Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

HCU Land Row: BJP Visit Protests Continue At University April 1st Updates1
HCUలో భూములపై రగడ.. బీజేపీ శ్రేణుల అరెస్ట్‌

హైదరాబాద్‌, సాక్షి: హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ఉద్రికత నెలకొంది. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. ఈ తరుణంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) క్యాంపస్‌ అట్టుడికిపోతోంది. ఇవాళ్టి నుంచి పోరాటం ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో తరగతుల్ని బహిష్కరించి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఒకవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు HCU సందర్శన వేళ.. హైదరగూడ MLA క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వద్దకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీని సందర్శిస్తామని అంటోంది. ఇప్పటికే భూముల వేలం పై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే యువ మోర్చా ఆధ్వర్యంలో HCU భూముల వేలానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తోంది.మరోవైపు.. వామపక్ష పార్టీలు సైతం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అమ్మకాన్ని ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌తో సీపీఐ, సీపీఎంలు నిరసన చేపట్టబోతున్నారు. హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం కేబీఆర్‌ పార్కు వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది’.. ‘హెచ్‌సీయూ అడవి నరికితే.. హైదరాబాద్‌ ఊపిరి ఆగుతుంది‘ అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో బీఆర్‌ఎస్‌వీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పలువురు ప్రకృతి ప్రేమికులు మద్దతు తెలిపారు.కంచె గచ్చిబౌలి భూములపై ఇప్పటికే టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది. వేడెక్కిన క్యాంపస్‌ హెచ్‌సీయూలో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సదరు స్థలాన్ని పొక్లెయిన్‌లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తు‍న్నారు. గత రెండురోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలతో HCU మొత్తం ఇప్పుడు పోలీసు పహారాలో ఉంది.

Ration Rice Row: Perni Nani Challange Kutami Prabhutam2
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్‌సీపీని వీడేది లేదు: పేర్ని నాని

కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్‌ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్‌ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్‌ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్‌.. సీజ్‌ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్‌ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్‌సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు.

IPL 2025: MI Captain Hardik Pandya Comments After Win Against KKR3
MI VS KKR: అతడు అద్భుతం.. క్రెడిట్‌ వాళ్లకే.. రసెల్‌ వికెట్‌ కీలకం: హార్దిక్‌

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. నిన్న (మార్చి 31) సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే, గుజరాత్‌ చేతుల్లో ఘోరంగా ఓడిన ఎంఐ.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకుని సంతృప్తి పొందే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపులో అరంగేట్రం పేసర్‌ అశ్వనీ కుమార్‌ కీలకపాత్ర పోషించాడు. అశ్వనీ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అశ్వనీతో పాటు దీపక్‌ చాహర్‌ (2-0-19-2), బౌల్ట్‌ (4-0-23-1), హార్దిక్‌ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్‌ పుతుర్‌ (2-0-21-1), సాంట్నర్‌ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది.కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్‌ (12 బంతుల్లో 22) బ్యాట్‌ ఝులిపించడంతో కేకేఆర్‌ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్‌ పాండే (19), రింకూ సింగ్‌ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్‌) సత్తా చాటిన డికాక్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్‌ నరైన్‌ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్‌ అయ్యర్‌ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్‌ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్‌ రికెల్టన్‌ (41 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్‌ (9 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్‌ జాక్స్‌ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్‌ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.మ్యాచ్‌ అనంతరం ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు సంతృప్తికరంగా ఉంది. హోం గ్రౌండ్‌లో గెలవడం మరింత ప్రత్యేకం. సమిష్టిగా రాణించాం​. ప్రతి ఒక్కరు గెలుపులో భాగమయ్యారు. వికెట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే మాకు అనుకూలించింది. అశ్వనీ కూమార్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పిచ్‌ను పరిశీలించాక అశ్వనీ తన సహజ శైలిలో బౌలింగ్‌ చేసినా సత్ఫలితాలు వస్తాయని అనుకున్నాము. అదే జరిగింది. అశ్వనీ లాంటి ఆణిముత్యాన్ని వెలికి తీసినందుకు మా స్కౌట్స్‌ను అభినంధించాలి. ముంబై ఇండియన్స్‌ స్కౌట్స్‌ దేశం నలుమూలలా తిరిగి విజ్ఞేశ్‌ పుతుర్‌, అశ్వనీ కుమార్‌ లాంటి టాలెంటెడ్‌ కిడ్స్‌ను ఎంపిక చేశారు. ప్రాక్టీస్‌ సమయంలోనే అశ్వనీలోని టాలెంట్‌ను గమనించాము. అతని బౌలింగ్‌లో ప్రత్యేకమైన లేట్‌ స్వింగ్‌ ఉంది. పైగా అతను లెఫ్ట్‌ హ్యాండర్‌. అశ్వనీ తీసిన రసెల్‌ వికెట్‌ చాలా కీలకం. అతడు డికాక్‌ క్యాచ్‌ను అందుకున్న తీరు కూడా అద్భుతం. ఓ ఫాస్ట్ బౌలర్ అంత ఎత్తుకు ఎగిరి క్యాచ్‌ పట్టడం ఆషామాషీ కాదు. ముందు చెప్పినట్లు, సమిష్టిగా రాణించడం శుభసూచకం.

Astronaut Sunita Williams says India Looks Amazing from Space4
అంతరిక్షం నుంచి ‘అద్భుత’ భారతం: సునీతా విలియమ్స్‌

‘అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంది?’ ఈ ప్రశ్నకు నాడు భారత వ్యోమగామి రాకేష్ శర్మ(Indian astronaut Rakesh Sharma) ప్రముఖ కవి ముహమ్మద్ ఇక్బాల్ రాసిన ‘సారే జహాన్ సే అచ్చా’ అంటూ సమాధానం చెప్పారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే ప్రశ్నకు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సమాధానమిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అద్భుతమైన హిమాలయాలను చూసిన సంగతిని ఆమె గుర్తుచేసుకున్నారు.286 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత సునీతను.. భారతదేశం అంతరిక్షం నుండి ఎలా కనిపించింది? అని అడిగినప్పుడు ఆమె ‘అద్భుతం.. అత్యద్భుతం’ అనే సమాధానం ఇచ్చారు. ‘భారతదేశం అద్భుతమైనది. మేము హిమాలయాల(Himalayas) మీదుగా వెళ్లిన ప్రతిసారీ అద్భుత దృశ్యాలను చూశాం’ అని సునీతా విలియమ్స్ అన్నారు. తన భారతీయ మూలాల గురించి తరచూ మాట్లాడే అమెరికా వ్యోమగామి సునీత అంతరిక్షం నుంచి భారత్‌కు సంబంధించిన ప్రకృతి దృశ్యాలను చూసి మంత్రముగ్ధురాలయ్యారు.పశ్చిమాన ఉన్న నౌకాదళాల నుండి ఉత్తరాన మెరుస్తున్న హిమాలయాల వరకు అంతా అద్భుతంగా కనిపించింది. తూర్పు నుండి గుజరాత్ మీదుగా ముంబైకి వెళ్ళినప్పుడు అద్భుత దృశ్యం కనిపించింది. భారతదేశం అంతటా రాత్రిపూట లైట్ల నెట్‌వర్క్ అమోఘంగా ఉంది. పగటిపూట కనిపించిన హిమాలయాల సౌందర్యం భారతదేశానికే తలమానికంగా నిలిచింది. భారత అంతరిక్ష విమానయాన కార్యక్రమానికి సహాయం చేస్తారా? అని ఆమెను అడిగినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు భారతదేశానికి వస్తాను. మా అనుభవాలను అక్కడివారితో పంచుకుంటాను. భారత్‌ ఒక గొప్ప దేశం. అద్భుతమైన ప్రజాస్వామ్యం(Democracy) ఇక్కడుంది. భారత్‌ అంతరిక్షయానంలో ముందడుగు వేస్తోంది. దానిలో భాగం కావడానికి, వారికి సహాయం చేయడం తనకు ఇషమేనని ఆమె సమాధానం చెప్పారు.భారతదేశంలో జన్మించిన విలియమ్స్ తన తండ్రి పూర్వీకుల ప్రాంతానికి రావాలని అనుకుంటోంది. తన సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌ను కూడా భారత్‌కు తీసుకురావాలని భావిస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష నౌక సిబ్బంది లేకుండా తిరిగి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారు చివరికి మొన్న మార్చి 19న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు.ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్‌.. దారుణమైన పరిస్థితులు

BRS KTR Criticizes Congress Government for Bulldozing Policies5
ప్రభుత్వమా? బుల్డోజర్‌ కంపెనీయా?

హైదరాబాద్‌, సాక్షి: హెచ్‌సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తాజా హెచ్‌సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్‌ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లా?.. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించారు.

Myanmar Health System Collapsed after Earthquake6
మరుభూమిగా మయన్మార్‌.. దారుణమైన పరిస్థితులు

నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్‌.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.మరింత దిగజారిన పరిస్థితులు మయన్మార్‌(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.సైనిక పాలనలో..పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్‌లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.ఆస్పత్రులు ధ్వంసంభూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.ఇది కూడా చదవండి: చిరాగ్‌ పాశ్వాన్‌ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు

Pinky Trigger Symptoms Diagnosis And Treatment7
పింకీ ట్రిగ్గర్‌..! గంటల తరబడి ఫోన్‌ వాడుతున్నారా..?

అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ దీనికి బానిసలే.. అదే నిత్యవ్యాపకంగా మారిన సెల్‌ఫోన్‌. ఈ మధ్యకాలంలో సెల్‌ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తిలేదు. లేచింది మొదలు పడుకునే వరకూ దాదాపు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న వారు అధికం అవుతున్నారు. దీంతో వీరిని రకరకాల రుగ్మతలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటే పింకీ ట్రిగ్గర్, ఫోన్‌ పింకీ అని పిలుస్తున్నారు. అధిక శాతం మంది కనీసం రోజులో 4–6 గంటలు సగటున ఫోన్‌ వినియోగిస్తున్నారు. ఇక 13–18 మధ్య వయసు వారు 5–7 గంటలు, 18–30 మధ్య వయసు వారు 6–10 గంటలు, ఉద్యోగాలు చేసేవారు 3–5 గంటలు, సీనియర్‌ సిటిజన్స్‌ 1–3 గంటల పాటు ఫోన్‌ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోషల్‌ మీడియా రాకతో ఎంటర్‌టైన్‌మెంట్, ఆన్‌లైన్‌ గేమ్స్, ఎడ్యుకేషన్, వీడియోలు, రీల్స్‌ ఇలా ఏ వయసు వారు ఆ స్థాయిలో ఫోన్‌ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న సమస్యలు.. అతిగా ఫోన్‌ వినియోగించడం వల్ల రక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల వెంటాడుతోన్న రుగ్మతల్లో ఒకటి పింకీ ఫింగర్, పింకీ ట్రిగ్గర్, ఫోన్‌ పింకీ ఒకటి. ఈ పదాలు వినడానికి కొత్తగా అనిపించినా ప్రస్తుతం వేదిస్తోన్న ప్రధాన సమస్య. గంటల తరబడి చిటికెను వేలుపై ఫోన్‌ బ్యాలెన్స్‌ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుల తరబడి ఫోన్‌ బరువు పడడంతో వేలుపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా చిన్న డెంట్‌ ఏర్పడుతోంది. ఒత్తిడి తగ్గించాలివేళ్లపై అధిక ఒత్తిడి పడడంతో ఆ ప్రభావం నరాలపైనా పడుతోంది. ఫలితంగా కార్పల్‌ టన్నల్‌ సిండ్రోమ్‌ అనే సమస్యకు దారితీస్తోంది. ఇదో గందరగోళ వైద్య సమస్య అని చెబుతున్నారు. అంతేకాకుండా బొటనవేలు సందుల మధ్య కండరాలు ప్రభావితం చెందడం వల్ల ‘టెక్ట్సింగ్‌ థంబ్‌’ సమస్య ఏర్పడుతోంది. దీంతోపాటు ఎక్కువ సేపు తల వంచి ఫోన్‌ చూడటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి సమస్యకు దారితీస్తోంది. వీటి నుంచి బయట పడటానికి రెండు చేతులూ వినియోగించడం, ఫోన్‌ స్టాండ్స్‌ వాడటం, చేతి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, చేతుల వ్యాయామం చేయడం ఉత్తమం. – డాక్టర్‌ బి.చంద్రశేఖర్, షోల్డర్‌ సర్జన్, కిమ్స్‌ సన్‌షైన్‌ హాస్పిటల్స్, బేగంపేట (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!)

Will Donald Trump Really Kind With Tariffs What Prez Says8
సుంకాల మోత వేళ ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

వాషిం‍గ్టన్‌: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్‌ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్‌ ప్రకటించారు. అయితే ట్రంప్‌ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్‌ల డెడ్‌లైన్‌ ఏప్రిల్‌ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్‌ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్‌ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్‌ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్‌హౌజ్‌ ప్రతినిధి కరోలిన్‌ లీవిట్‌ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్‌ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్‌ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్‌ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్‌ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్‌ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్‌ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్‌ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్‌ వార్‌ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్‌-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి.

Prithviraj Sukumaran Mother Mallika Comments On Mammootty9
మా బాధ చూసి మమ్ముట్టి మెసేజ్‌.. కన్నీళ్లొచ్చాయి: పృథ్వీరాజ్ తల్లి

'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2 Empuraan) వివాదంపై మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక స్పందించారు. లూసిఫర్‌ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ గొడవలో కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను మాత్రమే బలిపశువును చేస్తున్నారని ఆమె కామెంట్‌ చేశారు. తన కుమారుడికి చిత్ర పరిశ్రమలో చాలా మంది శత్రువులు ఉన్నారని మల్లిక తెలిపారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తుండటంతో అతని ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఎల్2: ఎంపురాన్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మల్లికా ఆరోపించింది.ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచిన ఏకైక స్టార్‌ హీరో మమ్ముట్టి మాత్రమే అని పృథ్వీరాజ్ తల్లి మల్లిక తాజాగా కామెంట్స్‌ చేశారు. ఆయన పంపిన సందేశం చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని ఆమె ఇలా చెప్పారు. "రంజాన్‌ పండుగ ఉన్నప్పటికీ, మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు. పృథ్వీరాజ్ గురించి ఫేస్‌బుక్‌లో నేను చేసిన పోస్ట్ చూసి చింతించవద్దని మమ్ముట్టి చెప్పారు. మాకు అండగా నిలబడుతానని మాట ఇచ్చారు. నా కుమారుడికి జరుగుతున్న అన్యాయం వల్ల నేను చాలా బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. మమ్ముట్టి ఒక మనస్సాక్షి ఉన్న కళాకారుడు.నా పిల్లల గురించి ఎక్కడైనా ప్రతికూలంగా ఏదైనా కనిపిస్తే.., అది నన్ను బాధపెడుతుందని అతను అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. నా పిల్లలకు కూడా మమ్ముట్టి చేసిన సాయాన్ని మర్చిపోవద్దని చెప్పాను. ఇంత జరుగుతున్నా చిత్ర పరిశ్రమ నుంచి మా కుటుంబం కోసం ఎవరూ మాట్లాడలేదు. కానీ, పరిశ్రమ నుండి సందేశం పంపిన ఏకైక వ్యక్తి మమ్ముట్టి మాత్రమే.. ఆయన పంపిన మెసేజ్‌ చూసినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.'అని మనోరమ న్యూస్‌తో మల్లిక అన్నారు.'ఎల్‌ 2: ఎంపురాన్‌' చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సెట్ చేయబడిన సన్నివేశాల చిత్రీకరణపై వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం వల్ల ఈ చిత్రం నుంచి సుమారు 3 నిమిషాల నిడివిని తొలగించారు.

key financial changes from april 1st10
నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్‌ కార్డు రివార్డులు, టీడీఎస్‌ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.2025–26 బడ్జెట్‌లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్‌ సిటిజన్స్‌) బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్‌ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్‌ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది. ఇన్సూరెన్స్‌ బ్రోకర్లకు వచ్చే కమీషన్‌ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్‌ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది. యాక్టివ్‌గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్‌ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్‌గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్‌ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్‌ ఫండ్స్‌ కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: యాపిల్‌పై రూ.1,350 కోట్లు జరిమానాస్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌లు, కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్లను నేరుగా డిజీలాకర్‌లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఎస్‌బీఐ తన క్రెడిట్‌ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్‌పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి. అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్‌ టారిఫ్‌లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement