సైదాపూర్: మండలంలోని బొమ్మకల్ గ్రామంలో ఓ వృద్ధురాలిపై ఆదివారం రాత్రి ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలు సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన యువకుడు కుటుంబంతో వృద్ధురాలి ఇంట్లో ఉంటూ గ్రామంలో చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. కొద్దిరోజుల క్రితం భార్యా పిల్లలు కరీంనగర్‌లోని ఇంటికి వెళ్లారు. కాగా ఆదివారం రాత్రి వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment