రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య
జమ్మికుంట : రైలు కిందప డి ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తి రుపతి తెలిపిన వివరాల ప్రకారం...హుజూరాబాద్ పట్టణంలోని మామిడ్లవాడకు చెందిన పొట్ట బ త్తిని సురేందర్ (69) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కిందపడి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.
‘పది’ ఫలితాలు రాకముందే విద్యార్థిని మృతి
● రూ.10 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం
బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతి పరిక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని ఆకుల నాగచైతన్య(15) అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన ఆకుల చిన్న రవి–రజిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్నకూతురు నాగచైతన్య ఆటో ఇమ్యూన్ వ్యాధితో ఏడాదిగా బాధపడుతోంది. గతంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నాగచైతన్యకు రూ.2.50లక్షల మేర ఎల్‌వోసీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏడాదిగా చికిత్స పొందుతోంది. నాగచైతన్య చికిత్స కోసం తల్లిదండ్రులు దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. గత మార్చిలో 10వ తరగతి పరీక్ష రాసింది. మూడు రోజుల క్రితం వ్యాధి తీవ్రం కావడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి గురువారం మధ్యాహ్నం మృతిచెందింది. చురుకై నా విద్యార్థిని అర్ధంతరంగా ప్రాణాలు వదలడంతో ఆమె చదివిన స్కూల్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
కథలాపూర్: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన చెరుకూరి శంకర్ విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ఈనెల 14న సిరికొండలో గొడవ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లారు. శంకర్‌ను గొడవ చేయవద్దని పోలీసులు చెప్పగా.. వారిపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించాడు. శంకర్‌ను గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించామని ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
అగ్నిప్రమాదంలో ఈతచెట్లు దగ్ధం
కథలాపూర్: కథలాపూర్ మండలం సిరికొండ గ్రామశివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో 400 ఈత చెట్లు కాలిపోయినట్లు గీతకార్మికులు గరువారం తెలిపారు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం ఈతచెట్లకు కల్లు గీసేందుకు వెళ్లి ఇంటికి వచ్చామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పిచ్చిమొక్కలతోపాటు 400 ఈతచెట్లు కాలిపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు. సంఘటన స్థలాన్ని ఆర్‌ఐ నాగేశ్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య
రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య


