
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): తెల్లారితే వై భవంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో రోద నలు మిన్నంటాయి. మేళతాళాలతో సందడి నెలకొనాల్సిన పందిట్లో చావు డప్పులతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి కొన్ని గంటల్లోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు అర్ధంతరంగా తనువు చాలించిన విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మెట్‌పల్లి మండలం వెల్లుల అనుబంధ గ్రామమైన రాంచంద్రంపేట గ్రామానికి చెందిన లక్కినపల్లి లక్ష్మి–లింబాద్రిలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతు ళ్లు. వీరిలో ముగ్గురికి వివాహమైంది. చివరివాడై నా కిరణ్(37) మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు.
ఇతడికి వివా హం చేయాలని నిశ్చయించిన తల్లిదండ్రులు పక్క గ్రామమైన వెల్లులకు చెందిన అమ్మాయితో పెళ్లి ఖరారు చేశారు. ఇటీవల నిశ్చితార్థం జరగ్గా.. పెళ్లి తేదీ ఈనెల 9. శుక్రవారం వధువుతో ఫొటో షూట్‌కు సైతం వెళ్లిన కిరణ్.. మ ధ్యాహ్నం తర్వాత ఇంటికొచ్చాడు. వచి్చ న నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుటుంబ సభ్యులు, ఇంటికొచ్చిన బంధువులతో సైతం బాగానే ఉన్నాడు. పడుకునేందుకు గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. శనివారం ఉదయం తెల్లవారుజామున కిరణ్ సోదరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ ఆత్మహత్యకు అతడి అనారోగ్య సమస్యలే కారణమని ఆయన తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనారోగ్య సమస్యల కారణంగా పెళ్లి జరిగాక భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయేమోననే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment