
కామారెడ్డి: కొందరు ప్రజాప్రతినిధుల్లా పర్సంటేజీలకు ఆశపడలేదు..ఆస్తులు అంతస్తులు కూడగట్టుకోలేదు ఆ మాజీ మహిళా సర్పంచ్. గ్రామాభివృద్ధి కోసం తన సొంత నిధులను కూడా వెచ్చించింది. ప్రస్తుతం ఆదుకునేవారు లేక అనాథగా మారింది. రామారెడ్డి మండలం కన్నాపూర్ సర్పంచ్‌గా బాల్‌రాజవ్వ 2006 నుంచి 2011 వరకు పనిచేసింది నీటి సమస్య పరిష్కారానికి బోరుబావులను తవ్వచింది.
ఇటీవల కాలంలో భర్త చనిపోయాడు. ఉన్న ఇల్లు కాస్త కాలిపోవడంతో గ్రామ కచేరీ ఆ మాజీ సర్పంచ్‌కు నివాస గృహంగా మారింది. ఆ ఊరి ప్రజలే అన్నం పెట్టి సాదుతున్నారు. భర్త చనిపోయిన తర్వాత బాల్‌రాజవ్వ మానసిక పరిస్థితి బాగాలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
బాల్‌రాజవ్వ ఇద్దరు కూతుళ్లలో ఓ కూతురు చనిపోగా, మరో కూతురు ఉన్నా, పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అండగా నిలిచి బాల్‌రాజవ్వకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే వైద్యం అందించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment