రాజశేఖర్‌రెడ్డి(ఫైల్)
రేణికుంట వద్ద రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొని యువకుడి దుర్మరణం
తిమ్మాపూర్: ఆ యువకుడు ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కల అయిన విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే బ్యాంకు లోన్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇంతలోనే ఆ యువకుడిని మత్యువు కబళించింది. ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు కథనం ప్రకారం.. కోహెడ మండలం గుండారెడ్డిపల్లి చెందిన కడతల రాజశేఖర్‌రెడ్డి(24) సొంత పనుల నిమిత్తం ఆదివారం వారి బంధువుల ఇంటికి వెళ్లాడు.
తిరిగి గుండారెడ్డిపల్లెకు రాత్రి 9 గంటలకు బయలుదేరాడు. ఈక్రమంలో రాజీవ్ రహదారిపై రేణికుంట వద్ద టైర్ పంచర్ కావడంతో లారీ ఆగి ఉంది. రాజశేఖర్‌రెడ్డి ఆగి ఉన్న లారీని గమనించకుండా వెనక నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న రాజశేఖర్‌రెడ్డిని స్థానికులు అంబులెన్స్‌లో కరీంనగర్ తరలించే క్రమంలో కొత్తపల్లి–నుస్తులాపూర్ మధ్యలో మరణించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
కుటుంబ సభ్యులకు సమాచారమందించడంతో.. వారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులంటున్నారు. రాత్రివేళలో వాహనాలు నిలిచి ఉన్న క్రమంలో హెచ్‌కేఆర్ సిబ్బంది ఎలాంటి సహాయ చర్యలకు పాల్పడడం లేదని గ్రామస్తులు, వాహనదారులు మండిపడుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment