శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కొత్తగట్టు–గొల్లపల్లి గ్రామాల మఽ ద్య జాతీయ రహదారి పక్క న కారు చెట్టును ఢీకొన్న ఘటనలో సర్పంచ్ గోపు కొమురారెడ్డి(53) దుర్మరణం చెందాడు. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. హుజురాబాద్ మండలం కనుకులగిద్దె సర్పంచ్ గోపు కొమురారెడ్డి శుక్రవారం భార్య రమతో కలిసి కారులో సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి సమీపంలో శుభకార్యానికి వెళ్లారు.
అదే రోజు సాయంత్రం కరీంనగర్‌లో పని ఉందని కొమురారెడ్డి కారులో ఒక్కడే వచ్చాడు. రాత్రి కరీంనగర్‌లో నిద్రించి శనివారం వేకువజామున కనుకులగిద్దెకు బయలుదేరాడు. శంకరపట్నం మండలం కొత్తగట్టు–గొల్లపల్లి గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారుతో చెట్టుకు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో బె లూన్‌లు ఓపెన్ అయినా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాద విషయం తెలుసుకున్న హుజురాబాద్ రూరల్ సీఐ సంతోశ్, ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య, కూతుర్లు ఉజ్వల, అఖిల ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కనుకులగిద్దెలో విషాదం
హుజూరాబాద్‌రూరల్: మండలంలోని కనుకులగిద్దె సర్పంచ్ కొమురారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కు టుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. రాజకీయాలకతీతంగా అందరితో సన్నిహితంగా ఉంటూ మెలిగిన వ్యక్తి అ కాల మృతిచెందడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా కొమురారెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితుడు. ఈటల టీ ఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో మండల అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఈటల బీజేపీలో చేరడంతో అత ను సైతం ఆ పార్టీలో చేరాడు. కొమురారెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఈటల దంపతులు హుటా హుటిన గ్రామానికి చేరుకున్నారు. మృతదేహానికి నివాళి అర్పించి, కొమురారెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే పార్థివదేహానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment