
గిన్నిస్‌బుక్ రికార్డులో ‘మానేరు’ విద్యార్థి
జగిత్యాల: కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి సర్వీన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ హలెల్ మ్యూజిక్ స్కూల్ మేనేజ్‌మెంట్ బోర్డు ఈవెంట్‌లో గిన్నీస్ రికార్డుకు ఎంట్రీలను ఆహ్వానించింది. 2024 డిసెంబర్ 1న 1046 మందితో గంటపాటు ఆన్‌లైన్‌లో నాన్‌స్టాప్ కీబోర్డు ప్లే ఈవెంట్‌ను హలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించింది. 45 సెకెన్లలోనే కీబోర్డును వాయించి గిన్సీస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్ సునీతరెడ్డి, ప్రిన్సిపాల్ అభినందించారు.