. పెళ్లీడుకొచి్చన కూతురుకు పెళ్లి చేద్దామన్న చేతిలో చిల్లి గవ్వ లేదు. గ్రామంలో సెంట్ భూమి లేదు. డబుల్ ఇంటిని ఇస్తారన్న ఆశతో ఉన్న ఇంటిని నేలమట్టం చేసి రేకుల షెడ్డు వేసుకున్నామని ఆవేదన చెందింది. ఇదే క్రమంలో అప్పులోల్లు ఇంటి చుట్టు తిరుగుతుంటే పరువు పోతుందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది ఏమిలేక దినసరి కూలీగా మిర్చి వేరడానికి ఎర్రటి ఎండలో రూ.200 కూలీకి వెళ్తున్నట్లు బోరున విలపించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే పాల్గొని, మిగిలిన సమయంలో దినసరి కూలీ పనులకు వెళ్తుంది. నాలాంటి కష్టాలు ఏ ప్రజాప్రతినిధికి కూడా రాకూడదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించిపెండింగ్లో పంచాయతీ అభివృద్ధి పనుల బిల్లులు వెంటనే విడుదల చేయించి తమను కష్టాల ఊబిలోనుంచి గట్టెక్కించాలని సర్పంచ్ ఉప్పమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
నువ్వేం ఏం చేస్తవ్ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రతాపం
-
నువ్వు ఏం చేస్తవ్ నన్ను? సర్పంచ్‌పై ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రతాపం
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక వివాదస్పదంగా మారింది. కడెం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం మంగళవారం ఖన్నపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, గ్రామ సర్పంచ్‌తో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. వేదిపై ఉన్న వారి పేర్లు చెబుతూ సర్పంచ్ పేరు పలకడం మర్చిపోయారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ నరేందర్ రెడ్డి తన పేరు ప్రస్తావించలేదని ఎమ్మెల్యేకు తెలిపారు. సర్పంచ్ పేరు చెప్పకుండా ప్రోటోకాల్‌న ఉల్లంఘించారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సర్పంచ్ సీరియస్‌గా స్పందించారు. రేపు నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే మాటలకు బయపడని సర్పంచ్.. మీరు నన్నేం చేస్తారు మేడం, ఏం చేస్తారో చేసుకోండని అని బదులిచ్చారు. దీంతో సర్పంచ్‌పై ఎమ్మెల్యే తన ప్రతాపం చూపించారు. నువ్వు నన్నేం చేస్తావ్?. ఎస్టీ మహిళ అని మాట్లాడుతున్నావా. ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ను తీసుకొస్తే.. ఇది నా ఊరు అని ఎలా అంటావ్. మా పార్టీ తరపునే మీ ఊరు డెవలప్ అవుతుంది. మా పార్టీ వల్లే రోడ్లు, ఇళ్లు వచ్చాయి’ అని సర్పంచ్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై సర్పంచర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తన పేరు పలకలేదని అడిగినందుకు ఎమ్మెల్యే దుర్బాషాలాడారని అన్నారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పినందుకు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల సర్పంచ్‌లపై రేఖనాయక్ చిన్న చూపు చూస్తుందనడానికి ఇదొక నిదర్శనమని అన్నారు. -
పాత కలెక్టర్‌పై కొత్త కలెక్టర్‌కు ఫిర్యాదు
జగిత్యాల: చేపట్టిన అభివృద్ధి పనికి బిల్లు చెల్లించలేదంటూ ఒక సర్పంచ్ పాత కలెక్టర్‌పై ప్రస్తుత కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేట సర్పంచ్ తునికి నర్సయ్య కథనం ప్రకారం.. కలెక్టర్ రవి జగిత్యాల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో దమ్మయ్యపేటలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. బడికి ప్రహరీ నిర్మించాలని ఆ సమయంలో సర్పంచ్‌కు సూచించి.. బిల్లులు సైతం వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే 150 మీటర్ల పొడవుతో సర్పంచ్ గోడ నిర్మించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బిల్లు లు విడుదల కాలేదు. ఈలోగా కలెక్టర్ రవి బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిపోయారు. దీంతో ప్రహరీ నిర్మాణ బిల్లులు ఇంకా తనకు రాలే దని సర్పంచ్ నర్సయ్య సోమవారం ప్రజావాణిలో అప్పటి కలెక్టర్ రవిపై ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు చేశారు. -
ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..!
వరంగల్: మహిళా సర్పంచ్‌పై లైగింక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే సార్‌ను ఓ ఆటా ఆడేసుకుంటున్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న ఎమ్మెల్యే.. మహిళలకు సంబంధించి తరుచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఎమ్మెల్యే రాజయ్య తనను లైగింకంగా వేధిస్తున్నాడని హనుమకొండ/జనగామ జిల్లా పరిధి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్య ఆరోపించడంతో మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీతో సహా అన్ని వర్గాల నుంచి ఆగ్రహం పెల్లుబికడంతో నిరసన సెగ ప్రగతిభన్ను తాకింది. పార్టీ వర్గాలు ఓపైపు ఆరా తీస్తుండగానే.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..! గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే రాజయ్య మహిళలకు సంబంధించిన ఏదో ఒక వివాదంలో తెరపైన కనిపిసూ్తనే ఉన్నాడు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను కేబినెట్ నుంచి ఏకంగా బర్తరఫ్ చేయడం అప్పట్లో హాట్‌టాఫిక్‌గా మారింది. దానిపై అనేక ముచ్చట్లు సైతం వినిపించాయి. ఇదిలా ఉంటే.. గతంలో వేలేరు మండలంలోని ఓ ఊరికి చెందిన మహిళతో ఫోన్లో అసభ్యకరంగా.. శవ్వ, శవ్వ అంటూ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడిన మాటలుగా.. ఆడియో రికార్డు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశం కాగా.. అది తన వాయిస్ కాదని రాజయ్య కొట్టిపారేశారు. ఆ తర్వాత లింగాలఘణపురంలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో సైతం ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. ఆన్లైన్లో హల్చల్ చేశాయి. ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లాలో లక్ష మందికి పైగా పిల్లలు తన వల్లనే పు ట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం విమర్శలను ఎదుర్కొనేలా చేసింది. అలాగే లింగాలఘణపురం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీలో సీఎం కేసీఆర్ అందరికీ భర్త లాంటి వాడని నోరుజారీ.. సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించడంతో ఎమ్మెల్యేకు అధిష్టానం నుంచి మొట్టికాయలు వేసే వరకు దారి తీసింది. మహిళా కమిషన్ ఆదేశం..పోలీసుల విచారణ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని సర్పంచ్ నవ్య ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్çపర్సన్ సునీత స్పందించారు. కేసును సుమోటోగా తీసుకుని.. విచారణకు డీజీపీని ఆదేశించారు. దీంతో పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఎమ్మెల్యే.. పార్టీ పెద్దల సూచనలు పాటిస్తూ.. ఆదివారం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. సర్పంచ్ దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. ప్రొటోకాల్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే.. మహిళా లోకం తనను క్షమించాలని కోరగా.. నవ్య పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెబుతూనే.. ఎమ్మెల్యేకు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేసింది. వేధింపులకు గురిచేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సర్పంచ్ ఇంటికి వెళ్లడంతో నాలుగు రోజుల వివాదానికి తెరపడగా.. మహిళా కమిషన్ విచారణకు ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సర్పంచ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటలిజన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. ఈ విషయమై సీఎంతోపాటు మంత్రి కేటీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. -
ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, వరంగల్: ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం.. సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రాజయ్య.. మీడియా సమక్షంలో ఆమెకు క్షమాపణ చెప్పారు. సర్పంచ్ భర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజయ్య.. నవ్య దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. వేధిస్తే భరితం పడతాం: సర్పంచ్ నవ్య సర్పంచ్ నవ్య మాట్లాడుతూ, మహిళలకు అన్యాయం జరుగుతోందని, తాను మాట్లాడిన ప్రతి మాట నిజం అంటూ మండిపడ్డారు. అన్యాయాలు, అరాచకాలు సహించవద్దని ఆమె అన్నారు. చిన్న పిల్లలను కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, మహిళలను ఎవరైనా వేధిస్తే భరితం పడతామని సర్పంచ్ హెచ్చరించారు. ‘‘ఎమ్మెల్యే రాజయ్యను గౌరవిస్తా. ఆయన వల్లే నేను సర్పంచ్ అయ్యా. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నా. పార్టీని ఒక కుటుంబంలా భావిసా. జరిగిన విషయాన్ని మరిచిపోయి ఇక ముందు అలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నా. తప్పు చేసినట్టు ఒప్పుకుంటే క్షమిస్తా’’ అని సర్పంచ్ నవ్య అన్నారు. క్షమించమని కోరుతున్నా.. ఎమ్మెల్యే రాజయ్య జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ‘‘నాకు నలుగురు అక్క చెల్లెళ్లు ఉన్నారు. ప్రవీణ్‌పై అభిమానంతో ఆయన భార్యకు సర్పంచ్ టికెట్ ఇచ్చా.. నేను తెలిసి తెలియక చేసిన పనులు వల్ల మానసిక క్షోభకు గురైతే క్షమించమని కోరుతున్నా. జానకిపురం అభివృద్ధికి పాటుపడుతా. అధిష్టానం ఆదేశం మేరకు రూ.25 లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నా’’ అని రాజయ్య పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా కమిషన్ యాక్షన్‌కు సిద్ధమైంది. ఆయనపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో రాజయ్యపై వ్యక్తిగత విచారణ చేయాలని డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. అసలేం జరిగింది.. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం! ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. -
ముఖరా(కె) సర్పంచ్‌కు ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్’
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కే) సర్పంచ్ గాడ్గె మీనాక్షి ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్–2023’ అవార్డును అందుకున్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ్ భారత్ గ్రామీణ్ విభాగంలో కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మీనాక్షికి ఈ అవార్డును అందించారు. 220 ఇళ్లు ఉన్న ముఖరా(కె) గ్రామం ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో చోటుదక్కించుకుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తమ గ్రామాభివృద్ధి వివరాలను మీనాక్షి వివరించారు. -
Adilabad: ఇది మీనాక్షి ఊరు.. సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుందా? అదేం కాదు..
Mukhra Sarpanch Meenakshi Gadge Inspiring Journey: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా అనే చిన్న పల్లెను చూస్తే సినిమాల్లోనే ఇలాంటి పల్లె ఉంటుంది అనిపిస్తుంది. మూడేళ్లలో దీనిని ఇలా తీర్చిదిద్దింది సర్పంచ్ మీనాక్షి గాడ్గె. అందుకే ఆమెకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది.ఎందుకో చదవండి... నూట అరవై కుటుంబాలు 700 జనాభా ఉన్న ఆ చిన్న ఊరు ఎంత ముచ్చటగా ఉంటుందంటే ప్రతి ఊరు ఇలాగే ఉంటే బాగుండు అనిపిస్తుంది. మూడేళ్ల క్రితం వరకూ అది అన్నింటిలాగే ఒక మామూలు పల్లె. మూడేళ్లలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచే స్థాయికి ఎదిగింది. దానికి కారణం సర్పంచ్ మీనాక్షి గాడ్గె. ఆమె కృషి, పట్టుదల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా గ్రామాన్ని అద్భుతమైన గ్రామంగా తీర్చిదిద్దాయి. నూతన గ్రామపంచాయతీ ఒకప్పుడు అనుబంధ గ్రామంగా ఉన్న ముఖరా 2019లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. గ్రామ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న సుభాష్ గాడ్గె తన భార్య మీనాక్షిని సర్పంచ్‌గా పోటీ చేయమని ప్రోత్సహించాడు. అక్షరాస్యత అంతంత మాత్రమే ఉన్న ఆ గ్రామంలో ఇంటర్ వరకూ చదివి అందరితో స్నేహంగా ఉండే మీనాక్షి ఆ పదవికి తగినదేనని ఊరంతా భావించింది. ఏకగ్రీవంగా ఆమెను సర్పంచ్‌గా ఎన్నుకుంది. ఈ నిర్ణయం మీనాక్షిని బాగా కదిలించింది. తన మీద ఇంత విశ్వాసం ఉంచిన గ్రామానికి పూర్తిగా సేవ చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. అన్నీ మంచి పనులే మీనాక్షి సర్పంచ్ అయిన వెంటనే చేసిన మొదటి పని ఊళ్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు కట్టించడం. దాంతో ఊరు ఒక్కసారిగా బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా మారిపోయింది. ఆ తర్వాత తాగునీరు ప్రతి ఇంటికి అందేలా చేయడమే కాకుండా ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత ఏర్పాటు చేసి వృ«థానీరు ఆ గుంటలో పోయేలా చూసిందామె. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఊరి బయట పెద్ద వాగు వానొస్తే పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగేది. మీనాక్షి వంతెన కట్టించింది. పక్కా రోడ్ల నిర్మాణం, సైడు కాలువల వల్ల శుభ్రత ఏర్పడింది. పాత భవనంగా ఉన్న స్కూలును కొత్త భవన నిర్మాణం చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే కాదు ఇంగ్లిష్ మీడియంలో చెప్పడానికి టీచర్లను నియమించింది. దాంతో 1 నుంచి 5 వరకు ఊళ్లో ప్రతి ఒక్క విద్యార్థి ఈ ప్రభుత్వ బడిలోనే చదువుతున్నాడు. డయల్ 100కు ఒక్క కాల్ లేదు ‘గత మూడేళ్లుగా మా ఊరి నుంచి డయల్ 100కు ఒక్క కాల్ కూడా వెళ్లలేదు’ అంటుంది మీనాక్షి. దానికి కారణం సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడమే. దాని వల్ల సగం గొడవలు లేకుండా పోయాయి. మద్యం తాగితే జరిమానా విధిస్తారు. అంతేకాదు గ్రామమంతా శాకాహారాన్ని అలవాటు చేసుకుంది. ఆరోగ్యం కోసం శాకాహారాన్ని ప్రచారం చేయడం వల్ల ఈ మార్పు వచ్చింది. ఊరిలో చిన్న అంగడి కూడా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తుంది. ఇక ఊరిలో నలభై వేల చెట్లు ఉన్నాయి. హరితహారంలో భాగంగా పదివేల మొక్కలు నాటి వాటిని పూర్తిగా కాపాడుకున్నారు. ఊళ్లోనే ఒక నర్సరీ ఉంది. వీటన్నింటి వల్ల ఊరు చల్లటి నీడలో ఉంటుంది. ఇందువల్లేనేమో కరోనా ఈ ఊరు దరిదాపులకు రాలేదు. మహిళా విజేత ఇన్ని మంచి పనులు చేసింది కనుకనే మీనాక్షిని మార్చి 4న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్–2023’ కార్యక్రమంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘మహిళా విజేత’ పురస్కారంతో సత్కరించనుంది. ‘నా భర్త, పిల్లలు, ఊరి ప్రజలు... వీరందరి సహకారం వల్లే ఈ పురస్కారం’ అని మీనాక్షి అంది. చెత్తను ఎరువుగా అమ్మి ముఖరాలో తడి చెత్త – పొడి చెత్త విభజనను ప్రతి ఒక్కరూ పాటిస్తారు. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేసి రైతులకు అమ్మి పంచాయతీకి లాభం సంపాదించిపెడుతోంది మీనాక్షి. ఎరువు అమ్మకం ద్వారా 6 లక్షలు వస్తే వాటిలో నాలుగు లక్షలు వెచ్చించి ఊళ్లో 6 కె.వి. సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారయ్యే కరెంటులో 4 కిలోఓల్టులు పంచాయతీ ఉపయోగించుకున్నా 2కిలో ఓల్ట్లను పవర్ గ్రిడ్‌కు అమ్మడం ద్వారా లాభం రానుంది. – ఇన్పుట్స్: గొడిసెల కృష్ణకాంత్ గౌడ్, సాక్షి, ఆదిలాబాద్ చదవండి: జంగిల్ రాణి..పద్మిని మాఝీ: అడవిని చేరాలంటే ఆమెను దాటాలి -
మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లేదు..
జగిత్యాల: ‘మమ్మల్ని మా ఊర్లో ఉండనివ్వడం లే దు.. వివాహాలను అడ్డుకుంటున్నారు.. గ్రామంలో ఎవరు చనిపోయినా ఆధార్‌కార్డు ఇస్తేనే అంత్యక్రియలకు అనుమతి ఇస్తానంటున్నారు’ అని ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణి ద్వారా అద నపు కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. 40ఏళ్లుగా వేములకుర్తిలో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వలస వచ్చి ఇక్కడ ఉండొద్దా? అని ప్రశ్నించారు. మా పని మేం చేసుకుంటామని, మమ్మల్ని బతకనివ్వాలని ప్రజావాణి ద్వారా వేడుకున్నారు. సుమారు 20 మంది వరకు కలెక్టరేట్‌కు తరలివచ్చి తమ ఆవేదనను వెలిబుచ్చారు. సుమారు 60 కుటుంబాలు గ్రామంలో ఉంటున్నాయని, గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోవాలని సర్పంచ్ ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇల్లు కిరాయి ఇవ్వడం లేదు నేను పరాయి దేశం పోయి వచ్చి అంతా లాసైన. అప్పుల బాధతో నా సొంతింటిని అమ్ముకున్న. కిరాయి ఇంట్లో ఉండనివ్వడంలేదు. ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – మాచర్ల లక్ష్మణ్ పెళ్లి అడ్డుకునేందుకు యత్నించారు నేను దివ్యాంగుడిని. ఇటీవల నాకు వివాహం నిశ్చయమైంది. పెళ్లిని అడ్డుకునేందుకు సర్పంచ్ ప్రయత్నం చేశారు. బ్రాహ్మణులను రాకుండా చేశారు. వేరేవాళ్లతో పెళ్లి చేయించుకున్నాం. – రాట్నం మహేశ్ శవాన్ని అడ్డుకున్నారు మా తాత ముత్తయ్య ఇటీవల చనిపోయాడు. ఆ శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్దామంటే ఆధార్‌కార్డు ఇస్తేనే పంపిస్తామని సర్పంచ్ చెప్పిండ్రు. చేసేది లేక ఆధార్‌కార్డులు ఇచ్చినం. ఇప్పుడు మా వద్ద అవిలేవు. ఇబ్బందిగా ఉంది. – రాజ్‌కుమార్ -
సర్పంచ్ అంటే అట్లుండాలి! తొలిసారిగా నగదు డెలివరీ చేసే డ్రోన్!
ఇంకా చాలా మూరుమూల ప్రాంతాల్లోని వారు రాష్ట్ర పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను అందుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందులోనూ దివ్యాంగుల పరిస్థితి గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అలానే ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగుడి కోసం స్వయంగా డ్రోన్ కొనుగోలు చేసి మరీ పెన్షన్ అందించి.. తన గొప్ప మనుసును చాటుకుంది ఓ మహిళా సర్పంచ్. వివరాల్లోకెళ్తే.. ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని మారుమూల గ్రామంలో హెతారం సత్నామీ అనే శారీరక వికలాంగుడు నివశిస్తున్నాడు. ప్రభుత్వ ఫించను కోసం ప్రతి నెల దట్టమైన అడవి గుండా రెండు కి.మీ పైగా దూరంలో ఉన్న పంచాయతీ వద్దకు వచ్చేందుకు నానాతంటాలు పడుతున్నాడు. ఈసారి సర్పంచ్ చొరవతో అతను ఫించన్‌ను నేరుగా ఇంటి వద్ద తీసుకున్నాడు. ఆ గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల దివ్యాంగుడు సత్నామీ పరిస్థితితి గురించి తెలుసుకుని అతని సమస్యను పరష్కరించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా ఆన్లైన్లో డ్రోన్‌ని కొనుగోలు చేశారు అగర్వాల్. ఈ మేరకు సర్పంచ్ అగర్వాల్ మాట్లాడుతూ..సత్నామీ పుట్టుకతోనే వికలాంగు, కదలలేడు. దీంతో అతని పేరును రాష్ట్ర ఫించన్ పథకంలో నమోదు చేశాం. ఐతే ఫించన్ కోసం ఆ అడవిని దాటి పంచాయతీ వద్దకు రావడానికి చాల కష్టపడుతున్నాడు. ఇతర దేశాలలో డ్రోన్లను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకుని వెంటనే కొనుగోలు చేసి అతడికి ఫించన్ పంపేందుకు వినియోగించాలని నిర్ణయించుకున్నా. ఐతే సదరు వ్యక్తికి విజయవంతంగా డ్రోన్ సాయంతో డబ్బు డెలివరీ చేయగలిగాం అని సర్పంచ్ చెప్పుకొచ్చారు. డ్రోన్లను కొనుగోలు చేసే సదుపాయం ప్రభుత్వం వద్ద లేనందును సర్పంచే స్వయంగా కొనుగోలు చేయడంతో ఇది సాధ్యమైందని నువాపాడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుబదార్ ప్రధాన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మందులు, కిరాణ సామాగ్రి, ఆహారం, ఇతర వస్తువులను డ్రోన్ల సాయంతో డెలివరీ చేయండ చూశాం. గానీ ఇలా డ్రోన్‌తో నగదు డెలవరీ చేయండం భారత్‌లోనే ప్రపథమం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?.. నా నుంచి అది మాత్రం లాక్కోలేరు: ఉద్దవ్ థాక్రే) -
ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం..
