
ఫిర్యాదు అనంతరం మాట్లాడుతున్న గ్రామస్తులు చంద్రం, పోశయ్య, అయ్యాలం,తదితరులు
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని గుర్జకుంట గ్రామ పంచాయతీలో జరిగినఅవకతవకలపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సర్పంచ్, ఉపసర్పంచ్ ఇద్దరు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
పంచాయతీ నిధుల ఖర్చు వివరాలపై సర్పంచ్ మమతా రాంరెడ్డి, ఉపసర్పంచ్ సత్యనారాయణలను అడగగా..వారు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారన్నారు. ఈ విషయంపై నంగి చంద్రం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకున్నారనన్నారు. ఆ వివరాలను పరిశీలించగా పంచాయతీ నిధుల ఖర్చులో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, అట్టి వివరాలతో సంబంధిత జిల్లా, మండల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment