ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన కరికె లింబాద్రి. తనకు ఉన్న ఎకరం పొలానికి నీరందించే బోరు ఎండిపోయింది. దీంతో మూడు బోర్లు వేయించాడు. 265 ఫీట్లు, 550 ఫీట్లు, 650 ఫీట్లు వేసినా చుక్కనీరు నీరు రాలేదు. మూడు బోర్లకు దాదాపు రూ.2.50లక్షలు ఖర్చు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మద్దిమల్లలోని రాయినిచెరువును నింపితే భూగర్భజలాలు పుష్కలంగా ఉండేవంటున్నాడు.
మూడెకరాలు ఎండింది
ఇతను వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన గుగులోతు వెంకటి. మూడెకరాల్లో వరిసాగు చేశారు. పంట చివరి దశలో ఉండగా బోరుబావి ఎండిపోయింది. రెండు బోర్లు వేయగా ఒకదాంట్లోనే కొంత నీరు వచ్చింది. ఆ నీరు కేవలం పశువులకు దాహార్తి తీర్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని వాపోయాడు. చేసేదేమి లేక మూడు ఎకరాల పంట పొలం ఎండిపోయిందని కన్నీటి పర్యాంతమవుతున్నాడు.
12 బోర్లు వేసినా..
ఇతను వీర్నపల్లి మండలం బాబాయిచెరువుతండాకు చెందిన భూక్య అంబ్రూ. ఎకరం పొలానికి నీరు అందించేందుకు ఇప్పటి వరకు 12 బోర్లు వేశాడు. ఇందుకోసం రూ.8లక్షలు అప్పు చేశాడు. ఉన్న ఆవులు, గొర్లు అమ్మి అప్పులు చెల్లించాడు. చివరికి పంటకు తెగుళ్లు సోకి 30 గుంటలు పాడయింది. సుమారు రూ.4లక్షల వరకు అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
‘బోరు’మంటున్న రైతులు
‘బోరు’మంటున్న రైతులు