గాంధీనగర్: పెళ్లి వేడుకలో కెరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రెండు అంతస్తుల భవనంపై నుంచి రూ.500 నోట్లు విసిరాడు. దీంతో అక్కడున్న వారు వీటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. గజరాత్ కేక్రి తససీల్దార్ పరిధిలోని సెవాడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నోట్లు విసిరింది మాజీ సర్పంచ్ అని తెలుస్తోంది. ఆయన మేనల్లుడి పెళ్లి సందర్భంగా ఆనందంలో ఇలా చేశారు . మొత్తం రూ.5లక్షలకు పైనే మేడపైనుంచి వెదజల్లినట్లు సమాచారం. #SorosGang भिखारी ए भारत हे तेरे वाहा filmo मे रुपीया उडते हे 🤣🤣🤣 गुजरात मेहसाणा pic.twitter.com/T7lKnK8AnA — akshaypatel (@akshayhspatel) February 18, 2023 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు షాక్ అయ్యారు. మరికొందరేమో గుజరాత్లో ఇది సాధారణమే అన్నారు. గతంలోనూ ఓ ఈవెంట్లో సింగర్‌పై రూ.50 లక్షలను వెదజల్లిన విషయాన్ని గుర్తుచేశారు. చదవండి: 18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు.. -
పాలిథీన్ చెత్తతో రండి.. గోల్డ్ కాయిన్‌తో వెళ్లండి
అనంతనాగ్(జమ్ము కశ్మీర్): ఈ భూమ్మీద పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. మనసు పెడితే.. చెత్త కూడా బంగారమే అవుతుంది!. నమ్మరా?.. అయితే.. ఆ సర్పంచ్ వైవిధ్యభరితమైన ఆలోచన, దాని వెనుక ఉన్న బలమైన కారణం.. ఏడాది కాలంలో ఆ ప్రయత్నంతో తన ఊరిలో తెచ్చిన మార్పు గురించి తెలుసుకోవాల్సిందే!. ఫరూఖ్ అహ్మద్ ఘనై.. పాలిథీన్ చెత్తతో వచ్చి గోల్డ్ కాయిన్‌తో వెళ్లమంటున్నాడు. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని కొండల మధ్య ఉండే సాదివారా అనే ఓ గ్రామానికి ఆయన సర్పంచ్. పైగా లాయర్ కూడా. పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. ఒక తీవ్రమైన సమస్యగా అర్థం చేసుకున్నాడాయన. శుభ్రత మీద ఇప్పుడు దృష్టిసారించకపోతే.. రాబోయే పదేళ్లలో సారవంతమైన భూమి, స్వచ్ఛమైన నీటి వనరులను కనుగొనలేరంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారాయన. ఇంట్లో పేరుకుపోయిన పాలిథీన్ చెత్తను బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో, నీళ్లలో పడేస్తున్నారు గ్రామస్తులు. అది నేలలో కలిసిపోవడం జరగని పని. అందుకే శుభ్రత కోసం అధికారులు, ప్రభుత్వం శ్రమించే కంటే.. ప్రజలే దృష్టిసారించడం మేలని భావించాడాయన. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కంటే.. వాళ్లకు ఆశ కల్పిస్తే ఎలా ఉంటుందని భావించాడు. అందుకే పాలిథీన్ చెత్తతో రండి.. బంగారు కాయిన్‌తో వెళ్లండి అనే పిలుపు ఇచ్చాడు. ఎవరైతే 20 క్వింటాళ్లకు తగ్గకుండా, అంతకు మించి పాలిథీన్ చెత్త తీసుకొస్తారో.. వాళ్లకు ఓ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాడు. అలాగే.. అంతకంటే కాస్త తక్కువ చెత్త వచ్చినవాళ్లకు సిల్వర్ కాయిన్ బహుకరిస్తున్నాడు. అంత చెత్త తెచ్చి ఎవరు ఇస్తాడని అనుకోకండి!. ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ఏడాదిలోనే ఎంతో మార్పు తెచ్చిందని సంబురపడిపోతున్నాడాయన. అంతేకాదు.. ఈ ఆలోచన జిల్లా అధికారులను సైతం కదిలించింది. అన్ని పంచాయితీల్లోనూ ఈ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా అభివృద్ధి అధికార యంత్రాంగం నిర్ణయించుకుంది. -
సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
సుభాష్‌నగర్ (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లా నందిపేట్ సర్పంచ్ సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి సోమవారం కలెక్టరేట్లో ఆత్మహత్యకు యత్నించారు. బిల్లుల(ఎంబీల)పై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడంలేదని, దీనితో రూ.2 కోట్ల కుపైగా ఆగిపోయాయంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సమీపంలో ఉన్నవారు వెంటనే దంపతుల నుంచి అగ్గిపెట్టెను లాక్కొని విసిరేశారు. బీజేపీ మద్దతుతో వాణి సర్పంచ్‌గా గెలుపొందడంతో సాకులు చూపి వేధింపులకు గురి చేస్తున్నారని, పంచాయతీ నిధులు మింగేశామని ఆరోపిస్తూ సస్పెండ్ చేశారని తిరుపతి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ మారినా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిల్లులు, చెక్ పవర్ ఇప్పించ లేకపోయారని పేర్కొన్నారు. బిల్లులు రాక గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రజలకు ముఖం చాటేయాల్సి వస్తోందన్నారు. వడ్డీ సహా మొత్తం రూ.4 కోట్ల వరకు అప్పులు అయ్యాయని.. ఈ దిగులుతో తన భార్య, సర్పంచ్ వాణి ఆస్పత్రి పాలైందన్నారు. అయితే కలెక్టర్ వచ్చే వరకూ కలెక్టరేట్ నుంచి కదిలేది లేదంటూ వాణి, తిరుపతి అక్కడే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీపీవో జయసుధ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడంపై విచారణ చేపడతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
రచ్చే కాదు... ఇంట కూడా గెలిచా!!
నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అన్నట్లుగా ఆమె ఎంబీఏ చేసింది. దిల్లీలో చక్కటి జీతంతో సకల సదుపాయాలతో పెద్ద పేరున్న బహుళజాతి సంస్థలో ఉద్యోగం ఆమెది. అలాంటిది, బంగారంలాంటి ఉద్యోగాన్ని, అందులో కంపెనీ ఇచ్చిన హోదాని, ఆ హోదాకు తగ్గ సౌకర్యాలనూ వదులుకుని బిహార్‌లోని మారుమూల ప్రాంతమైన గయ జిల్లా షాదిపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచింది. తాను మెట్టిన గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఆమే డాలీ. ఎందుకలా చేశావని అడిగితే ఇలా చెప్పింది. ‘‘నిజానికి నేనీ పని ఎప్పుడో చేసుండాల్సింది, చేశాను కూడా. అయితే అప్పుడు కుదరలేదు. 2015లో మా పెళ్లయింది. భర్త, మామగారు చాలా మంచివారు. అయితే అది పల్లెటూరు కావడంతో నేను అక్కడ ఉండలేకపోయాను. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయి, ఎప్పటిలాగే నా ఉద్యోగం చేసుకుంటూ సెలవ దొరికినప్పుడు వచ్చి కొద్దిరోజులు గడిపి వెళ్లేదానిని. అలా కొద్దికాలం గడిచింది. ఇంతలో పంచాయతీ ఎలక్షన్లొచ్చాయి. అంతవరకు జనరల్ స్థానంగా ఉన్న మా గ్రామ పంచాయతీని మహిళలకు కేటాయించారు. మా మామగారు, మా వారు ఆ స్థానానికి నన్ను పోటీ చేయమన్నారు. నేను ముందు ఆశ్చర్యపోయాను. తర్వాత చాలా ఆలోచించాను. ఢిల్లీ వంటి మహానగరంలో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్ చేసుకుంటున్న నేను మారుమూల పల్లెటూళ్లో సర్పంచ్‌గా పోటీ చేయడమా? అనుకున్నాను. మా వారు, మా వారు నన్ను 13 వార్డులున్న ఈ పంచాయతీకి సర్పంచ్ పోటీ చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని, గెలవడం కూడా అంత తేలికేమీ కాదని, అయితే బాగా ఆలోచించుకోమన్నారు. ఆ ఊరికి నేను కొత్త. పైగా అప్పటికే నేను ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. నా వేషభాషలు, మాటలు చూసిన గ్రామస్థులు ఇంత ఆధునికంగా ఉన్న ఈమె ఈ ఊరికి ఎంపికై ఏం చేస్తుంది అనుకున్నారో ఏమో, మా కుటుంబానికి ఎంతో పలుకుబడి, డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ నన్ను నమ్మేలా కనిపించలేదు. దాంతో నేను దానిని సవాల్‌గా తీసుకున్నాను. ఉద్యోగంలో వచ్చే సవాళ్లను ఏ విధంగా అయితే అధిగమించే దానినో, ఈ సర్పంచ్ పదవికోసం అదేవిధంగా కృషి చేయాలనుకున్నాను. గ్రామీణుల నుంచి ఇతరులను వేరు చేసే వాటిలో ముఖ్యమైనవి వస్త్రధారణ, భాష, సంస్కృతి. మా కుటుంబానికి రాజకీయాలు ఏమీ కొత్తకాదు. నేను అడుగుపెట్టేటప్పటికే మా అత్తగారు లేరు కానీ, మా అత్తగారు గతంలో సర్పంచిగా పని చేసినట్లు విన్నాను. అందుకే అప్పటివరకూ చాలా ఆధునికంగా ఉన్న నేను నా వస్త్రధారణను, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నాను. నిండుగా చీరకట్టు, నుదుట బొట్టు, చేతులకు గాజులు, కంటికి కాటుక, తలపై ముసుగుతో నేను పూర్తిగా అక్కడి అమ్మాయిలా మారిపోయాను. మాట తీరును కూడా మార్చుకున్నాను. కనిపించిన వారినందరినీ ఆప్యాయంగా పలకరించడం, వారి కష్టసుఖాలను కనుక్కోవడం, పెద్దవాళ్లకు గౌరవప్రదంగా నమస్కరించడం వంటి పద్ధతులతో వారికి నా పట్ల నమ్మకం కలిగించాను. ఇదంతా నేను సర్పంచ్ పదవిని ఆశించి చేసినవి కాదు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగంలో రకరకాల సవాళ్లు ఎదురుకాకుండా ఉండవు కదా... మన తెలివితేటలు, ఓర్పు, నేర్పుతో వాటిని ఏ విధంగా అధిగమిస్తామో, అలాగే ఇది కూడా అనుకున్నాను. అందుకే వారికి తగ్గట్టు నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. ఆ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడం, అందరూ చదువుకునేలా చేయడం, గ్రామస్థుల సమస్యలు పరిష్కరించడం ముఖ్యలక్ష్యాలుగా ఎంచుకున్నాను. అంతే! వారు నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. అప్పటినుంచి నేను పూర్తి సమయాన్ని గ్రామాభివృద్ధి కోసమే కేటాయిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన వారందరూ నా వారే అనుకున్నాను. రకరకాల కుటుంబ సమస్యలతో నా దగ్గరకొచ్చిన వారికి నాకు చేతనైన రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాను. గ్రామంలో స్త్రీ విద్య కోసం కృషి చేశాను. పంచాయతీకి నిధుల కేటాయింపు కోసం కృషి చేశాను. అక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాకు చేతనైన రీతిలో ఆధునికీరించాను. రోడ్లు మరమ్మతు చేయించడం, వీధి దీపాలు వెలిగేలా చూడటం, పంచాయతీకి రావలసిన పన్నులను సక్రమంగా వసూలయేలా చర్యలు తీసుకోవడం వంటివన్నీ చేస్తూపోయాను. పురుషాధిక్య భావనలు ఉన్న ఆ గ్రామంలో అందరూ నన్ను గౌరవించడం, వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నన్ను ఆహ్వానించడం వంటి వాటితో చిత్రంగా నా కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్న పోటీ, పరుగులు తీయడం, చికాకు, ఆందోళన, టెన్షన్లు వంటివి ఇక్కడ లేవు. నేను ఉద్యోగం చేస్తే కేవలం డబ్బు మాత్రమే వచ్చేది. అదే ఇక్కడ సర్పంచ్‌గా ఉండటం వల్ల ఎందరో గ్రామీణుల జీవితాలను బాగు చేయగలిగానన్న ఆత్మసంతృప్తి, మానసిక ప్రశాంతత కలిగాయి. అప్పుడు అనిపించింది... ఇంట గెలిచి రచ్చగెలువు అన్న సామెత ఉట్టిది కాదని... నేను బయటే కాదు, ఇంట కూడా గెలిచాననీ’’ పెద్ద చదువులు చదువుకున్న ప్రతి వారూ పెద్ద కంపెనీలలోనే పని చేసి రెండు చేతులా సంపాదించాలని ఏమీ లేదు, పెద్ద మనసుతో సొంత వూళ్లో సొంత ప్రజలకు సేవ చేసినా తృప్తితో గుండెలు నింపుకోవచ్చునని డాలీ ఉదంతం చెబుతోంది. (క్లిక్ చేయండి: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!) -
సర్పంచుల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ సమరం
-
సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి!.. కేంద్రం రూ.1,100 కోట్ల నిధులు ఆపేసింది
సాక్షి, హైదరాబాద్: ‘సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులు ఆపేశారు. అందుకే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతు కల్లాలకు రూ.150 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా భావించి, ఆ డబ్బులు ఆపేశారు. ఈ విషయమై సర్పంచ్‌లకు అధికారులు అవగాహన కలి్పంచాలి’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రం కావాలనే నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ విధంగా నిధులు ఆపడం సరికాదని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని చెప్పారు. కొంతమంది సర్పంచులు బీజేపీ మాయలోపడి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయా గ్రామాలకు అందిన నిధుల వివరాలతో ప్రతీ పంచాయతీలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో తొలుత సమావేశమై, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ ఆఫీసర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లతో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల జాబితాలు అందజేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బాగా పనిచేయడం వల్ల పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు వచ్చిందని, జాతీయస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని.. ఇదే స్పూర్తిని ఇకముందు కూడా కొనసాగించాలని కోరారు. కొత్తగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయాల పనులను వేగంగా చేయాలని సూచించారు. చదవండి: ‘అన్మ్యాన్డ్’.. సబ్స్టేషన్లు!.. టీఎస్ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట -
జీపీల నిధులు వెంటనే విడుదల చేయాలి
బషీరాబాద్: పంచాయతీలకు కేటాయించిన కేంద్రం, ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించడంపై సర్పంచులు మండిపడుతున్నారు. పంచాయతీలకు హక్కుగా వచ్చిన కేంద్ర నిధులను ఇతర పథకాలకు వాడుకుని తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట అధికార బీఆర్ఎస్కు చెందిన దాదాపు 20 మంది సర్పంచులు ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల (జీపీ) అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో ఎనిమిది నెలలుగా తమకు కేంద్ర నిధులు అందలేదని తెలిపారు. కాగా, గత వారంరోజుల్లో రెండు విడతలుగా కేంద్ర నిధులు జమయ్యాయని స్పష్టంచేశారు. కానీ జమైన నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఖాళీ చేసిందని చెప్పారు. జీపీల కరెంటు బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలకు కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని రాష్ట్రం ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధులను పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, హరితహారం, అభివృద్ధి పనులకే వినియోగించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎనిమిది నెలలుగా ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయలేదని, దీంతో ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక, కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. అప్పులు తెచ్చి పూర్తిచేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రావడం లేదని, నెలనెలా వడ్డీలు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆర్థిక సంఘం నిధులు జమచేయాలని, లేదంటే బీఆర్ఎస్కు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు అధికారులు మాత్రం పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేస్తామని సర్పంచులకు సర్ది చెబుతున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సర్పంచులు ప్రియాంక, రవీందర్, భీమప్ప, శాంతిబాయి, విష్ణువర్ధన్‌రెడ్డి, దశరథ్, హన్మీబాయి, నారాయణ, దేవ్‌సింగ్, అనురాధ, గాయత్రి, వీరమణి, వెంకటయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
సర్పంచుల రాజీనామా కేసీఆర్‌కు చెంపపెట్టు: షర్మిల
సాక్షి, హైదరాబాద్: అసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 18 మంది సర్పంచులు చేసిన రాజీనామా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చెంపపెట్టు అని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే చైతన్యం రావాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్టీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేంద్రం ఇచ్చే నిధులను దొంగచాటు గా కాజేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టు ఉంది కేసీఆర్ తీరు’ అని ఎద్దేవా చేశారు. నిధులు విడుదల చేయక ఇప్పటికే రాష్ట్రంలో 11 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్‌తో సర్పంచ్ల గగ్గోలు..
ఇటీవల నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బందితో కలిసి భిక్షమెత్తారు. సర్పంచ్ నయ్యా ‘దానం చేయండి’అంటూ బ్యానర్ పట్టుకుని, డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ భర్త మల్లేష్ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు చేశాడు. బిల్లులు రాకపోవడంతో, తెచ్చిన అప్పులు కట్టలేక ఈ మధ్యనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్ / నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సర్పంచ్ల పరిస్థితి అటు చెంపదెబ్బ, ఇటు గోడ దెబ్బ అన్నట్టుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రూ.వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల్లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్నిచోట్ల రక్షిత మంచినీటి సరఫరా చేసే విద్యుత్ మోటార్లు పాడైతే మరమ్మతు చేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని చోట్ల లక్షల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో వడ్డీలు కట్టలేక, కుటుంబ పోషణ కూడా భారమై దినసరి కూలీలుగా మారుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 1,692 గ్రామ పంచాయతీలున్నాయి. ఎస్ఎఫ్సీ నుంచి రూ.89.63 కోట్ల నిధులు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం, రాష్ట్రం నుంచి నెలకు రూ.13 కోట్లు వస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కేంద్రం నిధులు, గత రెండు నెలలుగా రాష్ట్ర నిధులు రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలున్నాయి. ప్రతినెలా విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.30 కోట్లు రావాలి. కానీ ఈ మార్చి నుంచి నిధులు రాలేదు. ఇక చేపట్టిన పనులకు సర్పంచులకు ఏడాదిన్నరగా బిల్లులు రాలేదు. చిన్న జీపీలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా, పెద్ద జీపీలకు రూ.12 నుంచి రూ.18 లక్షల దాకా పెండింగులో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. మొత్తం జీపీలు 1,507. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్రాల నుంచి రూ.203.39 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బేల మండల సర్పంచ్‌లు నిధుల విడుదలలో జాప్యానికి నిరసనగా ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా.. సూర్యాపేట జిల్లాలో 475 జీపీలున్నాయి. నెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8.75 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.8.25 కోట్లు రావాల్సి ఉంది. కానీ కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. అయితే ఇటీవలే ఎస్ఎఫ్సీ ఒక నెల నిధులు రూ.8.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 15 ఆర్థిక సంఘం నిధులు రూ.70 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ. 24.75 కోట్లు పెండింగులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులు రూ.2 వేల కోట్లు పెండింగ్! నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులో జాప్యానికి తాము కారణం కాదంటే తాము కారణం కాదని అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ఇచి్చన డబ్బుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకుంటున్నాయి. కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులకు సమానంగా తాము కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆదాయం అంతగా లేని కొన్ని చిన్న పంచాయతీల్లో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (గత ఏప్రిల్ నుంచి) 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మరోవైపు పలు గ్రామ పంచాయతీలకు దాదాపు 3, 4 నెలలుగా రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి వచి్చన నిధులకు సంబంధించిన వినియోగ సరి్టఫికెట్లు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) రాష్ట్రం సమర్పించలేదని, అందుకే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో (జీపీలు) 7,100కు పైగా మైనర్ పంచాయతీలు, వాటిలో కొత్తగా ఏర్పాటైన జీపీలు 4,383 ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఐదారు వందల లోపు జనాభా ఉన్న పంచాయతీలే ఎక్కువగా ఉండగా, సొంత ఆదాయ వనరులు లేక ఈ పంచాయతీలన్నీ పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. కాగా 15వ ఆరి్ధకసంఘం నిధులు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.1,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. అలాగే నాలుగు నెలల కాలానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు పంచాయతీలకు విడుదల కాలేదు. అవి కూడా దాదాపుగా అంతే మొత్తంలో ఉన్నట్టుగా సర్పంచ్‌లు చెబుతున్నారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు పెండింగ్ కూలి రూ.160 కోట్లతో పాటు, మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఆరేడు వందల కోట్లు కేంద్రం నుంచి రాలేదు. వీటితో పాటు దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉపాధి బకాయిల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిబంధలను విరుద్ధంగా ఇతర పనులకు ఉపయోగించిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.152 కోట్లు తమకు తిరిగి చెల్లించాలంటూ రాష్ట్రానికి కేంద్రం నోటీసులిచి్చంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్ల గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులతో పాటు పల్లెప్రగతి నిధులు కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో దాదాపు 80% దాకా చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్లో సర్పంచ్ల సమస్యలపై ఇటీవల ధర్నాచేశాం. – ఉప్పల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ చాంబర్ జనరల్ సెక్రటరీ రూ.4.50 లక్షల బిల్లులు రావాలి ఈ ఏడాది మా గ్రామంలో రూ.2.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2.80 లక్షలతో డ్రైనేజీ నిర్మించాం. రూ.1.50 లక్షలతో లైట్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం పంచాయతీకి రూ.4.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. మలీ్టపర్పస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉంది. – కిష్ట్యానాయక్, పల్లెగడ్డతండా సర్పంచ్, నారాయణపేట జిల్లా ట్రాక్టర్ డీజిల్‌కూ అప్పు! నిధులు రాకపోవడంతో పంచాయతీ ట్రాక్టర్ రోజువారీ డీజిల్ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల జాడే లేదు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ పనులు చేస్తే ఇదీ పరిస్థితి. – కాశీ విశ్వనాథ్, 4 ఇంక్లైన్ సర్పంచ్, భద్రాద్రి జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి.. 8 నెలల క్రితం రూ.4 లక్షలు అప్పు తెచ్చి మురుగు కాల్వలను నిర్మించాం. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. జీపీకి ప్రభు త్వం ఇచ్చే నిధులు ట్రాక్టర్ కిస్తీకి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాలి. నిధుల విడుదలపై దృష్టి సారించాలి. – తూముల శ్వేత, పెన్ పహాడ్ మండల కేంద్ర సర్పంచ్, సూర్యాపేట జిల్లా -
రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్చార్జ్ సర్పంచ్ భిక్షాటన
కౌడిపల్లి (నర్సాపూర్): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్చార్జి సర్పంచ్ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై -
నాడు నాన్న.. నేడు అమ్మ! ..
సాక్షి, మెదక్: తండ్రి, తల్లి మృతితో నా అనేవారు లేక ఓ బాలిక అనాథగా మారింది. సర్పంచ్, గ్రామస్తులు ముందుకు వచ్చి అంత్యక్రియలు చేసిన ఘటన జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన గుమ్ల రాములు, మల్లవ్వ దంపతులకు కూతురు రేణుక ఉంది. రేణుక వర్గల్ కస్తూర్బాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రాములు పదేళ్ల క్రితం మృతి చెందగా, మల్లవ్వ తన కూతురుతో కలిసి రెండేళ్లుగా కుకునూర్‌పల్లిలో ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మల్లవ్వ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందింది. బంధువులు ఎవరు రాకపోవడంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న రాయవరం సర్పంచ్ పావని మల్లవ్వ శనివారం అంత్యక్రియలకు సాయం అందించారు. తల్లిదండ్రుల మృతితో అనాౖథెన బాలికను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. (చదవండి: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) -
గుర్జకుంట సర్పంచ్, ఉపసర్పంచ్‌పై ఫిర్యాదు!
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని గుర్జకుంట గ్రామ పంచాయతీలో జరిగినఅవకతవకలపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సర్పంచ్, ఉపసర్పంచ్ ఇద్దరు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ నిధుల ఖర్చు వివరాలపై సర్పంచ్ మమతా రాంరెడ్డి, ఉపసర్పంచ్ సత్యనారాయణలను అడగగా..వారు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారన్నారు. ఈ విషయంపై నంగి చంద్రం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకున్నారనన్నారు. ఆ వివరాలను పరిశీలించగా పంచాయతీ నిధుల ఖర్చులో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, అట్టి వివరాలతో సంబంధిత జిల్లా, మండల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
సర్పంచులుగా ఉన్నా వీడని వృత్తులు.. సాదాసీదాగా జనంతో మమేకం
బి.కొత్తకోట(అన్నమయ్య జిల్లా): సాధారణంగా చిన్న పదవికే డాబు, దర్పం ప్రదర్శించేవాళ్లను చూస్తుంటాం. ఆ పదవితో చేస్తున్న వృత్తిని వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుని అవతారం ఎత్తేస్తారు. అయితే గ్రామానికి ప్రథమపౌరులై ఉండి, మన దేశంలో ప్రధానికైనా లేని చెక్‌పవర్ కలిగిన సర్పంచులు సాదాసీదాగా, చేస్తున్న వృత్తికే అంకితమై ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము సర్పంచులం, మనకొక హోదా, గుర్తింపు, సమాజంలో, అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉందన్న అహం కొందరిలో మచ్చుకైనా కనిపించడం లేదు. సర్పంచులు కాక ముందు ఏ వృత్తిలో ఉండి జీవనం సాగించేవాళ్లో ఇప్పుడూ వాటినే కొనసాగిస్తూ పంచాయతీ ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. సర్పంచు అయ్యాక మనోడు మారలేదు అనుకునేలా అందరితో కలిసిపోతూ మమేకమవుతున్నారు. అలాంటి సర్పంచుల్లో కొందరి గురించి... మోటర్ మెకానిక్‌గానే... అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళెంకు చెందిన సి.జయరామిరెడ్డి వైఎస్సార్సీపీ మద్దతుతో నాయనబావి సర్పంచుగా పోటీ చేసి అధిక మెజార్టితో గెలుపొందారు. అప్పటివరకు వ్యవసాయ మోటార్లకు రిపేర్లు చేసే మెకానిక్‌గా గ్రామస్తులకు పరిచయం. సర్పంచు పదవితో రాజకీయాల్లో బీజీ అయిపోతాడని గ్రామస్తులు భావించారు. డిగ్రీ ఫైయిల్ అయిన జయరామిరెడ్డి భిన్నంగా ఉన్నాడు. సర్పంచు పదవి ఇప్పుడొచ్చింది, నాకు జీవితాన్నిచ్చిన వృత్తిని వదిలేదిలేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. సర్పంచుగా అధికారుల సమావేశాలకు హజరువుతూ, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మోటార్ల రిపేరు పనిని కొనసాగిస్తున్నాడు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం పెద్దమండ్యం మండలం కోటకాడపల్లె సర్పంచు కే.భూదేవి చదివింది ఐదో తరగతి. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఆమె సర్పంచు అయింది. భర్త పెద్దరెడ్డెప్పకి ఒకటిన్నర ఎకరా పొలం, అందులో బోరు ఉంది. మొదటినుంచి మహిళా రైతుగా వ్యవసాయం చేస్తోంది. కోటకాడపల్లె సర్పంచు పదవికి పోటీచేసి గెలుపొందినా ఆమె రైతు జీవితాన్ని వీడలేదు. సర్పంచుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రోజూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. తాను గ్రామానికి ప్రథమ పౌరురాలిని అన్న దర్పం చూపకుండా టమాట, వేరుశెనగ పంటల సాగు పనులు చేస్తున్నారు. మహిళా సర్పంచు అయినప్పటికి మహిళా రైతు జీవితాన్ని వీడలేదు. పదవిలో రాణిస్తూ.. వృత్తిలో కొనసాగుతూ.. తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లె సర్పంచుగా పదో తరగతి చదివిన ఓ సాధారణ బోర్ మెకానిక్ ఎస్.మౌలాలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పైసా ఖర్చు లేకుండా ఏకగ్రీవమంటే ఆ సర్పంచు డాబు చూపాల్సిందే. అయితే ఈయన సర్పంచుగా కంటే బోర్ మెకానిక్‌గానే గుర్తింపు కోరుకొంటున్నాడు. పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఈయన ఈ ప్రాంతంలో బోర్లలో మోటార్లను వెలికితీయడం, కాలిపోయిన మోటార్లకు వైండింగ్ పనులు చేస్తున్నారు. సర్పంచుగా విధులు నిర్వర్తిస్తూనే మెకానిక్ పని చేస్తున్నాడు. తన వృత్తికి సర్పంచు పదవి అడ్డంకికాదని, అందరూ తనను మెకానిక్‌గానే అభిమానిస్తారని అంటున్నాడు మౌలాలి. సమస్యలు పరిష్కరిస్తూ.. దుకాణం నడుపుతూ.. బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన ఆర్.రుక్మిణి ఇంటర్ ఫెయిల్. తుమ్మణంగుట్ట సర్పంచు పదవి జనరల్ మహిళ కావడంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. భర్త అమరనాథరెడ్డితో కలిసి చిల్లర దుకాణం, చికెన్ సెంటర్ నడుపుతూ వస్తున్నారు. సర్పంచుగా గెలుపొందినా వృతిని వీడలేదు. సర్పంచుగా సమావేశాలకు హజరవుతూ, పల్లెల్లో పర్యటిస్తూ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అయినప్పటికి సాధారణ గృహిణిలా, దుకాణంలో పనులు చేసుకుంటూ కనిపిస్తారు. (క్లిక్: ఆ నిబంధనతో పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్య..) -
ఇదెక్కడి గోల.. ఈ భారం మోయలేం..
కరీంనగర్: గ్రామపంచాయతీలో సరిపడా నిధులు లేక సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఇవే తలకుమించిన భారమైతే.. సర్పంచ్‌లపై ట్రాక్టర్ల నిర్వహణ భారం కత్తిమీద సాములా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ఇచ్చిన ట్రాక్టర్ల కిస్తీలు కట్టలేక తలలు పట్టుకుంటున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి ఒక్క రూపాయి కూడా రావడంలేదు. దీంతో పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. తలలు పట్టుకుంటున్న సర్పంచ్‌లు జిల్లాలో 16 మండలాల పరిధిలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్త పంచాయతీలు 57 ఉన్నాయి. అయితే.. చాలా పంచాయతీలకు ఆదాయ వనరులు తక్కువ. దీంతో సిబ్బందికి జీతాల చెల్లింపు భారంగా మారిందని సర్పంచ్‌లు చెబుతున్నారు. ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన వివిధ బాధ్యతలు నిర్వహించేందుకు పలువురు సిబ్బంది అవసరం. పంచాయతీ వ్యవహారాలు చూసేందుకు కారోబార్‌తో పాటు పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్, వాటర్ ట్యాంక్‌లు, బోర్ల నిర్వహణ, తాగునీటి సరఫరా పనులు చూసేందుకు వాటర్‌మెన్, వీధిలైట్ల మెయిన్టనెన్స్ కోసం ఎలక్ట్రిషియన్, పారిశుధ్య పనులు, చెత్త సేకరణ సఫాయి కార్మికులు అవసరం ఉంటారు. పంచాయతీ ట్రాక్టర్లు నడిపేందుకు డ్రైవర్లు అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా డ్రైవర్లను నియమించకపోవడంతో పంచాయతీ సిబ్బందిలో నుంచి ఒకరిని డ్రైవర్‌గా నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సర్పంచ్‌లు అనుభవం లేని వారిని డ్రైవర్లను నియమించుకున్నారు. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రస్తుతం పంచాయతీ స్థాయి జనాభాను బట్టి సిబ్బంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి రూ.5 వేల నుంచి రూ.3 వేల వరకు వేతనాలు ఉన్నాయి. జీతాలు వ్యయం తక్కువగానే ఉండడంతో పంచాయతీలు భరిస్తున్నాయి. మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు నెలకు రూ.8,500 చెల్లించాల్సి ఉండడంతో సర్పంచ్‌లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. 500 జనాభాకు ఒకరు.. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇదివరకు ఉన్న గ్రామపంచాయతీలను పునర్ వ్యవస్థీకరించి కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆమ్లెట్ గ్రామాలు, గిరిజన తండాలు కొత్త జీపీలుగా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో వివిధ పనులు నిర్వహించేందుకు గాను గ్రామపంచాయతీలో 500 జనాభాకు ఒకరి చొప్పున మల్టీపర్పస్ వర్కర్లను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతీ పంచాయతీకి కనీసం ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు ఉండాలని సూచించింది. 500 వరకు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 10 ఉన్నాయి. 3 వేలలోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 244 ఉన్నాయి. 3 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 59 ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 1800 నుంచి 2000 మందికిపైగా మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవింగ్, మురికికాలువలు తీయడం, బల్బులు పెట్టడం, వాటర్ సమస్యలను పరిశీలించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. చిన్న పంచాయతీల్లో గందరగోళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 57 గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ట్రాక్టర్ కిస్తీ నెలకు రూ 16,000, పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.17,000, ట్రాక్టర్ మరమ్మ తు ఖర్చులు రూ.2,500, డీజిల్ ఖర్చు రూ.8,000 చొప్పున నెలకు రూ.43,000 ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి చిన్న పంచాయతీలకు వచ్చే నిధులు రూ.85 వేలు మాత్రమే. మిగితా రూ.42 వేల నుండి పారిశుధ్య కార్మికులకు, వీధి లైట్లకు, ఇతరాత్ర వాటికి ఉపయోగించాలి. ప్రభుత్వమే భరించాలి ఇప్పటికే పంచాయతీలకు పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. ఉన్న సిబ్బందికి జీతాలు ఇచ్చుడే కష్టంగా ఉంది. ట్రాక్టర్ నిర్వహణ, మల్టీపర్సస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇతరాత్ర ఖర్చుల కోసం నానా తంటాలు పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేస్తే వాటిని స్థానికంగా అభివృద్ధి పనులకు వినియోగించుకోనే అవకాశం ఉంటుంది. తలకు మించిన భారంగా తయారైన ట్రాక్టర్ నిర్వహణను ప్రభుత్వమే భరించాలి. – ఉప్పుల రాధమ్మ, గోలిరామయ్యపల్లె సర్పంచ్, రామడుగు (చదవండి: రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్ బాధితులు ) -
మునుగోడు: హోటల్ గిరాకీతో టీఆర్ఎస్ సర్పంచ్ అనురాధ బిజీ
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల వేళ నాయకులంతా ప్రచారంలో బిజీగా ఉంటే.. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం చొప్పరోనిగూడెం సర్పంచ్ అనురాధ మాత్రం హోటల్లో తనపని తాను చేసుకుంటున్నారు. ప్రచార బాధ్యతలను తన భర్త చూసుకుంటున్నారని అనురాధ పేర్కొంటున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన అనురాధ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అయితే చండూరులో నామినేషన్ సందర్భంగా ఆమె నడిపిస్తున్న హోటల్‌కు గిరాకీ ఎక్కువగా ఉండడంతో ప్రచారంలో పాల్గొనకుండా హోటల్లో పనిచేసుకుంటున్నారు. -
యువతిపై సర్పంచ్ అత్యాచారం
సాక్షి, వికారాబాద్: ఓ గ్రామ సర్పంచ్ పూటుగా తాగిన మైకంలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణాన్ని నిలదీసిన యువతి అన్నపై దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నంద్యానాయక్‌తండాలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన ఓ యువతి (21)మేకల కాపరిగా పనిచేస్తోంది. దసరా పండుగ సందర్భంగా యువతి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూసేందుకు వచ్చిన తమ బాబాయి పిల్లల్ని తిరిగి అప్పగించేందుకు వాళ్ల ఇంటికి వెళ్లింది. పక్కనే సర్పంచ్ రాథోడ్ శంకర్ నాయక్ ఇల్లు ఉంది. యువతి తిరిగి వస్తుండగా అప్పటికే పూటుగా మద్యం తాగి ఉన్న శంకర్‌నాయక్ ఆమెకు మాయమాటలు చెప్పి మిద్దమీదకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పిల్లల్ని అప్పగించేందుకు వెళ్లిన తన చెల్లి ఇంకా ఇంటికిరాలేదని అటుగా వెళ్లిన యువతి అన్న అక్కడున్న పిల్లల్ని ఆరాతీయగా సర్పంచ్ తీసుకెళ్లాడని చెప్పారు. వెంటనే మిద్దెమీదకు వెళ్లి చూడగా జరిగిన దారుణం కంటబడింది. సర్పంచ్‌గా ఉంటూ ఇలాంటి పనులు చేస్తావా అని గట్టిగా నిలదీయగా అతడిపై శంకర్‌నాయక్ దాడికి పాల్పడ్డాడు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి రాకను చూసి సర్పంచ్ తప్పించుకున్నా డు. అయితే కొద్దిసేపటికే అతడిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: (అపరిచితుడితో ఫోన్లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని..) -
కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై సర్పంచ్ దాడి
-
సర్పంచ్ పైశాచికం.. కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడిపై దాడి
మహబూబ్ నగర్: తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలి డబ్బులు ఇప్పించాలని అడిగిన ఓ వికలాంగుడిని సర్పంచ్ కాలితో తన్ని దుర్భాషలాడిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్వాడ మండలం ఫుల్పోనీ గ్రామంలో వికలాంగుడైన కృష్ణయ్య తనకు రావాల్సిన ఉపాధి కూలీ డబ్బులు ఇంతవరకు రాలేదని, ఆ డబ్బులు ఇప్పించాలని అధికార పార్టీ సర్పంచ్ శ్రీనివాసులును అడగడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో వికలాంగుడైన కృష్ణయ్య కుటుంబ సభ్యులు, తదితరులు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సర్పంచ్ శ్రీనివాసులు వికలాంగుడు కృష్ణయ్యతో పాటు అధికారులను సైతం బండ బూతులు తిడుతూ.. కాలితో తన్నాడు. ఈ సంఘటన చూసిన మరికొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రూపులలో హల్చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు కేసును సుమోటోగా స్వీకరించారు. సర్పంచ్‌ను సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: కూసుకుంట్లకు రూ.40లక్షల చెక్కు అందజేసిన కేసీఆర్ -
ప్రజాప్రతినిధి ఇంట్లో పెళ్లికి నేతల జేబులు ఖాళీ.. వాట్సాప్ చాటింగ్ వైరల్
సాక్షి, కరీంనగర్: రాజువారింట్లో వివాహనికి రాజ్యమంతా కదిలి వెళ్తుంది. మరి వెళ్లే ప్రజలంతా ఖాళీ చేతులతో వెళ్తారా? ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు కానుకలు తీసుకెళ్తారు. జిల్లాలో ఓ నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో మోగనున్న పెళ్లి భాజాలు.. నేతల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. ఇప్పుడు రాష్ట్రమంతటా మోరుమోగిపోతోంది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. అసలే పెద్ద ప్రజాప్రతినిధి. అందులోనూ ఆయన ఇంట్లో శుభకార్యం. ఆయన అనుచరులు ఉత్తినే ఉంటారా? అంతా కలిసి భారీ బహుమతి తీసుకెళ్లి చదివించాలని నిర్ణయించారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో చాటింపు వేశారు. సర్పంచులు ఇంత, ఎంపీటీసీలు ఇంత అంటూ రేటు ఫిక్స్ చేశారు. వారిలో ఆ నేతకు వీరాభిమాని అయిన ఓ గ్రామస్థాయి నేత ఈ వ్యవహారాన్ని మొత్తం అన్నీ తానై చూసుకుంటున్నారు. కొందరు నగదు రూపంలో చెల్లింపులు చేస్తుండగా.. మరికొందరు తమకు తోచిన కానుకలు సమర్పించుకుంటున్నారు. రామడుగు మండలంలోని ఒక గ్రామ మాజీ సర్పంచికి ఆ శుభకార్యానికి కావాల్సిన కోడిగుడ్లు సరఫరా చేయాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. కొడిమ్యాల మండలానికి చెందిన ఒక నాయకునికి చికెన్, చొప్పదండి కేంద్రానికి చెందిన నాయకునికి మటన్ పంపించాల్సి ఉంటుందని సదరు అనుచరుడు హంగామా చేస్తున్నట్లు సమాచారం. చదవండి: మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్ ఈ వ్యవహారంపై ఓ గ్రామ సర్పంచిని ‘సాక్షి’ వివరణ కోరింది. స్పందించిన సదరు సర్పంచి.. ‘మేమంతా కానుకలను ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు’ అని స్పష్టం చేశాడు. ఇదే నేత సరిగ్గా ఏడాది కింద.. పోలీసు పోస్టింగు విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనడం గమనార్హం. ఏడాదిలో మూడోది..! కరీంనగర్ జిల్లాలో నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగిన సమయంలో ఇలాంటి కానుకల కోసం చందాలు సేకరించడం ఏడాదిలో ఇది మూడో ఘటన. ఆగస్టులో ఓ పార్టీ నేత ఇంట్లో వివాహం జరిగినప్పుడు పలు మహిళా సంఘాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చందాలు సేకరించారు. అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఏడాదిలో కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి ఇంట్లో పెళ్లి కోసం కూడా దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేశారని ఉద్యోగులు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏడాదికాలంలో పెళ్లికానుకల చందాల వసూలులో ఇది మూడోది. ఈ షాదీ ముబారక్ కానుకల వ్యవహారం ఇటు అధికారుల్లో, నేతల్లో ఒక సంప్రదాయంగా మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు -
జెండా ఎగురవేసి.. కూలి పనికి వెళ్లి..
ఆమె గ్రామ సర్పంచ్. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయడం బాధ్యత. మహిళగా కుటుంబ పోషణ బాధ్యత కూడా ఉంది. రెండు బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం, రాజవరం గ్రామ సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ. సర్పంచ్‌ను కదా స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూలీకిపోవడమేంటి అనుకోలేదు. సోమవారంనాడు ముందుగా జెండా ఎగరేసిన సైదమ్మ... అనంతరం రోజూవారీ కూలీగా నాటు వేయడానికి వెళ్లారు. గ్రామంలోని ఓ పొలంలో నాట్లు వేస్తూ ఇలా ‘సాక్షి’కి కనిపించారు. ‘నాటేయడానికి వెళ్తే రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు వస్తాయి. దీనితో కుటుంబం గడుస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఏముంటుంది?’అని చెబుతున్నారు. వార్డు మెంబర్ అయినా సరే కాలర్ ఎగరేసుకుని తిరిగే మగవాళ్లలా కాకుండా... పరిపాలనలో మహిళ ఉంటే పరిణామాలు భిన్నంగా ఉంటాయని నిరూపించారు. – తిరుమలగిరి(నాగార్జునసాగర్) -
Lekhika Dagar: రేడియో జాకీ.. అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్.. ఎవరీమె?
చదువుకున్న వ్యక్తి గ్రామ పగ్గాలు చేపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెబుతోంది 21 ఏళ్ల రేడియో జాకీ. శ్రోతల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటివెన్నో జాకీలు చెబుతారులే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే రేడియో జాకీ ‘లక్షికా దాగర్’ ప్రస్తుతం ఓ గ్రామానికి సర్పంచ్ అయ్యి, రాష్ట్రంలోనే ‘యంగెస్ట్’ సర్పంచ్‌గా నిలిచింది. యువత ఏదైనా అనుకుంటే సాధించగలరు అని చెప్పడానికి లక్షికానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్ పరిధిలోని చింతామన్ జవాసియా గ్రామానికి చెందిన అమ్మాయే లక్షికా దాగర్. మూడువేలకు పైగా జనాభా ఉన్న చింతామణ్కు ఇటీవల పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టు ఎస్సీ మహిళకు కేటాయించబడింది. దీంతో ఎన్నికల్లో ఎనిమిది మంది పోటీపడ్డారు. వీరందరిలోకి చిన్నదైన లక్షికా 487 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ సీటుని దక్కించుకుంది. జూన్ 27న 22 ఏట అడుగుపెట్టడానికి ఒకరోజు ముందు లక్షికా సర్పంచ్‌గా ఎన్నికై మధ్యప్రదేశ్‌లోనే తొలి యంగ్ సర్పంచ్‌గా నిలిచింది. గ్రామంలో తొలిసారి చదువుకున్న అమ్మాయి సర్పంచ్ అవ్వడంతో గ్రామస్థులంతా తెగ సంబరపడిపోతున్నారు. భరత్పూరి జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్‌లో రీజనల్ అధికారిగా పనిచేస్తోన్న దిలీప్ దాగర్ ముద్దుల కూతురు లక్షికా. ఇంట్లో అందరిలోకి చిన్నది. ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతోపాటు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుచేస్తోంది. ఖాళీ సమయంలో రేడియో జాకీగా పనిచేస్తోన్న లక్షికకు చిన్నప్పటి నుంచి సామాజిక సేవా దృక్పథం ఎక్కువ. ఎప్పుడూ గ్రామస్థులతో కలిసి మెలిసి తిరుగుతూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటుండేది. ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు తీర్చాలంటే అధికారం ఉండాలని భావించింది. సర్పంచ్‌గా ఉంటే గ్రామంలో ఎక్కువ మందికి సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసింది. చదువుకున్న అమ్మాయి కావడం, ఆమె మేనిఫెస్టో నచ్చడంతో గ్రామస్థులంతా లక్షికను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆమె ఆధ్వర్యంలో ఆ గ్రామం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఆశిద్దాం. గ్రామాభివృద్ధే ముఖ్య ఉద్దేశ్యం ‘‘చదువుకున్న వారు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఇందుకు గ్రామస్థుల సాయం తప్పక ఉండాలి. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న సమయంలో అనేక సమస్యలు నా ముందుకొచ్చాయి. తాగునీటి సమస్య, ట్యాప్‌లు ఉన్నప్పటికీ నీళ్లు రాకపోవడం, మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం, వీధిలైట్ల మరమ్మతులు వంటివి సమస్యలు ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. అర్హులైన వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు అందడంలేదు. లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కూడా సరిగా అందడం లేదు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. ఈ సమస్యలన్నింటినీ వీలైనంత వేగంగా పరిష్కరిస్తాను. అదేవిధంగా ఒక ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ను కూడా ప్రారంభిస్తాను. ఇవన్నీ ఒక్కోటి పరిష్కారమైతే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది’’. – లక్షికా దాగర్, మధ్యప్రదేశ్ యంగెస్ట్ సర్పంచ్ చదవండి: చిరుతిళ్లను ఆరోగ్యంగా తినొచ్చు -
టీఆర్ఎస్కు ఊరంతా రాజీనామా
అశ్వారావుపేట రూరల్: సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్‌కు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడమే కాక లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ రామన్నగూడెం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఐదుగురు వార్డు సభ్యులు సహా గ్రామంలోని 160 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, గ్రామస్తులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీతో పాటు మరికొందరు నాయకులు పోలీసులను ఉసిగొల్పి తమ పాదయాత్రను అడ్డుకున్నారని వివరించారు. మహిళలపైనా పోలీసులు లాఠీచార్జ్ చేస్తుంటే సొంత పార్టీ వారు అడ్డుకోకపోగా, తరువాత పరామర్శించేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా 21 ఏళ్ల అమ్మాయి!
21-year-old Ujjain Girl: మధ్యప్రదేశ్‌లోని చింతామన్ జవాసియా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థిని ఓడించి 487 ఓట్ల ఆధిక్యంతో గెలిచిని అతి పిన్న వయస్కురాలిగా ఉజ్జయినికి చెందిన 21 ఏళ్ల అమ్మయిగా లతికా దాగర్ రికార్డు సృష్టించారు. లతికా మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ...గ్రామ అభివృద్ధికి కృషి చేయడమే తన లక్ష్యంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. అంతేకాదు ఆమె మేనిఫెస్టోలో తాగునీరు, డ్రైన్, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తానని, ఇళ్లు లేని కుటుంబాలకు గృహనిర్మాణ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందంటూ పలు రకాలు హామీలు ఇచ్చి మరీ గెలుపొందారు. అంతేకాదు మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మధ్యప్రదేశ్‌లోని అతి పిన్న వయస్కురాలైన మహిళా సర్పంచ్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ రికార్డును యాదృచ్ఛికంగా తన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ రికార్డును కైవసం చేసుకోవడం విశేషం. (చదవండి: ఐదేళ్లుగా అమ్మాయి కోసం చూసి చూసి.. చివరికి ఇలా..!) -
రాముడి గుడికట్టిన ముస్లిం సర్పంచ్
రఘునాథపాలెం: సర్పంచ్‌గా గెలిస్తే ఆలయం నిర్మిస్తానన్న హామీని తు.చ. తప్పకుండా అమలు చేసి చూపించిన ముస్లిం మైనార్టీ సర్పంచ్ గ్రామస్తుల మన్ననలు అందుకుంటున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడి దంపాడు సర్పంచ్‌గా ఎస్కే మీరా గతంలో ఓసారి గెలిచారు. రెండోసారి కూడా పోటీలోకి దిగిన ఆయన తనను గెలిపిస్తే గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సొంత డబ్బుతో నిర్మి స్తానని ప్రకటించారు. అనుకున్నట్లుగానే గెలిచిన వెంటనే సర్పంచ్ మీరా రూ.25 లక్షలు సమకూర్చారు. మరో రూ.25 లక్షలు గ్రామస్తులు, దాతల నుంచి సేకరించి గ్రామంలో శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కాగా, గురువారం విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరయ్యే భక్తులందరికీ అన్నదానం ఖర్చు కూడా మీరా భరించనుండటం మరో విశేషం. (క్లిక్: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. భారీ క్యూలు!) -
మేకల కాపరిగా కామాగిరి సర్పంచ్
ఇచ్చోడ: అభివృద్ధి పనులకు నిధులు సరిపోలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదు.. దీంతో సొంత డబ్బు వెచ్చించి.. అప్పులు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేశాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక.. కుటుంబాన్ని పోషించేందుకు మేకలు కాస్తున్నాడు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామాగిరి సర్పంచ్ తొడసం భీంరావు దుస్థితి ఇది. కూలి పనులు చేసుకునే ఆదివాసీ దివ్యాంగుడు భీంరావు కామాగిరి జనరల్ స్థానం నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పంచాయతీకి వస్తున్న అరకొర నిధులు ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్ బిల్లులు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటం, కుటుంబ పోషణ భారంగా మారడంతో విధిలేని పరిస్థితిలో రోజుకు రూ.200 కూలి కోసం మేకల కాపరిగా మారారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా మారానని భీంరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
బిల్లుల కోసం ఇల్లు అమ్ముకున్నాం.. సర్పంచ్ ప్రమీల భర్త ఆవేదన
భీమదేవరపల్లి: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసి బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఇల్లు అమ్మి మరీ చెల్లించా మని హనుమకొండ జిల్లా భీమదేవ రపల్లి మండలం కొత్తకొండ సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పల్లెప్రగతి’ లో భాగంగా కొత్తకొండలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్‌కుమార్ హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ మాట్లా డుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమం బాగుందని, కానీ చేసిన పనులకు బిల్లులు రావడం ఆసల్యం అవుతుండటంతో సర్పంచ్‌లు ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు. రెండేళ్ల క్రితం గ్రామంలో 500 ఇంకుడు గుంతలు నిర్మించామని, వాటికి రూ.20 లక్షలకు గాను రూ.5 లక్షలే వచ్చాయని, మిగతా రూ.15 లక్షలు ఇంకా రాలేదని వాపోయారు. చివరికి తన ఇల్లును రూ.20 లక్షలకు అమ్మి, అప్పులు కట్టి కిరాయి ఇంట్లో ఉంటున్నట్లు తెలిపారు. గ్రామంలో నీటిఎద్దడి నివారించేందుకు 6 బోర్లు వేశామని, నెలకు రూ.లక్ష వరకు వస్తున్న కరెంటు బిల్లు కూడా పంచాయతీకి భారంగా మారిందని చెప్పా రు. జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్క రి స్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి రూ. 2లక్షలు ప్రకటించారు. -
ఒక్క ఏడాదిలోనే సర్పంచ్‌గా ఎంతో సాధించి.. ఇంకా
పర్యావరణమైనా, పాలిటిక్స్ అయినా ‘‘నేను ఒక్కడిని మారినంత మాత్రాన వ్యవస్థ మొత్తం మారిపోతుందా?’’ అంటూ కనీసం తమవంతు సాయం, కృషి కూడా చేయని వారే సమాజంలో ఎక్కువ. ఒక అడుగు ముందుకేసినప్పుడు, మరో నాలుగు ఆడుగులు మన వెనకుండి ప్రోత్సహిస్తాయి. అప్పుడు ఎంతటి మొండి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని నిరూపించి చూపిస్తోంది ప్రియాంక తివారీ. సర్పంచ్‌గా ఏడాదిపాటు ఉండి పర్యావరణాన్ని ఎంతబాగా కాపాడుకోవచ్చో చేతల్లో చేసి చూపించి ఎంతోమందికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంక. రాజస్థాన్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగిన 29 ఏళ్ల ప్రియాంక తివారీ మాస్ కమ్యునికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ప్రియాంకకు 2019లో బిజినెస్ మ్యాన్‌తో వివాహం అయ్యింది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని రాజ్పూర్ గ్రామంలోని అత్తారింటికి కాపురానికి వెళ్లింది. ఢిల్లీలో పెరిగిన ప్రియాంకకు రాజ్పూర్ పెద్దగా నచ్చలేదు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ సరిగా లేదని అర్థమైంది. వ్యర్థాల నిర్వహణ, పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ, కనీసం శ్మశానవాటికలు లేకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. దీంతో వీటిని ఎలా సరిచేయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. సర్పంచ్‌గా.. ఎప్పుడూ గ్రామ పరిస్థితులు బాలేదు. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంది అని భర్త, అత్తమామల దగ్గర తన ఐడియాలను చెబుతుండేది ప్రియాంక. ఆమె ఐడియాలు సరికొత్తగా ఉండడంతో భర్తతోపాటు ప్రొఫెసర్, టీచర్లుగా పనిచేస్తోన్న అత్తమామలు సైతం ఆమెను ప్రోత్సహిస్తుండేవారు. ఆమె ఆలోచనలు ఎలా కార్యరూపం దాల్చుతాయి? అని ఆలోచిస్తున్నప్పుడు గతేడాది రాజ్పూర్ పంచాయితీ ఎన్నికల ప్రకటన వచ్చింది. దీంతో అత్తమామలు ప్రియాంకను పోటీచేయమని చెప్పారు. ‘‘ఈ గ్రామంలోని సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలో నడపించాలంటే ఇదే మంచి అవకాశం. నువ్వు తప్పకుండా పోటీచేయాలి’’ అని అందరూ ప్రోత్సహించడంతో ప్రియాంక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడింది. గ్రామస్థులంతా ప్రియాంకను గెలిపించారు. మరుసటి రోజునుంచే.. పంచాయితీ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజునుంచే ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి తెచ్చింది ప్రియాంక. ప్లాస్టిక్‌ని సమూలంగా నిర్మూలించడం ఒక్కరోజులో అయ్యే పనికాదు. చాలా సమయం పడుతుంది. కానీ అందరూ సహకరించాలని గ్రామస్థులను కోరింది. గ్రామంలోని కిరాణా, రోడ్లమీద బడ్డీ దుకాణాలకు పంచాయితీ నుంచి బట్టతో తయారు చేసిన బ్యాగ్‌లను సరఫరా చేసింది. వీటిని మాత్రమే వినియోగించాలని నిబంధన పెట్టడడమేగాక, తొలిసారి నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.500, రెండో సారికి రూ.1000 ఫైన్ విధించడం, మూడోసారి కూడా అతిక్రమిస్తే షాపు లైసెన్స్ రద్దుచేస్తామని హుకుం జారీ చేసింది. వీటితోపాటు ప్లాస్టిక్ వల్ల మానవాళికి, పర్యావరణానికి కలిగే నష్టం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్థులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించేలా చేసింది. దీంతో ప్లాస్టిక్ వినియోగం చాలా వరకు తగ్గింది. చిన్నపిల్లలు వాడే స్నాక్స్ ప్యాకెట్స్, చాక్లెట్ రేపర్స్ తీసుకొచ్చి ఇస్తే కేజీ ప్లాస్టిక్‌కు రెండు రూపాయలు ఇస్తామని స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం 75 శాతం పడిపోయింది. యూపీ గవర్నమెంట్ ప్లాస్టిక్ కలెక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో..ప్రియాంక కూడా ప్లాస్టిక్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసి గ్రామంలోని వ్యర్థాలను సేకరించి, ప్లాస్టిక్‌ను గ్రాన్యూల్స్‌గా రోడ్లకు వేసే తారు తయారీదారులకు ఇచ్చేది. ప్లాస్టిక్ నిషేధాన్ని ఇంత పకడ్బందీగా అమలు చేస్తోన్న ప్రియాంకని రాష్ట్రప్రభుత్వం గుర్తించి రూ.9 లక్షల రూపాయలను బహుమతిగా ఇచ్చి సత్కరించింది. ఈ డబ్బులను గ్రామంలో రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించనుంది. ఏడాదిలోనే... పటిష్టమైన డ్రెయినేజ్, మురుగు నీటికోసం పిట్స్ ఏర్పాటు చేయడం, శ్మశాన వాటికను నిర్మించడం వంటివి కేవలం ఏడాదిలోనే పూర్తిచేసింది. గ్రామంలో లైబ్రరీని కూడా ఏర్పాటు చేసి చేసింది. ఇంకా అభివృద్ధికోసం నిధుల్లేక విరాళాలకోసం చూస్తోంది. ఏడాదిలోనే రాజ్పూర్వైపు అందరూ చూసేలా చేసిన ప్రియాంక తన పదవీ కాలం పూర్తయ్యేలోపు ఇప్పటికే 75 శాతం పడిపోయిన ప్లాస్టిక్ వినియోగాన్ని మరింతగా తగ్గిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: వైరల్.. అమ్మ నీకు దండమే... -
ఈ ప్రభుత్వం సర్పంచ్‌లను జీతగాళ్లుగా మార్చింది
అక్కన్నపేట (హుస్నాబాద్): గ్రామాల్లో ఇదివరకే చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్‌లు మరోసారి గళం ఎత్తారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశనాయక్‌తండా సర్పంచ్ బానోతు రవీందర్‌నాయక్ గురువారం జరిగిన పల్లెప్రగతి అవగాహన కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డిని భిక్షం వేయాలంటూ జోలె పట్టి అడగటంతో అందరూ అవాక్కయ్యారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు పంచాయతీలో ట్రాక్టర్ కిస్తీ, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలకే సరిపోతోందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలంటూ భిక్షం అడుగుతూ ఆయన ఆవేదన వెళ్లగక్కారు. అక్కన్నపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాలోతు లక్ష్మి అధ్యక్షతన పల్లెప్రగతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రావడంలేదని, మళ్లీ పల్లెప్రగతి పనులు ఎలా చేయాలని అధికారులను నిలదీశారు. గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులకు బిల్లులు రాక భార్య మెడలో పుస్తెలతాడు, బంగారు ఆభరణాలు తనఖా పెట్టి అప్పు కడుతున్నామంటూ ఆవేదన చెం దారు. బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య లు చేసుకుంటున్నారని, మళ్లీ నక్సలైట్లు రా వాలని కోరుకుంటున్నామని అన్నారు. పెం డింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాకే పనులు చేస్తామని, అప్పటివరకు పల్లెప్రగతిని బహిష్కరిస్తున్నామని సర్పంచులు ముత్యాల సంజీవ్‌రెడ్డి, అన్నాడి దినేశ్‌రెడ్డి, బొమ్మగాని రాజేశం, గద్దల రమేశ్, జిల్లెల అశోక్‌రెడ్డి, కుమారస్వామి తదితరులు సృష్టం చేశారు. సమావేశం బహిష్కరణ.. సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వొద్దని పంచాయతీరాజ్ చట్టంలో ఏమైనా రాసి ఉందా? అని సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నించారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తేనే సరి, లేదంటే పల్లెప్రగతి పనులు చేయబోమని సర్పంచ్‌లంతా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలన సర్పంచ్‌లను జీతగాళ్లుగా మార్చేసిందని ఆరోపిస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. వీరంతా అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌లే కావడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీంతో మాజీ జెడ్పీటీసీ మాలోతు భీలునాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు సర్పంచ్‌లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం ఎంపీపీ మాలోతు లక్ష్మి మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం చేయడానికి సర్పంచ్‌లందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంగ, ఎంపీడీఓ కొప్పల సత్యపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
ప్రధానితో చర్చకు తలతంపర సర్పంచ్‌కు పిలుపు
కంచిలి: జాతీయ బాల్య వివాహాల చట్టంలో వయస్సును సవరించడం కోసం ప్రవేశపెట్టనున్న బిల్లుపై భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించనున్న చర్చకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 8 మందిని ఎంపిక చేశారు. అందులో కంచిలి మండలం తలతంపర పంచాయతీ సర్పంచ్ డాక్టర్ దొళాయి జగబంధును కూడా ఎంపిక చేస్తూ అమరావతి నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జెడ్పీ చైర్మన్, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, ఐదుగురును సర్పంచ్‌లతో పీఎం మోదీ ఆన్లైన్లో ఈ విషయమై చర్చిస్తారని, ఎంపిక చేసిన 8 మంది ప్రజాప్రతినిధులకు సీఎంఓ కార్యాలయం నుంచి సమాచారం అందించినట్లు తలతంపర సర్పంచ్ డాక్టర్ జగబంధు శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ విధమైన కమిటీలను నియమించి, అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఈ నెల 31వ తేదీన అమరావతిలో ఈ కార్యక్రమం ఉంటుందని, తప్పనిసరిగా హాజరు కావాలని సమాచారం వచ్చినట్లు తెలిపారు. (చదవండి: దొంగ సొత్తు చెరువులో ఉందా..?) -
న్యాయం చేయాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన మహిళా సర్పంచ్
సాక్షి, ఆసిఫాబాద్: మండల కేంద్రం మీదుగా చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహాల్యాదేవి, బాధితురాలు వందన శుక్రవారం ఆర్డీవో సిడాం దత్తు కాళ్లపై పడి వేడుకున్నారు. రోడ్డు విస్తరణలో ఉన్న కొద్దిపాటి గూడు కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఆదీనంలో ఏడెకరాల ప్రభుత్వ మిగులు భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోతున్న వాళ్లకు ఇళ్లు, దుకాణాలకు కేటాయించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. చదవండి: టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు -
ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న జనసేన సర్పంచ్
మొగల్తూరు: పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందుతున్నాయనడానికి నిదర్శనమే పేరుపాలెం వెంకన్న. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామ సర్పంచ్‌గా జనసేన పార్టీ మద్దతుతో వెంకన్న ఎన్నికయ్యారు. ఆయన, కుటుంబసభ్యులు వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750, వైఎస్సార్ చేదోడు కింద రూ.10 వేలు, రైతు భరోసా కింద రూ.16,500 లబ్ధిపొందారు. గ్రామంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు గ్రామ సర్పంచ్‌కి ప్రభుత్వం అందిస్తున్న వివరాలు తెలిపే బ్రోచర్‌ను సోమవారం అందించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం వెల్లడించారు. -
అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి
మునుగోడు: ‘అయ్యా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, పంచాయతీ కార్మికులం.. మేము చేసిన అభివృద్ధి పనులకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు.. ప్రతి నెలా కార్మికులకు అందించాల్సిన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరంతా మాకు దానం చేసి ఆదుకోవాలి’ అని కోరుతూ మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్నతో పాటు, పలువురు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. సర్పంచ్ వెంకన్న నిక్కరు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనగా డప్పు చప్పుళ్లతో వార్డు సభ్యులు, కార్మికులతో కలసి దుకాణాలు, ఇంటి యజమానుల వద్దకు వెళ్లి నగదు ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నగదు ఉన్నప్పటికీ తాము చేసిన పనుల చెక్కులు ఎస్టీఓలో వేస్తే చెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.35 లక్షలకు పైగా అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి తీసుకొచ్చామని వీటికి నెలకు రూ.70 వేల చొప్పున వడ్డీలు కడుతున్నామన్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సరిగా అందక ఆ కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం) ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ల, కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ పందుల పవిత్రశ్రీను, వార్డు సభ్యులు ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, మిర్యాల మధుకర్, యాట రామస్వామి, పందుల నర్సింహ, యడవల్లి సురేష్, పంచాయతీ కార్మికులు సుధాకర్, పెంటయ్య, అచ్చమ్మ, పావని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ లెక్కలు అడిగినందుకు.. విద్యుత్ తీగలు పట్టుకున్న సర్పంచ్
న్యాల్కల్(జహీరాబాద్): గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చుల వివరాలు సభ్యులు అడగడంతో మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ విద్యుత్ తీగలను పట్టుకునాన్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలోజరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు. సర్పంచ్ కుత్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. ‘పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులొచ్చాయి? ఏయే పనులు చేపట్టారు?’ వివరాలు కావాలని సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని రికార్డులను పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ ఇచ్చారు. ఆమె వివరాలు వెల్లడిస్తున్న సమయంలో వార్డు సభ్యులు, సర్పంచ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ నిధులతో పాటు ఇతర నిధులను తీసుకొచ్చినా నిలదీస్తారా? అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నా నన్నే అనుమానిస్తారా?’ అంటూ తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయాడు. రైతు వేదిక దగ్గరకు వెళ్లి అక్కడున్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ తీగలను పట్టుకున్నాడు. విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. విషయాన్ని గమనించిన పలువురు చికిత్స నిమిత్తం గంగ్వార్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది బీదర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో బీదర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారని గ్రామస్తులు తెలిపారు. ‘సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలే కాని విద్యుత్ తీగలు పట్టుకోవడం ఏమిటి’ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
మహిళపై టీడీపీ సర్పంచ్ దౌర్జన్యం
కలకడ : ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంట్లోకి.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత చొరబడి నానా దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలకడ మండలం కలకడదొడ్డిపల్లెలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ సోదరుడు, కె.దొడ్డిపల్లె సర్పంచ్ మద్దిపట్ల నాగరాజ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్థరాత్రి సమయంలో చరపల్లె. శ్రీనివాసులునాయుడు భార్య అలివేలమ్మను నిద్ర లేపి తనకు ఓటు వేయలేదని నానా దుర్భాషలాడి కత్తితో చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
జాతీయ సదస్సులో ఆకట్టుకున్న సర్పంచ్ ప్రసంగం
రామవరప్పాడు: ‘సుపరిపాలన’ అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ‘సుపరిపాలన’ అంశంపై జాతీయ సదస్సు జరుగుతున్న విషయం విదితమే. ఈ జాతీయ సదస్సులో రంగారావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతంగా అమలు చేస్తున్న నవరత్న పథకాలు, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తీరు, సంక్షేమ పథకాలు, పరిపాలన విధానం, సచివాలయ వ్యవస్థపై విపులంగా వివరించారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు దాదాపు 640కిపైగా పౌరసేవలను సీఎం జగన్ అందిస్తున్నారని చెప్పారు. నాడు–నేడు పథకం ద్వారా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, వైద్యశాలలకు కొత్తరూపు తీసుకొచ్చారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, చేయూత, పింఛన్ల పెంపు, అమ్మ ఒడి, రైతు భరోసా, జలయజ్ఞం తదితర పథకాల అమలు తీరును స్పష్టంగా వివరించారు. సదస్సులో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమా మహదేవన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
వేధింపులు ఆపాలని ధర్నా చేసినందుకు యువతి ముక్కు కోసిన సర్పంచ్
ఛత్తీస్గడ్: సర్పంచ్ అంటే ఊరికి పెద్ద. ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అతనిది. కానీ అలాంటి వ్యక్తే ప్రజలకు సమస్యగా మారాడు. ఆ గ్రామంలోని ముగ్గురు అమ్మాయిలను వేధింపులకు గురిచేశాడు. అతని చేష్టలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఒక అమ్మాయి ముక్కును కత్తిరించాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను కొంత కాలంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులను భరించలేని వాళ్లు తమకు న్యాయం చేయాలంటూ సర్పంచ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీనికి కోపంతో ఊగిపోయిన ఆ సర్పంచ్ ధర్నా చేస్తున్న వారిలో ఒక అమ్మాయి ముక్కు కోశాడు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు, తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. -
తనకు ఓటు వేయలేదని గ్రామస్తులపై కక్ష.. ఏం చేశాడంటే?
పర్లాకిమిడి(భువనేశ్వర్): పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచ్ అభ్యర్థి తనకు ఓటు వేయని గ్రామస్తులపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని ఇబ్బంది పెట్టాలని గ్రామ రహదారిని దిగ్బంధం చేశాడు. రోడ్డుకు ఓ వైపు పెద్ద గొయ్యి తవ్వి.. మరోవైపు దారికి అడ్డంగా భారీ బండరాళ్లను ఉంచాడు. దీంతో కూలి పనులు, ఇతర అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన గజపతి జిల్లాలోని రాయఘడ సమితిలో ఉన్న ఏఓబీ(ఆంధ్రా–ఒడిశా బోర్డరు)లోని గంగాబడో పంచాయతీలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. ఇదంతా ఇక్కడి పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి, ఓటమి పాలైన బరిక శోబోరో అనే వ్యక్తి చేసిన నిర్వాకంగా తేలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేడీ మద్దతు అభ్యర్థిగా ఇతడు పోటీ చేశాడు. అయితే ఇక్కడి ప్రజలు ఇతడిని కాదని ఇండిపెండెంట్ అభ్యర్థి హారిబందు కార్జికి అండగా నిలిచి, అతడిని గెలిపించారు. దీంతో కోపంతో రగిలిపోయిన బరిక శోబోరో తనకు అధికార పార్టీ బీజేడీ అండ ఉందన్న అహంకారంతో గ్రామస్తులపై ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త సర్పంచ్ హారిబందు కార్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గారబంద పోలీసులు, గారబంద ఐఐసీ అధికారి సర్వేశ్వర సామంత్రాయ్, తహసీల్దారు లీలావతి ఆచార్య హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం రహదారి పునరుద్ధరణ పనులకు చర్యలు ముమ్మరం చేశారు. -
దళిత మహిళా సర్పంచ్‌కు టీడీపీ ఉప సర్పంచ్ వేధింపులు
సాక్షి, ప్రత్తిపాడు (గుంటూరు): కులం పేరుతో తనను దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఓ దళిత మహిళా సర్పంచ్ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కథనం ప్రకారం.. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా గొట్టిపాడు సర్పంచ్‌గా టీడీపీ బలపరిచిన ఆది ఆంధ్రా కాలనీకి చెందిన ప్రత్తిపాటి మరియరాణి గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా టీడీపీకి చెందిన ముఖుంద శివరంజనిని పంచాయతీ సభ్యులు ఎన్నుకున్నారు. నాటినుంచి సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటికే అనేకమార్లు పంచాయతీ కార్యాలయంలోనే వివాదాలు, వాగ్వాదాలు జరిగాయి. సర్పంచ్‌గా మరియరాణి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఉపసర్పంచ్ భర్త నిమ్మగడ్డ శ్రీకాంత్ ఆమెను కులం పేరుతో దుర్భాషలాడుతున్నాడు. ఇటీవల ఖాళీ చెక్కులపై సంతకాలు చేయాలంటూ శ్రీకాంత్, పంచాయతీ ఇన్చార్జి సెక్రటరీ రామ్మూర్తి కలిసి మరియరాణిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో దుర్భాషలాడుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై పంచాయతీకి వెళ్లనని శ్రీకాంత్ ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు. చదవండి: (విమ్స్‌లో ముక్కు ద్వారా వేసే కరోనా టీకా ట్రయల్స్) ఆ తర్వాత కూడా మళ్లీ ‘నాతోనే క్షమాపణ చెప్పిస్తావా?, ...దానివి నీకెందుకు సర్పంచ్ కుర్చీ. మేం ఎలా చెబితే అలా చేయాలి లేకుంటే చంపేస్తాం’ అంటూ శ్రీకాంత్ బెదిరింపులకు దిగాడు. వేధింపులు తాళలేని మరియరాణి శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. శ్రీకాంత్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ రామ్మూర్తి నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రతాప్‌కుమార్ తెలిపారు. -
సర్పంచ్ పదవికి ఎంట్రన్స్ టెస్ట్
రూర్కెలా: ఒడిషాలో పంచాయతీ ఎన్నికల సంరంభం ఆరంభమైంది. అయితే ఎవరిని పడితే వారిని ఎన్నుకోమని కుట్రగ్రామ్ పంచాయతీ పరిధిలోని మలుపదా గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. తమ ఓట్లు కావాలంటే తాము పెట్టే పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని వింత షరతు పెట్టారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీపడుతున్నవారంతా పరీక్షకు తయారయ్యారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఈ గ్రామంలో ఎన్నికలు ఈనెల 18న జరగనున్నాయి. 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన రాత పరీక్షకు వీరిలో 8మంది హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణాలు, సర్పంచ్కుండాల్సిన లక్ష్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన, గ్రామ పరిస్థితులపై సమాచారం తదితర అంశాలను పరీక్షలో అడిగారు. ఫలితాలు ఈ నెల 17న ప్రకటిస్తారు. చదవండి: (మీ పాలనలో రూ.5.35 లక్షల కోట్ల మోసాలు!) -
మహిళా అధికారినిపై దాష్టీకం: డ్యూటీలో ఉంది.. అందులోనూ గర్భిణి!
కొంతమంది ఇటీవల కాలంలో అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి అమానుష ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పైగా సాటి మహిళ, గర్భిణి అని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు. అసలు విషయంలోకెళ్తే....మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అటవీ శాఖలో పనిచేస్తున్న గర్భిణి అధికారి పై పల్సవాడే మాజీ సర్పంచ్ అతని భార్య అత్యంత అమానుషంగా దాడిచేశారు. మహిళా అటవీ శాఖాధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలను వేరే స్థలంలో పనిలో పెట్టుకున్నారని స్థానిక అటవీ కమిటీలో మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం వాపోయారు. అంతేకాదు మాజీ సర్పంచ్ సోమవారం మహిళా అధికారిణిని ఫోన్లో బెదిరించాడు కూడా. ఈ మేరకు మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం జంకర్, అతని భార్య ప్రగతి జంకర్.. మహిళా అటవీ అధికారి, ఆమె భర్త పై దాడి చేశారు. పైగా మాజీ సర్పంచ్ భార్య ప్రగతి జంకర్... సాటి మహిళ, గర్భిణి అనే కనికరం లేకుండా అటవీ అధికారి జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి, చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ మేరకు ఈ ఘటనను ఆ మహిళా ఆఫీసర్ భర్త, అటవీ సిబ్బంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్‌ని అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
Gunfire: శ్రీకాకుళంలో కాల్పుల కలకలం..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిపై దుండగులు కాల్పులు జరిపారు. తూటాలు వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు కొద్దిసేపటి ముందు ఆయన కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను వెంట తీసుకెళ్లింది. వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకితో రెండుసార్లు కాల్పులు జరిపి అక్కడ నుంచి పరారయ్యారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కేటుగాళ్లు.. నకిలీ బంగారు నాణేలతో మోసం.. -
సర్పంచ్ పదవికి వేలం పాట.. ఓర్ని! అన్ని లక్షలేందిరా సామీ..
భువనేశ్వర్/బొలంగీరు: రాష్ట్రంలో మూడంచెల పంచాయతీరాజ్ ఎన్నికల తొలి దశలోనే ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇలా ప్రారంభమైందో లేదో పలుచోట్ల పదవుల వేలం పాట చోటుచేసుకుంటుండడం సంచలనం రేకిత్తిస్తోంది. తాజాగా బొలంగీరు జిల్లాలో సర్పంచ్ పదవిని వేలం వేసిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. దీనివెనక నిజానిజాల నిగ్గు తేల్చాలని జిల్లా కలెక్టరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. బొలంగీరు జిల్లా, పుంయింతొల మండలం, బిలెయిసొర్డా పంచాయతీలో సర్పంచ్ పదవి వేలం పాట జరిగింది. ఎన్నికల ప్రారంభ దశలోనే ఇటువంటి ఘటన తారసపడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే పంచాయతీలో బిలెయిసొర్డా, బొందొనొకొటా, కొస్రుపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడి సర్పంచ్ స్థానం రిజర్వేషన్ సాధారణ వర్గాలకు కేటాయించారు. అయితే గ్రామ సమగ్రాభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలనే సంకల్పం గ్రామస్తుల్లో బలపడింది. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన గ్రామసభ ఏర్పాటు చేశారు. చదవండి: తగ్గేదేలే..! తొలిసారి అసెంబ్లీ బరిలోకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థానిక జగన్నాథ మందిరం ఆవరణ వేదికగా జరిగిన ఈ సమావేశానికి పంచాయతీలో 3 గ్రామాల ప్రజలు(ఓటర్లు), ఔత్సాహిక సర్పంచ్ అభ్యర్థులు హాజరయ్యారు. తర్వాత సర్పంచ్ పదవి కోసం వేలం పాట ప్రారంభించారు. గ్రామ ప్రగతి కోసం పలువురు ఔత్సాహిక అభ్యర్థులు ముందస్తు ఆర్థికపరమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. మొత్తం నలుగురు వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం వేలం పాటలో పాల్గొని, పోటీపడగా చివరికి సుశాంత ఛత్రియా అనే వ్యక్తి అధిక వేలం పాటతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. రూ.7 లక్షల నుంచి మొదలై.. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఆయన మాత్రమే సర్పంచ్ అభ్యర్థి అని, వేరెవ్వరూ ఆ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయకూడదన్నది వేలం పాట ఒప్పందం. దీంతో సుశాంత ఛత్రియానే బిలెయిసొర్డా పంచాయతీ సర్పంచ్ అని స్థానికంగా వినిపిస్తోంది. సర్పంచ్ పదవి కోసం రూ.7 లక్షల నుంచి మొదలైన వేలం పాట ఆఖరికి రూ.44.10 లక్షలు ధర పలికినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇదంతా అవాస్తవమని సుశాంత ఛత్రియా కొట్టిపారేశారు. గ్రామ ప్రగతికి విరాళంగా రూ.44 వేలు మాత్రమే తాను అందజేసేందుకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. తనను ఏకగ్రీవంగానే గ్రామసభ ఎన్నుకుంటుందన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా నివేదిక దాఖలుకు ఆదేశాలు.. బిలైసొర్డా పంచాయతీ సర్పంచ్ పదవి వేలం పాట సంఘటనపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి, వాస్తవాలతో సమగ్ర నివేదిక దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ పదవి రూ.44.10 లక్షలకు వేలం వేసినట్లు ప్రధాన ఆరోపణ కాగా, ఈ క్రమంలో దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, వాస్తవ, అవాస్తవాలను తెలియజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఆర్.ఎన్.సాహు బొలంగీరు జిల్లా కలెక్టరు చంచల్ రాణాకు లేఖ జారీ చేయడం విశేషం. గతంలోనూ ఏకగ్రీవమే.. ప్రధానంగా ఎన్నికల వ్యయం పరిమితం చేసేందుకు ఈ విధానానికి గ్రామసభ ఏకీభవించింది. ఈసారి జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరమితి రూ.2 లక్షలుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతకన్నా తక్కువ ఖర్చుతో(రూ.44 వేలు) గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని ఆయన సర్దిచెప్పుకొచ్చాడు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికలో ఇక్కడి సర్పంచ్‌గా రీతా బొఢియా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. గుర్తింపు ఇవ్వలేం.. ఇలాంటి ప్రక్రియలో సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తికి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేమని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి, సంబందిత ఫారం నింపాల్సి ఉంటుందన్నారు. ఇలా ఓ పద్ధతి ప్రకారం వెళ్లిన వ్యక్తికే సర్పంచ్ పదవి దక్కుతుందని, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చని, ఆఖరికి వేలం పాటలో పాల్గొన్న వ్యక్తి అయినా కావొచ్చని అధికారులు తేల్చి చెప్పారు. -
స్కూల్లో ఐదుగురు టీచర్లు.. పాఠాలు బోధించిన ఉత్తమ సర్పంచ్..
సాక్షి, నెన్నెల (ఆదిలాబాద్): ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ, గ్రామాభివృద్ధికి పాటు పడటమే కాదు.. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, వారికి దగ్గరుండి భోజనం వడ్డిస్తూ శభాష్ అనిపించుకోంటోంది గొళ్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ. సాధారణంగా సర్పంచ్‌లు గ్రామ సమస్యల పరిష్కారానికి పని చేస్తూ ఉంటారు. అందుకు భిన్నంగా టీచరమ్మగా మారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి అభ్యున్నతికి చొరవ చూపుతోంది. ఆమె పని తీరును మెచ్చుకొని జిల్లా కలెక్టర్ భారతిహోళ్లీకేరి 2020లో మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా సర్పంచ్‌గా పురస్కారం ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసింది. గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 1–5 తరగతుల విద్యార్థులు 86మంది ఉన్నారు. మొత్తం ఐదుగురు టీచర్లు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై మరో చోటికి పంపించారు. మంగళవారం ముగ్గురు ఉపాధ్యాయులలో ఇద్దరు లీవ్‌లో ఉండగా, ఆ సర్పంచ్ పాఠశాలకు వెళ్లి పిల్లలకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తూ, దగ్గరుండి భోజనం వడ్డించారు. అటు రాజకీయంగా ఊరికి సేవలు చేస్తూ, ఇటు పిల్లలకు విద్యాదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు లేక బోధన సాగకపోవడంతో విద్యాబోధన చేస్తున్నానని సర్పంచ్ పేర్కొంది. -
‘రూ.15 లక్షల దాకా అవినీతి.. నో ప్రాబ్లమ్!’
అధికారులు, నేతల మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. అది చర్చనీయాంశంగా మారడం సహజం. కానీ, అందుకు విరుద్ధంగా ఓ రాజకీయ నాయకుడు అవినీతిని ప్రొత్సహించేలా మాట్లాడడమే ఇక్కడ విశేషం. దీంతో ఆయన్ని తిట్టిపోస్తున్నారు. మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా.. తాజాగా రేవాలో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో అవినీతి గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. ఎవరైనా వ్యక్తిగతంగా 15 లక్షల రూపాయల దాకా అవినీతికి పాల్పడడం సరైందేనంటూ వ్యాఖ్యానించాడాయన. చాలామంది నా దగ్గరికొచ్చి మా సర్పంచ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ చెప్తుంటారు. అప్పుడు నేను ఆ సర్పంచ్ చేసిన అవినీతి 15 లక్షలలోపు ఉంటే నా దగ్గరికి రాకండయ్యా అని అంటాను. ...When people accuse sarpanch of corruption, I jokingly tell them that if corruption is up to Rs 15 lakhs don't come to me...come only if it's (corruption) beyond Rs 15 lakhs: BJP MP Janaradan Mishra in Rewa, Madhya Pradesh (27.12) pic.twitter.com/ImobGWecBH — ANI (@ANI) December 28, 2021 ఎందుకంటే ఆ సర్పంచ్ ఎన్నికల కోసం రూ.7 లక్షలు ఖర్చు చేసి ఉంటారు. మరో 7 లక్షలు వచ్చే ఎన్నికల కోసం కేటాయిస్తారు. మరో లక్ష అదనం. ఆ లెక్కలే అంత. అంతకు మించి అవినీతికి పాల్పడితే అది వేరే పరిస్థితి అంటూ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పంచాయితీ ఎలక్షన్ ర్యాలీలోనే ఆయన ఈ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ.. సోనియాకు చేదు అనుభవం -
మాజీ సర్పంచ్ కురసం రమేష్ ఆడియో విడుదల చేసిన మావోలు
-
మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్ చేసిన మావోలు..ఏజెన్సీలో ఉత్కంఠ
ఏటూరునాగారం/వెంకటాపురం (కె): మాజీ సర్పంచ్, ప్రస్తుతం డ్రైవర్ వృత్తి చేసుకుంటున్న కురుసం రమేశ్‌ను మావోయిస్టులు సోమవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు పంచాయతీ కె కొండాపురం వద్ద కిడ్నాప్ చేసినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. సూరువీడు ప్రాంతానికి చెందిన రమేశ్ 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత రమేశ్ భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో నివాసం ఉంటున్నారు. రమేశ్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత 24 గంటలు దాటినా రమేశ్ ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా, కొందరు ముఖానికి ముసుగులు కట్టుకొని రమేశ్‌ను వేరే వాహనంలో తీసుకెళ్లినట్లు అక్కడి స్థానికులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో ఏజెన్సీలో ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టులు కిడ్నాప్ చేయడంతో ఆయన పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో అలర్ట్ చేసి.. రమేశ్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటున్న రమేశ్ భార్య రజిత, పిల్లలు అన్నలూ.. నా భర్తను విడిచి పెట్టండి.. రమేశ్ భార్య రజిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, మా కుటుంబానికి అన్యాయం చేయొద్దని మావోయిస్టులను కోరారు. ‘ఏదైనా తప్పుచేస్తే నాలుగు దెబ్బలు కొట్టి ఇంటికి పంపించండి. మాకు ఇద్దరు పిల్లలు, నేను ఆగమైపోతా. మీ తోడబుట్టిన దానిని అనుకొని నా భర్తను విడిచి పెట్టండి. నా కుటుంబానికి నా భర్తే పెద్ద దిక్కు. అన్నలూ.. దండం పెడుతున్నా.. ఆయనకు ఏదైనా హాని తలపెడితే మేం బతకం’అంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రమేశ్ తల్లి మంగమ్మ కూడా కొడుకును విడుదల చేయాలని కోరారు. -
గ్రామ ప్రజల పాట.. 44 లక్షలకు సర్పంచ్ పదవి!
భోపాల్: గ్రామంలో సర్పంచ్ పదవి చేపట్టాలంటే ఎన్నికలు జరిపి ఓటర్లు ఎన్నుకోవాలన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగిన ఇదే తంతు నడుస్తుతుంది. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా తమ సర్పంచ్‌ని ఎన్నుకున్న పద్ధతిని వింటే షాక్ అవుతారు. వాళ్లు ఓట్లతో కాదు నోట్లతో తమ సర్పంచ్‌ని ఎన్నుకున్నారు. ఎలా అంటారా? వివరాల్లోకి వెళ్తే.. అశోక్ నగర్ జిల్లా భతౌలి గ్రామ పంచాయతీ ప్రజలు డిసెంబరు 14న, రాధా-కృష్ణ దేవాలయంలో సమావేశాన్ని నిర్వహించారు, అక్కడ కొత్తగా గ్రామ సర్పంచ్‌ని ఎంపిక చేసేందుకు వేలం పాటను నిర్వహించారు. వినడానికి వెరైటీగా ఉన్నా ఇది నిజమేనండి. కాగా ఈ వేలం పాటలో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారు. చివరకు సౌభాగ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి వేలం పాటలో గెలిచి పదవిని చేజెక్కించుకున్నాడు. వేలం పాటు రూ.21 లక్షలతో వేలం ప్రారంభం కాగా చివరకు రూ.44 లక్షల వరకు చేరింది. నిబంధనలు ప్రకారం ఎన్నికల సమయానికి సౌభాగ్ సింగ్ అంత మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది. కారణం ఏదైనా అతను డబ్బును సమకూర్చలేకుంటే.. అతని తర్వాత వేలం పాటలో ఎక్కువ పాడిన వ్యక్తిని గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటారు. గ్రామస్తులు ఇలా చేస్తుంటే అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎన్నికైనా వాళ్లకే తాము సర్పంచ్‌గా గుర్తిస్తామని చెప్పారు. చదవండి: Victory Hug: నాన్నా.. నీ రాక మాకెంతో సంతోషం -
పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య
రాజుపాలెం: పాతకక్షల నేపథ్యంలో పట్టపగలే మాజీ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ దుర్ఘటన రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారంగ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్రకూటి శ్రీనివాసరావు(50) పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో పోలేరమ్మగుడి వద్ద కాపు కాసి ఉన్న కుర్రా వీరనారాయణ ఇనుపరాడ్‌తో దాడి చేశాడు. శ్రీనివాసరావు తలపై పలుమార్లు బలంగా మోదాడు. తీవ్రరక్తస్రావంతో శ్రీనివాసరావు అపస్మారకస్థితిలోకి వెళ్లారు. ఆయనను స్థానికులు వెంటనే పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసరావు చికిత్సపొందుతూ మృతిచెందారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే.. శ్రీనివాసరావు 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన భార్య వెంకాయమ్మ గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. వైఎస్సార్సీపీలో శ్రీనివాసరావు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఈయనకు దూరపు బంధువు వీరనారాయణతో పాతకక్షలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వీరనారాయణ శ్రీనివాసరావు వెన్నంటే తిరుగుతూ మంచిగా ఉంటున్నట్టు నమ్మించాడు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో కుమ్మక్కై హత్యకు పథక రచన చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పిడుగురాళ్ల రూరల్ సీఐ పి.ఆంజనేయులు, ఎస్ఐ కె.అమీర్ వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. -
ఆ పల్లెది విచిత్ర కథ: ఇద్దరు సర్పంచ్‌లు..రెండు మండలాలు
అర్వపల్లి: అదో మారుమూల పల్లె. ఈ పల్లె మూసీనది వెంట ఉంది. కానీ ఈ పల్లెకు ఓ విచిత్ర కథ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ గ్రామానికి సమస్య వచ్చి పడింది. ఈ ఆవాస గ్రామానికి రెండు గ్రామ పంచాయతీలు, రెండు మండలాలు ఉన్నాయి. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. ఇది నిజం. ఆ కథాకమామీషు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామమేర్పడినప్పటి నుంచి ఇదే పరిస్థితి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం–నాగారం రెండు మండలాల మద్య ఈ గ్రామం నలిగిపోతుంది. అదే కంచుగట్లగూడెం గ్రామం. జాజిరెడ్డిగూడెం ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి జాజిరెడ్డిగూడెం, వర్ధమానుకోట రెండు గ్రామపంచాయతీలు ఉండేవి. గ్రామంలో రెండు ప్రధాన వీధులు ఉండగా ఓ వీధి జాజిరెడ్డిగూడెం, మరో వీధి వర్ధమానుకోట గ్రామపంచాయతీలలో ఉండేవి. దీంతో ఏ గ్రామపంచాయతీ సరిగా పట్టించుకోకపోవడంతో ప్రజలు సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఒకే పంచాయతీ కిందకు ఈ గ్రామాన్ని తేవాలని అధికారులకు ఎన్నో మార్లు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా కొత్తమండలాలు ఏర్పడ్డాక ఈ గ్రామానికి మరో సమస్య వచ్చిపడింది. ఇది వరకు ఈ గ్రామం రెండు పంచాయతీల మద్య ఉండగా ఇప్పుడు రెండు పంచాయతీలతో పాటు రెండు మండలాల పరిధిలోకి వెళ్లింది. ఈ గ్రామానికి జాజిరెడ్డిగూడెం, నాగారం రెండు మండలాలు అయ్యాయి. కొన్ని ఇళ్లు ఇటు.. కొన్ని అటు కంచుగట్లగూడెంలో 70 ఇళ్లు ఉన్నాయి. 200 జనాభా, 150 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలోని ప్రధాన వీధి వెంట ఓ వైపు ఇళ్లు నాగారం మండలం పేరబోయినగూడెం పంచాయతీ పరిధికి, మరో వైపు ఇళ్లు జాజిరెడ్డిగూడెం మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధికి వెళ్లాయి. 55 ఇళ్లు పేరబోయినగూడెం జీపీకి, 15 ఇళ్లు జాజిరెడ్డిగూడెం జీపీకి వచ్చాయి. 150 మంది ఓటర్లకు గాను 100 మంది ఓటర్లు పేరబోయినగూడెం, 50 మంది ఓటర్లు జాజిరెడ్డిగూడెం పరిధికి వచ్చారు. దీంతో ఈ ఆవాస గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామ ప్రజలు ఇద్దరు సర్పంచ్‌లకు ఓట్లు వేయాల్సి వస్తుంది. దీంతో పరిపాలన పరంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలతో ప్రజల పాట్లు ఈ గ్రామానికి ఇంత వరకు పక్కా రోడ్డు లేదు. ఇంకా గుంతల మయమైన ఫార్మేషన్రోడ్డే. గ్రామంలో ఇప్పటి వరకు జానెడు సీసీరోడ్డు నిర్మించలేదు. ప్రభుత్వ పాఠశాలలో కూడా అనేక సమస్యలు నెలకొన్నాయి. సరైన మురుగు కాల్వలు లేవు. ఇలా అనేక మౌళిక సమస్యలు గ్రామంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాన్ని ఒకే పంచాయతీ, ఒకే మండలం కిందకు చేర్చాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు మా గ్రామ విచిత్రమేమిటంటే రెండు పంచాయతీలు, రెండు మండలాల పరిధిలో గ్రామం ఉండటంతో సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామానికి ఇంత వరకు పక్కారోడ్డు లేదు. సీసీరోడ్డు నిర్మాణం జరగలేదు. రోడ్డు సరిగా లేక ఆటోలు, బస్సులు కూడా రావడం లేదు. గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. ఇప్పటికైనా ఒకే పంచాయతి, ఒకే మండలం కిందకు చేర్చాలి. -కంచుగట్ల లింగయ్య, వార్డు సభ్యుడు, కంచుగట్లగూడెం 70 ఏళ్ల నుంచి గ్రామం పరిస్థితి ఇలాగే 70 ఏళ్ల నుంచి చూస్తున్నా మా గ్రామ పరిస్థితి ఇలాగే ఉంది. ఇంత వరకు డాంబర్ రోడ్డు లేదు. ఇప్పుడున్న మట్టిరోడ్డుపై గుంతలు పడి నడిచిపోవాలంటే కూడా సాధ్యం కావడం లేదు. మా ఊరు సగం పేరబోయినగూడెం, ఇంకో సగం జాజిరెడ్డిగూడెం కిందికి పోయాయి. దీంతో మా ఊరును ఎవరూ పట్టించుకోవడం లేదు. నా చిన్నప్పటి నుంచి డాంబర్రోడ్డు కావాలని కొట్లాడుతున్నాం. -కోడి రాజమ్మ, వృద్దురాలు, కంచుగట్లగూడెం -
శభాష్ సంర్పంచ్.. ప్రథమ పౌరుడి ‘పాఠ’వం
అశ్వారావుపేట రూరల్: తన చదువుకు సార్థకత చేకూరుస్తూ ఆ ఊరి ప్రథమ పౌరుడైన సర్పంచ్ విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వేదాంతపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోని శివశంకర ప్రసాద్ బీఈడీ పూర్తిచేశాడు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీకి ముందు మండలంలోని పాత నారంవారిగూడెం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా వలంటీర్‌గా పనిచేశాడు. రాజకీయాల మీద ఆసక్తితో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. గెలిచాక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ విద్యకు దూరమవుతున్నట్లు ప్రసాద్ గుర్తించాడు. గ్రామసభ ఏర్పాటుచేసి విద్యార్థులందరికీ రాత్రి పూట ఉచితంగా ట్యూషన్ చెబుతానని, పిల్లలను క్రమం తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులకు సూచించాడు. సర్పంచే ఉచితంగా ట్యూషన్ చెప్తాననడంతో తల్లిదండ్రులు పిల్లలను పంపించడం ఆరంభించారు. కరోనా కాలంలో ప్రారంభించినా... పాఠశాలలు తెరిచాక కూడా ట్యూషన్ కొనసాగుతున్నది. గ్రామ చిన్నారులకు నేటి పోటీ ప్రపంచానికి తగినట్లు తీర్చిదిద్దాలని డిజిటల్ తరగతులు అందుబాటులోకి తెచ్చాడు. ట్యూషన్‌కు వస్తున్న పిల్లల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులే అధికంగా ఉన్నారు. వీరికోసం రూ.25వేల సొంత ఖర్చుతో ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేశాడు. దీని ద్వారా విద్యార్థులకు డిజిటల్ బోధన సైతం అందిస్తున్నాడు. ‘శ్రీ గంగానమ్మ తల్లి పాఠశాల’గా... మొదట్లో సర్పంచ్ ఒక్కరే పిల్లలకు ట్యూషన్ చెప్పగా, ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన బీఈడీ, టీటీసీ పూర్తిచేసిన నాగలక్ష్మి కూడా ట్యూషన్ చెప్పేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. అదే గ్రామంలోని వనంలో కొలువుదీరిన శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి పేరుతో ‘శ్రీ గంగానమ్మ తల్లి పాఠశాల’గా నామకరణం కూడా చేశారు. -
ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపేశారు.. చివరకు
సాక్షి, కోరుట్ల: ‘ఎగబడి కరుస్తున్నాయ్.. కుక్కలే కదా చంపితే ఏమవుతుందిలే’ అనుకుంటే కుదరదు. శునక వధ కారణంగా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్‌లో కుక్కుల బెడద తీవ్రంగా ఉంది. రాత్రి వేళల్లో చాలా మంది కుక్కకాటుకు గురై ఆస్పత్రి పాలైన ఘటనలూ ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు శునకాలను చంపాలని పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానించారు. పది రోజుల క్రితం కొన్నింటిని చంపేశారు. స్థానిక రాజకీయ విభేదాల కారణంగా ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా జంతు ప్రేమికులకు చేరింది. చదవండి: నిజామాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం వెంటనే స్పందించిన హైదరాబాద్‌కు చెందిన ఎర్త్ ప్రెసెన్స్ అనే జంతు ప్రేమికుల సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ శశికళ వారం రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల క్రితం కొండాపూర్ సర్పంచ్, కార్యదర్శిపై కేసు నమోదు చేసినట్లు కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు శుక్రవారం తెలిపారు. ప్రజల రక్షణ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమపై కేసు నమోదు చేయడం సరికాదని సర్పంచ్ అభిలాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేడిపల్లి మండలవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు పలు గ్రామాల సర్పంచ్‌లు తెలిపారు. చదవండి: బైకుతో సహా నాలాలో పడిన వ్యక్తి.. లక్ జగదీష్ -
పేరుకు ఊరి సర్పంచ్.. చేసేది గంజాయి సరఫరా
కాగజ్‌నగర్ రూరల్: ఆయనో పంచాయతీకి సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు కాస్త దారి తప్పాడు. గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం పట్టుకున్నట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ.. 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక పట్టుబడ్డ వారిలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్ సుర్పం భగవంత్‌రావు, ఈస్గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్ ఉన్నారు. వారు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు చేశారు. వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈజ్గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
Nirmal: సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్
-
సర్పంచ్‌ని చెప్పుతో కొట్టిన మహిళా ఉపసర్పంచ్
నిర్మల్: సర్పంచ్‌పై మహిళా ఉపసర్పంచ్ చెప్పుతో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లలాలో గురువారం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నిర్మల్ జిల్లా మహాగామ్ గ్రామంలో చెక్కులపై ఫోర్జరీ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణపై గురువారం విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ రాకేష్‌కు, ఉప సర్పంచ్ శారదకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. (చదవండి: వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..) ఈ క్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గీయుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉప సర్పంచ్ శారద.. సర్పంచ్ రమేష్‌ని చెప్పుతో కొట్టింది. -
వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..
జడ్చర్ల టౌన్: కుటుంబ కలహాలతో ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారానికి చెందిన సిరి (28)కి నసురుల్లాబాద్‌తండా వాసి శ్రీనివాస్‌తో 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోగా పలుమార్లు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. అయినా భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో మనోవేదనకు గురైన భార్య వారం కిందట ఇంట్లోనే గడ్డిమందు తాగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. శనివారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి సోదరుడు శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఆమె భర్త ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. సర్పంచ్ల సంఘం సంతాపం నసురుల్లాబాద్‌తండా సర్పంచ్ సిరి మృతిపై సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మండల అధ్యక్షుడు బాల్‌సుందర్ తదతరులు సంతాపం వ్యక్తం చేశారు. జెడ్పీ వైస్‌చైర్మన్ కోడ్గల్ యాదయ్యతో పాటు సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకులు తండాలో రాత్రి జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తాము అండగా ఉంటామని పిల్లలకు భరోసా కల్పించారు. -
Karimnagar: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): గ్రామంలో ఎవరికైనా కూతురు పుడితే పాప పేరిట రూ.5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్ ప్రకటించారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ఆడపిల్లలపై వివక్ష చూపవద్దన్నారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టినట్లుగా భావించాలని చెప్పారు. తల్లి, చెల్లి, భార్య ఆడవాళ్లే అయినప్పుడు పుట్టే బిడ్డ మాత్రం ఆడబిడ్డ కావొద్దని కోరుకోవడం మూర్ఖత్వమేనని పేర్కొన్నారు. పంచాయతీ రికార్డుల్లో జనన నమోదు చేసిన వెంటనే రమేశ్ అన్న కానుక పేరిట రూ.5,116 బ్యాంకులో డిపాజిట్ చేసి, సంబంధిత పత్రాలను తల్లిదండ్రులకు అందిస్తామని తెలిపారు. దసరా పండుగ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామస్తులు అభినందించారు. తిమ్మాపూర్ మెడికల్ ఆఫీసర్ ఇందు, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ తాజొద్దీన్ ఉన్నారు. చదవండి: వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసు: జువైనల్ హోంకు బాలుడి తరలింపు -
ఆగిపోయిన చోట ఎన్నికల నిర్వహణపై కసరత్తు
సాక్షి, అమరావతి : వివిధ కారణాలతో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోయిన చోట తిరిగి నిర్వహించే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని గురువారం పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నీలంసాహ్నితో భేటీ అయ్యారు. ఎన్నికలు ఆగిపోయిన స్థానాల వివరాలు అందజేశారు. తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. -
Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్.. సామాన్యుడిని కాలితో తంతూ..
-
Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్.. సామాన్యుడిని కాలితో తంతూ..
వికారాబాద్ (రంగారెడ్డి): గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక సామాన్యుడిపై సర్పంచ్ తన ప్రతాపాన్ని చూపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మార్పల్లి మండలం దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
మాజీ సర్పంచ్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
రాయదుర్గం రూరల్(అనంతపురం జిల్లా): రాయదుర్గం మండలం చదం గొల్లలదొడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఎర్రప్పతో పాటు గ్రామ వలంటీర్లు హరేష, శివానందలపై టీడీపీ కార్యకర్తలు అకారణంగా దాడి చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు గ్రామానికి వచ్చి వెళ్లిన కాసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. బుధవారం గ్రామంలో మారెమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు టీడీపీ నాయకులు మాజీ మంత్రి కాలవను ఆహ్వానించారు. గ్రామానికి వచ్చిన ఆయన దాదాపు రెండు గంటల పాటు గడిపి..మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెనుదిరిగారు. ఆయన వచ్చిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు టపాసులు పేల్చి నానా హంగామా చేశారు. (చదవండి: దారుణ ఘటన.. ఒకే మర్రికి వెయ్యిమంది ఉరితీత...!) అంతటితో ఆగకుండా సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తన వ్యవసాయ తోటలోకి ద్విచక్ర వాహనంపై వెళుతున్న మాజీ సర్పంచ్ ఎర్రప్పను అడ్డగించి..కట్టెలు, ఇనుపరాడ్లతో మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అటుగా వచ్చిన గ్రామ వలంటీర్లు హరేష, శివానందలపైనా అకారణంగా దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న టీడీపీ సర్పంచ్ మల్లేష్ బంధువులు గొల్ల ఈరన్న, సూర్య, మరికొందరు ఈ దాడిలో పాలుపంచుకున్నారు. రక్తపు గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఎర్రప్పను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి ఘటనపై కేసు నమోదు చేశారు. గొడవలకు కాలవ ఆజ్యం! రాయదుర్గం నియోజకవర్గంలోని గ్రామాల్లో గొడవలకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉంటూ వచ్చిన గ్రామాలలో నేడు రాజకీయ స్వార్థం కోసం గొడవలు సృష్టిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కాలవ అండ చూసుకునే చదం గొల్లలదొడ్డి గ్రామంలో సర్పంచ్ మల్లేష్ మనుషులు రెచ్చిపోయారు. చదవండి: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి.. -
టీడీపీకి ఓటు వేయనందుకు దళితులపై కక్ష
సాక్షి,కడప(రాజంపేట రూరల్) : తెలుగుదేశం పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని దళితులపై కొల్లావారిపల్లి గ్రామపంచాయతీసర్పంచ్ ఎం.మహేష్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా కొల్లావారిపల్లిలోని మిట్ట హరిజనవాడలో పాగా వేసేందుకు పావులు కదిపాడు. 20 ఏళ్ల క్రితం తాగు నీటి కోసం 400 అడుగులు వేసినా నీరు పడకపోవడంతో వదిలేసిన బోరును తిరిగి మరమ్మతులు చేయిస్తానని ముందుకు వచ్చాడు. ఇక్కడే మోటారు బిగించి నీటిని అందిస్తానని పట్టుబట్టాడు. ఇది అంతా గ్రామ ప్రజలపై ప్రేమతో కాదు. ఆ గ్రామంపై పట్టు సాధించేందుకు చేసిన యత్నం. మండల పరిధిలోని కొల్లావారిపల్లి గ్రామ పంచాయతీకి ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో మిట్ట హరిజనవాడకు చెందిన దళిత అభ్యర్థి మహేష్ టీడీపీ తరఫున పోటీ చేశాడు. పంచాయతీ ఎన్నికల్లో మిట్ట హరిజనవాడ ఓట్లు కీలకంగా మారాయి. ఎప్పుడూ వైఎస్సార్ కుటుంబం వెన్నంటే.. ఈ గ్రామంలోని దళితులు ఎప్పుడూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం వెంటే నడిచేవారు. కమ్మ సామాజిక వర్గానికి పట్టు ఉన్న కొల్లావారిపల్లిలో వైఎస్సార్ సానుభూతి పరుల మీద ఎప్పుడూ కక్షసాధింపు చర్యలు కొనసాగేవి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకి చెందిన కొల్లావారిపల్లి సర్పంచ్ మహేష్ గ్రామ సర్వే నంబరు–25లోని టి.నరసింహులుకు సంబంధించిన ఇంటిస్థలాన్ని ప్రభుత్వం పేరుతో స్వాధీనం చేసుకునేందుకు వేసిన స్కెచ్‌లో భాగంగా ఎవరి అనుమతులు లేకుండానే బోరును రీ పాయింట్ చేసేందుకు పూనుకున్నాడు. అడ్డుకున్న మిట్ట హరిజనవాడ ప్రజలను ‘మీకు చేతనైంది చేసుకోపోండని’ సవాల్ విసిరాడు. జగనన్న పాలనలో నీటి ఎద్దడి లేదు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించినప్పటి నుంచి పుష్కలంగా వర్షాలు కురవడంతో ఈ రెండున్నరేళ్ల కాలంలో గ్రామంలో నీటి ఎద్దడి లేదు. గతంలో 800 అడుగుల ఉన్న బోరును సంవత్సరం క్రితం రీ బోర్ చేయించి 1150 అడుగుల లోతుకు చేశారు. నీటి అవసరం లేకున్నా బోరును వేయించి ఒకే పైపునకు రెండు మోటార్లకు చెందిన నీటిని వదిలితే పైపులు పగిలిపోతాయని తెలిసినా సర్పంచ్ ఇటువంటి పనులు చేయడం సరికాదని వారు అంటున్నారు. తక్షణమే బోరును వేయకుండా నిలుపుదల చేయాలని మిట్ట హరిజనవాడ గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరుతున్నారు. గ్రామస్తులు గురువారం ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ కేతన్‌గార్గ్ దృష్టికి తీసుకెళ్లేందుకు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. అయితే సబ్ కలెక్టర్ క్యాంప్ లేకపోవడంతో తిరిగి శుక్రవారం వస్తామని వెళ్లిపోయారు. చదవండి: కాపలా ఉండాల్సింది పోయి.. కాజేసి పరారయ్యాడు! -
అది అవినీతి సొమ్ము కాదు..నా సొంత డబ్బులే ఇచ్చా
సాక్షి,పటాన్చెరు(హైదరాబాద్): ‘పంచాయతీలో సీసీ కెమెరాలు ఉంటాయని మాకు తెలియదా? పంచాయతీ హాలులో సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నా సొంత డబ్బులను ఇచ్చాను. అది కూడా హోలీ పండుగ సందర్భంగా ఇచ్చా.’ అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫుటేజీపై సర్పంచ్ ఏర్పుల కృష్ణ వివరణ ఇచ్చారు. గురువారం ఆయన ఉపసర్పంచ్ ఫయీమ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అయితే ఆ సొమ్ము ఏ బిల్డర్ దగ్గర తెచ్చింది కాదు. ఓ వార్డు సభ్యుడు అక్రమంగా ఏడంతుస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడని, ఆ భవంతిని కూల్చివేసిన కారణంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారని కృష్ణ తెలిపారు. పంచాయతీ సీసీ కెమెరా ఫూటేజీని దొంగలించి తమపై లేనిపోనివి కల్పించి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో సీసీ కెమెరాలున్న సంగతి మాకు తెలియంది కాదన్నారు. సీసీ కెమెరాలను ఊరంతా పెట్టించానని, అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలోనూ తామే పెట్టించినట్లు సర్పంచ్ కృష్ణ, ఉపసర్పంచ్ ఫయీమ్ వివరించారు. తాము ఏ తప్పు చేయలేదని, పంచాయతీ కార్యాలయంలో ఇచ్చిన డబ్బు అవినీతి సొమ్ము కాదని తెలిపారు. తనపై అనవసర దుష్ప్రచారానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వివాహేతర సంబంధం వద్దన్నందుకు.. -
పంచాయతీ కార్యదర్శిపై చెప్పులతో దాడి!
సాక్షి, కెరమెరి(ఆదిలాబాద్): మండలంలోని కైరి పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌పై సర్పంచ్ లెండుగురే విజయలక్ష్మి, ఆమె భర్త బాలాజీ చెప్పులతో దాడి చేసినట్లు మంగళవారం పంచాయతీ కార్యదర్శులు సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో దత్తారాం, పీఎస్సై ప్రశాంత్‌కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయంలో విధుల్లో ఉండగా అకారణంగా దూషిస్తూ సర్పంచ్‌తోపాటు ఆమె భర్త చెప్పులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘం నాయకులు మహేందర్‌రెడ్డి, రమేశ్, మల్లేశ్, హరీశ్, ధర్మయ్య తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈమేరకు సర్పంచ్ విజయలక్ష్మి, బాలాజీని వివరణ కోరగా.. ఇటీవల పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి తీర్మానం కావాలని కోరామన్నారు. అయితే మహిళా సర్పంచ్ అని చూడకుండా దుర్భాషలాడారని ఆరోపించారు. తాము చెప్పులతో దాడి చేయలేదని, పంచాయతీ కార్యదర్శి అకారణంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌తోపాటు డీపీవోకు నివేదిస్తానని ఎంపీడీవో తెలిపారు. కాగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
జెండా ఎగురవేశాడని దళిత సర్పంచ్‌పై సెక్రటరీ పిడిగుద్దులు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక దళిత వ్యక్తి జాతీయజెండాను ఎగురవేశాడనే కోపంతో.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికుల ప్రకారం.. ఈ సంఘటన బుందేల్ ఖండ్‌లో జరిగింది. కాగా, నిన్న (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్పూర్లోని ధాంచీ గ్రామస్తులు.. స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సదరు గ్రామ కార్యదర్శి సునీల్ తివారి సమయానికి రాలేదు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ హన్ను బాసర్ను జెండా ఎగురవేయాలని కోరారు. వారి కోరిక మేరకు.. హన్ను బాసర్ జెండాను ఎగురవేశాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న సునీల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను కాదని.. నువ్వు జెండా ఎలా ఎగురవేశావని ప్రశ్నించారు. కోపంతో విచక్షణ కోల్పోయిన సెక్రెటరీ.. దళిత సర్పంచ్‌పై పిడిగుద్దులు కురిపిస్తు దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా.. అడ్డు వచ్చిన సర్పంచ్ భార్య.. కోడలిపై కూడా దాడిచేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యదర్శిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్, అతని భార్య.. సెక్రెటరీ సునీల్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనపై కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉప సర్పంచ్ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్ గుజ్జ జయసుధ సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం గ్రామంలో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు తెచ్చి, గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామని, 10 నెలలవుతున్నా చెక్కులపై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్థికంగా చితికిపోయిన తనకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చావే శరణ్యమని అన్నారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ సోమవారం సీఎం కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానని మహేందర్‌గౌడ్ పేర్కొన్నారు. -
ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత, అతడి భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అనంతనాగ్‌లోని లాల్ చౌక్‌లో సోమవారం జరిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్‌తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఉగ్రవాదుల దాడుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు చనిపోయినట్లు మరో బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. అమాయకులును బలి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ దారుణాన్ని ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘కుల్గాంలో జరిగిన కాల్పుల్లో కిసాన్ మోర్చా అధ్యక్షుడు, సర్పంచ్ గులామ్ రసూల్ దార్‌తో పాటు ఆయన భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపంద చర్య.. హింసకు పాల్పడిన వారిని అతి త్వరలో న్యాయస్థానం ముందు నిలబెడతాం. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 మరో వైపు పూంచ్ సెక్టార్లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో ఆయుధాలు దొరికాయి. వాటిల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి. Jammu & Kashmir | Terrorists fired bullets at a couple at Lal Chowk in Anantnag. Both husband & wife have been shifted to hospital. More details awaited. — ANI (@ANI) August 9, 2021 -
వీడిన సర్పంచ్ హత్య మిస్టరీ: పాతకక్షలతోనే దాడి
లింగాల : వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల సర్పంచ్ కణం చిన్న మునెప్ప హత్యకు పాత కక్షలే కారణమని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. లింగాల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. మునెప్ప సర్పంచ్‌గా గెలుపొందడం జీర్ణించుకోలేక నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి వర్గీయులు హతమార్చారు. 1995లో గ్రామంలోని సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులు అదే గ్రామానికి చెందిన కాల్వ పుల్లన్నపై బాంబులు, తుపాకులు, కొడవళ్లతో దాడిచేసి చంపారు. దాడిలో పుల్లన్న, నలుగురు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కణం చిన్న మునెప్ప నిందితుడిగా ఉన్నాడు. తర్వాత 1995లో పులివెందుల మండలం రాయలాపురం బ్రిడ్జి సమీపంలో సరిబాల లక్ష్మీనారాయణరెడ్డి వర్గీయులే నాగిరెడ్డి గారి లక్ష్మీరెడ్డి బావ అంకిరెడ్డి మనోహర్‌రెడ్డిని హతమార్చారు. ఈ కేసులో కణం చిన్న మునెప్ప హస్తం ఉన్నట్లు బయటపడింది. అప్పటి నుంచి ఇతడిపై లక్ష్మీరెడ్డి వర్గీయులు కక్ష పెంచుకున్నారు. చిన్న మునెప్పను హతమార్చేందుకు పథకం వేశారు. గతనెల 27వ తేదీన పులివెందులలో నిర్వహించిన సర్పంచ్ శిక్షణా తరగతులకు కణం చిన్నమునెప్ప హాజరై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిగారి లక్ష్మీరెడ్డి, మరో 15 మంది ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఢీకొట్టారు. కిందపడిన చిన్న మునెప్పను కొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను గురువారం వెలిదండ్ల సమీపంలోని గొడ్డుమర్రి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షి సరిబాల వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ద్విచక్రవాహలను సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితులను శుక్రవారం పులివెందుల సివిల్ జడ్జి కోర్టుకు హాజరుపరచగా.. రిమాండ్‌కు పంపించారు. సమావేశంలో సీఐ రవీంద్రనాథరెడ్డి, ఎస్ఐ హృషికేశవరెడ్డి పాల్గొన్నారు. -
గాడిదపై సర్పంచ్ ఊరేగింపు: పండగ చేసుకున్న గ్రామస్తులు
భోపాల్: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా మధ్యప్రదేశ్‌లో మాత్రం ఆశించినంతగా కురవడం లేదు. దీంతో వర్షాల కోసం ప్రజలు తీరొక్క తీరున పూజలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మనం కప్పల పెళ్లి తదితర కార్యక్రమాలు చూశాం. కానీ ఆ రాష్ట్రంలో వింతగా గాడిదపై సర్పంచ్ కూర్చొని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఉత్సాహంతో ఈలలు.. కేకలు వేస్తూ డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ వర్షం కోసం ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలోని విదిశ జిల్లా రంగై గ్రామంలో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతోంది. వర్షాల కోసం గాడిదపై సర్పంచ్ గ్రామమంతా ఊరేగాలనే సంప్రదాయం ఉంది. ప్రస్తుతం ఆ జిల్లాలో వర్షాలు సక్రమంగా కురవడం లేదు. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి సర్పంచ్ సుశీల్ వర్మకు గత సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనుకున్నదే తడువుగా ఒక గాడిదను తీసుకుని వచ్చి దానికి పూజించారు. అనంతరం సర్పంచ్ సుశీల్ వర్మ గాడిదపై కూర్చోగా గ్రామస్తులంతా కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. పటేల్ బాబా ఆలయం నుంచి గణేశ్ మందిరం వరకు ఊరేగింపు చేపట్టారు. ఈలలు.. కేకలు వేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో గ్రామస్తులు పాల్గొన్నారు. ఊరేగింపు ముగిసిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురవాలని గ్రామస్తులంతా ప్రార్థించారు. ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్ సుశీల్ వర్మ స్పందించి ఆ ఆనవాయితీ గురించి వివరించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో మాకు వింత ఆచారం ఉంది. గ్రామ అధిపతి (సర్పంచ్) గాడిదపై స్వారీ చేస్తే వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే గాడిదపై స్వారీ చేశా. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల సమస్య పరిష్కరించడం నా బాధ్యత. అందుకే గాడిదపై ఊరేగి వరుణదేవుడిని ప్రార్థించా’ అని తెలిపారు. -
నేటినుంచి సర్పంచులకు శిక్షణ
సాక్షి, అమరావతి: ఏపీలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పాలనపై గురువారం నుంచి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఆగస్టు 14 వరకు పంచాయతీరాజ్‌శాఖ, స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ (ఎస్ఐఆర్డీ) ఆధ్వర్యంలో కొనసాగే ఈ శిక్షణ తరగతులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభిస్తారని ఎస్ఐఆర్డీ డైరక్టర్ జె.మురళి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం 60 కేంద్రాల్లో ఈ తరగతులు మొదలవుతాయన్నారు. సర్పంచులకు రెసిడెన్షియల్ పద్ధతిలో వారి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ప్రతి తరగతికి 20 మందే హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఒక్కో బ్యాచ్‌లో ప్రతి జిల్లాలో 120 మందికి మాత్రమే శిక్షణ ఇస్తున్నామన్నారు. ఒక్కో బ్యాచ్‌కి 3 రోజులపాటు 14 అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి జిల్లాలో గరిష్టంగా 7 బ్యాచ్‌లు ఉంటాయని చెప్పారు. ఈ తరగతుల నిర్వహణకు మొదటి విడతగా జిల్లాలకు రూ.1,77,63,998 విడుదల చేసినట్టు చెప్పారు. సర్పంచుల్లో గర్భిణులకు మినహాయింపు ఇచ్చామని, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. సర్పంచులకు శిక్షణ ఇచ్చే 14 అంశాలు తొలిరోజు 1. గ్రామ పంచాయతీలు, మన స్థానిక ప్రభుత్వాలు– గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రాముఖ్యత 2. సర్పంచ్, వార్డుసభ్యులు, సిబ్బంది అధికారాలు, విధులు, బాధ్యతలు 3. స్థానిక స్వపరిపాలన– గ్రామ సచివాలయాలు, వలంటీర్లు, గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాలు, కార్యచరణ కమిటీలు 4. మౌలిక వసతుల కల్పనతో గ్రామాభివృద్ధి – తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, వీధిదీపాలు మొదలైనవి 5. పారిశుధ్యం – జగనన్న స్వచ్ఛ సంకల్పం రెండో రోజు 6. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్1 7. నియంత్రణ అధికారులతో గ్రామ పంచాయతీ పాలన– పార్ట్ 2 8. గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవహారాలు 9. గ్రామ పంచాయతీల ఆదాయ వ్యయాలు– వ్యయ నియమాలు– బడ్జెట్, అభివృద్ధి ప్రణాళికలు 10. ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు– నవరత్నాలు– గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న వివిధ పథకాలు మూడో రోజు 11. పారదర్శక పాలన– పంచాయతీలపై పర్యవేక్షణ, నియంత్రణ వ్యవస్థ 12. పంచాయతీ రికార్డులు, నివేదికలు 13. గ్రామ పంచాయతీలో జవాబుదారీతనం– క్రమశిక్షణ 14. కేంద్ర ఆర్థికసంఘం నిధులు, ఉపాధిహామీ పథకం, స్వచ్ఛ భారత్ -
సర్పంచ్ భర్తపై ఇనుపరాడుతో దాడి..
సాక్షి, పెంబి(నిర్మల్): మండలంలోని వేణునగర్ గ్రామ సర్పంచ్ భర్త రమేష్‌పై గ్రామ పారిశుధ్య కార్మికుడు ఆదివారం సాయంత్రం ఇనుప రాడుతో తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు రమేష్ వివరాల ప్రకారం.. ప ల్లె ప్రకృతి వనంలో కార్మికుడు సోనేరావు రో డ్డుపై ట్రాక్టర్ నిలిపి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. రోడ్డుపై ట్రాక్టర్ నిలుపవద్దని, పక్కకు పె ట్టుకుని బకెట్‌తో నీళ్లు పోయాలని తెలుపగా సోనేరావు తనచేతిలోని ఇనుపరాడుతో దాడి చేశాడు. తలకు గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రమేష్ తెలిపాడు. -
యువకుడి రెండు చేతులను నరికేసిన సర్పంచ్ భర్త..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచోసుకుంది. పంట సేకరణ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒక వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చిన అమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన హోషంగాబాద్ జిల్లాలో జరిగింది. చౌరాహెట్ గ్రామాంలో కొన్ని రోజులుగా పంట సేకరణ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో.. సదరు గ్రామానికి చెందిన సోమేష్ గుర్జార్ అనే రైతు ఒక రోజు సర్పంచ్ భర్త అయిన భగవాన్ సింగ్‌కు తమ సమస్యలను పరిష్కరించాలని కోరాడు. ఈ విషయం గురించి గ్రామస్తులు పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా, సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఒకరోజు సోమేష్ గుర్జార్ గ్రామస్థుల అందరి సమక్షంలో సర్పంచ్ భర్తను నిలదీశాడు. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటమాట పెరిగి ఒకరి కాలర్‌ను మరోకరు పట్టుకున్నారు. ఈ సంఘటనను భగవాన్ సింగ్ అవమానకరంగా భావించి ఆవేశంతో రగిలిపోయాడు. గుర్జార్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో గత శుక్రవారం రాత్రి సింగ్ కుటుంబం సభ్యులు గుర్జార్‌ను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మూకుమ్మడిగా కర్రలతో దాడిచేశారు. దీంతో గుర్జార్ లేవలేని స్థితిలో కిందపడిపోయాడు. అప్పుడు భగవాన్ సింగ్ ఒక కోడవలితో రైతు రెండు చేతులను విచక్షణ రహితంగా నరికేశాడు. ఈ క్రమంలో, రైతు రెండు చేతులు తెగిపోయి, రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనతో అతని కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గుర్జార్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
సర్పంచ్ కొడుకా.. ఛీ ఇవేం పనులు
సాక్షి, ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): అధికారంలో ఉండగా ఆడిందే ఆటగా, పాడిందే పాటగా చలాయించిన టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తమ పాచికలు పారకపోవడంతో బరితెగిస్తున్నారు. మశాఖపురం పంచాయతీ సర్పంచ్ ఆశి తులసమ్మ కొడుకు, టీడీపీ నేత మాధవరావు సహనం కోల్పోయి అభివృద్ధినే అడ్డుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చరిత్రలో లేని విధంగా జగనన్న కాలనీలో పేదలకు ఇళ్లు పంపిణీ చేయడంతో సదరు వ్యక్తికి కన్నుకుట్టింది. ప్రస్తుతం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటి కోసం ఇటీవల కాలనీలో వేసిన మోటారు బోరుకు సంబంధించి విద్యుత్ లైన్ దౌర్జన్యంగా కట్ చేయడంతో పాటు పైపులను తొలగించడంతో లబ్ధిదారులు శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటిని ఇప్పించాలని, అదే విధంగా ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్న సర్పంచ్ కుమారుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడివో, తహసీల్దార్లను కోరారు. -
ఖమ్మం : రసాభాసగా మల్లవరంలో పల్లెప్రగతి కార్యక్రమం
-
‘బ్రోకర్లా మారావు’.. ఐబీ ఏఈపై సర్పంచ్..
సాక్షి, పరకాల(వరంగల్) : మండల పరిధి లక్ష్మీపురం గ్రామంలో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణం విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా బిల్లులు చేస్తున్నారు.. కనీసం సర్పంచ్‌కు సమాచారం ఇవ్వకపోవడం ఏంత వరకు సమంజసం.. అధికారి అనే విషయం మరిచి బ్రోకర్‌గా మారావంటూ ఐబీ ఏఈపై సర్పంచ్ ఆముదాలపల్లి మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ స్వర్ణలత అధ్యక్షతన బుధవారం పరకాల మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా సమావేశానికి హాజరుకాని శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు కోరారు. సర్వసభ్య సమావేశానికి వరుసగా మూడు సార్లు హాజరుకాకుండా ఉన్న ఎక్సైజ్ అధికారుల తీరుపై మండిపడిన సభ్యులు.. వారిపై చర్య తీసుకోవాలని, ఈ మేరకు కలెక్టర్‌కు నివేదికను పంపాలని తీర్మానం చేశారు. అలాగే.. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి కొత్తవి నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. కోవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు 16 రకాల ఐటెమ్స్‌తో పాటు రూ.2వేల నగదు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నందున మృతుల జాబితా సిద్ధం చేయాలని, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలకు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కామారెడ్డిపల్లె, వెల్లంపల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలను అరికట్టాలని సర్పంచ్‌లు రాజమౌళి, కృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు సిలువేరు మొగిళి, వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ నాగరాజులతో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చదవండి: ఇంటి నుంచి పారిపోయి ... హిజ్రాగా మారి! -
మనవడి పెళ్లి వివాదం.. సర్పంచ్ కిడ్నాప్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో సినిమాను తలదన్నే రీతిలో ఓ సర్పంచ్ కిడ్నాప్ చోటు చేసుకుంది. పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం కాస్త చివరకు సర్పంచ్ కిడ్నాప్‌కు దారి తీసింది. ఆ వివరాలు.. స్థానిక సంప్రదాయం ప్రకారం దియాలి గ్రామ సర్పంచ్ బద్రిలాల్ మనవడి వివాహం బాలాగంజ్ ప్రాంతానికి చెందిన యువతితో బాల్యంలోనే నిశ్చయమయ్యింది. ప్రస్తుతం ఇద్దరికి యుక్తవయసు వచ్చింది.. చిన్నప్పుడు నిశ్చయించిన ప్రకారం యువతిని తమ ఇంటికి పంపాల్సిందిగా బద్రిలాల్ ఆమె కుటుంబ సభ్యులును కోరాడు. కానీ వారు నిరాకరించడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఇరు కుటుంబాల పెద్దలు గ్రామంలోని అంతారి ఆలయంలో సమావేశమయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలు సమస్య గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. చివరకు చర్చలు కాస్త ముదిరి.. ఒకరినొకరు దూషించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు ఎవరింటికి వారు వెళ్లారు. ఇక మరుసటి రోజు ఇంటి నుంచి బయటకు వచ్చిన బద్రిలాల్ను యువతి కుటుంబ సభ్యులు అపహరించారు. విషయం తెలుసుకున్న బద్రిలాల్ గ్రామస్తులు యువతి కుటుంబం మీదకు గొడవకు వెళ్లారు. అక్కడ వీరంగం సృష్టించి.. యువతి ఇంటిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: విషాదం: ఇంటి మిద్దెకూలి మనవడితో సహా సర్పంచ్ మృతి -
విషాదం: ఇంటి మిద్దెకూలి మనవడితో సహా సర్పంచ్ మృతి
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండ రావిపాకుల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి మిద్దెకూలి గ్రామ సర్పంచ్ లచ్చమ్మ (51), ఆమె మనవడు యోగేశ్వర్ (7) మృతి చెందారు. మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మిద్దెకూలిపోయి వారిపై పడింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కాగా, బండ రావిపాకుల.. ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. ఈక్రమంలో సర్పంచ్ ఇళ్లు పాతదై పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీఓ,తహసీల్దార్లతో గ్రామస్తుల వాగ్వివాదం గ్రామ సర్పంచ్ మృతి చెందిన విషయం తెలియడంతో ఆర్టీఓ, తహసీల్దార్ బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు బండ రావిపాకుల వెళ్లారు. అయితే, ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ, తహసీల్దార్లను అడ్డుకున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. తమకు సకాలంలో పునరావాసం ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి పరిస్దితి తలెత్తేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులంతా పునరావాస పరిహారంపై పట్టుబట్టడంతో ఆర్టీఓ, తహసీల్దార్లు వెనుదిరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. చదవండి: కేపీహెచ్‌బీకాలనీ: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం -
ఏపీ: గ్రామ పాలనలో 55 శాతం వారే..
►ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల చిల్లా అనూష ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాజకీయాల పట్ల తనకు ఉన్న ఆసక్తి, ప్రజాసేవ చేయాలనే కోరిక తనను ఈ దిశగా నడిపించాయని అనూష అంటున్నారు. ఆ గ్రామ సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడం తనకు కలిసి వచ్చిందని ‘సాక్షి’తో అన్నారు. ఈమెతో పాటు రాష్ట్రంలో ఎంతో మంది ఔత్సాహిక యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాలకు కొత్త కళను తీసుకొచ్చారు. గ్రామాల్లో మారుతున్న పరిస్థితులపై కథనం ►అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లజెరువు సర్పంచ్‌గా ఎంకాం చదివి.. రెండేళ్ల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన దాసరి శ్రీనాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. అతడి తల్లిదండ్రులు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులే. వాళ్లిద్దరూ పెద్దగా చదువుకున్న వాళ్లు కూడా కాదు. శ్రీనాథ్‌రెడ్డి మాత్రం రాజకీయాలపై ఆసక్తితోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌రెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆయన సర్పంచ్‌గా ఎన్నిక కావడానికి దోహదపడ్డాయి. సర్పంచ్ అయ్యాక శ్రీనాథ్‌రెడ్డి గ్రామంలో కరోనా బారిన పడినవారి కోసం స్థానిక పాఠశాల భవనంలో 10 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సాక్షి, అమరావతి: రాజకీయ రంగం నూతన జవసత్వాలు పుంజుకుంటోంది. గ్రామీణ రాజకీయ రంగంలో పాత నీరు దాదాపు పోయింది. బాగా చదువుకున్న నవతరం రాజకీయాల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 84 శాతం మంది తొలిసారి సర్పంచ్‌లుగా ఎన్నికైన వారే ఉన్నారు. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో 13,097 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీరిలో 13,070 సర్పంచ్ల పూర్తి వివరాలు ఎన్నికల సంఘానికి అందాయి. ఆ వివరాలను పరిశీలిస్తే.. ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. సర్పంచ్‌లుగా ఎన్నికైన 13,070 మందిలో 11,008 మంది (84 శాతం) తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వారే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిగ చోట్ల వైఎస్సార్సీపీ సానుభూతిపరులే గెలుపొందిన నేపథ్యంలో.. రాష్ట్రంలో డైనమిక్ రాజకీయాలకు నాంది పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో కొత్త తరం వారికి మెండుగా అవకాశాలు దక్కాయి. రిజర్వుడు స్థానాల్లోనూ చదువుకున్న వారే.. తొలినాళ్లలో చదువు వచ్చినా.. రాకపోయినా ఊళ్లో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే వారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేవారు. అప్పట్లో సర్పంచ్‌లుగా గెలిచే వారిలో 90 శాతం వరకు నిరక్షరాస్యులే ఉండేవారు. గడచిన 30 ఏళ్ల కాలంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వు అయ్యే స్థానాల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే సర్పంచ్‌లుగా గెలుపొందే వారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మొత్తం 13,070 మంది సర్పంచ్‌లలో కేవలం 2,276 మంది మాత్రమే నిరక్షరాస్యులు ఉన్నారు. 10,794 చోట్ల చదువుకున్న వారే గెలిచారు. వీరిలో చార్టెడ్ అకౌంట్ (సీఏ), ఎంటెక్, ఎంఏ, ఎంబీఏ, సీఏ, బీటెక్ వంటి ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. మొత్తం సర్పంచ్‌లలో 525 మంది పెళ్లి కాకమునుపే సర్పంచ్‌లుగా గెలుపొందటం విశేషం. రిజర్వేషన్లకు మించి మహిళలకు పదవులు జనరల్ రిజర్వుడు స్థానాల్లో మహిళలు సర్పంచ్ స్థానాలకు పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాల్లో 55 శాతం మంది మహిళలు సర్పంచ్ పదవులు దక్కించుకోగా.. పురుషులకు కేవలం 45 శాతం సర్పంచ్ స్థానాలే దక్కించుకోగలిగారు. సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలో 50 శాతం స్థానాలు మహిళలకు రిజర్వు చేశారు. కానీ, రిజర్వు స్థానాలకు అదనంగా మరో 5 శాతం సర్పంచ్ స్థానాలను మహిళలు దక్కించుకున్నారు. -
సర్పంచూ.. 22న మీ ఊరొస్తున్నా : ఫోన్లో సీఎం కేసీఆర్
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ తాను హామీ ఇచ్చిన మేరకు ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్తున్నారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్ పోగుల అంజయ్యకు శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనం, గ్రామసభ ఏర్పాటు కోసం స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సర్పంచ్ అంజయ్య మధ్య సంభాషణ సాగిందిలా.. సీఎం కేసీఆర్: హలో సర్పంచ్: సార్ నమస్తే సార్ సీఎం: నమస్తే అంజయ్య.. బాగున్నవా? సర్పంచ్: బాగున్న సార్.. బాగున్న సార్ సీఎం: అంజయ్యా.. ఇప్పుడేందంటే 22న వస్తున్న మీ ఊరికి. సర్పంచ్: 22 తారీఖా సార్. సీఎం: ఎందుకంటే ఈ మధ్య నాకు కరోనా వచ్చింది. దేశమంతా కరోనా వచ్చే. సూద్దమంటే కూడ రాలేకపోయిన. అప్పుడు నేను మాటిచ్చిన కాబట్టి 22న వచ్చి, ప్రాజెక్ట్ టేకాఫ్ చేద్దాం ఇగ. సర్పంచ్: ఓకే సార్. థాంక్యూ సార్. సీఎం: నువ్వు రెండు జాగలు జూడాలే. ఊరందరికీ భోజనం నేనే పెట్టాలే. ఎవరు పెట్టే అవసరం ఉండదు. ఎమ్మెల్యే గారికి కూడ చెప్పిన. నేనే పంపిస్తా. టీమ్ హైదరాబాద్ నుంచి వస్తారు. మొత్తం మీ ఊరి జనాభా ఎంతయ్యా? సర్పంచ్: 2,600 సార్. సీఎం: మూడు వేల మందికి వండితే సరిపోతదిగా మంచిగ? సర్పంచ్: మూడు వేలకు సరిపోతది సార్. సీఎం: నా వెంబడే వస్తది జిల్లా యంత్రాంగమంతా.. సర్పంచ్: అయితే ఎక్కువ గావలే సార్.. సీఎం: సరిపోతది.. నా వెంబడి 200 మంది వస్తే.. ఇంకో 200 మందికి ఎక్స్ట్రా అనుకుందాం. సర్పంచ్: సరిపోతది సార్. సీఎం: పోలీసోళ్లు, వాళ్లు, వీళ్లు ఉంటరు చూద్దాంలే. దానికి నువ్వెందుకు బాధ పడతవుగని. నేను జేపిస్తలే, టీమ్ వచ్చి సపరేట్ చేస్తరులే నువ్వేం గాబరా గావాల్సిన అవసరం ఉండది, కాకపోతే రెండు జాగాలు చూడాలే నువ్వు. మీ కలెక్టర్ కూడ వస్తది. సర్పంచ్: ఇప్పుడే వస్తదా సార్? సీఎం: ఆ.. కలెక్టర్ ఇప్పుడొస్తది. నీకు చెప్పే వస్తది, నీ పేరు కూడ చెప్పిన.. మధ్యాహ్నం వరకు వస్తదేమో. మొత్తం టీమ్, టీమ్ వస్తరిగ. మొత్తం రెండు జాగలు, ఒకటి ఊరి మొత్తం కులం, మతం, జాతి లేకుండా అందరికీ గలిసి సామూహిక భోజనం. ఒక్కతాననే తిందాం. నేను పదకొండున్నర, 12 మధ్యన చేరుకుంట. అందరితోపాటు కలిసి నేనుగూడ తింట. మందిల్నే కూర్చుని తింట. మీ మంత్రి గారొస్తరు. లోకమంత వస్తరు. దాని తర్వాత ఇంకో జాగల మీటింగ్ సర్పంచ్: సార్.. ఓకే సార్ సీఎం: దీనికి కూడ రెయిన్ ఫ్రూప్ టెంట్ ఏర్పాటు చేయాలే.. వానొచ్చినా ఇబ్బంది లేకుంట.. కలెక్టర్‌కు చెప్పిన. వాళ్లు చూసుకుంటరు. ఊరంత కూర్చొని తినడానికి. ఊరంత గూసోని మళ్లీ సభ జరుపుకోవడానికి రెండు జాగలు మంచివి నీట్‌గా ఉండేవి చూడాలె. అర్థమైందిగదా.. సర్పంచ్: ఊరు చిన్నది సార్. గ్రామ పంచాయతీ అంటే మరీ మధ్యన అయితది, అంతమంది కూర్చోవడానికి వీలు కాకపోవచ్చు సార్. మన రామాలయం అప్పుడు మీరు కారు ఆపిండ్రు చూడు సార్ టర్నింగ్‌ల, కొండాపూర్ రోడ్ల, అక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంటడు. అక్కడ అయనది ఓ ముప్పై ఎకరాలుంటది. హాస్టల్ దగ్గర.. సీఎం: అక్కడనే పెట్టియ్యి. అదే జాగల పెట్టు. సర్పంచ్: అక్కన్నే పెడ్తసార్. మీరొచ్చే తొవ్వలనే.. మీరు రావడానికి ఈజీ ఉంటది సార్. ట్రాఫిక్ ఇబ్బంది ఉండది. సీఎం: నాది బస్సు వస్తది. అండ్లనే బాత్రూం గిట్ల అన్ని ఉంటయి. నేను ఎవరింటికి పోవాల్సిన అవసరం ఉండది. బస్సులకే పోత. సర్పంచ్: మా ఇంటికి రావాలే సార్, ఓ సారి.. సీఎం: మీ ఇల్లు ఎక్కడుంది? సర్పంచ్: మాది ఊరి లోపలుంటది సార్. చిన్నది పెంకల ఇల్లు సార్. సీఎం: ఆ.. ఏముంది మీ ఇంటికి వస్తా. సర్పంచ్: మా ఇంటికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి పోవాలే సార్. సీఎం: నో ప్రాబ్లం. ముందో, తరువాతనో పోచేలా ప్లాన్ చేసుకుందాం. సర్పంచ్: ఒకే సార్, సరే సార్. సీఎం: దీంట్ల చిల్లర రాజకీయాలు, పార్టీలుండవు. సర్పంచ్: నా దగ్గర అట్లాంటివి లేవు సార్. సీఎం: నీదిగాదు నేను చెప్పేది వేరే పార్టీలోళ్లు ఉంటే గూడ ఓపికతో కలుపుకొని పోవాలే. ప్రతి ఇంటిని బాగు చేయాలనే చూస్తున్నం. వీడు, వాడు అనేదేం ఉండదు మనకు, నువ్వు మంచిగ చేస్తే, ప్రాజెక్ట్ మంచిగ ఇంప్లిమెంట్ జేస్తే నీకు మంచి ఫలితాలు ఉంటాయి. సర్పంచ్: మీ దయ, బ్లెస్సింగ్స్ సార్. సీఎం: బాగ చెయ్యి ఊరును, నీకు మంచిగుంటది. సర్పంచ్: సరే సార్ సీఎం: అన్నం తినే జాగ, మీటింగ్ జాగ వేరే ఉండాలి. అర్థమైంది గద. సర్పంచ్: అర్థమైంది సార్. సీఎం: మీటింగ్ అయ్యే లోపున అన్నం తిని మీ ఇంటికి వస్తా, పబ్లిక్ తిని మీటింగ్ వచ్చే వరకల్ల మీ ఇంటికి పోయి వద్దాం. సర్పంచ్: మంచిది సార్. -
సర్పంచ్ అయితే మాకేంటి ?. పెద్దసార్ చెబితేనే వదిలేస్తాం..
సాక్షి, హసన్‌పర్తి : నువ్వు సర్పంచ్ అయితే నాకేంటి! లాక్డౌన్ ఉందని తెలియదా... ఏమైనా ఉంటే పెద్ద సార్‌కు చెప్పుకో... అంటూ ఓ ట్రెయినీ ఎస్సై వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. హసన్‌పర్తి మండలం సీతంపేట సర్పంచ్ జనగాని శరత్ దంపతులు ఇటీవల కరోనా బారిన పడ్డారు. పదిహేను రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు మళ్లీ పరీక్ష చేయించుకునేందుకు శుక్రవారం ఉదయం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో తిరుగుపయనమయ్యారు. అయితే, వారు హసన్‌పర్తి బస్టాండ్ వద్దకు చేరుకునే సరికి సమయం 10.20 గంటల అవుతుండడంతో పోలీసులు తనిఖీలు మొదలయ్యాయి. దీంతో శరత్ దంపతుల వాహనాన్ని ట్రెయినీ ఎస్సై ఆపారు. దీంతో ఆయన “సార్ నేను సీతంపేట సర్పంచ్‌ను. నాతో పాటు నా భార్యకు పక్షం రోజుల క్రితం కరోనా వచ్చింది. ఆస్పత్రికి వెళ్లివస్తున్నాం’ అని చెప్పినా వినకుండా బైక్ పక్కన పెట్టి మాట్లాడాలంటూ ఎస్సై నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత నచ్చచెప్పినా వినకపోగా రోడ్డు ఆవతలి వైపున ఉన్న పెద్ద సార్‌కు చెప్పుకుని, ఆయన అనుమతి ఇస్తేనే వదిలి పెడతానని స్పష్టం చేశాడు. దీంతో కాసేపు వేచి ఉన్న సర్పంచ్ శరత్ తనకు తెలిసిన ఎస్సైకు ఫోన్ చేయగా, ఆయన జోక్యం చేసుకోవడంతో సర్పంచ్‌ను పంపించారు. లాక్డౌన్ అమలుకు పోలీసులు నిరంతరం శ్రమిస్తుండగా, ఒకరిద్దరు వ్యవహరిస్తున్న తీరుతో శాఖకు అప్రతిష్ట వస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు నిబంధనల అమలు విషయంలో సిబ్బందికి తగిన సూచనలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: అంబులెన్స్ ధరలు.. మోటారుసైకిల్‌పై మృతదేహం తరలింపు ధోవతి ఫంక్షన్ తెచ్చిన తంటా..∙ 10 మందికి సోకిన కరోనా -
బంగారు నగలు తాకట్టు పెట్టి..వేతనాల చెల్లింపు
చిట్యాల: ఓ వైపు కరోనా విలయతాండవం.. మరోవైపు ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలం దిస్తున్నా 3 నెలలుగా వేతనాలు అందలేదం టూ పారిశుధ్య కార్మికుల ఆవేదన.. దీంతో ఆ గ్రామ మహిళా సర్పంచ్ మనసు చివుక్కు మంది. ఇంకేముంది ఏకంగా తన ఒంటి మీదున్న నగలను తాకట్టు పెట్టి మరీ వారికి వేతనమిచ్చి ఉపశమనం కల్పించారు. స్ఫూర్తి మంతంగా నిలిచారు. అందరి మన్ననలు అందుకున్నారు. కరోనా కాలంలో కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆ సర్పంచ్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెలిమి నేడు గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, ఉప సర్పంచ్ మశ్ఛేందర్ నడుమ పొసగడం లేదు. అది కాస్తా ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే వరకు వెళ్లింది. దీంతో నెలపాటు పంచాయతీ పాలన స్తంభించింది. మరోపక్క హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వహించారని కలెక్టర్ తనిఖీల్లో తేలడంతో 15 రోజులపాటు సర్పంచ్ మల్లమ్మపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి సైతం కార్మికుల వేతనాల బిల్లులను సకాలంలో ఎస్టీఓలో సమర్పించలేదు. దీంతో మూడు నెలలుగా 18 మంది కార్మికుల వేతనాలు నిలిచిపోయాయి. వేతనాలందక ఇబ్బంది.. ప్రస్తుత కరోనా వైరస్ విజృంభణ తరుణంలో గ్రామంలో రోజుకు నాలుగైదు కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న తాము వేతనాలందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే వేతనాలివ్వాలని కార్మికులు ఇటీవల పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పదిరోజుల్లో వేతనాలివ్వకుంటే విధులకు హాజరుకాబోమని చెప్పారు. సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. దీంతో సర్పంచ్ ఆ కార్మికులకు కొంతమేరకైనా వేతనాలు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టుపెట్టగా రూ.90వేలు వచ్చాయి. ఆ మొత్తాన్ని పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి రూ.5వేల చొప్పున పంచారు. వెంటనే వారికి వేతనాలు విడుదల చేయాలని సర్పంచ్ మల్లమ్మ అధికారులను కోరారు. -
రూ.30 లక్షల అప్పు.. సర్పంచ్ ఆత్మహత్య
ఇల్లంతకుంట: ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాక పోవడంతో మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్డే ఆనందరెడ్డి (48) 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రూ.18 లక్షల వరకు వెచ్చించి సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు నిర్మించారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఏడాదిన్నరగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం కోసం రూ.12 లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం 30 లక్షల రూపాయల వరకు అప్పు అయ్యింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు విడుదల కాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నట్లు పొలం వద్ద నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు వెళ్లిన కుటుంబ సభ్యులకు ఆనందరెడ్డి కొనఊపిరితో కనిపించారు. ఇల్లంతకుంటలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ప్రభుత్వ పనులకు సంబంధించిన బిల్లులు రాకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పద్మ ఆరోపించారు. -
ఆర్ధిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై బలవన్మరణం
-
భూపాలపల్లి ఎమ్మెల్యేపై హెచ్చార్సిలో ఫిర్యాదు
నాంపల్లి: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత, భర్త దేవేందర్‌తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి విషయమై ఎమ్మెల్యేతో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 2న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ధి గురించి పలువురు సర్పంచ్‌లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చరించినట్లు తెలిపారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్‌ను కోరారు. -
ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్..మహిళా సర్పంచ్ మృతి
దామరగిద్ద (నారాయణపేట): కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఓ మహిళా సర్పంచ్ మృతి చెందింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దామరగిద్ద పీహెచ్సీలో డీపీఎల్ సర్జన్ డాక్టర్ హరిచందర్‌రెడ్డి సమక్షంలో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరం చేపట్టారు. ఈ శిబిరంలో ఆపరేషన్ చేయించుకునేందుకు లింగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మి (32) వచ్చింది. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను మధ్యాహ్నం రెండు గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చి, గర్భసంచి ప్రాంతంలో కడుపుపై ట్రాకర్‌ను లోపలికి పంపేందుకు చర్మాన్ని కట్ చేసే సమయంలో లక్ష్మికి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లక్ష్మి మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు నారాయణపేట పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళా సర్పంచ్ మృతి చెందిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆపరేషన్ చేయకముందే.. లక్ష్మికి సర్జరీ చేసేందుకు అనస్తీయా వైద్యులు జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చారని, ఆపరేషన్ చేసేందుకు సర్జన్ హరిచందర్‌రెడ్డి చర్మాన్ని కట్ చేయగా.. పేషెంట్ కోమాలోకి వెళ్లిందని డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్ తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే, అక్కడికి చేరుకోగానే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. లక్ష్మి మృతికి గల కారణం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు. ( చదవండి: విషాదం: ఇద్దరు చిన్నారులు సజీవ దహనం ) -
సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి
పెద్దవూర: అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతిచెందిన సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్ అంత్యక్రియలు ఆదివారం స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ఆయన మృతితో పెద్దవూర గ్రామ పంచాయతీలో విషాదఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌లో మృతి చెందగా శనివారం రాత్రి 9 గంటలకు పెద్దవూర తీసుకువచ్చిన మృతదేహాన్ని ఆదివారం 11 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన నాయకుడి కడచూపు కోసం వందలాదిగా తరలివచ్చారు. కిలోమీటర్ పైగా సాగిన అంతిమ యాత్రలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డిలు పాల్గొని నడిచారు. పాడె మోసిన మంత్రి జగదీశ్‌రెడ్డి తన సహచరుడు, సీనియర్ టీఆర్ఎస్ నేత, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి అంతిమ యాత్రలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని పాడెను మోశారు. భాస్కర్‌రెడ్డితో తనకు గల అనుభవాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రముఖుల పరామర్శ అనారోగ్యంతో మృతి చెందిన పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి పార్థీవ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్, యువజన శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కుమార్, ఎంసీ కోటిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మన్నెం రంజిత్‌యాదవ్, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనురాధసుందర్‌రెడ్డి, కర్నాటి లింగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కంకణాల నివేదితారెడ్డి, డీవీఎన్‌రెడ్డి, ఇరిగి పెద్దులు, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తన్నుకున్న సర్పంచ్, ఉపసర్పంచ్
కౌడిపల్లి (నర్సాపూర్): ఓ మురికి కాలువ నిర్మాణం విషయంలో సర్పంచ్, ఉపసర్పంచ్లు బాహాబాహీకి దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు సర్పంచ్ సంజీవ్ ప్రతిపాదించారు. అయితే మరోచోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ వెంకటేశం ఈ ప్రతిపాదనపై అభ్యంతరం చెప్పారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు తన్నుకున్నారు. దీంతో తోటి సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడిపించారు. పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉపసర్పంచ్‌పై దాడి పంచాయతీ కార్యాలయంలో బాహాబాహీ అనంతరం ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ కుటుంబ సభ్యులు అతని అనుచరులు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఇంతలోనే ఉపసర్పంచ్ వెంకటేశం కూడా అక్కడికి వచ్చాడు. ఇది గమనించిన సర్పంచ్ అన్న రవి, తమ్ముడు ప్రవీణ్‌తోపాటు అతని వర్గీయులు ఒక్కసారిగా ఉపసర్పంచ్‌పై దాడి చేశారు. దీంతో ఎస్ఐ రాజశేఖర్, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. చదవండి: ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్ -
కాలవలోని చెత్తను తొలగించిన సర్పంచ్..
సాక్షి, విజయనగరం : శ్లాబు కల్వర్టు కింద మురుగునీరు నిల్వ ఉండకుండా పూడికను తొలగిస్తున్నది గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడో, వేతనదారుడో అనుకుంటే పొరపాటే. శ్లాబు కల్వర్టు కింద మురుగునీరు నిల్వ ఉండకుండా అడ్డుకున్న చెత్తను తొలగిస్తున్నది విజయరాంపురం (బూరిపేట) పంచాయతీకి సర్పంచిగా ఎన్నికైన బూరి మధుసూదనరావు. వీధి కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా గురువారం తానే స్వయంగా కల్వర్టులో దిగి పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి గ్రామస్తులతో శభాష్ అనిపించుకున్నారీయన. గ్రామస్తులంతా సర్పంచిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరి ఇంటి వద్ద ఉన్న కాలువలను నిత్యం శుభ్రం చేసుకుంటే దోమలు వ్యాప్తిని అరకట్టి, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు కదా. మరెందుకు ఆలస్యం నడుం బిగిద్దామంటోంది ఆ గ్రామంలోని యువత. – తెర్లాం -
నల్గొండ జిల్లా వెలిమినేడు సర్పంచ్ మల్లమ్మ ఆత్మహత్యయత్నం
-
బడి పంతులుగా మారిన సర్పంచ్
చౌటుప్పల్: భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ సర్పంచ్ ఆ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు పంతులయ్యాడు. పంతంగిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడి పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎంఏ (తెలుగు) చదివిన సర్పంచ్ బాతరాజు సత్యం.. విద్యార్థుల ఇబ్బందులను గమనించి వారికి పాఠాలు బోధించాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. సర్పంచ్‌గా ఉన్న వ్యక్తి పాఠశాలకు వెళ్లి పాఠాలు బోధిస్తుండటంతో పలువురు అతడిని అభినందించారు. చదవండి: ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ ! -
మహిళా సర్పంచ్ కుటుంబంపై టీడీపీ నేత దాడి
సాక్షి, చోడవరం: విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరంలో టీడీపీ వర్గీయులు గురువారం సర్పంచ్ ఇంటిపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్పంచ్ పల్లా ఇంద్రజతోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా అర్జున తన కుటుంబసభ్యులు, వర్గీయులు సుమారు 13 మందితో కలిసి ఇనుపరాడ్లతో వెళ్లి వైఎస్సార్సీపీ అభిమాని అయిన సర్పంచ్ ఇంద్రజ, ఆమె మేనమామ గోకివాడ రమణ ఇంటిపై దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు రాడ్లతో కొట్టడంతో సర్పంచ్‌తో పాటు ఆమె తల్లి సత్యవతి (46), అన్న బాలఅప్పలనాయుడు (27), చిన్నాన్న రమణబాబు (47), మేనమామ గోకివాడ రమణ (50), అతని కుమారుడు గోకివాడ మోహన్ (26), కుమార్తె గోకివాడ రామలక్ష్మి (18) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్నవారంతా అక్కడికి చేరడంతో దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు పరారయ్యారు. ఇదే గ్రామంలో ఉన్న సర్పంచ్ ఇంద్రజ బంధువులు హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడికి పాల్పడ్డవారిని నిలదీసేందుకు వెళ్లగా వారు అక్కడ కూడా ఎదురుతిరగడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న చోడవరం సీఐ అక్కడికి చేరుకొని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడిన సర్పంచ్, కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా టీడీపీ వర్గీయులు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స కోసం చేరారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ నాయకులు కక్షకట్టి దాడి చేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఘటనలో ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. -
ఆధిపత్య పోరు: సర్పంచ్ వర్సెస్ ఉపసర్పంచ్
సాక్షి, వరంగల్ రూరల్: నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ సర్పంచ్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉప సర్పంచ్ బండారి సమ్మయ్య కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సంపేట మండలం ఆకులతండా సర్పంచ్ బానోత్ రాము తీర్మానాలు లేకుండా పనులు చేస్తున్నాడని ఉప సర్పంచ్ లక్ష్మి, వార్డు సభ్యులు రమ, శ్రీకాంత్, సమ్మాలు, అరుణ కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే సమన్వయంతో ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పంచాయతీల పరువు రచ్చకెక్కుతోంది. ఏదో ఒక సాకుతో విమర్శలు చేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల దాడులు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య జాయింట్ చెక్‌పవర్ విభేదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టంతో నేరుగా నిధులు.. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం–2018 అమలులోకి రావడంతో పంచాయతీలకు నేరుగా నిధుల మంజూరు, ప్రతి జీపీకి కార్యదర్శి నియామకం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఉండడంతో ఇద్దరి సమ్మతి లేనిదే నిధులు డ్రా చేసేందుకు వీలు లేకుండా పోయింది. పలు గ్రామాల్లో సర్పంచ్‌లు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్‌లకు చెప్పకుండానే అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. దీంతో ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు పెట్టకుండా మొండికేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆదిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకుంటుండగా.. మెజార్టీ గ్రామాల్లో నిధుల వినియోగంపై సమన్వయం లేక ఆ “పంచాయితీ’లను అధికారుల వద్దకు తెస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఒకరిమీద ఒకరు చేసుకున్న ఫిర్యాదులు 100కు పైగా వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో 50 వరకు పరిష్కరించినట్లు సమాచారం. ముందుకు సాగని పనులు మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ల మధ్య ఆదిపత్య పోరు.. సమన్వయ లోపం.. విభేదాల కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు అధికారుల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలుపొందిన సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమన్వయంతో ముందుకు సాగాలి.. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో ముందుకు సాగి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి. ఈ మేరకు వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం. చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని, సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు వారిని పలిపించి మాట్లాడడంతో పాటు ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నాం. – చంద్రమౌళి, డీపీఓ -
గెలుపును జీర్ణించుకోలేక టీడీపీ దాష్టీకం..
రణస్థలం(శ్రీకాకుళం జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో తట్టుకోలేని టీడీపీ వర్గీయులు హింసకు తెగబడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేటరాజాంలో బీభత్సం సృష్టించారు. పోలీ సుల మీద కూడా కర్రలు, రాళ్లు, సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు దొరికినవారిని దొరికినట్టు చితకబాదాయి. సర్పంచ్‌గా గెలిచిన వైఎస్సార్సీపీ మద్దతుదారు అసిరితల్లి భర్తను కొట్టడంతో ఆయన చేయి విరిగింది. ఈ ఘటనకు సంబంధించి 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం జరిగిన చిల్లపేటరాజాం పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు కంబపు అసిరితల్లి 49 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే కొందరు వ్యక్తులు టీడీపీ మద్దతుదారులు గెలుపొందినట్లు పుకార్లు సృష్టిం చారు. దీంతో రెండు వర్గాలు గొడవకు దిగాయి. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసు లు రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు పోలీసులపై కర్రలతో దాడికి పాల్పడడంతోపాటు రాళ్లు, సీసాలు విసరడంతో ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు ఎస్ఐ అశోక్‌బాబుకు గాయాలయ్యాయి. దీంతో ఎస్పీ అమిత్ బర్దార్ నేతృత్వంలో భారీ సంఖ్యలో ప్రత్యేక పోలీసు బలగాలు చిల్లపేటరాజాం చేరుకున్నాయి. విచక్షణ కోల్పోయిన ప్రత్యేక బలగాలు.. గ్రామానికి చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు పరిస్థితిని అదుపుచేసే క్రమంలో కనిపించిన ప్రతి ఒక్కరిపై లాఠీ ఝుళిపించాయి. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఇంటింటికీ వెళ్లి దొరికినవాళ్లను దొరికినట్టు పోలీసులు చితకబాదారు. ఘర్షణ నెలకొనడంతో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి అసిరితల్లి, ఆమె భర్త నర్సింహులు రెడ్డి ముందుగానే వారి ఇంటికి చేరుకున్నారు. సర్పంచ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె భర్తను విచక్షణారహితంగా కొట్టారు. ఆయన ఇంటినంతా చిందరవందర చేశారు. లాఠీదెబ్బలకు నర్సింహులు రెడ్డి చేయి విరిగిపోయింది. సర్పంచ్ ఇంటితోపాటు చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు లోనై తలో దిక్కుకు పరుగులు తీశారు. కార్లు, ఆటోల అద్దాలు పగిలిపోయి వీధుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. 50కి పైగా బైకులు ధ్వంసమయ్యాయి. ఘర్షణతో సంబంధం లేనివారిని పోలీసులు కొట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి ప్రవేశించి కిటికీలు, టీవీలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు ధ్వంసం చేయడాన్ని ఖండించారు. జేఆర్‌పురం పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జేఆర్‌పురం ఎస్ఐ వాసునారాయణ తెలిపారు. బాధితులకు అండగా ఉంటాం చిల్లపేటరాజాంలో బాధితులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ భరోసా ఇచ్చారు. గాయపడినవారిని ఆయన సోమవారం పరామ ర్శించారు. పోలీసులు సామాన్యులను శిక్షించడం చాలా బాధాకరమన్నారు. చదవండి: ఉరకలేస్తున్న వైఎస్సార్ సీపీ.. నిస్తేజంలో టీడీపీ 13 మంది దుర్గ గుడి ఉద్యోగులు సస్పెన్షన్.. -
వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
సాక్షి, వికారాబాద్: పాత కక్షల నేపథ్యంలో పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదుల హత్యోదంతాన్ని మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలి భర్తను.. గ్రామ సర్పంచ్ దారుణంగా హత్య చేశాడు. పెద్దేముల్ మండలం హన్మపూర్‌లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. పెద్దేముల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వాణిశ్రీ భర్త వీరప్పకు, స్థానిక గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సర్పంచ్ కుటుంబ సభ్యులు వీరప్పపై దాడి చేశారు. ఊరడమ్మ గుడి దగ్గర కర్రలతో కొట్టి హత్య చేశారు. రాజకీయ కక్షల వల్లే హత్య జరిగిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
-
ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ !
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి పంచాయతీ సర్పంచ్‌గా ఖాదర్‌బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే నివసిస్తున్నాయి. 677 మంది ఓటర్లున్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లంతా ఎస్సీలే కావడంతో మొదట్లో సందిగ్ధానికి గురయ్యారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదరి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్‌బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలేకపో వడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ మా జాబితా తప్పని నిరూపించగలవా!